. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, June 30, 2013

మిస్సైన చిన్నారుల ఆచూకీ కోసం సివిఆర్ న్యూస్ యజ్ఞం..41 ఎపిసోడ్లు..38 విజయాలు

ఇంట్లోనుంచి వెళ్ళీన చిన్నారులను .. వెతికి తల్లిదంఅడ్రులకు చేర్చే అద్బుతమైన సివిఆర్ న్యూస్ మిస్సింగ్ ప్రొగ్రాం 41 ఎపిసోడ్లు..38 విజయాలు . .. ఏ న్యూస్ చానల్ చేయలేని ప్రయత్నం..సివిఆర్ న్యూస్ క్రైంటీం చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల వద్దనుంచి అద్బుతమైన స్పందన వస్తుంది... రెండువారాల్లొ ఐదురు చిన్నారులను తల్లిదండ్రులకు చేర్చి రికార్డ్ సృష్టించింది సివిఆర్ న్యూస్....ఈ కార్యక్రమంలో నేను ఒకడినైనందుకు .. మాటీం తరపున ఇల మిస్సైన ఎందరో చిన్నారుల ఆచూకి కనుక్కొవడంలో మాకు ప్రజల సహకారంతో నే  ఈవిజయాలు మీరు బాగస్తులు కండి... ఆ కన్నతల్లుల కన్నీరు తుడవడంలో మాకు సహకరించండి

మౌనాన్ని ఉపిరి తిత్తుల నిండా బలంగా పీల్చుకొని


ఒంటరి తనపు
మౌనాన్ని ఉపిరి తిత్తుల
నిండా బలంగా పీల్చుకొని
బాధల సుడులను
బయటకు వదులు తుంటే
వ్యర్ధంగా రాలిపోతుంది వర్తమానం
అస్త్రైలో బూడిదల

నాలో ఈ అలవాటుకి
సమాజం చూపే కారణం
అనాలోచితమో,
అవివేకమో, అమాయకత్వామో,
అహంకరమో
భావాల డిఫెన్స్ మెకనిజమో
నాకానవసరం

నికోటిన్ నిషానీ
తలకెక్కించి
నిస్తేజత స్థానంలో
నిర్లక్షాన్ని నింపి
నరాలని స్టిములేట్
చేసి నాడులని వైబ్రట్ చేసి
గతం గాయాలకు సెల్ఫ్ పిటీ
బామ్ ని అద్ది ఒదర్చెది వ్యసనమైనా
దానికి బానిస నవ్వడానికి
నాకు సమ్మతమే

పొగ.............
నల్లటి దట్టమైన పొగ
సుడులు తిరుగుతూ
పైకి ఎగురు తుంది ...
ఆ చ్చం నా ప్రియురాలి
కురుల ముంగురులల

పెదవుల మధ్య
మెత్తటి ఫిల్టర్ దూధి
తన లేత నుగారు
బుగ్గల్‌ల స్టుపిడ్
సిమిల్యారిటీ అనుకుంట

అటు చివర
వెలిగే నిప్పు కణిక
తన ఆధరాలలా
ఎర్రగా మెరుస్తుంటే
అందుకోవాలనే
ఆతృతతో బలంగా పీలుస్తున్నాను


వేడి పొగ గుండెల్లో
చేరుతుంటే వెచ్ఛటి
తన కౌగిలి నుభవానికి
వస్తుంది ఆఖరి ధమ్ము
వరకు అదే అనుభూతి
తానిచ్చిన తొలి ముద్దు
తాలూకు తిమ్మి రీ
వాళ్ళంతా పాకు తున్న్నట్టు
మత్తుగా గమ్మతుగా
హటాత్తుగ కళ్ళ ముందు
వెరిసిన వాస్తవికత
పొగ...నల్లటి
దట్టమైన పొగ
కాన్సర్ కత్తిని
కస్సున గుండెల్లో గుచ్చింది
ఆచ్చం వెన్ను పోటు పొడిచిన నా ప్రియరాలిలా..

Saturday, June 29, 2013

నేనో ఏకాంత క్షణమవుతాను అప్పుడు నాకంతా రహస్యమే

న‌న్నే గమనిస్తున్న నా నీడ‌
కాళ్ళీడ్చుకుంటూ నా వెంటే ఉంటుందనుకున్నావా?
దానికో సాయింత్రమొస్తుంది
న‌ను వీడి వెళ్ళిపోతుంది అప్పుడు
నా చుట్టూ నేనే

నాలో నేనే...
నే వొంటరిన‌వుతాను
నేనో ఏకాంత క్షణమవుతాను
అప్పుడు నాలో ఏ ఉద్వేగమూ మిగల‌దు
నాకంతా రహస్యమే....> ఆరహస్యిం నాలోదాచుకునే వాన్ని చెప్పుకునేందుకు నీవున్నావు...ఓదార్పుగా చెప్పేనీమాటలు నన్ను ఎప్పుడూ నీడలా వెంటాడేవి...ఎందుకో నాకు చాలా దైర్యంగా ఉండేది... ప్రపంచం చిన్నదిగా అనిపించేది .. మల్లీ నీ తీయ్యని స్వరం వినేదాకా నా మనస్సు నీ మాటలకోసం సూన్యింలో వెతికేవి ... మనస్సేమో నీమాటల్ మూటలు గుండెళ్ళీ నిక్షిప్తంచేసి..అంత మండుటేండలోకూడా చల్లని గాల్లులో తేలియాడేట్టు చేసేవి..నేను ఒంటరిగా ఉన్నా నన్నమాట మర్చేవాన్ని ఎందుకంటే ఎదోసమయంలో నీస్వరం వింటాననే దైర్యం ,,,గతం చేసిన గాయాలకు అదో మందు..అన్ని మర్చి నీ తీయ్యని స్వరం కోసం వెతికే వాన్ని..గుర్తిచ్చిన క్షనాన్నె SMS లతో నీ సెల్ లో నింపేవాన్ని అప్పుడు గాని నాకు తృప్తిగా ఉండేది ఏంటో కదా ..నీవు ఎక్కడికన్నా వెళ్ళావంటే గుండె తడబడేది..ఎందుకో నీకోసం తీవ్రంగ ఆలోచిస్తుండగానే నీ కాల్..అంతే అప్పటిదాకా పడ్డ ఆవేదన తుర్రుమని ఎగిరిపోయేది..ఇలాంటి తియ్యటి జ్ఞాపకాలన్ని నీడల్లా వెంటాడుతున్నాయి
" రెప్పల చాటున దాగిన దృశ్యాలన్నీ
పెదాలు బిగించి
ఒక్కొ వంతెన్నీ దాటుకుంటూ వెళ్ళుతున్నాయి
అంతా జ్ఞాపకాల గొడవే
నన్ను గుర్తించిన ఒక్కో జ్ఞాపకం
నన్నో ఏకాంతాన్ని చేసి వెళ్ళిపోతున్నాయి
ఇక నేనంతా బట్ట బయలే
నాకే రహస్యాలూ లేవు" నామనస్సునిండా నీజ్ఞాపకాలే అంటే నీవు నమ్ముతావా...ఒకప్పటి నీజ్ఞాపకాలే గాయాలై ఇప్పుడూ బాదిస్తున్నాయి..అప్పుడలా ఇప్పుడిలా ఏంటో జీవితం..నీపరిచయం లో నా అంత అదృష్టవంతుడు లేడు మరి ఇప్పుడూ నా అంత దురదృష్టవంతుడు లేడు అదృష్టానికి , దురదృష్టానికి వ్యత్యాసం ఇంత భాదాకరం అని తెలీదు అప్పుడు నీకు దూరంకాకుండా ఉండేందుకు జాగ్రత్త పడేవాన్ని ,,,కాని నీవు నా అనుకున్నా...అందుకే అంతస్వార్దంగా ప్రవర్తించా,,,అదే నీమనసును గాయం చేసిందేమో...అగాయం నాకు మిగిల్చి నాకు దూరం అయ్యావు..

ఎదుటి మనిషి బాదపడాలని కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు


నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(8)

1) జీవితపు తెల్ల డైరీలోని పేజీలు చేదు నిజాలు
నన్ను ముద్దాయిని చేసి నిలదీసి సంజాయిషీ అడుగుతున్నాయి ప్రియా


2) ప్రియా తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు చెలి చేసిన గాయం మానదులే చెలరేగే జ్వాల ఆరదు


3) ప్రేమ సాగరానికి దూరంగా అభిముఖంగా ప్రవహిస్తున్నా
ఏదో తెలీని అడ్డుగోడ ఎదురై ఉనికిని ప్రశ్నిస్తే వెనుతిరిగా అప్పుడే తెలిసింది నువ్వు నాతొలేవు.


4) బరువెక్కిన మనసుతో భరించలేకపోతున్నా
నీవు లేని నేను ఒంటరి అన్న మాటకు దాస్సోహం కాలేకున్నా ప్రియా


5) ఇక ఒక నిజం బద్దాకంగా నిద్రలేచి
మనో మైదానం మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది నన్ను ఓడించాలంటూ


6) నువ్వు నాతో లేని క్షణం
నా నుంచి సంతోషం వేరవుతుంది నువ్వు దూరమైనంత తేలికగా


7) ఇన్నాళ్లూ మోసపుచ్చిన జ్ఞాపకాలు 
ఒకేసారి బావుర్మన్నాయి ఏవేవో కలలు వెక్కిరించిన ఆశలు ఆవిరయ్యాయి గుండెకు నీవు పెట్టిన జ్ఞాపకం సాక్షిగా

8) గుండె గాయాలకు కాగితాలద్ది ఆ రక్తపు మరకలని అందంగా..
కవితలగా మార్చాలని అనుకొంటున్నా కాని అక్షరాలు కన్నీళ్ళు కార్చి చెరిగిపోతున్నాయి


9) మనసు పగిలినప్పుడు ఆ నెర్రల్లో భావాలు ఇరుక్కున్నాయి
కళ్ళనిండా కన్నీరున్నప్పుడు వెతికినా కనిపించని వెన్నెల్లాగా ప్రియా


10) కనురెప్పలు మూయగానే కన్నుల్లో నిండుతున్న నీ రూపం
కనులు తెరవగానే కన్నీళ్ళుగా కారిపోతోంది గుండెతలపుల్లో దాగిన భావం ఇదేనా


11) అబద్దపు మమతలను ప్రోగు చేస్తున్నా గతం అంతా నిజమనుకొని
అదే భ్రమలో జీవిస్తూ ఇంకా ఇప్పటికీ.. ..ఏంటి నిజం కాదా మరి ఏది నిజం


12) ఇన్నాళ్ళూ ఒంటరితనానికి ఏకాంతానికి తేడా తెలీని అమాయకుడను నీవు దూరం అయ్యాక ఇప్పుడు ఒంటరితనంలో చేదును రుచి చూస్తున్నా ప్రియా

13) నాతో ఉన్నప్పుడు ఓ కన్నెపిల్లాలా స్నేహితుల్లతో ఉన్నప్పుడు ఓ కొంటెపిల్లలా మీ అమ్మా,నాన్నలతో ఉన్నప్పుడు ఓ చిన్నపిల్లలా మరిప్పుడు నాకు దూరంగా...?

14) నా అన్న నేను నీలో ఉండిపోయినప్పుడు
నాలో నేను వెతుకుంటే ఏలా దొరుకుతాను చెప్పు ప్రియా


15) ఇప్పుడు అందరు నిద్రపోతున్నారు చచ్చిపడిన శవల్లా
నన్ను కుడా శవంలా మార్చవా అందరిలా ... నీజ్ఞాపకాలు నిద్రపోనివ్వడంలేదు


16) నీవుకల వైనా బాగుండేది నిద్రలోనే జీవితం గడిపేవాడిని
గతంలా మళ్ళీమన స్నేహంగా ఉండటం సాద్యిం కాదా మిత్రమా..


17) రాత్రి పక్కమీద అలసటగా వాలే దేహం..లోపలెక్కడో యేదో కుళ్ళిన వాసన మనసు మరణించింది ఏంచేయాలో తెలీక ప్రతిరాత్రి శవం లా జాగరణ చేస్తున్నా నీకోసం

18) నిన్ను కలుసుకుంటున్నప్పుడు.. నీవు నన్ను కాదని మౌనందాల్చినప్పుడు గుండెలో మోయలేనంత బరువుగా మారిపోయి కళ్ళలో ఉప్పునీటి చెరువు అయింది

19) ఆకుపచ్చరంగు చీరలో నువ్వు బాగున్నావు
విచ్చుకున్న మల్లెలా అందంగా నవ్వులు చిందిస్తున్నావు ప్రియా
( ఎప్పుడో నీవు పంపిన ఫొటో ఇప్పుడు కనిపించింది )


20) ప్రేమికులమై ఈ ప్రపంచానికి మెల్లగా 
దూరమై మనం ఒకటి కావాలి సాద్యమేనా...?

21) కన్నీటి నుండి సైతం కవిత్వాన్ని
ఒలికిస్తే రక్తపు ఆనవళ్ళు కనిపిస్తున్నాయేంటో

22) వెలుగుల జాబిల్లి పట్ట పగలు అందరూ చూడాలని
ఒంటిపై వెలుతురు మెరుపులు అతికించుకొని తిరిగినా ఎవ్వరూ చూడరేం


23) ఇన్నాల్లూ మనమద్య దూరాన్ని పెంచిన రహస్యంలో మౌనం నిశ్శబ్దంగా ఒదిగిపోయింది

24) మూసేసిన నీ మనసు తలుపుల ముందు దిగులుతో నిల్చున్న క్షణం గుర్తు చేసుకున్నాను

25) అడిగింది స్వప్నాలలోనైనా తనని తలుస్తావా
నీకేం తెలుసు నేను నిదురించి ఒక యుగమైనదని తెల్సుకొనేం చేస్తావులే


26) కన్నీటితో మనసులోని మంట చల్లారదు
నీటమునిగిన నావని తూఫాను ఆపలేదు..మోసపోయిన హృదయాలకు


27) మనసువిరిచేవానికేం తెలుసు మనసివ్వడం
మాట మార్చేవానికేం తెలుసు మాటివ్వడం మనసులేని మన్సుషులు


28) ఊపిరాడనీయని వ్యధలలో నన్ను ఉక్కిరి బిక్కిరౌతున్న
నన్ను ప్రేమించే వారున్నారని ఎలా నమ్మను..? అదో పెద్దవింత కాకపోతే


29) చిగురుటాకుపై మెరిసే చిన్ని మంచు బిందువుని చూసి నీవనుకున్నా చందమామ లో విరిసే వెన్నెల పువ్వుల్ని కోసి అవన్నీ నీకిద్దమనుకునే లోపు నీవులేవు

30) నీ చూపుల చీకట్లు దాటి ఊహల ఉయ్యాలలూగి ఎన్నాలైయింది
నా అంతరాంతరాల్లో ఓటమి ఒదిగి ఒదిగి చూస్తుంది..ఒక్కసారిగా నన్ను కబలించాలని
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 31) మనిద్దరి మాటలకు మంటలు పెట్టి తగలెట్టావు
ఆ మటల్లో మరొకరికి స్నేహాన్ని పంచి అదే పండు వెన్నెల అంటున్నావా ప్రియా


32 ) నిన్ను నీలొ కోల్పొయావు..అప్పటి నీవు కాదిప్పుడు
నువ్వు నీలా ఉన్నావా అలా లేవు కదూ.. నా కన్నీటి జలకాల్లో కరిగిపోయిన గుర్తులేవి


33) రాత్రి పెచ్చులు పెచ్చులుగా రాలిపోతుంది
ఆ పైచ్చులు నన్ను కబలించి వేస్తున్నాయ్
తిరిగి లేవాలని లేదు.. మళ్ళి మరోరాత్రిని చూడాలని లేదు..
ఎందుకో తెల్సా మళ్ళీ ఎదురుపడి ఎక్కడ నన్ను అవమానించి భాదపెడతావో అని


34 ) మనసు భాదగా ఉన్నప్పుడు విషాదాన్ని గ్లాసులో పోసుకునే తాగితే ఎంచక్కా ఏడ్వొచ్చు కదా

35) ఏంటా రక్తం వస్తోంది అనుకున్నానీ పదునైన మాటలు
గుండెళ్ళో గుచ్చుకున్నాయి కదూ దానితాలూక రక్తపుచుక్కలే ఈ పదాలు


36) ఎందుకు అలా రాళ్ళమీద నడుచుకొంటూ వెలతావు
నాజ్ఞాపకాలెన్నో ఉన్నాయిగా వాటిని చెప్పులుగా చేసుకో నీ పాదాలకు ఎలాంటి గాయంకాదు


37) ఎందుకలా చూస్తావు...నీవు వద్దనుకున్న గుండేగా
అందుకే నాగుండెగదులు నేనే కూల్చుకుంటున్నా...నీకోరిక అదేగా..?


38) మన ఇద్దరికి మధ్య తెలీని పూడ్చలేని అఘాదం
నువ్వు తవ్విన గుంతలో నేను..ఒడ్డు పైన విరగబడి నవ్వుతూ నీవు


39) నా జీవితాన్ని వర్షాపు బురదలో పారబోసాను నీ ఇంటిముందు
నీవు తొక్కుకుంటూ వెలతావు అని అయినా నీకిది అలవాటే కదా కొత్తేముంది..?


40) నా ఊహాల్ని నీ మౌనం ధ్వంసం చేస్తుంది నాప్రమేయం లేకుండానే
నీ జ్ఞాపకం కన్న కలల్ని సమూలంగా ముక్కలు చేస్తుంది జాలి అనేది లేకుండానే


41) నీవు కూడా నాలాగే నిజాన్ని దాస్తున్నావు
వర్షించే మేఘాలు చెబుతున్నాయి నీ వేదనని నాలా నీవేం చేస్తున్నావో


42) జ్ఞాపకాలు చేదయ్యాక నీకు తీపి గురుతుగా మిగిలి పోతానేమో
ఆత్మా దేహాన్ని వదిలే పయనంలో నిరూపితమవుతూ నిత్యం నిలిచి వుండేది ఒంటరితనం


43 ) పోగొట్టుకున్న నీ జ్ఞాపకాలు వెతికి పెడుతూ
నా జ్ఞాపకాలు చేదయ్యాక తానో తీపి గురుతుగా మిగిలిపోతూ నేనొంటారిగా


44) ద్వీతీయతకు తావు లేని అద్వితీయ అద్వైతం.
నీడను సైతం తిరస్కరించే నిరంకుశ తత్వం ఆత్మావలోకనమే నా లోకం


45) ఎవ్వరు లేని అదును చూసి ఒంటరితనం
తనలోకి లాక్కుంటుంది ఎంత వద్దన్నా నీ ఆలోచనలతో మనసంతా ఇరుకుచేస్తుంది


46 ) ఓర్వలేని ఒంటరితనం చాటుగా పరుచుకునే దిగులు చూపులు
రోజుల ఎడబాటైనా వల్ల కాదంటూ రాలి పడే విలువలేని నా కన్నీటి బొట్లు


47) విచ్చుకోని పెదవుల మౌనంలో మనసు విరహ గీతాలు
చెమ్మగిల్లిన చూపుల కటూ ఇటూ వేల గా మిగిలిపోయిన జ్ఞాపకాలు


48 ) తపించే వెర్రి హృదయపు బెంగ బాధగా భారంగా మారినపుడు..
నవ్వులు పూయని శూన్యంలో..వెలుతురు సోకని లోకంలో నేనొంటరిగా


49) సుతిమెత్తని నీమందలింపులు ఏమయ్యాయో
నిర్లిప్తంగా రోజులెందుకు ఇలా ఒంటరిగా ఎందుకు మారాయో కదా


50) భరించలేని భాదవచ్చినా...తట్టుకోలేని సంతోషం వచ్చినా
కన్నీటి ఉప్పెనలో నీవే గుర్తొస్తావెందుకో..నీజ్ఞాపకాలే తట్టి నిన్ను గుర్తుచేస్తాయి