. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, February 28, 2015

నా మనసును ఎదుకు పగులగొట్టావు ...?

నిజానికి
మనసెప్పుడూ గాజుపలకే
పగులుతూనే ఉంటుంది
ముక్కలు ముక్కలవుతూనే ఉంటాయి
పగులకొట్టే నీలాంటి వాల్లు 
మనసుని పగులకొట్టడానికే
పరిచయం అవుతారేమో 


ఒక పారదర్శకమైన పొర
నీవంటే ఇష్టం వున్న  
భావన నన్ను మరువనీయదు 
మనసును  చుట్టి ఉంచుతుంది.
ముక్కలైనా మనసు 
పగుల్లు 
నేలరాలకుండా
ఆ పొరలోనే ఉండిపోతాయి…
అందుకే కాబోలు
ముక్కలయినా..మనసులో 
ఎంత వెతికినా ప్రతి చోట నీవే కనిపిస్తావు   

Friday, February 27, 2015

చీకటి కాటుక పూసిన నింగిలో ఒంటరి ప్రయానం

చీకటి కాటుక పూసిన
నింగిలో అక్కడక్కడ 
వెలుతురు నీడలు వెక్కిరిస్తున్నాయి
నిరంతరాయ నిరీక్షణ
సాగినా అగని మనస్సు పొరాటం
నిజంకాని నిజంలో ఒంటరి 
చీకటి రాత్రుల్లో చేస్తున్న ప్రయాణం

అప్పటి నీ మనసు సవ్వడికై
నా అన్వేషణ ఫలితమే 
ఈ ఒంటరితనం  
నేను కోరుకుంది కాదు 
ఆ ఒంటరితనం నాలో కి విసిరిన 
నీకు నన్ను ఏమార్చీన నీకు 
ఏమని సమాదానం చెప్పుకోగలను 
నింగినుండి విసిరిన ఓ తారకనా 
కాలి బూడిదైన ఈ వెచ్చటి నిజాన్నా 
ఏదని చెప్పను ఏమని చెప్పుకోను 
నన్ను నాలో నేనాకై చిరకుపడుతున్న 
ఈ చీకటి రాత్రుల్లొ నన్ను నేను ఓదార్చలని 
ఈ అక్షరాలు  చేసున్న వింత ప్రయత్నం 

Thursday, February 26, 2015

మరణమా ఎక్కడున్నావు

మరణమా ఎక్కడున్నావు 
ఎందుకు నక్కి నక్కి చూస్తున్నావు 
నా మనస్సుతో ఆడుకొంటున్నావు 
రా ..... నువ్వు రా .... 
మరణమా ఎటువెల్తున్నావ్ 
నేనంటే భయపడ్డట్టు నటిస్తున్నావా 
రా ..... ఇటు రా ...... 
నన్ను కబలించి ఊగిసలాడుతున్నా 
నా ప్రాణాలు తీసుకెల్లూ 
ఎందుకు ఇంకా నాటకాలాడటావు  

ఎంత పిలచినా పలకవే నువ్వు 
ఎంత అరచినా చూడవే నువ్వు 
నీకు నేను అలసయ్యాను కదూ 
ఎందుకు ఎందుకు ఎందుకు ?
ఓ మరణమా మరణమా మరణమా 
ఒకప్పుడు నేనంటే బయపడేదానివి 
ఇప్పుడు ఎదురుగా వుండే డ్రామాలాడుతున్నావా  

నా గుండె అలసిపోయింది 
నా అడుగు నన్ను విడిపోయింది 
నా ఉనికి నన్ను మర్చిపోయింది 
నా తనువు మాత్రమే నాతో ఉంది  
ఊపిరి బిగబట్టినా అవె జ్ఞాపకాలు 

 నిస్సహాయత చుట్టుముట్టింది 
నిరాశే నాకు మిగిలింది 
ఆశ అడ్డు రానంటుంది 
నా శ్వాష మాత్రమే నాలో ఉంది   

నవ్వు నన్ను వెక్కిరిస్తుంది 
భాద నన్ను పలకరిస్తుంది 
బంధమే త్రోసివేసింది 
నా నీడ మాత్రమే నాతో ఉంది  
నాకు నేను దూరంమవుతున్నా రోజు రోజుకీ   

Sunday, February 22, 2015

నేను కవిని కాదు నేను రాసేది కవిత్వంకాదు

నేను కవిని కాదు నేను రాసేది కవిత్వంకాదు మనసుపొరల్లో అలజడి ...నావన్నీ తాటాకు చప్పుల్లే తడిఆరని కన్నుల్లో..ఉరకలేసే ఆవేశంతో రాస్తున్నా నేను కవిని అని చెప్పలేని ..నాది కవిత్వం అని చెప్పలేదు ఒకప్పుడు నేను రాసే పిచ్చి రాతలు ఒకప్పుడు నీకు కవిత్వంగా కనిపించాయి .. కాని అవి ఎందుకో పిచ్చి రాతలు అయ్యాయి నాకంటే నీవు మెచ్చిన వారిలా రాయడం నాకు రాదు నేను రాయలేను గుండెగదుల్లో..గూడుకట్టుకున్న నిజాలు సముద్రపు అలల్లా దూసుకొస్తూ అవేశంగా.. అక్షరాల రూపంలో రాసే ప్రయత్నం చెప్పుకునేందుకు మనుషులు దూరం అయినప్పుడు అక్షరాల అమరికకు నేను చేస్తున్న విఫల ప్రయత్నం బారమైన మనస్సుతో అక్షరాలను ఏర్చి పేర్చాలని చూస్తున్నానే కాని నేను రాసేది కవిత్వంకాదు.. నాకు కవితలు రాయడంరాదు కనికరంలేని మనుషులు కన్నెర్ర చేసినప్పుడు కాలిన మనసనే కట్టెల తాలూక మసిపొగే నా రాతలు తలరాతను నా రాతల్లో నీ రాతి గుండెను అక్షరాలతో తడిమే ప్రయత్నం కరగని మనస్సును అక్షరాలతో చల్లార్చే ప్రయత్నమే నా రాతలు చిమ్మ చీకట్లో.. వెలుగును అక్షరాలతో వెలుగునింపాలనుకునే ప్రయత్నం నీ మౌనం వెనుక శబ్దాలను.. ఊహాలోకంలో అక్షరాలు గా మార్చుకొని .. నీతో నేను మాట్లాడుకునే ప్రయత్నం నా రాతలు గతంలో మనం మాటలన్ని మూటలుగా ఉన్నాయి నీగుర్తులుగా ఉన్న మాటల మూటలు విప్పి అక్షరాలన్నీ పేర్చి చూసుకునే ప్రయత్నంలో మౌనంగా ఉన్న నీకు ఏదో చెప్పాలనే ప్రయత్నం నలిగిన హృదయం చెప్పలనుకున్న మాటలను నాలుగు అక్షరాలు పేచి మనస్సును కుదుట పర్చే ప్రయత్నం జరిగిన మోసానికి.. అఘాదాల్లో పడిపోతున్న సమయాన అక్షరాలను పేర్చీ ఏమౌతున్నానో అంటూ నాకు నేను చెప్పుకునే ప్రయత్నం..విఫల ప్రయత్నం నా గుండెలో రేగిన అలజడుల చప్పుడు నీకర్దం కాదు అర్ధం చేసుకుంటావన్న నమ్మకం  లేదు ... ఆమనసే వుంటే నిజాలనే నా గుండె మంటను తగులపెట్టావు నీవు నీలా ఆలోచించడం మానేసి ఎన్నిరోజులు అయిందో నేరం చేయని నన్ను నేరస్తుడనే ముద్రవేసి నవ్వుకొంటున్నా నిన్ను చూసి మౌనంగా రోదిస్తున్న నీకు  ఓ జోకర్ లా కనిపిస్తున్నా వాళ్ళలా  నేనుండ లేను ఎందుకంటే నేనూ ఎప్పటికైనా నేనే ...నీ చిలకపలుకుల్లో భావం అర్దం మరొకరికోసం అని తెల్సి అక్షరాల వైపు అర్తిగా చూడటం  తప్ప ఏమీ చేయలే ని నేను నన్ను నేను నిందించుకోవడం నన్ను నేను దూషించుకోవడం చెసుకొంటూ కాలాన్ని దాటే  ప్రయత్నం చేస్తున్నా .. 

Wednesday, February 18, 2015

ఆ మనిషి ( మనసులో ) లేని నేను ...?

ఒంటరిగా మిగిలిపోయాను 
విశాల ప్రపంచంలొ 
విరిగిన మనసు ముక్కల నేరుకొని
నేనేంటో తెలియని జన సమూహంలో 
ఒంటరిగా మిగిలా ..కాదు కాదు మిగిలేల చేసింది 
ఓటమిని నామొహాన పడేసి
మనసులేని మనుసులే  నన్నిలా చేశారు
నిజంలో దాగున్నా అనుకున్నా 
అబద్దమనే నకిలీ  మెరుగులకోసం 
పరుగులు పెడుతున్న 
ఆ మనిషిని చూసి నవ్వుకొంటున్నా 

చేజారిన కొన్నిని కన్నీటితో  తడిసిన క్షణాలను 
పట్టుకొని ఇంకా మురిసిపోతూనే వున్నా 
తను దూరమై సంత్సరాలు గడిచినా 
ఇంకా పక్కనే వున్నట్టు వెర్రి ఆలోచనలు
తను నా  నుండి దురం అవుతూ 
నాలో విసిరేసిన విషాదంతో కాలం వెల్లదీస్తున్నా

అస్పష్టమౌతున్న చూపులతో వెనుదిరగ్గానే
నేను చితిమీద తగలబడుతున్న 
కట్టెగా మారిపోయాను 

తనెళ్ళిపోయాక నాలోంచి 
ఆవిరైపోయిన ఆనందం
ప్రపంచంలో ప్రతీ ఒక్కరి పెదాలపై 
మళ్ళె మొగ్గలై విరుస్తూనే వుందిగా 
ఒక్క నా పెదలపై తగలబడే విషాదం 
ప్రతిక్షనం నన్ను వెక్కిరిస్తూనే వుంది 

Friday, February 13, 2015

బద్రి బాబాయ్ కు నా చివరిలేఖ


మరణం సహజం ..
కాని కొందరి మరణం అసహజంగా అనిపిస్తుంది
అందరివాడు.."బ్రది"..బాబాయి ఎక్కడున్నావో
ఇది నీకు న్యాయమా ..నీదారి నీవు చూసుకున్నావు
దేవుడితో నీవేం కమిట్ మెంట్ ఇచ్చావో తెలీదు కాని
నీకు తెలియకుండా నీవు వూహించని ఎందరో హృదయాలను
భారంగా చేసి బాగున్నావా అనే పలకరింపులో..కనిపిస్తావేమో అని
ఇప్పటికీ ఇంకా వెదికే తడి కన్నుల సాక్షిగా నీ అదృశ్యం నమ్మాలని లేదు
అది నిజం కాకూడాదని మనసును సర్ది చెప్పుకున్న 
ఎందరో కళ్ళో కన్నీటి చెమ్మగా మారి బాబాయి నేనున్నా గా 
అని అనిపిలుస్తున్నట్టుంది నిజంలో అబద్దాన్ని వెతుక్కున్నట్టు ..
నీకెంత ఫాలోయింగ్ వుందో నేకేం తెలుసు చూస్తున్నావా..
ఎంతమంది నీ మరణం నిజం కాదేమో 
అని ఇంకా టివి9 బులిటెన్స్ లో వెతుకుతున్నారు
అక్కడ కనిపించని నిన్ను యూట్యూబ్ లో నిన్ను బ్రతికించుకొని ..
గతాన్ని ముందుకు తెచ్చుకొని చూస్తున్నాంగా ... 
గతాన్ని గాలికొదిలేసినా నిన్ను గతంలోనించి ప్రస్తుతంలోకి లాగి 
ఎన్ని స్తార్లు యూట్యూబ్ లో చూసుకున్నామో..
దేవుడిని తిట్టాలనే ఉంది అందమైన కుటుంబాన్ని వేరు చేసి నిన్ను 
మానుంచి దూరం చేసి ఏం సాదించాడో ..ఎన్ని మరణాలు చూశాం.. 
ఏన్ని దారుణాలను కల్లముందే చూసాం..అతి వృత్తిలో భాగం అయిన 
ఎందుకొ ఇన్ని హృదయాలు పరితపిస్తున్న 
నీ మరణం నమ్మలని లేదు కాని నమ్మక తప్పడంలేదు

Sunday, February 8, 2015

హంతకుడిగా మారాలనుకుంటున్నా చిదిమిపోయే చిన్నారులకోసం


పదహారేళ్ళ ప్రాయరాకుండానే 
పరువాల విలువ తెలియని క్షనాల్లో
మనిషి తయారు చేసిన డబ్బుకోసం 
కాలే కడుపుకోసం కన్నవాల్లకోసం
కన్నీళ్ళను దాచుకొని 
కన్యత్వానికి ..కామానికి తేడాతెలియని 
వయస్సులో అందరిలా ఆడుకొకుండా 
రాకుమారుడి కల్లలో తేలిపోకుండా 
చికటీలో మగ్గే చిరుమొగ్గల కోసం 
చేయి చాచి ఆదుకునే నాదుడే లేడే 
సమాజం లో నీతులు వల్లించే 
రాజకీయనేతల కామానికి 
బలయ్యే మొదటి చిన్నారి 
ఈ పసిమొగ్గే 
సమాజమా ఈ దారునాలు చూడలేను 
అందుకే హంతకుడిగా మారాలనుకుంటున్నా
ఇలా పసిమొగ్గలను చిదిమే 
ప్రతివాడిని అడ్డంగా నరికేస్తా
నా ప్రాణాన్ని ఫనంగా పెట్టి
వంద జీవితాల వెలుగుకు కారనం కావాలని
అసలైన న్యాయంకోసం ఈ పని చేస్తున్నా
ఇప్పుడు న్యాతదేవత కల్లు తెరుస్తుంది
అమాయక ఆడపిల్లలను ఏమార్చే వారికోసం
నన్ను దోషిని చేస్తుంది 
నన్ను హంతకుడిగా శిక్షిస్తుంది
అసలైన దోషులు ..బైట నేను మాత్రం 
జైల్లో మగ్గాల్సిందే ...
ఎందుకంటే నేను మంచిపని చేస్తున్నా
అది న్యాయానికి నచ్చక కాదు
న్యాయదేవత కల్లకు గంతలు కట్టారుకదా

అవును ఎవరు వ్యభిచారి ....? ( ఈ ప్రశ్నకు సమాదానం ఉందా )

అవును ఎవరు  వ్యభిచారి 
కాలే కడుపుకోసం
కౌగిలింతలకు ఖరీదు కట్టేదా 
కన్న బిడ్డలకోసం
అవమానాన్ని కళ్ళు ముసుకోనైన భరించేదా 
అన్నం మెతుకులకోసం
అగంతకుల అలింగనాన్ని ఆహ్వానించే 
ఆకలిదా ...?

కట్టు బట్ట కోసం

నగ్నత్వాన్ని నడిబజారులో పరిచి 
తెగిపడని సమస్యల నిలువరింపు కోసం
రతి రోతను భరించే "వ్యభిచారిని"
పది పైసల నుండి , 
పదివేల వరకైనా
ప్రతి పైసను పరువంతో వెలకట్టేవాల్లను 
చూసి ముడిపడిన నీ నొసటి గీతాలను
వ్యభిచారి పెదవి విరుపుతో విదిలించే 
మాతాంగి,బోగిని,జోగిని, దేవదాసీ,వేశ్యా
అని నామకరణం చేసిన ఓ "పాతివ్రత్యమా" 
అసలు ఇక్కడ సంసారి ఎవరు.....వ్యభిచారి ఎవరు..?
మగడి కౌగిలింతలో పరపురుషుని స్పర్శను
ఊహిస్తూ మానసిక వ్యభిచారం చేసే నీవు
మాతాంగివి కావా....?
బోర్ కొట్టిన ప్రతిసారి బాయ్ ఫ్రెండ్ను మార్చే
నీవు బోగినివి కావా.....?
శరీర కోర్కెల కోసం 
పైకి పాతివ్రత్యం నటిస్తూ 
చీకట్లోని నాలుగు గోడల మధ్య 
కామం తీర్చునునే వారినేమనాలి
యజమాని మెప్పుగోలు కోసం
వాని కంపరం పుట్టే కామం చూపులను
నవ్వుతూ భరించే నువ్వు దేవదాసివి కావా
నీ అవసరాలకోసం మగాడి వికృత చేష్టలు బరిస్తూ 
దానికి స్నేహం  .. 
ప్రేమ అని పేర్లు పెట్టే నీవు మంచిదానివా ..?
జానెడు బట్టే బరువైన రంగుల ప్రపంచంలో
ఫ్యాషన్  పేరుతో ణి అందాలను ఆరబోస్తూ   
వెన్నెల బొమ్మల వెలుగొందే నీవు
జోగినివి కావా......?
మీ బ్రతుకు కంటే హీనమైనదా వ్యభిచారి బ్రతుకు
నీ పై పై ఆనందాలకోసం 
ఎక్కడ చీకటి దొరికితే అక్కడ పడుకునే నీవు 
పైకి పాతివ్రత్యం నటిస్తూ వ్యభిచరిని కన్నా దారుణంగా 
మగాళ్ళను ఏమార్చి మగజాతిని 
అటబొమ్మను చేసే నీకేం పేరుపెట్టాలో ...?
పబ్బుల్లో గబ్బుపట్టే నీ జీవితన్ని మెరుగు పర్చుకో
నీకంటే తనకోసం తనకుటుంబం కోసం బ్రతికే 
వ్యభిచరిని "దేవత" ..నీవు అసలైన వ్యహిచరినివి కాదా 

మరణాన్నైనా జయించగల్గే నీ చిరునవ్వు


Saturday, February 7, 2015

నిర్జీవంగా మరిపోయా గతాన్ని గెలిపించలేని ప్రస్తునం సాక్షిగా

అన్ని శబ్దాలు నిశ్శబ్దంలోకి 
ఆవాహన అయిపోయాయి 
పొరలు పొరలుగా జారిపోతున్న నిసర్గరాత్రి!
మృత్యుధ్వజంపై అచ్చేసిన  
బొమ్మ నాదే
దేవుడు చేసిన బొమ్మను కదా   
అదేవు డే చిత్ర విచిత్రంగా 
ముక్కలు చేస్తున్నాడు 
మనసును రంపపు కోతకోసాడు
ఇప్పుడు గుండెకు తూట్లు పొడుస్తున్నాదు 
నిన్నటికీ  రేపటికి మద్యి ఇరుక్కొని 
ఇంకా నలిగిపోతూనే వున్నా
గతం చురకత్తినా 
నా గొంతుకను కోస్తూ 
పచ్చి నెట్టురు తాగుతోంది 
ఆయాస ప్రయాసలలో కాలం నన్ను
కొండ చిలువై మింగేస్తోంది!
ఆ కాస్తా మిగిలిన క్షణాలను 
బతికిన క్షణాల్లోకి ఒంపుకుంటూ,
బ్రతకాలని లేకున్నా
బ్రతుకు నీడ్చలేక 
మౌనంగా రోదిస్తూ 
బ్రతుకుతున్నా  శవంలా 
నీవు రావు రాలేవని తెలిసి 
అట్టానే నిరీక్షించనూ?
మృత్యుకళికలోకి..
వెల్లి నన్ను నేను  కప్పెసుకుంటున్నా 
కాలేందుకు కట్టెగా మారాను 
అగరొత్తుల పొగను వెలిగించింది
సమాధిలోకి..
అత్తరు పరిమళాల్లో 
ప్రారంభమవుతుందనుకున్నావా?
తలదగ్గర పెట్టీన దీపం ఏప్పుడు 
ఆరిపోదామాని చూస్తుంది
నన్ను కాదని వెల్లిన నిజాన్ని  చూడలేక  
వెర్రివాని నవ్వులా జనం లోలోన
విరగబడి నవ్వుతూ...
పైకి మాత్రం ఉదాసీన ముఖాల ముసుగేసుకొని,
నాలుక చివరన వ్రేలాడే మాటల్లో
చివరి కన్నీటి చుక్కను జారుస్తారు
అయినా.. నేను మాత్రం అక్షర నక్షత్రమై
విషాద రాతలు రాస్తూ 
నేనేంటో తెలియని క్షనాల్లో 
నన్ను నేను మర్చి ఏమర్చి 
నిర్జీవంగా  మరిపోయా 
గతాన్ని గెలిపించలేని ప్రస్తునం సాక్షిగా