. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, December 26, 2017

నాలో నేను (5)

అర్థం కాని లోకంలో
అయోమయంలో
అదోరకపు భ్రాంతిలో
 బ్రతికేస్తున్నాం
మనుషులంతా ఇప్పుడు..
మౌనశిలలుగా మరో రూపమెత్తారు
మాటలు కరువైయ్యాయి
పెదాల కదలికల్ని మనసు దారిలో విసిరేసి
తమది కానీ లోకంలో విహరిస్తున్నారు

ఇప్పుడు మాట్లాడ్డానికేమున్నాయి?
అంతా వాట్సాప్,ఫేస్ బుక్ లేగా
ఇదే నిశ్శబ్దాలకు మూలాలు
అయిన ఇప్పుడేం మిగిలుంది
ఇద్దరి మనుషుల  నిశ్శబ్దమేగా
ఇద్దరు వ్యక్తుల మధ్య
నిరంతరం భయంకర నిశ్శబ్దం
ఆవరించి ఉంది
విధ్వంసానికి
మహా సంగ్రామాలు అక్కర్లేదు
ఎదురెదురుగా ఉన్నా
మాటలు రాలని మౌనం చాలు
అందుకే ఇప్పుడు..
మాటల్ని మౌనపు
ముద్దలుగా మూలకి విసిరేసి
మనుషులంతా నడిచే
మౌనశిలలుగా బతుకీడ్చుతున్నారు.
కాదు కాదు మౌన శిలలు గా మారిపోయారు

Sunday, December 17, 2017

నాలో నేను (4)

నమ్మకపు నాలుక చివరన
పడ్డ గాయం..నిశ్శబ్దపు
నిజం మాటున
చుర కత్తుల్లా..దూచుకొచ్చి
అక్షరాలు మనసునిండా
గాయాల మయం చేసాయి..

ఇష్టం కష్టం గా మారిన క్షణాన
ఎదురించ లేని నిస్సత్తువ నడుమ
నాలో రగిలిన‌ భావాలతో
నన్ను నేను రాగిలించు కొంటూ
తగలబడుతున్న జ్ఞాపకాల
వెలుగుల్లో..కానరాని నీకోసం.
నా మనసు ఆత్రంగా వెతుకుతొంది

నాలో రగులుతున్న
ఆశలు నా దేహాన్ని
చీల్చుకొని పదాల పరిమలా లై
విచ్చుకుంటూ ని గుండెలోతుల్లో
చొచ్చుకుపోతూ..చొరబడాలని
ఎప్పటికప్పుడు విఫల ప్రయత్నం
చేస్తూనే ఉన్నా  ఆశ నిరాసై
మౌనపు చీకటి సాక్షిగా..
గాయపడ్డ నిజం కన్నీరు పెడుతుంది

నీవు గుర్తొచ్చినప్పుడు
కొన్ని క్షణాలు నన్ను ఆశక్తుణ్ణి
చేసి ఏకాంతపు
గుహలో పడ్డప్పుడు
తడబడుతున్న అడుగులతో
నడుస్తూ వెళుతూనే ఉన్నా

Thursday, December 7, 2017

నాలో నేను(1)

మనసుపోరాల్లోని
జ్ఞాపకాలు తడుముకున్నప్పుడు
కంటి చివరల నించి..
క్షణాలను ఒడిసిపట్టుకుందామనుకున్న
జారిపోతున్న భావాలను
బందీలుగా చేయాలని చూస్తున్న
ప్రతి ప్రయత్నం విఫలం అవుతూనే ఉంది

 ఎదురుగా కనిపిస్తున్న రూపం
లిలగా అస్పష్టం కనిపిస్తూ
 మురిపిస్తు మైమరిపిస్తోంది
ప్రశ్నలుగా మిగిలిపోయిన
కొన్ని జవాబులుగా సాక్షిగా..
గాయపడ్డ గతం జ్ఞాపకాలై..
రాలి పోతూనే ఉన్నాయి
నీ చిరునవ్వుల ముందు
చిరిగిపోయి
జీవితాలు పొరల చిరిగుల్లో
వెతికిచూస్తే కనిపిస్తూనే ఉన్నావు

నాలో నేను(2)

ఒంటరితనపు నడకలో
ఆమె కన్నీటితో
నిర్లక్ష్యం నన్ను వేక్కిరిస్తూ
తన నడక సాగిస్తూనే ఉంది
నా రెప్పలపై జారిపోతున్న
కలల సాక్షిగా..నాలో నేను
తడబడుతూ...అడుగులు వేస్తున్నా
చెదిపోతున్న స్వప్నాల సాక్షిగా
నిదురలో ఉలిక్కి పడ్డ నేను
ఊహలకు ఉపిరిపోసుకుంటూ
 ప్రతీరాత్రీ...కలత నిద్రలో నీకోసం
తడుము కుంటూనే ఉన్నా

వేకువ కోసం వేలరాత్రులు
ఎదురు చూపులతో
కాలం కరిగిపోతూనే ఉంది
నిజం అడ్డుగోడను
బద్దలు చేసిన అబద్ధం సాక్షిగా
అన్ని కలలు గానే మిగిలి పోయాయి

 మనసు మూలలో
మౌనంగా రోధిస్తున్న నిజం సాక్షిగా
ఆ గతమంతా జ్ణాపకమై..మిగిలి పోయింది..

నాలోనేను (3)

పగిలిపోయిన పగుళ్లలో
ముక్కలైన..చిరుగుల.మధ్య
మనసులో జ్ఞాపలకు చేస్తున్న
విధ్వసం,విస్ఫోటనాలు
నాకు మాత్రమే వినిపిస్తున్నాయి

నిజం ఆకలి చూపులకు
ఆవిరి అవుతున్న జ్ఞాపకాల సాక్షిగా
అబద్ధపు..అక్రందనలో
ఆశగా ఎదురు చూస్తున్న
విషాదం..నిషా చీకటిలో
విరహపు నల్లటి రంగు
పులుపు కొంటుంది..ఎంటో..?

కోరికల విరహ వేదనతో
కసి తీర్చుకుంటున్న కాలం
కరిగిపోతున్నా..కనికరించని జ్ఞాపకం
కన్నీరై వెక్కి వెక్కి వెక్కి
ఏడుస్తున్న..గుర్తు గా మిగిలిన
ఆ ఎరుపెక్కిన కళ్ళే సాక్ష్యాలు

ఎక్కోడో.. మత్తెక్కిస్తున్న
మల్లెలు...నలిగి.నాశనం అయినా
చివరి  రెబ్బవరకు
మత్తైన వాసననిస్తూ
ఓ రెండు మనసులను దగ్గర చేసి
ఓ వింతైన తృప్తి తో
చెత్త బుట్టలో చేరి
ఆ ఇంటిని చివరిసారిగా నలిగిన
ఆ దుప్పటి మడతల్లో..తనొదిలిన
మల్లెల మాధుర్య0..ఒక్కసారిగా
జివ్వున వచ్చిన
గాలి తనతో తీసుకెళ్ళ0ది
అయినా  ఆ మత్తెక్కించే నిజానాన్ని
మౌనంగా వదలి..తాను తగలబడింది

Monday, October 30, 2017

నీకోసం వేచిచూడటమే ...ఓ కవిత్వం నాకు.

ఓయ్
ఈ చెట్లు చూడు రోజూ పెళ్లికూతుళ్లల్లా పూలు సింగారించుకుని ఆకాశాన్ని మత్తెక్కిస్తుంటే, వెర్రి ఆకాశం తెల్లబడుతూ, ఎర్రబడుతూ, నల్లబడుతూ తబ్బిబ్బై ముంచేస్తుంది.
ఆ సెలయేరు చూడు ఎవరు తరుముకొస్తున్నారని అంతలా పరుగులు పెడుతోంది? ఆగదు, ఆగనివ్వదు నీలా. మలుపు మలుపులో ఊరిస్తూ, ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
అందాల మందారం మాత్రం ఏమి తెలీనట్లు సోయగాల చమక్కుల్లో చిక్కకుండా చుట్టూ తిరుగుతోంది రంగులరాట్నంలా. రాలిపడుతున్న పారిజాతాల్ని, విప్పుకుంటున్న పొగడ పూవుల్ని ఒకింత ఆశ్చర్యంగా చూస్తూ. ఇంక మల్లెలతో మనసు కలిపేసుకుందేమో అక్కడ నుండి చూపులు తిప్పుకోలేక పోతోంది. నాకు భలే అసూయ అనిపించి, ఆ మందారం అదృష్టాన్ని ఆవగింజంత అరువు తీసుకుని, దేవగన్నేరు పూలని ఒక్కొక్కటిగా పేర్చుకుంటుంటే, నీకెందుకోయ్ అంత అక్కసు? పాదాల పారాణి పూలకంటిస్తున్నావేంటని నా వెంటబడ్డావు.
గమనించవు కానీ, ఆ పూల ఎరుపులు మత్తెక్కిన నీ చూపుల మెరుపులని ఎన్ని సార్లు చెప్పాలనిపిస్తుందో .... నువ్వేదేదో చెప్పేసి నా మాటల్ని నాలోనే మూటకట్టేస్తూంటావు.
అలా చూసివెళ్లే ఆ చూపుల్లో మునిగిపోయానేమో నీ నీడ పడిన చిలకరింతల్లో ప్రతి మొలకా చిగురులు తొడుగుతుంది. ఆ పులకరింతల్లో ప్రతి పువ్వు పరవశిస్తోంది.
అణువణువు నన్నల్లుకుంటున్న నీ చూపుల్ని ఓ కంట గమనిస్తూనే ఉంటానోయ్.
వెళ్లాలంటాను ..వెళ్లలేక
కొంచెంసేపంటావు ..వదల్లేక
అలా అలా ఏకాంతమంతా పెదాల నవ్వుల్లో విరబూయటం ఎంతో ఇష్టమైన అనుభవం మనకు.
నీ కౌగిళ్ళ వలలో చిక్కిపోగూడదంటూ .. పట్టుబడిపోవటం భలే గమ్మత్తుగా ఉంటుంది. అది సరే కానీ, కాలాన్ని అద్భుతదీపంలో దాచేద్దాంలే కానీ, వచ్చేసెయి.
నిన్నటి నీ చూపుల వలయం విసిరిన పారవశ్యంలో మునిగిపోవటం వదిలించుకోవటం ఎంత కష్టమో ఇప్పుడు నాకు.
ఒకొంత దూరాన్ని పాటిస్తూనే ..ఒకరినొకరు వెంటాడుకుంటూనే వుంటాము, ఎందుకిలా?
అక్షరాలతో అనువదించలేని భావం మనసులో దోబూచులాడుతోంది.
ఆకాశపు నీలిమంటలో చలి కాచుకుంటున్నానుగా .. నీ తలపుల పహరాలో.
ఊహలు, ఊపిరులతో గాలి గిరికీలు కొడుతూ, పూల బాసలో పరిసరాల్లో పరవసాలు ఒలికిస్తోంది.
ఆ వైపు మెరుపుల్ని కాదంటూ, ఈ వైపు ఉరుముల్ని వలదంటూ. ముసురేసే మేఘమాలల్లో తళుకుల తారంగం..చీకటి ఆకాశంలో నెలవంక సంతకాలు. ప్రపంచమంతా నిదురలో జోగుతుంటే, నేను మాత్రం నీ తలపుల్లో తూగిపోతున్నా, ఆలోచనల ఆవిరి అటుగా వెళ్ళి, కలానికి వెన్నెలని తాపడం చేసిందేమో, ఎటుచూసినా మోహనరాగాలే
ఎక్కడున్నా మధురోహల క్షణాల మాలలే.
ఎంత రాసినా నీ ఊసుల మకరందం ఊరుతుంటే, సౌందర్య సిరులని నెమరేసుకుంటూ,
అడుగుల సవ్వడిని నిరీక్షిస్తూ, మబ్బుల మధ్య ఈదుకుంటూ
అరవిచ్చిన లేయెదలో కలల రంగవల్లులు తీర్చిదిద్దుకుంటూ... అబ్బా
ఎన్నాళ్ళిలా తలపులు ?
ఎన్నేళ్ళి లా మేలుకొలుపులు ?
ఆకులన్నీ చప్పట్లు కొట్టటానికి సిద్ధమౌతున్నాయి ..మన ప్రణయగానానికి.
అయినా నువ్వు ఏమనుకుంటావోగాని ...!
ఇష్టంగా ఒక మాట చెప్పనా..!
వచ్చేయ్యి నీలో తప్పిపోతాను.
రాలిన పారిజాతాల సాక్షిగా..! విరబూసిన జాజుల సాక్షిగా..!
నీకోసం వేచిచూడటమే ...ఓ కవిత్వం నాకు.
Note:- ఈ కవిత కౌముది లోనిది  ఫీల్ నచ్చి అనుమతి లేకుండానే  ఈ బ్లాగ్ లో పోష్టు చేస్తున్నా ...అబ్యంతరం వుంటే తీసివేస్తాను  )

Sunday, May 28, 2017

కవిత్వమొక కాలాతీత కాంతిరేఖ

కవిత్వమొక కాలాతీత కాంతిరేఖ. ఒక మెరుపు. ప్రణాళికాబద్ధమైన వాటికి అది లొంగదు. సిసిరో అన్నట్లు అది ప్రకృతి నుంచే సరాసరి కవులకు అందుతుంది. ఆ వెలుగులో కవి జ్వలిస్తాడు. రూపాంతరం చెందుతాడు. తక్షణ అనుభూతిని కవి వజ్రంలా మెరిపిస్తాడు. నక్షత్ర వర్షం కురిపిస్తాడు. ప్రతి కవికీ ఒక ఫిలాసఫీ ఉంటుంది. అది సామాజికం కాదు. వ్యక్తిగతమైంది. వ్యక్తినిష్ఠమైంది.  “నిన్ను నీవు వ్యక్తీకరించుకోవడంలోని అసంపూర్ణత్వంలో ఆనందముంది” . భావనలో, అనుభూతిలో ఉన్న అసంపూర్ణం కాదది. అనుభవం తాలూకు అసంపూర్ణమది. ‘కవిత్వం పుట్టుకకు స్థలకాలాలు ఉన్నప్పటికీ కవి నుంచి వేరుపడిన తరువాత అది  ఒక స్వతంత్ర వ్యక్తిత్వాన్ని .ఒక పరిసరాన్ని పారవశ్యంగా సమీక్షిస్తాడు ‘నల్ల సముద్రంలో రాలిన తెల్లచంద్రుడు తీరం వేపు కొట్టుకొస్తున్నాడు, సహారా ఎడారిని వెంటేసుకొచ్చిన వైణికుడు నక్షత్రాల్ని  రాల్చుతున్నాడు,గాలి మౌనంగా ఉంది.. ఆకాశం ప్రేక్షకునిలా ఉంది’ అని తన మనసు పొరల్లోని జ్ఞాపక సుమం విచ్చుకోవడానికి ఒక వాతావరణాన్ని, అనుకూలాన్ని ఆయాచితంగా అందుకున్నాడు. అక్కడినించీ పరిసరాన్ని మరిపించే ఒక పరివేదన, ప్రశాంతంతో సమన్వయించిన ఒక కలత కలలా వస్తుంది.

‘నువ్వు గుర్తుకు వస్తావ్ నా జలసమాధిలో జీవానంతర పరీమళంలా నన్ను మరిచిపోతాను నక్షత్రాలన్నా రాలిన ఆకాశంలా” అంటూ చలిస్తాడు. సౌకుమార్యమన్నది స్వచ్ఛమైనది. గతాన్నీ భవిష్యత్తునూ అసరమైతే వెలిగిస్తుంది. వద్దనుకుంటే విదిలిస్తుంది. అక్షరాల గుండా ఒక సంగీతం ఆనందం దుఃఖపు జీర కలగలిసిపోతాయి.ఏదో సందర్భంలో మనిషి తన అస్తిత్వాన్ని గురించి ఆలోచనలో పడతాడు. శరీరం మనసు సానుకూల పరిస్థితిలో స్వరపరిచిన సంగీతంలా సానుకూలంగా సాగుతాయి. ఒక గాయం, ఒక వేదన, అనుకోనివి జరగడం, జరిగినవి అనుకోకపోవడం వంటివి మానవ జీవితానికి అనివార్యం. అనివార్యం నించే కళ జన్మిస్తుంది. అప్పుడు కవి తన అస్తిత్వ రహస్య అన్వేషణలో మునుగుతాడు. మహా సుకుమారమైన అనుభూతులకు అక్షర రూపాన్నివ్వడం . అనుభూతికి అలౌకిక స్పర్శనివ్వగలిగే అక్షరశక్తి అతన్ది. తన్మయత్వపు పల్చటి పొరలు విప్పుతూ ఆశ్చర్యపరుస్తాడు.‘మెత్తని చీకట్లో పారదర్శక రాగాలనేకం/ ప్రపంచం మౌనంగా నిద్రిస్తున్నప్పుడు స్వరాలు పరాగమై హత్తుకున్న గమ్మత్తయిన అలికిడి… ఇలా నైరూపయ అనుభూతికి.విస్పష్టమైన రూపాల్ని ఇస్తూ సాగుతాడు.వంకీలు తిరుగుతున్న హృద్యమైన వూపిరి, పలకరించే జ్ఞాపకాలు పక్షుల్లా వచ్చి ఓ వరసలో కూర్చుంటాయ్.. అన్నీ తెల్లనివే’ అంటాడు.అమూర్తాలకు మూర్తిమత్వాన్నివ్వడానికి విచిత్ర రస సంయోజన అవసరం. ఆ రసాయనం కవి దగ్గర మాత్రమే వుంటుంది. జీవితం దుఃఖమయం. ఎంతమంది తాత్వికులు ఎన్ని మార్గాలు చెప్పినా బతుకు మనిషిని గాయపరుస్తూ ఉల్లాసంగా సాగుతుంది. మనిషి పడే బాధని, ప్రకృతి పరిణామాన్ని నిశితంగా దర్శించి గాలి, మబ్బులు, ఆకాశం వింత వింత హొయలు చిమ్ముతూ అతని మనసు మీదుగా సాగుతాయి. స్పందనల్ని వాటికి అందించి పంపుతాడు.కవుల వూహలకు అంతుండదు. అంతుంటే అతను కవి కాడు. అనుకరిస్తే కవి కాడు. వూహ స్వతంత్రమైనది. మౌలికమైనది ఐతేనే అతను నిజమైన కవి.. మనిషి ఏకవచనం కాదు, అనేకవచనమంటాడు. ఎన్నో నేనులు కలిస్తే ఒక నేను అవుతాడు. ‘నేను నీలోంచీ… నీవు నాలోంచీ.. మనిద్దరమూ మరెవడిలోంచో… సామూహిక ఆత్మల సహస్ర విచ్ఛేదనలోంచి..’ఈ జననం వెనక ఈ జన్మ వెనక వున్న అనంత ప్రవాహాన్నీ ప్రదర్శిస్తాడు. ఒక తన్మయత్వం, ఒక స్వప్నపు వూహల్ని అక్షరాలని తాకుతూ వుంటుంది. దేన్నయినా భావించేటప్పుడు ఒక పారవశ్యపు కెరటం దృశ్యాన్ని కమ్ముకుంటుంది. ‘స్వప్న సరోవరంలో ఎవరదీ? పట్టుకుచ్చుల వింజామరల్ని భుజాన వేసుకుని నీళ్ళూపడానికి వస్తున్న మీనమా?’ అంటాడు. సమస్యని సాదాసీదాగా వర్ణించి ఫలానా పని చేస్తే పరిష్కారం దొరుకుతుంది అంటూ రాసేవన్నీ పేలవ నినాదాలుగా మారిన పాత కవిత్వ పరిచయం వున్న ఆధునిక కవులు కవిత్వ స్పృహతో వుంటారు. మౌనానికి కవిత్వానికి మధ్య వున్న తేడా వాళ్ళకు తెలుసు. కవిత్వమంటే ఏమిటో ఒక అద్భుత ద్వీపం నుంచి వచ్చిన అపురూపమైన ఆనందం కవిత్వమవుతుంది. ‘మేడ మీద కుర్చీ.. కుర్చీ చుట్టూరా వెన్నెల.. వెన్నెలకు పూసిన రెండు చేతులు.. నను నిమిరిన బిడియపు స్పర్శలు వెంటేసుకుని ఈ దారినే వెళ్తూంటుందప్పుడప్పుడూ..” ఇలాంటి మధుర మనోహర వూహల్లో మన మనసు వుల్లాస తరంగితమవుతుంది.
                                                                ప్రకృతిపరివర్తనకి, రుతుధర్మానికి మానవ రాగద్వేషాలకు అజ్ఞాత అంతరంగిక సంబంధముందని కవి చెబుతాడు. అది సహజంగా చెప్పినట్లుంటుంది. పనిగట్టుకు పరిశోధించినట్లుండదు.“వర్షాలకీ జ్ఞాపకాలకీ ఏదో గొప్ప సంబంధమే వుంది” అంటూ ఆలోచనలో పడతాడు. దేనికో ఒకదానికి లొంగిపోవడంలో జీవితం లేదు. ఆమోదించడం వేరు. ఆత్మ సమర్పణ వేరు. నిరంతర స్పృహతో జీవించడం వేరు. అసలు జీవితమంటే అదనీ ఇదనీ చాలా గొప్పదనీ దానికి ఎన్నో రంగులు పులిమి రచ్చకీడుస్తూ వుంటాం.“నన్ను నేను పట్టుకోలేకపోయినప్పుడే నేను జీవిస్తుంటాను..అప్పుడు కొన్ని భవిష్యత్ జ్ఞాపకాలు పలకరిస్తాయి...ఈ జీవితం పెద్ద గొప్పదేం కాదు..దీన్ని మళ్ళీ అనుభవించాల్సిన పని లేదు..వర్షాలకీ జ్ఞాపకాలకీ ఏదో గొప్ప సంబంధమే వుంది” అంటూ ఆలోచనలో పడతాడు. దేనికో ఒకదానికి లొంగిపోవడంలో జీవితం లేదు. ఆమోదించడం వేరు. ఆత్మ సమర్పణ వేరు. నిరంతర స్పృహతో జీవించడం వేరు. అసలు జీవితమంటే అదనీ ఇదనీ చాలా గొప్పదనీ దానికి ఎన్నో రంగులు పులిమి రచ్చకీడుస్తూ వుంటాం.“నన్ను నేను పట్టుకోలేకపోయినప్పుడే నేను జీవిస్తుంటాను,,అప్పుడు కొన్ని భవిష్యత్ జ్ఞాపకాలు పలకరిస్తాయి..ఈ జీవితం పెద్ద గొప్పదేం కాదు..దీన్ని మళ్ళీ అనుభవించాల్సిన పని లేదు”