యెదలోని జ్వాల యెగిసిపడక ముందే
మది లోని మంట మాడ్చి వేయక ముందే
నాలోని శ్వాసా ఆగిపోకముందే
నాగతమంతా అనిచివేయక ముందే
నా ఆశలు నెరవేరక పోవా?
నా ప్రేరణ నిదురించకరదా ?
నేనే ఓ ప్రళయం కానా?
ఈ చరితను మార్చక పోనా ?
అని కలలు గన్నాను అవి కళ్ళలే అని తేలింది..
దీపం అనే నీముందు మాడిపోతున్న పురుగుని అనుకోలేదు..?
నేనేంటో తెల్సుకోలేక పోయాను...ఇప్పుడు గుండె మొద్దు బారింది
గుండెళ్ళో కత్తులు దిగినా ఎందుకు బ్రతికున్నానా అనిపిస్తొంది
నామీద నాకే అసహ్యిం వేస్తుంది..చావెప్పుడొస్తుందాని ఎదురుచూస్తున్నా..
ఎక్కడో మినుగు మినుగుమంటున్న ఆశ చచ్చిపోయింది