అలసి,గెలిచిన అప్సరస అందాల ఆరబోతవో
రతీ,మన్మదులు కలిసి గీసిన నిలువెత్తు చిత్రానివో
చూపుల చుంబన చోరినివో రాతిరి వీడలేని వన్నెల జాబిలివో ,
ఆ ఇంద్రుడుపంపిన శస్త్రానివా,ఈ కౌశికునే మెప్పించ తలచిన పంతానివా ...
ఆ ఒంపు సొంపుల ఉక్కిరి బిక్కిరి రగిలించే నాలో మోహావేశం
ఆ చుక్కల చెక్కిళ్ళ సరిగమలు అధరాల మధురిమలతో కలగలిసి కరిగించే తాప ఆరాటం
అయినా ..!
నీ చూపుల రాపిడికేకాలిపోతున్నా
తనువుల తాకిడికే తిరిగి వస్తున్నా ప్రతిసారి...
రసమేని వయ్యారి .........