. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, August 31, 2012

ఇ హేట్ మైలైఫ్ బుజ్జీ...ఈ క్షనం గుండె ఆగితే బాగుండని పిస్తుస్తోంది


గుండె పగిలింది....నీ కన్నీరు ఒలకటానికి నేను కారనమా
మైండ్ బ్లాంక్..మదిలో కొలువైన నీవు.. ఏంటిలా..?
గుండే గొంతుకలొ పూడుక పోయింది..
ఈ క్షనం గుండె ఆగితే బాగుండని పిస్తుస్తోంది
అసలే విధి అడ్డంగా ఆడుకొంటున్న క్షనానా ఇదేంటి
అన్నీ నాకే ఎందుకిలా జరుగుతాయి.. నెనేం తప్పు చేశాను
కన్నీటి సాక్షిగా ..నావళ్ళ నా కాదు అని చెప్పినా అర్దం చేసుకోవా..?
ఒక్కొక్కటిగా తగులుతున్న దెబ్బలను తట్టుకోలేను
ఆ ఓపిక నసించింది..నీరసంగా మాటలు పెగలటంలేదు
మనిషిగా...ఈ రకంగా దారుణంగా ఓడిపోతానని తెల్సు
కాని నేనోడి నిన్ను గెలిపిస్తాను కాని.. నీ కన్నీటికి కారనం
నేనౌతా అని అవుతున్నా నన్న నిజం ..
నేను తీసుకున్న ఓ నిర్నయం
ఈ ప్రపంచం తో తీరబోతున్న రుణం ఇదే అనుకుంటా..
విధి నాతో ఆడుకుంటుంది అనుకున్నా కాని
ఇలా నా అంతం చుసేందుకు చెలగాటం ఆడుతుంది అనుకోలేదు..
అర్దం చేసుకుంటుంది అనుకున్న మనిషి అర్దం చేసుకోకపోతే..
చివరకు నాకు మిగిలింది ఆనిర్నయమే...జాగ్రత్త సుమీ
నా ప్రానం ఉండేది కొద్ది రోజులైనా ఇంక నీకీ పరిస్థితి రాదు
రానీయను .. .ఏమనాలో ఏం రాయాలో అర్దం కావడం లేదు
రోజులు గడియలు దగ్గర పడ్దయాని తెలుస్తోంది
ఆరోజెప్పుడాని ఆత్రంగా ఎదురు చూడటం తప్పించివిరహ వేదనతో నాకోసం ఎదురు చూసున్న నీవుసిగ్గులొలికే చిన్నారి..వయ్యారంగా నడచి వచ్చి
అందంగా తయారయ్యి..నాకోసం ఎదురు చూస్తోంది
వలపులన్నీ మూటగట్టి బొడ్డున మడికట్టి
ముగ్ద మందారంలా ఓరచూపులుచూస్తొంది
మదిలో భావలు చదివతరమా .మాటలు చెప్పతరమా
అసలే అందాల రాసి...సిగ్గుల మోగ్గ సింగారించుకొని
ఓరగా నాకోసం ఎదురు చుస్తున్నప్పుడు దూరంగా
ఈ దృస్యాలను కనులారా వీక్షించేందుకు రెండు కళ్ళూ చాలవు మరి
పెళ్ళీ కూతురు గెటప్ లో ..
విరహ వేదనతో నాకోసం ఎదురు చూసున్న నీవు
చూస్తున్న ఆ ఎదురు చూపుల్లో భావలు.
చదవాలని చదివి మురిసి పోవాలని సొంతం చేసుకోవాలని
ఎప్పటినుంచో కన్న కలను నిజమైపోతున్న వేల
చల్లని సాయం సమయాన....వెన్నేల వెల్గుల్లో
జాబిలమ్మ వెలుతురులో మరో జాబిలమ్మ..ఒడిలో చేరే మదురక్షనాలకోసం
ఆ ఎర్రని మేడిపండులాంటి పెదాలు నా సొంతమా అన్న ఊహే మధురం అయితే
అవి నాసొంతంఅని అదే కాసేపట్లో నిజం కాబోతున్న వాస్తవాన్ని ..
ఇంకా నమ్మలేకున్నా ప్రియా....నీ వెచ్చని ఓడిలో సేదతిరే ఆ క్షనకొసం
ఆచల్లని వెల్లేల కాంతుల్లో ఈ జాబిలమ్మ ముక్కుపుడక
తలుక్కున మెరిసి నన్నురమ్మని తొందర పెడుతోంది
దూరం నుంచి ఈ వయ్యాని భామ అందాలు ..
జీవితాంతం సొంతం చేసుకునే మదుర క్షనాలు..
నీ వెచ్చని కౌగిలిలో సేదతీరే అద్బుత గడియలు

ప్రియా నా మదిలో మూగగా రోదిస్తున్న నీ జ్ఞాపకాల సాక్షిగా


ప్రేమంటే ఎప్పటికీ తీరని భాదేనేమో....
ప్రేయసి వలపుల్లో తడవాలనే తపన
ప్రియా నీవు దూరం అయిన నీజ్ఞాపకాల సాక్షిగా
కన్నీటితో తడచిపోయిన నా కన్నుల సాక్షిగా..
ప్రియా నా మదిలో మూగగా రోదిస్తున్న నీ జ్ఞాపకాల సాక్షిగా
నా మది వేదన అంతంలేనిది ప్రియా
అంతంకానిది...ఆరిపోని అగ్నిలా రగులుతూనే ఉంటుంది
మన కన్నీరే మనల్ని నిలువునా మోసం చేస్తున్న క్షనాలివి ప్రియా
అసలు ప్రేమంటే ఏంటి ప్రియా... నమ్మించి మోసం చేయడమా
ఒకప్పుడు నేనున్నా అన్నావు . మరిప్పుడు ఆ నువ్వు ఏమయ్యావు ప్రియా
క్షన క్షనానికి ఇంకా నీకోసం ఎదురు చూస్తుంటా
ఆ ఎదురు చూపుల్లో నిజాయితీ ఉంటే
నా స్నేహం వాస్తం అయితే..నా ప్రేమలో నిజాయితి ఉంటే
నీవు కచ్చితంగా వస్తావు.. నా చెంతకు చేరుతావు..
ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నా నీవు దరి చేరలేదంటే
నా ప్రేలో లోపం .. నాస్నేహం లో నిజాయితీ లేదా..
ప్లీజ్ లేదు అనకు తట్టుకోలేను ..
వస్తావనే ఊపిరి ఆగే వరకు ఎదురు చూస్తాను ప్రియా..?
"ఎవరిమ్మన్నారు నీ మదిలో నాకు స్థానం.
నన్ను బయటకు తోసేసి నీ కన్నీటిని తుడిచేసుకో" అంటోంది ఎంతో నింపాదిగా...
ప్రేమించటం సులువే కాని మరుపే చాలా కష్టం.
నువ్వు ఎదురుగా ఉంటె నీ నుండి తప్పించుకు పారిపోగలను.
నా మన్నస్సులో ఉన్నావే నేను ఎలా వెళ్ళగలను?
ఎక్కడికని వెళ్ళను చెప్పు ప్రియా ...?

Tuesday, August 28, 2012

"కడుపులో కన్నీళ్ళు దాచుకొంటున్నాను ప్రియా

మనం ప్రాణంగా ఇష్టపడే వాళ్ళు మన తప్పు లేకుండా మననుండి విడిపోదామనుకుంటే ఆ బాదా,కష్టం మనసు లేని వారికైనా వస్తుంది.అ క్షణంలో ఏదోఒకటి చేసుకోవాలి అనిపిస్తుంది. మరి భరించలేనపుడు చచ్చిపోవాలి అనిపిస్తుంది.కాని అ సమయంలో కూడా పిచ్చిమనసు అవతలి వారి గురించే ఆలోచిస్తుంది.విడిపోవడం బాహ్యంగానే అయిన వారి ఙ్నపకాలు ఎప్పటికి తీపిగురుతులుగానే మిగిలిపొతాయి. కాని మళ్ళి భవిష్యత్తులో దేనినైన పొగొట్టుకునేటప్పుడు మాత్రం బాదా అనేది చాలా భయంకరంగా ఉన్న ఆ బాదాను చుపే కన్నిళ్ళు మాత్రం కడుపులొనే ఉండిపొతాయి.

ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్తితులు అలాంటివి.పరిస్తితులు పాముల్లా మన చుట్టూ ఉండి సూటి,పోటి మాటలాతో కాటెస్తాయెమో అనే భయం.అందుకే "కన్నీళ్ళను కూడా కలల్లా ఆ సమయంలో కరిగిపోమంటుంది మనసు". నిజమే! కాని జరిగిన తప్పులు ఎన్నైన,జతను వీడిన మనుషులు ఎవరైనా అది మన మంచికే అనుకుంటే అది కొంతకాలం తరువాత మానడానికి అవకాశం ఉంటుంది.కాని కొన్ని విషయాలు ఎంత మరచిపోదామన్న మరపురాదు. ఎందుకంటే గతం మన నీడవంటిది.ఏదుటివారితొ ఏమ్మాట్లాడుతున్న, ఏంత సంతోషం నటించినా అవతలి వ్యక్తి మనపై ప్రేమ చుపించినపుడుడల్లా గుర్తుకు వస్తుంది గతంలో చేజారిన క్షణలు,మరపురాని ఙ్నపకాలు.
బహుసా ఇదేనేమో జివితం అంటే...మనసులో ఎముందో కనుక్కొవడానికి ఏమందులు ఉండావేమోగాని,మనసాక్షికి తెలుసుస్తుందిగా...చేసిన నేరాలు,మొసపోయిన క్షణలు,చేజారిన బందాలు.ఓరున కురిసే వానలో ఉప్పెన ఉందోలేదో,ఎదురువచ్చే శకునంలో మంచి ఉందోలేదో,ఆగిపోని కాలంలో వేగం ఉందోలేదో,తెలుసుకోలెము, వాటికి తెలియదు.ఎందుకంటే వాటికి జీవం,జీవితం రెండు లేవు.కాని మనిషి ఆలోచనలో అంతరంగం అనేది ఆ మనిషి అంతరాత్మకు కచ్చితంగా తెలుస్తుంది.చేసింది తప్పో, ఓప్పొ తేలుసుకొలేని వాడైతే తను మనిషే కాదు.కాని తెలుసుకొని పశ్చాతాపం కొరేవారైతే ఖచ్చితంగా అసమయంలో ఎంత సమర్ధించుకున్నా కళ్ళలో నీళ్ళు వద్దన్నా బయటకు వస్తాయి.అపరిస్తితులలో ఇంక "కడుపులో కన్నీళ్ళు ఎందుకు దాచుకొవడం" అనిపిస్తుంది.

నిర్దయగా నా జ్ఞాపకాలను చిత్తుకాగితాలు చేశావు ప్రియా

ఏకాంత సాయింకాలపు పలుచని వెలుతురులో
హృదయంలో విరిసిన సన్నజాజుల గానంలా
ఓ జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.

గుప్పిట రహస్యాలను విప్పిన నూత్న యవ్వన వనాల
పరిమళాలు విరజిమ్మే శీతాకాల రాత్రులలో
నీ సాంగత్యపు కొలిమిలో నన్ను నేను
కొలిమిలో కాలిపోయి, కరిగించుకొని మరిగించుకొనే క్షణాన
వర్షించిన సౌందర్యానందం నిన్నూ నన్నూ
ఆకాశపుటంచుల వరకూ విసిరికొట్టిన
జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.
కాని ప్రియా ఆజ్ఞాపకం... నిర్జీవంచేశావు..
నిర్దయగా నా జ్ఞాపకాలను చిత్తుకాగితాలు చేసి
నాహృదయాన్ని దోచి..వలచి వచ్చిన నన్ను.
నిన్ను నిలదీసి అడుగలేని నా నిరాశక్తత తెల్సునీకు
నా వల్ల నీవు క్షనకాలం కూడా భాద పడకూడాదు
నేను జీవితకాలం అయినా ఆ భాదను బరిస్తాను ప్రియా
ఊరడించి మోసం చేసి ఓడించి ఒంటరినిచేశావు ప్రియా..
నేనోడి పోయాను ప్రియా గెలుస్తాను అన్న నమ్మకంలేదు
నీవు వోడించావు.. అందుకే గెలవాలన్న ఆశే నన్ను గేలి చేస్తుంది ప్రియా

ప్రియా నీవు నాయదపైవాలి గుండె చప్పుడు వినాలని ఉందా..

ప్రియా నీవు నాయదపైవాలి గుండె చప్పుడు వినాలని ఉందా..
ఆగుండె చప్పుడు ను ట్రాన్స్ లేట్ చేస్తే ఇలా ఉంటుంది ప్రియా.

మనస్సులొని మౌనమా...పలుకలెని భావమా,

కనులలొని కావ్యమా..బ్రతుకులొని బంధమా,

చెరిగిపొని స్వప్నమా..మరువలెనీ స్నెహమా,

నన్ను మరచిపొకు నెస్తమా.మదిలో ఎప్పటికీ నిలిచిపోయిన నాప్రాణమా.

నీను నన్ను మరచి పోయిన క్షనాన ఈ ఊపిరికి అర్దం లేదు ప్రియా

రగులుతున్న అంతరంగ ఘోష నీకు చెప్పాలనే ప్రియా

అదృష్టమో దురదృష్టమో కానీ ఎందరో మనసులోతులూ, ఆ మనసుల్లో గూడుకట్టుకున్న అంతులేని వేదనా ఒక్కోసారి గుర్తుకొస్తున్న జ్జాపకాల నీడలు మనసులో చెరలరేపే అలజడులకు .. ప్రతిక్షనం ఆందోళన పడల్సి వస్తోంది

ఏ ఒక్కరి వ్యక్తిగత విషయాలూ వేరొకరితో పంచుకోలేం, భాదల్లో తచ్చాడి తానై వచ్చిన భాదపడకు నేనున్నా అంటూ తీయ్యని పలుకులతో పలుకరించిన అ చిలక పలుకులు ఎలా మరువను భాదల్లొ ఉన్న నాకు పలుకరించి మనసుపులకరింపజేసి .. అగ్గిరాజేసి అల వదిలేసి వెళ్ళావెందుకు ప్రియా.నన్నిలా ఒంటరిగా వదిలేసి తానే మరో భాదగా మిగిలి పోతే.... చెబితే ఇలా ఉంటే ఆభాద అనుబవించిన వాడికే తెలుస్తుంది
నాతో ఉన్న ప్రపంచం ప్రతీ క్షణం ఆనందంగా ఉండాలని కోరుకునే నేను నా చుట్టుపక్కల ఉండే అందరి మనస్సుల్లోని వేదనల్ని జీర్ణించుకోలేకపోతున్నాను.నిజమే జీవితం ఎన్నో సవాళ్లని ముందు పెడుతుంది!సమస్యలూ, భిన్న మనస్థత్వాల వ్యక్తులూ, వారు సృష్టించే నరకమూ, మన నియంత్రణలో లేని పరిస్థితులూ… అన్నీ కలగలిపి నిండు జీవితాల్ని మొండిబరుస్తూనే ఉంటాయి.కానీ జీవితం ఆ సమస్యలే కాదు, ఆ పాత జ్ఞాపకాలే కాదు, లేదా ఈ క్షణమూ మెలిపెడుతున్న బాధాకరమైన పరిస్థితులే కాదు.నమ్మకంగా ఈ మనిషిని నమ్మొచ్చు తానే నాజీవితం .. అనుకుంటాం .. ప్రపంచంలో తాను తోడుంటే చాలు అనుకొని సంతోషించే లోపే..కారనం ఏదైనా దూరం కావడం జీవితంలో తగులుతున్న దెబ్బలకు మరో భాదాకరమైన తీయ్యని భాదగా మిగిలి పోతుంది..ఆమనిషికి ముందే చెప్పా..నాకు దగ్గరైన వాళ్ళు దూరం అవుతాను అని నావిషయం లో అలా జరగదూ అంటూనే ..భాదాకరమైన పరిస్థ్తితుల్లో దూరం అయి గుండెళ్ళో భారంగా భాదగ మిగిలిపోతుంది

ఎంత బాధలో ఉన్నా మనస్సులో ఆనందాన్ని నింపుకోగలిగే ప్రజ్ఞ ఎప్పటికి సాధించగలం? బాధల్ని మోయడం తప్ప ఇంకా జీవితంలో మిగిలిందేం లేదా?జీవితాంతం గడిచిపోయినవో, ఇప్పటివో బాధలే మోస్తూ ఉండాలంటే నా తోటి స్నేహితుల్లాగే నేనూ ఎంత బాధపడుతూ కూర్చోవాలో! అవును… నిజం చెప్తున్నాను… నేను బాధపడడానికి వంద కారణాలు ఇప్పటికీ నాకున్నాయి!! కానీ నేను భాదల్లో ఉన్నప్పుడు తానంతటా తానే ..పరిచయం చేసుకొని మనసుకు దగ్గరై..నేనున్నా అంటూ ఇచ్చిన ఓదార్పు మాటల్లో చెప్పలేనిది..ఎంత చెప్పుకున్నా తరగని తీయ్యని జ్ఞాపకం..అమె పరిచయమే . ఓ అద్బుతం.. మరి అకారణంగా దూరం అవ్వడం
చిన్నదైనా, పెద్దదైనా ప్రతీ సమస్యనీ మనస్సులోకి లోతుగా తీసుకుంటూ మనల్ని మనం ఎంత వేదనలో కుంగదీసుకున్నామో ఆలోచించండి!నా దృష్టిలో ఆనందం అనేది.. స్విచ్ ఆన్, ఆఫ్ లాంటిది. ఇదే థీరీని నేను కొన్నేళ్లుగా నమ్ముతున్నాను. ఈ థీరీ కరెక్టే కాదో టెస్ట్ చేసుకుందామని చాలా బాధాకరమైన సందర్భాల్లోనూ మనస్సులో ఆనందాన్ని నింపుకుని నేను చేస్తున్న విఫల ప్రయత్నాలన్నీ నన్ను ప్రతిసారి వెక్కిరిస్తుంటాయి..పిచ్చోడా అని..నిజమేకదా..నన్ను కాదని వాళ్ళ సంతోషాన్ని వెతుక్కొని వెళ్ళిన వారికోసం నామనసు పడుతున్న వేదన ఎలా తెలపాలి అలా తెలుపలేని నేను నిజంగా పిచ్చోడీనే కదా .

ఈ క్షణం నా ఆలోచన ఇలా సాగుతోంది అనుకుందాం.. "ఎందుకు నీ లైఫ్ ఇలాగైపోయింది… ఎన్ని కష్టాలొచ్చాయి.. అస్సలు నీ లైఫే ఎందుకు ఇలాగుండాలి.." ఇలా రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. అవే అలోచనలు రిపీటెడ్‌గా మైండ్‌లో తిరుగుతున్నాయనుకుందాం. నా మానసిక స్థితి పుట్టెడు కష్టాల్లో కాక గంపెడు ఆనందంలో ఉంటుందా? ఒక్కోసారి హేపీగా ఉండే వాళ్ళను చూస్తే ... వింతగా అనిపిస్తుంది.. ఎలా ఉంటారు ఇలా .. ఎవరైనా ఇద్దరు ఆత్మీయంగా మాట్లాడుతుటే నాతో ఎందుకిలా ఉండరు అని నామీద నాకు చిరాకేస్తుంది.... నేనేం తప్పులు చేయలేదు. గుండెల నిండా ప్రేమ ..తానే లోకం అనుకున్ననే మరి ఇప్పుడేంది ఇలా..ఎక్కడ దూరం అవుతావో అన్న కంగారే గాని..తనను ఇబ్బంది పెట్టాలని కాదు.. అంతగా అర్దం చేసుకున్న అమె ఎందుకిలా ఆపార్దం చేసుకుంది.. నన్ను మర్చిపోయి తన స్నేహితులతో తానూ హేపీగానే ఉంది అస్సలు నాజ్ఞాపకాలు తనకు గుర్తే లేనట్టు.. తానెవరో తెలీనట్టు ...కాని నేనెందుకిలా ప్రతిక్షనం ప్రతినిమిషం తన కోసం తన తీయ్యని పిలుపుకోసం అల్లాడుతున్నా..ఇదేనా ప్రేమ అంటే.. తానే ప్రేమించాను అంది తరువాత .. అలా అన్నానా.. ..స్నేహాన్ని ప్రేమ పేరుతో అపహాస్యిం చేస్తున్నా అన్న క్షనాన భూమి బద్దలైనట్టు గుండెళ్ళో డైన మేట్లు పేలి హృదయం చింద్రమైనట్టె చెప్పలేని చెప్పుకోలేని భాద.. ఎవరికి ఎలా చెప్పుకోవాలి చెప్పుకుంటే ఎవరు బా భాదకు సొల్యూషన్ చూస్తారా అది వల్ల అవుతుందా ఏంటో నాది పిచ్చి ప్రేమ .. అబద్దాన్ని నిజం అనుకున్నానేమో తాను అన్నట్టు.. తానంతటా తానై వచ్చి . అలలాగా వచ్చి కలలాగా మిగిలి గుండెళ్ళో చెప్పుకోలేని భాదగా మిగిలి పోయావా ప్రియా


Saturday, August 25, 2012

....ఎప్పుడైనా గుర్తుకొస్తానా బుజ్జీ..?

భాదల్లొ ఉన్ననాకు ఓదార్పులా కొత్త పరిచయం కాలం ...కొత్తగా పరిచయం అయి కొత్త లోకాలను చూపించిన ఓ స్నేహం.... తన అందమైన స్నేహంతో ఎక్కడీకో తీసుకెళ్ళింది...తన ప్రేమలో గొంతుదాగా దిగిన తవురువాత నా చేతిని విదిలించుకొని ..కొత్త కలల ప్రపంచాన్ని వెతుక్కుం
టూ పోయింది ..అప్పటీకే పీకలదాకా ప్రేమలో మునిగిన నేను తనకోసం వెనుక్కు పరిగెత్తా.. అక్కడ తన కొత్త స్నేహితులతో హేపీగా వుంది.. పలుకరించినా పలుకనంత బిజీగా..అప్పుడప్పుడూ పలుకరించినా ముక్తసరి సమాదానం ఎదురైంది..తాను హేపీగా ఉండాలని తనతోపాటు వెనుక్కు వెళ్ళీన వాన్ని తిరిగి మళ్ళీ.. పీకల లోతువరకు వచ్చా..ఎటూ మునిగిపోతాని తెల్సు.. తన కలల ప్రపంచం కొత్త స్నేహితులని ఎందుకు ఇబ్బంది పెట్టాలని.. మళ్ళీ నావైపు వెనిక్కి రాబోదాని అంతే...కొంతకాలం ఎదురుచూశా నిరాసే ఎదురైంది....ఇకరాదని ఇప్పుడీప్పుడే తెలుస్తోంది ఎప్పటికైనా మునిగే వాడినే .. పూర్తిగా మునిగాక ఎప్పటికైనా గుర్తుకొస్తే..ఒ చిన్న గులాబీ పువ్వు నేను మునిగిన ప్లేస్ లొ పెట్టి ఒక్క కన్నీటీ బొట్టురాలుస్తందన్న ..ఆశ.. ఏమో తెలీదు నేను గుర్తుండాలి కదా..?

ఓదార్చే ధైర్యం నీవు లేక ఒడిపోయాను ప్రియా


ప్రియానా ప్రాణం నీవే
ప్రణయం నీవే
ప్రళయం నీవే నీ...వే నీ ...........వే
కట్టలు తెగిన కన్నీళ్ళు చీకట్లో కలిసిపోతుంటే
ఓదార్చే ధైర్యం నీవు లేక ఒడిపోయాను ప్రియా
గది గోడలు మౌన సాక్షులుగా మిగిలిపోయాయి ప్రియా
ప్రియా జ్ఞాపకమై గుండెలో చేరి
మౌనాన్ని మంత్రంగా వేసి నిశ్సబ్ధం గా మరలిపోయావు

ప్రియా జ్ఞాపకాలు గుండెల్లో చేరి తీయని గాయం చేస్తున్నాయి

ప్రియా నీ మాటలతో ఆ మౌనం వీడేదెప్పుడు..ప్రియా

నీ ఓదార్పుతో నా గాయం మానేదెప్పుడు ప్రియా

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని..నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని

నీ వంటే ప్రాణమని నీతోనే లోకమని...నీప్రేమ లేకుంటే బ్రతికేది ఎందుకని..
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప ....కన్నులకు కలలు లేవు నీరు తప్ప..
మనస్సు ఉంది మమత ఉంది ......పంచుకునే నీవు తప్ప..
ఊపిరి ఉంది ఆయువు వుంది..ఉండాలనే ఆశతప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంటేనా..ప్రేమిస్తేనే సుదీర్గనరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్ప...చివరికి ఎమవ్వాలి మన్ను తప్ప

నీవంటే ప్రాణమని నీతోనే లోకమని...నీప్రేమ లేకుంటే బ్రతికేది ఎందుకని..
నడిచొస్తానన్నావు ..మళ్ళోస్తానన్నావు..జంటై మరొకరి పంటై వెళ్ళావు
కరునిస్తానన్నావు వరమిస్తానన్నావు...కరువైమెడకు ఊరి అయిపోయావు
దేవతలోను ద్రోహంఉందని తెలిపావు..దీపంకూడా దరియిస్తుందని తేల్చావు
ఎవరిని అడగాలి నన్ను తప్ప..ఎవరిని నిందించాలి నిన్ను తప్ప..

నీవంటే ప్రాణమని నీతోనే లోకమని...నీప్రేమ లేకుంటే బ్రతికేది ఎందుకని..


నా మనసు పడుతున్న వేదనను నీవు అర్దం చేసుకోగలవా ప్రియా


ప్రియా చూసే ప్రతి చూపులో నువ్వే కనిపిస్తు

వినే ప్రతి మాటలో నీ పిలుపే వినిపిస్తుంటే

ప్రియా మనసు పడే వేదనని ఎలా వినిపించను నీకు
కనులు మూసుకుని..నా మనస్సుతో ఆలోచించు ప్రియా
నీవే కావాలని నా మనస్సు ఎదురు చూపులు నీకేం తెల్సు

కళ్ళలో ఉన్న నీ రూపాన్నే చూస్తూ ఉన్నా ప్రతి క్షణం
ప్రియా ఊపిరి ఆగే లోపు ఒక్కసారైనా..
నా కళ్ళెదుట నిలిచిన నిన్ను చూడాలని
గొంతులో పలికే భావాన్ని నీకు వినిపిద్దామనుకుంటూన్నా

ప్రియా మనసులోని అలజడి తెలుసు కుంటావనుకున్నాను
కాని ఆర్ధం చెసుకునే ఆ మనసే నీకు లేదని అనిపిస్తోంది
నామనసు తెలిసిన నీ ఎందుకు గొంతు మూగ పోయింది

ప్రియా నీ ప్రేమతో నిండిన నా మనసేమో నీకోసం మారం చేస్తుంది ..
నేనేలా ఉండగలను మాట్లాడకుండా అని..సమాదానం చెప్పు ప్రియా
నాదైన గొంతుని ఆపగలిగాను కాని
ప్రియా నాది కాని ఈ మనసుని ఎలా ఆపగలను ?
నామనస్సు ఎప్పుడో నీదైపోయింది.. అది నామాట వినటంలేదు ప్రియా
నీతో మాట్లాడలనుకునే మాటలని గుండెల్లోనే అదిమిపెడుతుంటే
ప్రియా కన్నీరై కన్నుల్లో ఉన్న నీరూపాన్నే అభిషేకిస్తున్నాయి
ఎందుకో నీ కోసం కన్నీరు కార్చినా ఆనందంగానే ఉంది
ఎందుకంటే నీ మనసుని తాకలేని నా మాటలు
ప్రియా కన్నీరై కన్నుల్లో ఉన్న నీరూపాన్ని తాకుతున్నందుకు..
నా మనసు పడుతున్న వేదనను నీవు అర్దం చేసుకోగలవా ప్రియా

నీ ఓదార్పుతో నా గుండె గాయం మానేదెప్పుడు ప్రియా


ప్రియా మనసుకేమో.. మరుపే లేదు
కంటికేమో కునుకే రాదు
ప్రియా మనసుకేమో.. మరుపే లేదు
ఎక్కడున్నావంటూ నిన్నడుగుతోంది మనస్సు ప్రియా
ప్రియా కన్నీటికి కారనం చెప్పలేక.. నీవేమయ్యావో తెల్సుకోలేక
నీవులేక ప్రతిక్షనం ఒంటరి తనం ఒడి చేరుతుంది
సరదాలు సంతోషాలను కాలదన్ని..మనస్సు ఒంటరిగా ఉండలని చూస్తోంది
ఎన్నటికి నిన్ను వీడనంటూ..ఏకాంతం కౌగిలించుకుంది ..
ప్రియా జ్ఞాపకమై గుండెలో చేరి మౌనాన్ని మంత్రంగా వేసి నిశ్సబ్ధం గా మరలిపోయావు
జ్ఞాపకాలు గుండెల్లో చేరి తీయని గాయం చేస్తున్నాయి ప్రియా
నీ మాటలతో ఆ మౌనం వీడేదెప్పుడు ప్రియా
నీ ఓదార్పుతో నా గుండె గాయం మానేదెప్పుడు ప్రియా

ప్రియా నా ఎదపై నువ్వు వాలితే...నా ప్రపంచం మొత్తం నీదవదా


ప్రియా నీవు అడుగిడగానే దారిలో
వసంతం విరియదా ?

ప్రియా చిలిపి చూపులు తాకిన
వలపు తలపులు సైతం చినబోవా ?

ప్రియా విరిసిన పెదవుల నవ్వులలో
హరివిల్లు లెన్నో తలపింపవా?

ప్రియా నీ అందమైన మోము కోసం
చందమామ దిగి రాదా ?

ప్రియా నా ఎదపై నువ్వు వాలితే
నా ప్రపంచం మొత్తం నీదవదా ??

ప్రియా నిండు పున్నమిలో నువ్ పండు వెన్నెలవే,
నిండు గోదారిలో తేలియాడు అలలపడవవే,

నీటి అలలపై తేలియాడు వెండి వెన్నెల,
నీ ప్రియా మోముచూసి ఉలికిపడుచుండ !

నీటిపై ప్రతి బింబంలా మారె కదా
చెలీ నీ నీడచందమామ

ప్రియా నీ మోము తాకి మురిసి మెరిసేందుకు !
పిల్ల తెమ్మెరలు నీ చెక్కిలి సవరించి సరసమాడవా !

ప్రియా నీ మేను తాకి పరిమళాలు మోసుకొస్తున్న
పిల్లగాలులు పూలకు సైతం సుగంధాలు పులుముతున్నాయి
,
ప్రియా అప్రయత్నంగా అడుగులు వేసాను
నన్ను నేను మరచి నీకోసం తపిస్తూ ,
నా ప్రాణ సఖిని చేరటానికి నిను చేరానని తలచిన
మరుక్షణమాగిన ఉపిరి వేణువూదునేమో ప్రియా !!

Friday, August 24, 2012

ప్రియా కడసారిగా కనుముసిన క్షణాన నా హృదయాన్ని అడుగు


ప్రియా నిను తొలిసారి చుసిన క్షణం కోసం......

.ప్రియా నీ రూపం మరువలేని నా కనులని అడుగు .......

నీ జ్ఞాపకాల కోసం...

తలచుకొని క్షణమంటూ లేని కాలాన్ని అడుగు.......

ప్రియా నీ ఫై ప్రేమ కోసం.....

మదిలోని వెలకట్టలేని నీ రూపాన్ని అడుగు......

ప్రియా నిను ప్రేమించిన కాలం కోసం... ప్రియా

ప్రియా కడసారిగా కనుముసిన క్షణాన నా హృదయాన్ని అడుగు ....
ఎలా అడిగిన ....ఏమని అడిగిన ....

ప్రియామదిలోని కొలువైన రూపం చెరిగిపోదు ......

వేరొక రూపం ధరి చేరదు ......ప్రియా

Thursday, August 23, 2012

ప్రియా చెమ్మగిల్లిన కళ్ళు అగుపించటం లేదు..?


ప్రియా"..ఏమైందో ఏమో
ఉన్నట్టుండి ఆ చెమ్మగిల్లిన కళ్ళు
అగుపించటం లేదు
ప్రేమ నిండిన ఆ అందమైన కళ్ళు
లోగిల్లై ..వాకిల్లుగా మారి పోయిన చోట
దేని కోసమో వెదుకుతున్నట్టు
ప్రియా ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్టు
అలుపు సొలుపు లేకుండా
వెంబడించినట్టు అనిపించింది
అయినా మనకు తెలియకుండా
మనల్ని మరొకరు చూడటం ఎంత బావుంటుందో
ప్రియా అదో స్మరనీయమైన సన్నివేశం
అదో మోహావేశపు ఆలింగనం
మనం అనుకుంటాము కానీ
కొన్ని వేల కళ్ళు
ప్రియా మనల్ని నిశితంగా గమనిస్తుంటాయి
గుండెలను గుచ్చుకునేలా చేస్తూనే ఉంటాయి
నడిచినా ..సంచారం చేసినా
ప్రియా లోకాన్ని స్పృశించినా
నిదురలోకి జారుకున్నా
ఆ కళ్ళు మాత్రం కలలో కూడా
కమ్మని కబుర్లు చెబుతాయి
హృదయపు సముద్రం మీద
ప్రియా అలల సంతాలు చేస్తాయి
గోదావరిగా మారిన
గుండెల మీద వాలిపోతాయి
మరిచిపోని సంతకాలు చేస్తాయి ప్రియా

పుట్టాను మరి నా చావు ఎప్పుడో ..?


నన్నోడీస్తావు .. నన్నూరడిస్తావో అని ఎదురు చూస్తున్నా ప్రియాప్రియా నీ జ్ఞాపకాల ప్రవాహం..
నా గుండె గదిలో ఏ మూలో తచ్చాడుతూనే ఉంటావు
వెలుగులు నింపుతూనే వుంటావు
మనసు తలుపులు తెరిచి నిన్ను పంపించలేను
మది అంధకారం చేసుకోలేను
కాని నీవే నన్ను కాదని దూరంగా ఉంటున్నావు
ప్రియా ఏకాంతంలో నిన్ను తలచి మైమరచిపోతుంటాను
ఒక్కోసారి నాలో నేను నీతో ముచ్చట్లు చెపుతూంటాను
నాలో ఎప్పటికీ ఆరని జ్యోతివి నువ్వు ప్రియా
ప్రియామది నిండిన జ్ఞాపకాల హారతి నువ్వు
అందుకేనేమో నా ఆత్మీయ నేస్తమా….. నిన్ను
గుండె గదిలో ఓ మూల బంధించాను!
నువ్వెప్పటికీ నాలోనే వుంటావుకదా... అప్పుడు
ప్రేమజ్యోతివై వెలుగులు నింపుతావో
ఆరని అగ్నికీలవై మదిని దహిస్తావో...
అంటూ నీ చల్లని పిలుపుకోసం ఎదురు చూస్తున్నా ప్రియా
దుక్కంలో నిన్ను దూరం చేసుకుంటున్నానో ..
బాదల్లో బందీగా మార్చుకున్నానో తెలియడం లేదు ప్రియా
నీవు గుర్తిచ్చిన ప్రతినిమిషం కర్సవుతున్న కన్నీటీ సాక్షిగా
నన్నోడీస్తావు .. నన్నూరడిస్తావో అని ఎదురు చూస్తున్నా ప్రియా

ప్రియా నీవు నామనసులో బందీ అయిపోయావు


ప్రియా ఎంత నిశ్శబ్దంగా
నా జీవితంలోకి వచ్చావో
అంతే నిశ్శబ్దంగా వెలుతున్నావు
అడక్కుండానే వచ్చావు..
భాదల్లో ఊడడించావు..
బందాన్ని ఎర్పరిచావు..
ప్రియా నీవు నామనసులో బందీ అయిపోయావు
వస్తూ వస్తూ నే బోలెడు వసంతాన్ని
బతుకంతా వర్షించి నన్ను నీవాడిగా మార్చావు ప్రియా
ప్రియా ప్రతిక్షనం నీ ఆలోచనలతో పిచ్చివాడిని చేస్తున్నావు..
నీవు మిగిల్చిన జ్ఞాపకాల పూదోటలో
ప్రతి జ్ఞాపకం ఓ మొక్కై పూసినట్టు,,. పూసి రాలినట్టు
ఎన్నో జ్ఞాపకాలు గుండెల్లో పదిలపర్చావు
నిజానికవి జ్ఞాపకాలు కాదు
గుండెళ్ళో మ్రోగుగున్న నీ అందెల రవళుళు ప్రియా
ఒకప్పటి మాటల ప్రావాహం ఆగిపోయిందేం ప్రియా
నావల్ల తప్పుజరిగితే మనస్సులో పెట్టుకొని ఊరడిస్తావని తలచా
కాని ఇలా అకారణంగా దూరం అవుతావని ఊహించలేదు ప్రియా
ఏది అబద్దమో ఏది నిజమో తెల్సుకొలేక పిచ్చాడిలా తచ్చాడుతున్నా ప్రియా
కనికరించి కాస్తనీ తీయ్యని మాటలతో సేద తీర్చవా ప్రియా
మాటలన్నీ మూటలు గా పేర్చా ఏకాంతంలో కలుస్తావన్నవుగా
ఎప్పుడు వస్తావు ప్రియా నాలో వసంతాన్ని ఎప్పుడు నింపుతావు ప్రియా

Wednesday, August 22, 2012

పైటలేని పరువాలు నన్నుడికిస్తుంటే.. ఎలా ఆగను ప్రియా


నల్లని నీకురులు నన్ను రమ్మనిపిలుస్తోంది
నాజూకైన నీ కళ్ళు అద్దంలోకి మత్తుగా చూస్తున్నాయి

అందమైన మెడవంపులు వలపుల తలపులై
పైటలేని నీ యదలోతుల్లో ..గుండేవేగం ఎంత ప్రియా

పైటతీసి...పరువాలను చూపిస్తూ నన్నెందుకే ఊరిస్తావు
నీ యదపొంగుల పరువాలు..నాలో కసినిరేపుతున్నాయి ప్రియా

నీ పెదవి చాటున నన్ను అద్దంలో చూస్తు ఓరగా
నన్ను పిలుస్తున్నావా ప్రియా నేనింక ఆగలేను

మెడవంపున మెత్తగ ఏదో తాకి మైమరచి నేనుంటే
నీవు మదిలో మెదిలి మోహంతో పరవసింపజేయకు

ఆచ్చాదన లేని ..అందమైన నీ ఎదపొంగులు
నన్నేగదమాయిస్తున్నాయి ప్రియా..మదిని దోచావే
పైటలేని పరువాలు నన్నుడికిస్తుంటే.. ఎలా ఆగను ప్రియా
మలయమారుతంలాంటి ఆచ్చాదన లేని నీ బొడ్డు..
నీ నడుము మడతల వయ్యారం..
నాలోని విద్యుత్ మొత్తం లాగేసేలా ఉంది ప్రియా..
కామనాడుల్లో కార్చిచ్చు అలజడిరేపుతోంది ప్రియా
రతీదేవి నిలువెత్తు రూపలావణ్యిమా.. ఈ రేయినిన్ను నిదుర పోనీనులే
తలుపులు వారగా తెరచి ఉందు అర్ద్రరాత్రి తలుపుతడతాను
లోపలికొచ్చానో ఇంక నీకు గాలీసోకని ప్రాంతాలేవీ నీకు గుర్తుండవేమో ప్రియా
లేత లేత పసిడి వన్నేల రూప లావణ్యింమా
ఈ రేయి మణ్మద రాజ్యానికీ ఈ రేయి నీవే రాణీవి
మన సంఘమం..మరపురాని తీపు గుర్తు అవుతుంది ప్రియా నీకు
మదిలో మణ్మద భానాల భావోద్వేహం...
ఎప్పుడు చీకటౌతోందాని తొందర పెడుతోంది ప్రియా..
నన్నాక ఆపకు ప్రియా నేనాగలేను..వచ్చేస్తున్నా కాచుకో మరి

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక రాసాను నేను నావ్యధనంతా
మేఘాలతోటీ నా నివేదనా లేఖగా నీకంపినాను రావా దేవీ

నీ పేరొక జపమైనది
నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా

ఉండీ లేక ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నువ్వే

దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే

నేను నీలో వున్నాను అని చెబుతుంది నా మనసు..


కళ్ళలో కాదు నా హ్రుదయంలో చోటిచ్చాను.....
కళ్ళలో కాదు నా హ్రుదయంలో చోటిచ్చాను.....
సరిపోలేదని మౌనంగా కన్నీరై పోతున్నావు......

నవ్వుతో మనసులోని భావాల్ని నొక్కివేయకు నేస్తమా
దాన్ని అర్ధం చేసుకునే భాష నాకు రాదు......
మౌనంలో అర్ధాలు వెతకమనకు నేస్తమా
వేదాలు నాకు అర్ధం కావు.......
భావుకతతో వర్నించలేను...నాకు తెల్సింది నాకు నచ్చింది రాస్తున్నాఇలా..
నా నరనరాన జీర్నించుకుపోయిన నీమీద ఇష్టాన్ని చెబుతున్నా ఇలా..

నేను నీలో వున్నాను అని చెబుతుంది నా మనసు.....
అయితే ఏంటంటా అని అంటావు నీవు ....నాకు తెలుసు....
మౌనం అనే ముగులో నీవెదుకున్నావో తెలియక...పిచ్చెక్కుతోందినాకు.
ఈ మౌనం ముసుగులో ఉంది నేను మాత్రమేకాదు నీవుకూడా..ఎందుకని ప్రియా..
ఇద్దరి మద్యి మౌనం నరకం అని తెల్సి ఎందుకిలా ఎన్నాళ్ళిలా ప్రియా...?

ప్రియా పగిలిన జ్ఞాపకాలు అన్ని ఒక్కటిగా చేయాలనే విఫల ప్రయత్నం


ఊహల రెక్కల ప్రేమ విహంగనం
మది తనువంతా పులకిస్తున్న వేళ
నేనున్నా అంటూ పకులరించి ప్రేమకురిపించి
అదే జీవతం అన్ని క్షనాన..హృదయాన్ని విసిరి కొట్టి
మనసు సముద్రపు అలల్లా కొట్టుకుంటున్న సమయాన
తానేవచ్చి పలుకరిపులతో పులకరించజేసి
కొత్త ఆశలు మళ్ళీ చిగురింపజేజి
జ్ఞాపకాల నీడలో సేద తీరుతున్న సమయాన..?
ఎవరి కోసమో నా తీయ్యని జ్ఞాపకాలు ..
భళ్ళుపగులగొట్టి నా జ్ఞాపకాల జాబిల్లి..
పగిలిన జ్ఞాపకాలు ఏరుకుంటూ నేను.
ఎక్కడ చిన్న అవకాశం దొరికినా..
జ్ణాపకాలను పగల గొడుతున్న జాబిల్లి..
పిచ్చివాడిలా ఆత్రంగా జ్ఞాపకాలను ఏరుకొంటూ నేను
పగిలిన ఆజ్ఞాపకాల ముక్కళ్ళో అన్నీ పేర్చి
గుండేళ్ళో జ్ఞాపకాలున్నాయేమో అని
అవికూడా పగులకొట్టాలని చూస్తున్న జాబిల్లి
హృదయంలో కి చేతులు పెట్టి మరీ వెరుకుతోంది
ఒక్కటిగా చేయాలనే నా తపన నెరవేరేనా ప్రియా..
కనికరం లేని జాబిల్లి..కన్నీరు పెట్టిస్తూ
ఆకన్నీటిని చూస్తూ ఆనందిస్తోంది ..
పగిలిన జ్ఞాపకాలు అన్ని ఒక్కటిగా చేయాలనే
విఫల ప్రయత్నంలో నేను ఎంతకాలమిలా ప్రియా..
నాలో ఉన్న నీజ్ఞాపకాలను పగులగొట్టి
నన్నేడిపించి నీవేం సాదించావు బుజ్జీ..?

Tuesday, August 21, 2012

ఊసులన్నీ పోగేసి వుంచాను ఏకాంతంలో ఎప్పుడు జతచేరుతావు ప్రియా


నన్ను చూసి నవ్వుకుంటూపోతున్న నల్లని మేఘాలు
వీపుమీద ఉన్న సంచిలో
చూడాలని పైనుంచి ఆత్రంగా చూస్తున్న పక్షులు
మాటల మూటల్ని జాగ్రత్తగా బుజానికెత్తుకొని
వడి వడిగా అడుగులేస్తున్నా
మొత్తానికి కవిసంఘం కు చేరుకున్నా
ఓ మూల కూర్చొని నీకోసం చూస్తున్నా ప్రియా
ఊసులన్నీ పోగేసి వుంచు.
ఏదో ఒక రోజు నీ ఏకాంతంలో జతచేరుతాను.
అని అన్నావు కదా అందుకే నీకోసం ఎదురు చూపులు
ఇక్కడ ఎందుకున్నానో తెల్సా..
నీకు కవితలంటే ఇష్టం కదా..
ఎప్పటికైనా ఇక్కడికొస్తావనే ఆశతో చూస్తున్నా..
అదికో నడుచుకుంటూ వస్తున్నది నీవేనా.. ?
ఏంటి కళ్ళు మసకబారాయి..
ప్రియా నీవేంటీ నీటిలో నడుస్తున్నావు.
ఆ వస్తున్నది నీవేనా..
ఇప్పటిదాకా స్పష్టంగా చూసిన నేను
ఇప్పుడు ఏమీ కనిపించడం లేదు ఎందుకో..
నీవు వస్తున్నా వన్న ఆనందంలో
నాకళ్ళు ఆవేశాన్ని ఆపుకోలేక
కన్నీళ్ళతో నిండి ఎవ్వరు వస్తున్నది కనిపించడంలేదు ..
అదేంటి ఆగకుండా వెలుతున్నావు
అది నీవుకాదా..ఏంటో నా కన్నీటి పొర
నీవెవరో చూడనీకుండా చేస్తోంది..
అరె..వెళ్ళీపోతున్నావా..
వచ్చిందినీవుకాదా....?

Monday, August 20, 2012

ప్రియా నీవు గుర్తుకొస్తే చాలు..నాలో ఏమి ఉండదు నీ జ్ఞాపకాలు తప్ప


ప్రియా నీవు గుర్తుకొస్తే చాలు
నాలో ఏమి మిగిలి ఉండవు నీ జ్ఞాపకాలు తప్ప
ప్రియా నా గతం గుర్తుకురాదు..నీతో ప్రణయ రాగాలు తప్ప
నా రేపు ఏమో తెలియదు నా రేపటికి గురించి నాకు అవసరం లేదు
ఈ క్షణ౦ శాశ్వితమై..నీవు నాతో వుంటే చాలు
అది నిజం అయినా కల అయినా పర్లేదు ప్రియా
ప్రియా నాలో నేను ఉండను అంతే నీవు తప్ప
ప్రియ నా ప్రేమ నిన్ను వేదిస్తున్నదని నీవు అనుకుంటే
నీ మీద నాకున్న ప్రేమ నన్ను బ్రతికిస్తుందని
నీవు గుర్తుకొస్తే చాలు..నాలో ఏమి ఉండదు నీ జ్ఞాపకాలు తప్ప
ఈ క్షణ౦ శాశ్వితమై..నీవు నాతో వుంటే చాలు
నాలో నేను ఉండను అంతే నీవు తప్ప ..ప్రియ,
ప్రియా నీ కళ్ళలో కన్నీరులా జారి..అదే ఊపిరిగా మారుతుంది
ప్రియా నీ ప్రతి శ్వాసలో ఉపిరిగా మారి ..ప్రాణంగా నిలుస్తుంది
నీతో జీవితంత౦ ఉండాలని ఆశిస్తూ ఆరాటపడుతూ ..
విఫల ప్రయత్నం చేస్తున్నా ప్రియా
మౌనంగా ఉన్న నా మనసుకు నీ ప్రేమ భాష్యాలు చెబుతున్నా
ఊరించి ఉడికించి మౌనతోనే చంపేస్తున్నావుకదా ప్రియా..

ప్రియా నీ నులి వెచ్చని కౌగిలో చేరాలనే తహ తహ..


ప్రియా.అదేంటో....
ఎంత తడిపిన తడవని పెదాలు..
ఒకటికి ఒకటి ఆధారంగా ఉన్నా...
వణుకుతునే ఉన్నాయ్...
అదేంటో...
ప్రియా. ఏదో భారాన్ని మోస్తున్నట్టు
ఎపుడు వాలిపోదామా అనుకునే కళ్ళు

ప్రియా.నీ ఆలోచనలతో కళ్ళు మూతలు పడితే చాలు
తెరవాలనే ఆశే లేకుండా...
ప్రియా నిదురించాలని అనుకుంటాయి.
ప్రియా.ఏంటి ఇదంతా...అంటే
కారణం ఒకటే...
"నువ్వు" ప్రియా.
ప్రియా నిద్రలో నీగురించే కలవరింతలు..
మెళుకువలో ప్రతిక్షనం నీగురించే ఆలోచనలు..
నాకేదో జరుగుతోంది నీవు నన్నేదో చేస్తున్నావు ప్రియా.

ప్రియా మనసు పడే వేదనని ఎలా వినిపించను


ప్రియా జ్ఞాపకమై గుండెలో చేరి గాయంగా ఎందుకు నిలచిపోయావు

మౌనాన్ని మంత్రంగా వేసి నిశ్సబ్ధం గా మరలిపోయావు

ప్రియా జ్ఞాపకాలు గుండెల్లో చేరి తీయని గాయం చేస్తున్నాయి

నీ మాటలతో ఆ మౌనం వీడేదెప్పుడు

ప్రియా నీ ఓదార్పుతో నా గాయం మానేదెప్పుడు .

చూసే ప్రతి చూపులో నువ్వే కనిపిస్తు

ప్రియా వినే ప్రతి మాటలో నీ పిలుపే వినిపిస్తుంటే

మనసు పడే వేదనని ఎలా వినిపించను నీకు

ప్రియా కనులు మూసుకుని

కళ్ళలో ఉన్న నీ రూపాన్నే చూస్తూ ఉన్నా ప్రతి క్షణం

ఊపిరి ఆగే లోపు ఒక్కసారైనా

ప్రియా నా కళ్ళెదుట నిలిచిన నిన్ను చూడాలని..

నా గుండేళ్ళో దాగిన దాచుకున్న వన్ని నీకు తెలపాలని..?

ఈ జన్మకు ఈ కోరిక తీరేనా ప్రియా ...మది అడుగుతోంది చెప్పవూ

Sunday, August 19, 2012

ప్రియా నీ జ్ఞాపకాల సుడిగుండంలో చిక్కుకుపోయి


ప్రియా నీ జ్ఞాపకాల సుడిగుండంలో చిక్కుకుపోయి

నీ ఆలోచనల ఊబి నుండి బయటకు రాలేక ఊపిరాడక అందులోనే ఉండలేక

తప్పిపోయి తీరాన ఎగిరిపడిన చాప పిల్లలా గిలా గిలా కొట్టుకుంటున్నా ప్రియా

ప్రియా నీ హృదయ సముద్రాన్ని చేరుకోలేక ..

జ్ఞాపకమై నను వేదిస్తుంటే కన్నీటితో మనసును ఓదార్చుతున్నా

కాని కార్చి కార్చి అలిసిపోయిన ఆ కన్నీటికి ఓదార్పు ఎవరు

గుండెల్లో గుడి కట్టుకున్న నీ రూపమా లేక

ఆ గుండెని చీల్చే నీ ఆలోచనలా ప్రియా?

ప్రియా కన్నీరుగా నీ పాదాలు అభిషేకిస్తా ప్రియా


ప్రియా ఏంటో గతం తాలూకా జ్ఞాపకాలు ప్రతిక్షనం వేదిస్తున్నాయి
అజ్ఞాపకాలు నావేడి కన్నీళ్ళతో చెరిగి పోతాయా ప్రియా
నీకోసం నా వేడి వేడి రక్తాన్ని సైతం కరిగించి
ప్రియా కన్నీరుగా నీ పాదాలు అభిషేకిస్తా ప్రియా
రక్తంనీ తెల్లని పాదాలు అభిషేకిస్తా ఎర్రటి రక్త చూసి భయపడతావు
అందుకే రక్తాన్ని కన్నీరుగా మారుస్తున్నా ప్రియా

Saturday, August 18, 2012

ప్రియా జ్ఞాపకం వెంటాడి వేదిస్తూ నన్ను నిలువునా దహించివేస్తుంటే


ప్రియా తీయని మాటలు లేవు

మూగ బాసలు లేవు

ప్రియా చిలిపి చేష్టలు లేవు

ఆశలు లేవు కలిసి కన్న అందమైన కలలు లేవు

మరి ఎదో జ్ఞాపకం వెంటాడి వేదిస్తూ నన్ను నిలువునా దహించివేస్తుంటే

ప్రియా కన్నీరు కూడా ఆవిరైపోతుంది ఏమిలేని ఆ జ్ఞాపకాల సెగలో .నీ ఆలోచలు నా గుండెల్లో అగ్ని గుండాన్ని మండిస్తుంటే

ప్రియా కన్నుల్లో కారే కన్నీరు ఆ అగ్నికి ఆజ్యం పోస్తుంది

ఆ అగ్నిలో దహించుకు పోయేది నేనే కాని

ప్రియా నా ఆలోచనల్లో నిండిన నీ జ్ఞాపకాలు కాదు

ప్రియా నీ కోసం ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో


ప్రియా ఎవ్వరికి తెలియదు నా కన్నీటితో తలగడ ఎందుకు తడిసి ముద్దయిందో

ప్రియా ఎవ్వరికి తెలియదు నీ కోసం ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో

ప్రియా ఎవ్వరికి తెలియదు నా మనసనే డైరిలో ప్రతి పేజీ నీ గురించే రాసానని

ప్రియా ఎవ్వరికి తెలియదు నేను నిన్ను ఎంతగా ఆరాధిస్తున్నానో

ప్రియా ఎవ్వరికి తెలియదు నిన్ను పలకరించకుండా ఉండటానికి

ప్రియా ఎంత నరకాన్ని అనుభవిస్తున్నానో

ప్రియా ఎవ్వరికి తెలియదు గుండె పగిలేలా ఎందుకు రోదిస్తున్నానో

ప్రియా ఎవ్వరికి తెలియదు ఏ బంధం లేని అనుబంద్ధం నీతో ఎలా పెనవేసుకుందో

ప్రియా ఎవ్వరికి తెలియదు పైకి చెప్పలేని ఎవ్వరితోనూ పంచుకోలేని ఎన్నో భావాలు

ప్రియా నన్ను దహించివేస్తున్నాయని

ప్రియా ఎవ్వరికి తెలియియదు నన్ను నాకు కాకుండ చేసిన నువ్వంటే ఎంత అభిమానమో

ప్రియా కారణం ఎవ్వరికి తెలియదు నాకే కాదు మరెవ్వరికి తెలియదు

ప్రియా మనుషులంతా ఇంతే...


ప్రియా మనుషులంతా ఇంతే...
మనల్నిమనం ఏంకోల్పోతున్నామో..
తెల్సుకోలేనంతగా సంతోషంలో ..
భాదను కోల్పోతూ..
భాదలో అదే ఆనందం అని బ్రమ పడుతూ బ్రతికేస్తుంటాం.
ప్రియా ఆనందానికి భాదలు అర్దాలు కూడా తెల్సుకోలేనతగా
మనుషులుగా మాయపోతూ..
మనల్ని మనం మర్చిపోతూ
మార్గం తెలియక..మర్మంఅర్దంకాకఒక్కోసాని నిన్నటిని రేపటిని జతకలుపుతూ
బాల్యాన్ని తలచుకొని యవ్వనంపై విరక్తితో
కాలాన్ని శంకిస్తూ...కొవ్వొత్తిలా కరిగిపోతున్న
ప్రియా జీవితాన్ని అర్దం తెల్సుకోలేక
ఏం కోల్పోతున్నామో అర్దంకాక..ఏంటో జీవితం

ఓరచూపుల వయ్యారి..వలచివచ్చానే నీకోసం..


నా తనువులోనీవే ...అణువణువునీవే ప్రియా
నీలోని సౌందర్యాన్ని...ఎక్కడని వెతకను
నా మదిలో రగులుతున్న ఆరని వెతలు
అర్దం చేసుకుంటావని
ఎంతో ఎదురు చూశాను ప్రియా
నా మనసులోని
అంతరంగోష నీకు చేరలేదా..?
అరవిరిసిన అందార మందార సుకుమారి
పరదాలు తొలగించి...
నీకై అలసిన నన్ను సేదతీర్చవే
నన్ను నీ కౌగిలిలో బందిస్తావని ఎదురుచూస్తున్నా
ఆ ఒక్క క్షనణపు నీ బిగి కౌగిలి లో
నన్ను మైనంలా కరిగిస్తావని చూస్తున్నా ప్రియా

నీ అందమైన కనుసన్నల కాటుక చెదరకుండా ..
కవ్విస్తున్న మయూరి
ఓరచూపుల వయ్యారి..వలచివచ్చానే నీకోసం..
ఓంటరిగా చెంతకు చేరానని తుంటరిగా నన్నుడికించకే..
నీ అరవిరిసిన అందంముందు నేనోడి నీపాదాల చెంతచేరానే ప్రియా

నీవులేక ఏకాంతం నన్ను కౌగిలించుకుంది ప్రియా


ప్రియా మరుపన్నది

నన్ను నిలవనీయడంలేదు

ప్రియా జాలే లేని జ్ఞాపకమా

అందరని దూరంగా పంపేసి

ఒంటరి తనం ఒడి చేరుతుంది

ప్రియా సరదాలు సంతోషాలను కాలదన్ని

ఎన్నటికి నిన్ను వీడనంటూ

నీవులేక ఏకాంతం నన్ను కౌగిలించుకుంది ప్రియా

నేనోడిపోయానని తెల్చేసినట్టుంది ప్రియా

ప్రియా కన్నీరు మాట్లాడాలి అని అనుకున్నప్పుడు పిలవగానే పలుకుతుంది


ప్రియా చాలా మంది కన్నీటిని ఇష్టపడరు ఎందుకనో మరి

కాని నాకు మాత్రం నా కన్నీరంటే చాల ఇష్టం చాలా చాలా ఇష్టం చెప్పలేనంత ఇష్టం

ప్రియా కన్నీరు మాట్లాడాలి అని అనుకున్నప్పుడు పిలవగానే పలుకుతుంది

ప్రియా బాధను పంచుకుందాము అన్నప్పుడు పిలవకుండానే కన్నీరు వచ్చి నా చెక్కిలిని తడుముతుంది

ప్రియా ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీరు నేను తోడున్నాను అని దోబుచులాడుతుంది

ప్రియా గుండె బరువైనప్పుడు కన్నీరు మనసుతో ఊసులాడి ఓదార్చుతుంది

ప్రియా నా ప్రతి కష్టంలోను నీతోడు నేనున్నాను అంటు కన్నీరు గుండెలకు హత్తుకుంటుంది

ప్రియా ఎందుకో ఈ మధ్య నా కంటే కూడా కన్నీటి మీద ఇష్టం పెరుగుతుంది .

ప్రియా కట్టలు తెగిన కన్నీళ్ళు చీకట్లో కలిసిపోతుంటే


ప్రియా దేవుడు ప్రత్యక్షమై

నీ ఆఖరి కోరిక కోరుకోమంటే . . .

నేను ప్రాణంతో లేనని తెలిసిన క్షణాన

నీ కంటి నుండి కారే కన్నీటి బొట్టుని కావాలని కోరుకుంటాను ప్రియా
ప్రియా నా ప్రాణం నీవే
ప్రణయం నీవే
ప్రళయం నీవే నీ...వే నీ ...........వే
ప్రియా కట్టలు తెగిన కన్నీళ్ళు చీకట్లో కలిసిపోతుంటే
ఓదార్చే ధైర్యం లేక
ప్రియా గది గోడలు మౌన సాక్షులుగా మిగిలిపోయాయి
ప్రియానీ ఆలోచలు నా గుండెల్లో అగ్ని గుండాన్ని మండిస్తుంటే కన్నుల్లో కారే కన్నీరు ఆ అగ్నికి ఆజ్యం పోస్తుంది ఆ అగ్నిలో దహించుకు పోయేది నేనే కాని
ప్రియా నా ఆలోచనల్లో నిండిన నీ జ్ఞాపకాలు కాదు

ప్రియా నా ప్రాణం ఉన్నంత కాలం గుండెల్లో పదిలంగా ఉంటుంది


ప్రియా నీ పేరుని పేపర్ మీద రాశాననుకో అది చిరిగిపోతది కొన్ని రోజులకి

ప్రియా ఇసక మీదరాశాననుకో మరుక్షణమే అలలు వచ్చి చెరిపేస్తాయి

ప్రియా గోడ మీద రాశాననుకో రంగు వేసి తుడిచేస్తారు

ప్రియా అందుకే నా గుండెల్లో రాసుకున్నాను

ప్రియా అక్కడ ఎప్పటికి ఎవరు చేరిపేయలేరు

ప్రియా నా ప్రాణం పోయిన సరే నాతో పాటు కాలిపోతుందే కాని ఎవ్వరు చెరపలేరు

ప్రియా నా ప్రాణం ఉన్నంత కాలం గుండెల్లో పదిలంగా ఉంటుంది .

ఓరచూపుల వయ్యారి..వలచివచ్చానే నీకోసం..


నా తనువులోనీవే ...అణువణువునీవే ప్రియా
నీలోని సౌందర్యాన్ని...ఎక్కడని వెతకను
నా మదిలో రగులుతున్న ఆరని వెతలు
అర్దం చేసుకుంటావని
ఎంతో ఎదురు చూశాను ప్రియా
నా మనసులోని
అంతరంగోష నీకు చేరలేదా..?
అరవిరిసిన అందార మందార సుకుమారి
పరదాలు తొలగించి...
నీకై అలసిన నన్ను సేదతీర్చవే
నన్ను నీ కౌగిలిలో బందిస్తావని ఎదురుచూస్తున్నా
ఆ ఒక్క క్షనణపు నీ బిగి కౌగిలి లో
నన్ను మైనంలా కరిగిస్తావని చూస్తున్నా ప్రియా

నీ అందమైన కనుసన్నల కాటుక చెదరకుండా ..
కవ్విస్తున్న మయూరి
ఓరచూపుల వయ్యారి..వలచివచ్చానే నీకోసం..
ఓంటరిగా చెంతకు చేరానని తుంటరిగా నన్నుడికించకే..
నీ అరవిరిసిన అందంముందు నేనోడి నీపాదాల చెంతచేరానే ప్రియా

Friday, August 17, 2012

ప్రియా నా గుండే ప్రతి లయ నీ తోడు కోరుకుంటూంది


ప్రియా నీ అందం నన్ను
మరపింపచేసింది
ప్రియా నా కనుపాపలలో
నీ రూపం..విడిచివెళ్ళనంటుంది
ప్రియా రెప్పల మాటున..కన్నీటి మాటున
అది దాగుండిపోయింది...
ప్రియా నిదురలోనూ నీ ప్రతిబింబం నన్ను..
మనసు పొరళ్ళో ...తట్టి లేపింది
ప్రియా నీ వెంటే నేనున్నానంటూ నన్ను
పలుకరించి ఎందుకలా దూరం అయ్యావు
ప్రియా నా ఉచ్చ్వాస నిశ్వాసలోనూ
నీ పూల పరిమళం
పూరించివేసింది
ప్రియా నా గుండె చప్పుడును
నీ తీయని మాటలు
నన్ను మాయ చేసింది
ప్రియా నా గుండే ప్రతి లయ నీ తోడు
కోరుకుంటూంది
ప్రియా దూరంగా ఉన్న
మన తనువులు
దగ్గరవ్వాలని
ఒక్కటైన మన హౄదయం
ఆశపడుతుంది..ఆశతీరేనా నాఊపిరి పోయేనా ప్రియా

మన ప్రేమ అక్షరాలు చెరపకు ప్రియా


ప్రియా ఎప్పుడు మన కలయిక


ప్రియా నీ స్నేహాన్ని ఎలా మర్సిపోను చెప్పు


మళ్ళి కలుస్తామన్న ఆశతో బ్రతుకుతున్న ప్రియా


నీ పరిచయం ఒక అద్బుతం ప్రియా


Wednesday, August 15, 2012

.ప్రియా నీవు లేని నేను లేనన్న నిజం నమ్ముతావా..?


నీవు నేను వేరైనా మన ప్రేమ ఒక్కటే కదా..?


కళ్ళలో దాగిన చిన్న కన్నీటి బొట్టు జారిగుండె లోని ఎంత భారాన్ని దించింది


బాధ అంటే తెలీదు అప్పటి వరకు బాధ అంటే తెలీదు అందం గా అల్లుకున్న స్నేహ బంధాలు తప్ప కన్నీళ్ళు అంటే తెలీదు నవ్వి నవ్వి కనుచెలమలు నిండడం తప్ప కష్టాలంటే తెలీదు నేస్తాలతో చిన్న చిన్న అలుకలు తప్ప విడిపోవడం అంటే తెలీదు సాయంత్రాలు నడవడం తప్ప మౌనంగ వుండడం తెలీదు సెలయేరులా గల గలా మాట్లాడడం తప్ప మరి ఈరోజేమిటి.. నవ్వులన్ని జ్ఞాపకాల్లో చేరిపోతున్నాయి అందమయిన బంధాలన్ని ఆటోగ్రాఫ్ లో భాషగా మారిపోతున్నాయి మనసులేమిటి మాటలని దాచేస్తున్నాయి వీడుకోలు చెప్పడం అంత కష్టమా?అరే...ఇదేమిటి?ఆకాశంలో కదా మేఘాలున్నాయి మా కన్నుల్లో వర్షం కురుస్తుందేమిటి?...

కళ్ళలో దాగిన చిన్న కన్నీటి బొట్టు జారిగుండె లోని ఎంత భారాన్ని దించింది...ఈ రోజే కన్నీటి బరువు తెలుసుకున్నానుఇందరి ప్రియ నేస్తాల సమక్షం కూడాఇవ్వని ఓదార్పు ఒక్కరి స్పర్శ అందించింది...ఇన్ని తెలిపిన ఈ కష్టం ఇపుడు నాకిష్టమైందిఈ రోజు నాకెంతో విలువైనదిగోల పెడుతున్న మాటల గువ్వలను ఎగరనీయకుండా భావాల రూపం లోగుండె లోనే బందించేస్తూఇంకా ఎంత కాలమిలా..?మనసుకి స్నేహం మత్తు నిచ్చి నిద్రపుచ్చుతూమాటలకు మౌనం భాషనేర్పినవ్వుకుంటూఇంకా ఎంతకాలమిలా..?ఆగని కాలంకేసి భారంగా చూస్తూభారమైపోతున్న గుండెకేసి జాలిగా చూస్తూచూస్తూ..చూస్తూ..చెలిని దూరం చేసుకుంటూఇంకా ఎంత కాలమిలా..?
తొలి పొద్దులో గరిక పూవుపైమంచు తాకి మైమరచింది నేనేనా?ముంగిట ముగ్గుకి రంగులద్దిమురిసిపోయిన మనిషి నేనేనా?వాన చినుకుల్లో కలిసి తడిసిఅలిసిపోయిన మనసు నాదేనా?రేకులు రాలుతున్న పూవును చూసిచెక్కిలి జారిన కన్నీరు నాదేనా?ఏది అప్పటి సున్నితత్వం?ఏది అప్పటి భావుకత్వం?వయసు పెరిగేకొద్దీమనసు చిన్నదయిపోతుందా?ధనం వచ్చేకొద్దీఆనందం విలువ పెరిగిపోతుందా?ప్రతి రాత్రి నను పలుకరిస్తూ మా ఇంటి కిటికీ లో నవ్వుతూ చంద్రుడు! వెన్నెల ఊసులెన్నో చెపుతూ కన్నెగుండెల్లో ఊహలెన్నొ నింపుతాడు ! ఏతారకతో స్నేహం కుదిరిందో ఇటురానేలేదు ఈరోజు నిశీధినేలే నెలరాజు! లోకమంతా చీకటి... కన్నె మనసులోనూ అదే చీకటి...చెప్పలేని ఏదో వెలితి

Tuesday, August 14, 2012

గెలిచానో ఓడానో తెలియని అయోమయంలో


నీ నవ్వులో ఏమి దాచావో చెప్పవా
అలానే చూస్తూ ఉండాలని పిస్తుంది రెప్ప వాల్చక


నీ నడకలో ఏమి వయ్యారము దాగుందో కదా
తడబడినా అడుగులు పడుతున్నై నీ వెనకే


నీ మాటలో ఏమి మంత్రము వేసావో కదా
మత్తెక్కిన మనసు వింటున్నది నీ మాటే


నన్ను నన్నుగా నిలవనియక నన్ను
పూర్తిగా అసహయుడిని చేసావు చిరునవ్వులతో

గెలిచానో ఓడానో తెలియని అయోమయంలో
మళ్ళి ఓడిస్తున్నావు నీ వొడిలో సేద దీర్చి

నన్ను నేను పూర్తిగా కోల్పోఇనా
ఇంత ఆనందం ఉంటుందా నీతో ఓటమిలో ??

చెక్కిలిమీద చారికై నిలిచిన జ్ఞాపక౦


ఈ రాత్రి నిశ్శబ్ద౦గా ఉ౦డదు
చెవిని తొలిచే కీచురాళ్ళ ధ్వని
చెప్పుకోలేని భాద ఎందుకో ఇలా
ఆలోచనలకు రెక్కలు తొడగకా మానదు
ఇప్పటికెన్ని ఆలోచనలు
గాజుబొమ్మాల్లా పగిలిపోయాయో..?
టార్చిలైటును ఆర్పివెలిగిస్తూ
రాత్రిని పరిశోధిస్తున్న మిణుగురుకు తెలుసు
పదునెక్కిన ఆలోచనల ముల్లుగర్రలు
మానుతున్న గాయాలను మేల్కొలుపుతు౦టాయి
గాయాలు జ్ఞాపకమై సలిపినప్పుడల్లా
హృదయ౦లోకత్తిదిగిన బాధ.......

అర్ధరాత్రి దాటాక
కునుకుపట్టని కళ్ళు నేరేడు పళ్ళవుతాయి
నరాలు కాలుతున్న కరె౦టు తీగలవుతాయి
గుడ్లగూబ గొ౦తువిని
చ౦ద్రుడు మబ్బుదుప్పటి కప్పుకు౦టాడు
నేనుమాత్ర౦...
జ్ఞాపకాల లోయల్ని తవ్వుకు౦టూ
ఏ మూడో ఝామునో
స్వప్న౦తో నిద్రను వెలిగి౦చుకు౦టాను.

తెల్లారిచూస్తే...
జ్ఞాపకాలు జాడను కోల్పోయినట్టే అనిపిస్తు౦ది
అద్దానికి ముఖాన్ని చూపగానే
చెక్కిలిమీద చారికై నిలిచిన జ్ఞాపక౦
మళ్ళీ ఆలోచనల్నిరేపి
నన్నొక కన్నీటి శిబిరాన్ని చేస్తు౦ది.

నీవు చెప్పిన మాట నిజమైతే ఒక్కసారి వచ్చిపోవా వసంతమా


ప్రియా ఎవరు బ్రతికారో
ఎవరు చనిపోయారో ఎలా తెలుస్తుంది
చనిపోయిందెవరో తెలిస్తే తప్ప
బ్రతికిందెవరో తెలియదు
చావంటే ఏంటి ? బ్రతుకంటే ఏంటి .?
ఈ రెండిటీ మద్యి వత్యాసం ఏంటి..?
బ్రతికి ఉన్నప్పుడు ఇష్టపడ్డవాళ్ళకు కష్టంగా మారితే.?

చావంతా..
అందరికీ ఒకటిగా ఉండదు
దుర్గంధ భూయిష్టమై
తగలేయడానికి వీల్లేని శవంలా
పెనుభారంగా...

ప్రియానీవంటూ నన్నెందుకు దూరం చేస్తున్నావో
మారినా కాలాళ్ళా ...మనసులో ప్రేమ అర్దాలు మార్చుకుంటుందా..?
అవదులు దాటుతున్న నావేదనకు .. అర్దాలు చెప్పగలవా
ఆవేదన గుండెపొరలనుంచి తెరలు తెరలుగా బైటికొస్తున్నాయి ...?

జీవితంలో ఒకే ఒక్కసారి నీతో రోజంతా మనసారా మాట్లాడాలని ఉంది
ఆతరువాత ఎమైనా పర్లేదు.. చూట్టూ పచ్చని చెట్లు..అక్కడ మనిద్దరం
చల్లని చిరుగాలులు మనల్ని పలుకరిస్తూ..మేమున్నామంటూ చిరుజల్లుళ్ళో
ఇద్దరం తడుస్తూ కన్నుళ్ళో చెమ్మగిళ్ళుతున్న తడిని ఒకరివి ఒకరికి తెలియకుండా
ప్రపంచాన్ని మరచి..ఏకాంతంగా నీతో మాట్లాడాలని
మాటల మూటలన్ని పేర్చి నీకోసం ఎదురు చూస్తున్నా ప్రియా
అప్పుడు నీవు చెప్పిన మాట నిజమైతే ఒక్కసారి వచ్చిపోవా వసంతమా
మరచిపోలేని మన బందాన్ని .. విడదీయలేని మన ఆత్మ సంతసాన్ని
నాకిస్తావని నీవస్తావని నాకన్నుల్లో కురిచే .. ఆనందపు చెమ్మను ఆత్మీయంగా తుడుస్తూ.. నన్నోదారుస్తావని ఎదురు చూస్తున్నా ప్రియా
Monday, August 13, 2012

ప్రియా జ్ఞాపకాల కొలిమిలో కాలిపోతున్నా జాబిల్లీ ఎప్పుదు నీమౌనం వీడతావో


ప్రియా కనుల సరస్సులో ప్రేమ ఇంకా ఇంకిపోకుంది,
హృదయ స్పందనలో ప్రేమ ఇంకా ఆగిపోకుంది,
ప్రియా మది గదిలో ప్రేమ ఇంకా ఖాళీకాకుంది,
ఆలోచనని ఆణిచిపెట్టినా, ప్రియా జ్ఞాపకం కరిగిపోనంటుంది.
ప్రియా నీ ఊహలేని క్షణాన్ని కాలం దరిచేరనీయనంది.
ఇంక ఎలా మరి నిన్ను
మరిచిపోయేది ప్రియా ....?
ప్రియా ఒక్క మాటలో చెప్పనా నా జీవితంలో ప్రతిరోజు....
నిదుర కరిగిన కనులకు మొదటి రూపం, రెప్పవాల్చే కనులలో చేరే చివరి అందం నీ ఆలోచనే. మదిలో రేగే మంటలకు .. మౌనవేదనకు కారణం నీవని తెల్సి
ఎందుకింత మౌనంగా వుంటున్నావో ప్రియా.జ్జాపకాల కొలిమిలో కాలిపోతున్నా జాబిల్లీ ఎప్పుదు నీమౌనం వీడతావో అని నిద్రమాని నీకోసం ఎదురు చూతున్నా ప్రియా