నాకిది జరగాల్సిందే...నీకోసం అంతగా ఆరాట పడ్డాను కదా..
నాకిది జరగాల్సిందే...నీవే నాప్రానం అనుకున్నాను కదా..?
నాకిది జరగాల్సిందే...ఎందుకంటే నీవిలా చేస్తావని కలలో కూడా ఊహించలేదు
నాకిది జరగాల్సిందే...ప్రపంచంలో ఇప్పటికీ నీవంటే ఎందుకో చెప్పలేనంత ప్రేమ..
యదలోతుల్లో తుఫాలు అలజడి..చుట్టూగాడాంధకారం కమ్ముకుంటోంది
హృదయాంతంగాళ్ళో మోదలైన ఆవేదని ఇప్పుడు ...నా భవిష్యత్ చెప్పేస్తున్నాయి
నమ్మకం అనే నీడలో కలకాలం జీవించి ఉంటాను అనుకూన్న నిజం అబద్దం అయింది..
నీడ అనుకున్న నిజం..ఏర్రటి ఎండగా మారి..నన్ను కాల్చేస్తుంది..
ఎందుకో ఒకప్పుడు ఎవడో పెట్టిన చిచ్చుకి సగంకాలిన శవంగా మారా..
వాడు అనుకున్నది సాదించి..ఆనదంగా ఉన్నాడు..మరినేను ..?
ఎందుకో తగలబడుతున్నా..ఇప్పటికే సగం కాలిపోయా...కాలుతూనే ఉన్నా
ఒకప్పుడు వద్దు బ్రతకానలి అనిపించేది..కాని ఇప్పుడు ఆ ఆశలేదు చచ్చిపోయింది
కనీసం కనిపిస్తావన్న కోరిక చచ్చిపోయింది..ఎందుకంటే నమ్మకం సమాది అయిందికదా..?
స్నేహితులు బ్రతకాలని కోరుకుంటారు ..మరి చావాలాని చచ్చిపో అనే వాళ్ళు ఎవరు..
చచ్చిపొమ్మని చెప్పిన నీకోరికి తీరుతోంది ..అందుకే తగలబడుతున్నా...?
ఎప్పుడన్నా ఏదో కారనం వల్ల గుర్తుకు వస్తే ..ఎంత వెతికినా కానరానేమో
అప్పుడనుకుంటావు ..చూశావా నేను చెప్పినట్టే చేశాడు..పీడా విరడైందని కదా..పండుగ చేసుకో నా చావుని ప్రియా