కాలం మారుతుంది..మనసులు మారాలని రూల్ లేదుగా
సొంతం అనుకున్నవాళ్ళూ దూరం అయితే..కారణం ఎవరు
మనసును ప్రశ్నించుకొంటే అన్నీ ప్రశ్నలే..సమాదానం దొరకని ప్రశ్నలు
మనసుగాయం పెద్దదైనా పట్టించుకోని గతం తాలూకా గాయం
గుర్తొచ్చినప్పుడల్లా అలజడే ...ఎవ్వరికి చెప్పుకోలేక గతం గుర్తొచ్చి తట్టుకోలేక
ఒకప్పుడు నీవున్నా వన్న దైర్యం కోల్పోయిన క్షనం నుంచి ఏమౌతుందో అర్దకాక..ఇప్పుడు
ప్రతిక్షనం అనుభవిస్తున్న వేదన అర్దం చేసుకుంటావనే ఒకప్పుడు ఉండేది
అప్పుడు నీవు నీవులా లేవు కదా మారిపోయావు ఎందుకు అప్పుడే
అందర్ని నమ్ముతావు నన్నెందుకు నమ్మలేదు ..నేనంత ఏంచేశానో తెలీదు..
నాకు తెల్సి నీవు ఎవ్వరు బాదపడటం నీకిష్టం ఉండదు కాని నన్ను ఎందుకు నావిషయంలో అలా ఉంటావో తెలీదు
ఓడిపోయి, ఓడిపోయి, విసిగిపోయి
గెలుపు అనే మాటే మరచిపోయి....
అలసి సొలసి ఇలా పయనిస్తూ, అడుగు అడుగునా మరనిస్తూ,
జీవనపోరాటం చేస్తున్న వేళ..
ఒటమిలో తోడుగా, చిరునవ్వుల జాడగా
నా వెనువెంటే వచ్చావు, నాకు నీ ప్రేమ పంచావు, గెలవాలనే తపన పెంచావు
నేడు ఇలా రొజు రొజుకీ, ఘడియ ఘడియకీ నీవు నన్ను ఓడించావు
నువ్వు లేవనే బాద తిరిగి నన్ను ఒంటరివాడిని చేసేసింది...
నీవు వెతికినా నేను కానరాని రోజు కోసం ఎదురు చూడటం తప్ప ఏం చేయలేనని తేలిపోయింది ఎప్పుడో