నువ్వు నవ్వితే నాకు ఆనందం
కానీ ఆ నవ్వు వేరొకరి సమక్షంలో ఐతే,
నేను బాధ పడతాను.
ఆ నవ్వుని నేను కోల్పోయానే అని,
నువ్వు నడుస్తుంటే చూస్తూనే ఉంటాను.
కానీ, తర్వాత ఏడుస్తాను
ఆ నడక నీ నుండి నన్ను దూరం చేసిందని.
నువ్వు నా ఎదురుగా మాట్లాడుతుంటే
నాకు ఏమీ అర్ధం కాదు. ఎందుకంటే,
నీ అధరాల కదలికను గమనిస్తూ,
నా చెవులు వినటం మానేస్తాయి. .
నువ్వు గమనించావో లేదో ,
కవులందరూ ప్రకృతిలోని అందాన్ని వర్ణిస్తారు.
కానీ నేను నీలోనే ప్రకృతిని చూస్తాను.
ప్రకృతిలో జరిగే అలజడిని నాలో చూస్తాను.
నువ్వు కనపడితే నా కళ్ళు వర్షిస్తాయి
కనపడకపోతే మళ్ళీ వర్షిస్తాయి
ఒకసారి ఆనందంతో అయితే,
మరోసారి దుఃఖంతో..............
ఒకప్పుడు ఎక్కడ భాదపడతానో అని ఫీల్ అయ్యేనీవు ఇప్పుడు
ఏమైనా నాకేంటి అంటున్నావంటే...ఆచ్చర్యింలాంటి భాద వేస్తుంది
కచ్చితంగా ఎవరో ఏమో చెప్పారు ..అందరూ చెప్పింది నమ్ముతావు
ఏమౌతుందొ తెలీదు ..ఎందుకిలా చేశావో చేస్తున్నావొ తెలీదు
వాడు నీకు మాకు మద్యి చిచ్చుపెట్టి తనకు కావాల్సింది ..?
మొత్తానికి నన్ను జీవితంలో గెలవలేకుండా చేసి..వాడి గెలుపు శాశ్వితం
నేను ఓడీపోయానీ లేదు అని కాదు ఓడించింది నీవు..అని తెల్సినా ..?