. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, October 30, 2017

నీకోసం వేచిచూడటమే ...ఓ కవిత్వం నాకు.

ఓయ్
ఈ చెట్లు చూడు రోజూ పెళ్లికూతుళ్లల్లా పూలు సింగారించుకుని ఆకాశాన్ని మత్తెక్కిస్తుంటే, వెర్రి ఆకాశం తెల్లబడుతూ, ఎర్రబడుతూ, నల్లబడుతూ తబ్బిబ్బై ముంచేస్తుంది.
ఆ సెలయేరు చూడు ఎవరు తరుముకొస్తున్నారని అంతలా పరుగులు పెడుతోంది? ఆగదు, ఆగనివ్వదు నీలా. మలుపు మలుపులో ఊరిస్తూ, ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
అందాల మందారం మాత్రం ఏమి తెలీనట్లు సోయగాల చమక్కుల్లో చిక్కకుండా చుట్టూ తిరుగుతోంది రంగులరాట్నంలా. రాలిపడుతున్న పారిజాతాల్ని, విప్పుకుంటున్న పొగడ పూవుల్ని ఒకింత ఆశ్చర్యంగా చూస్తూ. ఇంక మల్లెలతో మనసు కలిపేసుకుందేమో అక్కడ నుండి చూపులు తిప్పుకోలేక పోతోంది. నాకు భలే అసూయ అనిపించి, ఆ మందారం అదృష్టాన్ని ఆవగింజంత అరువు తీసుకుని, దేవగన్నేరు పూలని ఒక్కొక్కటిగా పేర్చుకుంటుంటే, నీకెందుకోయ్ అంత అక్కసు? పాదాల పారాణి పూలకంటిస్తున్నావేంటని నా వెంటబడ్డావు.
గమనించవు కానీ, ఆ పూల ఎరుపులు మత్తెక్కిన నీ చూపుల మెరుపులని ఎన్ని సార్లు చెప్పాలనిపిస్తుందో .... నువ్వేదేదో చెప్పేసి నా మాటల్ని నాలోనే మూటకట్టేస్తూంటావు.
అలా చూసివెళ్లే ఆ చూపుల్లో మునిగిపోయానేమో నీ నీడ పడిన చిలకరింతల్లో ప్రతి మొలకా చిగురులు తొడుగుతుంది. ఆ పులకరింతల్లో ప్రతి పువ్వు పరవశిస్తోంది.
అణువణువు నన్నల్లుకుంటున్న నీ చూపుల్ని ఓ కంట గమనిస్తూనే ఉంటానోయ్.
వెళ్లాలంటాను ..వెళ్లలేక
కొంచెంసేపంటావు ..వదల్లేక
అలా అలా ఏకాంతమంతా పెదాల నవ్వుల్లో విరబూయటం ఎంతో ఇష్టమైన అనుభవం మనకు.
నీ కౌగిళ్ళ వలలో చిక్కిపోగూడదంటూ .. పట్టుబడిపోవటం భలే గమ్మత్తుగా ఉంటుంది. అది సరే కానీ, కాలాన్ని అద్భుతదీపంలో దాచేద్దాంలే కానీ, వచ్చేసెయి.
నిన్నటి నీ చూపుల వలయం విసిరిన పారవశ్యంలో మునిగిపోవటం వదిలించుకోవటం ఎంత కష్టమో ఇప్పుడు నాకు.
ఒకొంత దూరాన్ని పాటిస్తూనే ..ఒకరినొకరు వెంటాడుకుంటూనే వుంటాము, ఎందుకిలా?
అక్షరాలతో అనువదించలేని భావం మనసులో దోబూచులాడుతోంది.
ఆకాశపు నీలిమంటలో చలి కాచుకుంటున్నానుగా .. నీ తలపుల పహరాలో.
ఊహలు, ఊపిరులతో గాలి గిరికీలు కొడుతూ, పూల బాసలో పరిసరాల్లో పరవసాలు ఒలికిస్తోంది.
ఆ వైపు మెరుపుల్ని కాదంటూ, ఈ వైపు ఉరుముల్ని వలదంటూ. ముసురేసే మేఘమాలల్లో తళుకుల తారంగం..చీకటి ఆకాశంలో నెలవంక సంతకాలు. ప్రపంచమంతా నిదురలో జోగుతుంటే, నేను మాత్రం నీ తలపుల్లో తూగిపోతున్నా, ఆలోచనల ఆవిరి అటుగా వెళ్ళి, కలానికి వెన్నెలని తాపడం చేసిందేమో, ఎటుచూసినా మోహనరాగాలే
ఎక్కడున్నా మధురోహల క్షణాల మాలలే.
ఎంత రాసినా నీ ఊసుల మకరందం ఊరుతుంటే, సౌందర్య సిరులని నెమరేసుకుంటూ,
అడుగుల సవ్వడిని నిరీక్షిస్తూ, మబ్బుల మధ్య ఈదుకుంటూ
అరవిచ్చిన లేయెదలో కలల రంగవల్లులు తీర్చిదిద్దుకుంటూ... అబ్బా
ఎన్నాళ్ళిలా తలపులు ?
ఎన్నేళ్ళి లా మేలుకొలుపులు ?
ఆకులన్నీ చప్పట్లు కొట్టటానికి సిద్ధమౌతున్నాయి ..మన ప్రణయగానానికి.
అయినా నువ్వు ఏమనుకుంటావోగాని ...!
ఇష్టంగా ఒక మాట చెప్పనా..!
వచ్చేయ్యి నీలో తప్పిపోతాను.
రాలిన పారిజాతాల సాక్షిగా..! విరబూసిన జాజుల సాక్షిగా..!
నీకోసం వేచిచూడటమే ...ఓ కవిత్వం నాకు.
Note:- ఈ కవిత కౌముది లోనిది  ఫీల్ నచ్చి అనుమతి లేకుండానే  ఈ బ్లాగ్ లో పోష్టు చేస్తున్నా ...అబ్యంతరం వుంటే తీసివేస్తాను  )