. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, October 30, 2019

గత0 దూరమైన ప్రస్తుతం ఏడిపిస్తుంది

గత0 దూరమైన  ప్రస్తుతం ఏడిపిస్తుంది ..తరవాత గడపాల్సిన కాలం గుర్తుకువచ్చి
జీర్ణించుకోవడానికి నన్ను నేను సమాయుత్త పరచుకోవడం విఫలం అవుతునే ఉన్న....క్షణాలు గడపడం
దుర్లభం  అవుతోంది
ఎదురుగా జరుగుతున్న నిజాలు నమ్మాలి..నమ్మి తీరాలి ఎందుకో ఒక్కోసారి నన్ను నేను నియంత్రిచుకోవడంలోను విఫలమై
అర్ధం కాని అయోమయ స్థితిలో ఉహాల్లో బతికున్నానేమో..నాది కానీ దానికోసం తచ్చాడుతు నిజాన్ని మరచి..ఉహల్లో కూడ నన్ను నేను గాయపర్చుకుంటుమళ్లీ
జీవనంలో జీవశ్చవంలా మారాను..? ..మాటలు మౌనంగా నన్ను వెక్కిరిస్తున్నాయు..
ఎందుకో నా మనసు ఊపిరి ఆగే. ఆక్షణం కోసం ఎదురు చూసు0ది ....
ప్రతి సారి ఎదురైయ్యె గాయాలు తట్టుకోలేక
ఏమైనా  నా పై నాకున్న భావన సహనశీలి గా ముద్రించుకుని
ఓటమి రహదారుల్లో నడుస్తున్న ఈ నడక నాకు అలవాటే ..మళ్ళీ మళ్ళీ గాయాల పాలౌతు నడక సాగిస్తూన్న ఒంటరిగా ఉన్నాను..ఆగే ఆక్షన0 కోసం ఎదురు చూస్తూ..😔😔😔

Saturday, October 26, 2019

నీకోసం అక్షరాలు తడుము కొంటూనే ఉన్నాయి ఇంకా

ఉదయం లేచింది మొదలవుతుంది
అంతులేని నిరీక్షణ....
కోసం.నా బైల్ తడుముకున్న ప్రతిసారి
లాస్ట్ మెస్సే వైపు దినంగా చూస్తూ మరో మెస్సేజ్ ఎప్పుడు వస్తుందా అని
ఆత్రంగా ఎదురు చూస్తోంది మనసు..ఎదో సమయంలో
కొత్త మెసేజ్ కనిపించకపోదా అని

రోజులు,
గడిచిపోతున్నాయి....కాలం గిర్రున తిరుగుతుంది
కాలాలు, ఋతువులు
మారిపోతున్నాయి...కానీ నాది కానీ దానికోసం..మనసు తడుముకు0టుంది


ఎక్కన ఉన్నాయి  కొసం ఎదురు చూసే అక్షరాలు
ఏవీ?నా గుండెపై
గుప్పెడు మల్లెలు చల్లినట్లుండే
ఆ ప్రణయ పత్రాలు?
అవును నిజం కానీ నిజాలు ఊహల రూపంలో నాన్నిలా ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి..నిజంగా నేను అల్ప సంతోషిని అన్ని నావే అనుకుంటా ..అందరూ నా వల్లే అనుకుంటా..కానీ ఏది నాది నాది కాదు...ఎవ్వరు నావాళ్లు కాదు..అంతా ఊహ అదంతా భ్రమ..బ్రమల్లో బ్రతకడం మనసుకు ఆలవాటు అవ్వడం పొరపాటుకాదేమో

నీ చిలిపి రాతలు చిలికిన
కవ్వింతలు ఎక్కడ?
అవి నా మనసుకి
పెట్టిన గిలిగింతలు ఎక్కడ?
అవి కనరావు..ఎక్కడో ఎప్పుడో ఎక్కడికో జరిపోతూనే ఉన్నాయి మౌనంలో..నిజం నేను నిజం లో బ్రతకాలి అనికోవడం ఈ జన్మలో జరగదేమో కదు

Thursday, October 24, 2019

నీకు ఈ నా మనసు నివేదన వినవా

నన్ను నేను తడుము కుంటున్న క్షణాల్లో
మొగ్గతొడిగిన ప్రేమ
లోలోనదాగి.ఒక్క విచ్చుకున్న పువ్వులా
నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది
వయస్సు తెచ్చిన
ధైర్యమో, అనుభవమో
కథలు కథలుగా
మాటలు పొరలు పొరలుగా నా అనసులోని నివేదన విప్పి చెప్పాలని చూస్తుంది మనస్సు

మంచు పూల పల్లకిలో
అందంగా ముస్తాబయిన హేమంతం..ఋతువులా నువ్వు ని సోయగాలతో నా మనసును తడుముతూ
తనువంతా చక్కిలిగింతలు పెట్టి నవ్వించి కవ్విస్తున్నట్టు అనిపిస్తుంది

ఏమని వర్ణించనూ..? నిన్ను ఎలా చెప్పాను ని ప్రేమను
రేయంచు నుంచి జారిపడిన వేకువఝాములో
పూలకొమ్మను హత్తుకుపోయిన నీటిముత్య0లా ని ప్రేమ
తూరుపు కొండలని దాటివస్తున్న సూరీడిని
మసకతెర చాటునుంచి తొంగిచూస్తున్నట్టు ప్రతిక్షణం ని ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తూన్నాయి

Saturday, October 19, 2019

మనస్సు పరితపిస్తుంది నీకోసం

నా కల నీ రూపం కోసం వెతుకుతునే ఉంటుంది
నా కవిత నీ  భావం కోసం ఎప్పుడు పరితపిస్తుంది
నా  మనసు నీ చెలిమి కోసం తడుము కొంటూ పరుగెడుతుంది
నా ఊహ నీ మనసుతో..జతకట్టాలని.. నీ   రూపాన్ని అక్షరాల్లో మలచుకొని చదువుతుంటే మనసు ఊయల ఊగుతుంది

నీ జ్ఞాపకాలతో నా కాలం పయనిస్తుంది..నీ ఆలోచనలతో ప్రతి క్షణం
నీ శ్వాసతో నా గుండె ఊపిరి తీసుకొంటుంది
నీ ఊహ తో నా  ప్రపంచం ఉదయాన్నే ఆవిర్బస్తుంది ..నిన్ను తలచుకొంటు రోజుని మొదలు పెడతాను..నీతో మాట్లాడుతూ ఆరోజు ముగిస్తూ...మరుసటి రోజి ని పలరింపుతో.  మరో ఉదయాన్ని చూస్తాను

నీ కోసం నా కోరిక పరిగెడుతుంది
నీ కోసం నా ఊహ జన్మిస్తుంది
నీ కోసం నా కనులు కాంతులు విరజిమ్ముతుంది
నీ కోసం నా మనసు ఓ విశాలమైన విరంహంతో విచారిస్తూ,  తాపంతో తపనపడుతూ ని వెచ్చని కౌగిలో కరిగి పోవాలని, మైకంతో  తమకంతో ...నన్ను నేను మార్చి పోతూ ఉంటాను బేబి