. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, September 22, 2015

పర్లేదు నామన్సు తో ఆడుకో ..నీ ఇష్టం

ఓ రేయి  ఒంటరివాడా, 
ఊహలలో తేలుతున్నట్టు 
నన్ను నేను పిలుచుకుంటున్న పిలుపు
అలుపెరగని నా పయనంలో 
ఎప్పుడూ నేను ఒంటరిగానే కనిపిస్తాను 
ఎందరో చేరారు నాపయనంలో 
కాని హృదయాన్ని 
తూట్లు పొడిచి మరీ 
వెల్లింది తను మాత్రమే 
ఎందుకు నాజీవితం లో కి వచ్చిందో 
ఎందుకు  నాజీవితంలోనుండీ వెల్లీందో తెలీదు 
రావడం వాల్లిష్టం పోవడం వాల్లిష్టం 
మని నేనెవరిని ..నాతో వాల్లెందుకు 
అబద్దపు అనుబందం పెంచుకున్నారు 
కాదు కాదు ..అలా నటించారు 
నేను అన్నీ నిజం అని నమ్మా 
ఎవరినో తన పక్కన పెట్టుకొని 
నన్ను దోషిని చేసి 
మాట్లాడిన క్షనాల్లో 
కూడా ఏం జరుగుతుందో అర్దం చేసుకోలేక 
అపార్దాల ఊభిలో చిక్కుకున్న నన్ను 
కాపాడే వారు లేని క్షనాల్లొ 
మళ్ళీ నేను ఒంటరిని 
అన్న విషయం గుర్తుకొచ్చిది  
నేను నిలబడి ఉన్న ప్రదేశం 
సమాది అని రూడీ అయింది 
నేను ఇప్పుడు బ్రతికుండీ 
చనిపోయిన మనిషిని
చావలేక చావురాక ..
ఒంటరిగా మిగిలిన పక్షిని 
ఎంటీ నవ్వుతున్నారు .
నిజమే నన్ను చూస్తే 
అందరికీ నవ్వొస్తుంది 
నీవు నవ్వడంలో తప్పేం 
లేదు నవ్వు విరగబడి నవ్వు
నీవు అందంగానే వున్నావు 
నీకూ నామనతో ఆడుకోవలని వుందా
ఎందుకు ఆలస్యం  
రా నా హృదయం ఖాలీగానే వుంది 
నటించు ప్రేమగా వున్నా 
అని చెప్పు వెంటనే నమ్మేస్తా 
అప్పుడూ నీవు నీవు 
మరొకరిని తీస్కొచ్చి 
నన్ను అవమానించు  
నా మన్సు గాయం అయ్యేలా 
మాటల తూటాలతో కుళ్ళబొడువు 
ఏం పర్లేదు ఇది నాకు అలవాతే ..
తను అలా చేసే వెల్లింది   
నీవు అలానే చేయి 
పర్లేదు నామన్సు తో ఆడుకో 


Sunday, September 20, 2015

గతాన్ని గుండెల్లో గుచ్చుకొని...నటించడం ఏంత కష్టమో..

అన్నీధ్వంసం చెయ్యాలనిపిస్తుంది. ఒకరి  ఆనందం కోసం నా హృదయాన్ని దొలిచేస్తున్న విద్వేషాన్ని,  ఒక శూన్యమైన, అబధ్ధపు చిరునవ్వునొకదాన్ని ముఖానికి పులుముకుని నడవవలసి వస్తుంది. ఇంతకన్న దారుణమైన, హేయమైన స్థితి ఇంకేముంటుంది?.. ఇక్కడ మనసంతా విషాదమే. గుడెనిండా  తనను .. తన చిరునవ్వునే నింపుకొని  అసలైన ఓ నిజంకోసం కల్లుమూసుకొని నిన్నే తలస్తూ ప్రయత్నిస్తే వింత ప్రపంచం ఆవిష్కృతమౌతుంది.  ఈ ప్రపంచాన్ని ఇక్కడే మరిచిపోదాం.  గతకాలపు వెతలు, ఎదురుచూస్తున్న ఆనందపు ఘడియల ఉత్సుకతను ఏమాత్రం  తగ్గించలేవు. నిజంలో కాలిపోతున్న గతం సాక్షిగా అన్ని అబద్దలేకదా కటిక దరిద్రుడైనా, నీచాతినీచుడైన బానిస అయినా, మరణదండన విధించబడి నేరస్థుడైనా,  వాడి బాధని కన్నీళ్లతో కడుక్కునే వీలుంటుంది.  కానీ, నాకు అటువంటి అవకాశం లేదు.  బాధాకరమైన బలహీనతలతో- నేలకు ఒదిగి ఉండడం కష్టం.  అంతకు మించి నన్నుచుట్టు ముట్టి ఉన్న ఈ అందాలూ,  తళతళలూ నన్నింకా విచారగ్రస్తుణ్ణిచేస్తున్నాయి.  నా దౌర్భాగ్యం . నా హృదయం ఒంటరిగా విచారాన్ని వెలిగ్రక్కనూలేదు..నామీద నామీద నాకే అసహ్యం వేసే ప్రతినిమిషాన్ని నేను విషాద గులికలుగా చేసుకొని మ్రింగుతూ నవ్వలేక నవ్వురాక నవ్వినట్టు నటిస్తుంటే ... లేని ఆనందాన్ని మొకం మీద పులుముకొని ష్టేజీమేద నటుది మల్లే ప్రతిక్షనం లేని హావభావలను మొహం మీద పులుముకొని ఆనందం నటించడం ఏంత కష్టమో  

నావైపు నేను జాలిగా చూసుకొవడంతప్ప ఏం చేయను

నన్ను  ఓదార్చడానికి..
ఎన్ని నదులైనా సరిపోవు

నా కన్నీళ్లు నింపుకునే 
సముద్రాలు లేవు
అపజయాల దిగుడు బావిలో 
ఆత్మహత్యిచ్సుకొంటున్నా
కాని చావురావడం లేదు 
నాకో చీకటి ప్రదేశం కావాలి
ఎండ తళుక్కున మెరిసే వెచ్చని 
నీనవ్వు కావాలి
నా మనసుకు తూనీగలా  కాలూన్చే 
చిన్ని ఆధారం నీ  జీవితం కావాలి
కళ్ల ఆధారంతో కవిత్వాలల్లుకుని
కందిరీగల కాలాన్ని 
రెక్కలార్చుకుంటూ పోయే 
సీతాకోకలా ఎగరాలని వుంది 
 నేననుకున్నది  ఏదీ జరగదు
ఏది జరగకూడాదనుకున్నానో 
అదే జరుగుతుంది ..
నిజం అబద్దంగా మారిపోతుంది 
నా అనుకున్న ప్రతి మనిషి 
స్వార్దపరులైన వేల  
నిస్సహాయంగా 
ఆకాశం వైపు చూసి 
ఆనీలి ఆకాశంలో  
నావైపు నేను జాలిగా 
చూసుకొవడంతప్ప  ఏం చేయను 

Saturday, September 19, 2015

http://cobranews.net ...latest Crime news

http://cobranews.net ...latest Crime news
1) చెప్పినట్టు వినలేదని.. మర్మాంగాన్ని కోసేసింది....
2) సర్కార్ స్కూళ్లలో ‘సుప్రీం’ బృందం తనిఖీ....
3) యువకుడిని బ్లాక్ మెయిల్ చేసిన ఎస్సై సస్పెన్షన్....
4) ఇక అన్ని పోలీస్టేషన్స్ కు వీడియో కాన్ఫరెన్స్....
5) ఎల్బీనగర్‌లో నలుగురు యువకుల వీరంగం....
6) తన భార్యకు గర్భం రాలేదంటూ పక్కింటివాడిపై కేసు....
7) సుడిగాలి సుధీర్‌తో జబర్దస్త్ రష్మీ డేటింగ్....
More News..  http://cobranews.net

Monday, September 14, 2015

మౌనం తప్ప మాట్లాడే భాషలేవి

 మౌనం తప్ప మాట్లాడే భాషలేవి 
మనదగ్గర లేనపుడు…
ఆత్మల్లో అతర్మదనం చెందుతూ 
ఆత్మీయత స్పర్శలు కరువై 
గమ్యం తెలియంది దారుల్లో 
వేకువలెరుగని చీకట్లో 
కానరాని మనుషులకోసం 
మన్సు  తపించినపుడు..
ఒక్క పలకరింపుకోసం
ఎదురు చూస్తున్న క్షనాల్లో 
ఒక్క పరిష్వంగం కోసం
ఆరాటం..నా ఆవేదన 
తెలుసుకోలేని ఈ మనుషుల మధ్య 
చావలేక బ్రతుకును ఈడ్చలేక 
నమ్మిన ప్రతి మనిషి 
నన్నే ద్రోహిని చేసిన క్షనాలను 
తలచుకొని లేని ప్రేమకోసం 
ఆరాట పడూతూ అవేశపడి 
ఆందోలనలో ఎవ్వరీ నిందించలేక 
నన్ను నేను హింసించుకొంటూ 
నన్నూ నేను దూషించుకొంటూ 
నాలో నేణు నలిగిపోతునే వున్నా 

Friday, September 11, 2015

అందరూ మంచోళ్ళే ...అందరికీ నేను తప్ప

నాలోకి నేను కాకుండా
నా నించి నేను దూరంగా..
నిశ్చలభయాల నిర్వికారాన్ని
ముక్కలుగా వేరుచేసి విసిరేస్తూ
తేలికై పోవాలి..
ఊహల్లో విహరిస్తున్నా
నన్ను నేను కాల్చుకుంటున్నా

జ్ఞాపకాల శకలాలనీ ఏరుకొంటూ
సుదూర స్వప్నాల కోసం 
ఎదురు చూస్తూ 
పగటిపూట నీతలపులతో 
రాత్రుల్లు నీజ్ఞాపకాలతో 
నన్నూ నేను 
మాయచేసుకుంటూ బ్రతికేస్తున్నా  
ఇంతా జరుగుతున్నా
మనసు మాత్రం 
ఏమీ చెప్పా పెట్టాకుండా
వెన్నెల రెక్కలు తొడుక్కుని
నీ యౌవనవనాల వైపు 
వెళ్ళిపోతూంటుంది…
అయినా ఎక్కడో వెలితి..
మనసంతా సూన్యం 
శూన్యంగా మిగిలిపోదు
పరిమళాల సంగీతం వినిపిస్తూన్నా
నాలో ఇంకా విషాదం 
సెగలు వస్తూనే వున్నాయి
ఎవరికీ చెప్పలేని 
చెప్పుకోలేని వేదాంతం 
నాలో నేను 
కుమిలిపోతున్న క్షనాలివి 
నేను నమ్మిన మనుషులు తప్ప 
అందరూ మంచోల్లే 
అందరికీ నేను తప్ప
మంచోళ్ళే అందుకే ఊహా ప్రపంచానికి 
నాలోని నన్ను హింశిచుకొంటూ 
రక్తాక్షరాలు రాసుకొంటూనే ఉన్నా

Monday, September 7, 2015

వ్యధ వెన్నెల లై నాపై అగ్ని కురిపించిన క్షనాలు

రాగం మెలిక తిరిగి 
నాలో శోకం కలిసిపోయింది
వ్యధ వెన్నెల లై నాపై 
అగ్ని కురిపించిన క్షనాలు 
గుండెను గురిచూసి కొట్టిన జ్ఞాపకాలు 
నన్ను ఇప్పటికీ ముక్కలు 
చేస్తూనే వున్నాయి

ఎప్పుడూ నాలో కనిపించే విషాదం 
నన్నూ మాత్రమే వేదించే వేదన 
నాకు తెలియకుండా నన్నేందుకు  
ఈరోజు మూగగా రోదించేలా చేస్తున్నాయి 

నీ కోసం నండె ఏనొస్తే నీ గుండె 

తలుపులు మూసే ఉంటాయి
తలుపు సందుల్లోనుండి చూస్తే 
నీమనసు ఎవ్వరో 
ప్రశాంతంగా నిద్రపోతున్నారు 
నాతాలూక ఆనవాల్లు 
కనిపిస్తాయేమో అని
నీ గుండె గదిమొత్తం వెతికాను 
ఎక్కడ లేవు..నీవు నాలో 
గుచ్చిన మాటల తూటాలు 
నీవు విసెరెసిన నిర్లక్ష్యపు 
మాటల గాయాల కత్తులు 
ఇంకా అక్కడ పడేసే వున్నాయి 


Wednesday, September 2, 2015

ఎందరిని ఏమార్చి ఇలా వంటరిని చేసి మోసం చేశావో

ఇప్పుడు నీవు 
ఎందరి మనసుల్లో ఉన్నావో
ఎవరెవరి కళ్ళల్లో నిండావో
ఎవరికి ఎన్నెన్ని జ్ఞాపకాలని మిగిల్చావో
ఎవరెవరి గమనాన్ని elA మార్చావో
ఎన్ని రహస్యాలను నింపుంటావో 

ఒప్పుడు దూరమైన నీకోసం 
గడియలు పెట్టుకుని ఎవరైనా ఏడ్చుండచ్చు
నీ కోసం చయ్యకూడని ద్రోహం చేయలేక 
అపురూపమైన మనసును మరొకరికి తాకట్టు పెట్టలేక 
నీ కోసం పోగొట్టుకోకూడని దేన్నో పోగొట్టుకుని  
నిరాశగా ఆకాశం వైపు చూస్తూ 
ఉన్నవాన్ని ఎప్పటీకీ గుర్తించలేవు
ఎందరిని ఏమార్చి 
ఇలా వంటరిని చేసి మోసం చేశావో 
నీ కవ్వించే కల్లతో ఆశపెట్టి 
అధోపాతాలానికి నెట్టేశావో 
నీకేదైనా సాద్యమే కదా 

Tuesday, September 1, 2015

కనపడవని తెలిసీ ఇంకా వెతుకుతూనే వున్నా

మనసు పూల గంపను
అటూ ఇటూ కదిల్చి
రాలిపడిన జ్ఞాపకాల తట్టలో 
నీ  గులాబి 
చేతుల స్పర్శతో
నన్ను నేను 
మైమరచిన నాకు 
చెప్పలేనంత 
భారాన్ని గుండెలో  మోపి 
ఎదలో గుచ్చిన నీ తలపుల్లో 
నా గతాన్ని గాయాలమయం చేశావుగా 

ఎప్పటికీ ఎదురు గానీ  
నీ ఆ చిన్న పలకరింతకు కూడా
నా  సమాధానం తో పనిలేకుండా 
మనసు బందంలో  సంధించే భిగువులొ 
గట్టిగా బిగుసుకుపోయిన 
నా ప్రేమను 
నిన్నటి గాలానికి 
రేపటి కాలాన్ని 
వేలాడ దీశాను 
ముక్కలు ముక్కలుగా 
విరిగి పడిపోతున్న 
కాలపు ముక్కల్లో 
వెతికినా కనపడవని తెలిసీ 
అమాయకంగా ఇంకా వెతుకుతూనే వున్నా