. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, December 26, 2017

నాలో నేను (5)

అర్థం కాని లోకంలో
అయోమయంలో
అదోరకపు భ్రాంతిలో
 బ్రతికేస్తున్నాం
మనుషులంతా ఇప్పుడు..
మౌనశిలలుగా మరో రూపమెత్తారు
మాటలు కరువైయ్యాయి
పెదాల కదలికల్ని మనసు దారిలో విసిరేసి
తమది కానీ లోకంలో విహరిస్తున్నారు

ఇప్పుడు మాట్లాడ్డానికేమున్నాయి?
అంతా వాట్సాప్,ఫేస్ బుక్ లేగా
ఇదే నిశ్శబ్దాలకు మూలాలు
అయిన ఇప్పుడేం మిగిలుంది
ఇద్దరి మనుషుల  నిశ్శబ్దమేగా
ఇద్దరు వ్యక్తుల మధ్య
నిరంతరం భయంకర నిశ్శబ్దం
ఆవరించి ఉంది
విధ్వంసానికి
మహా సంగ్రామాలు అక్కర్లేదు
ఎదురెదురుగా ఉన్నా
మాటలు రాలని మౌనం చాలు
అందుకే ఇప్పుడు..
మాటల్ని మౌనపు
ముద్దలుగా మూలకి విసిరేసి
మనుషులంతా నడిచే
మౌనశిలలుగా బతుకీడ్చుతున్నారు.
కాదు కాదు మౌన శిలలు గా మారిపోయారు

Sunday, December 17, 2017

నాలో నేను (4)

నమ్మకపు నాలుక చివరన
పడ్డ గాయం..నిశ్శబ్దపు
నిజం మాటున
చుర కత్తుల్లా..దూచుకొచ్చి
అక్షరాలు మనసునిండా
గాయాల మయం చేసాయి..

ఇష్టం కష్టం గా మారిన క్షణాన
ఎదురించ లేని నిస్సత్తువ నడుమ
నాలో రగిలిన‌ భావాలతో
నన్ను నేను రాగిలించు కొంటూ
తగలబడుతున్న జ్ఞాపకాల
వెలుగుల్లో..కానరాని నీకోసం.
నా మనసు ఆత్రంగా వెతుకుతొంది

నాలో రగులుతున్న
ఆశలు నా దేహాన్ని
చీల్చుకొని పదాల పరిమలా లై
విచ్చుకుంటూ ని గుండెలోతుల్లో
చొచ్చుకుపోతూ..చొరబడాలని
ఎప్పటికప్పుడు విఫల ప్రయత్నం
చేస్తూనే ఉన్నా  ఆశ నిరాసై
మౌనపు చీకటి సాక్షిగా..
గాయపడ్డ నిజం కన్నీరు పెడుతుంది

నీవు గుర్తొచ్చినప్పుడు
కొన్ని క్షణాలు నన్ను ఆశక్తుణ్ణి
చేసి ఏకాంతపు
గుహలో పడ్డప్పుడు
తడబడుతున్న అడుగులతో
నడుస్తూ వెళుతూనే ఉన్నా

Thursday, December 7, 2017

నాలో నేను(1)

మనసుపోరాల్లోని
జ్ఞాపకాలు తడుముకున్నప్పుడు
కంటి చివరల నించి..
క్షణాలను ఒడిసిపట్టుకుందామనుకున్న
జారిపోతున్న భావాలను
బందీలుగా చేయాలని చూస్తున్న
ప్రతి ప్రయత్నం విఫలం అవుతూనే ఉంది

 ఎదురుగా కనిపిస్తున్న రూపం
లిలగా అస్పష్టం కనిపిస్తూ
 మురిపిస్తు మైమరిపిస్తోంది
ప్రశ్నలుగా మిగిలిపోయిన
కొన్ని జవాబులుగా సాక్షిగా..
గాయపడ్డ గతం జ్ఞాపకాలై..
రాలి పోతూనే ఉన్నాయి
నీ చిరునవ్వుల ముందు
చిరిగిపోయి
జీవితాలు పొరల చిరిగుల్లో
వెతికిచూస్తే కనిపిస్తూనే ఉన్నావు

నాలో నేను(2)

ఒంటరితనపు నడకలో
ఆమె కన్నీటితో
నిర్లక్ష్యం నన్ను వేక్కిరిస్తూ
తన నడక సాగిస్తూనే ఉంది
నా రెప్పలపై జారిపోతున్న
కలల సాక్షిగా..నాలో నేను
తడబడుతూ...అడుగులు వేస్తున్నా
చెదిపోతున్న స్వప్నాల సాక్షిగా
నిదురలో ఉలిక్కి పడ్డ నేను
ఊహలకు ఉపిరిపోసుకుంటూ
 ప్రతీరాత్రీ...కలత నిద్రలో నీకోసం
తడుము కుంటూనే ఉన్నా

వేకువ కోసం వేలరాత్రులు
ఎదురు చూపులతో
కాలం కరిగిపోతూనే ఉంది
నిజం అడ్డుగోడను
బద్దలు చేసిన అబద్ధం సాక్షిగా
అన్ని కలలు గానే మిగిలి పోయాయి

 మనసు మూలలో
మౌనంగా రోధిస్తున్న నిజం సాక్షిగా
ఆ గతమంతా జ్ణాపకమై..మిగిలి పోయింది..

నాలోనేను (3)

పగిలిపోయిన పగుళ్లలో
ముక్కలైన..చిరుగుల.మధ్య
మనసులో జ్ఞాపలకు చేస్తున్న
విధ్వసం,విస్ఫోటనాలు
నాకు మాత్రమే వినిపిస్తున్నాయి

నిజం ఆకలి చూపులకు
ఆవిరి అవుతున్న జ్ఞాపకాల సాక్షిగా
అబద్ధపు..అక్రందనలో
ఆశగా ఎదురు చూస్తున్న
విషాదం..నిషా చీకటిలో
విరహపు నల్లటి రంగు
పులుపు కొంటుంది..ఎంటో..?

కోరికల విరహ వేదనతో
కసి తీర్చుకుంటున్న కాలం
కరిగిపోతున్నా..కనికరించని జ్ఞాపకం
కన్నీరై వెక్కి వెక్కి వెక్కి
ఏడుస్తున్న..గుర్తు గా మిగిలిన
ఆ ఎరుపెక్కిన కళ్ళే సాక్ష్యాలు

ఎక్కోడో.. మత్తెక్కిస్తున్న
మల్లెలు...నలిగి.నాశనం అయినా
చివరి  రెబ్బవరకు
మత్తైన వాసననిస్తూ
ఓ రెండు మనసులను దగ్గర చేసి
ఓ వింతైన తృప్తి తో
చెత్త బుట్టలో చేరి
ఆ ఇంటిని చివరిసారిగా నలిగిన
ఆ దుప్పటి మడతల్లో..తనొదిలిన
మల్లెల మాధుర్య0..ఒక్కసారిగా
జివ్వున వచ్చిన
గాలి తనతో తీసుకెళ్ళ0ది
అయినా  ఆ మత్తెక్కించే నిజానాన్ని
మౌనంగా వదలి..తాను తగలబడింది

Monday, October 30, 2017

నీకోసం వేచిచూడటమే ...ఓ కవిత్వం నాకు.

ఓయ్
ఈ చెట్లు చూడు రోజూ పెళ్లికూతుళ్లల్లా పూలు సింగారించుకుని ఆకాశాన్ని మత్తెక్కిస్తుంటే, వెర్రి ఆకాశం తెల్లబడుతూ, ఎర్రబడుతూ, నల్లబడుతూ తబ్బిబ్బై ముంచేస్తుంది.
ఆ సెలయేరు చూడు ఎవరు తరుముకొస్తున్నారని అంతలా పరుగులు పెడుతోంది? ఆగదు, ఆగనివ్వదు నీలా. మలుపు మలుపులో ఊరిస్తూ, ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
అందాల మందారం మాత్రం ఏమి తెలీనట్లు సోయగాల చమక్కుల్లో చిక్కకుండా చుట్టూ తిరుగుతోంది రంగులరాట్నంలా. రాలిపడుతున్న పారిజాతాల్ని, విప్పుకుంటున్న పొగడ పూవుల్ని ఒకింత ఆశ్చర్యంగా చూస్తూ. ఇంక మల్లెలతో మనసు కలిపేసుకుందేమో అక్కడ నుండి చూపులు తిప్పుకోలేక పోతోంది. నాకు భలే అసూయ అనిపించి, ఆ మందారం అదృష్టాన్ని ఆవగింజంత అరువు తీసుకుని, దేవగన్నేరు పూలని ఒక్కొక్కటిగా పేర్చుకుంటుంటే, నీకెందుకోయ్ అంత అక్కసు? పాదాల పారాణి పూలకంటిస్తున్నావేంటని నా వెంటబడ్డావు.
గమనించవు కానీ, ఆ పూల ఎరుపులు మత్తెక్కిన నీ చూపుల మెరుపులని ఎన్ని సార్లు చెప్పాలనిపిస్తుందో .... నువ్వేదేదో చెప్పేసి నా మాటల్ని నాలోనే మూటకట్టేస్తూంటావు.
అలా చూసివెళ్లే ఆ చూపుల్లో మునిగిపోయానేమో నీ నీడ పడిన చిలకరింతల్లో ప్రతి మొలకా చిగురులు తొడుగుతుంది. ఆ పులకరింతల్లో ప్రతి పువ్వు పరవశిస్తోంది.
అణువణువు నన్నల్లుకుంటున్న నీ చూపుల్ని ఓ కంట గమనిస్తూనే ఉంటానోయ్.
వెళ్లాలంటాను ..వెళ్లలేక
కొంచెంసేపంటావు ..వదల్లేక
అలా అలా ఏకాంతమంతా పెదాల నవ్వుల్లో విరబూయటం ఎంతో ఇష్టమైన అనుభవం మనకు.
నీ కౌగిళ్ళ వలలో చిక్కిపోగూడదంటూ .. పట్టుబడిపోవటం భలే గమ్మత్తుగా ఉంటుంది. అది సరే కానీ, కాలాన్ని అద్భుతదీపంలో దాచేద్దాంలే కానీ, వచ్చేసెయి.
నిన్నటి నీ చూపుల వలయం విసిరిన పారవశ్యంలో మునిగిపోవటం వదిలించుకోవటం ఎంత కష్టమో ఇప్పుడు నాకు.
ఒకొంత దూరాన్ని పాటిస్తూనే ..ఒకరినొకరు వెంటాడుకుంటూనే వుంటాము, ఎందుకిలా?
అక్షరాలతో అనువదించలేని భావం మనసులో దోబూచులాడుతోంది.
ఆకాశపు నీలిమంటలో చలి కాచుకుంటున్నానుగా .. నీ తలపుల పహరాలో.
ఊహలు, ఊపిరులతో గాలి గిరికీలు కొడుతూ, పూల బాసలో పరిసరాల్లో పరవసాలు ఒలికిస్తోంది.
ఆ వైపు మెరుపుల్ని కాదంటూ, ఈ వైపు ఉరుముల్ని వలదంటూ. ముసురేసే మేఘమాలల్లో తళుకుల తారంగం..చీకటి ఆకాశంలో నెలవంక సంతకాలు. ప్రపంచమంతా నిదురలో జోగుతుంటే, నేను మాత్రం నీ తలపుల్లో తూగిపోతున్నా, ఆలోచనల ఆవిరి అటుగా వెళ్ళి, కలానికి వెన్నెలని తాపడం చేసిందేమో, ఎటుచూసినా మోహనరాగాలే
ఎక్కడున్నా మధురోహల క్షణాల మాలలే.
ఎంత రాసినా నీ ఊసుల మకరందం ఊరుతుంటే, సౌందర్య సిరులని నెమరేసుకుంటూ,
అడుగుల సవ్వడిని నిరీక్షిస్తూ, మబ్బుల మధ్య ఈదుకుంటూ
అరవిచ్చిన లేయెదలో కలల రంగవల్లులు తీర్చిదిద్దుకుంటూ... అబ్బా
ఎన్నాళ్ళిలా తలపులు ?
ఎన్నేళ్ళి లా మేలుకొలుపులు ?
ఆకులన్నీ చప్పట్లు కొట్టటానికి సిద్ధమౌతున్నాయి ..మన ప్రణయగానానికి.
అయినా నువ్వు ఏమనుకుంటావోగాని ...!
ఇష్టంగా ఒక మాట చెప్పనా..!
వచ్చేయ్యి నీలో తప్పిపోతాను.
రాలిన పారిజాతాల సాక్షిగా..! విరబూసిన జాజుల సాక్షిగా..!
నీకోసం వేచిచూడటమే ...ఓ కవిత్వం నాకు.
Note:- ఈ కవిత కౌముది లోనిది  ఫీల్ నచ్చి అనుమతి లేకుండానే  ఈ బ్లాగ్ లో పోష్టు చేస్తున్నా ...అబ్యంతరం వుంటే తీసివేస్తాను  )

Sunday, May 28, 2017

కవిత్వమొక కాలాతీత కాంతిరేఖ

కవిత్వమొక కాలాతీత కాంతిరేఖ. ఒక మెరుపు. ప్రణాళికాబద్ధమైన వాటికి అది లొంగదు. సిసిరో అన్నట్లు అది ప్రకృతి నుంచే సరాసరి కవులకు అందుతుంది. ఆ వెలుగులో కవి జ్వలిస్తాడు. రూపాంతరం చెందుతాడు. తక్షణ అనుభూతిని కవి వజ్రంలా మెరిపిస్తాడు. నక్షత్ర వర్షం కురిపిస్తాడు. ప్రతి కవికీ ఒక ఫిలాసఫీ ఉంటుంది. అది సామాజికం కాదు. వ్యక్తిగతమైంది. వ్యక్తినిష్ఠమైంది.  “నిన్ను నీవు వ్యక్తీకరించుకోవడంలోని అసంపూర్ణత్వంలో ఆనందముంది” . భావనలో, అనుభూతిలో ఉన్న అసంపూర్ణం కాదది. అనుభవం తాలూకు అసంపూర్ణమది. ‘కవిత్వం పుట్టుకకు స్థలకాలాలు ఉన్నప్పటికీ కవి నుంచి వేరుపడిన తరువాత అది  ఒక స్వతంత్ర వ్యక్తిత్వాన్ని .ఒక పరిసరాన్ని పారవశ్యంగా సమీక్షిస్తాడు ‘నల్ల సముద్రంలో రాలిన తెల్లచంద్రుడు తీరం వేపు కొట్టుకొస్తున్నాడు, సహారా ఎడారిని వెంటేసుకొచ్చిన వైణికుడు నక్షత్రాల్ని  రాల్చుతున్నాడు,గాలి మౌనంగా ఉంది.. ఆకాశం ప్రేక్షకునిలా ఉంది’ అని తన మనసు పొరల్లోని జ్ఞాపక సుమం విచ్చుకోవడానికి ఒక వాతావరణాన్ని, అనుకూలాన్ని ఆయాచితంగా అందుకున్నాడు. అక్కడినించీ పరిసరాన్ని మరిపించే ఒక పరివేదన, ప్రశాంతంతో సమన్వయించిన ఒక కలత కలలా వస్తుంది.

‘నువ్వు గుర్తుకు వస్తావ్ నా జలసమాధిలో జీవానంతర పరీమళంలా నన్ను మరిచిపోతాను నక్షత్రాలన్నా రాలిన ఆకాశంలా” అంటూ చలిస్తాడు. సౌకుమార్యమన్నది స్వచ్ఛమైనది. గతాన్నీ భవిష్యత్తునూ అసరమైతే వెలిగిస్తుంది. వద్దనుకుంటే విదిలిస్తుంది. అక్షరాల గుండా ఒక సంగీతం ఆనందం దుఃఖపు జీర కలగలిసిపోతాయి.ఏదో సందర్భంలో మనిషి తన అస్తిత్వాన్ని గురించి ఆలోచనలో పడతాడు. శరీరం మనసు సానుకూల పరిస్థితిలో స్వరపరిచిన సంగీతంలా సానుకూలంగా సాగుతాయి. ఒక గాయం, ఒక వేదన, అనుకోనివి జరగడం, జరిగినవి అనుకోకపోవడం వంటివి మానవ జీవితానికి అనివార్యం. అనివార్యం నించే కళ జన్మిస్తుంది. అప్పుడు కవి తన అస్తిత్వ రహస్య అన్వేషణలో మునుగుతాడు. మహా సుకుమారమైన అనుభూతులకు అక్షర రూపాన్నివ్వడం . అనుభూతికి అలౌకిక స్పర్శనివ్వగలిగే అక్షరశక్తి అతన్ది. తన్మయత్వపు పల్చటి పొరలు విప్పుతూ ఆశ్చర్యపరుస్తాడు.‘మెత్తని చీకట్లో పారదర్శక రాగాలనేకం/ ప్రపంచం మౌనంగా నిద్రిస్తున్నప్పుడు స్వరాలు పరాగమై హత్తుకున్న గమ్మత్తయిన అలికిడి… ఇలా నైరూపయ అనుభూతికి.విస్పష్టమైన రూపాల్ని ఇస్తూ సాగుతాడు.వంకీలు తిరుగుతున్న హృద్యమైన వూపిరి, పలకరించే జ్ఞాపకాలు పక్షుల్లా వచ్చి ఓ వరసలో కూర్చుంటాయ్.. అన్నీ తెల్లనివే’ అంటాడు.అమూర్తాలకు మూర్తిమత్వాన్నివ్వడానికి విచిత్ర రస సంయోజన అవసరం. ఆ రసాయనం కవి దగ్గర మాత్రమే వుంటుంది. జీవితం దుఃఖమయం. ఎంతమంది తాత్వికులు ఎన్ని మార్గాలు చెప్పినా బతుకు మనిషిని గాయపరుస్తూ ఉల్లాసంగా సాగుతుంది. మనిషి పడే బాధని, ప్రకృతి పరిణామాన్ని నిశితంగా దర్శించి గాలి, మబ్బులు, ఆకాశం వింత వింత హొయలు చిమ్ముతూ అతని మనసు మీదుగా సాగుతాయి. స్పందనల్ని వాటికి అందించి పంపుతాడు.కవుల వూహలకు అంతుండదు. అంతుంటే అతను కవి కాడు. అనుకరిస్తే కవి కాడు. వూహ స్వతంత్రమైనది. మౌలికమైనది ఐతేనే అతను నిజమైన కవి.. మనిషి ఏకవచనం కాదు, అనేకవచనమంటాడు. ఎన్నో నేనులు కలిస్తే ఒక నేను అవుతాడు. ‘నేను నీలోంచీ… నీవు నాలోంచీ.. మనిద్దరమూ మరెవడిలోంచో… సామూహిక ఆత్మల సహస్ర విచ్ఛేదనలోంచి..’ఈ జననం వెనక ఈ జన్మ వెనక వున్న అనంత ప్రవాహాన్నీ ప్రదర్శిస్తాడు. ఒక తన్మయత్వం, ఒక స్వప్నపు వూహల్ని అక్షరాలని తాకుతూ వుంటుంది. దేన్నయినా భావించేటప్పుడు ఒక పారవశ్యపు కెరటం దృశ్యాన్ని కమ్ముకుంటుంది. ‘స్వప్న సరోవరంలో ఎవరదీ? పట్టుకుచ్చుల వింజామరల్ని భుజాన వేసుకుని నీళ్ళూపడానికి వస్తున్న మీనమా?’ అంటాడు. సమస్యని సాదాసీదాగా వర్ణించి ఫలానా పని చేస్తే పరిష్కారం దొరుకుతుంది అంటూ రాసేవన్నీ పేలవ నినాదాలుగా మారిన పాత కవిత్వ పరిచయం వున్న ఆధునిక కవులు కవిత్వ స్పృహతో వుంటారు. మౌనానికి కవిత్వానికి మధ్య వున్న తేడా వాళ్ళకు తెలుసు. కవిత్వమంటే ఏమిటో ఒక అద్భుత ద్వీపం నుంచి వచ్చిన అపురూపమైన ఆనందం కవిత్వమవుతుంది. ‘మేడ మీద కుర్చీ.. కుర్చీ చుట్టూరా వెన్నెల.. వెన్నెలకు పూసిన రెండు చేతులు.. నను నిమిరిన బిడియపు స్పర్శలు వెంటేసుకుని ఈ దారినే వెళ్తూంటుందప్పుడప్పుడూ..” ఇలాంటి మధుర మనోహర వూహల్లో మన మనసు వుల్లాస తరంగితమవుతుంది.
                                                                ప్రకృతిపరివర్తనకి, రుతుధర్మానికి మానవ రాగద్వేషాలకు అజ్ఞాత అంతరంగిక సంబంధముందని కవి చెబుతాడు. అది సహజంగా చెప్పినట్లుంటుంది. పనిగట్టుకు పరిశోధించినట్లుండదు.“వర్షాలకీ జ్ఞాపకాలకీ ఏదో గొప్ప సంబంధమే వుంది” అంటూ ఆలోచనలో పడతాడు. దేనికో ఒకదానికి లొంగిపోవడంలో జీవితం లేదు. ఆమోదించడం వేరు. ఆత్మ సమర్పణ వేరు. నిరంతర స్పృహతో జీవించడం వేరు. అసలు జీవితమంటే అదనీ ఇదనీ చాలా గొప్పదనీ దానికి ఎన్నో రంగులు పులిమి రచ్చకీడుస్తూ వుంటాం.“నన్ను నేను పట్టుకోలేకపోయినప్పుడే నేను జీవిస్తుంటాను..అప్పుడు కొన్ని భవిష్యత్ జ్ఞాపకాలు పలకరిస్తాయి...ఈ జీవితం పెద్ద గొప్పదేం కాదు..దీన్ని మళ్ళీ అనుభవించాల్సిన పని లేదు..వర్షాలకీ జ్ఞాపకాలకీ ఏదో గొప్ప సంబంధమే వుంది” అంటూ ఆలోచనలో పడతాడు. దేనికో ఒకదానికి లొంగిపోవడంలో జీవితం లేదు. ఆమోదించడం వేరు. ఆత్మ సమర్పణ వేరు. నిరంతర స్పృహతో జీవించడం వేరు. అసలు జీవితమంటే అదనీ ఇదనీ చాలా గొప్పదనీ దానికి ఎన్నో రంగులు పులిమి రచ్చకీడుస్తూ వుంటాం.“నన్ను నేను పట్టుకోలేకపోయినప్పుడే నేను జీవిస్తుంటాను,,అప్పుడు కొన్ని భవిష్యత్ జ్ఞాపకాలు పలకరిస్తాయి..ఈ జీవితం పెద్ద గొప్పదేం కాదు..దీన్ని మళ్ళీ అనుభవించాల్సిన పని లేదు”

Thursday, April 13, 2017

కన్నీళ్లే వాళ్లను బతికిస్తున్నాయి...( kvita gari matalu)


గుండెలోని ఆవేదననంతా కరిగి ద్రవించేవి కన్నీళ్లు. ఆ భావోద్వేగం వైయక్తికం. కానీ అక్కడ అది సామూహికం. బతుకుదెరువు. అందుకే వాళ్లు గుండెలు బాదుకుంటూ రోదిస్తారు. అవును అక్కడ కన్నీళ్లు వాళ్ల కడుపునింపుతున్నాయి. ఇది రాజస్థాన్‌లోని రుదాలీ మహిళల కథ.
ఎవరైనా చనిపోయారన్న వార్త వినిపిస్తే చాలు వాళ్లంతా హవేలీ ఆవరణలోకి వస్తారు. వాళ్ల ఆచార సంప్రదాయాల ప్రకారం ఆ హవేలీలోని మహిళలెవ్వరూ బయటికి రారు. ఊర్లోని మగవాళ్లంతా కలిసి ఆ చనిపోయిన వ్యక్తి చేసిన మంచి పనులను కీర్తిస్తూ ఉంటారు. ఆ పక్కనే నల్లని చీరలు ధరించిన మహిళలు... రోదిస్తూ ఉంటారు. గుండెలు బాదుకుంటూ. కన్నీళ్లు జారి చెంపలపై చారికలు పడతాయి. కానీ వాటిని తుడుచుకోరు. అలా వాళ్లు ఏడవడం ఇదే మొదటిసారి కాదు. చివరిసారీ కాదు. నిత్యం ఏడుస్తూనే ఉంటారు. ఏడుపే వృత్తిగా జీవిస్తున్నవాళ్లు. బతికేందుకు ఏడుస్తున్నవాళ్లు. యముడికి ఇష్టమైన రంగు నలుపునే ధరిస్తారు. వాళ్లంతా తక్కువ కులానికి చెందినవారు. ఈ సమాజం వారికో కుటుంబం ఉండటానికి అంగీకరించదు. వాళ్లు సంతోషంగా ఉంటే డబ్బున్న వాళ్ల చావులకు ఏడ్చేదెవరు? అందుకే ఎప్పుడూ వాళ్లు బాధితులుగానే ఉంటారు.
అగ్రకులాల హుందాతనంకోసం...
అదో వింత వృత్తిగా, వికారమైన చేష్టగా మనకు కనిపించవచ్చు. కానీ రాజస్థాన్‌లోని వెనుకబడిన ప్రాంతాల్లోని సంప్రదాయానికి వాళ్ల అవసరం ఉంది. కారణం.. ఉన్నత కులాల్లోని మహిళల భావోద్వేగాలు ఇతరుల ముందు ప్రదర్శించడానికి వీలు లేదు. అందుకే వాళ్ళు హవేలీలోని పరదాల వెనుక ఉంటారు.
''ఉన్నత కుటుంబాల్లోనివాళ్లు చనిపోయినప్పుడు ఏడవడానికి ఎవరో ఒకరు కావాలి కదా. నిజానికి మహిళలు సున్నిత మనస్కులు. అందుకే మా కుటుంబాల్లోని మహిళలు ఏడవరు. ఇంటి బయట మా మహిళలు ఉండటానికి అనుమతి లేదు. అదీ కాక ఉన్నత కులానికి చెందిన మహిళలు సాధారణ ప్రజల ముందు ఏడవరు. భర్త చనిపోయినా సరే... వాళ్లు వారి హుందాతనాన్ని కాపాడుకోవాలి. ఈ తక్కువ కులానికి చెందిన మహిళలు.. అదే రుదాలీలు మా ఉన్నత కులాల్లోని మహిళల తరుపున ఏడుస్తారు. ఓ వ్యక్తి చనిపోతే ఊరు మొత్తం ఆ వ్యక్తిని కోల్పోతుంది కదా. ఆ ఊరి బాధనంతా వారు వ్యక్తపరుస్తారు'' ఇది అక్కడి ఠాకూర్స్‌ కుటుంబాల్లోని వ్యక్తులు చెప్పే మాటలు. ఈ రుదాలీ వృత్తి వెనుక లింగ, కుల, వర్గ, ఆర్థిక స్థాయిలు బలంగా పనిచేస్తున్నాయి. పేదరికం, కులం, లింగ వివక్ష కలగలిపి ఆ మహిళలను ఈ వృత్తిలోకి నెట్టేశాయి. కిందికులానికి చెందిన మహిళల వ్యక్తిగత భావోద్వేగాలు... ఉన్నత కులానికి చెందిన పురుషులకు అమ్మకపు సరుకులైపోయాయి.
అక్రమ సంతానంగానే...
ఈ మహిళలకు ఆ సమాజంలో కనీస గుర్తింపు ఉండదు. అదే వారిని దోపిడీకి గురి చేస్తోంది. వాళ్లలో చాలా మంది ఉన్నత కులాలకు చెందిన పురుషులకు అక్రమ సంతానాన్ని కనే యంత్రాలు మాత్రమే. అదే పుట్టింది ఆడపిల్లయితే... వెంటనే చంపేస్తారు. 'మా కాళ్ల మీద మేం ఒక మైలు నడవడమే కష్టమైన చోట... ఇక అమ్మాయిలను కనే స్వేచ్ఛ మాకెక్కడుంది?' అంటుంది ఓ ముదుసలి రుదాలి మహిళ. ఒకవేళ కొడుకు పుట్టినా వాళ్లకు తండ్రి పేరు చెప్పడానికి వీల్లేదు. వాళ్లు అక్రమ సంతానంగానే పిలవబడతారు. ఆ మహిళలింకా.. అగ్రకులాలకు చెందిన పురుషులు దీర్ఘాయిష్సులుగా ఉండాలని... తక్కువ కులానికి చెందిన యువతులను ఆకర్షించి మోహించిన బ్రహ్మచారి దేవుడు 'భెరుజీ'నే పూజిస్తారు.
పాతబట్టలు.. మిగిలిపోయిన రొట్టెలు...
మరి వాళ్లలా ఏడ్చినందుకు ఎక్కువ డబ్బు ఏమన్న పొందుతారా అంటే అదీ లేదు. 30 ఏండ్ల కిందటనుంచి ఇప్పటివరకు కిందపడి పొర్లి మరీ ఏడ్చినా... గుండెలు బాదుకుంటూ ఏడ్చినా... వాళ్లు పొందేది ఐదు లేక ఆరు రూపాయలు. అప్పుడప్పుడు కొన్ని బియ్యం, పాతబట్టలు, ఉల్లిగడ్డలు, ఇంట్లో మిగిలిపోయిన రొట్టెలు మాత్రమే. ఆ మాత్రం కోసం వాళ్లు పన్నెండు రోజులపాటు ఏడుస్తూనే ఉంటారు. ఒక్కోసారి ఆ కాలపరిమితి ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబం ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డబ్బున్న వాళ్లయితే ఇంకా ఎక్కువ రోజులు ఏడిపించుకుంటారు.
సుర్మాతో...
వాళ్లకోసం వాళ్లు ఏడవడం ఎప్పుడో మానేసిన ఆ మహిళలు.. ఉన్నతవర్గాల కోసం ఏడ్చేటప్పుడు తమ బాధలను గుర్తు తెచ్చుకుంటారు. అయితే అన్నిసార్లు అది కుదరదు కదా. అందుకే ఏడుపుకోసం వాళ్లకు రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. కొందరు లాలాజలం ఉపయోగిస్తారు. ఇంకొందరు కళ్లకు నీళ్లు తెప్పించే ఓ చెట్టు ఆకులను కళ్ల దగ్గర పెట్టుకుంటారు. కొందరు కళ్లకు సుర్మా పెట్టుకుంటారు.. అది తాకిన కళ్లు మండి కన్నీరును వర్షిస్తాయి.
LikeShow more reactions
Comment

Thursday, April 6, 2017

మనసు మాటవినదెందుకో .. చెప్పఊ

 మనసు, ఆలోచన, అంతరంగం, అంతరాత్మ- పేర్లు ఏవైనా ఇవన్నీ మనసుతో ముడిపడి ఉన్నవే. ఏ మనసు తన గురించి తాను ఆలోచించదు. తనకు సంబంధించని ఇతర అంశాల గురించే ఆలోచిస్తుంది. మన కన్నులాగే ఆ'లోచనం' చేసేదే మనసు. మనలో ఉండి మనలను నడిపించే మనసే మన 'తొలిగురువు' అంటోంది వేదసారం. 'నీవెవరో తెలుసుకో' అని బోధించిన రమణ మహర్షుల వారైనా 'నీవే ప్రపంచం' అన్న జిడ్డు కృష్ణమూర్తి తత్వమైనా నీలో ఉన్న ప్రపంచాన్ని నిన్నే చూడమంటోంది.
ఆలోచన అనగానే మన మనసు అనే జల్లెడ మంచిని, చెడును వేరు చేసే పరికరంలాగా పనిచేస్తుంది. ఆచరణలో మాత్రం మంచిని తీసుకుని చెడును వదిలివేస్తాం. ఒక్కోసారి చెడును కూడా మంచిగా భావించి మనసు మొండికేస్తూ మంచిని విస్మరిస్తుంది. ఎవరి సలహాను కూడా ఈ మనసు పరిగణనకు తీసుకోదు. కాని, ఈ ఆలోచన సాధారణంగా ఒక సమస్యపై ఉంటుంది. ఆ సమస్య మనం తలపెట్టిన ఒక నూతన కార్యం కావచ్చు. లేక గత కాలంలో మనం చేసిన కర్మ వలన ఏర్పడిన దుష్ఫలితాలపై ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో శరీర ఆరోగ్యాన్ని గురించి కూడా ఉండవచ్చు.ఈ ఆలోచన అనే ప్రక్రియ సాధారణంగా బాహ్య వాతావరణానికి సంబంధించి ఉంటుంది. ఏ పరిస్థితులలోను ఈ మనసు తన గురించి తాను ఆలోచించదు. ఈ ఆలోచన జీవితంలో జరిగే ఒడిదుడుకుల గురించి కాని, కొన్ని కోరికల గురించి కాని జరుగుతుంది. బాహ్యాన్ని గురించి జరిగే ఈ చింతన ప్రక్రియనే ఆలోచన అంటాం. కాని ఈ ఆలోచన ప్రక్రియ మనలోపల ఉన్న మనసులోనే జరుగుతుంది. మనకు కొన్ని సందర్భాలలో ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకనపుడు బాగా అనుభవం ఉన్న, మనకు సన్నిహితుడైన వ్యక్తిని ఆ సలహా మనకు నచ్చితే దానిని పాటిస్తాం. ఈ ప్రక్రియ సహజంగా లోకంలో జరిగేదే. మనసే ఒక లోచనం ఆలోచన అనే పదంలోనే 'ఆ' అంటే ఎక్కడో దూరంగా మనకన్నా భిన్నంగా గాని మనకన్నా వేరుగా ఉన్నదాన్ని సూచిస్తుంది. ఆలోచనంలో ఉన్న 'లోచనం' అంటే కన్ను అని అర్థం. అంటే దీన్నిబట్టి చూస్తే మన మనసే ఒక కన్ను అనవచ్చు. ఈ మనసు అనే కన్ను ఎంత సేపటికి బయటకే పరుగెడుతుంది కాబట్టి దీన్ని ఆలోచనం అంటున్నాం. అంటే బాహ్యంగా ఉన్న విషయాన్ని మనలోనే ఉన్న మనసుతోనే చూస్తున్నాం.

ఇక మనకు తెలియని విషయాన్ని తెలియబరిచే వ్యక్తిని 'గురువు' అంటారు. కేవలం మనుషులే కాదే ఒక్కోసారి ఒక సంఘటన, పశువులు, పక్షులు, కొండలు, గుట్టలు కూడా మన సమస్యకు పరిష్కారాన్ని సూచించవచ్చు. బాగా పరిశీలించి చూస్తే అందరి అనుభవంలో ఇలాంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ప్రకృతి కూడా గురువే అవుతుంది. దత్తచరిత్ర కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుంది. ఏదేమైనా మనలోనే ఉండి మనను నడిపించే మనసు చెప్పినట్లే సమస్యకు పరిష్కారాన్ని, ప్రశ్నకు జవాబును తెలుసుకుంటున్నాం. అందువల్ల మన మనసును కూడా 'గురువు'గానే పరిగణించాలి.. మనౌ  ఎప్పుడు  మనలను  మనలో నిలువనీయకుండా ... ఏకాంతంలో కుడా ఆలోచనలతొ  ఉక్కిరి బిక్కిరి చేస్తు   ఉంటుంది .. ఊకందని  ఆలోచనలను సితం గుందెల్లో గుబులు రేపుతూ  నిన్ను నిన్నుగా నిలవనీయదు.. తెలీయ్ని ఊహాలోకాల్లో విహరించేలా చేస్తూ  నాలోని నన్ను నీలోకి రప్పిస్తూ  నన్ను కవ్వించి   కనుచూపు మెరలో  నిలబడనీయకుండ్ ఆ పరిగెత్తిస్తూనే వుంటుంది

Wednesday, March 15, 2017

ఆత్మహత్య ఎందుకు తప్పు?

ఎవరు ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నా దానికి బలమైన మానసిక, శారీరక, సాంఘీక కారణం ఉంటుంది. వారి స్తానంలో ఉంటే తప్ప వారి మానసిక సంఘర్షన ఎవరికీ అర్ధం కాదు. అది అర్ధం కాకుండా వాళ్ళను విమర్శించడం, వాళ్ళు చేసేది తప్పు అండం వారిని అవమానించడమే. వారి స్తానంలో ఉంటే ఈ విమర్శకుడు అలానే చేసేవాడేమో. వారిస్తానంలోకెళ్ళి ఆలోచించడి (put yourself in their shoes). నన్ను నేను వారిస్తానంలో ఉంచి రాయడానికి ప్రయత్నిస్తున్నా. విశ్లేషణలోకి వెళ్ళేముందు ఆత్మహత్య చేసుకునే వాళ్ళ మానసిక పరిస్తితిని వివరిస్తూ ఎవరో రాసిన నాలుగు మాటలు

   WHEN TEARS DON'T STOP FLOWING FROM EYES,AND NO ONE APPEARS TO BE OWN,  WHEN DEATH APPEARS BEAUTIFUL THAN LIFE,  A PERSON IS FORCED TO COMMIT SUICIDE.ఆత్మహత్య తప్పు అనేవాళ్ళకు నేను వేసే ముక్కుసూటి ప్రశ్న, ఆత్మహత్య ఎందుకు తప్పు? ఈ ప్రశ్నకు మాత్రం ఇదమిద్దంగా ఎవరూ సమాధానం చెప్పరు. కొందరు తప్పు అంతే అంటారు; ఇంకొందరు పుట్టించింది భగవంతుడు ప్రాణం తీసె హక్కు నీకు లేదు అంటారు; మరి కొందరు దేవుడు నిన్ను పుట్టించాడు అంటే దానికి ఓ కారణం ఉంది అందుకు బ్రతకాలి అంటారు; ఇలా వీళ్ళు ఇచ్చే ఏ ఒక్క సమాధానం సంతృప్తికరంగా ఉండదు. వీళ్ళ దగ్గర కారణం అంటూ ఉండదు. అది తప్పు అనే ఓ నిర్ణయం ఉంటుంది దాన్ని మనం పాటించాలి, ప్రశ్నించకూడదు, ప్రశ్నించడం తప్పు. వీళ్ళ గురించి ఆలోచించడం వృధా. ఇక  ఇంకొంతమంది కాస్త తార్కికంగా నువ్వు చనిపోతే x, y................. వాళ్ళంతా బాధపడతారు, నువ్వుపోయి వాళ్ళను బాధ పెడతావా అంటారు. ఇది వినడానికి కాస్త సరైనదే అనిపించినా, ఎవరో బాధపడతారు అని బ్రతకాలా? అలా బ్రతికిన బ్రతుకులో తను అంటు లేనప్పుడు ఆ బ్రతుక్కి అర్ధం ఏంటి? ఈ లోకంలో ఎల్లకాలం ఉట్టి కట్టుకుని ఊరేగడాని రాలేదు కదా. ఇవ్వాళ ఆత్మహత్య చేసుకోకున్నా కాలప్రభావం వళ్ళ పోతే ఆనాడూ ఈ x, y, z, ....... లు బాధ పడతారు కదా. మరి అది ఆత్మహత్య చెసుకోవడానికి అడ్దంకి ఎందుకు కావాలి. ఎన్ని చెప్పినా వీళ్ళ జవాబు ఒక్కటే నీకు చనిపోయే హక్కు లేదు, దేవుడే చంపాలి. సరె, ఈ విషయం మీదే మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో అన్ని పనులు చేసేది దేవుడే మనం నిమిత్తమాత్రులం అంటారా? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారా? ఈ ఆత్మహత్య మాత్రం దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా, శివుడాజ్ఞలేకుండా జరుగుతుందా? దైవజ్ఞ/శివుడాజ్ఞలేకుండా ఏదైనా జరగగలదా? పోనీ, నిమిత్తమాత్రులం కాదు, పని మనం చేస్తాం, మనం చేసే పనికి శిక్ష ఉంటుంది అంటారా? ఎవరో ఎకడో శిక్ష విదిస్తారు అని ఇక్కడ, ఇప్పుడు ఈ జీవితంలో శిక్ష అనుభవించడానికి ఒప్పించగలమా? అందుకే ఆత్మహత్య తప్పు లేక ఒప్పు అనలేము. వారి వారి పరిస్తితుల ప్రకారం అది వారికి తప్పో ఓప్పో అనిపించవచ్చు. దాన్ని కాదు అనే హక్కు మనకెక్కడుంది? ఒడ్డున కూర్చుని ఎన్నైనా చెప్పొచ్చు. చాలామంది చావు పుట్టుకలు మన చేతిలో లేవు అంటారు. పుట్టుక మనచేతిలో లేదు, నిజం. బ్రతికి ఉండటం మనచేతిలో లేదు, నిజం. అలాగే చావడం మనచేతిలోనే ఉంది. అదీ నిజం, ఎవరొప్పుకున్న కోకున్నా నిజం.ఇది అంగీకారయోగ్యం కాదు అందుకే తప్పు అంటారా? ఎవరికి అంగీకార యోగ్యం కాదు? చట్టానికా న్యాయానికా? చట్టనికి న్యాయానికి అంగీకారయోగ్యం కానిది నేరం. ప్రతి నేరం తప్పవ్వాలని నియమమేమీ లేదు. అయినా చనిపోతా అనుకున్నవాడికి చట్టం ఏంటి న్యాయం ఏంటి? ఈ ప్రపంచంలో ఎన్నో దేశాల్లో కారుణ్య హత్యలు (euthanasia) లేవా? అవి చట్టబద్దం కావా? అవి కేవలం నివారణ లేని రోగాలున్నవారికే, ఆ శారీరక బాధ భరించలేనివారికే అంటారేమో. ఓ.. అంటే మీ ఉద్దేశంలో శరీరానికి కలిగే బాధే బాధా? మనసుకు కలిగే బాధ బాధ కాదా? శరీరానికి కలిగే బాధ తొలగించడానికి కారుణ్యహత్య (euthanasia)  సమర్ధనీయమయితే మనసుకు కలిగే బాధను నివారించడానికి కూడా కారుణ్యహత్య (euthanasia) సమర్ధనీయం కావాలి. కారుణ్యహత్య (euthanasia), ఆత్మహత్య రెండూ వేరు అంటారా? ఊహూ.. ఆ వాదనను నేను ఒప్పుకోను. ఆత్మహత్య అంటే తనను తాను తన ఇచ్చాపూర్వకంగా చంపుకోవాడం. కారుణ్యహత్య (euthanasia)లో కూడా రోగి తనను తాను తన ఇచ్చాపూర్వకంగా చంపుకుంటాడు దానికి పక్కవాళ్ళ సహాయం తీసుకుంటాడు. కనుక ఇది కూడా ఆత్మహత్యలో ఒకరకమే అంటాను. మనిషికి జీవించే హక్కు ఉన్నట్టే జీవించను అనే హక్కు కూడా ఉండాలేమో. తను ఉండాలా పోవాలా అన్న నిర్ణయం తీసుకునే హక్కు ప్రతిఒక్కరికి ఉండాలేమో. అయితే ఆ నిర్ణయం ఏ క్షనికావేశంతో తీసుకున్నదో కాక కనీసం ఓ ఆరునెలలు ఆలొచించి తీసుకున్నదయ్యుంటే దాన్ని వ్యతిరేకించనవసరం లేదేమో.ఇక దీనికితోడు సలహాలిచ్చేవాళ్ళు, వీళ్ళు సలహాలిస్తున్నారో లేక అసలే మానసికంగా బాధ పడుతున్నవాళ్ళను అవమానిస్తున్నారో నాకైతే అర్ధం కాదు. కొందరేమో ఆత్మహత్య పిరికివాళ్ళ చర్య నువ్వు పిరికివాడివా, చేతకానివాడివా అంటారు. ఇంకొంతమంది చావడానికి చాలా ధైర్యం కావాలి, అందులో కొంతైనా బ్రతుకుని బాగుచేసుకోవడానికి వాడుకుంటే హాయిగా బ్రతుకొచ్చు అంటారు. అసలే మానసికంగా బాధల్లో ఉన్నవాళ్ళకు ఇవి రుచిస్తాయా? నిజానికి చావడం అంత తేలిక కాదు. ఈ ప్రపంచంలో ఏ ప్రాణి అయినా బ్రతకడానికే ప్రయత్నిస్తుంది. స్వామి వివేకానంద చెప్పిన ప్రకారం, "జన్మ జన్మల్లో చావును చుసిన జీవుడికి చావు అంటే భయం" అందుకే ప్రతి ప్రాణిలోని జీవుడు బ్రతకాలనే చూస్తాడు. అంతటి బ్రతకాలనే కోరికను ఎదురించి చావాలని చూస్తున్నవాడు ఎంతగా అలోచించుంటాడు? ఎదో క్షణికావేశంలో అత్మహత్య చేసుకుకోవాలని చూస్తున్నవాళ్ళను వదిలేస్తే మిగతావాళ్ళు ఈ సలహా ఇచ్చేవాళ్ళకన్నా ఎక్కువే ఆలోచించి ఉంటారు. ఇంకొంతమంది చావు సమస్యకు పరిష్కారం కాదు అని ఉచిత సలహా ఇస్తారు. ఎవరి సమస్యకు పరిష్కారం కాదు? పోయేవాడి సమస్యకా లేక పోగామిగిలినవాళ్ళ సమస్యకా? మనిషి పోయాక వాడికి ఈ సమస్యే ఉండదు కనుక చావు సమస్యకు పరిష్కారం కాదు అనడంలో అర్ధం లేదు. పోగామిగిలినవాళ్ళ సమస్య అంటారా? దానిగురించే ఆలోచిస్తేవాళ్ళు ఆత్మహత్య ప్రయత్నమే చేయరు. ఈ సలహాకు అర్ధమే లేదు. ఇంకో చెత్త సలహా. నీకు జీవితమంటే ఇష్టంలేదు సరె సమాజానికి ఉపయోగపడు, సమాజ సేవ చెయ్యి, నలుగురు అనాధలను దత్తత తీసుకుని పోషించు వాళ్ళకు ఆనందాని పంచు. ఎవరైన తనదగ్గర ఉన్నదే పక్కవాళ్ళకు ఇవ్వగలరు. వాళ్ళ దగ్గరే ఆనందం లేకుంటే ఇంక పక్కవాళ్ళకెలా ఇస్తారు? ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వడం ఆ మనిషిని ఇంకా రెచ్చగొట్టడమే అవుతుంది కానీ తన ఆలోచనను ఏ మాత్రం దూరం చేయదు.ఆత్మహత్యను మతం అంగీకరించదు అంటారా? అవును, ఆత్మహత్య ధర్మబద్దం కాదు, దాన్ని శాస్త్రం అంగీకరించదు, దాన్ని వేదం నిషేధించింది. మనుస్మృతి ఆత్మహత్య చేసుకున్నవాళ్ళకు కర్మకాండను నిషేధించింది. ఎందుకు నిషేధించింది ఇందులో వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఓ సమాధానం తోస్తుంది. మానవ జన్మ చాలా దుర్లభం. ఎన్నో జన్మలు ఎత్తిన తరువాత కానీ ఈ జన్మ లభించదు. ఈ జన్మను మోక్ష మార్గంలో ప్రయాణించడానికి వినియోగించుకోకుండా ఆత్మహత్య చేసుకోవడం, నీ ఆద్యాత్మిక ప్రగతిని నిరొధించడమే. కర్మను ఎక్కడైతే వదిలేసి వెళ్తున్నారో మళ్ళీ అక్కడే మొదలవుతుంది. ఈ వాదన కూడా రుచించే వాదన కాదు. వాళ్ళు సరే అలాగే కానీ నాకేంటీ నష్టం అంటే మీ సమాధానం? అదీ కాక ఈ ప్రపంచంలో ఎంతమంది మానవ జన్మను సద్వినియోగ పరుచుకుంటున్నారు? ఎందరు ధర్మ బద్దంగా జీవిస్తున్నారు? డబ్బు, సుఖం, మోహం, అహం, పేరు, ప్రతిష్ట మొ|| తప్ప ఈ ప్రపంచంలో ఎంతమందికి ధర్మం కావాలి? అసలు ధర్మం అంటే ఎంతమందికి తెలుసు? ప్రాపంచిక సుఖాలకోసం వెంపర్లాడే వీళ్ళంతా మానవ జన్మను సద్వినియోగంచేసుకుంటున్నారా? ప్రపంచంలో ధర్మబద్దం కానీ జీవనం జీవిస్తూ మానవ జన్మ దుర్వినియోగపరుచుకుంటే ఒప్పా? అదే ఆత్మహత్య చేసుకుని దుర్వినియోగపరుచుకుంటే తప్పా? రెండు దుర్వినియోగమే అయినప్పుడు రెంటిలో పెద్ద తేడా లేదు.పోనీ మన పురాణల్లో ఆత్మహత్య చేసుకున్న/చేసుకోవలనుకున్న మహాపురుషులు లేరా? ఉన్నారు అంటాను. వారెవరో పరిశీలిద్దాం. పరిశీలించేముందు ఆత్మహత్య అంటే నా నిర్వాచనం చెప్తా. ఆత్మహత్య - తనను తాను చంపుకోవడం. సహజ సిద్దంగా లేదా బాహ్యప్రక్రియల వళ్ళ కాక తనకు తానుగా తన ఇచ్చానుసారంగా తనను తాను చంపుకోవడం. మళ్ళీ దానిని సమర్ధించడానికి కారణాలు వద్దు. సమర్ధించడానికి కారణాలు వెతికితే ఆత్మహత్య చెసుకోవలనుకుంటున్నవాళ్ళదగ్గర కూడా ఉంటాయి బోలెడన్ని కారణాలు. (నా పురాణ పరిజ్ఞానం కేవలం మిడిమిడి జ్ఞానమే, తెలిసి తెలియని విషయాలమీద నేను ఏమైనా తప్పులు చెప్పుంటే ఆ తప్పును ఎత్తిచూపండి సరిదిద్దుకుంటా)ఆత్మ హత్య చేసుకున్న పురాణ పురుషుల్లో (పురుష - హృదయంలో నివసించే) మొట్టమొదటిగా నేను చెప్పేపేరు ఆదిపరాశక్తి పార్వతీ దేవి. సతీదేవి దక్షయజ్ఞం సమయంలో ఆత్మహత్య చేసుకుంది. తన కాలి బొటనవేలితో అగ్నిని రగిల్చి అందులో దూకింది. దానికి కారణం తన తండ్రి అయిన దక్షుడు తన భర్త శివున్ని అవమానించాడని. అలా దూకడాన్ని శాస్త్రం ధర్మం అంగీకరించాయి. అంటే తనని (లేదా తనవాళ్ళను) ఎవరైనా అవమానిస్తే, ఆ అవమాన భారాని భరించలేక ఆత్మహత్య చేసుకోవడం అంగీకారయోగ్యమా? ఇది దైవలీల అన్న సమాధానం మాత్రం వద్దు, లీల ప్రశ్నించే ప్రశ్నకు సమాధానం చెప్పదు, పారిపోతుంది. ఇక రామాయణంలో వేదవతి రావణుడు తన కురులను ముట్టుకున్నాడని అగ్నిలో దూకింది. దీన్ని కూడా శాస్త్రం ధర్మం అంగీకరించాయి. ఎందుకు అంగీకరించాయి? అలాగే పురణాల్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాళ్ళను పరిశీలిస్తే, భరతుడు తన అన్న రాముడు 12 ఏళ్ళ తరువాత రాకుంటే అగ్నిలో దూకుతా అంటాడు. అదీ ఆనాటి ప్రాజ్ఞ సమ్మతమే. రాముడు వచ్చాడు కనున భరతుడు ఆత్మహత్య చేసుకోలేదు లేకుంటే చేసుకునేవాడే. హనుమంతుడు లంకలో సీతను చూసేవెళ్తాను, చూడలేకుంటే అగ్ని దూకుతా అనుకున్నాడు. అదీ అందరికీ అంగీకార యోగ్యమే. వాళ్ళ కారణాలు సమర్ధనీయం అనుకుంటే, వీళ్ళ కారణాలు సమర్ధనీయమే. నిన్న మొన్నటివరకు భారత దేశంలో ఒక సాంఘీక నియమంగా, ధర్మంగా ఆచరించబడ్డ సతీసహగమనం? మహాభారతంలో మాద్రి సతీ సహగమనం చేయలేదా? అది ధర్మబద్దమని అంగీకరింపబడలేదా? తన ఇష్టప్రకారం సతీసహగమనం చేయడం ఆత్మహత్య కాదా? ఇవ్వన్నీ చూస్తే నాకు ఓ అనుమానం వస్తుంది. అగ్నిలో దూకి ఆత్మ హత్య చేసుకోవడంలో తప్పులేదా? అది ధర్మబద్దమా?మరి ప్రాయోపవేశం సంగతో? ప్రాయోపవేశం ఆత్మహత్య కాదా? మహాభారతంలో దుర్యొధనుడు అవమాన భారాన్ని భరించలేక ప్రాయోపవేశం సంకల్పిస్తాడు. అది ఆనాటి ప్రాజ్ఞులకు సమ్మతమే. అయితే శకుని తనమాయటలలో ఆ ప్రయత్నాన్ని విరంపింపజేస్తాడన్నది వేరే విషయం. అవమానభారం భరించలేక దుర్యోధనుడు ప్రాయోపవేశం సంకల్పించాడు, అవమానభారం భరించలేక సతీదేవి అగ్నికి ఆహుతయ్యింది. అవమానభారం భరించలేక ఆత్మహత్య.. సమ్మతమా? ప్రాయోపవేశానికి ఎన్నో నియమాలూ, పద్దతులూ. ఫలానా కారణాలు ప్రాయోపవేశానికి (ఆత్మహత్యకు) అంగీకరానీయం మిగతావి కాదు అన్న వాదన నాకు నచ్చదు. ఒక కారణం అంగీకరయోగ్యం అయితే వేరే కారణం కూడా అంగీకారయోగ్యం కావాలి. ఎవరి కారణం వారిది. అయితే, ప్రాయోపవేశంలో నాకు నచ్చిన విషయం, ప్రాయోపవేశి ఒక్క క్షణంలో చనిపోకుండా, కొంత కాలంపాటు ప్రాయోపవేశం చేసి మరణిస్తాడు. ఈ కాలంలో తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునే అవకాశం లభిస్తుంది, తను ఈ జీవితంలో పూర్తిచేయక మిగిలిపోయిన పనులు పూర్తిచేయడానికి సమయం లభిస్తుంది. అదీకాక తన వాళ్ళందరికి, సమాజానికి ఇతని చావు గురించి మానసికంగా సంసిద్ధమవడానికి అవకాశం లభిస్తుంది. తను నిజంగా  మరణించిన్నాడు అది వాళ్ళను అంతగా విభ్రాంతికి గురిచేయదు తెలిసిన విషమే కనుక.ఎంత విశ్లేషించినా ఆత్మహత్య తప్పే. అంతే అంటారు అందరు. ఎవరికి తప్పు? చేసుకునే వాళ్ళకా, చూసే వాళ్ళకా? చేసుకునే వాళ్ళకు మాత్రం తప్పు అనిపించదు, చూసేవాళ్ళకు తప్పు అనిపించొచ్చు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నవాడికి నువ్వు చేసేపని తప్పు అని చెప్పడం తప్పా అంటే, నేను ముమ్మాటికి తప్పే అంటాను. ఆత్మహత్యా ప్రయత్నం మానిపించే ప్రయత్నం తప్పు కాదు, అది అభినందనీయం కానీ. వాళ్ళతో నువ్వు చేస్తున్నది తప్పు అని వాదించడం తప్పు. ఈ భూప్రపంచంలో ఎవరితో అయినా, ఏ విషయంలోఅయినా నువ్వు చేస్తున్నది తప్పు అని చర్చ ప్రారంభిస్తే ఎవరూ మీ మాటను వినరు, మీ అభిప్రాయాన్ని పట్టించుకోరు. ముందు మీరు వాళ్ళును అర్ధం చేసొండి. వాళ్ళు ఆ మానసిక పరిస్తితుల్లో తీసుకున్న నిర్ణయం సరైనది అని మీరు ముందుగా అంగీకరించడి. మిమ్మల్ని వాళ్ళ స్తానంలో ఉంచండి (put yourself in their shoes). మీరు వాళ్ళ స్తానంలో ఉంటే అంతకన్నా భయంకర నిర్ణయం తీసుకునేవాళ్ళేమో, ఎవరికి తెలుసు. ఈ నిజం అంగీకరించాక మాత్రమే వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నించండి. అనుక్షణం వాళ్ళ నిర్ణయం సరైనదే అని అంగీకరిస్తూ, వాళ్ళ మానసిక పరిస్తితి అర్ధం చేసుకొండి. అప్పుడు మీకు అర్ధమవుతుంది వాళ్ళను బాధించే పరిస్తితులు ఏంటో. అది సంఘానికి సంబంధించిందా, మిత్రులకు సంబంధించిదా, చుట్టూ ఉన్న పరిస్తితులకు సంబందించిందా? మీకు చేతనయితే వాటిని పూర్తిగా మార్చడానికి ప్రయత్నించండి, అవి మారితే తను మారొచ్చు. ఓ మనిషి ఆత్మహత్యకు ప్రయత్నించాడంటే వాడికి జీవితం మీద ఆశలేదు. ఎందుకులేదో కనుక్కొండి, ఆశను చిగురింపజేయడానికి ప్రయత్నించండి. అంతే కానీ నువ్వు చేసేది తప్పు అని ఉపన్యాసలు దంచడమో, లేక ఎవరినో తీసుకొచ్చి ఉపన్యాసాలు ఇప్పించడమో చేస్తే వాళ్ళకు విరక్తి ఇంకా పెరుగుతుంది.ఇక ఆత్మహత్య చేసుకుందామనేవాళ్ళకు, మీ పరిస్తితులేంటో నాకు తెలియదు. అందుకే మీ నిర్ణయం తప్పు అని అనను. ప్రతి ఒక్కరికి తన జీవితంలో ఏ నిర్ణయమైన తీసుకోవడానికి సంపూర్ణ స్వేచ్చ ఉండాలని నమ్మేవాన్ని నేను, అందుకే మీ నిర్ణయాన్ని తప్పు అనను. కానీ ఒక్కటి ఆలోచించండి, మీ నిర్ణయం క్షణికావేశంలో తీసుకున్నదా? ఈ ప్రపంచంలో ఏదీ ఎల్లకాలం ఉండదు కొన్నాళ్ళ తరువాత ఏదైన వెళ్ళిపోతుంది, పరిస్తితులు పూర్తిగా మారిపోతాయి. మిమ్మల్ని బాధ పెడుతున్న విషయానికి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి కావలసిన సమయం ఇచ్చారా? లేదంటే సమయం ఇచ్చి చూడండి. అన్ని చేసిన తరువాత కూడా మీరు చనిపోవాలనే నిర్ణయించుకున్నారా? అయితే మీరు మీ నిర్ణయాన్ని ఒక ఆరునెలలు వాయిదా వేసుకొండి. ఓ నెల పాటు పునర్విమర్శ చేసుకొండి. అయినా మీ నిర్ణయం మారకుంటే ప్రాయోపవేశంలో నాకు నచ్చిన ఒక్క విషయాన్ని పాటించండి. అందరికి నేను పోతున్నా అని ఓ అయిదు నెలలు చెప్పండి. దానితో చుట్టూ ఉన్న అందరికి మానసికంగా సంసిద్దమవడానికి అవకాశం లభిస్తుంది. మీరు పూర్తి చెయ్యాల్సిన పనులేమైన ఉంటే పూర్తిచెయ్యండి ఆ తరువాత మీ నిర్ణయం మీది. ఈ ఆరు నెలల తరువాత మీకు మీరు చేయాలనుకున్న పని సరైనదే అనిపిస్తే మీ ఇష్టం. దానికి అవును కాదు అని చెప్పడానికి ఎవరు అర్హులు కారు.


పుట్టుక అనేది దేనికి మొదలు కాదు, చావు అనేది దేనికి అంతం కాదు. చావు పుట్టుకలు సంసార చక్రం (జనన మరణ చక్రం)లో  ఊచల్లాంటివి మాత్రమే.

Thursday, March 9, 2017

--- ప్రతిసారి ఓడిపోతూ గెలుస్తూనే ఉన్నాం " జర్నలిష్టుగా" చావలేక బ్రతుకుతూ -----


 

పోరాడి గెలవానలే ఆరాటం
ఉరుకుల పరుగుల జీవితం
పరుగుల్లో పడ్డా లేచినా
అడిగేవారు లేరు
అందరు మీడియా అంటే కడగాలని చూసేవారే
మాదారి ముళ్ళదారి అని మాకే తెల్సు
అయినా గోదారిన్ ఒడ్డున సేదతీరాలనే
అత్యాస తీరక పరుగులు పెడుతూ
ఆరాట పడుతూనే ఉంటాం
తప్పదు పొట్టతిప్పలు
ఓవైపు పోటీ పడి ముందుండాలనే తపన లో
మా మనసులతో మేమే తన్నుకు చస్తున్నాం
అందరు వెలెత్తే చూపిస్తే .. సమాజాన్ని
జరుగుతున్న వాస్తవాల్ని చూపించేది ఎవరు
చూడాల్సిన వాళ్ళూ చూస్తూ వూరకుంటే
నీవు నిజాలు తెల్సుకునేది ఎప్పుడు
ఒక్కోసారి నిజం నీడై మమ్మల్ని వెంటాడుతుంది
సమాజానికి సమాదానం చెప్పుకోలేని నిజాన్ని ఒప్పుకోలేక
ఓ చుక్క గొంతులోకి దిగితే గాని అలుపు తీరదు
అయినా అది శాశ్వితం కాకపోయినా
ఆకాస్తసమయానికి .. ఊరట
తెల్లారుతుంటే మళ్ళీ మొదలౌతుంది మాపరుగు
మీ చేతిలో రిమోట్ ఆడుతుంటే
ఒకచోట నేను పరుగులుతు తీస్తే
మరో చోట మా మిత్రుడు పరుగులు తీస్తాడు
అప్పటికప్పుడూ వేడి వేడి వార్తలు మికిచ్చేందుకు
తప్పదు మాది జీవన పోరాటమా
జీవిత పోరాటమా తెలియక పరుగులు తీస్తూనే ఉంటాం

Saturday, March 4, 2017

చిన్న నిశ్శబ్దానికే గుండె బారం అవుతోంది

ఆ పలకరింపు ..తియ్యని పులకరింపై
ఓ శబ్ద తరంగాన్ని అలా మోసుకొచ్చి
చుట్టపుచూపులా వచ్చినట్టే వచ్చి
కనుచూపుమేరకు తరలిపోయింది
నాలోతట్టుకోలేని నిశ్శబ్దాన్ని మిగిల్చింది

కనురెప్పల కదలికలలో సవ్వడేది?
కన్నీటి సుడులలో హోరు
హృదయంలో నీ జ్ఞాపకాల అలజడి
మీరెవరన్నా విన్నారా?
ఒయ్ నిన్నే నీకూ వినిపిస్తుందా
నాకనిపిస్తోంది  నిశ్శబ్దమే బాగుంది కదా
నిశ్శబ్దమే శాశ్వతం……..కాదంటావా
కాదని అనగలవా అంత టైం ఉందా నీకు

రాత్రుళ్ళు అందరూ
ఊహా  లోలకానికి అతుక్కుపోయినట్టున్నారు
అవును కాదుల నడుమ
ఊపిరి సలపనంత ఊగిసలాట…
గడియారపు టిక్కుటిక్కులే మిగిలిందిక
గాడితప్పిన గతం సాక్షిగా
ఒకనాటి ఒప్పులన్నీ తప్పులయ్యాయిగా

ఏంటో ఈ చల్లని వెన్నెల చీకట్లో
నా నుదుటి స్వేదం
గుండెలపైకి జారి
నిశ్శబ్దాన్ని చిద్రం చేస్తుంది
ఆ చిన్న నిశ్శబ్దానికే గుండె బారం అవుతోంది
నిశ్శబ్దం చిన్న అలికిడి కూడా లేదు
చిరునవ్వుల సందడి నాకు దూరం
అయింది నన్నొదిలి దూరంగా

నా చుట్టూ నిశ్శబ్దపు రాజ్యం
రాజుని నేనే, దాసున్ని నేనే!
ఆలోచనల అలల్లో తీరం చేరితే
సామ్రాజ్యమంటాను!
ఆశల వలలో చిక్కుకుపోయి
సముద్రంలో చిక్కుకున్నాను
విరహవలయంలో చిక్కుకున్నా
చింద్రం అయిన మనస్సులో
ఏన్నో ఆలోచనల సుడులు
నాకు నేనుగా ..
ఓడిపోయిన ప్రస్తుతంలో
ఒంటరిగా జీవింఛలేక
ఇంకా నీపై  ఆశచావక
ఎదురు చూస్తూనే ఉన్నా నీకోసం

Friday, February 24, 2017

నీ ఆనందం లో నా సంతోషాన్ని వెతుక్కుంతున్నాగా

గడిచిన కాలం వదిలిన జ్ఞాపకాల్లో 
నన్ను నేను చూసుకోవాలనుకున్న ప్రతిసారి
మనసనే అద్దం పగిలిన క్షనాల్లో 
అద్దం ముక్కల్ని ప్రేమగా తుడుచుకుని
పగిలి  చెదిరిన బింబాల్లో నన్ను నేను 
ఆతృతగా వెతుక్కుంటున్నాను..
ప్రతి ప్రతిబింబంలో 
నేనెక్కడ కనిపించడంలేదు 
అన్నిటిలో నీవే కనిపిస్తున్నావు 
నాన్ను నేను చూసుకుందామనుకొంటే 
ఎక్కడా కనిపించనెందుకనో 

నిజమిది అని ఒప్పుకోను
అబద్ధమని మరువలేను
తప్పు నాదని తలవంచలేను
ఒప్పు ఇది అని ఎదిరించలేను
ఇవన్నీ తెలీసే నీవు నాతో 
నాజీవితంతో ఆడుకొన్నావు 
ఆట ముగిసింది ..
నా గతమతా గాయాల పాలు చేసి 
నీ ప్రస్తుతాన్ని మాత్రం పూలవనం చేసుకొని 
ఆనందిస్తున్నావు గాఆ 
నన్ను భాదపెట్టినా 
భాదపెట్టిందినీవేగా అని నీ ఆనందం లో 
నా సంతోషాన్ని వెతుక్కుంతున్నాగా 

!!మరణ మృదంగం!! ( ఈ కవిత నాదికాదు )

అంతా సుఖమే అని భ్రమిస్తున్న జీవితంలో
కపటం చేసే కల్లోలం ఎంతో
ఒక కల నుంచి ఇంకో కలకు దొర్లిన చప్పుడు
ఒక దుఃఖం నుండి ఇంకో దుఃఖానికి పొర్లిన చప్పుడు

తెలియని గోడల్లో కన్నీళ్ళ చప్పుడు
కూలిన ఆశల శిధిలాల్లో
ఎగరలేని ఆలోచనల చప్పుడు
పచ్చని ఆకులు పగిలిన చప్పుడు
రెక్కలు విరిగిన చప్పుడు

పాట ఆగిన చప్పుడు
శ్వాస వీడిన చప్పుడు
ఆరాటాలు పోరాటాలు అలిసిన చప్పుడు
ఆఖరి పర్వంలో చీదరింపుల చప్పుడు
మనిషికి మనుగడకు మధ్య నలిగిన చప్పుడు

దిక్కులు పిక్కటిల్లిన చప్పుళ్ళ మధ్య
తేల్చుకోలేక
పోల్చుకోలేక
తెగింపులేక
మృత్యుశీతల స్పర్శలో
ఘనీభవించినపుడు
గర్వంతో ఉప్పొంగి పోవడం చాతకాలేదెపుడు

మాట్లాడుతూ
పోట్లాడుతూ
నేలకొరిగినపుడు
ఒక్కో పిలుపు
ఒక్కో ముఖం
జ్ఞాపకాల పేజీలు తిప్పుతుంటే
గతం కాకులు పొడుస్తున్న ఎద్దుపుండు మరువనీయదెపుడు

నీవెంటే మేమంటూ
తంత్రాంగాలో మంత్రాంగాలో
స్వచ్ఛత కోసం సాగుతున్న యంత్రాంగంలో
వాదించేవి
బంధాలె కాదు
బాధ్యతలు కూడా
వేధించేవి
జ్ఞాపకాలే కాదు
అనుభవాలు కూడా

Tuesday, February 14, 2017

చావేలేక బ్రతుకుతున్న ఓ మనసు నివేదన ( FB లో )

నా ప్రతి సవ్వడి
నిశ్శబ్దం తాలూకు విస్ఫోటమే
ఎన్నో ఆరాటాలు పోరాటాల మధ్య
శరీరాన్ని అద్దెకు తీసుకుని సాగుతుంటే
ఉన్న మెదడు వదిలి అద్దె మెదడుతోనే 

కాపురమని ఖరారు
కాలం లెక్కలు కుదుర్చుకున్నాక
బాగోగులకై భారీగానే తకరారు

రంగులు పొంగులు హంగుగానే 
మాట్లాడుకున్నాయి
అహంకారాలు ఆడంబరాలు 

అలంకరణలయ్యాయి
ఉప్పూకారంలో ఊరబెడుతూ
కోర్కెల సెగలో చల్లబడుతూ
నరనరాన్ని నాట్యం చేయించటమే 

వుంటుందక్కడ అన్నారు
ఇంకేముంది
కరుకుతనం ఇరుకుతనం ఇరుసుల్లో
శరీరం దాని పని అది చేసుకుపోతోంది
కళ్ళూ కాళ్ళూ
నిగ్రహంతోనో ఆగ్రహంగానో
అద్దె మెదడులో అమరలేక 

అతకలేక అల్లాడిపోతుంటాయి
నియంత్రణలేని తనంతో
నిరాశగా పగటి పరకలను 

చీలుస్తూ కట్టలు కడుతూంటాను
రేయి రమించాక దులపుకోవాలంటూ
నిస్పృహలు గోడలునిండా అతుక్కుంటే
నిశీధిని కిటికీలకు అలుకుతూంటాను
ఆక్షేపణల మధ్య అస్తిత్వం కోసం
ఎప్పుడూ లోపల్లోపల
అప్పుడప్పుడూ బయట
నాతో నాకు సమస్యే మరి

రక్తమాంసాల్లో మాత్రం తీవ్రమైన జ్వాల
ఒక కాంతి రేఖగా మెరవాలని
ఒక పచ్చని చిత్రంగా ఒదగాలని
ఒక సెలయేరులా శీతలత్వాన్ని పూయాలని
నిరంతర ప్రయాసతో పయనం
దాహానికైనా దహనానికైనా దేహమేగా
బాడుగ భారాన్ని బలవంతంగా మోసుకుంటూ
దుఃఖసాగరాన్ని తలగడలో దాచుకుంటూ
ఎన్నిసార్లు మరణించానో లెక్క తేల్చలేను

క్షమించండి
జీవించటం నాకు చాతకావటం లేదు

Tuesday, January 3, 2017

వ్యక్తపరచలేని నీ మాటల లేమి

కన్నీరు అడ్డొచ్చి
వెక్కిళ్ళు మాటలను మింగేసిన క్షణంలో
నీ మౌనాన్ని వింటాను.

నాలో  నువ్వు 
పడుతున్న సంఘర్షణను
వ్యక్తపరచలేని నీ మాటల 
లేమి నాకు వినిపిస్తుంది.

పదాల కోసం వెతుక్కునే 
నీ నిస్సహాయత నిట్టూర్పును  
 మౌనంలో వింటాను
అక్షరాలలో ఒదగలేని 
నీ భావాలను నా కళ్ళతో చూస్తాను

మాట్లాడుతూ మాట్లాడుతూ
నువ్వు హటాత్తుగా ఆగిపోతావే
అప్పుడు నీ నిశ్శబ్దం  నా చెవులలో విస్పోటకాలవుతాయి….మౌనంగా 

Monday, January 2, 2017

సువిసైడ్


ఆ రెండు కన్నీటి చుక్కలు

కనుకోనలలో వేళాడుతున్నాయి

వాలే భుజం లేక…..ఆ రెండు మాటలు

నాలికను చిధిమేస్తూ

గొంతుకలో నొక్కివెయ్యబడుతున్నాయి

వినే మనసు లేక…..ఆ విసుగు నిస్పృహై

శూన్యంలోకి జారిపోతుంది
ఆశకు ఆసరా లేక…..


ఆ తనువు తనను 
తాను శిక్షించుకుంటూ
మరణాన్ని ప్రేమించి నిష్క్రమించింది
హత్యో ఆత్మహత్యో ముద్దాయిలెవరో
తేల్చుకోలేని ప్రశ్నలను
మనకు వదిలేస్తూ…..మనం
ఆ మనసులను
ఆ ఆ  అంతరంగపు 
లోతులను తడమగలిగి
వారి ఆత్మలను ముద్దాడిఉంటే
ఒక మాట, ఒక చేయూత, 
ఒక ఆసరా, 
ఒక సహానుభూతి, 
ఒక ఆశ….ఇచ్చివుంటే
ఎన్ని కొత్త చిగురులు 
తొడిగేవో కదూ ఆ జీవితాలు.
చిదిమేసుకున్న ప్రతీ 
జీవితం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది

source :- https://alochanalu.wordpress.com

మరణించాను

 ఓ చెరిగిపోయిన అక్షరాల్లారా కరిగిపోయిన క్షణాల్లారా! ప్రవహించండి నా కలంలో సిరాలాగ ! సరే మరణించాను నాకు   చచ్చిపోవాలని ఉంది. బహుశ విమాన ప్రమాదంలో, లేదా జలగండం వల్ల ?బైక్ ప్రమాదంలోనో... బస్సు క్రింద పడో.. అదీ ఇదీ కాకపోతే నేల మీదనే కాలధర్మం. నా శవం చుట్టూ చాలామంది చేరి ఏడుస్తున్నారు. "ఎందుకేడుస్తున్నారు, ఇప్పుడేమయిపోయిందని" అని నేనెంత ధారాపాతంగా అరుస్తున్నా ఎవరికీ నా మాటలు వినబడవు. " అనంతర కార్యక్రమం గురించి ఆలోచించామన్నా" రెవరో! దహన సంస్కారం ఎజండాలోకి వచ్చింది. అదే వీల్లేదన్నాన్నేను. మతానికి సంబంధించిన ఏ విధమైన కర్మకాండకీ నా (సజీవ లేదా నిర్జీవ) కళేబరాన్ని అంకితం చెయ్యడం అనే పనికి నేను సుతరాము అంగీకరించను.     
            చుట్టూ మూగిన వాళ్ళలో కొంతమందికి నేనొకసారి రాసిన మరణశాసనం జ్ఞాపకం వచ్చింది. అందులో నేను, "నేను చచ్చిపోయాక జరగవలిసిన మొట్టమొదటి పని నా శవాన్ని ఉస్మానియా హాస్పిటల్ లో అప్పగించడం" అని రాశాను. ఆ తర్వాత జరగవలసిన పని అక్కడున్న మెడికల్ కాలేజి విద్యార్దుల్లోని నిరీశ్వరవాదుల ఆధ్వర్యం కింద జరగాలని నా ఆకాంక్ష. ఏడ్చి, ఏడ్చి ఆగిపోయిన వాళ్ళు, ఆగిపోయినా, ఏడుస్తున్న వాళ్లింకా ఏడుస్తూనే ఉన్నారు. ఎడవమనండి నాకు అభ్యంతరం లేదు. విరసం వాళ్ళు నన్నూరేగిస్తామన్నారు. నా అభ్యంతరం లేదు. నా శవం మీద ఎర్రజెండా కప్పడం మాత్రం మరిచిపోకండని మరీ మరీ అభ్యర్ధించాను.  
                       నా కొడుకే వచ్చి తన చేతుల్తో నా తలకి కొరివి పెడతానన్నాడు. ఇది వాడికి పుట్టిన బుద్దికాదనుకుంటాను. ఎవరో చెప్పించిన ట్యూషన్ అయినా అదే వీళ్ళేదంటాన్నేను.

                                                                                                      .....  శ్రీ శ్రీ