. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, August 31, 2014

Friday, August 29, 2014

ఆశతో నేను కాల్ చేసినపుడు దయచేసి నీవు ఫోను తీయ్ ప్లీజ్

ఆశతో నేను
కాల్ చేసినపుడు
దయచేసి నీవు
ఫోను తీయ్ ప్లీజ్ 
విసుగును కొంత సహించి
ఒక్క నిమిషమైనా  మాట్లాడు!
ఒక్కసారి నిన్ను 
కల్సి మాట్లాడతానని 
ఉబలాటపడితే
రాలేనని చీవాట్లు పెట్టు!
కబుర్లు చెప్పుకోవడానికైతే
కాలం విలువ నాకు తెలీదని  
గట్టిగా బెదిరించు!
కవిత్వం వినిపించడానికి
బలవంతం చేస్తే
అబద్దాలాడి
రాకుండా తప్పించుకో!
కలుసుకొనే ఇష్టం లేకపోతే
ఎగ్గొట్టడానికి
ఎన్నైనా నాటకాలాడు!
కాని -
ఒకసారి ఫోను తీసి పలుకు!
ఏ అవసరముండి
ఫోను చేస్తానో
ఎటువంటి ఆపదలో చిక్కుకొని
నీ ఆసరా కోరుతానో
నీ స్వరం విన్న నాలో 
కలిగే  భావాల తుంపరలతో 
నా మనస్సేంత  ఆనంద 
పడుతుందో నీకేం తెల్సు 
కరుణించి కాసేపు
నా ఆర్తనాదంతో
చెలగాటమాడకు!
రాంగ్ నెంబరొస్తే
కోపమొచ్చినట్టు
అవసరం లేని వాళ్లయితే
చూసీచూడనట్టు
అర్థించే ఆత్మీయున్నైన నన్ను 
గాయం చేయకు!
తెలిసిన పిలుపుని
తేలిగ్గా కొట్టేసి -
ఈ మిత్రుణ్ణి ఇంకా
ఏకాకిని చేయకు!
నా ఫోన్ బ్లాక్ లిష్ట్ల్ లో 
ఎందుకు పెట్టావు 
నేను నా మాట నీకెప్పటికీ 
వినిపిచకూడదనేగా 
నీవు రోజూ మాట్లాదే వాల్లలో 
నేను పనికిరాని వాన్ననేగా 
అంతలా నీకేం ద్రోహం చేసాను
అందరిలో నన్నిలా అవమానిస్తున్నావు 

ఆమె అడుగుల కింద నా "ప్రేమ" వాక్యం నిశబ్దంగా ముక్కలయ్యింది

నిద్ర ఒలికిన ఆ రాత్రంతా
ఆమె జ్ఞాపకాల్లో ఇటూ అటూ దొర్లుతుంటే
నాకు విరహపు మరకలు అంటుకొని
నా మనసంతా గాయాల పాలై
నన్ను వేదిస్తున్నాయి
నీవు నాలోనే వున్నావు
నీలో నేనున్నానో లేదో
అస్సలు ఓ మనిషిగా
నన్నెందుకు అర్దం చేసుకోవో తెలీదు
అపార్దంలో నన్ను ముక్కలు చేసి
నీవేం సాదిచావో
నాకిప్పటి సమాదానం లేని ప్రశ్నలే
నీ మనస్సులో లేత ప్రాయపు చిగుర్లు
ఉచ్ఛ్వాస నిశ్వాసాలను
అందుకునే నా ప్రయత్నానికి
ఆమెదేహాన్ని దేవాలయం
అనుకొని నా మనసింకా తనకోసం
ప్రదక్షిణలు చేస్తూనే ఉంది
నాకు అవమానాల గాయాలను 
బహుమతిగా ఇచ్చింది
అందరిలో నన్ను దోషిని చేసి
శిదిలం అయిన నా మనసనే
ఆలయంలో తడబడుతున్న నా జ్ఞాపకాలు
ఆమె అడుగుల కింద
నా "ప్రేమ" వాక్యం నిశబ్దంగా ముక్కలయ్యింది
సున్నిత రూపం లేతగా
సున్నిత మనసు మరింత లేతగా
నేను అక్కున చేర్చుకుందామంటే
అపస్వరాలు వినిపిస్తున్నాయి
వేసవి కాలపు వేడి గాలి
ఆమె ముంగురుల చివరి
చెమట చుక్కను మోసుకొచ్చి
నా పెదాలపై చిలకరించింది
ఆమె అందాల పుష్పగుచ్చమై
పుప్పొడిని నా హృదయంపై చల్లి
నిష్క్రమించింది
ఒంటి స్తంబపు ఆలయపు జేగంటలకు
నా జ్ఞాపకాలను అతికించి
వెనె్నల చెరువులాంటి ఆమెలోకి
నాకు నేను తొంగి చూసుకుంటున్నాను
నా హృదయం ద్రవించీ ద్రవించీ
చంద్రవంకలా మారిపోయింది
మాటలు రాని మనసు
ఆమె ఆలోచనల పంజరంలో
పెనుగులాడి పెనుగులాడి
యవ్వనపు తోటలో మొలకెత్తాలని
తొలకరి వానకై కలగంటున్నది
ఆశగా, ఆర్ద్రతగా
ఎన్నాల్లని వేచి చూడను
తను రాదని తెల్సి
నా మనస్సు ఇంకా ఇంకా
తనకోసం తపన పడుతూనే ఉంది

Thursday, August 28, 2014

చెంపలపై ఆత్మీయపు తడి తగిలితే ఏంటా అనుకున్నా వాన చినుకులా

అర్ధరాత్రి చెంపలపై ఆత్మీయపు తడి తగిలితే 
నా కన్నీరేమో అదేంటి నాకు తెల్వ కుండా  
వస్తున్నాయి అనుకున్నా
కిటికీ అవతల వర్షం కురుస్తోంది
తెల్లని పువ్వయి విచ్చుకున్న ఆ
కాశపు హృదయం నుండీ
జాల్వారినట్లు వాన కురుస్తోంది 
గతాన్ని గాయం చేశావుగా 
అందుకే నా కన్నీళ్ళు వానై కురుస్తోంది 


తెలియని రసప్రపంచపు రహస్య 
ద్వారమేదో తెరచుకున్నట్లుంటుంది
నీలిరంగు చీకటిలో నీడలు కదలాడినట్లు
మార్మిక ఛాయలేవో మనసును కలవరపెడతాయి
తడిసిన మట్టి వాసనతో గాలి శరీరాన్ని చుడితే
సాంద్రమూ సన్నిహితమూ అయిన స్వప్నమేదో 
స్పర్శించినట్లుంటుంది మనసెప్ప్పుడు 
నిన్నే తలస్తోంది
లేని నిన్ను నీ జ్ఞాపకాలు తలుస్తున్నాయి 

సగం తెరిచిన కిటికీ రెక్కపై
చిత్రమైన సంగీతాన్ని ధ్వనించే చినుకులు
చిరుజల్లై నన్ను తాకి నిన్నే 
గుతుకు తెస్తున్నాయి

నిద్రకూ మెలకువకూ మధ్య నిలిచి
నిద్రను దూరం చెస్తున్నాయి
మనసు ఉల్లాసంగా ఉన్నా..
ఎక్కడో ఎందుకో తెలీని భాద
మంద్రస్థాయిలో వినిపించే 
జంత్రవాయిద్యపు సంగీతవిభావరిలో
తన్మయమై పోయిన మనస్సు
తెలియకుండానే పొలిమేర 
దాటి నిద్రలో జోగుతుంది
తెరలు తెరలుగా దృశ్యం 
అదృశ్యంలోకి మాయమయినట్లుగా
ఏంటో ఏదో తెలియని భాద
తెలియని ఆందొలన 
ఎప్పుడూ నీవేం చేస్తావో 
అని ఎక్కడున్నావో అని 
తడబడుతున్న మనస్సు
నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక
వర్షం లో నేను కార్చే కన్నీరు 
ఎవ్వరూ చూడలేరుగా 
నీకు చూడాల్సిన అవసరం నీకు లేదుగా 

నమ్మకు నమ్మకు ఆడల్లలోని ప్రేమలను నమ్మినవానికి చూపెడుతుంది నరకాన్ని

నమ్మకు నమ్మకు ఆడల్లలోని ప్రేమలను నమ్మినవానికి చూపెడుతుంది నరకాన్ని


నన్నెందుకు ఇలా....వేధిస్తావు

ఎవరు నీవు.....
నాకు ఏమవుతావు.....
నన్నెందుకు ఇలా....వేధిస్తావు
నీవు కలవైతే
నేను నిదురిస్తాను...
మధురమైన జ్ఞాపకమైతే
నా మస్తిష్కంలో ఏదో పొరలో.....
నిన్ను పదిలంగా.....నిక్షిప్తపరుస్తాను.
గాయం రేపె బాధవైతే
మౌనంగా.....భరిస్తాను.
కానీ....,
నీవు మాటలు రాని మౌనంలా...
వెలుగు లేని చీకటిలా...
గులాబీ చాటు ముల్లులా......
అనుక్షణం నన్ను వెంటాడే నీడలా...
ఎందుకు నన్ను ఇలా.......వేధిస్తావు...
ఒక్కోసారి నీ మాటలతో నన్ను నామనస్సును
పెద్ద పెద్ద గాయాలు అయ్యేలా చేశావు
నీకది ఆనందమా.. ఎందుకలా మారావు
అప్పుడు అలా లేవే.. ఇంతలో ఇంత మార్పా
అభిమానించినందుకు అవమానించాలా
ఎందుకలా నేనూ మనిషినే కదా
ఒకప్పుడు నేనెక్కడ భాదపడతానో అని ఫీల్ అయ్యావు
ఇప్పుడు ఏదో విదంగా భాదపెడుతున్నావు...

Wednesday, August 27, 2014

నన్ను నా జ్ఞాపకాలను నీ కాలి ముని వేల్లతో తన్నావు గా..?

విరిగిన బంధం విలువెరిగి
కన్నీటి దరల్లో 
చెంపల గీతలెన్ని తుడిచినా
గతం మారదు

పోయిన పరువు బరువెరిగి
పొగిలిన చింత ఎంత కురిసిన
బరువు తీరదు.
పగిలిన గుండె సాక్షిగా 

వీడిన నిద్దుర సుఖమెరిగి
నిలచిన తనువులెంత తూలినా
తనివి తీరదు.
తానేంటొ తెల్సిన క్షనాన 

జారిన మాటల పదునెరిగి
తెగిన తావుల నెంతకుట్టినా
గాయం మానదు.
గుండె లోతుల్లో 
గాయాన్ని నీవు చూడలేవుగా ..?


అంతా వీడిన ఆవల
నన్ను  నా జ్ఞాపకాలను 
నీ కాలి ముని వేల్లతో 
తన్నావు ఇప్పుడునేను 
విలవిలలాడేం ఏం లాభం ?

చెల్లని చిత్తు కాగితాన్ని  చేసి
నన్ను నీవు విసిరిన క్షనాల్లో 
నాకు నేను మడతలు పడి
ఓడిన నేను వాడిపోయిన  మనస్సుతో 
నన్ను నేను ఎప్పుడో వీడిపోయాను లే  


Tuesday, August 26, 2014

Cobra News App is published in iPhone & iPad and Nokia X Platforms

https://itunes.apple.com/us/app/cobra-news/id909848009?mt=8

పైన ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి...24 గంటలు నేసమాచారాన్ని తెలిపే కోబ్రాన్యూస్ లో ఎప్పటికప్పుడు జరిగే నేరాలను తెల్సుకొండి

www.cobranews.net లో26th రొజు నేరవార్తలు

www.cobranews.net లో26th  రొజు నేరవార్తలు
1) విధులకు హాజరైన ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి 
2) విశ్రాంతి గదిలో శవమై కనిపించాడు.
3) వ్యభిచారం చేస్తు పట్టుబడ్డ యువతులు
4) జైళ్లు కాదు.. నేరగాళ్ల డెన్లు!
5) ప్రియుడే చంపి, వివస్త్రను చేసి పడేశాడు
6) ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్
7) ఒంగోలు జిల్లాకు నిర్భయ క్రైం సెంటర్’
8)ఈ ముసలి డక్టర్ మహా ముదురు..

Monday, August 25, 2014

www.cobranews.net లో24th రొజు నేరవార్తలు

www.cobranews.net లో24th  రొజు నేరవార్తలు
---------------------------------------------->
1) వివాహిత అనుమానాస్పద మృతి
2) 58 ఏళ్ల సహజీవనం తర్వాత ...
పెళ్ళి చేసుకున్న వృద్ద దంపతులు
3) తాగుబోతు ఉద్యోగి చేసిన 
నిర్వాకంతో రోగి ప్రాణాలు కోల్పోయాడు
4) వంద రహస్య ఖాతాల వివరాలు సేకరించిన భారత్
5) ఫోన్ కోసం దుస్తులు విప్పించి సోదా: బాలిక ఆత్మహత్య
6) పోలీసుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య ?
7) స్నేక్ గ్యాంగ్ పోలీసులనూ బెదిరించారు

Saturday, August 23, 2014

అన్నీ తెల్సి నన్ను నేను మోసం చేసుకొంటూ నేనేంటో తెల్సిన క్షనాలు కదా ఇవి

నా మనసులో ఏముందో వ్రాయాలి. కానీ ఎలా? ఎక్కడనుండీ మొదలుపెట్టాలి? ఏమని చెప్పాలి? ప్రేమలేఖలయితే ఎందరో వ్రాసారు. రిఫరెన్స్ దొరుకుతాయి. మరి గతంలో ఎవరయినా మనసులో మాట వ్రాసుంటారా? వ్రాస్తే మాత్రం బయటకి చెప్పుకుంటారా? ప్రేమ అనే పదానికి.. సారీ భావానికి అర్ధాన్ని వివరించాలని చరిత్రలో మొదటి పేజీ నుండి ఎందరో ప్రయత్నించారు. ఆ మహాయఙ్ఞానికి నేను సయితం సమిధనిచ్చా. అయినా ఆ మహాశక్తి విశ్వరూపం ఆవిష్కరింపబడలేదు. నిజమే అదే జరుగుంటే ఈ ప్రపంచం ఇలా ఉండేదా ఏమిటి? అయినా పదాలని వివరించగలంగానీ భావాల్ని అందులోనూ ప్రేమని నిర్వచించాలనుకోవటం ఏంటి నా వెర్రి కానీ.
సరే ప్రేమని నిర్వచించలేను మరి నా మనసులో ఏముందో..పెద్ద కవిసామ్రాట్ లా ఫోజుకొట్టేవాడినాయే మనసులో మాట ఏంటి మూగబొయిన జ్ఞాపకం ఏంటి చెప్పు అందరిలా బేలగా ఉంటే ఎలా? నాకేంటనో, నీ దురదృష్టం అనో అర్ధంవచ్చే కవిత ఒకటి అలవోకగా అలా అలా ఆశువుగా వదిలి, దర్పంగా కళ్ళు ఎగరేయాల్సిందే. అమ్మో అలా అయితే అందరూ వీడికి పొగరు అందుకే ఇలా జరిగింది అనుకుంటారేమో? గెలిచినా, ఓడినా సింపథీ ఎప్పుడూ మనవైపే ఉండేలా చూసుకోవాలి మరదే మానవనైజం. మరలా అయితే విధి ఆడే వికృత క్రీడ అనో, కధ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం బ్రహ్మ అనో అర్ధమొచ్చేలా వేదాంతంలోకి పోతే ఎలా ఉంటుంది? ఇందులో కుడా ఇబ్బంది ఉంది మరి. చూసేవాళ్ళు వయస్సే......, వ్రాసేది మోసేది పాత చింతకాయ పచ్చడి అంటారు. పోనీ “వదిలిపోకు నేస్తమా, నా జీవిత ప్రయాణపు చివరి మజిలీలో.” “ఙ్ఞాపకాల తట్ట నా నెత్తిన పెట్టే సహాయం మాత్రమే చేస్తావు. నా తోడు రావు. నేనెప్పుడూ ఒంటరినే అమ్ముకుంటూ ఉంటా భావావేశాన్ని ఈ విశాలరహదారుల్లో బాటసారులకి..” ఇలా రాస్తే. ఖచ్చితంగా కొందరు జాలి చూపిస్తారు. కొందరు పైశాచిక ఆనందం పొందుతారు. ఇంకొందరు ప్రాక్టికాలిటీ లేదని తేల్చేస్తారు. అయినా నేను ఏం వ్రాస్తున్నా? ఎవరికి వ్రాస్తున్నా? పార్టింగ్ నోట్ ఏమయినా శ్వేత పత్రమా? బహిరంగలేఖా? మరి ఎవరెవరో దీనికి ఎందుకు స్పందిస్తారు? పక్కవాడి వ్యక్తిగత విషయాలు అందులోనూ, ప్రేమ విషయాలు ఎంత ఆసక్తిగా ఉంటాయో కదా!
మొత్తానికి ఎక్కడ మొదలుపెట్టానో అక్కడే ఉన్నా. ఏం వ్రాయాలో తేలక. మనసులో మాట ఏంటి మూగబొయిన జ్ఞాపకం ఏంటి చెప్పుమనసులో మాట ఏంటి మూగబొయిన జ్ఞాపకం ఏంటి చెప్పు ఒక దృశ్యమా? ఒక ఙ్ఞాపకమా? ఒక సంఘటనా? అసలుమనసులో మాట  అంటే ప్రేమ లేఖ కాదా? “నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా..” “నిన్ను ప్రేమించే నేను నీ మనసుని భాందిచలేక మౌనంగా రోదిస్తూ వెళ్ళిపోతున్నా..” “నా మనసులో అపురూప కావ్యంలా ఒక గేయంలా నిలుస్తావనుకున్నా, కానీ ఒక మరుపురాని గాయంలా నిలిచిపోయావు” ఇవన్నీ మనలోని ప్రేమని చెప్పేవేగా మరలాంటప్పుడు ఇవి ప్రేమలేఖలు కావా? కాకపోతే మరి ప్రేమలేఖ అంటే ఏంటి? నాకు ఇప్పుడు మెల్లగా అర్ధమవుతుంది ప్రపంచమంతా ప్రేమనే భావంలో కాదు భ్రమలో మునిగితేలుతున్నారని. మనమంతా పువ్వుయొక్క సువాసనని అనుభూతి చెందుతున్నాం తప్పా, నిజమైన పువ్వుని, దానిలో నిఘూడమైన అందాలని,రహస్యాలని కనుగొనలేకపోయాం అని. కేవలం అనుభూతుల అలలే ఇంత ఆవేశాన్ని,ఉన్మాదాన్ని కలిగిస్తే, నిజంగా ప్రేమసాగరంలో ఆకేంద్రంలో లోతుల్లో ఇంకెంత విలయం ఉందో, అది ప్రపంచాన్ని ఇంకెంత కుదిపేస్తుందో కదా! కాదు కాదు నిజంగా ఆ ఉన్నత భావం విశ్వరూపం సందర్శనమయితే, నిజరూపం ఆవిష్కరింపబడితే మన మానవ మేధస్సు అర్ధం చేసుకోగలిగితే…. అరరే నేను ఏమి వ్రాస్తున్నా? నాకేమయింది? నేను వ్రాయాల్సింది మనసులో మాట కదా?నా ముందిప్పుడు రెండు మార్గాలున్నాయి. ఒకటి నా మనస్సు మీద కమ్ముకున్న ముసుగులను,ఇగోలను,అపోహలను,అందరూ ఏమంటారో అనే స్పృహను ప్రక్కనపెట్టాలి. అప్పుడే నాతో నేనే నటిస్తూ, నన్ను నేనే మోసంచేసుకునే పరిస్థితిని దాటగలను. లేదా పార్టింగ్‌నోట్ అనే ఆలోచనను పూర్తిగా వదిలేయాలి. మొదటిదే చేస్తా ఎందుకంటే అందరిముందు మంచి ఇంప్రెషన్ సంపాదించటం నాకు ముఖ్యం కాదేమో ఇప్పుడు. అన్ని ముసుగులను ఆభిజాత్యాలను వదిలేసా. నేను నేనుగా ఉన్నా. కాదు కాదు, నా మనస్సు కేవలం ఒక మనస్సుగా మిగిలింది. నేను అనే ప్రభావం, నా ఆలోచనలు దాని పైన లేవు. మకిలిపట్టిన ముత్యపు చిప్పలో అపురూపంగా దాచబడ్డ ముత్యంలా ఉన్న మనస్సు. ఇప్పుడు వ్రాయాలనే స్పృహ నాకు లేదు. నా మనస్సు నడిపిస్తుంది.
” ఎప్పుడూ నా జీవితంలో సంభోదన శూన్యమేనేమో. సరే కానీ..
ఎక్కడ మొదలుపెట్టాలో తెలియకపోయినా, మొదలుపెట్టక తప్పదుగా. వీడుకోలు తప్పదని తేల్చేసావుగా. అందుకే ఎవరికీ అన్యాయం జరగకుండా పెంచుకున్న భందాన్ని, పంచుకున్న అనుభూతుల్ని చెరిసగం వాటా వేసేద్దామని ఈ లేఖ. వచ్చిన చిక్కంతా ఈ ప్రేమ కేవలం ప్రస్తుతంతో కాక గతంతోనూ, భవిష్యత్తుతోనూ ముడిపడిపోయింది. చిన్నప్పుడు మీ తాతగారు కొనిచ్చిన బంగారు పట్టీలదగ్గరనుండి, నిన్నకాక మొన్న నీ పుట్టిన రోజున వేసుకున్న పట్టుపరికిణీ వరకు పరచుకున్న ఙ్ఞాపకాలను నా గుండెలో కుడ్యచిత్రాలుగా చిత్రించి, ఆ దృశ్యాల్లో నన్ను నేను లిఖించుకునే ప్రయత్నం చేస్తున్నా. ఇన్నివేల క్షణాలకి శ్రోతను కాగలిగానే కానీ ప్రత్యక్ష సాక్షిని కాలేని నా దురదృష్టాన్ని నిందిచుకుంటున్నా. ఏరోజుకైనా శాశ్వతంగా నా వద్దకు వచ్చేస్తావుగా అనుకున్నా. కానీ ఈరోజున ఇలా వదిలివెళ్ళిపోతావని 
ఎప్పుడయినా నువ్వు కిచెన్ లో ఒంటరిగా వంటచేస్తున్నప్పుడు, అల్లరిగా నాచేతులు నిన్ను అల్లుకుంటాయన్న ఆలోచన నీకెప్పుడు రాదని మాటిస్తే ఖచ్చితంగా చెరిపేస్తా. భవిష్యత్తులో నీసొంతవాళ్లయినా “ఐ లవ్ యూ” అని చెప్పినప్పుడు. వాడు పదే పదే చెప్పే ఈమాటలో ఉండే ఫీల్ వీళ్ళు మొదటిసారి చెప్పినప్పుడు కూడా లేదేంటి? అనే అనుమానం ఎప్పటికీ కలగదని మాటివ్వు. నువ్వడిగినట్టే ఙ్ఞాపకాల్ని అతకలేని ముక్కలు చేసేద్దాం.” అంతకు మించి ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా ...అన్నీ తెల్సి నన్ను నేను మోసం చేసుకొంటూ  నేనేంటో తెల్సిన క్షనాలు కదా  ఇవి 

Tuesday, August 19, 2014

అవేదనలో వస్తున్న పిచ్చి ఆశలకు అంతేలేదంటే ఇదేనేమో కదూ

నిన్ను నా ఊహల్లో నింపుకుంటూ..
గుండె గాయాలు పూడ్చుకుంటూ..
నీకోసం ఎదురు చూస్తూ 
నీ బాటన గులాబీలు పరుచుకుంటూ..
విధి వెల్లువలో కొట్టుకు పోతున్న .. 
ఓ చెకోర పక్షిని నేను 
నీ చెలిమి కోసం ఎదురు చూస్తున్న 
ఏండిపోయిన ఏరువాకను నేను
నా కంటి స్వాతి చినుకులు గుండెల్లో
దాచుకుని.. నీకోసం ముత్య మవుతున్న
ఆలు చిప్పను నేను.
నీకై గులాబీలు పూయిస్తున్నా 
నా గత జ్ఞాపకాల ముళ్ళపై 
పరుండి ఆత్రంగా నీకోసం ఎదురు చూతున్నా
వస్తావని ఆశలేదు అటూగా వెలుతూ 
నన్నూ చిరాగ్గా అయినా చూస్తావేమో అని  
అలా గైనా కని కనుచూపు లోని 
కంటిపాపలో ఒక్కక్షనం ఉండీపోవచ్చనే ఆశ 
అవేదనలో వస్తున్న పిచ్చి ఆశలకు 
అంతేలేదంటే ఇదేనేమో కదూ 

www.cobranews.net లో ఈ రొజు నేరవార్తలు


1) ఢిల్లీలో 5 స్టార్ హోటల్లో నర్సుపై గ్యాంగ్ రేప్
2) బలవంతంగా మద్యం తాగించి వివాహిత గ్యాంగ్ రేప్
3) వెబ్ మీడీయాకు అల్లు అర్జున్ వార్నింగ్
4) నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
5) తనను ప్రేమించాలటూ 
యువకుడి గొంటుకోసిన యువతి
6) అత్యాచార బాధితురాలి ఆత్మహత్యాయత్నం
7) ప్రేమజంటపై కీచకుల దాడి వివస్త్రను చేసి సెల్‌లో చిత్రీకరించిన దుండగులుSaturday, August 16, 2014

కోబ్రాన్యూస్ ఇప్పుడు Avilable On Android Market Lo Download Chesukondi..

కోబ్రాన్యూస్ ఇప్పుడు Avilable On Android Market Lo Download Chesukondi..
ఎప్పటికప్పుడు లైవ్ క్రైం న్యూస్ అడేషన్స్ తెల్సుకొండిFriday, August 15, 2014

కేవలం శవాలుగా నిష్క్రమించామని మనిద్దరికీ తెలిసిపోయింది


మనిషి జీవితం.. మంచితనం..కోరిక...ప్రేమ..ఇవన్నీ ఏంటో.. ఎందుకు మనజీవితాల్లోకి వస్తాయో ఎందుకు వెలతాయో తెలీదు..నేనేమైపోయినా నీవు బాగుండాలి అని అన్నిటికి తలవంచడ చేతకాని తనమా..చేతులారా నటించలేక నీ ఆనందంకోసం కన్నీళ్ళు త్రాగి నీవదిలిన నీ అడుగుల చారికలనే జ్ఞాపకాలుగా చేసుకొని గతాన్ని నిందించకుండా జరిగిన ప్రతి సంఘటన కు నన్ను నేను భాధ్యుడను చేసుకొంటూ నాలో నేను కుమిలిపోతున్న క్షనాలను లెక్కచేయకుండా ఎక్కడో చోట నీవు ఆనందం గా ఉంటావులే అన్న తలపులతో నాలో నేణు తన్నుక చస్తున్నా పైకి నవ్వుతూ నీకోసం నేను ఎప్పుడూ ఓడీపోతూ క్షనాలను ఎంత భారంగా గడుపుతున్నానో నా మనసుపొరలను తట్టి చూస్తే తెలుస్తుంది చూడలని ఆశలేదు  అలా ఆలో చిస్తావని కోరిక లేదు ఎందుకో ఈరోజు గడబిడగా ఏవేవో ఆలోచనలు కందిరీగల్లా నన్ను చుట్టు ముట్టి కుట్టేస్తున్నాయి..ఈ రాత్రి ఎలా గడుస్తుందో నని బెంగలేదు.తెలియని ఆందోలన ఇన్నేళ్ళ ఇన్ని తడిపొడి బంధాల పెళుసు కాగితమ్ముక్కల చాటున దాగి విరిగిపోయిన అక్షరాలు ఎందుకో వెక్కిరిస్తున్నాయి..నేనేప్పుడూ ఇలా ఆలోచిస్తుంటే వెర్రివాడినని  చీదరించుకుంటున్నాయి అచ్చం నీలానే సగం మాత్రమే రాసిన అక్షరాలు నాకు ఉరి కంబాల్లా కనిపిస్తున్నాయి ఈరోజూ మనసు ఇరుకు  ఆ స్తంభాల మధ్య దిసమొలతో చావు ఆట ఆడుకుంటూ రాత్రిలోకి జారుకుంటూ వెళ్తున్నానని నీకు చెప్పాలని అనుకుంటా.ఎందుకో మౌనంగా రొదిస్తూ రాని నిద్రకోసం తపనపడుతూ ఆకాశం వైపు చూస్తునే తెల్లవారుతోంది దీనికి ఎర్రబడ్డ నా కళ్ళే సాక్ష్యం కాని, ఎందుకో కర్తకర్మ క్రియలన్నీ ఎంచక్కా అమరుకుంటూ వచ్చిన వాక్యం మీద చచ్చేంత ప్రాణం!దీన్నీ ఊపిరిగా చేసుకొని కొద్దిపాటి ఊపిరిని పీలుస్తున్నానేమో కదూ నేను  చావు రేఖ మీద విలవిల్లాడుతూ కూడా ఆ వాక్యం క్రియాంతం అయినప్పుడు వొక ప్రాణాంతక క్రీడానంతరం లోపలి తెల్లప్రవాహం అంతా వొక్కసారిగా పెల్లుబికి మౌనపు రక్తపారంలో ఎప్పుడూ నా జ్ఞాపకాలు నానుతూనే ఉంటాయి ఇంకా మనజీవితం ఆగిపోలేదు కాని
నీ దారిన నువ్వూ 
నా దారిన నేనూ అని విడీపోయాక 
మనం
కేవలం శవాలుగా నిష్క్రమించామని 
మనిద్దరికీ తెలిసిపోయింది
ఇప్పటిదాకా వ్యక్తమైనదంతా 
వొక అవ్యక్త ఆత్మహత్య.
కాదంటావా? కాదనే ఆత్మ సౌందర్యం నీకుండా 
నీకు కావాల్సిన క్షనికానందాలే నీకు ముక్యిం
నిజాలను అబద్దలుగా చేసి 
వేడి వేది పకోడీలు చేసిన వాల్లే 
నీకు నిజమయిన వాళ్లు నిజాయితీ పరులు కదూ  
అయినా రాసిందల్లా అంతా  అబద్ధమై 
తెగిపోతున్నప్పుడు ఏం రాయమంటావ్ చెప్పు 
గతమంటా  అబద్దమని తెలిశాక 
మళ్లీ మొదటనుండీ మొదలెట్టి ఏం చేయగలను 
చివర్లో నన్ను విసిరేసి 
అందరిని ముందువరసలో కూర్చో బెట్టావు
నేను ఏదీ ఆశంచలేను నిన్ను శాసించలేను  
ఇద్దరిలో నన్ను ఓడించి మరొకరిని గెలిపించి 
గేలి చేసిన క్షనాన్నే నేను చచ్చిపోయానుగా 

అన్నీ నీ జ్ఞాపకాలే నా ప్రతి గుండె అరలో

ఈరోజు రాత్రి నా నిస్సత్తువలా
నాకంటే ముందే నన్ను చేరింది
మామూలుగా ఈపాటికి 

ఆలోచిస్తూ ఉండాలిసింది
నిద్రపోవాలనుకున్నా ఎవరో 

బలవంతంగా కళ్ళు తెరుస్తున్నారు
అనుకొకుండా నా  కళ్ళెదురుగా 

కనిపించిన అక్షరాలు నిజాలని చెప్పాయి 

ఎందుకో..   ఈ రోజు తెలియని దిగులు
నా కళ్ళు ఒలుకుతున్నాయి..
పెదవులు వణుకుతున్నాయి..
మనసులో ఎందుకో అలజడి
కారనం మనసుకే తెలుసో తెలిఊదో
నా మనస్సు నన్నే వెక్కిరిస్తున్న క్షనాలు


చీకట్లో నిశ్శబ్దం నా అంతర్మధనానికి
నేపధ్య గీతంలా సాగుతోంది
నిట్టూర్పుల వేడి విషాదం
ఈ సమయంలొ నిషాలను నింపుతుంది
గుండెలపై ఎవరో 

1000 కేజీల బరువు పెట్టినట్టూ

బాధలో భావుకత వెతుక్కుంటూ
నవ్వులు పులుముకుని ఆనందం నటిస్తూ
నా ప్రస్తుతాన్ని గడిపేస్తున్నా
పొడి కళ్ళ వెనుక వున్న
తడిని గుర్తించలేని స్నేహాలు 

మనసుల్ని ఏమారుస్తున్న క్షనాలు

ఈ నిశిరాత్రి   జ్ఞాపకారణ్యంలో
నన్ను నేను వెతుక్కుంటున్నాను
నాకు ఎక్కడన్న దొరుకుతానేమో అని

నా గతం నుండి నన్ను నేను
పెకిలీంచినా నిజాలు దొరకడంలేదు
అన్నీ నీ జ్ఞాపకాలే నా ప్రతి గుండె అరలో


Thursday, August 14, 2014

మీరు క్రైం రిపోర్టర్ అవ్వొచ్చు ...కోబ్రాన్యూస్ డాట్ నెట్ లో

..www.cobranews.net లో మీరు క్రైం రిపోర్టర్ కాలాలనుకుంటున్నారా.. మీకు తెల్సిన నేరవార్తలను ప్రంపంచంలోని తెలుగు ప్రజలతో షేర్ చేసుకోవాలనుకుంటే వెంటనే కోబ్రా న్యూస్ డాట్ నెట్ కు లాగిన్ అవ్వండిWednesday, August 13, 2014

http://www.cobranews.net లో మీరు సిటిజన్ క్రైం రిపోర్టర్ గా పని చేయొచ్చు

సమాజంలో జరిగే అన్యాయాలు అక్రమాలు మీకు తెలుసా ... మీరు మీ మీ ఉద్యోగాలు చేసుకుంటూనే సిటిజన్ జర్నలిష్టుగా కోబ్రాన్యూస్ లో సేవలందిస్తూ అక్రమాలను అన్యాయాల పై మేము చేసే యగ్నంలో మీరు బాగస్వామ్యులు కావచ్చు..ఇంకెందుకు ఆలస్యిం వెంటనే మా కోబ్రాన్యూస్ డాట్ నెట్  కు లాగిన్ అవ్వండి...భాద్యతగల పౌరుడిగా మాతో చేతులుకలపండి  అవినీతి అక్రమాలు బ్లాక్ మైల్ చేసే వారిపై యుద్దానికి కోబ్రాన్యూస్ సిద్దం http://www.cobranews.net

మిమ్మల్నిఎవ్వరైనా బ్లాక్ మైల్ చేస్తున్నారా ... బెదిరిస్తున్నారా..ఎవ్వరీ చెప్పులేక భాదపడుతున్నారా..ఎంతటివాళ్ళైనా మీ వైపు న్యాయం ఉంటే మీతరుపున మేము పోరాటం చేస్తా.. మీకోసం మేమున్నాం వెంటనే మీరు మా కోబ్రాన్యూస్ సైట్http://www.cobranews.net/కు లాగిన్ అయి వివరాలివ్వండి నిచ్చితంగా నిద్ర పొండి ..మీతరుపున న్యాయపోరాటం చేసేందుకు మేము ఎప్పుడూ సిద్దంగా ఉంటాం


అవును మీరు చూసింది నిజమే..మీమీదొట్టు


Tuesday, August 12, 2014

ఎవరునువ్వు?

ఎవరునువ్వు?
ఇలా ఎపుడుమారావు?
నేనే గుర్తించలేనంతగానీ
నీకు నువ్వే నచ్చలేనంతగా
ఇలా ఎపుడు మారావు?
వ్యక్తిత్వం వదిలిఅస్తిత్వం మరచి
వట్టి మెదడుతో అలా ఎలాబ్రతికేస్తున్నావు?
మిధ్యాలోకం లో మిద్దెలు కడుతూమురిసిపోతున్నావా?
పేకమేడలెపుడన్నా కట్టావా?
నీటి రాతలెపుడన్నా రాసావా?
వాటి అనందం ఎంత సేపు?నీకుతెలీదా? 
ఇప్పటికన్నా చెప్పుమనిషిలా ఎపుడు మారతావు?
నీలా నువ్వు మళ్ళా ఎప్పుడు పుడతావు?
ఇన్ని ప్రస్నలకు సమాదానాలెప్పుడు చెబుతావు..?

ఈ పాట ఒకప్పుడు నీ సెల్ఫోన్ రింగ్ టోన్ గుర్తుందా..ఇప్పటికీ నా మన్సులో అలజడి రేపుతున్న పాట

ఈ పాట ఒకప్పుడు నీ సెల్ఫోన్ రింగ్ టోన్ గుర్తుందా..ఇప్పటికీ నా మన్సులో అలజడి రేపుతున్న పాట

అలుపన్నది ఉందా ఎగిరే అలకు..యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే మదినది తలపు..మరి మరి ఉరికే మది తలపులకు .లల లల
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
నాకోసమే చినుకై కరిగి . ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాల ...బహుమతి కాదా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు...లల లల లలలాల

అలుపన్నది ఉందా ఎగిరే అలకు..యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
నీచూపులే తడిమే వరకు ..ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాలా ద్వారాల తలుపులు తెరిచి తరుణం వరకు..
ఎదురుగ నడచే తొలి ఆశలకు...లల లల లలలాల
అలుపన్నది ఉందా ఎగిరే అలకు..యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే మదినది తలపు..మరి మరి ఉరికే మది తలపులకు .లల లలMonday, August 11, 2014

నా యదలో నీవు రేపిన గాయాలే సాక్ష్యాలుగా నిలిచాయి

నాలో నేను  ఒంటరితనాన్ని
ఆయుధంగా ధరించిన నేను
నాకు నేను గా కాకుండా
నీవు నాకు ఇచ్చిన 
ఏకాంతం కదా ఇది 
నా యదలో నీవు రేపిన గాయాలే 
సాక్ష్యాలుగా నిలిచాయి
నీవు కాదన్న గతం మిగిల్చిన 
గాయాలు చెప్పే నిజాలు ఇవి 

చిటికేసి నక్షత్రాలని తనలో దాచుకొని 
నీ చిర్నవ్వుతో చెట్లని చిగురేయించి 
ఓర చూపుతో వంద జన్మల మన అనుబందాన్ని 
గుర్తుకు తెస్తూనే నవ్వి నన్ను నమ్మించి 
కల్లు తెరిచి చూస్తే కనిపించకుండా పోతావు 
నీవు నడిచిన ఇసుక ఎడారుల్లో 
నన్ను ఒంటరిగా వదలి పెట్టి 
నాలో ని ఆనంద సాగరాల్ని 
తరలించుకు పోయి చుట్టూ చీకట్లను వదలి
వెలుగును మరొకరికోసం తీసుకొనివెల్లావు 
తనలో ప్రపంచాన్ని దాచుకొని 
మనసుదోచుకున్న మాయావివి 
నవ్వనూ గలవూ..
నవ్వి నట్టు నటించి 
ఏడ్పించనూ గలవు 
ఎమీ ఎరగనట్టు 
మౌనంగా ఉండనూ గలవు 
ఏదినా చేయగలవు 
అన్నీ చేసి నేనేం చేసానని 
తప్పంతా నామీద నెట్టి 
తప్పించుకొని పోనూగలవు 


Wednesday, August 6, 2014

కనుచూపుమేరలో కనిపించని నీ కన్నుల రెపరెపలు

ఈ రాత్రి బ్రతుకు పండినట్లుంది
తన చంద్రుని గుండెకు హత్తుకుని
తానొదిగి తమకంలో నిద్దరోతుంది

ఇటు చూడు వేదన బల్లమీద
ఓ ఆశ ఒంటరై ముఖం దాచుకుని
ఏడ్చి అలిసి బేలగా ఒదిగి కూర్చుంది మన జ్ఞాపకం 

తోడు దొరకని ఆశకు ఈడు జారింది
నీ జాడ కానక తాను గోల చేసింది
నీడతోనే తన గోడు చెప్పుకుంటుంది
వింటావులే అని కాని ఏంటొ 

నేను చెప్పెవి నేచెవికిచేరుతున్నాయో లేదో 

కలల విత్తులు నాటుతున్న మనిషికి
కొమ్మంటు జోడీలు వెదికే మనసు,
ఊహలకి ఆలంబన తరిచే మనసుకి
అరచేత స్వర్గాల మురిసే మనిషి
మనసు అంతరంగాల్లొ అలిగిన 
కరిగిన కాలాన్ని ఎప్పుడు తీసుకురను  
నవ్వే కన్నులు .. మౌనపు మాటల నిశ్శబ్దంలో 
నాకు కావాల్సిన మాటలు దొరుకుతాయో లేదొ 
అవి ముత్యాలై నీ మెడలో చేరాక 
నేణు చేసే ఈ ప్రయత్నం ఫలిచేనా  

ఇంద్ర ధనుస్సుల సమూహానికీ,
నడుమ దారి తప్పిన క్షణానికీ,
ఎంతేమిటి ఎడబాటు?
మనసులో మనిషున్నంతవరకు
కలల రంగవల్లులు కోటానుకోట్లు.
జవరాలి గాజుల సవ్వడి మోహనరాగమే కదూ 
కనుచూపుమేరలో కనిపించని నీ కన్నుల రెపరెపలు 
మది చాటున దాగి ఉన్న మూగభాషకు అర్ధలు ఎక్కడని వెతకను


Tuesday, August 5, 2014

ఓ జ్ఞాపకామా సొమ్మసిల్లిపోకే చివురుకొమ్మలా

తెలియనిదారుల్లో 
నిన్నుతెలుసుకోలేక దూరం అయ్యాను 
తప్పుకోకునేస్తమా తప్పులుంటేమన్నింపుము.
తెలియకనే చెప్పావు తెలుసుకొమ్మని
తడిపేమాటలతో హృదయం తెల్లబరిచావు.
ఎంత ఎగిసి పడినా కెరటం తిరిగిచేరేదెక్కడ?
వూసులు కరిగినా, ఎప్పటికీ కలిసే 
కనురెప్పలస్నేహమే కదా మనది?
కాలకాలుడు  కాలయముడై  
కరిగిపోయే కాలంలో 
నన్నో దోషిని చేసి నిలబెట్టాడు
అందించుము నేస్తమా మదిలో నేవదిలిన 
నీ స్నేహహస్తాన్ని ఇవ్వవా అని వేడూకొంటున్నాను  

నిలువరించలేని మనసుకి 
నిలకడైన నిశీథికి నడుమ ఒంటరై ఉన్నాను 
నిశ్శబ్దబేధి టిక్ టిక్మనే ఈ గోడగడియారం
పలుమార్లు పరికించినా పలుకరింపులేవీ 
మోసుకురాని నా జీవితకొలమానం మూగబోతొంది 
సెగల పొగల వీడిపోయే నీటి ఆవిరి వెంట
పొంగి పొర్లిపోయే పాలలా నిట్టూర్పుగానం
పాలపొంగై దొర్లిపోతోందొ ..పట్టుకుందామన్నా 
చేతికి చిక్కకుండా పారిపోతోంది కాలం 
కమ్ముకొచ్చే కాలం కలత చెంత 
కరిగి చెదిరే కన్నీటిశోకం
విన్నపాలు వినిపించుకో మదికొరిన నేస్తమా 

ఓ జ్ఞాపకామా సొమ్మసిల్లిపోకే చివురుకొమ్మలా, 
ఎండమావిలో కవితలల్లి తీర్చునా నీ దాహార్తిని
నిజం నమ్మే రొజొకటి వస్తుందా ఎప్పటికైనా 

Monday, August 4, 2014

స్వచ్చంద నిఘా సంస్థ..మీకు తెల్సిన వివరాలు మైల్ చేయండి info@cobranews.net

http://cobranews.net> మీకు తెల్సిన వివరాలు మైల్ చేయండి info@cobranews.net
స్వచ్చంద నిఘా సంస్థ....చీకటిమాటున జరుగుతున్న అన్యాయాలపై...మీడియా మిత్రులచే స్థాపించిన సంస్థ..అత్యాధునిక సీక్రెట్ కెమేరాలతో వెలుగుకు రాని వాస్తవాలపై ..ఏర్పాటు చేసిన సంస్థ ఇది .బ్లాక్ మైలింగ్...అక్రమాలు అన్యాయాలు ఎలాంటి సమాచారం అయినా మాకు సాక్ష్యాదారాలందిస్తే లోతైన పరిశోదన చేసి పోలీసుల సహకారంతో నిజాలను వెలికి తీస్తాం.. మా సంస్థలో ప్రముఖ న్యాయవాదులు సాంఘిక కావిద్యావేత్తలు, కార్యకర్తలు,రిటైర్ట్ పోలీస్ ఆఫీసర్లసలహాలతో స్వచ్హందా పని చేస్తారు సమాజానికి సేవచేయాలనే దృక్పదం ఉన్న ఎవరైనా మా సంస్థలో బాగస్తులు అవ్వొచ్చు..ఒక ఆలోచన... ఎన్నీ మార్పులకు కారణం అవుతుంది .. సమాజాన్ని సమూలంగా మార్చలేం.. ఓ కొత్త ఒరవడితో .మనకోసం మనం పోరాడుదాం .మరొకరికి చెప్పుకోలేక భాదపడుతున్న వారికి షోషల్ వెబైట్లలో జరిగే హెరాస్ మెంట్స్ బారినపడ్డవారికి మా ఆసర...మీ వివరాలు చాలా సీక్రెట్ గా ఉంచుతాం ఎలాంటి సమాచారానైనా మాకు ఇవ్వొచ్హు చట్టపరిదిలో ...మనకు జరిగాల్సిన న్యాయాన్ని మనమే సాదించుకుందా...ఈ స్వచ్చంద నిఘా సంస్థలో మీరు మాతో చేతులు కలపంది.. ఈ ఆలోచనకు అన్ని మీడియా సంస్థలు సహకరించేందుకు ముందుకొస్తున్నాయి..నిజం భయాన్ని కోరదు నిద్బయంగా నిజకోసం పోరాడుదాం ..అవినీతి పరుల ఆటకట్టిద్దాం...సీక్రెట్ గా ఎప్పుడు ఎక్కడ మన ఉనికి చూసి అక్రమార్కులు దడుచుకోవాలి .,, ఈ యజ్ఞంలో మీరు మాకు సహకరించాలి..CommingSoon...మీకు తెల్సిన వివరాలు మైల్ చేయండి info@cobranews.net


Sunday, August 3, 2014

నా వేదనకి నువ్వే పూర్తి కారణం...నన్నేప్పుడో ఒడించావుగా

పరిగెడుతున్న కాలం ఒక్క క్షణం అలా ఆగి నిలిచిపోయి మరలా సాగినట్టనిపించింది. రోడ్డు మీద అలానే నిల్చుని ఆ క్షణాన్ని మరలా మరలా గుర్తు చేసుకుంటు తన్మయత్వంలో ఉండిపోయాను. ఒక్కసారిగా నాకు ఎదో జరిగిన అనుభూతి, మనసులో ఒక తెలియని ఉద్వేగం. తేరుకుని తిరిగి చూసేసరికి తను దూరంగా వెళ్ళిపోయింది. ఆ అద్భుత క్షణాన్ని అలా తలుచుకుంటూ చాలారోజులు గడిపేసాను.  తనని చూసిన అదే సమయానికి రోజూ వెళ్ళి ఎదురు చూసేవాడ్ని. కానీ తను మరలా కనిపించలేదు. ..
                           క్షరమక్షరం కూర్చి నీకోసం
                     పత్రాలు వ్రాసే నేను...
                 ప్రతి లేఖనూ చిన్నచిన్న ముక్కలు
         చేసి పైకెగరేశావుగా నీవు 

నా మనో భావాల మాలికలల్లి
నీకు సమర్పించే నేను
         ఒక్క భావానికి కూడా 
         చలించని హృదయంతో నీవు...

ప్రేమ మందిరం కోసం 
చలువరాళ్ళు సేకరిస్తూ నేను 
          ప్రేమకు సమాధి కట్టేందుకు
          ఇటుకలు పేరుస్తూ నీవు...

ప్రేమ విజేతనవ్వాలనే
తపనతో నేను...
          ఈ పోటీలో గెలుపు 
          నీదేనన్న ధీమాతో నీవు..
                                              క్షణాన నా కనుల నుండి కరిగిపొతూ క్షణ క్షణాన కన్నీటి బిందువులు సిందువులుగా నేల రాలుతుండగా నా మనసు వాటితో దోబూచులాడుతూ అడిగింది ఆలోచన రహితం గా ,,అర్దాంతరంగా అడుగులు వెలుపలికి వేసారు ఎం అని వెను వెంటనే ఆ కన్నీటి బిందువులు కన్నీరు కారుస్తూ..ఎదన దుఃఖం ఎగసి పడుతున్నది..తలపులతో తనువు బరువౌతున్నది హృదయపు సవ్వడులు తక్కువై నిట్టూర్పులు ఎక్కువౌతున్నవి ప్రేమ ఓటమిని అంగీకరించనన్నది మరణం విజయ దరహాసం చేస్తున్నది పెదవి దాటని పదాలు నిన్ను కడసారి చూడాలంటున్నవి స్వప్నం కూడా నిన్ను కానలేదన్నది నా జీవితం మైనంలా కరుగుతున్నది
            సరిపోదా ఈ జన్మకు నువు చేసిన మోసం
         మానేదా నా ప్రేమకు నువు చేసిన గాయం
        గుండె పొరల్లో దాచి ఉంచిన నీపై అభిమానం
       ఒక్క దెబ్బతో పగిలి పొయిందే...నీదే ఆ నేరం.....
        ఒక్కటి కాదు ముక్కలైన నా హృదయం 
       నా వేదనకి నువ్వే పూర్తి కారణం...

కలకాలం నిలచి ఉండే స్వచ్చమైన స్నేహితులకు అంకితం

కలలను తెచ్చావు
కవితలు రేపావు
మనిషిని చేశావు
మనసుని దోచావు
స్నేహాస్తాన్ని ఇచ్చావు
మాటలన్నీ నీవే మాట్లాడి
నన్ను మూగవాన్ని  చేశావు
మదిలో మాటువేసి క్షనం నేనేంటో చెబుతూ 
ఈ కలికాలంలో కలకాలం నిలచే స్నేహాన్ని ఇచ్చావు
నా కష్టం చూసి చెమరే నీకళ్ళలో నన్నే కనిపెట్టుకొని  
నా భాదలు తెలిసి పగిలే ఎదకు ఆసరా నీస్నేహం 
నాన్న అన్నల ప్రేమల కన్నా సడలక నా మనసును అల్లుకు పోయింది స్నేహం

(కలకాలం నిలచి ఉండే స్వచ్చమైన  స్నేహితులకు అంకితం)  ---

note :- నాకు ఇప్పటికీ కలకాలం నిలచి వుండే ఇలాంటి  స్నేహం దొరకలేదు .జీవితంలోకి అనుకోకుండా వచ్చారు  తట్టుకోలేనంట విషాదాన్ని మిగిల్చి వెల్లారు 

Saturday, August 2, 2014

http://cobranews.net..స్వచ్చంద నిఘా సంస్థ...

http://cobranews.net> స్వచ్చంద నిఘా సంస్థ...స్వచ్చంద నిఘా సంస్థ...
..చీకటిమాటున జరుగుతున్న అన్యాయాలపై...మీడియా మిత్రులచే స్థాపించిన సంస్థ..అత్యాధునిక సీక్రెట్ కెమేరాలతో వెలుగుకు రాని వాస్తవాలపై ..ఏర్పాటు చేసిన సంస్థ ఇది .బ్లాక్ మైలింగ్...అక్రమాలు అన్యాయాలు ఎలాంటి సమాచారం అయినా మాకు సాక్ష్యాదారాలందిస్తే లోతైన పరిశోదన చేసి పోలీసుల సహకారంతో నిజాలను వెలికి తీస్తాం.. మా సంస్థలో ప్రముఖ న్యాయవాదులు సాంఘిక కావిద్యావేత్తలు, కార్యకర్తలు,రిటైర్ట్ పోలీస్ ఆఫీసర్లసలహాలతో స్వచ్హందా పని చేస్తారు సమాజానికి సేవచేయాలనే దృక్పదం ఉన్న ఎవరైనా మా సంస్థలో బాగస్తులు అవ్వొచ్చు..ఒక ఆలోచన... ఎన్నీ మార్పులకు కారణం అవుతుంది .. సమాజాన్ని సమూలంగా మార్చలేం.. ఓ కొత్త ఒరవడితో .మనకోసం మనం పోరాడుదాం .మరొకరికి చెప్పుకోలేక భాదపడుతున్న వారికి షోషల్ వెబైట్లలో జరిగే హెరాస్ మెంట్స్ బారినపడ్డవారికి మా ఆసర...మీ వివరాలు చాలా సీక్రెట్ గా ఉంచుతాం ఎలాంటి సమాచారానైనా మాకు ఇవ్వొచ్హు చట్టపరిదిలో ...మనకు జరిగాల్సిన న్యాయాన్ని మనమే సాదించుకుందా...ఈ స్వచ్చంద నిఘా సంస్థలో మీరు మాతో చేతులు కలపంది.. ఈ ఆలోచనకు అన్ని మీడియా సంస్థలు సహకరించేందుకు ముందుకొస్తున్నాయి..నిజం భయాన్ని కోరదు నిద్బయంగా నిజకోసం పోరాడుదాం ..అవినీతి పరుల ఆటకట్టిద్దాం...సీక్రెట్ గా ఎప్పుడు ఎక్కడ మన ఉనికి చూసి అక్రమార్కులు దడుచుకోవాలి .,, ఈ యజ్ఞంలో మీరు మాకు సహకరించాలి..CommingSoon...Share This To your Friends..

Friday, August 1, 2014

స్థంభించినా సమయంలో రాలుతున్న కన్నీటి చుక్కలు

నీకై వేచిన ఆ ప్రతి క్షణాలు..
నేచేసిన ఎదురు చూసినవే
స్థంభించినా సమయంలో
రాలిని ఆరెండు చుక్కలు.
కాకతాళీయ మనుకుంటున్నావా
నీవు దూరం అయినప్పటినుండి
అవి కాకతీయంగా రాలినవి కావు
నీకోసం తడుముతున్న 
జ్ఞాపకాల ఆనవాల్లు 
వాటిని గుర్తించే 
తీరికలేదు కదా నీకు 

నువు కనపడనప్పుడు,
మెలికలు తిరిగిన మనసు భాదను 
వెర్రి తనమని  వెటకారంగా 
విరగబడి నవ్వుకుంటున్నావు కదూ 
బరువు పెరిగిన ఆ రెప్పల భారం
బరువు బారంగా మారిన నా మనస్సు 
భారాన్ని ఎంతకాలం మోయాలో తెలీదు

నీ మాటకోసం పడె తపనను
పిచ్చితనమని పెదవి విరుస్తూ
నా మాటల గారడీలో
నలిగిన నిజాలనేరుకుంటూ..
ఎదురు చూపుల్లో ఎండి వాలిన
రెప్పలు, రాలకుండా సంభాళిస్తున్నా..
ఒంటిచేతి చప్పట్లకు ఆవురావురని
ఎగిరొచ్చే ప్రతిధ్వనులని ఆస్వాదించలేకపోతున్నా
ఓటరినై వేదనతో దిగులు మనస్సుతో ఉన్నా