జీవితం గాయపరచవచ్చు
దగా చేసిండవచ్చు
దౌర్జన్యమే జరిగి ఉండోచ్చు
ఏం జరిగినా నువ్వు ఒంటరిదానివి కాదుగా
ఎందుకలా చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయావు?
ఒంటరిగా వెళ్ళాననుకున్నావేమో
నీ ప్రాణ సమానుల్ని,
సహచరుల్ని,గుండేల్లో దాచుకోవాల్సిన వాళ్ళని,
వాళ్ళ జీవితాన్ని,
వాళ్ళ ఆశల్ని కూడా నీ వెంట తేసుకెళ్ళిపోయావు..
చెప్పకుండా వెళ్ళిపోయిన వాళ్ళు
ఎప్పుడైనా తిరిగొస్తారని
హృదయంతో వేచిచూసే వాళ్ళు గుర్తుకు రాలేదా నీకు?
ఒక్క తీపి జ్ఞాపకం ఐనా నిన్ను కదలించలేదా?
ఆనాటి ఆత్మీయత నిన్ను కరిగించలేదా నేస్తం?
- David