. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, September 30, 2013

నిన్ను మరువలేక గతిలేక గమ్యిం ఎటో తెలియక తికమక పడుతున్నా

బద్దలయితే మౌనంలో 
ఆ ముక్కలేరుకోవడమే
ఒక్కోసారి సుఖమనిపిస్తుంది...
తన్నుకొస్తున్న దుక్కం సాక్షిగా
తపన పడుతున్న మనస్సు నివేదన  


నిన్ను మరువలేక గతిలేక
గమ్యిం ఎటో తెలియక 

తికమక పడుతున్నా
నివు కాదన్న  మౌనంతో
కలిసి మధన పడేకంటే
నిట్టూర్పులతో కలిపి ప్రాణాన్ని
వదలడమే సుఖమనిపిస్తుంది
సడిచేసే గుండెలో జీవంలేక
ఏ నవ్వు వెనకా మమత లేక
ఆశా సౌధాలుజేరే సోపానాలు లేక
అయోమయంలో అవస్థలకన్నా..
కారే కన్నీళ్ళలో కలిసి
కొట్టుకుపోవడమే.. సుఖమనిపిస్తుంది


సందది చేసే  గుండెలో జీవంలేక
ఏ నవ్వు వెనకా 

మమత మమకారాలు కరువై
అయోమయంలో అవస్థలకన్నా..
కారే కన్నీళ్ళలో కలిసి
కొట్టుకుపోవడమే.. 

సుఖమనిపిస్తుందికు
బ్రతుకు మీద 

సన్నగిల్లుతున్న చివరి క్షనాల్లో 

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(24)

1) నిన్నటి దాకా నన్ను చుట్టుముట్టిన వెలితి
ఇవాళ ఉదయం మళ్ళీ ప్రత్యెక్షమైయింది నిన్ను వెతుకుతూ


2) నీకోసం మౌనంగా ఎదురుచూస్తుంది నా ప్రాణం
నిశ్శబ్దపు విషాద ఛాయలు మదిలో నిండుకొన్నా తడుముతొంది మనస్సు నీకోసం


3) నీలో ప్రేమ అవకాశవాదిగా మరినప్పుడు నేను ఎక్కడుంటే నీకేంటీ..?
నీ మనసులో స్వచ్ఛత కోల్పోయావు నువ్వు ఏమైతే నాకేంటి..


4) జన్మకు సరిపడా ఆవేదననీ నాకు మిగిల్చావు
హృదయంలో అనుభూతులుకు ఆకారం కల్పించలేక పడేవేదన


5) నా ఆశల వెనుక తిరిగి రాని ఆ రోజులును తీసుకరాగలవా
ఒంటరి తనాన్ని అంతం చేసే నీ తలపులు నా గతాలుగా మిగిలిపొతుంటే ఆపగలావా....?


6) ఒక్కక్షణం కూడ వీడని నీ జ్ఞాపకాలు
మరుక్షణంలోనే మాయమవుతాయని ఎలా ఊహించావు ప్రియా


7) నీ జ్ఞాపకాలు నాగుండె అరలను చీల్చుతున్నాయి..
నాలో నిండిఉన్న నీ అనంతమైన ఆలోచనలు నన్ను వేదిస్తున్నాయి


8) నాలో నేను నిశ్శబ్దపు యుద్ధం చేయ్యలేక చెదిరిన స్వప్నాలను బాష్పాలుగా మారుస్తూ ఎదబీడుని తడుపుతున్నాను..

9) ఎందుకో ఈ రాత్రి భాషతో మేల్కోన్నా
ఎంటో నాతో నీవు మాట్లాడినట్టు నిరాశతో మాట్లాడుతున్నాను ఏంటీ..?


10) చీకటి చారలు లేని తెలుపు కాంతుల మధ్య పెరిగిన నీకేం తెలుసు నా జీవితం విలువ అందుకే నా జీవితం అంటే అంత చులకన

11) భావావేశాలను కొల్పోతూ ఉద్వేగానికి లోనౌతూ  నుకోకుండా ఆనవాలు కోల్పోతున్న దృశ్యాలెన్నో నాకు పరిచయం చేశావు

12) ప్రేమా ఎన్ని ఆశలు నిరాశలు చేస్తావు..ఎన్ని ఆనందాలను జ్ఞాపకాలు చేసి ఎన్ని బ్రతుకుల వర్తమానలను మింగేసి విగతజీవుల్ని చేస్తావు

13) కాలమా అవిశ్రాంతంగా అందరి బ్రతుకు వెనక అగాధాలను
తవ్వుతూ అలుపనేది లేకుండా బ్రతుకుల్ని చిదిమేస్తావు నీకిది న్యాయమా


14) సముద్రమంత విశాల హృదయం పసిపాపలాంటి మనస్సు
పుష్పమంత సున్నితమైన స్పర్శ నీలో దాచుకొని ఎక్కడున్నావో కాస్త చెప్పవూ


15) గుండెలు పగిలి, మనసు విరిగిపోయి నోరు తడారిన తరుణంలో
నా మూగబోయి బాధకు భాష్యం చెపుతూ బరించ రాని వేదన మిగల్చిన నీవెక్కడ


16) ఏదీ నిజంకాదని తెల్సిన క్షనాన
నాకు నేను ఓ గతి తప్పిన రైల్లా దిశా దశా లేని గమ్యిం వైపు సాగనీ


17) కొన్ని గాయాలు పచ్చిగా ఉంటేనే..
శిక్ష కఠినంగా ఉంటేనే గానీ కొందరి కసి తీరేట్టుగా లేదు


18) నేనేంటో తెలియని దిక్కుతోచని స్థితిలో
నా కన్నీళ్ళతోనే నా గాయాలు కడుక్కొంటూన్నా


19) నీ మౌనంతో కాలిపోతున్న నా జ్ఞాపకాలచితి
ఇంకా ఆరక ముందే నీ జ్ఞాపకాల నుంచి నన్ను వేరుచేయడం ఏలా సాధ్యం ?


20) నా కోసం నీవు కొత్తగా జన్మిస్తే నీతో మరో జన్మ నాకు మిగిలి ఉంటే...
నీ మమతానురాగాల కోసం ఎన్నిసార్లు అస్తమించడానికైనా నేను సిద్ధంగానే ఉన్నా


21) ఏది జరుగకూడదని భయపడతామో అదే నాకళ్ళేదురుగుగా జరిగితే..
నాది అనుకున్నది నా ఎదురుగా దూరం అయినప్పుడు ..నిజం బ్రమలా మారితే


22) చెక్కిలిమీద చారికై నిలిచిన నీజ్ఞాపక౦
ఇద్దరి ఆలోచనల్నిరేపి నన్నొక కన్నీటి శిబిరాన్ని చేస్తు౦ది.


23) నీ జ్ఞాపకాల లోయల్ని తవ్వుకు౦టూ
ఏ అర్ద్రాత్రో స్వప్న౦తో నిద్రను వెలిగి౦చుకు౦టాను.


24) ఇప్పటికెన్ని ఆలోచనలు గాజుబొమ్మాల్లా పగిలిపోయాయో..?
మది కలవరింతల్లో కొట్టుకపోతున్న జ్ఞాపకాలను పట్టి ఆపేదేలాగో చెప్పవూ...?


25) ఎదలో నిన్ను దాచుకోవాలనుకొన్న
ప్రతిసారీ గాయమై ఉబికొస్తావు నన్ను చిత్తడి చేస్తావెందుకో


26) మనసు తెరను చింపుకొని నన్నునీవు గుర్తించేది ఎప్పుడు...
నా లో ప్రేమ స్వరూపాన్ని అర్థం చేసుకొని అక్కున చేర్చుకొనే రోజొస్తుందా..?


27) హృదయ అంతఃరంగాల్లో మౌనాన్నే అక్షరీకరిస్తూ
నిజం నీడల్లో నాటుకపోయిన అబద్దాలను పెకిలించాలనే వింత ప్రయత్నంలో నేను


28) చేజారిపోయిన నిన్ను నేను కన్నీళ్ళతో చుస్తే
చేతులనిండా బంధించలేని గాలిలా నన్ను చుట్టేసి నన్ను చంపేస్తున్నావు


29) నా మాటలలో అర్దాలన్నీ అపార్దాలయ్యాయి
నీ మాట కోసం ఎదురు చుసే నా మౌననికి సమాదానం ఏమని చెప్పను


30) కమ్మని కలలా కరిగిపోయిన కాలానికి
క్షనాల్లో మారిపోయె ప్రస్తుతానికి మధ్య మిగిలిన జ్ఞాపకానివి


31) ఎంత తడిపిన తడవని పెదాలు..
ఒకటికి ఒకటి కలవకుండా వణుకుతునే ఉన్నాయి ఎందుకనో


32) నా కన్నుల నుండి జారే కన్నిటిని చూడు,
నా గుండెలో నిండిని నీ పై ప్రేమ కనబడుతుంది


33) శాస్వతమైనా నా ప్రేమను కాదని
మట్టిలొ కలిసిపోయే దేహన్ని చూసుకొని ఎగిరెగిరి పడుతున్నావు


34) మనసుని కాల్చేస్తున్న జ్ఞాపకాల జ్వాలలు
నీ రాక కోసం ఎదురుచూస్తూ నిదుర మరచిన కన్నులు


35) ఊపిరివై నా గుండెలో నిండిపోతావనుకున్నాను,
కాని ఉప్పెనవై నామనసును నా నుండి దూరంగా తీసుకెళ్ళిపోతావనుకోలే


36) స్వచ్చమైన కన్నీటి లాంటి ప్రేమ నీదంటే పొంగిపోయాను
గుండెకు చిచ్చుపెట్టి, నేను రోధిస్తుంటే కనులనుండి జారిపోతావని గ్రహించలేక


37) వెచ్చని నా కన్నీటికి లో మునిగిపోతున్నా
నా మనసుని ద్రవింపచేసినువ్వు కాదని వెళ్ళిన నా ప్రేమని చూసి..


38) నేను నాలాగే ఉండాలనుకుంటా
మరొకరిలా ఉండి నటించడం అవసరామా..?


39) కన్నీటిని నాకు తోడుగా ఉంచి
నీ జ్ఞాపకాల కోటలో నన్ను బంధించి వెళ్లిపోయావ్


40) కలలా నన్ను కలిసావ్..
కలవరమై నా మనసులో మిగిలిపోయావ్ పోయావు ఎందుకనో


41) గడచిన కాలం అంతా కలలా కదిలి పోతుంటే...
ముందున్న కాలం అంతా సూన్యిమై కరిగిపోతుంది ఎందుకో..?


42) నా కలలన్నీనిజం చేసుకోవాలని మనసు ఉరకలేస్తుంటే
ఎగసిపడే ఈ భావాలని ఎదను కోస్తున్న జ్ఞాపకాలన్నిటినీ నీకు తెలిపేదెలా


43) ఎప్పుడో నిదురించిన జ్ఞాపకాలని తట్టి లేపి
మూసిన గుండె గది తలుపులని బలవంతంగా తెరచి వంటరిగా వదిలేశావేంటి


44) కంటి చూపు నన్ను ఏమారుస్తుంది
శూన్యాన్నే చూపిస్తూ అక్కడ నీవున్నా వంటుందేంటీ....?


45) ఓ చేదునిజం స్వప్నమై నిలిచి
నా శ్వాస లయతప్పి విరహవేదన పడుతోంది


46) నిన్ను చేరుకోవాలని నేను పరుగులు తీస్తూ
నీకోసం నిరంతర అన్వేషనలో నేనుంటే.. నీవు పారిపోతావేంటి


47) మనిద్దరం ఏకాంతంగా కనిలిసిన క్షణాలన్నిటీనీ
పోగేసుకొని నన్ను నేను వెతుక్కుంటే అవేంటి నన్ను వెక్కిరిస్తున్నాయి


48) నీవెక్కడున్నావో ఆని మనస్సు వెతికేలోపు
పటుక్కన తెగి జారిన దండ పూసల్లా నీజ్ఞాపకాలు జారిపోతూనే ఉంటాయి


49) మనం కల్సే రోజొస్తుందని ఎదురుచూస్తుండగానే
కాలం నన్ను దాటుకొని వెలుతూనేఉంది.. నీవులేని నేను ఒంటరిగా నీకోసం


50) నీఙ్ఞాపకాల వర్షంలో కన్నీళ్ళు రావడం లేదు
కానీ మనసు మాత్రం తడిసి ముద్దౌతుంది ప్రతిక్షనం


51) మనసు మౌనంగా రోధిస్తుంటే
నీవు చేసిన గాయం ఇంకా పెద్దది అవుతూనే ఉంది


52) అద్దంలో నా ప్రతిబింబాన్ని చూద్దామంటే
అది కూడా నీ బింబాన్నే చూపెడుతుంది ఎందుకనో


53) ఆ గాయం మానలేదనుకుంటే
మరో గాయానికి గురి చేస్తున్నావు ఎక్కడ నేర్చుకున్నావీ విద్యి


54) పుస్తకంలోని పేజీలు వెనక్కి తిప్పినట్లు
జీవితాన్ని వెనుక్కు తిప్పే మత్రం ఏదన్నా ఉంటే ఎంతబాగుండు..?


55) నాకు నేనే మౌనం వహిస్తాను
నా పలుకులు ఇతరులను భాధించినప్పుడు


56) కరిగిన కలలో నిజాన్ని చూస్తున్నా
రాతిగుండెలో ప్రేమని వెతుకుతున్నా దొరకదని తెల్సి కూడా


57) ఈ క్షణంలో నాకు కళ్ళు మూసుకోని
పండు చందమామని,నిండు వెన్నెల జాబిల్లిని చూడాలని ఉంది


58) ఏ పున్నమి రాత్రి కోసమో ఎదురుచూస్తూ
ఆ రాత్రిని నేను కనుగోలేకపోయాను అందులోనే కరిగిపోయాను


59) కొన్ని క్షనాల్లో ఏంచెయ్యాలో తెలియక.
రెప్పలు మూసుకుని నా కన్నుల్లోకి చీకటికి చోటిచ్చాను


60) కొన్ని ప్రశ్నలు కరిగి కదిలిస్తాయి
వాటి ఉనికిని కోల్పోయి నా ఉనికిని ప్రశ్నిస్తున్నాయి ...?


61) నన్ను నీలో తెల్సుకోలేనప్పుడు నువ్వు నన్ను అందుకోలేని దిగంతాల దూరాన్ని

62) కంటి పాపకి తీరని ఆశలన్నీ కన్నీరవ్వగా
చెప్పుకోలేని బాధలన్ని మౌనంలో మరిగిపోయాయి మరి


63) కన్నీరు తాకిన చేతులు తడి ఆరలేదింకా
కంట తడి మాటున కధ కంచికి చేరింది ఎందుకో...?


64) ఎనెన్నో పరిచయాలు నన్ను అలుకున్నా..
అనుబంధాల నడుమ పువ్వై పరిమళించే స్నేహాలు కొన్నే


65) ప్రేమ కోసం ప్రాణమే ఇచ్చేవారు ఉన్నా
ప్రాణమిచ్చి ప్రేమించేవారు కొందరే నిజాలను ఒప్పుకోవాలంటే దైర్యం ఉండాలి


66) నిజం దాగున్నప్పుడు
ముందుకొచ్చిన మౌనంలో మనస్సు మదన పడుతుంది


67) మౌనంగా మిగిలిపోయిన నిన్ను
అక్షరాల్లో దొరికించుకోవాలని చూస్తున్నా..దొరుకుతావా...?


68) నీ తలపుల తలుపులు మూసుకున్నాయేమో కనిపించడం మానేసావు...?

69) గుండె లో ముళ్ళు దిగినట్టు ఉండడమే "బాధ" అదిపెట్టినోళ్ళకు తెలీదేమో కదా..?

70) దోసిట్లో పొదుగుకున్న అనుభూతులు
జారిపోతూ నన్ను వెక్కిరిస్తున్నయి...ఎందుకలా....?


71) మారలేని నా అసహాయతను గుర్తుచేస్తున్నజ్ఞాపకాలు
నా నిశ్చల హృదయంలోవేదనను గుమ్మరిస్తున్నది ఎవరు? నువ్వా? నేనా?


72) నాలోకి నువ్వు వచ్చవేంటి నీలోకి నేను ఆవహించి రాత్రి ఇంకా మిగిలిపోయిందా..

73) ఈ స్వప్నమేంటి..చేదునిజమై కనుపాపలో కన్నీరై నిలచింది

74) నా కలలు ఫలించె ఒక్క క్షణం ఇవ్వు చాలు...
నీ పెదవి పై మాటనవుతాను..నీ చూపులో ఆశనవుతాను.


75) ఏ పూలరెక్కల్ని చిదిమి పరువను నువ్వొస్తున్న ఆ రహదారిని
ఏమని మొదలుపెట్టను నేస్తం నీకోసమని వ్రాస్తున్న ఈ పదాల అల్లికలను


76) నీ తలపులతో గుండెభారం మోయలేక
మూగబోయి మాటలు రాక మౌనంగా రాస్తున్న ఇలా


77) ఒంటరిగా నా ఊహలలో జీవిస్తున్న నన్ను
నేనున్నా రమ్మంటూ వాస్తవం లోకి లాగి నీవెవరు అని ప్రశ్నిస్తే ఏం చెప్పను..?


78) నీకై నేను వెదుకులాటలో
ఎప్పుడూ నన్ను నేను పోగొట్టుకుంటూనే ఉన్నాను


79) ఒక జ్ఞాపకం గుండెను గుడిగా చేస్తే
మరో జ్ఞాపకం గుండెను రాయిని చేస్తుంది ఏంటో


80) గుండెల్లో ప్రేమ ఎగసి ఆకాశాన్నంటితే ఏం లాభం..
ఎదుట కనిపించే మనసు నిండా అంతా శూన్యమే కదా నిండి ఉంది


81) మౌనమే నేను నా ప్రశ్నకు సమాదానం ఐతే
నిజాన్ని దాచేసి మౌనాన్ని భరించే శక్తి నాకు లేదు


82) కన్నీళ్ళూ వలుకుతూనే ఉన్నాయి
నీవు గుర్తొచ్చినప్పుడల్లా గుండెల్లో ఏదో భారాన్ని మోస్తున్నట్టు ఉంటుంది


83) నేను లేనని తెల్సీ నీ కళ్ళల్లో నన్ను వెతుక్కుటాను
నా ఆత్మను నీ ముందు ఆవిష్కరించి నీదరి చేరాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాను


84) ఒంటరితనపు రోదలోనాలో నిండి ఉన్న
అసంపూర్తి గీతలేవో నా దారికి నిత్యం అడ్డుపడుతూనే ఉంటాయి.


85) అపార్దాల వెంట నీవు ...నీ ఊహల మధ్య నేను
ఎప్పటికీ ఒంటరిగా అదే దిక్కుతోచని సమూహంలో నన్నొదిలేశావుగా..?
 
 


86) నీ ఊహలలో చిక్కుకున్నకాలాల దారాలను తెంచాలని చూస్తున్నా
గతంలో కొన్ని నిజాలు ప్రస్తుతంలో నాకు అండగా ఉంటాయన్న చిన్ని ఆశ


87) ఎందుకు నీ ఆలొచన నన్ను ఇలా తరుముతోది
నిన్న నే కన్న చూసిన కలా? గతం నీవు చేసిన గాయం తాలూకా భాదనా


88) ఎవరో నిర్మించిన చట్రాలలో ఇరుక్కపోయి
మరెవరో కలిగించిన దూరాలకు బెదిరి మనం ఎందుకిలా...?


89) అందినట్టే అంది చిక్కకుండా చేజారిపోయే జాబిల్లిలా నన్నుడికిస్తూ
నన్నో అక్షర సముద్రంలో పడేసి అందులోనుంచి మంచి ముత్యలనేరమంటావు


90) ఎక్కడో సంతోషంగా నువ్వున్నవనే వెర్రి ఆశతో
నా ఉనికిని గుండె చప్పుడుగా మార్చా ఆ శబ్దతరంగాలు నిన్ను చేరాయా


91) నిన్ను చేరుకోలేనని తెలిసి కూడా పిచ్చిగా పరుగులు తీస్తుంటాను
నీకు నాకు మధ్య వైరం కొలవలేనంత మౌనం వెలుగే లేనంత చీకటి ఎందుకని ఇలా


92) నామనసు ప్రతిబింబంలో నీవు వేయి సార్లు జవున్మిస్తావు
నను కాదని నీ చూపు మరిలిన అనుక్షణం నేను లక్షసార్లు మరణిస్తూనే ఉన్నాను


93) పగిలిన గుండెను ఓదార్చే నేస్తమా...
నాకోసం చూసిన ఎదురుచూపులను తిరిగి నా కివ్వవా


94) నాకు అందితే నీతో కొన్ని క్షణాలు గడిపే వరం
నిలుపుతాను నా హృదయాలయం లో నీ రూపం అన్ని జన్మలకు


95) ప్రతి రొజు నిజాన్ని కన్నీటి పొరలతొ కప్పుతుంది జ్ఞాపకం
నేను ఊహించిన అద్బుతమైన నిజాలన్నీ అవిరౌతున్నాఎందుకో ..?


96)  గుండెకు గుచ్చుకున్న తన జ్ఞాపకాల మువ్వలతొ...
తన జీవితం మీద తానే నిద్రపొయింది ఏం చేయాలో తెలీక


97) మరు మల్లెపూల ఫానుపు మీద పడుకునే నీకేం తెలుసు...
నాలొ అణుచుకున్న రొదన రాత్రుల గురించి నిద్ర లేని చీకట్ల గురించి


98) నిన్ను నువ్వే బంధించుకొని...అవే నిజాలనుకొన్న క్షనంలో
కన్నీటి రూపంలొనిజాలన్నీ నా కళ్ళ నుండి జ్ఞాపకాలుగా జారిపొతున్నాయి


99) నీ మౌనంతో కాలిపోతున్న నా మది చితి ఇంకా ఆరక ముందే
నన్ను నీ నుంచి నీ జ్ఞాపకాల నుంచి వేరుచేయడం ఏలా సాధ్యం అనుకొంటున్నావు


100) నీవు నన్ను పట్టించుకోనప్పుడు....
నిశ్శబ్దాన్ని గుండెలమీదేసుకుని జోకోట్టిన ఏకాంతాలెన్నో.