. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, February 28, 2013

మాటలలో చెప్పజాలనిది .... మనసుని మైమరి పించేది ప్రేమే కదా ప్రియా

మాటలలో చెప్పజాలనిది .... మనసుని మైమరి పించేది
మౌనంగా ఉండనీయది .... హదులు ధటిన్చేది
చెతలలో చూపలేనిది .... కను సైగలతో మాట్లాడిన్చేది
ఏమి చేసిన తనివితీరనిది .... తనువులు ఆశించేది
క్షణమునే యుగము చేసెది .... క్షణమైనా చాలు అనిపించేది
క్షణమైన గడువనీయది .... స్వర్గ తీరాలకు చేర్చేది
గుండె చప్పుడు మించిపోయెది .... గుండె చప్పుడు అధికమయ్యేది
గుండెనే పిండివేసెది .... తనువులను పెనవేసేది
ఏ రూపమైన నేను చూసెది ....రూపానికి అతీత మైనది
నీ రూపాన్నే గుర్తు చేసెది .... ఎ జివి కైనా కావాలని పించేది..అవసరమైనది
ఇన్ని భావాలు కలిగించేది .... మధురమైన జీవితాన్ని అందించేది
ఏలా పిలిచిన బాగున్నదనిపించేది ....పెళ్లి భందానికి అనుబంధమిది
రెండు అక్షరలైన ఎంతో అర్థాన్ని ఇచ్చేది ....తెలుగులో రెండు అక్షరాలే అది
ఈ లోకాన అందరికి నచ్చేది ....సృష్టికి మూలం ఇది
సో రెండక్షరాలేకదాని మాత్రం లైట్ గా తీసుకోమాకండి ...
చిరిగి చాట అవుద్ది మరి..
ఏంటి ఆ రెండు అక్షరాలు ఏంటా అనుకుంటున్నారా ..
మీరు ఇంత Dim Gaa ఉంటే ఎలా బాస్ అదేనండీ బాబు రెండక్షరాల "ప్రేమ "

రక్తసిక్తమయిన దేహం తో..బ్రతికిన్నశవంగా ఉన్నానేను

ప్రియా నీవు లేని నేను లేను
అనుకున్నాను ఆ రోజు
నీకు నేను నాకు నీవు అనుకున్నా
ఆ రోజు ఎగిరిపోయింది ఎక్కడికో.
ఎంత వెతికినా ఎంత  ఎదురు   చూసినా

నీకు దూరం అయిన
నేను ఉన్నాను ఈ రోజు
రెక్కలు విరిగిన పక్షినయి
రక్తసిక్తమయిన దేహం తో
బ్రతికిన్నశవంగా ఉన్నానేను

ఆ రోజుఏ నాటికయిన వస్తుందా
మరి ఆ రోజు
మన ఇద్దరికలయికలో
ఆగిపోయేకాలంలో
ఆ ఒక్క క్షణం కోసం
వేచి ఉన్నా
నా రెప్పల మాటున
నీ చిత్రాన్ని చిత్రించుకొని ....
మనసులో  మూగగా   రోదిస్తూ  నీకోసం

చిరునవ్వుల వరమిస్తావా ప్రియా


Wednesday, February 27, 2013

ఈరోజెందుకో మనస్సు హాయిగా ఉంది ప్రియా

ఈరోజెందుకో మనస్సు హాయిగా ఉంది ప్రియా
విరిసిన పూవుల్లో మెరిసిన కళ్ళల్లోఇన్ని రోజుల్లో ఈ రోజెందుకో మనస్సు హాయిగాఉంది
పన్నీటి జల్లులతో పలుకరించి మైమరపించినట్టూంది
చల్లని జల్లుల్లో తెల్లని వెన్నెల్లో
కదిలిన చేతనలో కడిగిన ముత్యంలో
వెచ్చని గుండెల్లో వచ్చిన కవితల్లో
అంతా నువ్వే చెలీ అంతా నువ్వే !!
ఈ క్షనం ఇలాగే ఆగిపోతే
ఆచిన్ని ఆనందం మనసులో నిలచిపోతే బాగుండు అనిపిస్తుంది..
 నాకీ చిన్ని ఆనందం చాళ్ళే అనిపిస్తోంది ప్రియా
గుండె గోడపై ప్రేమ కుంచెతో
ఓ చిత్రం గీశా
నా కళ్ళల్లోకి చూడు
కనిపిస్తుంది !!
ఓ చిరునవ్వుల జాబిల్లి బింబాన్ని
మనసు మైనంతో చిత్రంగీశా నా కళ్ళల్లోకి చూడు
కనిపిస్తుందిఆ అనందాల హరివిళ్ళు ప్రియా

నీవు మిగిల్చిన గాయాల తాలూక మచ్చలకు నిశ్శబ్దం

యుద్దం నడుస్తోంది..ఎన్నాలిలా..?
నాకు తెల్సు ఈ సమయం జీవిత కాలమని..అయినా..?

నిశ్శబ్దం కూడ
ఒక భాష
మౌన సముద్రపు ఘోష ..
అంతరంగం లో ఉప్పొంగే..ఆందోళ అలల నిశ్శబ్దపు ఘొష

నిశ్శబ్దం
నమ్మకమయిన నా నేస్తం
నిస్సబ్డమే
నా నిజమైన బలం
నిశ్శబ్దం
నా ఆత్మ విశ్వాసం దెబ్బతీసి వేసిన కంచే
నిశ్శబ్దం
నా దుఖ్హం హరించే ధ్యానం
నిశ్శబ్దం
కాలమంత శాస్వితం


నిశ్శబ్దాన్ని అక్షరీకరించలేను
అదో అక్షరం కు అందని భావం
అన్ని పాటల కన్న అతీతం
సత్యానికి అమ్మ నిశ్శబ్దం
సంగీతానికే సంగీతం నిశ్శబ్దం
ఆకలితో,ఆర్తితో ఆలకిన్చేవారికి
నిశ్శబ్దం సర్వ శబ్ద మయం
సకల రాగ రంజితం...

సత్య శోధనకు
ఆధ్యాత్మిక నిత్య సాధనకు
అసలైన మార్గం
నిశ్శబ్దం
ఆందోళనకు,ఆవేశానికి
కోపతాపాలకు
సిసలైన సమాధానం
నిశ్శబ్దం

జీవితంలో
ఎన్నో సందర్భాల్లో
అసలు గొంత్తెత్తి అరిచేది
నిశ్శబ్దం మే
శబ్ద సమూహాల్ని
చెల్లా చెదురు చేసేది
నిశ్శబ్దం మే..


పవిత్రతకు
దారి తెల్పే పరమ రహస్యం నిశ్శబ్దం
నీ మాటల తూటాలు
నీవు మిగిల్చిన గాయాల తాలూక మచ్చలకు
నిశ్శబ్దం
లేపనంగా మారి మాయం చేస్తుంది
అనే ఆశతో నిశ్శబ్దంగా జరిగేది చూస్తున్నా..
మళ్ళీ తిరిగి వచ్చే వసంతం కోసం కాదు..
ఆ ఆశ ఎప్పుడో చచ్చిపోయింది..
జరిగిన నిజం తెల్సుకునే రోజుకోసం..అ సలు నిజం తెల్సినరోజు ..
కార్చే కన్నీటీ బొట్టులో అబద్దం కొట్టుక పోతుందని ఎదురు చూస్తున్నా నిశ్శబ్దంగా..
కానీ ఆనిజం ఎప్పటికీ తెల్సు కోలేవని..తెల్సుకునే ప్రయత్నం చేయవనేది గట్టినమ్మకం..అదీ గమనిస్తున్నా నిశ్శబ్దంగా

బాంబ్ బ్లాష్ట్ పై తీసే షార్ట్ ఫిల్మ్ లో మీరు బాగస్తులు కండి

మీకు నటీంచాలని ఉన్నా..మీదగ్గర మంచి ఐడీయా ఉన్నా...మైల్ చేయండీ..మైల్ ఐడి స్పెల్లింగ్ తప్పు ఉంది
shortfimmaking@gmail.comవెంటనే మైల్ పంపండి ఈ షార్ట్ ఫిల్మ్ కు పోలీసులు సహకరిస్తున్నారు....మీడియాలో వచ్చేలా గొప్పగా తీసి అందర్ని అప్రమత్తం చేయాలని ప్లాన్...ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసే కంటే మనకి మనం రక్షనగా ఉందాం

Tuesday, February 26, 2013

గుండెలు మండుతున్నాయి అందుకే... ఆమందు గొంతు దిగుతోంది వెచ్చగా ప్రియా

అది నీకూ నాకు మాత్రమే తెల్సిన నిజం ...అయినా అంత ప్రేమగా మనుషులు ఎలా ఉంటారో అనిపిస్తుంది... నటించకుండా...నిజంగా అలా ఉంటారా నేను  చూశాను అలా ఉండే వాళ్ళను అలా ఎలా ఉంటారో కదా ప్రియా నీలా ఉండటం కూడా అందరికి సాద్యం కాదేమో గుప్పెడంత గుండెలో అంత ప్రేమగా ఎలా ఉంటారో  నిజంగా ఉంటారా అలా నటిస్తారా..అప్పుడలా ఇప్పుడిలా అంటే అప్పుడు ప్రేమ అనిపిస్తుంది తరువాత కాకుండా పోతుందేమో అదెలా నీలా ..
మనచుట్టూ అవకాశవాదులు ఉంటూనే ఉంటారు అవకాశం దొరికితే వదలరు నిజకాకపోయినా అచ్చం నిజంలా నమ్మిస్తారు.. అందుకు ఏలాంటీ టెక్నిక్ లు వాడతారో .. చివరకు ఆడదానికి ఏడ్వటానికీ వెనుకాడరు వెదవలు నిజమైన నీజాయితీ ఉనండి నట్టు నటిస్తూ .. నిజమైన ప్రేమను చెడగొట్టే వెదవలుంటారు తమపని కోసం అడదానిలా ఏడ్వటానికి సైతం వెనుకాడని వెర్రి నా కొడుకులున్నారు...అవకాశవాదులు ఆ కుక్కలకు వేరే పనేమీ ఉండదు నిజమైన ప్రేమను చంపి ఎదుటివాన్ని భాదపెట్టడమే వారి పని 24 గంటలూ వెతుకుతూనే ఉంటారు.. అవకాశం కోసం కాసుక్కొని కూర్చునే కుక్కల ఎదుటి వారికి ఏది ఇష్టమో తెల్సుకొని అటువైపునుంచి నరుక్కురావడంలో ఆరితేరి ఉంటారు నటించి నిజం అనేలా చేస్తారు ఆ నికృష్టపు వేష్టు గాళ్ళదే రాజ్యిం వీళ్ళు వాళ్ళనే గుడ్డిగా నమ్ముతారు.. ఆ కుక్కలకు ఒక్కసారి చాన్స్ వచ్చిందంటే ఎదుటి వారి గుండెల్ళో  నరాలు పీకి పదునైన నాపరాళ్ళతో చితక్కిట్టినంతా భాద పెట్టేలా చేస్తారు,,,, ఎప్పుడో  నీవు పంపిన  SMS చదువుకో " Girls are like Fruits...Every girl has her oun Unique Tast & Color The Problam is the Boyes The Love Fruit Salad..? " చూశావా  ఎంత అమాయకంగా నీవు పంపిన SMS   ఇది చూసి నవ్వొస్తుంది నిజమే కదా. అని ప్రపంచంలో భ్యూటిఫుల్ ప్రెండ్ షిప్ ఉందా అని ఇది క్రుయల్ ప్రపంచం అని  కూడా నీవు  SMS పంపావు  అదీ అయినా గుర్తుందా ప్రియా..అద్బుతమైన అందమైన SMS  lu పంపేదానివి నేను ప్రతి రోజు ఎదురు చూసేవాడిని జీవిత సత్యాలు ఒక్కసారి తలచుకో నీవేం చేస్తున్నావో అర్దం అవుతుంది..మనసుపై దాడి ని మర్చిపోవావ్లంటే రోజూ వెచ్చగా  గొంతులోకి మందు దిగంది నిద్ర పట్టని పరిస్థితికి తీసుకొచ్చావు... అప్పుడు అడిగే హక్కుందేమో కాని ఇప్పుడూ నన్ను అడీగే దైర్యం లేదేమో కదా బుజ్జీ ఎందుకంటే అది నీమనస్సుకు తెల్సిన నిజం మరొకరు అర్దంచేసుకోలేని వాస్తవం కదా...?నీకోసం నేను రాసుకున్న పదాలు గుర్తున్నాయా

ఆ స్నేహం కోసం ఎన్ని జన్మలైనా పుట్టాలని ఉంది

కల్మషం లేని మనసుని చూసా తొలిసారిగా
నను కనుపాపలా వెంటాడే ఆ స్నేహం
కలత చెంద కూడదని
దేవుణ్ణి వెడుకుంటున్నాను ప్రతి క్షణం
నే కళ్ళు మూసుకుంటే అమ్మ లా
నా బాదలొ ఓదార్పులా
నా సంతోషం లో నవ్వులా
తన ప్రేమలో జీవంలా
చూసుకొనే ఆ స్నేహం గురించి
వర్ణించటానికి పదాలు లేవు
ఆ స్నేహం కోసం ఎన్ని జన్మలైనా పుట్టాలని ఉంది
చెరగని మమకారం ఈ జన్మలోఆ దేవుడు నాకిచ్చిన వరం నీ స్నేహం

మరిప్పుడేమైంది అంతలో ఇంతలా ఎలా మారావు ఒక్కసారి ప్రశ్నించుకున్నావా ప్రియా...అంతమందిని వదలి పారిపోయేలా మనస్సుపై దాడి చేశారు వేష్టుగాళ్ళు వాళ్ళకు నీసపోర్టు ...అందుకే పారిపోయా . నీవే వాళ్ళకంత సపోర్టు చేస్తుంటే వాళ్ళు వదులుతారా ప్రియా  వాళ్ళు వేష్టుగాళ్ళు అని తెల్సుకునే రోజొస్తుందిలే ... నేను ఎంతగా భాద పడితే  అక్కడ ఉండానలేక పోయా నంటే అసలు నిజాలు తెల్సినా తెలియనట్టున్న నిన్ను చూసి భాదేసింది..రాత్రుల్లు నిద్రపట్టని  పరిస్థితుల్లో మద్యాన్ని నింపుకుంటున్నా అది నన్ను తగల బెట్టే  పెట్రో ల్ అని తెల్సు అయినా తప్పదు  నాగుండెమీద జరిగిన దాడులు పడ్డగాయాలు అలాంటివి ఇప్పుడు నీవు ఏవీ నమ్మే స్థితిలో లేవు అంతలా ఏమార్చారు ఆ కొత్తగా వచ్చిన వాడితో సహా అందుకేగా .,,,ఇలా పారిపోయి వచ్చా నీకు మనసుంటే ఆమనస్సుతో అర్దం చేసుకునే ప్రయత్నం చేస్తే తెలుసుంది అస్సలు నిజం మౌనంగా రోదిస్తున్నా నాకు ప్రతి రాత్రి కాళ రాత్రే నా నువ్వు ఎలా మారిపోయావు ప్రియా

నీకోసం నా మనస్సుతో ఒంటరిగా పోరాడుతున్నా ప్రియా

నీ తలుపులు రేపే
నా ఈ నిశ్శబ్ధయుద్దంలో..
ఒంటరిగా పోరాడుతున్నా మనస్సుతో
యుద్ధం చేసేదీ నేనే....
గాయపడేదీ నేనే... ప్రియా
నాకూ గాయపడాలని లేదు
ఎప్పుడూ విజయం సాదించాలని ఉంది కాని అది
సాద్యిం కాదని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ప్రియా 

నీవిషయంలో ఎప్పుడూ ఓటమిని గుండెలపై  వేసుకొని
భారంగా  తిరుగుతున్నా ప్రియా

నిన్ను నానుంచి దూరం చేసిన
నల్లని రాత్రులలో నీకోసం
ఎదురు చూస్తూ వాడిపోయిన
నా హృదయం సాక్షిగా
తుంపులు తుంపుల జ్ఞాపకాలూ…
గాఢమైన దిగుళ్ళూ గుండె
బరువుగా నీకోసం ఎదురు చూపులు
కనుల ముందే చేజారే క్షణం ..
కనులు నమ్మలేని నిజం
కనులు దాటని కన్నీటి జలం
మరి ఇది ఏ దేవుని శాపం మూలమో ప్రియా


నీ మౌనంలోనూ....
కెరటాల అలజడిలోనూ వినిపిస్తుంది
నా హృదయ ఘోష...ణీకు చేరాలనే  తాపత్రయం
ఉప్పొంగే ఆశల నిట్టూర్పుల మద్యి కొట్టాడుతున్నా బుజ్జీ
నా శ్వాస కదలి కరిగిపోతున్న నా ఆశ నిరాశగా మారి
ఆశలో ఊపిరి పీల్చాలన్న ద్యాసే మరుస్తున్నా నీ ఆలోచహలతో ప్రియా 


నీ తలపులు కలలోను కలవరపెడుతుంటే...
నిద్రలేని రాత్రుల్ల  సాక్షిగా నీకోసం  నా ఆవేదన
నన్ను నేను ఓదార్చుకోలేక నాలో నేను
లోలోపలే నా పై కలబడుతున్న
నీ జ్ఞాపకాలను తడుముతూ నాకన్నీటికి
సమాదం ఎమని చెబుతావు ప్రియా


ప్రియా నీ మౌనమేంతో గుండె బరువై ........నీ మాటలన్నీ కరువై .....

ప్రియా ఏనాటి నేరమో ఈనాటి ఓటమి ....
మనసు ఆడిన ఆటలో నేనేమో ఒంటరి.....
ఆశతోనే నేను అంతరించి పోతాను..
ప్రేమ పోరాటంలో నేను ఓడిపోయాను...
దోషిగా నిన్ను నేన్నెన్నటికీ నిలబెట్టను...
 నాకు నేను పూర్తిగా తగల పడ్డాకూడా

ప్రియా ఊహల ఊయలలో నేనూగుతుంటాను...
ఆ తీయని భాధలో నేను బ్రతికేస్తుంటాను...

ప్రియా నీ ప్రేమను పొందలేక పోయాను...
అయినా నీకోసం ప్రాణమైనా ఇస్తాను...

ప్రియా మరు జన్మలోనైనా నీవు నాకు దక్కాలనుకుంటాను...
ఆ ఆశతోనే నేను అంతరించి పోతాను
ప్రియా  నీ మౌనమేంతో గుండె బరువై ........నీ మాటలన్నీ కరువై ......
నీ మౌనమేంతో మనస్సు భారమై ........నీ మాటలన్నీ కరువై .......
ప్రియా ఆలోవనలు నన్ను నిలవనీయదు...
ఎక్కడ నీవంటూ అడుగుతున్న మనస్సు
రె ప్ప పడదు నా కంటికిన నిను కలిసే దాక ...........
ప్రియా నీ పరిమళాల చందనాలే ..ఇంధనమై నన్ను మండిస్తే.........
నీవు రేపిన ఆశలు నన్ను చావనీయక బ్రతక నీయక ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి...
ప్రియా  నీవు లేని నేను లేనని తెల్సికుడా నన్ను వీడి ఎందుకు వెల్లావు అని అడుగలేను
ఈ ప్రాణమెందుకు ఇంకా ఉంది అంటూ ...అంటూ నీ ఆలోచనలే ప్రియా

నీలాల గగనాల ఓ జాబిలి, నిన్ను నిరుపేద ముంగిట నిలిపేది ఎల

ఆకాశమా నీవెక్కడ, అవని పైనున్న నేనెక్కడా
ఆకాశమా నీవెక్కడ, అవని పైనున్న నేనెక్కడా
ఎ రెక్కలతో ఎగిసి వచ్చినా... ఎ రెక్కలతో ఎగిసి వచ్చినా, నిలువగలన నీపక్కన
ఆకాశమా నీవెక్కడ, అవని పైనున్న నేనెక్కడా

నీలాల గగనాల ఓ జాబిలి, నిన్ను నిరుపేద ముంగిట నిలిపేది ఎల?
నీలాల గగనాల ఓ జాబిలి, నిన్ను నిరుపేద ముంగిట నిలిపేది ఎల?
ముళ్ళున్న రాలున్న నా దారిలో నీ చల్లని పాదాలు సాగేది ఎల?
నీ మనసన్నది నా మది విన్నది, నిలిచి పోయింది ఒక ప్రశ్నల
నిలిచి పోయింది ఒక ప్రశ్నల

ఆకాశమా... లేదక్కడ
ఆకాశమా లేదక్కడ, అది నిలిచి వున్నది నీపక్కన
వేల తారకలు తనలో వున్నా.. వేల తారకలు తనలో వున్నా నేలపైనే తన మక్కువ
ఆకాశమా లేదక్కడ, అది నిలిచి వున్నది నీపక్కన

వెలలేని నీ మనసు కోవెలలో నన్ను తల దాచుకోని చిరు వెలుగునై
వెలలేని నీ మనసు కోవెలలో నన్ను తల దాచుకోని చిరు వెలుగునై
వెను తిరిగి చూడని నీ నడకలో నన్ను కడదాక రాని నీ అడుగునై
మన సహజీవనం వెలిగించాలి నీ సమత కాంతులు ప్రతి దిక్కున
సమత కాంతులు ప్రతి దిక్కున

ఆకాశమా నీవెక్కడ.. అది నిలిచి వుంది నాపక్కన
వేల తారకలు తనలో వున్నా, వేల తారకలు తనలో వున్నా నేలపైనే తన మక్కువ
ఈ నేలపైనే తన మక్కువ

వినిపించు నా చెలికి మేఘసందేశం.


ఆకాశ దేశాన, ఆషాడ మాసాన మెరిసేటి ఓ మేఘమా... మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో వీడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం

వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై, వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై 
ఈ యడరి దారులలో యడద నేను పరిచానని, కడిమియోలె నిలిచానని
ఉరమని తరమని వుసులతో ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదన, నా విరహ వేదన 

ఆకాశ దేశాన, ఆషాడ మాసాన మెరిసేటి ఓ మేఘమా... మెరిసేటి ఓ మేఘమా

రాలు పూల తేనియకై రాతి పూల తుమ్మెదనై, రాలు పూల తేనియకై రాతి పూల తుమ్మెదనై
ఈ నిశిది నీడలలో నివురులాగ మిగిలానని, శిధిల జివినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో రుదిరబాష్ప జల దారాలతో....
విన్నవించు నా చెలికి మనొ వేదన, నా మరణ యాతన

ఆకాశ దేశాన, ఆషాడ మాసాన మెరిసేటి ఓ మేఘమా... మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో వీడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం




స్నేహమా ఎక్కడున్నావు ప్రియా

సూర్యతాపంతో ఎండిపోయిన సరస్సు లా,

మబ్బుల్లో దాగిన చందమామను అడిగాను,

జాబిలిలో వీచిన చిరుగాలిని అడిగాను,

వెన్నెల్లో విరిసిన మల్లెపూవును అడిగాను,

నింగిలో మెరిసిన నక్షత్రాలను అడిగాను,

నిశీధిలో కురిసిన మంచుబిందువులను అడిగాను ,

నా పాణ స్నేహం ఎక్కడుందని..?

ఎవ్వరూ నా స్నేహం ఆచూకీ తెలుపలేదు..


చివరకు ఏమీ పాలుపోక,

నా హృదయాన్ని తట్టిచూశా...!

అక్కడే నా నేస్తం ప్రశాంతంగా నిద్రపోతుంది..

ఉలిక్కిపడి లేచి చూసా..పైన నక్షత్రాలు చుట్టూ చిమ్మ చీకటి తప్ప ఏమీ కనిపించడంలేదు..

నాలో నేను కాలిపోవడానికి సిద్దం అయ్యాను ప్రియా

అందమైన నిండు జాబిల్లి నిన్న ఎంత అందంగా కనిపించావో నిండుగా అందాలు అరబోసినట్టు ఫుల్ గా కనిపించావు
నన్నెందుకు దూరంచేశావు..మనం ఎందుకిలా ఉన్నామన్నది ఇంకా నిజంకాదేమో అనిపిస్తుంది నన్ను నేను  నీవుగా మార్చాను నాలో నేను లేను ఉందంతా నీవే ప్రియా నమ్మవానేను  మొదటనుంచీ చాలాస్వార్దపరున్ని నా ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి నా అనుకున్నది నాకే సొంతం ఎవ్వరూ కనీసం కూడా ఆలోచించకూడదు ..నేను తనగురించే ఆలోచిస్తా తను నాగురించే ఆలోచించాలి అనుకునేంత పిచ్చి ప్రేమ నాది...కాని ఏది కూడదు అనుకుంటానో అదేజరుగుద్ది నాజీవితంలో కారణం తెలీదు...అలా అనుకున్నవార్నే నేను నమ్మి పూర్తిహా జీవితంలో కి ఆహ్వానిస్తా  అలా ఒకసారి నమ్మా మోసపోయా అప్పుడే అనిపించింది జీవితం అంటే ఇలా ఉండాలేమో .ఇలా ఉంటేనే మనుషులమేమో అని మరి నాకు ఆ పిచ్చాడిలా నటించడం ఏడ్వటం మాటలు మార్చడం ,,,మనసుల్ని ఏమార్చడం రాదు మరి అందుకే తను  దూరం అయింది  తనను కూడా తప్పు పట్టను తన లైఫ్ తనిష్టం నన్ను నమ్మని తను చెప్పలేదు...వాడిలా నటిస్తే తను నిజంగా దక్కేదేమో .. దేవుని గుడి సాక్షిగా వారు తనను పొదివి పట్టుకొన్నప్పుడు తను వాడికి సపోర్టుగా మాట్లాడిన క్షనం లో ఆరోజు  నిండు పూర్నమి ఆకాశంలో అందమైనా " జాబిల్లి" కనిపించింది నేనున్నా అంటూ చిలిపిగా నవ్వింది...ఆనవ్వే నీదంది..అయినా నా అదృష్టం మీద నాకు నమ్మకం లేదు  ఆ జాబిల్లి చెప్పే నిజాన్ని నమ్మలేదు ఆదే తనతో చెప్పా నీవు ఆలా నే చేస్తావా మాట్లాడకుండా పోతావా అని నేనలా  చేయను అన్నావు నమ్మా పూర్తిగా నమ్మా సంపూర్తిగా తనే నాజీవితం అనుకున్నా...అప్పుడప్పుడు శాడిష్టుగాడు నామీద దాడి చేస్తూనే ఉన్నాడు ఏదో రూపంలో  మౌనంగా బరించా వాడిని తనమీద ఇప్పటికీ నమ్మకంలేదు ఇంకా నామీద దాడి చేయాలనే చూస్తున్నాడు...అయినా నేను వాడిలా శాడిష్టునుకాదు..ఈ లోగా జాబిల్లి గుండే భరువును దించింది.. ప్రతినిమిషం ప్రతిక్షనం తనఆలోచనలే .. ఆలోచించే లోపు తియ్యగా మాట్లాడే స్వరంతో నా ఊపిరి వచ్చేది...ఏంటో అది నిజమేనా అని ఎన్ని సార్లు అనుకున్నానో తననే అడిగా నిజమే అంది..సృష్టిలో రహస్యిలుంటాయేమో గాని నామనస్సులో ప్రతిరహస్యి తనకు చెప్పుకున్నా అది తప్పైనా ఒప్పైనా ఎందుకో చెప్పాలనిపించింది తను  నా గురించి చెడుగా అనుకునేంత కుంచిత మస్తత్వంకాదు అర్దం చేసుకుంటుంది అని  నిజంగనే అర్దం చేసుకుంది ..ఎందుకో నాలోని స్వార్దపరుడు తన దూరం అవుతుందేమో అని హెచ్చరించాడు... అందుకే తను నా అని నేను ప్రవర్తించిన తీరు తనను హర్డ్ చేసింది.భాదపడింది ..నేనూ తను  భాదపడితే తట్టు కోలేకపోయా తను హేపీగా ఉండాలని దూరంగా ఉన్నా... అయిన తనెక్కడున్నా నా మనసు కళ్ళూ వెతుకుతూనే ఉండేవి దూరంనించి అన్నీ గమనిస్తూ ఉండే వాడిని  అందమైన జాబిల్లి అందమైన నవ్వును కద మళ్ళీ మొదటీకొచ్చింది ..తను నాది అంటూ పిచ్చిరాతలు వాళ్ళ రాతలను తన సపోర్టు చూసి హర్ద్ అయ్యా..అసలే నాకున్న స్వార్దం  నన్ను పిచ్చాడిని చేసింది .... మళ్ళో మరో పదాల అళ్ళిక ఇంకా పిచ్చాడీని చేసింది .... వాళ్ళు తన అనడం తను ఆమాటలకు సపోర్టు చేయడం ,.,,నా గుండెళ్ళో నరాలు తెంపినంత భాద.. తలలో నరాలు తెగిపోతున్నాయేమో అన్నంత వేదన అయినా ఏం చేయగలను వాళ్ళు తనకోసం తనగురించి రాసే ప్రతి రాత నాగుండేల్నికోసే రంపాలయ్యాయి...వాళ్ళలా కోస్తూనే ఉన్నారు నేను భాదపడతానని తెల్సీ తనూ వాళ్ళకు సపోర్టు చేసింది..వాళ్ళు నీవిచ్చిన చనువును ఇంకా ఆసరాచేసుకొని నా గుండేళ్ళో నరాలి పీకి నాపరాయితో చిట్లగొడుతున్నంతా భాద పడ్డా... అవన్నీ చూసి నీవు నవ్వుతూ ఉండటం ఇంకా భాదపెట్టింది ఇప్పటికీ చావుకీ బ్రతుక్కి వ్రేలాడుతున్న మనిషిని అప్పటి నా జాబిల్లి కి  ఇప్పటి జాబిల్లికి ఎంత తేడా అప్పుడు కొంచం భావపడ్డా కంగారు పడే మనిషి ఇప్పుడు ...కావాలని భాద పడేలా చేస్తుంది..బాధపడాలని చూస్తుంది నిజకాదని మనస్సును ఎలా సర్ది చెప్పను,,,కళ్ళెదురుగా జరుగుతున్న నిజాలను చుస్తూ అందుకే అక్కడీనుంచి పారిపోయా ఇక్కడికొచ్చా ఇక్కడా ఉండాలని లేదు ..చిమ్మచీకట్లో ఒంటరిగా తన జ్ఞాపకాలతో గడుపుతున్నా... అప్పుడన్నావు ..జ్ఞాపకాల మూటలన్ని పెట్టు ఏకాంతంలో కలుస్తాను అని అది సాద్యం అవుతుందేమో అని చిన్ని ఆశ ..ఇప్పుడెందుకో అది అత్యాసేమో అనిపిస్తుంది కాని ప్రియా ( బుజ్జి ) నీకో రోజు ఒక నిజం తెలుస్తుంది .. అప్పుడు కచ్చితంగా నీగుండే పగులుతుంది నాకోసం వెతుకుతావు కచ్చితంగా నేను నీకు కనిపీంచను నేనూ అందరిని నీవుకాకపోతే మరొకరు అనుకునా టైప్ కాదు ,,,ఈ జీవితానికి  ఇంతే ఇంతవరకే జీవితం అనుకంటున్నా ఇలా మనస్సులో ప్రతిక్షనం మదన పడూతున్నా తీరని వేదన ఎన్నాళ్ళు ఆరోజు వరకేగా ప్రియా నాలో నేను కాలిపోవడానికి సిద్దం అయ్యాను ప్రియా ..కనిపించకుండా కనుమరుగయ్యే రోజు దగ్గరలోనే ఉంది లే..అందరూ శాడిష్టుగాళ్ళనే నమ్ముతారు నిజాన్ని నమ్మరు నిజ్లను తెల్సుకోరు నిజం తెల్సుకోరు తెల్సుకోలేరు ..?

Sunday, February 24, 2013

మది సమాదిపై రాసుకుంటున్న చివరి రాతలు నీకోసమే ప్రియా

జీవితం  అంటే ఇలా ఉంటుందేమో తెలీదు..ప్రతీది వెదన బరితమని తెలేదు అలా అని తెలిస్తే నీజోలికి వచ్చే వాడిని కాదు నీజోలికే కాదు నన్ను నన్నుగా ఉండనీయక మోసం చేసిన వారి జోలికి కూడా నేనెందుకు వేదన పడాలి అని ఎన్ని సార్లు నన్ను నేనూ తిట్టుకున్నానో.. అందరూ మనుషులే స్వార్దం ఎదుటి మనిషి మనసు తో పని లేదు స్వార్దం అందుకేనేమో  నన్ను చూస్తూనే నానుండి దూరమై గమ్యాన్ని వెతుకుతూ నీవెళ్ళిపోతే...నా గమ్యిం ఏంటో తెలేక నిషీద రాత్రుల్లు ఏడ్వటం తప్పించి నేనేం చేయలేక ... ఏం చేయ్యలో తెలీక...ఓదార్చే వారులేక ఆకాశం లోని జాబిళ్ళి వైపు ఆశగా చూస్తూ...అందదని తెల్సి ఆశపడ్డ నా బ్రతుకు తుట్టుకుంటూ ప్రియా నేను ఇది అన్ని నీవు ఎన్నీ రకాలుగా మనస్సును వేదించినా ఎందుకో నామనస్సు నిన్నే కోరుతుంది కాణి నీవు ఎందుకాల చేస్తున్నావో ఎదోమూల నేనున్నానా అని తడుముకుంటున్నా ప్రియా...కళ్ళెదురుగా జరుగుతున్న కొన్ని విషయాలు చూసి తట్టుకోలేక పారిపోయాను బుజ్జి...ఇంకా దూరంగా పారిపోవాలనే వుంది ...అప్పటి నానువ్వు ఇప్పటి నీవు   ఒక్కటి కాదు నన్ను చీమలతో పోల్చినప్పుడే ఎంట భాదపడ్డానో కాని జాబిల్లి ఆందం నీది ..జాబిల్ల్ లాంటి నిన్ను చేరుకోలేని నేను నేనూ టిట్టుకుంటున్నా లాస్యా నివు నవ్వుతుండాలి అదే నా కోరిక ఏమైందో చెప్పమంటే ఏం చెప్పను ఏం చెబుతున్నానో అర్దం అవుతోందా ఇది చదువుతున్నా నీకూ నాకూ తప్ప ఎవ్వర్కి అర్దం కాని మనసు ఘోష ప్రియా నీ మనస్సు నుండి నీవు వెళ్ళినప్పటినుండి నవ్వనేదే లేదు   ఒక్క క్షణమైనా కంటికి కునుకులేదని నిశిరేయిలో నా నీడను నేనే వెతికానిన్ను ఏదురుగా లేకపోయినా ఆకాశం లో జాబిల్లిలా కనిపిస్తావుగా ఆ ట్రుప్టి తో వెలుతున్నా ఎక్కడికో తెలీదు ప్రస్తుతానికి కొన్ని మాటలు చూడలేక పారిపోయి మళ్ళీ బ్లాగులో తేలా ఎవ్వరూ ఎందరు వచ్చినా  నిన్ను నాకు దూరం చేయలేరని వాళ్ళకు తెలేదు కనీసం నీకూ కూడా తెలీదు కదా ప్రియా నన్ను బంధించి భాధిస్తున్న తలపులన్నీ గుండేల్లో బాంబుల్లా పేలుతుంటే ఆధాటికి ఎప్పుడో గుండె ఆగిపోయేట్టు ఉంది అదే కావాలని ఒక్కసారి చెప్పవూ ప్లీజ్ ప్రియా ..నీ మదిగోడల్లోనే నా జ్ఞాపకాలు సజీవ సమాధి అయిపోతే ఎవరికి చెప్పుకోలేక నా మనస్సు పడుతున్నా ఎందుకు అని  అనడిగితే ఏమని చెప్పను నీవు లేకపోతే నాచుట్టూ  చిమ్మ చీకట్లు  నన్నావరించి చంపేసేలా ఉన్నాఅయినా  నేను చనిపోయాని  తెలిస్తే నీ మనసు కలవర పడుతుందని అన్నది పచ్చి అబద్దం కదా ప్రియా ఈ మద్యి నీ ప్రవర్తన చుస్తే అర్దం అయిందిలే ప్రియా అందుకే నేను వెళ్ళీనా నీ కంట నీరిడలేడు కారనం గుండేల్లో నేను లేనుకదా అందుకే అక్కడ వుండలేక పారిపొయా అందరినీ ప్రేమగా నీవిచ్చే రిప్లై  నన్నూ వెక్కిరిస్తున్నట్టు ఉంది ..వాళ్ళు నీకోసం రాసే రాతలు గుండెళ్ళో గునపాలైపోతున్నాయి నేను   చెప్పాలనుకున్నవేవీ నీకు నేను చెప్పలేనని తెలిసి తెల్లకాగితంపై నీ పేరునే  రాస్తున్నా రాస్తున్నా అవే చివరి అక్షరాలు అవుతాయేమో తెలీదు అయినా నీకేం నీవు హేపీగానే ఉంటావు ఆ నవ్వు నానువ్వూ కాదిప్పుడూ చాలా చాలా మారిపోయావు ప్రియా ఏం అనలేను జాబిల్లి జాగ్ర్త్తగా ఉండు నిజంగా నీకు ఆపదంటు వస్తుంది అప్పుడన్న నన్ను తలచుకో ప్రియా నేనంటూ ఉంటే నీకంటూ ప్రానం ఎవ్వటానికి నేను ఎప్పుడూ సిద్దమే అని తెల్సుకో చాలు ప్రియా

Tuesday, February 19, 2013

నన్ను నేను కోల్ఫోతున్నా .. నా ఆనందాన్ని కోల్పోతున్నా Priya

న‌న్నే గమనిస్తున్న నా నీడ‌
కాళ్ళీడ్చుకుంటూ నా వెంటే ఉంటుందనుకున్నావా?
దానికో సాయింత్రమొస్తుంది
... న‌ను వీడి వెళ్ళిపోతుంది అప్పుడు
నా చుట్టూ నేనే
నాలో నేనే...
నే వొంటరిన‌వుతాను..> నిన్ను నమ్మిన క్షనం లో ప్రపంచాన్ని జయించాను అని అనుకున్నా నన్ను నేను కోల్ఫోతున్నా .. నా ఆనందాన్ని కోల్పోతున్నా ..నాలో మనిషనే వాడే లేడని  ఓ శవంళా తిరుగాడుతున్నా నని చాలా ఆలస్యింగా తెల్సుకున్నా అందుకేనేమో నా నీడను చూసి నీవని మురిసిపోయాను ..నీ వల్ల నాకు నేనే ఓ సమస్యిలా నాకు నాకు నేనే  తరగిపోని భాదల ఇలా మిగిలిపోయానేందని  నివు పంపిన sms  చూసి నీవు ఫోన్ చేయద్దన్న SMS పంపినక్షనం నుంచి నాలో నేను చేస్తున్న యుద్దం ..నాకు నేనుగా  నామీద నాకు చిరాకుపడేలా చేసి ఆనదంగా ఉన్న నిన్ను చూసి నా మాటలే నాతో మౌనం పాటిస్తున్నాయి ఏమాలో చించాలో తెలీక ఏం ఆలోచిస్తున్నానో అర్దం కాక

 " రెప్పల చాటున దాగిన దృశ్యాలన్నీ
పెదాలు బిగించి
ఒక్కొ వంతెన్నీ దాటుకుంటూ వెళ్ళుతున్నాయి
అంతా జ్ఞాపకాల గొడవే
నన్ను గుర్తించిన ఒక్కో జ్ఞాపకం
నన్నో ఏకాంతాన్ని చేసి వెళ్ళిపోతున్నాయి
ఇక నేనంతా బట్ట బయలే
నాకే రహస్యాలూ లేవు "...> నిజమే నాకు నేనే ఓ అర్దంకాని
రహస్యింలా మిగిలిపోయాని కదిలిన నాగుండే భాద ఎవరికని చెప్పుకోను ఏమని చెప్పుకోను..
పెదాల చాటున గట్టినా బిగిచ్చి  బాదను దాచిపెట్టాలని చుస్తున్నా దాగతం లేదు.. ఈ క్షనం   ఈ నిమిషం నాకు నేను తగలబడాలని ఉంది.ఒకవేల నీమనస్సు మారినా నేను కనిపించకూడదు నా బూడిదతప్ప నాకు తెల్సి నీకీవిషయం తెల్సిన క్షనం నివెంత ఆనందిస్తావొ అని  నీకళ్ళలో ఆ ఆనందాన్ని చూడాలని నా మనస్సు తొందర పెడుతోంది ప్రియా "నేనో రహస్యమైనా
నాకే రహస్యాలు లేక పోయినా
అసంకల్పిత భావోద్వేగాలు నన్నెప్పుడూ చుట్టుముట్టే ఉంటాయి Bjii

Sunday, February 17, 2013

ప్రేమ పిచ్చివాళ్ళ సముదాయం లో ఒక ..ప్రేమికుడ్ని నేను. ప్రియా

పిల్లా!
పొరపాటున .... నన్ను
పడెయ్యాలని చూడకు!
నా అంత నేను పడిపోయేందుకు సిద్దం.
ఒడిదుడుకుల జీవితం
పరిస్థితుల ప్రభావం
పిచ్చివాళ్ళ సముదాయం లో
ప్రేమికుడ్ని ఒకడ్ని .... నేను.
పోగొట్టుకునేందుకు విడిగా .... నా వద్దేం లేవు.
పోగొట్టుకుంటాననే భయం లేదు.
అతిగా మునుపెవర్నీ ప్రేమించలేదు .... ..>నిజమే నేను పిచ్చి ప్రేమికున్న నీవు నాకుగించి తీవ్రంగా అలోచించినప్పుడు నీప్రేమలో నిజాయి ఎంతవరకో అని భయపడ్డా అప్పుడే చెప్పా నన్నొదిలి పోతావాని లేదు అన్నావు..నా ఫేట్ మీద నాకు అంత నమ్మకం విన్నావుగా నాగతం అంతావిని అది నీ స్వగతంలా ఫీలయ్యినప్పుడు నిజమా నీ అనంతమైన ప్రేమ నాదేనా అని పొంగిపొర్లిపోయా సమాజం కట్టుబాట్లు అడ్డులేకపొతే ఆరోజే నీ వడిలో సేదతీరేవాన్ని కాని... నాకు కావల్సింది గుప్పెడంత ఈ ప్రేమకు గుర్తుంచుకునే తీయ్యటీ స్నేహం నిన్ను కలవాలని నీదురుగా ఉండి నీవు చెప్పే ఆ తియ్యటి మాటల వినాలాని నామనసులో భాదకు నీవు చెబుతున్న తియ్యటి సమదానం ఎదురుగా నీవు చెబుతుంటే నీ అందమైన కళ్ళలో కళ్ళుపెట్టి చూస్తూ వినాలని నా మనస్సు తహ తహ లాడింది ఎంతగా అంటే నన్ను నేను కంట్రో చేసుకోవడానికి నీన్ను చేరుకోలేని నాదురదృష్టానికి నేని ఎవరూ చూడకుండా కార్చిన కన్నీరే సాక్ష్యాలు..మనసు మూగగా రోదిస్తున్నా అవేం నీకు తెలియకుండా ఉండేందుకు నేను పడిన తపన ఎలా చెప్పుకోగలను ప్రియా.."ప్రియా!
అర్ధం అయ్యేలా చెప్పాలనుంది.
నా వేదాంతాన్ని....
ఎలా చెప్పాలో తెలియడం లేదు.
అర్ధం అయితే ఆనందిస్తావని తెలుసు.
అనుభవానికొస్తే అమరానుభవం పొందుతావని తెలుసు.
అందుకే చెబుతున్నా .... " ఆమత్రం చెప్పేందుకు ఇప్పుడు నీవు దగ్గరగా లేవు అయినా..మనసు నివేదన చేర్చలేక నీటిమీద రాతలు ఇవి నీగుండేల్లో రాయాలని కలలు కన్నాను అవి కళ్ళలుగా మిగిలిపోయిన క్షనాన దూరంగా కూడా ఉండి చూడలేని కళ్ళున్న గుడ్డివాన్ని చేశావు.. స్నేహితుల లిష్టులో లేనప్పుడే నీ మనస్సులో నాస్థానం తెల్సిపోయింది ఎన్ని రిక్వష్టులు పంపినా నీ ఫ్రెండ్స్ లిష్టు చేర్చుకునేందుకు నీ మనస్సు ఒప్పుకోలేదు ఎందుకో ...అలా ప్రతిసారి నీకు రిక్వష్టులు పండం నీవు రిజెక్ట్ చేయడం ఫేజ్ బుక్కోడు గమనించాడో ఏమో నన్ను బ్లాక్ లిష్టులో పెట్టాడు...అలా నెలరోజులు అ
నెలరోజులు గడపడం మళ్ళీ నీకు రిక్వష్టులు పంపండ ఫేజ్ బుక్కోడు నన్ను మళ్ళి నెలరోజులు బ్లాక్ లిష్టులో పెట్టడం ఫ్రెడ్స్ రిక్వష్టు పెట్టకుండా ఒకప్పుడు నీవెంతగానో ప్రేమగా నీ అంతటనీవే రిక్వేష్టుపంపిన రోజూ గుర్తుకొచ్చాయి ప్రియా " ఒడిదుడుకుల జీవితం
పరిస్థితుల ప్రభావం
పిచ్చివాళ్ళ సముదాయం లో
ప్రేమికుడ్ని ఒకడ్ని .... నేను.
పోగొట్టుకునేందుకు విడిగా .... నా వద్దేం లేవు.
పోగొట్టుకుంటాననే భయం లేదు.
అతిగా మునుపెవర్నీ ప్రేమించలేదు "...>అంటే నీవు నమ్మవేమో కదా ఎందుకంటే నేను నీ మనస్సు విరిచి వేశానుకదా...నా అనుకొని స్వతంత్ర్యిం తీసుకున్నా అక్కడ నీ మనసు గాయపడింది... ఎప్పటికైన నీవు నాతొ మాట్లాడతావని ఎదురు చూస్తున్నా..నీవు నాకు విదించిన శిక్ష జీవితకాలం అని ఇప్పుడిప్పుడే అర్దం అవుతోంది...చెప్పు వచ్చేజన్మలో మనం ఏకం అవుతాము అంటే ఇప్పుడే నా ప్రాణం విడవటానికి సిద్దంగా ఉన్నా ప్రియా నాపిచ్చిగాని మౌనంగానే ఉంటావు ఏదీ తేల్చవుగా చావాలో బ్రతకాలో ..

వెంటాడుతున్న జ్ఞాపకాలతో

వినిపించలేను విరహవేదన
ఆలపిస్తున్నా ఆత్మ సాక్షిగా
మనసు మాటున దాగివున్న
జ్ఞాపకాల సాక్షిగా మరిచిపోలేని
ఈ నరకయాతన నీ తోడు లేక
ఒంటరినై నీ పలుకులే లేక పంజరమై
వెంటాడుతున్న జ్ఞాపకాలతో
చేజార్చుకున్న చెలిమి కోసమై
పయనిస్తువున్నా పిచ్చివాడిలా
పెనవేసుకున్న ప్రేమ కోసమై ఆరాట పడుతూ
నీ తీయ్యని పిలుపుకోసం ఆరాట పడుతూ
నీకోసం ఎదురు చూస్తున్నా ప్రియా

ఒకప్పటి నీజ్ఞాపకాలే గాయా లైయ్యాయి ప్రియా

న‌న్నే గమనిస్తున్న నా నీడ‌
కాళ్ళీడ్చుకుంటూ నా వెంటే ఉంటుందనుకున్నావా?
దానికో సాయింత్రమొస్తుంది
న‌ను వీడి వెళ్ళిపోతుంది అప్పుడు
నా చుట్టూ నేనే

నాలో నేనే...
నే వొంటరిన‌వుతాను
నేనో ఏకాంత క్షణమవుతాను
అప్పుడు నాలో ఏ ఉద్వేగమూ మిగల‌దు
నాకంతా రహస్యమే....> ఆరహస్యిం నాలోదాచుకునే వాన్ని చెప్పుకునేందుకు నీవున్నావు...ఓదార్పుగా చెప్పేనీమాటలు నన్ను ఎప్పుడూ నీడలా వెంటాడేవి...ఎందుకో నాకు చాలా దైర్యంగా ఉండేది... ప్రపంచం చిన్నదిగా అనిపించేది .. మల్లీ నీ తీయ్యని స్వరం వినేదాకా నా మనస్సు నీ మాటలకోసం సూన్యింలో వెతికేవి ... మనస్సేమో నీమాటల్ మూటలు గుండెళ్ళీ నిక్షిప్తంచేసి..అంత మండుటేండలోకూడా చల్లని గాల్లులో తేలియాడేట్టు చేసేవి..నేను ఒంటరిగా ఉన్నా నన్నమాట మర్చేవాన్ని ఎందుకంటే ఎదోసమయంలో నీస్వరం వింటాననే దైర్యం ,,,గతం చేసిన గాయాలకు అదో మందు..అన్ని మర్చి నీ తీయ్యని స్వరం కోసం వెతికే వాన్ని..గుర్తిచ్చిన క్షనాన్నె SMS లతో నీ సెల్ లో నింపేవాన్ని అప్పుడు గాని నాకు తృప్తిగా ఉండేది ఏంటో కదా ..నీవు ఎక్కడికన్నా వెళ్ళావంటే గుండె తడబడేది..ఎందుకో నీకోసం తీవ్రంగ ఆలోచిస్తుండగానే నీ కాల్..అంతే అప్పటిదాకా పడ్డ ఆవేదన తుర్రుమని ఎగిరిపోయేది..ఇలాంటి తియ్యటి జ్ఞాపకాలన్ని నీడల్లా వెంటాడుతున్నాయి
" రెప్పల చాటున దాగిన దృశ్యాలన్నీ
పెదాలు బిగించి
ఒక్కొ వంతెన్నీ దాటుకుంటూ వెళ్ళుతున్నాయి
అంతా జ్ఞాపకాల గొడవే
నన్ను గుర్తించిన ఒక్కో జ్ఞాపకం
నన్నో ఏకాంతాన్ని చేసి వెళ్ళిపోతున్నాయి
ఇక నేనంతా బట్ట బయలే
నాకే రహస్యాలూ లేవు" నామనస్సునిండా నీజ్ఞాపకాలే అంటే నీవు నమ్ముతావా...ఒకప్పటి నీజ్ఞాపకాలే గాయాలై ఇప్పుడూ బాదిస్తున్నాయి..అప్పుడలా ఇప్పుడిలా ఏంటో జీవితం..నీపరిచయం లో నా అంత అదృష్టవంతుడు లేడు మరి ఇప్పుడూ నా అంత దురదృష్టవంతుడు లేడు అదృష్టానికి , దురదృష్టానికి వ్యత్యాసం ఇంత భాదాకరం అని తెలీదు అప్పుడు నీకు దూరంకాకుండా ఉండేందుకు జాగ్రత్త పడేవాన్ని ,,,కాని నీవు నా అనుకున్నా...అందుకే అంతస్వార్దంగా ప్రవర్తించా,,,అదే నీమనసును గాయం చేసిందేమో...అగాయం నాకు మిగిల్చి నాకు దూరం అయ్యావు..

ప్రేమంటే ఇదేనా ప్రియా...?

నా ప్రేయసి నాతో అంది
ఎదురుగా కూర్చుని .... నేను
ఆమె కళ్ళలోకి చూసినప్పుడు
"నీవు గొప్ప జ్ఞానిని
నీలో దివ్య తేజస్సుంది!" అని ...> అవును ప్రేమిస్తున్న మొదట్లో ప్రియుడే లోకం తనే ప్రపంచం తిన్నాడో లేదో అని ఎలా ఉన్నాడో అని ఇకా ప్రతి నిమిషం ఆలోచింది ప్రియుడికి తనకంటే తనగుంరించి ఆలోచించే వాళ్ళున్నారని ధీమా తనే నాకు ప్రపంచం అనుకుంటాడు... ఎప్పుడు ప్రియురాలు తనకోసం పడే ఆరాటం ఎక్కడకు వెల్లినా తనను గుర్తుతెచ్చుకోవడం అందుకే తన మనస్సుకో ఒక ఇరుకైనా ప్రపంచాన్ని సృష్టించుకొని ప్రియురాలిని దేవతగా కొలవడం మొదలు పెడతాడు.అంతే తనక్కడ ఊపిరి పీలుస్తుంటే ఇక్కడ ఆయువు ఉంటుంది లేదా పోతుంది అన్నట్టు ఉంటాడు ..సమస్యి వస్తే మాట్లాడుకోవాలి అపార్దలు వస్తే అర్దం చేసుకోవాలి అంతే ..ఎందుకో ప్రియురాలిలో ఆకస్మికమార్పు అప్పటిదాకా తట్టుకోలేని ఆనందాన్ని రుచి చూపించిన ప్రేయసి భాద ఎలా ఉంటందో వేదన ఎలా ఉంటుందో అని చురకలు వేస్తూ మరొకరి సమక్షంలో భాదపెట్టడం మొదలు పెడుతుంది కారణం అర్దం కాక కన్నీళ్ళకు అర్దం తెల్సుకోలేక పిచ్చివాడవుతాడు,,,అలా పిచ్చి పట్టేలా ఏక్కడ ఎలా భాద పడతాడో తెల్సుకొని మరి భాదపేదుతుంది మరి,," గర్వం, అభిమానం, హోదా
జీవితంలో వాటి స్థానం,
ఆపేక్షలు ఆశయాలు ఆవేశాలు
సెగలు నానుంచి వెదజల్లుతూ ఉన్నా ....
సూచన లేని వినయంలా,
ఒక రోజు పంచభూతాల్లో ఒకటైన భూమి ....
ఆరడుగుల స్థలంతో .... ఎదురుచూస్తుండటం నిజం! తట్టుకోని నిజాలను తట్టి చూపు నీ బ్రతుకు ఆరడుగుల నేలలోనని చెప్పకనే చెబుతుంది...అందరి ఎదురుగా చీమలా చేసి మాట్లాడుతుంది ఇదేనా ప్రేమంటే ...ఒకప్పుడు తనకు నీవు " బంగారం " ఇప్పుడు...?

Saturday, February 16, 2013

ఏదా అద్బుత దృస్యిం..అందమైన జలపాతంలాంటి నవ్వు ఎక్కడున్నావు ప్రియా

కనపడని అడుగులు చేస్తున్న శబ్దం
గళ్ళు గళ్ళు మని
అదియల శబ్దం లయబద్దంగా
ఏదో నాకు వినిపిస్తుంది
టక్కున నిశ్శబ్దాన్నీ చేదిస్తూ
గుండెలదిరేలా పెద్ద శబ్దం
కిందపడి భళ్లున పగిలి
ముక్కలైన మౌన శిథిలాలు
చెల్లా చెదురుగా విడివడి
లెక్కలేనన్ని రూపాలను
సంతరించుకుంటున్నాయి
మనసు అగాథంలో ఎక్కడో
అణు విస్ఫోటం జరిగి
నా అణువణువుకూ పాకి
ప్రకంపనలు సృష్టిస్తుంది
ఏదో తెలియని శక్తి
నా నరనరాలగుండా ప్రవహించి
నన్ను ఉత్తేజపరుస్తుంది
ఎన్నో రంగులు పులుముకున్న
అందమైన దృశ్యమొకటి
నా కంటి నాడులపై నాట్యం చేస్తుంది
కకలావికలమైన ఆలోచనల ఉప్పెన
చివరకు సద్దుమణిగి నా ముందొక
అందమైన చిత్రాన్ని ఆవిష్కరించింది
లోతెరుగని లోయల్లోకి
జారిపోతున్న నా చేతికి
ఓ చెట్టుకొమ్మ దొరికింది
నాకు ఆధారంగా నిలుస్తూ
అరే అదేంటి అక్కడ నీవు కనిపిస్తున్నావు
నీ తియ్యని స్వరం వినిపిస్తుందేమిటి.
ఆనువ్వు నీవేనా ఆనవ్వునీదేనా ప్రియా
ఉలిక్కిపడి చూస్తే అంతా చీకటి ఎక్కడనీవు ..
ఏదా అద్బుత దృస్యిం..అందమైన జలపాతంలాంటి నవ్వు ఎక్కడున్నావు ప్రియా

Friday, February 15, 2013

గుండె దడగా ఉంది ..మనస్సెందుకో అలజడిగాఉంది

గుండె దడగా ఉంది ..మనస్సెందుకో అలజడిగాఉంది
కారనం తెలీదు ఎవరికోసమో మనస్సు ఆరాట పడుతుంది
తన జాడ లేకలో..ఎక్కడుందో ఎలా ఉందనో
ఓ మనిషి మరో  మనిషిని ఇంతలా
శాశిస్తారా..మౌనంలో కూడా సంభాషిస్తారా 

కారనం తెలీదు నా గుండెదడకు ఆన తెల్సుకోలేను
అయినా ఏంటీ ప్రపంచం ఏంటీ జీవితం
ప్రతిసారి దెబ్బమేద దెబ్బ నాకే ఎందుకు తగులుతోంది 

ఈప్పటికిప్పుడు ఇక్కడికిక్కడ దూరంగా పారిపోవాలనుంది
పారిపోలేను,,దరి చేరలేని అసహాయున్ని ప్రియా
నిజమే..గుండె ఈక్షనం ఆగిపోతే ఎంత బాగుండో అనిపిస్తుంది

ప్లీజ్ ఎవ్వరైనా నా ఊపిరిని లాగెయ్యరా
నా ఆయువుని ఇప్పటికిప్పుడు తీసెయ్యరా
ఎవ్వరికి చెప్పుకోలేను
ఏమిటో ఆలోచనలు ప్లిజ్
ఏంటి గుండెదడ మనసు అలజడి

బరించలేని భాదను గుండెళ్ళో రగిలించి ఆనందిస్తున్నవు.

ఏ దివ్య కాంతి పుంజమో
నీ నీడ ను నా దరికి చేర్చింది
నీ మౌన పరిభాష
నా కవితాక్షరాలై కులుకుతున్నాయి..> అవును ఆకాంతి పుంజం వెలుగుల్లో వెలిగిపోవాలని ..ఎన్నో ఆశలు పడ్డాని...ఆవెలుగులు జీవితానికి అనుకున్నా కాని నన్ను తగులబెట్టే నిప్పు అనుకోలేదు నా మనసును తాకిన క
ాంతులు జాబిళ్ళి వని మురిసిపోయాను కాని అది పైకి కనిపించని సూర్యుని అతినీలలోహిత కిరణాలని తెల్సుకోలేకపోయాను..అవి ఎవ్వరికీ కనిపించకుండా నన్ను తినేస్తున్నాయి..
నీ మౌన పరిభాష
నా కవితాక్షరాలై కులుకుతున్నాయి...> గుండెళ్ళో సెగలై ఆవిర్లు బైటికొస్తున్నాయి..అందరిని ఆ సెగ తగులుతోంది నీకూ మాత్రం చల్లగా హాయిగా ఉంది అందుకేనేమో ఇంకా మనసును రాజేసేస్తున్నావు. ఎందుకంటే నీ చలికి కావుకాచే వేడి ఆసెగలేకదా.. నాకు భరించ రాని ఆవేదన నీకు ఆనంద పుష్పాలు కదా ....................నాలోని భావకున్ని నీకర్పిస్తున్నాను...
నన్ను నీ సొ౦త౦ చేశాను. నీ అనుమతి లేకు౦డా...> అందుకేనేమో బరించలేని  భాదను గుండెళ్ళో రగిలించి ఆనందిస్తున్నవు... ఇంతకీ నీపరిచయం నాకు వరమా శాపమా ప్రియా..(

నా శవం మాట్లాడుతోంది ఆవేదనగా


ఎం మనుషులో , వీళ్ళస్సలు అర్దం కారు
బ్రతికున్నప్పుడు చంపేసి చచ్చాక ఏడుస్తారు.
చితి పై పండ బెట్టాక నాజ్ఞపకాలు ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయేమో
అందరి కళ్ళలో కన్నీరు జల జల రాలుతుంది

నేను చితిమంటల ల పై తగలబడుతున్నాక
ఎందుకో కొందరు ఒక్కపెట్టున ఏడుస్తున్నారు
వీళ్ళే ఒకప్పుడు నన్ను గుండెలవిసేలా చేశారు
నేను చచ్చిపోవడానికికారణం వీళ్ళే
మరిప్పుడేం ఇలా గుండెలవిసేలే ఏడుస్తున్నారు

అసలు నేనేవరో తెలిని మనుషులు
వాళ్ళే సొంతగా నన్ను పరిచయం చేసుకున్నారు
నా ఏడ్పేదో ఏడుస్తుంటే..ఓదార్పులా వచ్చి
తనకొసం ఏడ్చేలా చేసింది
మనసు మారింది మనిషి కూడా మారింది ఎందుకో
ఎవరికోసమో నన్నోడించి ఏడ్పించడం మొదలు పెట్టింది

ఎవడో పక్కన చేరి వాన్ని పొగుడుతూ
నన్ను తిడుతూ వెటకారపు మాటలు
వాడు రెచ్చిపోయి పదాలతో ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నాడు
వాడి మాటలు నా మెడ నరాలు కసుక్కున కొరికినంత భాద

వాన్ని ప్రేమగా పిలుస్తూ నన్ను వెటకారపు మాటలతో వేదించావు
అప్పుడు నీవు నా గుండె మీద దాడి చేసి
నరాలు తెగ్గోసినంత భాద,,రక్తం పీల్చి పిప్పి చేస్తున్నంత ఆవేదన

నీ వన్న ప్రతి మాటకు ఒక్కో గుండె నరం తెగిపోయింది
రక్తం జల జలా రాలింది..రక్తం ఏరులై పారింది
ఐనా నేను మౌనంగానే ఉన్నా
మౌనంగానే నా ప్రాణాని వదిలా

ఒకప్పుడు ఎంతో ఇష్టంగా ఉన్న నీవే
ఇప్పుడు శత్రువులా నన్నేడిపించి చంపేశావు
నిన్ను ప్రాణంగా ప్రేమించడమే నేను చేసిన తప్పేమో
అందుకే ఆప్రాణం తీసే హక్కు నీదే అని అనుకున్నావేమో
ఆ హక్కుతోనే నన్నిలా వేదించి చంపావేమో

ఇంతా చేసి ఇప్పుందుకు ఆకన్నీరు
నిజంగా ఏడుస్తున్నావా ,,అందరూ చూస్తున్నారని నటిస్తున్నావా
నాకెందుకో నీవు కన్నీరులా లేవు ..
నా పిడా విరగడైందని వస్తున్న ఆనంద భాష్పాల్లా ఉన్నాయి


ఇంకా ఎందుకురా నటిస్తావు
నీజం ఒప్పుకోరా...ఇప్పటికైనా ప్లీజ్ నటించకు
అదిగో నీ వాళ్ళు వచ్చారు
వెళ్ళు వాళ్ళాకోసమేగా నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చావు
వెళ్ళు వాళ్ళేకదా నీకు ముఖ్యిం వెళ్ళరా
ఇంకా ఎందుకు ఏడ్చినట్టు నటిస్తావు


ఓయ్ నామాట నీకు వినిపిస్తుందా
నా ఆవేదన నీకు అర్దం అతుందా
చితిమీద ఉన్నా నీగురించే ఆలోచనలు
నీకోసంగతి తెల్సా ..
నాతో పాటూ నీజ్ఞాపకాలను తీసుకెలుతున్నా

ఒయ్ ఎక్కడికి వెళ్ళీపోతున్నావా ఒక్కసారి నావైపు చూడవా
వాళ్ళోచ్చారు వాళ్ళతో నీవెళ్ళీపోతున్నావేంటీ
నేనింకా పూర్తిగా తగలబడలేదు
అప్పుడే నీ స్నేహితులతో వెళ్ళీపోతున్నావా
ఇప్పటిదాక నేనన్నవన్నీ నిజాలేనా
నామీద కోంచేంకూడా ప్రేమలేదా
ప్లిజ్ నేను పూర్తిగా కాలిపోయేదాకా అన్నా
నటించవా..ప్రియా ,,ఇది నా హృదయ వేదన ప్రియా




Thursday, February 14, 2013

నీ కై నిరీక్షనలో కాలాన్ని స్థబించాలనే ఉంది ప్రియా

నీ నిరీక్షణలో ................

మౌన సంధ్యనై
చీకటి నిశికి వారధినవుతున్నా

నీ హృదయాగమనంలో
నిలిచిపోయిన కాలాన్నవుతామనుంది..>నీ కై నిరీక్షనలో కాలాన్ని స్థబించాలనే ఉంది నాకా శక్తిఉంటే..జరిగిపోయిన గతాన్ని తిరిగి తెచుకోవాలనే ఉంది కాని ఆసక్తున్ని అన్నీ ఆలోచించడంతప్ప కాలాన్ని శశించలేను కావాలంటే నీవు పీల్చే ఉపిరిని శ్వాసించగలను ..ఒక వేల నీ ఊపిరి అగేక్రమంలో నా ఊపిరిని అడ్డంగా పెట్టగలను కాని జరిగిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురాలేను జరుగుతున్న వాస్తవాల్ని ఏం చెప్పి ఆపగలను కాలగమనాలను ఇప్పుడూ శాశించాలని నుంది లోకాన్ని ఒక్క క్షనం ఇప్పటికిప్పుడు ఆపేయాలని ఉంది ...నిన్ను సోంతం చేసుకునేందుకు.."................... ఓయ్
నీలోనే నా ప్రాణం ఉందనీ
అది నీతోనే వెళ్ళిపోయి‍దని నీకు తెలుస్తోందా..?
కనీసం అది నీతో చెప్పిందా?
నీజ్ఞాపకాలే నా ఊపిరైనాయని " ...> నాగుండె చప్పుడు నీకు వినిపిస్తుందా... నాహృదయనివేదన నీకు అర్దం అవుతోందా..కళ్ళూడి చూడలేకపోవడం చెవులుండి విలలేకపోవడం అంటే ఇదేనేమో ప్రియా ఓయ్ ఒక్కసారి నాగుండె ఆవేదన వినివెళ్ళవా...కంటిలోని భావాలు చదివా,,,నా కన్నీటికి అర్దాలు ఎన్నున్నాయో చెప్పవా..వసంత రుతువులు ఆగమన కాలాలు మనసు అవసరమా ..మనం ఏకం కావాలంటే.. కాలాన్ని కాస్త ఆగమని చెప్పవా ప్లీజ్ "నీ హృదయాగమనంలో
నిలిచిపోయిన కాలాన్నవుతామనుంది

నీ పూదోటలో
శిశిరం లేని వసంతాన్నవ్వాలనుంది " నీకోసం ఇలా ఆశపడుతూ ఆత్యాసకు పోతున్ననేమో..ఆరని తీరని వేదని నీచెవికి చేరేదెన్నడు ..అది జరిగేనా...కాలం కాళ్ళదగ్గరకు నా నివేదన చేరేనా ప్రియా ..కడలి కెరటాలా హాయిగా ఉండాల్సిన నేను ఇప్పుడెందుకిలా ఆకెరటాల అలలకు కొట్టుకు పోతున్నానో కదా..కాలం కందిరీగలమాది నామీద దాడిచేసి నన్ను నాహృదయాన్ని చిల్లులు చేస్తోంది ప్రియా నారోదన నీకందడం లేదా....Priya

నీ జ్ఞాపకాల సాక్షిగా,,నీకోసం ఎదురు చూస్తూ


Wednesday, February 13, 2013

ప్రేమికుల రోజు సందర్బంగా నా గుండెళ్ళో ప్రేమజ్వాల ప్రియా ఇది

నా ప్రేమ ను
విశ్వప్రేమికులంతా ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంటుంది

ఈ మాటలు ఎక్కడైనా నేనంటే
నా మానసిక స్థితి ని అనుమానిస్తారేమో?
అని కూడా నాకో సందేహం....> విశ్వమంత ప్రేమ ఉన్నా విస్వసించలేనప్పుడు..అపార్దాల సుడిగుండంలో ఉండి మనస్సు బండగా మరి మారిన నిన్ను
చూస్తూ...యుగ యుగాలుగా నిజాయితీ ప్రేమకు పట్టిన గతేనని విషాదంగా మిగిలిపోయా..నెవెక్కడున్నా హేపీగా ఉన్నావులే అని మనస్సుకు సర్దిచెప్పుకోనా నిజమే ప్రతి క్షనం ప్రతి నిమిషం నిన్నే తలుస్తున్న నన్ను చూసి నీవన్నట్టు నాకు పిచ్చే ప్రేమ పిచ్చి..నన్ను నేను కూడా ఇంతగా ప్రేమించలేదేమో..నామీద కూడా నేను ఇంతాలా ప్రేమించి ఉంటే..నిన్ను ఇష్టపడి ఉండేవాడిని కాదేమో అవును నిజమే "నన్నో షాజహాన్ గానో, శరత్ గారి దేవదాసు గా మిగిలిపొవాల్సిందే ఆకేరక్టరే కరెక్టని డిసైడ్ అయ్యావేమో అందుకే దూరంగా ..నాకు ఏది మనస్సు కష్టమనిపిస్తుందో అదే చేస్తున్నావు...గుండెకు గాయమేకాదు ..ఆగాన్ని కూడా గండిపెట్టగల మనసులేని మనిషిగా మారావు ఇలాఅని తెల్సిఉంటే నన్నునేనైనా ప్రేమింఉకునే వాన్ని కాని ..నీదాసున్ని అయ్యాకదా ఈ వేదన నాకు తప్పదు....నీచుట్టూ నిన్ను పొగిడేవాళ్ళను పెట్టుకొని అదే ప్రపంచం అని నిర్నయించుకున్నావు కదా ..? పొగడ్త చూసి వదిలేయాలి వాళ్ళనే వెంటబెట్టుకొని గొప్పగా ఫీల్ అవుతున్నావు..ఎదోరోజు అసలు నిజం తెలుస్తుందకదా..? నిజమే పొగడ్తల మద్యి ఉన్నవాళ్ళను ఎదురుగా నిజాలు కనిపించవు..అలాగే నీవు కళ్ళున్న గుడ్డి మనిషిగా మారిపోయావు నేను శాశ్వితంకాదు బట్ నా ప్రేమ శాశ్వితం ఈ కట్టే కాలే సమయానికైనా ఆ నిజం తెల్సుకుంటావన్న నమ్మకం అస్సలు లేదు ఇప్పుడు andukee "ఇంకా నా ప్రేమ ను విశ్వప్రేమికులంతా ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంటుంది " నా ప్రేమలో నిజాయితీ పెద్దగా గొంతులో నరాలు తెగేలా చెప్పాలని ఉంది కాని ...మూగవాన్ని చేశావు....

నా హృదయం
రోదిస్తుందని తెలుసు
నీవు ఎదురుగా లేవని
నీతో పంచుకోవాల్సిన ఎన్నో భావాలు
ఇంకా మిగిలే ఉన్నాయని


నీవు
నన్ను హింసిస్తున్నావు
నీ జ్ఞాపకాలతో గతం
మధురోహల మత్తు
నా నర నరాల్లో
దిగమింగుకోలేకపోతున్న ఊసులు ..>నాకు మిగిలింది రోదించడమేకదా..ప్రేమను నిజాయితీగా ప్రేమించాను..నిండు పున్నమి జాబిలి వని నిన్ను ఎంతగా ఇష్టపడ్డానో అంతగా పట్టపగలు సూర్యిన్నే నీలో దాచుకొని మనసు దోచుకొని జ్ఞాపకాలతో దాడి చేస్తూ గాయం చేస్తూ మురిసిపోతున్నావు అందుకేనేమో నాగాయలైనా నీ నవ్వే నాకు ముఖ్యిం NAdi oka Premena kada "ఒక ప్రేమేనా
ఒక అబద్దం ఒక అస్పష్టతేనా
ఒక అయోమయమేనా అని .... అడగాలి
అర్ధం తెలుసుకోవాలి అని
అక్షరాలు కొన్ని .....
అంతరంగలోనే ఆవిరైపోతున్నాయి "కాదు ఆవిరి చేస్తున్నావు...నిలువునా దహించి వేస్తున్నావు నీకు ఏదైనా సాద్యిమే "ఇప్పటికీ నీ ప్రేమ భావనల్లోనే
మధుర స్మృతుల్లోనే ..... రోదిస్తూనే
కన్నీటి ప్రతిబింబాలు .... భావాలు కొన్ని
మనసు గోడల్లోనే ఇంకిపోతున్నాయి! " నాకన్నీరు రక్తంగా మారింది ప్రియా

Tuesday, February 12, 2013

నేను కాలి బూడిద ఔతానేమో ప్రియా

మబ్బుల్ని గుండెల మీదకు లాక్కుని..
పచ్చని ప్రకృతి దుప్పటితో
నీ జ్ఞాపకాల్నిపరుచుకొని పడుకుంటాను

నన్నిప్పుడు చుట్టుముట్టే నిరాశల వేడిగాలుళ్ళో
నేను కాలి బూడిద ఔతానేమో ప్రియా

ప్రతిరాత్రి వచ్చే ఆకొద్దిపాటి నిద్రలో
ఉలిక్కిపాటు కలవరింతల్లో

ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ వయ్యారంగా కనిపిస్తావు
వెనక్కి తిరిగి ఏదో చెప్పబోయి హటాత్తుగా మాయమౌతావు

మళ్ళీ లీలగా నీ జ్ఞాపకాల కందిరీగలు
చుట్టుముట్టి నాగుండెపైదాడి చేస్తాయి ప్రియా

నీ కలలకు బద్ధలైన కళ్ళలోంచి నెత్తురో కన్నీరో
అర్దంకాని పరిస్థితుల్లో
నారోదన నీకు వినిపిస్తుందో లేదో ప్రియా
అన్నీ తెల్సినా నీవు మాత్రం కలగా మిగిలావు

Monday, February 11, 2013

ఎక్కడో ఏదో జరుగుతుంది ప్రియా నిజంకోసం పోరాడుతున్నా

ఎక్కడో ఏదో జరుగుతుంది
గాలి చొరబడని మనిషి కనబడని
కీకారణ్యం..ఒక్కడినే ఉన్నా
చుట్టూ మనుషులున్నారు
ఏంటో ఒక్కల్లకు హృదయం లేదు
డబ్బాల్లా తిరుగుతున్నారు
హృదయం ప్లేస్ లో మాత్రం
ఓ ప్లాష్టిక్ కాలీ డబ్బా ఉందెంటో

నాచుట్టు నీజ్ఞాపకాలను పర్చుకొన్నా
వాటి వెలుగుల్లోనే బ్రతుకునీడుస్తున్నా
బ్రతకాలన్న ఆశతోకాదు
ఎప్పటిదాకా బ్రతుకుతానోతెలీక

చుట్టూ స్మశానం బ్రతికామన్న ద్యాసే లెదెందుకో
చుట్టూ సమాదులే ..అదే కదా చివరి మజిలీ
అందుకే అక్కడేమన్నా నిజాలు
తెలుస్తాయేమో అని దేవుతున్నా
ఎందుకోతెల్సా..నీవే ఇలా చేస్తే
అందరూ ఎందుకలా ఉంటారో అని

నాశరీరాన్ని ఎండబెట్టి ఆరబెడుతున్నా
మార్పు నాలోరావాలేమో అని
నన్ను నేను మార్చుకోవాలని
ఇంకా ఏమన్నామార్పువస్తుందేమోఅని
నిన్ను ఏం అడగలేను అడిగినా చెప్పే పరిస్థితిల్లో లేవు

నేను అందరూ నా వాళ్ళని ఆరాటపడితివే
నాది ఆవేదనగా మిగిలి పోయింది
ఇక్కడ నాచుట్టూ ఉన్న శవాలతో సహవాసమే
ఇదే బాగుంది..అవే కాస్త అర్దం చేసుకున్నాయి
చివరకు నా ఆకరిస్థానంలో ఏన్నో నిజాలు దాగున్నాయని

నాచుట్టూ ఎందరి జ్ఞాపలానున్నా
అంతలా వెలుగునిస్తున్నవి నీజ్ఞాపకాలే
ఆవెలుగుల్లో ఈ జీవితాన్నిబ్రతికేయొచ్చేమో ప్రియా

ఇంతా వెతుకుతున్నా అసలు నిజాలను చేదిస్తానోలేదు
అందుకే వెతుకుతూనే ఉన్నా ..
వెతుకుతూనేఉంటా చివరి వరకు ప్రియా

ఓదార్చే చేతుల కోసం….సేదదీర్చే ఒడి కోసం

ఏదో చెయ్యాలని ఉన్నా ….ఏం చెయ్యాలో తెలియక
సమస్యేంటో తెలిసినా….పరిష్కారం పాలుపోక
ప్రపంచంలో ఇంతమందున్నా ….భుజం తట్టే వారు ఒక్కరూ లేక
నీలోనే ఒక నేస్తమున్నా ….తనతో మాట్లాడ బుద్ధికాక
ఓదార్చే చేతుల కోసం….సేదదీర్చే ఒడి కోసం
బేలగా ఎదురు చూస్తూ బాధగా బ్రతుకీడుస్తూ
నిమిషం అనేది నిరాశ రూపం గా కనిపిస్తే
అది ఆనందానికి అంటరానితనం
దాని పేరే ఒంటరితనం
అదినీవిచ్చిన గొప్పవరం కదా ప్రియా

ప్రతి క్షణం నీకోసం ఎదురుచూపు

ప్రతి క్షణం నీకోసం ఎదురుచూపు
కనిపించి కనుమరుగౌతుంటే నిన్ను తలచి
ఎందుకో ఈ ఉలుకుపాటు
వసంతం వస్తూందో రాదో
మనసును పులకరంచే ఆ పలకరింపు
నన్ను పలుకరిస్తుందోలేదో
నావైపు వస్తుందోరాదో
వస్తే ఇస్తూంది మైమరపు
రాకుంటే ఉండదు కంటికి కునుకు
వద్దనుకున్నా గుండేల్లో రేపే నీ ఆలోచనల గగుర్పాటు
ఎడారి వంటి మనసుకి అవుతాయి ఒయాసిస్సు
నీవు నన్ను వీడి వెళ్ళిననాడు మాత్రం ఇస్తాయి గుండె భారమైన కన్నీళ్ళు ప్రియా

Saturday, February 9, 2013

ప్రియా నిన్ను మర్చిపోవడమా..?

నిన్ను మరచిపోవడమంటే
నానుంచి నేను విడిపోవడమే
నా మనస్సులో నీ జ్ఞాపకాలు
సముద్రంలోని కెరటాల్లా
ప్రతిక్షనం ప్రతినిమిషం
ఎగిసి పడుతూనే ఉంటాయి
ఎంతగా తీరం వైపు తోసేసినా
తిరిగి నాలోనే కలుస్తాయి
జ్ఞాపకాల అలలు ఎగసి ఎగసి
నీ మనస్సును అందుకోవాలనే ఆరాటం
ప్రయత్నిస్తూనే వుంటాయి
నా ప్రయత్నం ఫలించదు అని తెలుసు
కాని నేస్తం ....నువ్వు అందని జాబిల్లివి
అయినా నా ఆలోచనలు ఆగవు
నీ నా జ్ఞాపకాల సాక్షిగా
నాలో ఎప్పటికీ నిలచే ఉంటావు
నిన్ను తలస్తూనే ఉంటాను ఎప్పుడూ ప్రియా

అయ్యో నాగుండేది ప్రియా


ఎందుకు చెంతకు వస్తావో ఎందుకు చేయి వదిలేస్తావో

ఎందుకు చెంతకు వస్తావో ఎందుకు చేయి వదిలేస్తావో
స్నేహమా చెలగాటమా..
ఎప్పుడు నీముడీవేస్తావో ఎప్పుడెలా విడదీస్తావో ప్రణయమా పరిహాసమా
శపించే దైవమా దహీంచే దీపమా .. ఇదేనీరూపమా ప్రేమా
ఫలిస్తే పాపమా కలిస్తే లోపమా గెలిస్తే నష్టమా ప్రేమా
ఈకలకా నాలేత మమతా..మరపురాని స్మ్రుముతులతోనే రగిలిపోతావా
మరపురాని గతంగానే మిగిలిపోతావా..
రెప్పలు దాటవు స్వప్నాలు చెప్పకతప్పడు వీడ్కోలు
నిజం నిష్టూరమా ప్రేమిస్తే కష్టమా
కన్నీటీకి చెప్పవే ప్రేమా

Monday, February 4, 2013

ఏంటో దీనమ్మ జీవితం...?

1) ప్రియ నన్ను ఎప్పుడూ ఓడించడం నీకలవాటు
 ఓడిపోతూ నిన్నుగెలిపిస్తున్నాని ఫీల్ అవ్వడం నాకలవాటు

2) నీ మౌనాన్ని అక్షరాలుగా మార్చాలని
 నాలోనేను పడుతున్న తపనే ఈఅక్షరాలు ప్రియా

3) రేపటికోసం నిన్నిటిని మర్చిపోవాలని చూసా
 నిన్నా రేపటి కోసం నేడు నలిగిపోతున్నా ప్రియా

4) ఆలోచనలను నరుక్కొవాలనుకోవడం
 అనాలోతంగా భాదను కొని తెచ్చుకోవడమే

5) నా గుండెళ్ళో నీకోసం గుడికట్టాని అనుకున్నా
 ఆ తరవాత తెల్సింది నాలోంచి నన్ను తరిమేశానని

6) నిన్నింకా ప్రేమిస్తూనే ఉంటా
 నీవు నన్ను ద్వేషిస్తున్న సంగతి మనస్సుకు చెప్పను
7) కత్తి కండను చీలుస్తుంది
  మౌనం మనస్సును చీలుస్తుంది
8) ఏంటి నీజ్ఞాపకాలు మెరుస్తున్నాయి
 ఇప్పుడే ఆమిగిన కన్నీటితో కడిగా కదా అందుకేనేమో

Friday, February 1, 2013

ఉద్యోగాల పేరుతో అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న ప్రబుద్దుడి పై సీక్రెట్ ఆపరేషన్

తండ్రితరువాత స్థానంలో ఉండే ఉపాద్యాయుడు..అలాంటి ఉన్నత  స్థాయిలో ఉండి ఎస్సార్ నగర్ లో విద్యాసంస్థల ముసుగులోజరుగుతున్న అక్రమ చీకటి వ్యవహారం పై నేను చేసిన సీక్రెట్ ఆపరేషన్.part-1

జరిగిన చీకటి వ్యవహారం మీముందుంచే ప్రయత్నంమరొకరు ఇలా బలికాకూడదని..చేసిన సీక్రెట్ ఆపరేషన్ అసలు నిజాలు మీరే చూడండి




తండ్రితరువాత స్థానంలో ఉండే ఉపాద్యాయుడు..అలాంటి ఉన్నత  స్థాయిలో ఉండి ఎస్సార్ నగర్ లో విద్యాసంస్థల ముసుగులోజరుగుతున్న అక్రమ చీకటి వ్యవహారం పై నేను చేసిన సీక్రెట్ ఆపరేషన్.part-2
ఇక్కడ జరుగుతున్న వ్యవహారాల పై నిజాలు తెల్సుకునేందుకు మేముచేసిన ప్రయత్నం..రెండు వైలా వర్షన్ తీసుకొని నిఖార్సైన నిజాన్నిరాబట్టాలనే ప్రయత్నం ఆవీడియో మీరూ చూడండి



తండ్రితరువాత స్థానంలో ఉండే ఉపాద్యాయుడు..అలాంటి ఉన్నత  స్థాయిలో ఉండి ఎస్సార్ నగర్ లో విద్యాసంస్థల ముసుగులోజరుగుతున్న అక్రమ చీకటి వ్యవహారం పై నేను చేసిన సీక్రెట్ ఆపరేషన్.part-3
ఈ వీడియో లో సదరు బాదితురాలు ఏం నిజాలు చెబుతుందో మీరే చూడండి