నువ్వు నాకు చెందవని తెలుసు 
అయినా కూడా ఆశించాను..
నీ హృదయం లో 
ఎక్కడో ఒక మూలన
నా పై ఎప్పుడో ఒకప్పుడు 
ప్రేమ పుడుతుందని
నువ్వు నాకు చెందవని తెలుసు 
అయినాకూడా మనసు పడ్డాను
ఎప్పుడో ఒకప్పుడు 
నావైపు నీ దృష్టి మరలుతుంది 
ప్రేమ పుట్టిస్తుందని ...
నువ్వు నాకు చెందవని తెలుసు
అయినా కూడా వగచాను 
ఎప్పుడో ఒకప్పుడు జాలితో నైనా
నన్ను దరి చేరనిస్తావని 
నువ్వు నాకు చెందవని తెలుసు 
కాని ఆశించడం మానుకోలేను 
జీవితం అంతా నీ జ్ఞాపకాలతోనే 
గడిపేంత సాహసం నేను చేయగలను
ఎందుకంటే
ఏదో ఒక రోజు నన్ను నీవు 
కోల్పోయవనే భావన 
నీకు కలుగక పోదని ..
నా ప్రేమకు నువ్వు కరిగిపోయే 
రోజు వస్తుందని .....!!
 
