ఆడదాన్ని అద్బుతంగా వర్నించిన పాట ఇది టైటిల్ సాంగ్ అయినా ..మంచి మెలోడీతో మనసుకు ఆహ్లాద్దాన్ని చ్చేసాంగ్..ఆడవాళ్ళ జీవితాన్ని ప్రక్రుతితో వర్నిస్తూండే పాట ఆపాట లో పదాలు చదవండి ..వీడియోకూడా ఉంది చూడండి
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
ఏ ఒడిలో నీ జననం ఏ కడలికో నీ పయనం
ఏ ఒడిలో నీ జననం ఏ కడలికో నీ పయనం
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
ఇసుక తిన్నెలెదురైనా ఏ గిరులు తిరిగి పొమ్మన్నా
లోయల్లో దిగిపోయినా పాయలుగా విడిపోయినా
లోయల్లో దిగిపోయినా పాయలుగా విడిపోయినా
ఆగిపోదు నీ నడక ఆ..
ఆగిపోదు నీ నడక ఆ గమ్యం చేరేదాకా
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
గుండె ముక్కలైపోయి సుడిగుండాలే చెలరేగి
కల్లోలం విషమించినా ఆ…
కల్లోలం విషమించినా కాలమే వంచించినా
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
ఆగిపోదు నీ నడక ఆ గమ్యం చేరేదాకా ఆ…
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
ఎదలోని రాపిడిలోన కదలాడు నురగలపైన
కలకలనవ్వులున్నాయో ఓ….
కలకలనవ్వులున్నాయో కన్నీళ్ళు పొంగుతున్నాయో
తెలిసేదెవరికి.. ఆ దైవానికి
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
ఏ ఒడిలో నీ జననం ఏ కడలికో నీ పయనం
ఏ ఒడిలో నీ జననం ఏ కడలికో నీ పయనం
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
ఓ తరంగిణి ఓ తరంగిణి