కలకానిది.. విలువైనది..
బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు
కలకానిది.. విలువైనది..
బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు
చరణం 1:
గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా
గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా
జాలి వీడి అటులే దానీ వదలివైతువా
ఓ.. ఓ.. ఓ..
చేరదీసి నీరు పోసి.. చిగురించనీయవా
కలకానిది.. విలువైనది..
బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు
చరణం 2:
అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
కలతలకే లొంగిపోయి.. కలవరించనేల
ఓ.. ఓ.. ఓ..
సాహసమను జ్యోతిని.. చేకొని సాగిపో
కలకానిది.. విలువైనది..
బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు
చరణం 3:
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే..ఏ..
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే..ఏ..
ఏదీ తనంత తానై.. నీ దరికి రాదు
శోధించి సాధించాలి.. అదియే ధీరగుణం
కలకానిది.. విలువైనది..
బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు