కలల ఒడిలో అలసి పోయి బాధ్యతల మెలుకువ వచ్చింది
మనసు బాధల ఆటుపోట్లు కన్నీళ్ళ ఉప్పెనతో ముంచాయి
దారి తెలియని జీవితమనే నిద్దురలో తీయని కల తిరిగి చుక్కానిలా దారి చూపుతుంటే
కనిపించని ఎండమావులకి పరుగులు తీస్తున్న ఓ హృదయమా !
స్నేహమనే చల్లని నీడ క్రింద తల దాచుకో
బాగున్నావా అనే పలకరింపు తెచ్చే ఆనంద బాష్పలతో
నీ దాహం తీర్చుకో !!! అవకాశం లేకపోతే పాతజ్ఞాపకాలతో సర్దుకుపో
ఏదీ అవకాశం లేకపోతే చచ్చిపో...కనీసం నీవు పోయాకన్నా నిజం తెల్సుకొంటుందేమో ..?