నువ్వు - నా విషాదం
నువ్వు నవ్వితే నాకు ఆనందం
కానీ ఆ నవ్వు వేరొకరి సమక్షంలో ఐతే,
నేను బాధ పడతాను.
ఆ నవ్వుని నేను కోల్పోయానే అని,
నువ్వు నడుస్తుంటే చూస్తూనే ఉంటాను.
కానీ, తర్వాత ఏడుస్తాను
ఆ నడక నీ నుండి నన్ను దూరం చేసిందని.
నువ్వు నా ఎదురుగా మాట్లాడుతుంటే
నాకు ఏమీ అర్ధం కాదు. ఎందుకంటే,
నీ అధరాల కదలికను గమనిస్తూ,
నా చెవులు వినటం మానేస్తాయి. .
నువ్వు గమనించావో లేదో ,
కవులందరూ ప్రకృతిలోని అందాన్ని వర్ణిస్తారు.
కానీ నేను నీలోనే ప్రకృతిని చూస్తాను.
ప్రకృతిలో జరిగే అలజడిని నాలో చూస్తాను.
నువ్వు కనపడితే నా కళ్ళు వర్షిస్తాయి
కనపడకపోతే మళ్ళీ వర్షిస్తాయి
ఒకసారి ఆనందంతో అయితే,
మరోసారి దుఃఖంతో..............