ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది -
జీవించే ఒకరోజైనా అందంగా బతకాలని.
ఒక ఆకు రాలుతూ చెప్పింది -
ప్రాణం శాశ్వతం కాదని....ఎన్నటికైనా రాలిపోవల్సిన్దేనని.
ఒక చెట్టు జాలిగా చెప్పింది -
తను కష్టంలో ఉన్నా ....ఇతరులకు నీడనివ్వమని.
ఒక కొవ్వొత్తి కరుగుతూ చెప్పింది -
తనలాగే చివరిక్షణం వరకు పరులకు సహాయపడమని .
ఒక మెరుపు గర్జిస్తూ చెప్పింది -
దైర్యం ఒకరి సొంతం కాదని.
ఒక పక్షి ఎగురుతూ చెప్పింది -
తనలాగే హయిగా ఉండమని.
ఒక కొండ పగులుతు చెప్పింది -
తారతమ్యం లేక అందరికి ఆశ్రయమిమ్మని.