. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, January 31, 2016

కనులెప్పుడూ మురిపిస్తుంటాయి ఎదురుగా నీవున్నట్టు

నిన్నటి నవ్వు
నేటిదాకా దాచుకోలేను
నిన్నటి దుఖాన్ని 
నేటిదాకా మోస్తూనే వున్నా
నువ్వు మారుతున్నట్టే
నేను మారను నేణు నాలానే వుంటా 
కనులెప్పుడూ మురిపిస్తుంటాయి
 ఎదురుగా నీవున్నట్టు 
నన్ను నాలో చేరి గుర్తిస్తున్నట్టు 
అనిపిస్తుంది వులిక్కి పడి లేచాకా 
తెల్సింది అదంతా బ్రమ అని 
నిజమనే నీడలో జరిగిన వాస్తవాలు
ఇప్పటికీ నా చుట్టూ 
చేరి వెక్కిరిస్తున్నాయి 

ఏ ఒక్కటీ నిజం కాదని తెలుకొన్న 
క్షనాలను తలచుకొని ఏడ్చిన క్షనాలు 
ఎన్నని చెప్పను .. నీ ప్రతి చిరునవ్వు వెనక 
నా విషాదం దాగి వుందన్న నిజం నీకో జోక్ 
ఇది చదివి వెర్రిగా నవ్వుతున్న 
నీ ఎర్రని పెదాల సాక్షిగా 

రెప్పలార్పని నా కళ్ళలో
జీవంలేని కిరణాలు ప్రసరిస్తుంటాయి
నన్ను ఎప్పుడో అవన్ని 
నిర్జీవున్ని చేశాయి  
విగతజీవుడిగా మిగిల్చాయి

జారుకుంటున్న నిశ్శబ్దంలోకి 
నీ జ్ఞాపకం ఎప్పుడో నెట్టేసింది 
మెల్లగా లాక్కుపోతున్న 
గతం దూరం అయినా  
నేనేమీ చెయ్యలే ని 
నిస్సహాయున్ని ఇప్పుడు 

మళ్ళీ ఏదో నవ్వు చెక్కుకుంటూ
ముఖంపై పులుముకొని
మార్చుకుంటూ పాడుతుంటాను. 

Friday, January 29, 2016

నా రాతల్లోనిది కవిత్వమే కాదు కల్పన కూడా అందులో లేదు

నేను రాసేవి కవితలు కావు
గుర్తు తెలియని  హృదయం 
నన్ను గేలిచేస్తుంది
ఒంటరితనం నన్ను వేధిస్తుంది..
ఎవరొ నన్ను తరుముతున్నారు 
గమ్యిం తెలియని ....దారే తెలియని 
దిక్కే లేని వైపు పరుగులు పెడుతున్నా 

నా రాతల్లోనిది కవిత్వమే కాదు
కల్పన కూడా అందులో లేదు
నా మౌన స్వరానికి తర్జుమాయే 
చేస్తూ వాటిని అక్షరాలుగా 
మార్చి నన్ను నేను
ఏమార్చుకుంటున్న క్షనాలే ఇవి 
అర్ధం కాని వ్యర్దమైన భావలే ఇవి 

అప్పుడప్పుడు గుండెలయలే 
ఊసులై పదమాలికను 
పరుపులుగా పేరుస్తున్నా 
కొన్నిసార్లు కన్నీళ్ళే 
నా కవితలకి కారణమై ఉప్పొంగి పొర్లుతున్నాయి 

చావుబ్రతుకుల సారమెరుగని నాకు 
నిజానికి అబద్దానికి మద్య నలిగిన నిజాలే ఇవి 
అబద్దాలని నీ మనసుకు సర్ది 
చెప్పుకున్నా అవి నిజాలు కాకపోవుగా 

Tuesday, January 19, 2016

గుండెల్లో మెలిపెడుతున్న భాదను దిగమింగుకొని నాలోకి నేను

నిత్యం చూసే 
ముఖాల మధ్య
మౌనంగా నాలో నేను 
అతుక్కుపోవడం
ఎవ్వరూ గుర్తించని 
మరో ముఖాన్ని తొడుక్కుని
భాదను నవ్వులో కలుపుకొని
పైకి నవ్వుతూ లోలోపల  
గుండెలు పగిలేలా ఏడుస్తూ
నన్ను నేను ఓదార్చుకొనే శక్తిలేక 
ఓ చిన్న ఓదార్పు కోసం 
అటూ ఇటూ 
పరుగులు పెడుతూ నేవున్నా 
అయినా గుండెల్లో  మెలిపెడుతున్న 
భాదను దిగమింగుకొని 
భరిస్తూ నాలోకి నేను 
నడకను సాగిస్తూనే వున్నా 
నిజాన్ని అబద్దంలో దూర్చి 
దాని చుట్టూ అందమైన పూలూ పేర్చి 
ఎవ్వరికీ కనిపించకుడా నాలో 
రేగుతున్న అగిని చల్లార్చే 
కన్నీటిని అదుముకొని 
పేలుతున్న అగ్నిగోలాల సాక్షిగా 
నేనెవరొ తెలుపుకోలేక 
అటూ ఇటూ పరుగులు పెడుతూనే వున్నా 

Sunday, January 17, 2016

నీ జ్ఞాపకంలో చిక్కుకొని మనస్సు విలవిల్లాడుతోంది

రాయాలని కలం పట్టగానే
ముసిరే ఆలోచనలు
కాస్త కళ్ళుమూస్తే
ఓ అస్పష్టపు రూపం
పదే పదే
మనసు మానిటర్ పై
కదుల్తూ వెంటాడుతోంది
అందమైన ఆ రూపం
నా మనస్సు 
ఎప్పుడూ నాతో  పోరాడుతూ 
మాట్లాడుతోది, ఏడ్పిస్తోంది
చెంపలపై చారికల్ని 
తుడుచుకుంటూ
చివరి మజిలీకి సాగిపోతున్న
నా  దేహంపై
ఎవరో రక్తాన్ని జల్లుతున్నారు

చీకటి నేత్రంలోపడి
కబేళాల కండలుగా దేహాన్ని కోస్తున్న
కత్తుల ఉచ్చుల్లో బిగిసిన  
జ్ఞాపకం పుండులా మారి వేదిస్తోంది   
జ్ఞాపకంలో చిక్కుకొని మనస్సు 
గిలగిలలాడినప్పుడు
చెదపట్టిన చెట్టులా
శిధిలమౌతున్న జీవనాన్ని
ఎవరిదాహార్తికోసమో నిలువునా 
తగలబెట్టుకొంటున్నానేమో 

Wednesday, January 13, 2016

నా గుండెల్లో గుబులేదో నిన్నే తలపిస్తుంటే

నీవు నా నుంచి దూరమమయ్యావని తెలిసి  
నీవు లేని నా జీవితం మోడు వారుతుందని 
తెలిసి నీకోసం ...తెలియని నాలో నాకోసం
నా గుండెల్లో గుబులేదో నిన్నే తలపిస్తుంటే
నీ ఎడబాటు ఎలా బరించాలా అని
 నా కళ్ళు వర్షిస్తూ వున్నై
నీవు నాతో చేసిన భాషలు 
నా మదిలో కదలాడుతుంటే
నీవు నా దరి ఉండలేవని తెలిసి
నీ కోసమై నా మనసు ఘోష పెడ్తుంది
నీవు లేని ఈ జీవితం నిరర్ధకం
నీ స్పర్సకై ప్రతినిత్యం పరవశించే
నా తనువు తన్మయత్వాన్ని కోల్పోతుంది
నీ పలకరింపు లేక
నా నరనరాలు విలవిల్లాడుతున్నాయి
నీ తోడూ లేని నా మనసు 
మూగగా రోదిస్తూనే ఉంది
నీ దర్సన బాగ్యం లేక 
నీతో మాటల దాహం తీరక
నా పెదాలు ఎండిపోతున్నాయి
నీ ప్రతిరూపం చూడలేక
నా నయనాలు నిర్జీవం అవుతున్నాయి
మన ఇరువురి అనుబందం తెలిసిన
 ఏకైక నేస్తానివి నీవే నాకు దూరమైతే  
నన్ను నేనెల ఊరడించు కోవాలి
మరు జన్మ ఎత్తైన 
నా కోసం నీవు వస్తావని  
జరగని ఆ ఘటనకోసం 
తీరని ఆకోరికతో 
ఎన్నాల్లని ఎదురు చూడను 
నీ కోసం భాద పడ్తున్న నన్ను ఊరడిస్తావని . 
నీ నేను .....నీకు ఏమి కాని నేను 
నాలోనుండి దూరమైన నేను ..
రావని రాలేవని తెలిసి ఎదురూ చూస్తూ నేను

ఓ మనిషి లో ఒక సాయంత్రం ( ఈ కవిత నాది కాదు )

శిశిరంలో ఒక సాయంత్రం 
చెట్ల నీడల్లో అంతులేని తాత్వికత 
పక్షుల గూళ్ళల్లో చింతలేని సాత్వికత 
ఏటి గలగలల్లో ఎంచలేని మార్మికత
అనుకోకుండానే అనుభూతుల ఉపరితలం మీద 
అందమైన గులాబీ మొగ్గ తొడుగుతుంది 
అలవాటుగానే నీతో అడుగులు కలుపుతాను 
ప్రేమమయమైన చిరుగాలి తోడు వస్తానంటుంది
భావమయమైన హృదయకలం నెమలికుంచెలా 
నిన్ను అన్ని కళ్ళతో పలకరిస్తూ వుంటుంది
నిశ్శబ్ద క్షణాల గుసగుసల్లో 
ఎవరెవరో నడుస్తూ పరిగెత్తుతూ
పడిపోతూ, లేచి ఒగరుస్తూ 
సమయాన్ని ఇంతకంటే గొప్పగా 
గడపలేమంటూ నిర్లక్ష్యపు నసనసలు
బాధపడుతూ భగ్నపడుతూ
సొంతం కానీ శరీరాలంటారు
కనిపించని ఆత్మలమంటారు 
అంతలేని ఆవేదనంటారు 
పొంతనలేని మాటలు వింటూంటాను
ఈ రుసరుసల్లో 
నిన్ను మాత్రం అదే ధ్యానంతో 
అంతే ఆరాధనతో 
జీవితపు పుటల్లో మరో పుటని 
ఆసక్తిగా, ఆలోచనగా 
ఆత్రంగా, ఆప్యాయంగా 
రాసుకుంటూనే వుంటాను
ఖాళీని నింపుకుంటూనే వుంటాను
(ఈ కవిత కాపీ చెయ్యలేదు .. 
బాగుందని నాకు ఎవరో పంపితే పోష్టుచేశా )

Monday, January 11, 2016

డైనమిక్ తెలుగు హీరో సుమన్ చేతులమీదుగ ట్విన్ సిటీస్ లో ఉత్తమ జర్నలిష్టు అవార్డ్ తీసుకున్న సందర్బం

డైనమిక్ తెలుగు హీరో సుమన్ చేతులమీదుగ ట్విన్ సిటీస్ లో ఉత్తమ  జర్నలిష్టు అవార్డ్ తీసుకున్న సందర్బం  గా ఈ ఫొటోలు స్వీట్ మెమరీస్