నీవు లేక.....
నీ నిట్టూర్పులలో.....
నా విరహం ఊపిరి వదిలింది.
ఎన్నో వెన్నల రాత్రులు
నీ తోడు లేక ఉసూరుమన్నాయి.
నువ్వు జీవితం కోసం వేస్తున్న స్కెచ్లలలో...
పనికిరాని గీతల్ల నా కోరికలు ఏరేజ్ అవుతున్నాయి.
స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ లా....
కురిపించకు నా మీద ప్రేమను.
కాస్త నిలకడగా ఉండు...
నా కళ్ళ రెప రెపలను
నువ్వు కాగితాల రెప రెపలతో పోలిస్తే.....
నా కలలన్నిటిని నోట్ల కట్టల్లా....
బీరువాలో దాచాల్సిందేనా....?