వేచియున్నాను ఆ మృత్యు సాగర తీరాన......
నువ్వు లేని నిజాన్ని నమ్మలేను
నిన్ను కల అని మరువలేను
నీ కలల హద్ధులు దాటలేను
నీ జ్ఞాపకాల చేరసాలలో ఉండలేను
నీ ఉహల కెరటాల తాకిడిని తాళలేను
నీ కౌగిలి తీరం చేరక నిలువలేను
నీ శ్వాసల స్పర్శ లేని గాలిని పీల్చలేను
నీ తలపులతో నిండిన ఉపిరిని ఆపలేను
అందుకే!
వేచియున్నాను ఆ మృత్యు సాగర తీరాన.....