కొన్నిసార్లు ఆవేశంతో..కొన్నిసార్లు ఆత్రుతతో
మరికొన్నిసార్లు అసంతృప్తితో..ఎన్నో ప్రశ్నార్ధకాల పరిహాసాల నడుమ
పరుగులు పెడుతుంటాను దేనికోసమో..?
నామది నెమ్మదించడానికి..నువ్వు గుర్తొస్తే చాలు
ఒక హయైన భరోసా !
నీమాటతోనో...స్పర్శలోనో..ప్రశ్నలన్నీ ఆవిరయిపోతూ
అద్దంలాంటి నీచిరునవ్వు..నను గెలుస్తూ...గెలిపిస్తూ...
నీతోడు నిజంగా...ఒక అందమైన మాయ!!
ఆ అందమైన మాయలో ఎప్పుడో మునిగిపోయాను..?
బయటికి రాలేను ఒంటరిగా ఆలోచించలేని..అది సాద్యింకాదు
నేనుగా నన్ను నేను ఎందుకు కోల్పోయానీ తెలీదు..
సూర్యుడు పగలు బాగా వెలుగుతాడు సాయంత్రం వెలుగు కోల్పోతాడు
ఇప్పుడు నేను వెలుగును కోల్పోయిన సూర్యున్ని ...
అంతా నాదే అనికొని బ్రమలో ఉన్నానేమోకదా.
ఎందుకో నీవు జ్ఞాపకం వచ్చినప్పుడు బరించలేని భాద..
తట్టుకోలేని ఆవేదన అనిపిస్తుంది..కాని ఏం చేయలేని పరిస్థితి..
భాదపడటం నీవు నాకిచ్చిన గిఫ్టేమోకదా....?
జరిగిపోయిన నిజాన్ని ..జరుగుతున్న వాస్తవంలో ఏది నిజం
నీకు నేను గుర్తున్నానా...అప్పుడలా ఇప్పుడిలా ఏలా ఉండగలుతున్నావు
నిజమే బ్రమలో ఉన్న నేను ఏదినిజమో ఏది అబద్దమో తేల్చుకోలేక పోతున్నానా..?
నాది అనుకున్నది నా ఎదురుగా దూరం అయినప్పడే ..నిజం బ్రమలా మారింది..
ఏది జరుగకూడదని భయపడతామో అదే నాకళ్ళేదురుగుగా జరిగితే..
ప్రతిక్షనం అదే గుర్తుకువచ్చి..మనస్సు గందరగోళంలో నిదుర కరువౌతుంది
-David & Me