. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, March 10, 2016

ఓ జ్ఞాపకం మనసును సన్నగా తడుతుంది

నాకు మొబైలిప్పుడు కేవలం
సాంకేతిక సమాచార సాధనమే కాదు
నా దేహాన్ని, ఆలోచనల్ని వైబ్రేట్‌చేసే పరికరం కూడా.

అవసరాలమధ్య అనుసంధానమౌతున్న 
అనేకనెంబర్లతోపాటు
నీ నంబరు అలానేవుంది
అప్పుడప్పుడూ ఏదొకటి వెదకుతున్నప్పుడు
నీ పేరుతో నంబరు కన్పిస్తుంది
అంతటి వెదకులాటలో
ఓ జ్ఞాపకం మనసును సన్నగా తడుతుంది
ఒక్కసారి ప్రయత్నిద్దామని మదిలో తొలుస్తుంది
ప్రయత్నించిన వెనువెంటనే కలిసుంటే  
రింగ్  అవుతుంది కానీ వెంతనే కట్ చేస్తావుగా 
అందుబాటులో లేవనో, పరిథిలో లేవనో పదే పదే పలుకుతుంది
మొబైల్ లో కొత్త ఆప్సన్స్ నీకు 
మంచి అవకాశం కలిపించాయి
బ్లాక్ లో పెట్టడం..
నీవు బ్లాక్ చేసిన నెంబర్లలలో మొదటిది నాదే కదూ 

దగ్గరవ్వాలనే ఆలోచనకు
విభజన రేఖేదో అడ్డమొస్తుందేమో!

వాణిజ్య బేరీజులమధ్య నెంబర్లు 
మారుస్తుంటాము
కానీ ఆది నా దగ్గర వుండదు..
కానీ  నీ నెంబర్ అలానే వుంది
కొత్తనెంబర్ కూడా సేవ్ అయి వుంది 
కాని ఫోన్ చేసేంత దైర్యం అయితే మాత్రం లేదు

వాడని నెంబర్లను తీసివేస్తుంటాము
మరి నా నంబరు నీ దగ్గరుందో లేదో

నాకిప్పుడు
నీ పిలుపునుంచో, మాటల్లోంచో పొందే తరంగ తాకిడికోసం
మనసెప్పుడూ తడుముకొంటూనే ఉంటుంది
నీ నుంచి రింగు కావాలి
నా మొబైల్ కు నీ వాయిస్ ద్వారా ఏదో సందేశం రావాలి
అది ఒకప్పుడు స్వీట్ వాయిస్ కాని ఇప్పూడు 
తిట్లదండకం ఎవరో ఎదో చెబితె నిజం తెలుసుకొకుండా
ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం 
పిచ్చి మనస్సు అలాగైనా నీ వాయిస్ వినొచ్హని 
ఆరాటపడుతుంది నీ కు చీ అనిపించదంలేదు ...?
నా నెంబరు మారలేదు సుమా!

హఠాత్తుగా
జీవితాన్ని ఏమీ మార్చలేదు

Wednesday, March 9, 2016

శూన్యంలో నీకోసం ఆశగా ఎదురు చుస్తున్నా ...

ఎన్నో పంచుకోవాలని కలలు కన్నాను
దగ్గర అయ్యేకొద్దీ  కొద్దీ దూరమయ్యావు.

నీకోసం పలవరించిన ఏకాంతపు రాత్రులు
కలవమని చేసిన అభ్యర్ధనలు..ప్రార్ధనలు


నీకాలిక్రిందవేసి నిర్దాక్షన్యంగా తొక్కి 
నా మానాన నన్నొదిలేశావు..
ఒంటరిని చేసావు 

స్థితిగతులు మారి, 
నా నిస్సత్తువ గెలిచినప్పుడు
నిస్సహాయుడనై.. నీకోసం పిలచిన పిలుపులు
ప్రతిధ్వనులై వెక్కిరించాయి.
నీకోసం ఆత్రంగా వెతికిన నా కళ్ళలో 
ఉబికి వస్తున్న నాకన్నీ విలువ 
తెలుసుకోలేక నన్నోదిలేసి 
నీ ఆనందం నీవు చూసుకున్నావు 
నాతోనే ఉన్నావంటావా .. సాక్ష్యమేదీ ?
అని నిజం కాదు కదా 
అప్పతి జ్ఞాపకాలు సూదులై గుండెల్లో 
గుచ్హుతున్న గాయాల తాలూకా పుండ్లే అవి 
నా బ్రతుకంతా నువ్వు చేసిన జ్నాపకాలే కదా మరి 


నువ్వెంతమందిని పిలిచావు?
ఎంతమందిని కలిశావు ?
అందరూ మంచొల్లే నీకు 
ఒక్క నేను తప్ప ..?
ఎందుకో చెప్పవూ ..?
ఏం నేచేసిన తప్పిదమేమిటి ?

నా రాక.. నీకది ఇష్టంలేదేమో
నే రావడం.. నీకు  కష్టమే ?
అసలాంతర్యమేమో ? ఈ ఎడబాటెందుకో ?
కడలి కన్నీరే తెలిపిన నిజాలివి 

విధిని నమ్మిన వాడిని
నీవి కావాలని కోరుకుంటున్న మనస్సు
.క్షమించు
కాలం జారుతుందిగా..
మన మధ్య దూరమూ..కరుగుతుంది. 
అనే పిచ్చి బ్రమలో బ్రతుకుతున్నా 

ఎప్పటికైనా మన కలయిక తధ్యమే !
కానీ తొందరలో చూడగలనన్న ఆశతో.
నిరాశ అని తెల్సి ..
ఆశను చివరి కోరికగా చేసుకొని 
శూన్యంలో  నీకోసం ఆశగా ఎదురు చుస్తున్నా  

Monday, March 7, 2016

గుండె లోతుల్లో సమాధి చేసిన జ్ణాపకం,

గుండె లోతుల్లో సమాధి చేసిన జ్ణాపకం,
మనసు గోడల బీటలు చూస్తూ
విధి రాతలవని పక్కకు తోసి
తడి కళ్ళతో చిత్తడి భవితలోని
కొత్త చిగురాకు కోసం ఆశగా 
ఎదురు చూస్తుంది మనస్సు 
ఓటమెదురైనా వెనుదిరగని 
తడికిక నా కళ్ళలో తావీయనని..
నడక నేర్చిన శవమై
జీవం వైపుగా ఆగక సాగే పయనమమిది
కనువిప్పు తెలియని  కరిగిపోతున్న 
కాలం సాక్షిగా కన్నీటిలో 
తేలాడే నిజాలు తెలిపే గత0నాది  


మానిన గాయాల్ని రేపడం,
నీకు  అలవాటేమో  కదూ
అలలారిన మనసు కొలనులో
జ్ఞాపకాలిసరడం నీకు అలవాటైన   
నీ ప్రవృత్తేమో కదూ 
ఆరిన జ్ఞాపకాలను  తిరిగి
రగిలించడం నీకానందమెమో కదూ