. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, July 31, 2015

ఆశతో నేను కాల్ చేసినపుడు దయచేసి నీవు ఫోను తీయ్ ప్లీజ్


ఆశతో నేను
కాల్ చేసినపుడు
దయచేసి నీవు
ఫోను తీయ్ ప్లీజ్ 
విసుగును కొంత సహించి
ఒక్క నిమిషమైనా  మాట్లాడు!
ఒక్కసారి నిన్ను 
కల్సి మాట్లాడతానని 
ఉబలాటపడితే
రాలేనని చీవాట్లు పెట్టు!
కబుర్లు చెప్పుకోవడానికైతే
కాలం విలువ నాకు తెలీదని  
గట్టిగా బెదిరించు!
కవిత్వం వినిపించడానికి
బలవంతం చేస్తే
అబద్దాలాడి
రాకుండా తప్పించుకో!
కలుసుకొనే ఇష్టం లేకపోతే
ఎగ్గొట్టడానికి
ఎన్నైనా నాటకాలాడు!
కాని -
ఒకసారి ఫోను తీసి పలుకు!
ఏ అవసరముండి
ఫోను చేస్తానో
ఎటువంటి ఆపదలో చిక్కుకొని
నీ ఆసరా కోరుతానో
నీ స్వరం విన్న నాలో 
కలిగే  భావాల తుంపరలతో 
నా మనస్సేంత  ఆనంద 
పడుతుందో నీకేం తెల్సు 
కరుణించి కాసేపు
నా ఆర్తనాదంతో
చెలగాటమాడకు!
రాంగ్ నెంబరొస్తే
కోపమొచ్చినట్టు
అవసరం లేని వాళ్లయితే
చూసీచూడనట్టు
అర్థించే ఆత్మీయున్నైన నన్ను 
గాయం చేయకు!
తెలిసిన పిలుపుని
తేలిగ్గా కొట్టేసి -
ఈ మిత్రుణ్ణి ఇంకా
ఏకాకిని చేయకు!
నా ఫోన్ బ్లాక్ లిష్ట్ల్ లో 
ఎందుకు పెట్టావు 
నేను నా మాట నీకెప్పటికీ 
వినిపిచకూడదనేగా 
నీవు రోజూ మాట్లాదే వాల్లలో 
నేను పనికిరాని వాన్ననేగా 
అంతలా నీకేం ద్రోహం చేసాను
అందరిలో నన్నిలా అవమానిస్తున్నావు 

Thursday, July 23, 2015

నలిగి చినిగిపోయిన జ్ఞాపకాలకు కుట్లు వేసుకుంటూ నేను

చిక్కని చీకటి లో  మిగురులై 
వెలుగుతున్న జ్ఞాపకాలు 
కిరణాలు సోకని పుస్తకంలో అక్షరాల 
ఆరబోస్తున్న ఎందుకంటే కన్నీటిలొ 
తడిచి విరిగిపోతున్న క్రమంలో 
కొన్ని జారిపోతున్నా పట్టుకొన్న
భావాలను  త్రాగి నాలో నేను 
నన్ను నేను వెలిగించుకుంటున్నా 
నిజాన్ని కప్పేసిన 
అవమానంలోనుండి 
బ్రతకాలన్న విఫల ప్రయత్నంలో 
ఆలోచనలన్నీ నాపై దాడి చేస్తే 
పగిలిపోతున అక్షరాలను 
పేరుస్తున్న క్రమంలో 
కొన్ని అక్షరాలు మనసుకు గుచ్చుకొని 
కారిన రక్తపు బొట్లను 
తోడి కన్నీటిలో కలిపిన క్షనంలో  
కన్నీటి వర్షం ప్రతి సారి చెరిపేస్తున్న 
కలల  ను మల్లీ పుట్టించుకొని 
గతంలోనుంచి నిజాన్ని 
బ్రతికిచుకోవాలని  
చూస్తున్న పిచ్చిగా 
అది ఊహకే పరిమితమై 
గతం అంతా  అగ్గిగా 
మారి నన్ను తగలబెడ్తోంది 
తగల బడుతున్న నన్ను నేను 
చూసుకొన్నప్పుడు 
తెలిసింగి  నేను నిజం లో లేనని 
చిమ్మ చీకటీలో 
గతం నిజం అవ్వలని 
తడుముకొంతున్నాను అని 
నలిగి చినిగిపోయిన జ్ఞాపకాలకు 
కుట్లు వేసుకుంటూ
నిశబ్దపు దుప్పటిలో దూరి 
కారిన కన్నీటికి విలువ కట్టాలని 
చూడటం .. అన్నీ నావే అనుకొవడం 
అన్నీ నిజాలని బ్రమపడటం 
సత్సరాలు గడచి పోయినా 
ఇంకా గతంలో బ్రతలాన్న 
ఆతీపి జ్ఞాపకాల కోసం 
పిచ్చోడిలా తడుముకోవడం 
నిజంగా పిచ్చేమో కదూ ..?

Sunday, July 12, 2015

మనస్సు నిండా చికాకులతో మరొక ఉదయంలో....

మనస్సు నిండా చికాకులతో 
మరొక ఉదయంలో కల్లు తెరిచి న నాకు 
రొటీన్ గా  తప్పూలు ,
 ఒప్పుల తీర్పులూ
నిరాశలు , నిస్ర్పుహలు 
అవమానాలు , ఆందోళనలు 
అన్నిటిని గుండెల్లో నింపుకొని 
అవే గుండె గదులకు గాయం చేస్తున్నా
ఏం చేయలేక వైరాగ్యంతో 
వున్న నన్ను చూసి 
అక్షరాలు  కూడా వెక్కిరిస్తున్నాయి 
నా రక్త నాలాల్లొ రక్తం 
పరుగులు పెడుతూనే వుంది 
దారితెలియని బాటసారిలా 

పైనేమిటో, లోనేమిటో తెలియని రహస్యంలా
నాలో నల్లటి ముసుగొకటి
మన మనసులను కప్పేసింది 
ఎదో కావాలి ఏం కావాలో తెలీదు
చావుకి బ్రతుక్కి మధ్యి 
ఇరుక్కున జ్ఞాపకాలు 
నవ్వాలో , ఏడ్వాలో 
తెలియని వెర్రితనం 
ఏడ్వటానికి ఓపికలేక 
నవ్వే అవకాశమూ లేక
నడుస్తునే వున్నా 
ఈ వింత మనుషుల మద్య 
వీల్లందరూ మనుషుల మని  
పిలిపించుకునే మృగాలు 
నీతీ జాతి లేని 
స్వార్ద జీవులు 
తమ స్వార్దం కోసం  
అమ ఆనందంకోసం 
ఎదుటి వాల్ల జీవితాలనే 
బలులు ఇచ్చే కసాయి తలారులు 
పైకి అందంగా నవ్వుతూ 
నిజాలని స్వార్దం కోసం 
నిలువునా తగులబెట్టే నీచులు 
ఈ మనుసులు 
దాదాపు అందరూ  అంతే 
ఒక్కరు నిజాయితీ గా
మనసున్న వాల్లే నాకు 
కంపించడంలేదు    
వీల్లను పుట్టించిన 
ఆ తల్లిదండ్రులకైనా తెలుసోలేదో 
ఆనిజం వీల్లు మనుషులు కాదని 
నిజం ఎప్పుడు పచ్చి నెత్తురులా 
వెగటుగా వెచ్చగానే వుంటుంది మరి 

Wednesday, July 8, 2015

నాలో దాగి ఉన్న ఒంటరితనం


చీకటి పడగానే నన్ను పకరిస్తుంది
అప్పటిదాక చుట్టూ  జనాలను చూసి
అందరూ ఉన్నారని మిడిసి పడతావేమో 
అని ఏమరపాటు లోంచి 
చొరవగా బయటకి చొచ్చుకొస్తుంది
నాలో దాగి ఉన్న ఒంటరితనం 

చీకట్లో నిద్ర రెప్పల కింద మెలకువని 
నీ జ్ఞాపకాలు రగిలించి  తనెళ్ళిపోయాక
చంద్రుడ్ని మింగే తొలి 
పొద్దు కోసం యుగాల్ని లెక్క పెడుతూ
కదలని గడియారం ముళ్ళు 
నేను నాలోని జ్ఞాపకాలతో  
అంతర్యుద్ధం చేస్తూ  
ఒంటరిగా  మిగిలిపోతాను 

ఎందుకంటే నాలోని ఒంటరితనం 
ఎటెల్లొపోతుంది ..నాకు నేను ఎప్పుడు 
ఒంటరినేగా ..ఓడినా నిజాన్నేగా 
కదూ నిజమే కదూ ..ప్లీజ్ చెప్పవూ
    
గుండెలో భారమైపోయిన 
ఆప్యాయత.. అనుగారం 
ఎక్కడో చోట చూడటం 
అవి దగ్గరగా లేనందుకు 
బిగ్గరగా నాలో నేను రోదించడం 
దగ్గర కాలేక పోయిన దూరపుతనాలో 
చెంపలపై కన్నీటి చారల ఆనవాల్లు  
వెన్నెల వెలుగుల్లో 
ఎండిపోయిన రక్తపు చారికల్లే
ఎబ్బెట్టుగా గతానికి 
ప్రతినిదిలా కనిపిస్తూనే వుందిగా  

Tuesday, July 7, 2015

నాలో నుండీ నాలోకి


చీకట్లో వర్షిస్తున్న
నిశ్శబ్దంలో తడుస్తూ
నడుస్తున్నాను 
గమ్యిం తెలియని తీరం వైపు
నీ నామ స్మరణను
నా పెదాలపై అల్లుకుంటూ

నడుస్తూనే ఉన్నాను 
నాలోనుండి నాలోకి

నిశబ్దపు దుప్పటిలో దూరి 
నన్ను వెంబడిస్తున్న గాలికి
నా నిట్టూర్పులను సెగ జత చేసి
మౌనంగా కొట్టుకుంటున్న గుండె సాక్షిగా
మనసు భారంగా ..
నడుస్తూనే వున్నా నాలోనుండి నాలోకి

నీ ఆలోచనలన్ని నా మనసుపై 
దాడి చేస్తే పగిలిపోయిన 
మనసు ముక్కల మద్య 
ఒంటరిగా ఆకాశం వైపు నిసృహగా చూసి 
నవ్వలేక ఏడ్వలేక వెర్రిగా నవ్వేస్తున్నా
అది ఏడుపో నవ్వో తెలియక 
ఆకాశంలో చందమామ భయ్పడి
నల్లని మబ్బుల చాటుకు వెల్లి 
తొంగి చూస్తున్నాడూ భయం భయంగా 
అప్పుడూ కూడా నీ ఆలోచనలు 
నడుస్తూనే వున్నాయి 
నాలో నుండీ నాలోకి 

నన్ను నేను వెతుక్కోవటానికే

గుప్పెడు చీకటి
మొహంపై చల్లుకొని
విభ్రమం తో
పరిభ్రమిస్తున్నా...

చీకటినుండి  నుండి
పారిపోతున్నా...
నా లోకి నేనే

నిర్నిద్రా గమనంలో
గమ్యిం  తెలియక 
నన్ను నేను
వెతుక్కోవటానికే...

గాయాలు నిండిన
హృదమ భవక్డనై

మనో వల్మీకపు
కుడ్యాల పై
నన్నునేను
ప్రతిష్టించుకుంటూ
నిమిషాల నిఘంటువుల
అవాస్తపు ఆవాసాల
పరాజిత
చరిత్ర పుటల్లో
నా చరిత్రను
పునర్లిఖిస్తూ
పునర్జన్మిస్తూ...

అనంతానంత
దిగంతపు మేఖలలో
ప్రతిధ్వనిస్తూ,
పరిక్రమిస్తూ..
మౌనం చెక్కిలిపై
హస్తపురేఖలు
చిత్రిస్తూ....
నన్నునేనే
ఒక
ప్రస్తానపు ధునిలో
పారేసుకుంటూ
పరీవ్రుతున్నై
పరిగెడుతున్నా....
నాలోకి నేనే.....

Sunday, July 5, 2015

ఇప్పుడు నా సమాదినుండి నేను మాట్లాడుతున్న

నా చుట్టూ సాలెగూళ్ళు
అల్లుతున్న మృగాలను 
మించిన మనుషులు
ఉచ్చనీచాలు లేవు...
తాను నవ్వాలంటే 
ఎదుటి మషిలో కన్నీళ్ళు 
తెప్పించే నీచులు 
కుట్టి  కుట్టి రక్త దాహం తీర్చుకునే 
కీటకాల జాతి అనుకుంటా
ఎదుటిమనిషిని ఏడ్పించి నవ్వే జనాలు  

  
ఎవడొప్పుకుంటాడు
బతికుండగానే
బలిచ్చేందుకు
నమ్మకమనే  కత్తులతో 
కుత్తుకలు కోసే జనాలు తప్ప

గుండెలో గుచ్చుకున్న మూలుగు
నమ్మిన నమ్మకం  పగిలిన ధ్వని 
అగ్ని పర్వతమై దహిస్తుంది 
నమ్మిన నిజాలు కల్లెదురుగా 
కాలి బూడిదచేసి వికటాట్ట 
హాసం చేసున్న  మనుషులు
వేకువలో బ్రతికుండగానే
నిలువునా చంపి పీక్కుతినే 
రాబందులు నా చుట్టు వున్న మనూషులే  

ఎదో చేయ్యాలనుకున్న 
అందరూ బాగుండాలనుకున్నా 
అందుకే నన్ను ఊభిలో నెట్టి 
నా సమాదిపై ఆనంద నిలయాన్ని 
నిర్మించుకొని ఆనందిస్తున్న మనుషులు 
నా లైఫ్ లోకి ప్రవేసించిన అందరూ ఇలానే చేస్తున్నారు
అందరూ మనసులేని మనుషులే 
స్వార్దపు జీవులు 
వాల్లు బాగుంటే చాలు 
అనుకునే కుంచితత్వపు మనుషులు 

దేవుడున్నాడా నమ్మినందుకు దేవుడు 
వాళ్ళవైపే వుండి నవ్వుతున్నడేందుకో  

నా కన్నీటి శాపం వాల్ల బిడ్డలకు తగలకూడదు  
వాళ్ళూ సల్లగా వుండాలి ..
వాల్ల బిడ్డలు సంతోషం గా వుండాలి 
ఇది నిర్జీవంగా మారిన నా హృదయ ఘోష 
ఎందుకంటే నేను మనిషిని 
మానాన్న పెంపకం
నీకేమైనా పర్లేదు 
నిన్నెవరు మోసం చేసినా 
వాల్లందరు బాగుండాలని కోరుకో అన్నాడు 
తల్లిదండ్రుల పెంపకమే మనునుషులను ఇలా చేస్తుంది
ఆయన్ నాతొ లేకున్నా ఆయన ఆశయం అలానే వుంది 
అందుకే నిర్జీవంగా కూడా ఇదే కోరుకుంటూన్నా 
ఎందుకంటే నన్ను ఎప్పుడో సమాధి చేశారు 
ఇప్పుడు నా సమాదినుండి నేను మాట్లాడుతున్న   మనసులో పూచిన మౌన పుష్పాలు గాయాలై గుచ్చుతున్నాయి

మాట్లాడటానికి ఏమీలేక మౌనపుష్పాలుపుట్టుకొచ్చాయి మసిబారిన కాలం మాటున ఏటూ పోయే అవకాశం లేక, శూన్యంలో కుప్పగా  నాలో ఒదిగిన అక్షరాలను పేర్చి భావాన్ని బందీని చేయకుండా అప్పుడే బడీలో చేరిన చిన్నారిలా  పలకదొరికితే ఆత్రంగా రాస్తున్న పసివాడిలా మారి ఏదేదో రాస్తున్నా ఏం రాస్తున్నానో తెలియడంలే
 అక్షరాల ను పేర్చి మనసు భారం దించాలి అనుకుంట్న్నా కాని నాలో వున్న గాయాన్ని పదునైన కట్టి తో బలంగా నాకు నేను గాట్లు పెట్టుకొని నన్ను నేను పొడూచుకొని ఆనందిస్తున్నానేమో  . నాలో మొత్తం దహించబడిన తర్వాత మసిబారిన మనస్సును కాగితం మీద గొకి గీకుతున్న . చితికిన గాయాలు స్రవిస్తుంటే జీవిస్తున్న అనుభూతిని అక్షరాలలో నింపుతుంటాను.రెప్పల మధ్యన ప్రశ్నలు జారిపోతుంటే పదాలుగా పేర్చి  నాలో నేను బిగ్గరగా అరుస్తున్నా నామాటలు నాకే వినపడనంత బిగ్గరగా ..రెప్పల మధ్యన ప్రశ్నలు జారిపోతుంటే పదాలుగా నీరుగా పేర్చి దాచుకుంటాను.మనసులోని గాయాలకు అవి రాలిపోతూనే వున్నాయి జారిపోతూనే వున్నాయి 

Friday, July 3, 2015

ఇప్పుడు నిశ్శబ్దం నా ఊపిరి..ఓటమిని మౌనంలో దాచుకున్నా

పోరాటాల అడుగుల మీద నడిచి వెళ్తున్న
నన్ను నేను కాపాడుకోళెఖా
నేనేంటో తెల్సిన మనుషుల 
అవమానపు పెదాల శబ్దాలు 
వైనలేక మౌనంలో ఒదిగిపోయా 
గతంలో ఎన్నడూ నిశ్శబ్దం నాదరి చేరలేదు 
ఇప్పుడు  నిశ్శబ్దం నా ఊపిరి
నిశ్శబ్దం నా నడక
గెలుపు గాయంగా మారిన క్షనంలో 
ఓటమిని మౌనంలో దాచుకున్నా 

సముద్రం ఎన్నడైనా నిశ్శబ్దమవుతుందా?
నేను సముద్రాన్ని.. సముద్ర కెరటాన్ని
సముద్రంలో తూర్పు దిక్కు పయనిస్తున్న
ఉధృతంగా ఊగి, వూపి, చెలరేగి,
కొంత సమయం మౌనం వహిస్తుంది 
నా ప్రమేయంలేకుండా నాలో  
కలలన్నీ అలలై కొట్టుకుపోతున్నాయి 
ఏంటీ ఇప్పుడూ మొఊనంలో 
నిశ్శబ్దమయిన సముద్రాన్ని చూచి
సముద్రం నిరాశలో వుందని
నాలో ఇప్పుడదే మిగిలి వుందని తేలింది 
నిజం  ఏప్పటికీ నిజమే ..అదీ నిశ్శబ్దంగా    

Thursday, July 2, 2015

అంతులేని కథని అన్వేషిస్తూ.


ఓ మగువ.... 
నీ మనసు లోతుని
అన్వేషిస్తున్న బాటసారిని....
నీకోసం ఆక్రోసిస్తున్న ఆత్మబందువుని 

నా ప్రయాణంలో ఎన్ని ఓటములో
అన్నే గెలుపులు, మలుపులు
ఓటమి చివరమాత్రం ఎప్పుడూ నేనే

 నా మనసు ఓ అంతులేని కథ
ఎన్నిసార్లు ఓడినా అదో తీయని వ్యధ 
  
పొగమంచు మేలి ముసుగులో
ఓ మనసా పలకరిస్తావు...
కనుమరుగై కన్నీరు పెట్టిస్తావు

దరిచేరి మసుగు తీసే లోపే కరిగి
నేనొక మాయనని వెక్కిరిస్తావు... 
మరికరి వంచన చేరి వెక్కిరిస్తావు

సముద్రాన్ని దాచుకున్నావు...
ఒక్క అలనైనా తాకనీయవు...
ఆకాశనికి .. బూమికి పోలిక ఎక్కడంటు వెక్కిరిస్తావు 

ఆకాశంలో సగం నేనేనంటావు
శూన్యం తప్ప ఇంకేదీ కనపడనీయవు
నన్ను అందులోనే  ఉండిపొమ్మని ఆర్దేస్తావు

అగాధం అంచున ఉంటానంటావు....
ఆ అగాధానికి అంతేలేదని నువ్వే చెప్తావు....
అన్నీ తియ్యగా చెప్పి అఘాదాల్లో ఉండిపో అని నెట్టేస్తావు

చిక్కుముడుల చిత్రాన్ని నేనంటావు...
విప్పిన కొద్దీ కొత్త ముడిని చిత్రిస్తూనే ఉంటావు...
నాజీవితానికి చిక్కుముడులతో జీవితాన్ని చింద్రం చేస్తావు

మనసు పొరలు మరుల తరువంటావు
ఆ పొరల చెరలో కన్నీటి చుక్కనీ నేనే అంటావు
కన్నీరు ఇంకేవరకు ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటావు

కలల వలలో చిక్కుతావని అంటే...
కనులు మూసుకున్నాను....
కళ్ళు తెరచి చూస్తే అంతా చీకటి చేశావు

ఆ కలల వల నాపైనే విసిరి...
కలత నిదురవై వెళ్లిపోయావు... 
ప్రతిరాత్రి నిశిరాత్రి చేసి ఏకాంతంలో ఏడిపిస్తున్నావు

ఎట్టకేలకు....
మససు వాకిట నిలబడి తలుపు తడితే...
లక్షప్రశ్నల నిలువెత్తు శిల్పమై మాయమయ్యావు...

అంతులేని కథని అన్వేషిస్తూ....
అంతం తెలియని దూరం ప్రయాణిస్తూ...
చిక్కుప్రశ్నలకు బదులు వెదుకుతూ...
నా... అన్వేషణ నీకోసం సాగుతూనే ఉంది...

వీడని చిక్కుముడి కోసం ఆరాటమెందుకని... 
నా పిచ్చి మనసుని చూసి జాలిపడి .. 
ఆ మనసు... ఓ నవ్వు నవ్వి....
పొగ మంచు మేలి ముసుగులో కరిగిపోయింది...  
మట్టిలో కల్చిపోయేందుకు నాదేహం 
ఇప్పుడు సిద్దం అయింది అందుకేనేమో
 నీవు నన్ను శిలలా చేసి ఆడుకొన్నావు

కారిపోయే కన్నీరు మంచిది..

కంటిలో కరగని నలుసు కన్నా, 
కారిపోయే కన్నీరు మంచిది... 

దాహం తీర్చని సముద్రాని కన్నా, 
తీరం వదిలే కెరటం మంచిది... 

మెలకువలోను ఒక కలగా మెదలడం కన్నా, 
వేకువను వదిలే చీకటి మంచిది... 

నీటికి ఆరని అగ్నిజ్వాల కన్నా, 
చిరు జల్లులు కురిసే మేఘం మంచిది... 

కలల మేడను కట్టడం కన్నా, 
శిధిలమైన పూరి గుడిసె మంచిది.... 

కలిసిరాని కాలానికి కన్నీరే పన్నీరవుతుంది...!!
మనుషులను నమ్మకు మనసును నమ్ముకో

మౌనంతో గాయాన్ని తడుముకో
ఎన్నీ జ్ఞాపకాలు గుండెల్లో అగ్నిని రాజేస్తాయి 

నీవు నిలువునా తగల బడు కాని 
నీకు ఇష్టమైన వాల్లు బాగుండాలని కోరుకో 

అదే పగిలిపోయిన నీ ఆత్మకు శాంతి 
కుంగిపోయిన నీవినాశనానికి నాంది