. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, April 28, 2012

నమ్మిమోసపోయిన మనసును అసహ్యించుకుంటు..మరణం వైపు మౌనంగా నే అడుగులేస్తుంటే

నమ్మిన ప్రేమ నాకు మిగిల్చిన చేదుజ్ఞాపకాలు
ప్రతి క్షణం గుర్తుకోస్తూ..
అనుక్షణం నా ప్రాణాలని నిలువునా చిల్చేస్తూంటే
చితిమంటల జాడని అన్వేషిస్తు
జీవితాన్ని ద్వేషించుకుంటూ..
నమ్మిమోసపోయిన మనసును అసహ్యించుకుంటు
మరణం వైపు మౌనంగా నే అడుగులేస్తుంటే

అనుకోకుండా అప్యాయంగా ఒక మనసు నన్ను పలకరించింది
మాటలతో చినుకల్లే నా మదిని తాకి
ఆవిరైపోతున్న నా ఆశలకి ఊపిరోసింది
మరణమే శరణ్యమనుకొంటు,
రాయిలా మారినా నా మనసుకి
కల్మషం ఎరుగని ఆ పరిచయం
ప్రాణంపోసి మరుజన్మనిచ్చింది
మనిషిగా మళ్లీ నన్ను నిలబెట్టింది

కన్నీటీలో కరిగిపోతున్న నా ఆశయాలని
గతి తప్పిన నా గమ్యాన్ని
అనుక్షణం నాకు గుర్తుచేసి
కొండంత ధైర్యం ఇస్తూ అండగా ఉండి
నన్ను ముందుకు నడిపిన నిన్నూ,నీ స్నేహాన్ని
మరువలేను మిత్రమా....
నే మరణించేదాకా....

శిధిల మైన శిలలా మారిపోవాలని ఉంది..జీవం ఆవిరౌతోంది కదా..

కనురెప్ప వాలిపోతోంది.....
పొంగిపోతున్న కన్నిటికి ఆనకట్ట వేసేందుకు .....
గుండె బరువెక్కుతోంది .....
బద్దలవుతున్న బాధను బందించేందుకు ....
గుండె అలసిపోతోంది .....
చెక్కిలి పై కన్నీటి ఆనవాళ్ళు తుడిచేందుకు. ....
వేదన రాగాన్ని ఆలపిస్తున్న మూగ గానం నాది.........
అది విని కరిగే హృదయపు ఉనికి ఏది ...?
ముక్కలైన మనసుతోనే ... శిదిలమైన ఆస తోనే సంచరిస్తున్నా...
మనిషి లాగే కనిపిస్తూ శిల లాగా బ్రతికేస్తున్న....
లేదు ఇంక ఎక్కువకాలం బ్రతికే అవకాశంలేదనిపిస్తోంది..
శిధిల మైన శిలలా మారిపోవాలని ఉంది..జీవం ఆవిరౌతోంది కదా..
ప్రియా నేను పోయినా నన్ను గుర్తుంచుకుంటావుకదూ..?
ఆవిషయం తెల్సిన క్షనాన ఓ కన్నీటి బొట్టు రాలుస్తావా..?
ఆ కన్నీటి తో మళ్ళీ జీవంపోదాలని ఆలోచన కాదు..అది నాకు మృతం..
ఆ కన్నీటిబోట్టే ..నా తప్పులన్నిటిని తప్పిస్తుందన్న నమ్మకం..
వెళ్ళి పోతున్నాను ప్రియా..నీకు దూరంగా చూడలన్నా చూడలేనంత దూరంగా..
నన్ను చూడాలనిపిస్తే ఆకాశంకేసి చూడు ..అక్కడో తలుక్కుమనే చుక్క నీకోసం ఆత్రంగా చూస్తుంది
మినుకు మినుకు మంటూ నీకోసం ఎదురు చూస్తుంది.అది నేనే..
ఆకాశం లో చుక్కగా మారి నీ చల్లని చూపుల కోసం ఎదురు చూస్తా..
అవును నా పిచ్చిగాని అప్పటిదాకా నేను గుర్తు ఉండాలి కాదా...?
గుర్తు ఉంటానా..గుర్తుంచుకునేంత గొప్పోడిని కాదుకదా...?

Wednesday, April 25, 2012

ఎవ్వరికి తెలియియదు నన్ను నాకు కాకుండ చేసిన నువ్వంటే ఎంత అభిమానమో

ఎవ్వరికి తెలియదు నా కన్నీటితో తలగడ ఎందుకు తడిసి ముద్దయిందో

ఎవ్వరికి తెలియదు నీ కోసం ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో

ఎవ్వరికి తెలియదు నా మనసనే డైరిలో ప్రతి పేజీ నీ గురించే రాసానని

ఎవ్వరికి తెలియదు నేను నిన్ను ఎంతగా ఆరాధిస్తున్నానో

ఎవ్వరికి తెలియదు నిన్ను పలకరించకుండా ఉండటానికి

ఎంత నరకాన్ని అనుభవిస్తున్నానో

ఎవ్వరికి తెలియదు గుండె పగిలేలా ఎందుకు రోదిస్తున్నానో

ఎవ్వరికి తెలియదు ఏ బంధం లేని అనుబంద్ధం నీతో ఎలా పెనవేసుకుందో

ఎవ్వరికి తెలియదు పైకి చెప్పలేని ఎవ్వరితోనూ పంచుకోలేని ఎన్నో భావాలు

నన్ను దహించివేస్తున్నాయని
కారణం ఎవ్వరికి తెలియదు నాకే కాదు మరెవ్వరికి తెలియదు . . .

రేకులు రాలుతున్న పూవును చూసిచెక్కిలి జారిన కన్నీరు నాదేనా?

మనసుకి స్నేహం మత్తు నిచ్చి నిద్రపుచ్చుతూమాటలకు మౌనం భాషనేర్పినవ్వుకుంటూ
ఇంకా ఎంతకాలమిలా..?
ఆగని కాలంకేసి భారంగా చూస్తూభారమైపోతున్న గుండెకేసి జాలిగా చూస్తూచూస్తూ..చూస్తూ..
చెలిని దూరం చేసుకుంటూఇంకా ఎంత కాలమిలా..?
తొలి పొద్దులో గరిక పూవుపైమంచు తాకి మైమరచింది నేనేనా?
ముంగిట ముగ్గుకి రంగులద్దిమురిసిపోయిన మనిషి నేనేనా?
వాన చినుకుల్లో కలిసి తడిసిఅలిసిపోయిన మనసు నాదేనా?
రేకులు రాలుతున్న పూవును చూసిచెక్కిలి జారిన కన్నీరు నాదేనా?
ఏది అప్పటి సున్నితత్వం?ఏది అప్పటి భావుకత్వం?
ప్రతి రాత్రి నను పలుకరిస్తూ మా ఇంటి కిటికీ లో నవ్వుతూ చంద్రుడు! వెన్నెల ఊసులెన్నో చెపుతూ కన్నెగుండెల్లో ఊహలెన్నొ నింపుతాడు ! ఏతారకతో స్నేహం కుదిరిందో ఇటురానేలేదు
ఈరోజు నిశీధినేలే నెలరాజు! లోకమంతా చీకటి...మనసులోనూ అదే చీకటి...చెప్పలేని ఏదో వెలితి

నీవన్న మాటలు ఇప్పడికీ గుండేళ్ళో బాంబుళ్ళా పేలుతూనే ఉన్నాయి

మోసం చేశానా అన్నావు మరి నీవు చేసింది మోసంకాదా..?
అసలు నిజం నీకు తెల్సు..కాని నిన్ను నమ్మావు వాడేం చేశాడో నీకు తెల్సు
ఇష్టమైన వ్యక్తి జీవితంతో మరొకరు ఆడుకుని వేదిస్తుంటే ...కాంగా ఉంటారా..?
చనిపోయే పరిస్థితులు వాడు క్రియేట్ చేస్తుంటే కాంగా ఎలా ఉండగలిగావు..?
మనిషిగా నీవిషయంలో ఎంతగా నలిగిపోయానో తెల్సు కాని నీవు..?
అప్పుడు వాడు... ఆ తరువాత నీవే చచ్చిపో అన్నావు ..ఇలా అనిపించుకోవడానికా బ్రతికి ఉంది
నా గురించి తెలియనివాడు ఎందో చేశాడు మరి నాగురించి తెల్సిన నీవే " ఎవడివి నీవు " అన్నావు
నేను ఏ చిన్నవిషయాన్ని తట్టుకోలేనని తెల్సు ..కాని ఎలా అనగలిగావు..?
నీవన్న మాటలు ఇప్పడికీ గుండేళ్ళో బాంబుళ్ళా పేలుతూనే ఉన్నాయి
అప్పుడు వాడు స్వార్దంకోసం...ఆ తరువాత నీవు.. నేనేం తప్పుచేశానో అర్దంకావడం లేదు
నిన్ను నమ్మా ..నీమాటలు నమ్మా..అదేనా నేను చేసినతప్పు..
నీవన్న ప్రతి మాట గుండెళ్ళో పెట్టుకొని ఇష్టపడ్డందుకు నాకు ఇలా జరగాల్సిందే..కదా..?
నీవు నిజం ..నీ మాటలు నిజం అని నమ్మినందుకు నాకిలా జరగాల్సిందే
అన్నీ మర్చి పోయి నీవు హేపీగా ఉన్నావు .. బట్ నేను మాత్రం ఇలా..అనుబవిస్తున్నా..?
వాడు చేయాల్సింది చేసి హేపీగా ..లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు..వాడు పెట్టిన మంటలు ఇంకా రగులుతూనే ఉన్నాయి
వాడు మనిషి పుట్టి ఉంటే ఇలా చేసుండే వాడు కాదు..?
వాడేం కావాలని కోరుకున్నాడో అప్పుడు నాకు చెప్పాడుసాదించాడు హేపీగా ఉన్నాడు..
నాకు వాడిలా డ్రామాలు అడవాళ్ళడా ఎడ్వటం..అక్కడిమాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చెప్పడం నాకు చేతకాదు
నీమీద నమ్మకం జీవితాన్ని చదివావు ..ఏది నిజమో ఏది అబద్దమో తెల్సుకుంటావని..కాని..?
అందరిలా..నీవు నమ్మించావు.. తర్వాత నీస్వార్దం చూసుకున్నావు..?
అప్పుడెప్పుడో అడిగావు ..నేను మోసం చేశానా అని మరి ఇప్పుడు మోసంచేసింది ఎవ్వరు

నమ్మలేనంతగా దూరం అవ్వడం..నమ్మకాన్ని కోల్పోవడం..

ఏంటో ఒక్కోసారి ఆలోచనలు వింతగా ఉంటాయి..
ఇష్టపడ్డ మనుషులు దూరం అవ్వడం వేరు ఎవవల్లో దూరం అవ్వడం..
నమ్మలేనంతగా దూరం అవ్వడం..నమ్మకాన్ని కోల్పోవడం..
జీవితంలో ఏది జరుగుకూడదని బయపడతామో అదే కళ్ళెదురుగా జరగడం..
ఏది వినకూడదో ఏది వింటే తట్టుకోలేమో అవే వినాల్సి రావడం
మనం భాద పడాలని కొందరు అంటున్నమాటలు గుండేల్లో బాంబుల్లా పేలుతున్నాయి
నాది అనుకున్నది ..దూరం అవ్వడం చాలాదారుణం
మనం కొందర్ని ప్రానంకంటే ఎక్కువగా నమ్ముతాం..
కాని వాళ్ళే మనల్ని నమ్మనంత దూరం అయితే..
నిజాన్ని నమ్మలేక వాస్తవాలను చూస్తూ తట్టుకోలేక ఆ భాద అనుబవించిన వాడికే అర్దం అవుతుంది
తిమ్మిని బమ్మిని చేసి ..మాటలతో మాయచేసేవాడే ఇప్పుడు విజేత...
మనసులో దారుణమైన ఆలొనచనలు పెట్టుకొని పైకి నటించే వాన్నే నమ్ముతారు
నీతిగా నిజాయితీగా వుండే వాళ్ళను నమ్మరు.. అది కల్లారా చూస్తున్నా
అందుకే పదునైన కత్తిని చుస్తే కసిగా గుండేళ్ళో దిగబడితే బాగుండు అనిపిస్తుంది..
అకత్తి దిగబడి గుండేల్లో రక్తం చిమ్మి నాచెలిమీద పడితే బాగుండు అనిపిస్తుంది
వర్షంలో నడుస్తుంటే నామీద పిడుగు ఎందుకు పడ కూడదు అనిపిస్తుంది..
స్పీడ్ గా వెళ్ళే ట్రైన్ చూస్తే అది నాతల మీదమీద గా పోతే బాగుండు అనిపిస్తుంది..
ఎక్కడైనా విషం బాటిల్ చూస్తే గటగతా తాగేయాలని పిస్తుంది
పెట్రోల్ చూస్తే మీదపోసుకొని అగ్గి పెట్టుకోవాలని పిస్తుంది ఒక్కాసారిగా నిలువునా కాలిపోతాంకదా..?
తుపాకి ని చూస్తే ఆ తుపాకీలోని గుళ్ళన్నీ నా గుండేళ్ళో దిగబడితే బాగుండు అనిపిస్తుంది
ఇలా ఎందుకనిపిస్తుందో నీకు తెల్సు నాగు జరిగిన అవమానం..నీవు చేసిన మోసం
నీవే అన్నావుకదా నీవు చనిపోతే నాకేంటి అని అప్పటినుంచి ఇలా అనిపిస్తుంది ప్రియా..
కావాలని కోదరు నా ఎదురుగా చేస్తున్న .. చేసిన పనులు తట్టుకోలేనప్పుడు ఇలా అనిపిస్తుంది
తప్పు వాళ్ళది కాదు వాళ్లకి నీవు అవకాశం ఇచ్చావు నామనసుతో ఆడుకొంటున్నారు..
తప్పు నీది కూడా కాదు నీ లైఫ్ నీ ఇష్టం..కదా..?

Tuesday, April 24, 2012

ప్రపంచాన్ని తృణప్రాయంగా వదులుకోగాలను కాని నీ జ్ఞాపకాల్ని తుడిచేయ్యలేను

నిన్ను విడిచి దూరంగా వెళ్ళగలను కాని నీ ఊహలను వీడలేను.

నీకోసం కన్నులు చెమర్చేను కాని కన్నీరుగా అయిన నిన్ను జారనివ్వలెను.

నీకై అలుపెరుగక నిరిక్షించగలను కాని నీ నిర్ణయాన్ని కాదనలేను.

నా ఊహలను బందించగలను కాని నీకై పరితపించే నా గుండె లయను ఆపలేను.

ప్రపంచాన్ని తృణప్రాయంగా వదులుకోగాలను కాని నీ జ్ఞాపకాల్ని తుడిచేయ్యలేను

Monday, April 23, 2012

కేవలం నిన్ను తప్ప, నీ నుంచి ఇంకేమి ఆశించని నా ఈ ప్రయత్నం..

నాలో పొంగే భావాలే నన్ను వెంటాడి మరీ వేధిస్తున్నాయి.
నాతో సహకరించని నిజాలు నన్నుతప్పు చేయమంటున్నాయి..
ఎప్పటికి నిజం కాని కలల నిప్పుల్లో నేను కాలిపోతుంటే..
నీతో గడిపిన ఆనంద క్షణాల అగ్నికి నే ఆహుతి అవుతుంటే..
నువ్వు మాత్రం నిశ్చింతగా అక్కడ ఎలా నిద్రపోతున్నావు..?
నీ తలపుల వలపు సెగను నాలో ఎందుకు రేపుతున్నావు.. ?
అయినా నా పిచ్చి కాకపోతే .....
నీపై ఇసుమంత కూడా లేని అధికారానికి నాకెందుకింత తాపత్రయం.. ?
ఎప్పటికి నువ్వు దక్కవని తెలిసినా నా వెర్రి మనసుకెందుకింత ఆవేశం..?

ఎందుకో తెలుసా...?
నే ప్రాణంగా ప్రేమించే నా కన్నుల కోసం,
నన్ను నేనే మరిచిపోయే నీ చిరునవ్వుకోసం,

కేవలం నిన్ను తప్ప, నీ నుంచి ఇంకేమి ఆశించని నా ఈ ప్రయత్నం..
ఎప్పటికైనా నిన్ను కరిగిస్తుందని ఆశిస్తూ..

కడసారిగా కనుముసిన క్షణాన నా హృదయాన్ని అడుగు ప్రియా

నిను తొలిసారి చుసిన క్షణం కోసం...... ప్రియా

నీ రూపం మరువలేని నా కనులని అడుగు ........ప్రియా

నీ జ్ఞాపకాల కోసం...

తలచుకొని క్షణమంటూ లేని కాలాన్ని అడుగు.......

నీ ఫై ప్రేమ కోసం..... ప్రియా

మదిలోని వెలకట్టలేని నీ రూపాన్ని అడుగు......ప్రియా

నిను ప్రేమించిన కాలం కోసం... ప్రియా

కడసారిగా కనుముసిన క్షణాన నా హృదయాన్ని అడుగు ....ప్రియా

ఎలా అడిగిన ....ఏమని అడిగిన .....ప్రియా

మదిలోని కొలువైన రూపం చెరిగిపోదు ......ప్రియా

వేరొక రూపం ధరి చేరదు ......ప్రియా

--

కళ్ళు వర్షాన్ని కురిపిస్తున్నా ఈరోజెందుకో..?

బాపుబొమ్మ.. ఎలా రుణపడి ఉంటానీకు చెప్పు..? నీ మాటలు మాయ చేస్తున్నాయ్

బాపుబొమ్మ.. ఎలా రుణపడి ఉంటానీకు చెప్పు..?.
కొందరు మనసుకు చేసిన ద్రోహం .. నీస్నేహంతో మరిపించావు
కొందరు ఆడుతున్న నాటకాలు మనుషులు ఇలా ఎందుకుంటారో అర్దంకావడంలేదు
నిజాన్ని మర్చి ...మనుషుల్ని ఏమార్చి..గతాన్ని మర్చి..
కొన్ని ఘటనలు ఆలొచిస్తుంటే.... వీళ్ళేం మనుషులు అనిపిస్తుంది
అసలు విషయం తెలియక పోయినా అనవసరంగా కల్పించుకున్నవాళ్ళకు షాకిచ్చాను
జీవితంలో వాళ్ళతో మాట్లాడకూడాదని ...మాట్లాడను అని చెప్పేసా...
ఆరోజు నీనోట ఆమాట విన్నప్పటినుంచి మనసు విరిగింది..?
ఇన్ని రోజుగా నేను ఎదురు చూసింది ఈ మాటానిపించుకోవడానికా..?
మా బంగారు బాపు బొమ్మకు చెబితే.. నిన్ను నమ్మని వాళ్ళగురించి ఆలోచించకు అని చెప్పింది
మనిషి చిన్నదైనా మనసు చాలా పెద్దది.. నాకంటే బాగా ఆలో చిస్తుంది
కొంతమంది బిహేవియర్ అలా ఎందుకు చేస్తారో చెబుతుంటే నిజంగా ఎందరో జీవితాలు చదివిన నాకే ఆచ్చర్యం వేస్తుంది
సమయం దొరికినప్పుడల్లా నా బుజ్జి స్నేహితురాళితో మాట్లాడీతె సమయం తెలియడంలేదు
జరిగినవన్ని తనతో షేర్ చేసుకుంటుంటే చాలా పెద్ద ఆరిందిలా సలహాలిస్తుంది
చదివింది M.B.A అయినా మంచి సలహాలు ఇస్తుంది.. మనగురించి ఆలోచించని వాళ్ళకోసం భాదపడొద్దని దైర్యం చెబుతుంది
చాలు బాదలు షేర్ చేసుకునే స్నేహితురాలు ... అదీ ప్రానం కంటే ఎక్కువగా ఇష్టపడ్డ వ్యక్తి.. అన్న మాటలు ..?
ఆ మాటలు తూటాల్లా గుండెలో గుచ్చుతున్నా .. తన మాటలు మర్చిపోలేక పోతున్నా..
చాలు నా చిన్ని హృదయాణికి ఆ చిన్ని స్నేహంచాలు..
జాబ్ సమయం కుదిరినప్పుడు తనతో మాటల యుద్దం....నా భాదలు నన్ను బాగా అర్దం చేసుకుంటుంది..
నేను చెప్పే ప్రతివిషయం వింటుంది.. మంచి స్నేహితురాలి లా సలహా ఇస్తుంది..
మనసు బాగా బాద అనిపిస్తే తనతో మాట్లాడితే .. మండుటెండలో చిరుజల్లులా అనిపిస్తుంది..
నా జీవితానికి కొందరు చేసిన మోసానికి దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ తన స్నేహం
కొన్ని ఘటనలు మరీ మరీ చెబితే .. ఎందుకలా చిన్నపిల్లాడీలా ఆలోచిస్తావంటుంది.
నిజమే కదా నాగురించి ఆలోచించని వాళ్ళ కోసం నేనెందుకు ఆలోచిస్తావని ఆరిందిలా మాట్లాడుతుంది..
మనసులు కలవాలంటే కలవాల్సిన పనిలేదు ఇలా భాదలు సంతోషాలు షేర్ చేసుకుంటే చాలు అనుకుంటాం ..
కొన్ని జరిగిన సంఘనలు ఒ స్నేహం గురించి చెబితే ..తనది తప్పుకాదని నన్నే తిడుతుంది
ఎందుకు అంటే అదంతే నీవిక మాట్లాడొద్దు అంటుంది... బాపు బొమ్మ ఏం మాయచేసావో నన్ను అనిపిస్తుంది అప్పుడు

Sunday, April 22, 2012

నీప్రేమై వెర్రికేకలు పెడ్దుతున్న నా హ్రుదయనాదం ఇంకా నాకు వినిపిస్తుంది కదా!

పిల్లగాలికి పులకరించే నా శరీరం..
మొద్దుబారిపొయిందేమో!
లేక.. పిల్లగాలి నను వెలివేసిందా!

మైమరపించేటి ఆ పూతోటల పరిమళాలు
నా శ్వాసకు అందటం లేదేమీ!
కొంపదీసి నా శ్వాసగానీ... ఆగిపోయిందా!

ఇంకా లేదే!
నీప్రేమై వెర్రికేకలు పెడ్దుతున్న నా హ్రుదయనాదం ఇంకా నాకు వినిపిస్తుంది కదా!
అవిగో, నీటిపొరలు నాకు ఇంకా కనిపిస్తూనే వున్నాయికదా!
నీ చేతి స్పర్శకై నా శరీరం ఇంకా తపిస్తూనే వుంది కదా!
ఆ శ్వాస కూడా.. తెరలు తెరలుగా.. పరిగెడుతుంది కదా!

ఎందరిలో నేనున్నా, నా ఊహలు నీకు అంకితం.

కన్నులకు కలలు సహజం.
ఆ కలలు ఏవేవో ఊహల ఫలితం.

కలలు నిజమైతే కనడం ఓ అర్దం.
కలలు కల్లలైతే కనడం ఎంతో కష్టం.

నా కన్నులు కంటిపాపైన నీకు అర్పితం.
అందులో కన్నీరు మాత్రం నాకు సొంతం.

ఎందరిలో నేనున్నా, నా ఊహలు నీకు అంకితం.
నీ జ్ఞాపకాలతోనే చివరకు అయిపోతానేమో అంతం.

లోకమంతా చీకటి...మనసులోనూ అదే చీకటి...చెప్పలేని ఏదో వెలితి

మనసుకి స్నేహం మత్తు నిచ్చి నిద్రపుచ్చుతూమాటలకు మౌనం భాషనేర్పినవ్వుకుంటూ
ఇంకా ఎంతకాలమిలా..?
ఆగని కాలంకేసి భారంగా చూస్తూభారమైపోతున్న గుండెకేసి జాలిగా చూస్తూచూస్తూ..చూస్తూ..
చెలిని దూరం చేసుకుంటూఇంకా ఎంత కాలమిలా..?
తొలి పొద్దులో గరిక పూవుపైమంచు తాకి మైమరచింది నేనేనా?
ముంగిట ముగ్గుకి రంగులద్దిమురిసిపోయిన మనిషి నేనేనా?
వాన చినుకుల్లో కలిసి తడిసిఅలిసిపోయిన మనసు నాదేనా?
రేకులు రాలుతున్న పూవును చూసిచెక్కిలి జారిన కన్నీరు నాదేనా?
ఏది అప్పటి సున్నితత్వం?ఏది అప్పటి భావుకత్వం?
ప్రతి రాత్రి నను పలుకరిస్తూ మా ఇంటి కిటికీ లో నవ్వుతూ చంద్రుడు! వెన్నెల ఊసులెన్నో చెపుతూ కన్నెగుండెల్లో ఊహలెన్నొ నింపుతాడు ! ఏతారకతో స్నేహం కుదిరిందో ఇటురానేలేదు
ఈరోజు నిశీధినేలే నెలరాజు! లోకమంతా చీకటి...మనసులోనూ అదే చీకటి...చెప్పలేని ఏదో వెలితి
నీవన్న ఆమాట విస్ఫోటనంలా నన్ను కాల్చేస్తుంది ఇక బ్రతకనేమో..
ఆ మాటతో ఇక నేను జీవితంలో కనిపించకూడదని పిస్తోంది..

ఇలాంటి మాట.." పళ్ళు...." ఆమాట గుర్తు వచ్చి నప్పుడల్లా.ఇందుకోసమా..? ఇన్నాళ్ళు ఎదురుచూసింది అనిపిస్తొంది..
నా జీవితాని సైతం ఫనంగా పెట్టి ..నీసంతోషంకోసం అన్ని భాదలు భరించింది ఈ మాటకోసమా..
చాలు అనిపించుకు కున్నది చాలు ఇక నీకు ఎప్పటికి కనిపించకూడదనుకుంటున్నా
నా వెర్రిగాని ఎప్పుడో నన్ను మర్చిపోయావు ఇంకా గుర్తుంచుకుంటావనేది బ్రమ..

కన్నిటిలో నన్ను జారనీయకు రా..ప్లీజ్....

నాకు ప్రాణాన్ని పోసావు
నా ఊహలకు రెక్కలు తొడిగావు
ఇంకేముంది
స్వేచ్ఛగా విహరిస్తున్నా...
నీ చుట్టూ... సీతాకోకనై
నీ జీవితానికి రంగులద్దాలని
ముద్దు ముద్దుతో..
నీ బాధనంతటిని తొలిగించాలని
కౌగిలింతతో..
ఎనలేని సౌఖ్యాన్ని అందించాలని
ప్రతీ రతిలో.
కాస్త చిరాకేసినా...
నిరాశ తొంగి చూసినా..
క్షణం కూడా ఆలస్యం చేయకు
ఇంకేమి ఆలోచించకు
నన్ను పిలువు
నా ఎదపై వాలి సేదతీరు
ఈ లోకానికి తెలియక పోయినా..
నీకు తెలుసు కదరా..
నేన్నున్నానని
మరి ఇంకెందుకు చింతిస్తావు ఒంటరినని.
నా మరణం ఎక్కడో లేదు
నీ బాధలో ఉంది
ఒంటరిననే నీ దిగులులో ఉంది
కన్నిటిలో నన్ను జారనీయకు రా..ప్లీజ్....

విరబూసిన పరువాలు

ఎటు నుంచో...పిలుపు
రా...రమ్మని
ఎటో....తెలియదు
వెళ్ళాలని...
చిగురులు తొడిగిన ప్రాయాలు
గుత్తులు గుత్తులుగా....
విరబూసిన పరువాలు
చాటున దాగి
వాటి మధువులు గ్రోలి
తూగే ఆ తుంటరి వసంతుడి
ప్రేమ రాయబారము కాదు కదా...!
ఈ తీయని సరాగము !!

అన్నీ పిచ్చి బ్రమలు పిచ్చి ఆశలని తేలింది లే..

నిన్నటి కన్నా నేడు
నేటి కన్నా రేపు
బావుంటుందనే ఆశతో
రోజు జన్మిస్తూనే ఉంటా!
నిన్ను చేరాలనే ఆత్రంలో.
నీ దగ్గర సేదతీరాలనే పిచ్చి కోరికతో.
ఇలా నీకోసం అకారణంగా
కొన్ని వేల జన్మలు వృథాగా !!
నన్ను నేనుగా నీకోసం.
కానీ,ఏనాడు నీ స్పర్శ సోకిందో..
ఏనాడు నీ ఆలోచనను నన్ను దరి చేరాయో..
ఎప్పుడు మనంగా అనుకున్నామో
ఆనాడే నా పుట్టుక ఆగింది.
కేవలం నీ ___ కోసమే
జీవించడం మొదలెట్టా....!!!
నీ జన్మ నా కొరకై ఉండి ఉంటె ...
నా జన్మకు మోక్షం ఉండేదేమో..
అన్నీ బ్రమలని తేలాయి..మరి ఇప్పుడు
కానీ,నేడు మరణం నన్ను వెంటాడుతోంది..
మరో జన్మకు సమయం ఆసన్నమైందని.
ప్రతి కలయిక
విడుకోలుకు నాంది అంటూ... విడలేను.
మరో జన్మలో కలుస్తామని..నమ్మలేను.
మరి ఏం చేయను
నీ చెంత ఉండాలనే
నా చింత తీరాలంటే ?
నన్ను నేనుగా ఈ జీవితాని చాలిస్తే కదా
మరుజన్మలో నీవడిలో చేసి సేద తీరగలిగేది ప్రియా
అందుకే తప్పైనా తప్పని పరిస్థితుల్లో
రక్త బంధాలు తెంచుకోవడం తో
నీతోడు కోసంఏమి లేని వాడనై
ఉన్నట్టుండి..వానలో నుండి
జారిపడే నత్తగుల్లల్లా..
ఏ మూలాలు లేకుండా..
జన్మించి ఉంటె ఎంత బాగుండేది !!!!
అన్నీ పిచ్చి బ్రమలు పిచ్చి ఆశలని తేలింది లే..
నీవు నాసొంతం అనుకునే ఇలా ప్రతిక్షనం నీ ఊహళ్ళో బ్రతుకు చాలిస్తున్నా

Saturday, April 21, 2012

నిట్టూర్పులో కన్నీరే తోడనిపిస్తుంది.మనుషుల సాంగత్యం కన్నా ఒంటరితనాన్నే మనసు కోరుతుంది.

ఒక్కోసారి..
గెలుపు కన్నా ఓటమే స్ఫూర్తినిస్తుంది..
ప్రశంస కన్నా విమర్శే ఉత్తేజాన్నిస్తుంది..
వెలుగు కన్నా చీకటే బాగుందనిపిస్తుంది..

ఒక్కోసారి..
పరిచయంలేని అపరిచితుల వద్దే మనసు విప్పాలనిపిస్తుంది..
సమాధానం కన్నా చిరునవ్వే చాలనిపిస్తుంది..
కళ్ళు మూసుకుని గుడ్దిగా నమ్మాలనిపిస్తుంది..

ఒక్కోసారి..
కొన్ని గతాలకు మరపే ముగింపనిపిస్తుంది..
నిట్టూర్పులో కన్నీరే తోడనిపిస్తుంది..
మనుషుల సాంగత్యం కన్నా ఒంటరితనాన్నే మనసు కోరుతుంది..

ఒక్కోసారి.
నిజం కన్నా అబధ్ధమే వినాలనిపిస్తుంది..
వేదనలో హాయికై వెతకాలనిపిస్తుంది..
మాటల కన్నా మౌనమే మేలనిపిస్తుంది.. !

అవును.నవ్వు నేను ఒకటి కాదనేది వాస్తవమే..అంగీకరిస్తాను.

ఎంత దగ్గరైనా...
దగ్గర అవుతున్నా....
ఈ జన్మకు సరిపడే దూరం ఉంది.
మరు జన్మకైనా...
ఎడబాటు లేని కలయిక కావాలి....
అది నువ్వైనా..
మరెవరైనా...కాని.
కానీ...ఈ జన్మ మాటేమిటి ?
అవును.నవ్వు నేను ఒకటి కాదనేది వాస్తవమే,
అంగీకరిస్తాను.
అయితే కావాలనుకున్నప్పుడల్లా...
ఒక్కటవుతున్నాం కదా...
అది వాస్తవం కదా...?
దాని మాటేమిటి ??
అయితే....కేవలం నీ ఊహలతో...
ఎప్పటికి (తెలియని) నీ వాడనై..
ఉండటం ఎందుకు వాస్తవం కాకూడదు ??
నాకంటూ... ఇంకొకరెందుకు ... ???
నేనంటూ...ఉన్నానని...
నాకంటూ... ఒకరు కావాలని
గమనించని ఈ లోకానికి దూరంగా...
ఒంటరిగా...నా ఊహలలో జీవిస్తున్న నన్ను
నేనున్నా రమ్మంటూ... వాస్తవం లోకి లాగింది నువ్వే.
నేడు నేనున్నా...లేకున్నా...అంటే
ఆ వాస్తవం నాకెందుకు ??
నాకై
నీ కంట ఒలికే కన్నీటి చుక్క
నీ పిడికిలిలో భద్రంగా ఉన్న నా చేయి
నీ నుదిటిపై నా పెదాల ముద్ర
ఇవే నా ఉనికి
ఇదే నా వాస్తవం
వీటన్నింటిని ఇంకొకరిపాలు చేయాలనీ చూడకు.
ఊహకైనా...వాస్తవానికైనా...
ఉండాల్సింది ఒక్కటే...
మనం.
మనం లేని నాడు ఏది లేదు.

Friday, April 20, 2012

నీవే మృత్యువని గుర్తించలేకపోయా

నీవే మృత్యువని గుర్తించలేకపోయా
ఒకప్పుడు భయం అంటే తెలీదు.. నీ పరిచయంతో నన్ను వెంటాడి మృతువని గుర్తించలేకపోయా
ఒకప్పుడు మొసం చేశానా అన్నావు..మరి అడుగడుగునా నీవు చేసింది మోసమే
మృత్యువు పేరులో మూడు అక్షారాలు.. నీపేరులో కూడా ఉంది మూడు అక్షరాలే
నీ పరిచయంతో ఓ మంచి మనిషి నికార్సై న మనిషి పరిచయం అనుకున్నా..అది అబద్దం అని తేలింది

మనసు కథ..Real Story ఇలాంటి అమ్మాయిలు లేరు మోసం చేసే అమ్మాయిలే ఉన్నారు

మనసు కథ
‘ఎక్స్‌క్యూజ్ మీ’ అని వినిపించడంతో పక్కకు తిరిగి చూశాడు ప్రగత్. ‘పెన్ను ఉందా?’ అని అడిగింది లక్షణ. ప్రగత్ ట్రెయిన్‌లో నిలబడి ఉన్నాడు. తన పక్కనే ఉన్న సీట్లో కూర్చుని ఉంది లక్షణ. ఆశ్చర్యంగానే ‘లేదండీ’ అన్నాడు. ‘ఎందుకు లేదు?’ వెంటనే అడిగింది లక్షణ. ప్రగత్‌కు నవ్వాగలేదు. ‘నేను పేదోణ్ణండీ. పెన్ను కూడా కొనుక్కోలేనంత పేదోణ్ణి’ అని కాస్త కామెడీని జోడించాడు. ‘మీ షర్ట్ బాగుంది. జేబుకు పెన్ను ఉంటే ఇంకా బాగుండేది’ అంది నవ్వుతూ. రెండు నిమిషాల్లో జరిగిన విచివూతమైన పరిచయం తరువాత ఐదో నిమిషం నుంచి ఫ్రెండ్స్ అయిపోయారిద్దరూ. దేశంలోని విషయాలన్నీ మాట్లాడుకున్నారు ఒక్క లవ్ గురించి తప్ప. అరగంట గడిచింది. లక్షణ పక్కనే ప్రగత్‌కు సీటు దొరికింది. గంట గడిచింది. మాటల్లో పడి మరింత క్లోజ్ అయ్యారు. గంటన్నర గడిచింది. లక్షణ దిగాల్సిన స్టేషన్ వచ్చింది. తను భారంగా చెప్పింది ‘బై’ అని.

మౌనంగానే తలూపాడు ప్రగత్. గంటన్నరలో గతమంతా మరిచిపోయేలా చేసిన ఆ అమ్మాయి వెళ్లిపోతుందంటే తట్టుకోలేకపోతున్నాడు. ఆమెను ఎలా ఆపాలో తెలియని పరిస్థితి. అసలు ఎలా అడగ్గలడు? ఏం చెప్పి ఆపగలడు?

తను లేచింది. ‘బై’ అంది మరోసారి. ఆమె మొహంలో బాధ కనిపిస్తున్నది. కానీ భారంగా కదులుతున్న ఆమె అడుగులు ఏదో ఆశను రేకెత్తిస్తున్నాయి ప్రగత్‌లో. అందుకే ధైర్యం చేసి అడిగాడు ‘మళ్లీ ఎప్పుడు కలవడం?’ అని.
‘ఇదే మా ఊరు. నువ్వెప్పుడొస్తే అప్పుడు కలుస్తా’ సంతోషం నిండిన మొహంతో చెప్పింది లక్షణ.
‘నెక్ట్స్ సండే?’ అడిగాడు.
‘ఓకే’ అంది లక్షణ.
ట్రెయిన్ ఆగింది. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. తప్పలేదు... లక్షణ ట్రెయిన్ దిగింది.
నిస్సహాయుడిలా ఉండిపోయాడు ప్రగత్. ఫ్లాట్‌ఫామ్ మీద నడుస్తున్న ఆమె రెండు అడుగులకోసారి వెనక్కి చూస్తున్నది. కొంచెం దూరం వెళ్లాక ‘ఇట్రా’ అన్నట్టు కళ్లతో సైగ చేశాడు ప్రగత్. ఆశగా వచ్చింది తను.. ‘నీ పేరే చెప్పలేదు. ఊళ్లో దిగి ఏమనడగాలి?’ అన్నాడు.
‘నెక్ట్స్ సండే వస్తావు కదా. అప్పుడు చెప్తాలే’ అంది నవ్వుతూ.
‘మరి నిన్నెలా కలవాలి?’ సందేహంగా అడిగాడు ప్రగత్.
‘నెక్ట్స్ సండే నువ్వొచ్చేసరికి ఇదే బెంచిపై కూర్చుని ఉంటా’ అని స్టేషన్‌లోని బెంచిని చూపించింది లక్షణ.
ట్రెయిన్ హారన్ వినిపించింది. వాళ్లిద్దరి కళ్లల్లో కన్నీటి పొర పేరుకుంటున్నది.
ట్రెయిన్ కదిలింది. వాళ్ల చెక్కిళ్లపై కన్నీటి చుక్కలు!

ఒక ఆదివారం. ట్రెయిన్ వచ్చింది. స్టేషన్‌లో కూర్చున్న లక్షణ కళ్లు అంతా వెతుకుతున్నాయి ఆశగా. కానీ ఏం లాభం..ఇది వందో వారం! ఇప్పటికీ కొండంత ఆశ కనిపిస్తున్నది ఆమె కళ్లల్లో. ఈ రోజూ అంతే! ప్రగత్ రాలేదు.
తను బయలుదేరింది ఇంటికి. స్టేషన్ మాస్టర్ ఎదురుపడి అడిగాడు ‘రెండేళ్లు అయ్యింది. అతడు వస్తాడని నీకింకా నమ్మకం ఉందా?’ అని.
‘బాబాయ్! దేనికోసమైనా ఐదు నిమిషాలు వెయిట్ చేస్తున్నామంటే అది ‘అవసరం’. కొన్ని గంటలు ఎదురుచూస్తున్నామంటే అదొక ‘నమ్మకం’. కొన్ని నెలలు వెయిట్ చేశామంటే అది ‘ఫ్రెండ్‌షిప్’.. కానీ ఎన్నేళ్లయినా, అసలు రాడని తెలిసినా ఎదురు చూడటమే ప్రేమంటే!. నేను అతన్ని ప్రేమిస్తున్నాను బాబాయ్! ఆదివారాలు ఐదు నిమిషాలకోటి గడిచిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు’.... తను చెప్పుకుపోతున్నది.

మౌనంగా మిగిలిపోయాను..కనిపించని కన్నీటితో

నీ చూపుల భావాల్ని
అనుబంధంగా తలచా

నీవు నాలో రేపిన ఆశల్ని
అనురాగం అనుకున్నా

నీమాటల్లో అర్ధాన్ని
ప్రేమగా భావించాను

నా హృదయాన్ని నీకే
సమర్పించాను ప్రేమతో

దరికి చేరుస్తావని భావిస్తే
దూరం చేసావు నిష్కర్శగా

మౌనంగా మిగిలిపోయాను
కనిపించని కన్నీటితో

మనసు రగిలింది ఆగలేక
హృదయం పగిలింది నిలువలేక

ముక్కలైనా హృదయంలో నిను
దాచాను పదిలంగా ప్రతి ముక్కలో

నీకు చూపాలని ఉంది నీపై
ఎన్నో రెట్లు పెరిగిన ప్రేమను

వెలలేని ప్రేమను వెతుక్కుంటూ
నువ్వు వస్తావన్న నమ్మకంతో !!

Wednesday, April 18, 2012

చేతిలొ మళ్ళెల దండ..వయ్యారి నడుము..కసెక్కించే కన్నెతనం

ఎవరు నీవు.. అందాల రాశివా... బాపు బొమ్మవా..
అచ్చం బాపు కుంచెనుంచి జాలువారిన బొమ్మను మిచిపోయావు
చేతిలొ మళ్ళెల దండ..వయ్యారి నడుము..కసెక్కించే కన్నెతనం
పెద్దని వాలుజడ గుండెళ్ళో గుబులు రేపుతోంది..రమ్మని పిలుస్తోంది
నీ పరువం పడకకు రా అని రెచ్చ గొడుతోంది ..నేనేం చేయను
నాట్యమాడే నీ సన్నని నడుము నన్నేం చేయలేవా అని పిలుస్తోంది..
పక్కన బాపు బొమ్మలా నీవు బొమ్మవో ..బ్రమ వో అర్దంకావడం లేదు ప్రియా..
నీ ఎద పైనుంచి క్రాస్ చేసిన పైట కూడా నన్ను వెక్కిరిస్తుంది రమ్మంటూ
నీ ఎదపై క్రాస్ చేసిన పైట కొంగు..అలా క్రిందకు దిగి నడుమును కూడా టచ్ చేసి వయ్యారాలు బోతోంది...
ఆ చీర నడుమును కప్పేస్తుంటే నాకేంతెలియదు...
అని చీరమీద చిర్రుబుర్రులాడుతూ ..నాకు కనిపించాలనే ట్రైచేస్తుంది నీ నడుము..
నీ నడుము వ్యవహారం చూస్తుంటే నాకూ పూర్తిగా కనిపించాలనే ట్రై చేస్తోం ఎందుకో..
నీ చేతిలో మళ్ళెల పరిమలాలు నన్నాగొద్దని పిలుస్తున్నాయి.. అయినా ఏం చేయగలం లే0 కదా..?
బాపు బొమ్మను పక్కన పెట్టుకొని ఆసలో నకిలీ నో అర్దంకావడం లేదు ..?
నిజం అయితే .. ఆనిజం అలానే నా దగ్గరకు వస్తే నేనాగ గలనా..నిన్ను వదులుతానా చెప్పు

నీటి సుడుల మాటు నీరూపం కరిగిపోయింది,

ఓ చెలియా...!
కలనైనా చూద్దామని కనులు మూస్తే,
నీటి సుడుల మాటు నీరూపం కరిగిపోయింది,
జ్ఞాపకాల సుడిగుండం నను ముంచివేస్తుంది,
నా హ్రుదయం లయ తప్పుతున్నట్టుగా వుంది,
నా చెక్కిలి చెమ్మగిల్లుతోంది,

ఇంతలోనే..... ఎదో స్పర్శ,
నా చెక్కిలిని తడుముతూ..
నను ఓదార్చుతున్నట్టుగా వుంది,
అది నీవే కదా!

Tuesday, April 17, 2012

నిన్ను చూడక పొతే ..చెప్పుకోలేని యాతన

ఒక్కోసారి ఉపిరి ఆగిపోతున్నంత బాధ
నువు అర్ధం చేసుకోక పొతే

ఒక్కోసారి శూన్యంగా మిగిలిన వేదన
నువ్వు దూరంగా వెళ్ళి పొతే

ఒక్కోసారి నన్ను నేను కోల్పోఇన భావన
నీతో మాట్లాడక పొతే

ఒక్కోసారి చెప్పుకోలేని యాతన
నిన్ను చూడక పొతే

ఒక్క సారి ప్రేమిస్తే ఇదా ఫలితం ?
విరహగ్నుల జ్వాలలలో దహించే కన్నా
కౌగిలిలో కరిగించవా కనికరించి ?

.గోరింటాకు అందాల వెనుక దొంగచూపులు చూస్తున్న ఆ కన్నుల్లోని భావాలు వెతకాలా

నీ ఎర్రని పెదాళ్ళా.. పండిందా గోరింటాకు..
మనసులోని భావాళ్ళా .. అందమైన మెలికలు తిరిగిన డిజైన్..
ఆ ఎర్రటి గోరింటాకు నీచేతుల్లో పండించి.. సిగ్గుతో మొగ్గగా మారి
.. చేతులను నీ అందమైన నీ మొకారవిందాన్ని అడ్డుగా పెట్టుకొని
నీ వాలు కనులతో ..దొంగచూపులు చూస్తుంటే.మనసు మాటవినదు మరి మనిషన్నవాడు ఆవాలు చూపుల గాలంలో చిక్కుకుంటే విలవిల్లాడాల్సిందే నీ కన్నుల భావాలు పట్టుకోవాలని ప్రయత్నిస్తే అంతుచిక్కని భావాల అనుభూతి..నీ గోరిటాకు అందాలను చూడాలా..గోరింటాకు అందాల వెనుక దొంగచూపులు చూస్తున్న ఆ కన్నుల్లోని భావాలు వెతకాలా..మనసులో దాగిఉన్న ఆలోచననేంటో పసిగట్టాలంటే అయ్యే పనేనా..? చూపులు మరల్చుకోలేక.. ఆచూపుల్లో బావాలు చదవలేక ..గొరింటాకు అందాల వెనుక దోబూచులాడుతున్నా మనసును అర్దం చేసుకోలేక.. అల్లాడుతున్న అల్పప్రాణి.. భాదను అర్దం చేస్తుకో ప్రియా..? నాకు తెల్సు నా మనసులో భావం ..అన్నీ తెల్సు కాని తెలీనట్టు ఎంత అందంగా నటిస్తున్నావు అందమైన బాపు బొమ్మవుకదా ప్రియా

హృదయానికి చెబితే .. ఏం నీకు చేతకాదా..ఆమ్మాయి మనసు జయించలేవాని వెక్కిరిస్తుదేమో

పదహారణాల పడచుపిల్ల.. మనసులో ఎముందో..వాలు జడ ముందుకేసి ...తలనిండా మళ్ళెపూలు తురుముకొని... ఏ యువరాజుకోసమో .. కలల రాకుమారుడికోసమో ఆ ఎదురు చూపులు దూరంగా నిన్ను చూసిన క్షనాన దగ్గరవ్వాలనే తొందరపాటులు అలా దగ్గరకు రాగానే ఒక్కసారిగా కోరగా చూసిన నీ చూపులు నాగుండెళ్ళో గుచ్చుకున్నాయి..అప్పుడే చల్లగా వీసిన పిల్ల గాలి నీ తలలోని మళ్ళేల వాసనను నా హృదయంలో రేపెను అలజడి. ఎమని చెప్పను ప్రియా..సామ్రాజ్యాలు జయించడం ఈజీనెమో గాని నీలాంటీ అందగత్తె వాలు చూపుల్లో చిక్కుకొని నీ తలలోని మళ్ళేల సువాసనల్లో చిక్కుకున్న నేను..చూట్టూ శత్రువులు చుట్టు ముట్టీన రాకుమారుళ్ళా రాబోయే యుద్దం గురించి ఆలోచించడంలేదు .. నీ చూపుళ్ళో పడి విలవిల లాడుతున్నా నా హృదయాన్ని ...ఎలా సమూదాయించాలా ఆచూపులు నాకోసం కాదేమో అన్న సందేహంతో .. అయినా ఈ మాట నా హృదయానికి చెబితే .. ఏం నీకు చేతకాదా..ఆమ్మాయి మనసు జయించలేవాని వెక్కిరిస్తుదేమో అని భయం.. గెలవలేను అనికాదు గెలిచే అర్హత నాకు లేదేమో అన్నచిన్న సందేహం దూరంగా నిలబడి ఆ అందాలను చూస్తూనే ఉన్నా దగ్గరికి రాలేక దరిచేరితే .. ఆ కన్నుల మాటున దాగిఉన్న అసల్ను నిజం నేనే అయితే ఈ చిన్ని ప్రాణం తట్టుకుంటుండా ప్రియా... ఏంటో ఎమంటున్నానో ఏంచేస్తున్నానో అర్దం కావడం లేదు .. అంతా మనసంటా గందరగోళంలో అలా దూరంగా ఇలా ఆచిస్తున్నా ప్రియా

ఈ మూడు ముళ్ళ బందంతో వేయి జన్మన అనుబందాన్ని

శ్రీరస్తు శుబమస్తూ కళ్యాన మస్తు అని ...ఈ మూడు ముళ్ళ బందంతో వేయి జన్మన అనుబందాన్ని..తెలుపుతూ ఒక్కోముడి పడుతున్నప్పుడు ఆ పెళ్ళి కూతురు మదిలో మెదిలే భావాలు...ఏన్ని జన్మలెత్తినా ఈ మూడు ముళ్ళ బంద కలకాలం ఇలాగే ఉండాలని ఈరోజు ముడి పడిన సంబందం బందం అనుబంద తనకు రక్షగా వేయి జన్మల పుణ్యిఫలంగా పోదిన ఈ తాళీ గుండెల పై వేళాడుతుంటే.. తనను వేయి జన్మలు రక్షగా ఇది అండగా ఉంటుండన్న దైర్యాన్ని కళ్ళలో పెట్టుకొని ఆప్యాయంగా తాలిని పట్టుకోని ...మెడలో బర్తకడుతున్న తాళీని పట్టుకొని..ముసి ముసి నవ్వులు నవ్వుతూ.. బర్త తాళీ కడుతున్నప్పుడు బర్త చేతి వేళ్ళూ తాకిన ప్రతీ చోట.. మనసులో జివ్వుమనే ఆలోచన..ఆ సుభసమయం అలాగా మనసులో కలకాలం నిండీ ఉండాలని కొరినట్టు.. తాళికట్టు తున్నప్పుడు .. కనిగొంట ఆనంద భాష్పాలను ఎవరు గుర్తిస్తారు.. ఆ క్షనం జీవితంలో మధురాను భూతిగా చనిపోయే వరకే కాదు .. ఎన్ని జన్మ లెత్తినా..ఆ గుర్తులు మనసులో పదిలంగా దాచుకుంటారు అన్ని భావాలున్నాయి ఈ బొమ్మలో మరి

కన్నీళ్లను దిగమింగుకుని కాలం పెట్టే పరీక్షను తట్టుకుని

ప్రేమ రాహిత్యంలో కొట్టుకు పోతున్న తరుణంలో..ముళ్ళను దాటుకుని .. కన్నీళ్లను దిగమింగుకుని కాలం పెట్టే పరీక్షను తట్టుకుని నిలబడే ప్రయత్నం చేస్తున్న సమయంలో నువ్వు అద్బుతంగా అగుపించావు లబ్ డబ్ మంటూ కొట్టుకుంటున్న గుండెకు కాసింత ప్రేమను పంచావు అంతులేని ఆనందాన్ని ఇచ్చావు ఇదే ప్రయాణంలో ..నీ చల్లని చూపే నిజమంటూ నన్ను నిలువునా తోడేస్తోంది ఇద్దరం ఒక్కరమై ఈ లోకాన్ని చూస్తూ ఉంటే జీవితం చిన్నదైనట్టు.. నీలోకి నేను చేరిపోతున్నట్టు అనిపించింది .. ప్రేమంటే ..ఇదేనేమో ..ఇలాగే ఉంటుందేమో అనుకుంటూ సాగిపోవటమే కదా ముందున్నది ... చెలీ ..నువ్వో మువ్వవై నా హృదయంపై చిరుజల్లుగా మారి సందడి చేస్తుంటే ... ఎంత హాయి కదు.. ఎంత మోహావేశం కదూ .. మార్మికపు ప్రపంచంలో ప్రియురాలి ఒడిలో వాలి పోవటం అంటే ఓ గొప్పనైన అనుభవం స్వంతం చేసుకున్నట్టు .. నువ్వు సత్యం ..నువ్వు వాస్తవం నువ్వే నా సమస్తం .."

నీతో కల్సి రతీ దేవుని నాట్యాలు చేయాలనే తపన..పెరుగుతోంది ప్రియా..?

అదేంటో...
నాభి నుండి గుండె దాకా...
సర్రున ఎగబాకుతుంది.
ఉన్నట్టుండి ఉలిక్కిపడేలా..
చేతికి చిక్కదు
పట్టు వదలదు
ఎటు నుంచి ఎటు పాకుతుందో
మెలిపెడుతుంది దేహాన్ని..
అదేంటో....
ఎంత తడిపిన తడవని పెదాలు..
ఒకటికి ఒకటి ఆధారంగా ఉన్నా...
వణుకుతునే ఉన్నాయ్...
అదేంటో...
ఏదో భారాన్ని మోస్తున్నట్టు
ఎపుడు వాలిపోదామా అనుకునే కళ్ళు
నీ నులి వెచ్చని కౌగిలో చేరాలనే తహ తహ..
నీతో కల్సి రతీ దేవుని నాట్యాలు చేయాలనే తపన పెరుగుతోంది ప్రియా..?
నీ ఆలోచనలతో కళ్ళు మూతలు పడితే చాలు
తెరవాలనే ఆశే లేకుండా...
నిదురించాలని అనుకుంటాయి.
ఏంటి ఇదంతా...అంటే
కారణం ఒకటే...
"నువ్వు".
నిద్రలో నీగురించే కలవరింతలు..
మెళుకువలో ప్రతిక్షనం నీగురించే ఆలోచనలు..
నాకేదో జరుగుతోంది నీవు నన్నేదో చేస్తున్నావు ప్రియా...?
నా నరనరాళ్ళో నీ ఆలోచనలతో నిండి నన్ను నివనీయడంలేదు మనస్సు ప్రియా

Monday, April 16, 2012

ఆకళ్ళో అప్పుడు చూసిన నిజాయితీ పారిపోయింది.. ఆనిజాయితి లేదిప్పుడు అంతా స్వార్దం

నీ కళ్ళలో అనేక భావాలు పలికించగలవు..అందుకే ఆకళ్ళంటే ఇష్టం
నీ చూపుల్లో అమాయకత్వం... ఆరాదన..నమ్మకం కనిపించేది
ఆ అందమైనకళ్ళు అబద్దాలు చెప్పవని చెప్పే దైర్యం లేదని నానమ్మకం
కల్సిన కనిపించిన ప్రతిసారి ఆకళ్ళలో అనేక భావాలు వెతికే వాడిని
ఆ కళ్ళ వెనుక కళ్ళా కపటం లేని నిజాయితీ కనిపించేది నాకు ఎప్పుడూ
ఆప్యాయత అనురాగం ఎంతో ప్రేమతో చూసేవాకళ్ళు...కాని
ఆ కళ్ళే నన్ను మోసం చేస్తాయని కలలో కూడా నమ్మలేదు
ఆకళ్ళే నన్ను అనరాని మాటలు అంటావని అస్సలు ఊహించలేదు
అప్పుడు ఆమనిషి అలా ఇప్పుడు ఇలా ..అంటే రోజులు మారితే కళ్ళలో నిజాయితీ మారుద్దా...?
నేనేంటో తెల్సి కూడా నీవు ఎలా నన్ను అనగలిగావో తెలీదు..
ఆకళ్ళు మోసం చేసాయి అంటే ఇప్పుడు నమ్మ బుద్ది కావడం లేదు..
మరొకరి వంచనచేరి ఆ అందమైన కళ్ళూ నన్ను వెక్కిరిస్తాయని ఊహించలేదు..
మరికరి వంచనచేరి అనకూడని వినకూడని మాటలు అంటాయని నమ్మలేకున్నా
ఆకళ్ళో అప్పుడు చూసిన నిజాయితీ పారిపోయింది.. ఆనిజాయితి లేదిప్పుడు అంతా స్వార్దం
అప్పుడు నీవంటే ఓ దైర్యం కాని ఇప్పుడు నీవు మోసం చేసిన ఘటనే గుర్తుకొస్తుంది
ఎవడో వేష్టుగాడు పనికిరానివాడు..పద్దతి తెలియని వాడు చెబితే నమ్మావు
వాడికి బందాలు బాందవ్యాల విలువ తెలీదు..
తనస్వార్దంకోసం ఎలాగైనా ఎవ్వరి జీవితం నాశనం చేయగలడు..
తనస్వార్దం కోసం ఆడపిల్లలా ఏడుస్తాడు..ఎన్ని జీవితాలు నాశనం అయినా అనుకున్నది సాదిస్తాడు..
మనసుకు నచ్చిన మనిషిని అంతలా ఎలా భాదపెడటాడో నాకు ఇప్పటికీ అర్దంకాదు
నన్నోడిస్తుంటే ఆనందా చూస్తూ ఆకళ్ళు నా నిజాయితీని ఎలా శంకించాయో నన్నెలా మోసం చేశాయో కదా..?

Sunday, April 15, 2012

చెప్పలేని ఊసులన్ని గుండెలో గూడు కట్టుకుంటాయి...

ఏం చేయాలి కాలమా....??
కాలం కరుణిస్తానంటే నాదో కోరిక...
నేను తన సమక్షంలో ఉన్న సమయంలో కాస్త నెమ్మదిగా కదలమని
లేదా... అక్కడే ఆగిపోమ్మని.
ఎంత దగ్గరైన...
ఇంకా చేరలేని దురమేదో... ఉంది.
చెప్పే ఊసులన్ని గాలిలో కలిసిపోతాయి
చెప్పలేని ఊసులన్ని గుండెలో గూడు కట్టుకుంటాయి...
ప్రేమో తెలియదు
మోహమో తెలియదు
కానీ, తను ఎంత అవసరమో మాత్రం తెలుసు !
నా..ఆరాధనను
కళ్ళతో కాక మాటలతో చెప్పాలని
ప్రతి రోజు అనుకుంటాను...
కానీ,తను రాగానే
తన ఎదపై వాలిపోవాలని ,
తన పెదవులను తడపలనే మోహంలో పడి
మౌనమై పోతాను...
24 గంటలూ... నా ఆలోచనలలో మెదిలే తనని
కనీసం... 4 గంటలైన... నా ముందు నిలుపుకోవాలంటే...
ఏం చేయాలి..... కాలమా....?!

మరి ఈ జీవితాన్ని విడి వెళ్ళవు కదా....??

నీవన్నది నిజం...
నేనన్నది అపద్ధం...
మనమన్నది తాత్కాలికం
మన బంధమే శాశ్వతం
గత జన్మ వాసనలే
మనల్ని దగ్గర చేస్తే...
మన కలయిక అర్థవంతమే కదా...?!
మరి,
నీవెవరివో...
నేనెవరినో....
ఇలా....ఏలా...కలిసామో...
అన్న ప్రశ్నలు నీకెలా...?
ఏ...అడ్డంకులు లేకుండా...
నీ...సహచర్యమే లోకంగా...
బ్రతకడమే ఓ... వరంగా....
పొందడమే నా...లక్ష్యంగా....
నే జీవిస్తున్నాను.....!!
మరి ఈ జీవితాన్ని విడి వెళ్ళవు కదా....??

ఏనాటి బంధమో ఇది.....!!

ఏనాటి బంధమో ఇది.....!!
మన మనసుకు ఎవరు ఎపుడు ఎందుకు నచ్చుతారో తెలియదు...ఎవరితో ఏ బంధం ఏర్పడుతుందో అది ఎలా కొనసాగుతుందో...ఎవరు ఊహించలేరు.ఆ బంధాలలో కొన్ని అమోదయోగ్యమైనవైతే మరి కొన్ని (సమాజం దృష్టిలో ) కావు.ఏ దృష్టిలో చూసినా... ఆ బంధాల వల్ల కలిగే ఆనందం ఉందే అది శాశ్వతమైనది... అది ఏ దృష్టి కోణాలకు అందనిది...లొంగనిది...అలాంటి ఓ..మానసిక బంధమే నీకు నేనున్నానన్న నమ్మకాన్ని కల్పిస్తుంది.ఆ...నమ్మకమే మన జీవితాన్ని నడిపిస్తుంది....ఏ కష్టానికి చలించని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. అంతకన్నా మన జీవితానికి మరేదైనా.... కావాలా....??

ఈ నా జన్మను పునీతం చేయడానికి వచ్చిన ఓ...నా ప్రియ బంధమా...! ఇదిగో నన్ను నేను నీకు అర్పిస్తున్నాను. నీ చల్లని చేతులలో, నీ వెచ్చని కౌగిలిలో,నీ ప్రేమ పూర్వకమైన మాటలలో ఎల్లవేళలా నేను ఉండేలా....నన్ను అనుగ్రహించు.

ఒరేయి నిన్ను వదలను .. అవకాశం దొరికితే అయిపోయావు

ఒరేయి నిన్ను వదలను .. అవకాశం దొరికితే అయిపోయావు..
అసలు నీవెవడివిరా నాజీవితంతో ఆడుకోవడానికి..వెర్రోడా..?
తనను ఇష్ట పడ్డంత మాత్రానా నిన్ను నేను ఎందుకు క్షమించాలి ఎవడివి నీవు
చచ్చు వెదవ.. ఆ అమ్మాయిని నమ్మక ఆ అనుమానాన్ని నాజీతంమీద చూపిస్తావురా ..
ఆ అమ్మాయు ని అనుమానించి తెలివిగా నాటక మాడుతావురా.. ఏడ్పుగొట్టు వెదవ
అన్ని సంత్సరాల పరిచయంలో అనుమానించావురా వేష్టుగాడివి
తనను అనుమానించి ఆనుమానించి ఎంత డీసెంట్ గా నాటకాలు ఆడావురా
అనుకున్నది సాదించావు... హేపీగా లైప్ ఎంజాయ్ చేస్తున్నావు మరి నేను
తను హేపీగా ఉడాలని నీవు ఏంచేసినా భరిస్తే నాకు చివరికి మిగిలింది అవమానం
తను నన్ను ఘోరంగా మాట్లాడేంత గా నీవు విజయం సాదిచావు వెర్రి నాకొడక
ఇంతా చేసి నా జీవితంలొ నీవు పెట్టిన చిచ్చులో ప్రతిక్షనం అల్లాడుతుంటే నీవు హేపీగా
ఆరోజు పార్కులో నాకు చెప్పినట్టుగా ఎంజాయ్ చేస్తున్నావుకదా.. ?
అసలు నీ కెరెక్టర్ తెల్సుకుందామని నీమీద రికార్డెడెడ్ గా చెసిన ప్రయోగంలో నీవు వేష్టుగాడివని తేలింది
అమ్మాల కోసం... ఏలాంటి డ్రామా అయినా ఆడతావు..నీకు నీవు గొఫ్ఫోడివని చెప్పుకుంటావు
అంత వేష్టుగాడివని తెలింది.. సో .. నేను ఇప్పటికీ నా జీవితాన్ని కోల్పోయి భాద పడుతుంటే నీవు ఎంజాయ్ చేస్తావా..
సో నిన్ను నేనెందుకు వదలాని... వదలను నేనేంటొ చూపిస్తాను.?
నీవు చేసిన తప్పులకు నీతో భయంతో పరుగులు పెట్టిస్తాను చూసుకో
ఇప్పటీకీ నాకు ఎన్ని రాత్రులు నాకు నిద్రలేకుండా చేశావో అంతకు డబుల్ పరుగెత్తిస్తాను..?
మనిషివిలువ తెలీని వెర్రి వెదవ ఇప్పటినుంచి నీకు నీతి నిజాయితి అంటే భయం ఏంతో చూపిస్తాను..?
ఓ మనిషికి ద్రోహంచేస్తే జీవితంలో ఎంత భాదపడాల్సి వస్తుందో తెల్సేలా చేస్తాను
ఇదంతా నా మనసులో ఉన్న భాద..అది నిజంగా మారితే అది వెంటాడితే ఏంజరుగుతుందో చూడు..
ఆ మనిషే నాకు దూరం అయినప్పుడు అసలు నిన్నెందుకు వదలి పెట్టాలి
ఈ మద్య నాకు తెల్సిన నిజాలు నన్ను కలచి వేస్తున్నాయి..?
అందుకే నీవు నావిషయంలో చేసిన ప్రతి తప్పుకు నీవు మూల్యిం చెల్లించుకుంటావు
తనే నాకు దూరం అయింది కాబట్టి నీవు చేసిన ప్రతి తప్పుకు .. అనుబ వించాల్సిందే
ఎప్పుడు ఎక్కడ ఏవిదంగా నీవు నావిషయం లో చేసిన తప్పులు నిన్ను వెంటాడతాయి కాసుకో వెర్రి నా కో...క

నిన్ను విడిచి నేనుండలేను ..నన్ను నేను సముదాయించుకోలేను..

"ఘనీభవించిన కాలం
ఒక్కోసారి గుండెను గాయం చేస్తుంది
మరోసారి కోలుకోలేకుండా మార్చేస్తుంది
ప్రయాణమే జీవన మార్గంగా మారిన ప్రస్తుత తరుణంలో
మాటలు కరువయ్యాయి ...ఇక చూపులే మిగిలాయి ..
హృదయం మంచు ముద్దగా మారింది ...నీ గురించి ఆలోచించి ..ఆలోచించి ...
అయినా ..నువ్వు అక్కడ నేను ఇక్కడ
దారులు వేరు..గమ్యాలు వేరు ..
ఊహల్లో నేను ..కలల అలలై ఎగసి పడుతుంటే
నేను మాత్రం నీ తలపుల తనువు కోసం ఆరాటపడుతున్నా ...
మన పరిచయం ...సముద్రం లోని దిక్సూచిలాగా మారింది ..
అప్పుడప్పుడు ఓ రెండు మాటలు ..మరికొన్ని వాలు చూపులు ...
నీ కళ్ళు మెరిసినప్పుడు ...నీ పెదవుల మీద దరహాసం విరిసినప్పుడు
నీ గుండెల మీద ..నా చూపు గులాబిగా మారి నిన్ను గుచ్చుకున్నప్పుడు
నేను నేనుగా ఉండలేకపోయా ...
బహుశా ఇది మన మద్య మరింత దూరాన్ని పెంచింది
పెను అనుమానాలకు తావిచ్చింది ...
నిన్ను విడిచి నేనుండలేను ..నన్ను నేను సముదాయించుకోలేను..
మనసు పొరల్లో నిక్షిప్తంగా ఉండిపోయిన ..ఆ కాసిన్ని కన్నీళ్లను కార్చటం తప్పా ...
అందుకే ..నిండారా ..ఏడుస్తూ ఉన్నా ...
నువ్వు ..హాయిగా ఉండాలని ..వెళ్ళిపోతున్నా నీకు దూరంగా.. "
వెంటాడే జ్ఞాపకాలు

కళ్ళే కదూ ..అవును ..నిజంగా కమ్మని కళ్ళే ..

నువ్వు ఎక్కడున్నా పట్టేస్తాయి
నీకు తెలియకుండానే వెంటాడుతాయి
గతపు జ్ఞాపకాలతో తోడేస్తాయి
కోటి కోరికలు రేపుతాయి
దారి కోసం వెదుకుతూ ఉంటే
సముద్రంలో దిక్సూచిలాగా వెలుగు పంచుతాయి
అవి అందమైన ప్రపంచాన్ని చూస్తాయి
చూసేలా చేస్తాయి
కానీ తనను నిరంతరం కాపాడే కను రెప్పలను తప్పా ..
కనుపాపలను తప్పా ..
కళ్ళే కదూ ..అవును ..నిజంగా కమ్మని కళ్ళే ..
అవి గుండెకు వాకిళ్ళు..
హృదయానికి రెక్కలు ..
మనసుకు పొదరిల్లు ...
కళ్ళను చదివితే లోకాన్ని గుప్పిట బిగించినట్టు
కళ్ళలోకి చూస్తే ..ఇక ఏమీ లేనట్టు అనిపిస్తుంది
అంతా అయిపోయాక ..అద్భుతంగా తోస్తుంది .."
వెంటాడే జ్ఞాపకాలు

నీప్రేమై వెర్రికేకలు పెడ్దుతున్న నా హ్రుదయనాదం ఇంకా నాకు వినిపిస్తుంది కదా!

నీ జ్ఞాపకాల పందిరిలో.... ఇంకా నే బ్రతికున్నా....!
కమ్మగా వీనులవుందు చేసే ఆ కోకిల గానం ఎమైందీ!
చిట్టిచిలకమ్మ చెప్పేటి ఆ ముద్దుముద్దు మాటలు ఏమైయ్యయీ!
కోకిల గొంతు మూగబోయిందా!
చిలుకమ్మ కూడా ఎగిరిపోయిందా!
లేక.... నా కర్ణభేరి కరిగిపోయిందా!

మంచుబిందువులతొ మెరిసేటి ఆ పచ్చిక బయళ్ళు,
గలగలపారేటి ఆ సెలయెరు,
చిరుగాలికి సిగ్గుపడుతూ రమ్మని పిలిచే ఆ పూతోటలు,
ఏవీ?... అగుపించవేమీ!
ప్రకృతి విలయతాండవంలో కనుమరుగయ్యాయా!
లేక..... నా నయనములు నాశనమైపోయాయా!

పిల్లగాలికి పులకరించే నా శరీరం..
మొద్దుబారిపొయిందేమో!
లేక.. పిల్లగాలి నను వెలివేసిందా!

మైమరపించేటి ఆ పూతోటల పరిమళాలు
నా శ్వాసకు అందటం లేదేమీ!
కొంపదీసి నా శ్వాసగానీ... ఆగిపోయిందా!

ఇంకా లేదే!
నీప్రేమై వెర్రికేకలు పెడ్దుతున్న నా హ్రుదయనాదం ఇంకా నాకు వినిపిస్తుంది కదా!
అవిగో, నీటిపొరలు నాకు ఇంకా కనిపిస్తూనే వున్నాయికదా!
నీ చేతి స్పర్శకై నా శరీరం ఇంకా తపిస్తూనే వుంది కదా!
ఆ శ్వాస కూడా.. తెరలు తెరలుగా.. పరిగెడుతుంది కదా!

అవును...కదా!
ఇంకా నే బ్రతికేవున్నానేమో!

తెరలు తెరలుగా కమ్ముకువచ్చేటి రోదనను అదుపుచేసుకుంటూ....
పొరలు పొరలుగా పారేటి కన్నీటిని సుడులు తిప్పుకుంటూ....
పగులుతున్న హ్రుదయానికి అతుకులు వేసుకుంటూ....
నీ జ్ఞాపకాల పందిరిలో.... ఇంకా నే బ్రతికున్నా....!

నీకుమల్లేనే ఈ ప్రకృతి కూడా ఇక నాదరి చేరదేమో!

ఆకాశంకన్నామిన్నగా ఉన్న నా ప్రేమను మోయలేకున్న

నీవు శ్వాసించి వీడిన గాలి నా హృదయాన్ని చేరి,
నీ తలపులతో నాకు ప్రతిక్షణం ఊపిరినిస్తుంది.

నా మదిలో మంచులా కోలుఉన్న నీ రూపు, నీపై
తాపంతో కరిగి అలజడితో అలలా ఎగసిపడుతుంది.

నీ జ్ఞాపకం నా లయలో బడబాగ్నిలా మండుతూ,
నిన్ను చేరుకోమని నన్ను ఎండమావిలా చేసింది.

నీతో నడిచిన ప్రతిచోటు నీ స్మ్రుతులనే తలపిస్తూ,
నువ్వు లేని నేను, నేను కానని నవ్వుతున్నాయి.

ఆకాశంకన్నామిన్నగా ఉన్న నా ప్రేమను మోయలేకున్న
నన్ను చూసి ఆ నింగి చినుకై నిన్ను చేరుకోమంది.

పంచభూతాలు సైతం నా ప్రేమకు పరవశించి నన్ను నీతో
కలపాలని ప్రయత్నిస్తున్న నీ మౌనం నన్ను ఆపేస్తుంది.

హృదయంలో నాపై ఇష్టం దాచి నీ మనస్సును నువ్వే
ఎందుకు వెలివేస్తున్నవో తెలియక నా మది నీ పిలుపుకై వేచిఉంది.

హృదయంలో నాపై ఇష్టం దాచి నీ మనస్సును నువ్వే

Saturday, April 14, 2012

ప్లీజ్ ఈ పిల్లలను ఆదుకొండి

Dear friends as you all knew in helping people my channel " Zee 24 Gantalu " will be in first,
Here is a story of 5 sisters who live in Chennampalli (Village) Thalakondapalli (Mandal) Mahbubnagar (Dist) Andhra Pradesh.
Recently mother died & after days father also died.
Not even relatives attended funeral because they afraid these kids are girls.
After this they were under grand fathers care.

Yesterday he left(Passed away) these kids alone & went to meet god to ask him to give good health & wealth to take care of these five girls.
Till now he didn't came back. Finally God is also helpless, now these kids are alone.
They are searching for helping hands so i want you to hold their hand & show way to get success.
If we help these kids sure one day they help who are in need.
Here am giving you elder girl's (Radha) account number

Name: Pabali Radha
Bank: SBI
Number: 32280922120
Branch: Veljal (Mahbubnagar)

Not expecting money any help you can give.

I thank Mr Narender Chary our Mahanubnagar reporter for bringing this to
"Zee 24 Gantalu" Studio for live.
Each photo has a story

నిజాన్ని అందరూ ఒప్పుకొవాళ్సిందే..?

జీవితమనే చిత్తు కాగితం మీద రాసిన అందమైన ప్రేమలేఖను నేను...

జీవితమనే చిత్తు కాగితం మీద రాసిన అందమైన ప్రేమలేఖను నేను...!
భావాల సుడిగాలి రేగినప్పుడు అలా తేలుతూ...నీ ముందు వాలుతాను.
నాకు తెలుసు నువ్వు నా...స్థానాన్ని నాకిస్తావని.
నా జీవితాన్ని ఉండ చుట్టి అందులో పడేసావ్.నువ్వు పనికిరావని విసిరేసిన వస్తువులతో నేను జతకట్టాను.
నాకు వాటికి ఒకటే తేడా...అవి నిన్ను ప్రేమించావు.నేను ప్రేమించకుండా...ఉండలేను.
రోజులో ఏదో ఒక సారి నువ్వు నావైపు తొంగిచూస్తావ్.అది మొగ్గవిచ్చుకోనేందుకు పడ్డ సూర్యకిరణం అని అనుకొనే అంతలోపే...మేఘాల కనురెప్పలు వాల్చేసి వెళ్ళిపోతావు.
నా చుట్టూ ఉన్న కిటికీ సందులలో నుంచి నీ పాదాల కదలికలను గమనించే ఆ ఆనందమే వేరు...
నేడు నువ్వు ఇచ్చిన స్థలం కంటే పెద్ద స్త్స్లంలో వచ్చి పడ్డాను.ఇక్కడ చాలా మందికి పనికి రాని వస్తువులు ఉన్నాయి కానీ,నాకెందుకో వాటితో స్నేహం చేయాలని లేదు.. ఎందుకంటే నీది అన్నది ఏది...లేదు కదా!
మల్లి నాలో భావాల సుడిగాలి రేగి నీ చెంతకు రావాలని ఎగిరాను...కానీ గాలి నాకు ఆర్హత లేదంటూ... మంటల్లోకి నెట్టేసింది.నేను బూడిదైన...నా ప్రేమ పరిమళాలు నిన్ను తాకితే అంతే చాలు... ఈ జన్మకు...!!

పనికిరాని గీతల్ల నా కోరికలు ఏరేజ్ అవుతున్నాయి.

నీ నిట్టూర్పులలో.....
నా విరహం ఊపిరి వదిలింది.
ఎన్నో వెన్నల రాత్రులు
నీ తోడు లేక ఉసూరుమన్నాయి.
నువ్వు జీవితం కోసం వేస్తున్న స్కెచ్లలలో...
పనికిరాని గీతల్ల నా కోరికలు ఏరేజ్ అవుతున్నాయి.
స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ లా....
కురిపించకు నా మీద ప్రేమను.
కాస్త నిలకడగా ఉండు...
నా కళ్ళ రెప రెపలను
నువ్వు కాగితాల రెప రెపలతో పోలిస్తే.....
నా కలలన్నిటిని నోట్ల కట్టల్లా....
బీరువాలో దాచాల్సిందేనా....?

రాసుకుంటున్న మంటల వేడి

నిదుర రాని రేయిలో
పురుడు పోసుకున్న వేదనలు
ఎవరు చూసారు గనుక....
జారుతున్న కన్నీటిలో
రేపటి స్వప్నాలు ఉన్నాయని
ఎవరికీ తెలుసు గనుక...
చిరునవ్వుల వెనుక
రాసుకుంటున్న మంటల వేడి
ఎవరిని తాకింది గనుక....
నేనేంటో...........తెలియడానికి.

Friday, April 13, 2012

"ఎందుకో ఒంటరిగా అన్పిస్తోంది, ఏదో తెలీని లోటుగా ఉంది

నిర్లిప్తత కమ్ముకుంటోందా..

గంభీర స్వరాలు అకస్మాత్తుగా మూగబోవడం..

చలాకీగా చేసే పనులన్నింటిపై నిర్లిప్తత ఆవరించి స్థబ్ధంగా నిలిచిపోవడం..

కళ్లెదుట ఏం జరిగినా ప్రేక్షకుల్లా ఉండడమే సౌఖ్యంగా అన్పించేయడం..

ఇలాంటి మానసిక స్థితికి అప్పుడప్పుడు లోనవ్వని మనిషి ఉండరు. అందుకే చాలామంది కళ్లు శూన్యంలో, మనసు నిస్తేజంలో ఉండడం మన గమనింపుకు వస్తూనే ఉంటుంది.

ఉవ్వెత్తున ఎగిసే ప్రతీ అలా ఓ చోట విరిగిపడాల్సిందే! ఆ పడిన చోటి నుండి తిరిగి బలమూ, వేగమూ పుంజుకోవాలంటే కాస్తంత స్థబ్ధత ఆవరించాల్సిందే.

చాలామందికి తెలియని వాస్తవం.. మన ఆలోచనలు ఇదే క్రమంలో ఎగిసిపడతాయీ, కల్లోలం అవుతాయీ, నిర్లిప్తంగా ఆగిపోతాయీ, తిరిగి మరోమారు ఎగిసిపడతాయి.

"ఎందుకో ఒంటరిగా అన్పిస్తోంది, ఏదో తెలీని లోటుగా ఉంది, కాసేపు నన్నిలా వదిలేయండి" అని చాలామంది నుండి వింటుంటాం. ఎగిసిపడడం, విరిగిపడడం, మళ్లీ బలం పుంజుకోవడం అనే cycle అనేదే లేకుండా ఏ మనిషి ఆలోచనలూ ఉండవు. అంటే ఓ క్షణ కాలమైనా, మనం ఎంత బిజీలో ఉన్నా, ఎంత ఏక్టివ్ గా పనిచేసుకుంటూ వెళుతున్నా.. మనం గమనించినా గమనించకపోయినా మన మనసు స్ధబ్ధంగా మారకుండా ఆపలేం.

అన్నింటిలోనూ తానే కలివిడిగా ఉండాలనుకునే మనిషి.. ఆ స్ధబ్ధతలో మాత్రం.. ఏ విషయంలోనూ కొద్దిపాటి ఆసక్తినైనా కలిగి ఉండకపోవడం కూడా ఈ మానసిక cycle ఫలితమే. అందుకే మనకు కావలసిన వారు ఉన్న ఫళంగా ఒంటరిగా ఫీలవుతున్నారని అన్పించినప్పుడు, ఆ ఒంటరితనానికి సరైన కారణాలూ కూడా ఏమీ లేవని అర్థమైనప్పుడు వారికి కాసేపు అలా ఒంటరిగా వదిలేయడమే మంచిది..

దేవుడు నామీద ఎందుకో పగపట్టాడు...? దేవుడే వెంటాడి వెదిస్తే..ఎవరికి చెప్పుకోవాలి..?

దేవుడు నామీద ఎందుకో పగపట్టాడు...? దేవుడే వెంటాడి వెదిస్తే..ఎవరికి చెప్పుకోవాలి..?
దేవుడు నామీద ఎందుకో పగపట్టాడు...?దేవుడే వెంటాడి వెదిస్తే..ఎవరికి చెప్పుకోవాలి..?..దయ్యాలు పగపడతాయి కాని దేవుడు కూడా పగపడతాడని నా విషయంలో తెలుస్తోంది..కారనాలు వెతుక్కుంటే అన్నీ అవే...ఎందుకిలా జరుగుతుందో నాకే ఎందుకిలా జరుగుతుంతో తెలీదు..దేవుడా కొంత మందిని మనసుకు నచ్చిన వారిని పరిచయం చేసి.. ఆచ్చర్య పరుస్తావు..నేనేంటి వీళ్ళు నాకు మనస్సుకు దగ్గర అవడం ఎంటీ అనుకుంటూ ఉండాగా నే ఆ మనిషిని మనసుకు ఇంకా దగ్గర చేస్తావు..జరిగేది నిజమా అబద్దమా అనిమనసులో అచ్చర్యపోవడం కాదు ఒకింత గర్వంగా గొప్పగా ఫీల్ అవుతా ఆపీలింగ్ ఆలా మనసులో ఉండగానే .. జరిగేది నిజమో అబద్దమో అనుకుండాగా... అన్నీ నిజాలే అని మైమరపిస్తావు..దేవుడా నేను నీకేం ద్రోహం చేశానో తెలీదు అంతా నిజం అని నమ్మిస్తావు..నేనూ నమ్మేస్తాను నాది అసలే పిచ్చి మనస్సుకదా.... అలాంటీ క్షనంలో నే భయపడుతుంటాను ఎందుకో తెల్సాదేవుడా నామీద నాకు నమ్మకం లేదు నా అదృష్టం అలాంటిది..ఎన్నో సంఘటనలు చూశాను.. అలా నాజీవితంలో కొద్ది రోజులు ... ఒక్కోసారి పట్టలేనంత సంతో షాన్నిస్తావు ..చాలు నా జీవితానికి అని నాకు నేను అనుకునే లోపు...గుండెళ్ళో బాంబులు పేలుస్తావు..ఎందుకు ఇలా నాకే జరుగుతుందో తెలీదు.. నన్ను నేను తగ్గించుక్కున్నా.నా మనసుకు నచ్చిన వాళ్ళూ బాగుండాలని నేను జీవితంలో తలొంచి కాంప్రమైజ్ అయినా నీవు వదలవుగా పట్టలేని సంతోషాన్ని కొద్ది రోజులిచ్చి... అక్కడనుంచి నీ ప్రతాపం చూపిస్తావు.. నా నిద్రను కరువు చేసి.. ప్రతి రాత్రి కన్నీటి మయం చేస్తావు.. నిద్రపట్టకుండా ఏడిపిస్తావు..అలా ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా కరువు అవుతాయి నీరసం వస్తుంది..జీవితం మీద విరక్తి పుడుతుంది....అయినా దేవుడా నీకు నామీద కసితీరదు... పగలు కొందరు శాడిష్టులతో వెంట పడి వెంట పడి వేదించేలా చేస్తావు..వాడు పగలు పరుగులు పెట్టిస్తాడు.. అదీ నాకిష్టమైన వ్యక్తులతో వినకూడని మాటలు అనిపిస్తావు..చూడలేని విషయాలు తట్టుకోలేని సంఘటనలు నా కళ్ళేదురురా జరిగేట్టు చేస్తావు అలా మనసుకు నచ్చిన వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడీస్తావు..మళ్ళీ మంచి మనుషులను పరిచయం చేస్తావు..అయినా దేవుడివి నీవు నామీద పగపట్టావని అన్నీ నిజం అనుకుంటా.. వారు మాటలు వినాలని కాస్తా ఊరట పోందాలని వారితో సంతోషంగా స్నేహా ఉండి ... అప్పుడూ ఒక్కక్షనం దేవుడా నీమీద అనుమానం నీవేంటి నన్ను ఇలా సంతోష పెడుతున్నావు అని... అయినా పిచ్చోడిని కదా అందర్ని నమినట్టే నిన్నూ నమ్ముతా... అంతే ఆ సంతోషం రెండురోజులే నీప్రతాపం చూపిస్తావు.. నేను ఎక్కడ ఏవిదంగా భాదపడతానో నీకు మాత్రమే తెల్సు గుండెలమీద కొడతావు.. ఏముంది ఎప్పటిలా .. భాదపడటం తప్ప నన్ను నేను మర్చిపోయి ఎన్నోరోజులైంది.. అటు చావనీయవు బ్రతక నీయవు.. దేవుడా ఎందుకు నామీద ఇంత కక్ష .. నేనేం ద్రోహంచేశాను నాన్నని దూరం చేశావు .. అమ్మని దూరం చేశావు.. డబ్బే లోకంగా బ్రతికే రిలేషన్స్ ఇచ్చావు... మరి నాకంటూ మనిషిగా ఎమిచ్చావు..ప్రతిక్షనం ఎందుకిలా వేదిస్తావు.. మనసుకు దగ్గరచేస్తావు వెంటనే దూరం అయ్యేలా చేసి... ప్రతిక్షనం వారి జ్ఞాపకాలతో గుండెలు పగిలేలా ఏడ్చేలా చేస్తావు.. అసలు నన్నెందుకు పగపట్టావో తెలీదు.. అయినా నేనే దొరికానా దేవుడా.. నా మనసుకు నచ్చిన వాళ్ళను దూరం చేసి ఎందికిలా వేదిస్తావు దేవుడా నీకు నేను నచ్చకపోతే .. నాప్రాణం తీసుకపోవచ్చుకదా..?అది నీకు పెద్దపనికూడా కాదు..నన్ను ఇంకా భాదపెట్టడానికే నన్నింకా బ్రతికేలా చేస్తున్నావని తెల్సు నీ ప్లాన్ నాకు అర్దం అయింది దేవుడా.. నాప్రాణం నీవు తీయవు.. నా అంతట నేనే తీసుకునేలా చేస్తున్నావు కదూ అదే నికిష్టం కదూ ఒక్క నావిషయంలో నా మనస్సుతో గుండేళ్ళో ప్రతిక్షనం పొడుస్తూ ఎందుకు నన్నిలా వేదిస్తున్నావు దేవుడా..నీ మనసులో అసలు రహస్యి తెల్సింది.. అదిశగా నేను అడుగులు వేస్తున్నాలే దేవుడా నన్ను ఏడీపిస్తే ఏడీపించావు... నన్ను ఏమైనా చేయి కాని నా మనసుకు నచ్చిన వాళ్ళు హేపేగా ఉండేలా చేయి నేను ఏమైపోయినా పర్లేదు.. ప్లీజ్..నాలా వాళ్ళ మనస్సుతో ఆడుకోకు ప్లీజ్ దేవుడా ఇదే నా ఆఖరు కోరుక.....( ఇంకా చెప్పటానికి చాలా ఉంది మనస్సు భాదగా ఉంది ఇప్పుడు చెప్పలేను )

నిన్న వర్షం నా కన్నీటిని కానరాకుండా చేసింది

ఎవరో ఎమో చెబుతుంటే నమ్మలేది.. ఎందుకో ఆవైపుగా వెలుతున్న నాకు ఓ షాకింగ్
ఏం జరిగిందో ఏం జరుగుతుందో అర్దం కాలేదు...దూరాంగా నిన్ను చూసాను
అలా చూస్తాను అనుకోలేదు.. నీవు చాలా హేపీగా .. మరొ..తో కనిపించావు..
షడన్ గా అలా చూసేసరికి తట్టుకోలేనంత భాద వేసింది..వాడు వేరే వాళ్ళతో చెబుతుంటే నమ్మలా
ఆ తరువాత చూశాక నమ్మక తప్పలా..షడన్ గా చూసేసరికి.. కన్నీరు ఆగలేదు
నీవు అవునో కాదో అర్దం కాలేదు నామనస్సు నిన్ను గుర్తు పట్టింది అది ఏడ్చి నన్ను ఏడిపించింది
నిన్న వర్షం నా కన్నీటిని కానరాకుండా చేసింది..వర్షం నాకన్నీరుకు కానరాకుండా చేసింది
చూశావా నీవు అన్ను మోసం చేసి కన్నీరు తెప్పిస్తే వర్షం కన్నీరు కానరాకండా చేసింది
ఎవరన్నా చూస్తారని కూడా లేకుండా అలా కన్నీరు ఆగలేదు... తట్టుకోలేక పోయాను
అప్పుడెప్పుడో మోసం చేశానా అన్నావు మరి ఇప్పుడు చేసింది మోసం కాదా..?
మరొకరిని మనసులో పెట్టుకొని నామనసుతో ఆడుకున్నావు..నిజంకాదా
వాడు నిన్ను నీ కేరెక్టర్ ను నమ్మక నాజీవితంతో ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకున్నావు నిజంకాదా..?
ఫ్యామిలీ వాల్యూస్ తెలీని వెదవ పెట్టిన మంటల్లో ఇంకా రగులుతూనే ఉన్నా..
ఒక్కోసారి అనిపిస్తుందీ ఏదో రోజు పూర్తిగా కాలి మసైపోతానేమో అని అప్పుడైనా నిజం తెల్సుకుంటావో లేదో
బట్ నీవు నన్ను నమ్ముతావన్న నమ్మకం పోతోంది ఆ తవరువాత నీవు నన్ను చచ్చిపో..ఎవడివి నీవు అన్నప్పుడే..?

నువ్వు లేని నేను, నేను కానని నవ్వుతున్నాయి.

నీవు శ్వాసించి వీడిన గాలి నా హృదయాన్ని చేరి,
నీ తలపులతో నాకు ప్రతిక్షణం ఊపిరినిస్తుంది.

నా మదిలో మంచులా కోలుఉన్న నీ రూపు, నీపై
తాపంతో కరిగి అలజడితో అలలా ఎగసిపడుతుంది.

నీ జ్ఞాపకం నా లయలో బడబాగ్నిలా మండుతూ,
నిన్ను చేరుకోమని నన్ను ఎండమావిలా చేసింది.

నీతో నడిచిన ప్రతిచోటు నీ స్మ్రుతులనే తలపిస్తూ,
నువ్వు లేని నేను, నేను కానని నవ్వుతున్నాయి.

ఆకాశంకన్నామిన్నగా ఉన్న నా ప్రేమను మోయలేకున్న
నన్ను చూసి ఆ నింగి చినుకై నిన్ను చేరుకోమంది.

పంచభూతాలు సైతం నా ప్రేమకు పరవశించి నన్ను నీతో
కలపాలని ప్రయత్నిస్తున్న నీ మౌనం నన్ను ఆపేస్తుంది.

హృదయంలో నాపై ఇష్టం దాచి నీ మనస్సును నువ్వే
ఎందుకు వెలివేస్తున్నవో తెలియక నా మది నీ పిలుపుకై వేచిఉంది.

నీ జ్ఞాపకాలతోనే చివరకు అయిపోతానేమో అంతం.

కన్నులకు కలలు సహజం.
ఆ కలలు ఏవేవో ఊహల ఫలితం.

కలలు నిజమైతే కనడం ఓ అర్దం.
కలలు కల్లలైతే కనడం ఎంతో కష్టం.

నా కన్నులు కంటిపాపైన నీకు అర్పితం.
అందులో కన్నీరు మాత్రం నాకు సొంతం.

ఎందరిలో నేనున్నా, నా ఊహలు నీకు అంకితం.
నీ జ్ఞాపకాలతోనే చివరకు అయిపోతానేమో అంతం.

హఠాత్తుగా జగమంతా చీకటి,

హఠాత్తుగా జగమంతా చీకటి,

గ్రహాల గమనం అస్తవ్యస్తం,

మహార్ణవం,?

కేకలు,

ఏడుపులు-మెరుపులు,

లీలగా గాలి శబ్దం,..

రెండుగా చీలిన విచిత్ర సవ్వడి,

చీకటి సూర్యుడి బేలతనం,

కణాల గలగలలు,

గుండెపొరల్లో అగ్ని

కీలలు……………………………,

విశ్వంలోకి నడుస్తూ..,

శూన్యంలో నేను !!!!!!

Wednesday, April 11, 2012

నీ జ్ఞాపకాల పందిరిలో.... ఇంకా నే బ్రతికున్నా....!

నీ జ్ఞాపకాల పందిరిలో.... ఇంకా నే బ్రతికున్నా....!
కమ్మగా వీనులవుందు చేసే ఆ కోకిల గానం ఎమైందీ!
చిట్టిచిలకమ్మ చెప్పేటి ఆ ముద్దుముద్దు మాటలు ఏమైయ్యయీ!
కోకిల గొంతు మూగబోయిందా!
చిలుకమ్మ కూడా ఎగిరిపోయిందా!
లేక.... నా కర్ణభేరి కరిగిపోయిందా!

మంచుబిందువులతొ మెరిసేటి ఆ పచ్చిక బయళ్ళు,
గలగలపారేటి ఆ సెలయెరు,
చిరుగాలికి సిగ్గుపడుతూ రమ్మని పిలిచే ఆ పూతోటలు,
ఏవీ?... అగుపించవేమీ!
ప్రకృతి విలయతాండవంలో కనుమరుగయ్యాయా!
లేక..... నా నయనములు నాశనమైపోయాయా!

పిల్లగాలికి పులకరించే నా శరీరం..
మొద్దుబారిపొయిందేమో!
లేక.. పిల్లగాలి నను వెలివేసిందా!

మైమరపించేటి ఆ పూతోటల పరిమళాలు
నా శ్వాసకు అందటం లేదేమీ!
కొంపదీసి నా శ్వాసగానీ... ఆగిపోయిందా!

ఇంకా లేదే!
నీప్రేమై వెర్రికేకలు పెడ్దుతున్న నా హ్రుదయనాదం ఇంకా నాకు వినిపిస్తుంది కదా!
అవిగో, నీటిపొరలు నాకు ఇంకా కనిపిస్తూనే వున్నాయికదా!
నీ చేతి స్పర్శకై నా శరీరం ఇంకా తపిస్తూనే వుంది కదా!
ఆ శ్వాస కూడా.. తెరలు తెరలుగా.. పరిగెడుతుంది కదా!

అవును...కదా!
ఇంకా నే బ్రతికేవున్నానేమో!

తెరలు తెరలుగా కమ్ముకువచ్చేటి రోదనను అదుపుచేసుకుంటూ....
పొరలు పొరలుగా పారేటి కన్నీటిని సుడులు తిప్పుకుంటూ....
పగులుతున్న హ్రుదయానికి అతుకులు వేసుకుంటూ....
నీ జ్ఞాపకాల పందిరిలో.... ఇంకా నే బ్రతికున్నా....!

నీకుమల్లేనే ఈ ప్రకృతి కూడా ఇక నాదరి చేరదేమో!

ఆ కళ్ళే నన్ను మోసం చేస్తాయని కలలో కూడా నమ్మలేదు

నీ కళ్ళలో అనేక భావాలు పలికించగలవు..అందుకే ఆకళ్ళంటే ఇష్టం
నీ చూపుల్లో అమాయకత్వం... ఆరాదన..నమ్మకం కనిపించేది
ఆ అందమైనకళ్ళు అబద్దాలు చెప్పవని చెప్పే దైర్యం లేదని నానమ్మకం
కల్సిన కనిపించిన ప్రతిసారి ఆకళ్ళలో అనేక భావాలు వెతికే వాడిని
ఆ కళ్ళ వెనుక కళ్ళా కపటం లేని నిజాయితీ కనిపించేది నాకు ఎప్పుడూ
ఆప్యాయత అనురాగం ఎంతో ప్రేమతో చూసేవాకళ్ళు...కాని
ఆ కళ్ళే నన్ను మోసం చేస్తాయని కలలో కూడా నమ్మలేదు
ఆకళ్ళే నన్ను అనరాని మాటలు అంటావని అస్సలు ఊహించలేదు
అప్పుడు ఆమనిషి అలా ఇప్పుడు ఇలా ..అంటే రోజులు మారితే కళ్ళలో నిజాయితీ మారుద్దా...?
నేనేంటో తెల్సి కూడా నీవు ఎలా నన్ను అనగలిగావో తెలీదు..
ఆకళ్ళు మోసం చేసాయి అంటే ఇప్పుడు నమ్మ బుద్ది కావడం లేదు..
మరొకరి వంచనచేరి ఆ అందమైన కళ్ళూ నన్ను వెక్కిరిస్తాయని ఊహించలేదు..
మరికరి వంచనచేరి అనకూడని వినకూడని మాటలు అంటాయని నమ్మలేకున్నా
ఆకళ్ళో అప్పుడు చూసిన నిజాయితీ పారిపోయింది.. ఆనిజాయితి లెదిప్పుడు అంటా స్వార్దం
అప్పుడు నీవంటే ఓ దైర్యం కాని ఇప్పుడు నీవు మోసం చేసిన ఘటనే గుర్తుకొస్తుంది
ఎవడో వేష్టుగాడు పనికిరానివాడు..పద్దతి తెలియని వాడు చెబితే నమ్మావు
వాడికి బందాలు బాందవ్యాల విలువ తెలీదు..
తనస్వార్దంకోసం ఎలాగైనా ఎవ్వరి జీవితం నాశనం చేయగలడు..
తనస్వార్దం కోసం ఆడపిల్లలా ఏడుస్తాడు..ఎన్ని జీవితాలు నాశనం అయినా అనుకున్నది సాదిస్తాడు..
మనసుకు నచ్చిన మనిషిని అంతలా ఎలా భాదపెడటాడో నాకు ఇప్పటికీ అర్దంకాదు
నన్నోడిస్తుంటే ఆనందా చూస్తూ ఆకళ్ళు నా నిజాయితీని ఎలా శంకించాయో నన్నెలా మోసం చేశాయో కదా..?

ఆ స్నేహం కోసం ఎన్ని జన్మలైనా పుట్టాలని ఉంది

కల్మషం లేని మనసుని చూసా తొలిసారిగా
నను కనుపాపలా వెంటాడే ఆ స్నేహం
కలత చెంద కూడదని
దేవుణ్ణి వెడుకుంటున్నాను ప్రతి క్షణం
నే కళ్ళు మూసుకుంటే అమ్మ లా
నా బాదలొ ఓదార్పులా
నా సంతోషం లో నవ్వులా
తన ప్రేమలో జీవంలా
చూసుకొనే ఆ స్నేహం గురించి
వర్ణించటానికి పదాలు లేవు
ఆ స్నేహం కోసం ఎన్ని జన్మలైనా పుట్టాలని ఉంది
చెరగని మమకారం ఈ జన్మలోఆ దేవుడు నాకిచ్చిన వరం నీ స్నేహం

నీవు నా హృదయంలో బద్రంగా ఉన్నావు నీకేంకాదు..?

భగవంతుడా!!! అసలు మనిషికి మనసుని ఎందుకు ఇచ్చావు

అందమైన కలలు కనమని కళ్ళకు ఎందుకు చెప్పావు....
కన్నీరు కరిగించాడానిక....!
ఆశల వలలు విసరమని గుండెకు ఎందుకు చెప్పావు....
అడియాసలను బందించాడనికా...!
లోతుగా ప్రేమించమని హృదయానికి ఎందుకు చెప్పావు....
తరువాత తనని తానూ బాధతో చీల్చుకోవడానిక....!

భగవంతుడా!!! అసలు మనిషికి మనసుని ఎందుకు ఇచ్చావు?
మనసుని ని బొమ్మగా చేసి మనిషిని ఆడించడానికా..?
నా ప్రతి శ్వాస నువ్వేనని తెలిసి తెన్చుకోవాలనుకున్నాను
కాని నేడు తెలిసింది నువ్వు లేని లోటు ,,,
కమ్మని కలవై నిదురించిన నీవు చెంత లేక
నిదురన్నదే కల అయినది ,
ప్రతి కలలో నను లాలించే నీవు
నేడు నా చెంత లేవు అనేది ఒక కల ఐతే మంచిది ,
అడుగున అడుగై నను నడిపించిన నీవు లేక
ప్రతి అడుగు తడబడుతుంది
ఇక నీవు లేక నేను జీవించలేను
ఈసారికి క్షమించుమా

తీరని కలలు కనే ఏ హృదయాన్నైనా..ఎన్నిసార్లని పీకేస్తాం

ఎన్నిసార్లని విరిచేస్తాం
తీరని కలలు కనే ఏ హృదయాన్నైనా
ఎన్నిసార్లని పీకేస్తాం
రాళ్ళ పగుళ్ళలో తలెత్తే ఏ మొక్కనైనా

ఎన్నిసార్లని మూసేస్తాం
దారి మధ్యలో ఉబికే ఏ ఊటనైనా
ఎన్నిసార్లు తొక్కేస్తాం
శాశ్వతం అనుకునే ఏ పరకనైనా

ఎన్నిసార్లని కుక్కేస్తాం
నిండిపోయిన ఏ ఙాపకాల పెట్టెలోనైనా
ఎన్నిసార్లని ఛేదిస్తాం
అసాధ్యమని తెలిసిన ఏ పద్మవ్యూహాన్నైనా

ఎన్నిసార్లని ముందుకుతోస్తాం
అలసత్వం నిండిన ఏ పిరికి మెదడునైనా
ఎన్నిసార్లని చూస్తూంటాం
ఎటు దూకాలో తెలియని ఏ గోడమీది పిల్లినైనా

ఇక చాలు..ఇదే ఆఖరు

ఇది మొదలు..హృదయాలూ లేవు
విరగడాలూ లేవు..రాళ్ళలో చెమ్మా లేదు
మొక్కలూ రావు...దారీ లేదు
ఉబికే ఊటా లేదు..మెదడూ లేదు

ఆకోయిల గొంతు ఎవరు నొక్కారబ్బా...కాలమా ..కలికాలమా..?

గల..గల మాట్లాడే కోయిల ఎందుకు మూగబోయిందో
ఆకోయిల గొంతు ఎవరు నొక్కారబ్బా...కాలమా ..కలికాలమా..?
ఎంజరిగింది మిత్రమా నేరమా .. అపచారమా..గ్రహచారమా..?
మనసులోని భావాలు ..బయటకు రావడం లేదా..కారణం..?
నిజం నిర్బయం అబయం..అన్నీ ఏమయ్యాయో..ఎమైంది..?
ఏమన్నా ఏమనుకున్నా సర్దుకుపోవాలన్న నీవే...దూరంగా ఎందుకో..?
కోయిల గొంతు కోటిరాగాలు ఇక వినలేనేమో అనిపిస్తుది..ఎందుకంటే..
ఏరుతువులో రాగాలొస్తాయి..ఎదురుచూపులో కాలం కరిగిపోతోంది
మనసా మౌనం వీడవా..ఎన్నాళ్ళీ మౌనం..మరుజన్మదాకా ఎంటీ మిత్రమా
కాలాన్ని కరిగిస్తూ..మౌనం ఎన్నాళ్ళో తెలీదు..కష్టంగా ఉంది చెప్పేందుకు
చేసేదేం లేదు మౌనం వీడే రోజుకోసం చకొర పక్షిలా ఎదురు చూడటం లేదంటే
ఇలాగే నీ మౌనంవీడే రోజు కోసం ఎదురు చూడటం తప్ప..
కాలం ప్రతిసారి కసి తీర్చుకుంటుంది అంటే ఇదేనేమో కదా మిత్రమా

ముక్కలైన మనసు కథ

ముక్కలైన మనసు కథ
కనురెప్ప వాలిపోతోంది.....
పొంగిపోతున్న కన్నిటికి ఆనకట్ట వేసేందుకు .....
గుండె బరువెక్కుతోంది .....
బద్దలవుతున్న బాధను బందించేందుకు ....
చేయీ అలసిపోతోంది .....
చెక్కిలి పై కన్నీటి ఆనవాళ్ళు తుడిచేందుకు. ....
వేదన రాగాన్ని ఆలపిస్తున్న మూగ గానం నాది.........
అది విని కరిగే హృదయపు ఉనికి ఏది ...?
ముక్కలైన మనసుతోనే ... శిదిలమైన ఆస తోనే సంచరిస్తున్నా...
మనిషి లాగే కనిపిస్తూ శిల లాగా బ్రతికేస్తున్న.

Tuesday, April 10, 2012

నిజంగా మనసుతో చెలగాటమాడి..అంత హాయిలా ఎలా ఉండగలుతున్నావో

నిజంగా మనసుతో చెలగాటమాడి..అంత హాయిలా ఎలా ఉండగలుతున్నావో..
నిన్ను నమ్మా నీమాటలు నిజమనుకున్నా..కాని నా నమ్మకం వమ్ము చేశావు
మనసుకి మనిషికి మద్యి గ్యాప్ షృష్టించినవాడిని నమ్మావు..నన్ను నమ్మలేదు
మనసులో ఒకటి బైట మరొకటి మాట్లాడే వాళ్ళను నమ్మావు.. నన్ను నమ్మలేదు
నటించే వాళ్ళను నట్టేటముంచే వాళ్ళనునమ్మావు నన్ను నమ్మలేదు
మనసునిండా స్వార్దాన్ని పెట్టూకొని..కావాల్సింది సాదించుకోవడాని ఏడ్చేవాళ్ళను నమ్మావు నన్ను నమ్మలేదు
నిస్వార్దంగా ..నిన్ను నిన్నుగా.. ఏమి ఆసించకుండా ఉన్న నన్ను నమ్మలేదు
నన్ను నమ్ముతావేమో అని ఆశపడ్డాను..నట్టేట ముంచి నీసంతోషం చూసుకున్నావు
నేనేంటో తెల్సిన నీవు ఇలా చేస్తావని కలలో కూడా ఊహించలేదు..నన్ను నమ్మలేదు..
నేరం చేసినోడు నీతో ఉన్నాడు నిన్నునిన్నుగా నమ్మిన నన్ను నమ్మడం లేదు
ఎదుటి వాని నమ్మకాన్ని సమాది చేసి..ఆ సమాధిపై నీతో జత కట్టాడు అందుకే నన్ను నమ్మలేదు..
ఏ పరిస్థితుల్లో నిన్ను నిన్నుగా ఇష్టపడ్డాను కాబట్టి అందుకేనేమో నీవు నన్ను నమ్మలేదు..
వాడు జీవితాన్ని నాశనం చేస్తున్నా..నిన్ను నమ్మాను కానీవు నన్ను నమ్మలేదు..
అన్ని రోజులు ఎదురు చూసాను కదా అందుకే అప్పుడు అన్ని మాటలు అనిపించుకున్నాను
వాడెవడో వేష్టుగాడు అంటే అన్ని బరించా నీవనలేదుగా అని.కాని నీవే చచ్చిపో ఎవడివి నీవు అన్నావు కదా ..ఎలా అనగలిగా వో తెలీదు

ఆచ్చం వెన్ను పోటు పొడిచిన నా ప్రియరాలిలా

ఒంటరి తనపు మౌనాన్ని ఉపిరి తిత్తుల నిండా బలంగా పీల్చుకొని
బాధల సుడులను బయటకు వదులు తుంటే
వ్యర్ధంగా రాలిపోతుంది వర్తమానం
అస్త్రైలో బూడిదల

నాలో ఈ అలవాటుకి సమాజం చూపే కారణం
అనాలోచితమో, అవివేకమో, అమాయకత్వామో, అహంకరమో
ఆథ్మన్యున్నథ అభత్రతా భావాల డిఫెన్స్ మెకనిజమో
నాకానవసరం

నికోటిన్ నిషానీ తలకెక్కించి
నిస్తేజత స్థానంలో నిర్లక్షాన్ని నింపి
నరాలని స్టిములేట్ చేసి నాడులని వైబ్రట్ చేసి
గతం గాయాలకు సెల్ఫ్ పిటీ బామ్ ని అద్ది ఒదర్చెది వ్యసనమైనా
దానికి బానిస నవ్వడానికి
నాకు సమ్మతమే

పొగ.............
నల్లటి దట్టమైన పొగ
సుడులు తిరుగుతూ పైకి ఎగురు తుంది ...ఆ చ్చం నా ప్రియురాలి కురుల ముంగురులల

పెదవుల మధ్య మెత్తటి ఫిల్టర్ దూధి
తన లేత నుగారు బుగ్గల్‌ల (స్టుపిడ్ సిమిల్యారిటీ అనుకుంట)

అటు చివర వెలిగే నిప్పు కణిక
తన ఆధరాలలా ఎర్రగా మెరుస్తుంటే
అందుకోవాలనే ఆతృతతో బలంగా పీలుస్తున్నాను

వేడి పొగ గుండెల్లో చేరుతుంటే వెచ్ఛటి తన కౌగిలి అనుభవానికి వస్తుంది
ఆఖరి ధమ్ము వరకు అదే అనుభూతి
తానిచ్చిన తొలి ముద్దు తాలూకు తిమ్మి రీ
వాళ్ళంతా పాకు తున్న్నట్టు
మత్తుగా గమ్మతుగా

హటాత్తుగ కళ్ళ ముందు వెరిసిన వాస్తవికత

పొగ.........
నల్లటి దట్టమైన పొగ

కాన్సర్ కత్తిని కస్సున గుండెల్లో గుచ్చింది
ఆచ్చం వెన్ను పోటు పొడిచిన నా ప్రియరాలిలా..

చెప్పాలని ఉన్నా ...

చెప్పాలని ఉన్నా ...
ఓ చెలీ ! తెలుపవే... ఎందుకే నీకీ మౌనం
నీ మనసులో ఎమున్నదో అని నాకు చిన్న సందేహం
ఆ నింగిలో ఈ నేలలో చిరుగాలిలో సెలయేరులో
ఊహలో... ప్రతి ఊసులో ... నీ రూపమే నా గుండెలో

చెప్పాలని ఉన్నా ... నీకు చెప్పలేకున్న ...
చెప్పాలని ఉన్నా ... నీతో చెప్పుకోలేకపోతున్నా ..

"ఎందుకో ఒంటరిగా అన్పిస్తోంది, ఏదో తెలీని లోటుగా ఉంది

నిర్లిప్తత కమ్ముకుంటోందా..

గంభీర స్వరాలు అకస్మాత్తుగా మూగబోవడం..

చలాకీగా చేసే పనులన్నింటిపై నిర్లిప్తత ఆవరించి స్థబ్ధంగా నిలిచిపోవడం..

కళ్లెదుట ఏం జరిగినా ప్రేక్షకుల్లా ఉండడమే సౌఖ్యంగా అన్పించేయడం..

ఇలాంటి మానసిక స్థితికి అప్పుడప్పుడు లోనవ్వని మనిషి ఉండరు. అందుకే చాలామంది కళ్లు శూన్యంలో, మనసు నిస్తేజంలో ఉండడం మన గమనింపుకు వస్తూనే ఉంటుంది.

ఉవ్వెత్తున ఎగిసే ప్రతీ అలా ఓ చోట విరిగిపడాల్సిందే! ఆ పడిన చోటి నుండి తిరిగి బలమూ, వేగమూ పుంజుకోవాలంటే కాస్తంత స్థబ్ధత ఆవరించాల్సిందే.

చాలామందికి తెలియని వాస్తవం.. మన ఆలోచనలు ఇదే క్రమంలో ఎగిసిపడతాయీ, కల్లోలం అవుతాయీ, నిర్లిప్తంగా ఆగిపోతాయీ, తిరిగి మరోమారు ఎగిసిపడతాయి.

"ఎందుకో ఒంటరిగా అన్పిస్తోంది, ఏదో తెలీని లోటుగా ఉంది, కాసేపు నన్నిలా వదిలేయండి" అని చాలామంది నుండి వింటుంటాం. ఎగిసిపడడం, విరిగిపడడం, మళ్లీ బలం పుంజుకోవడం అనే cycle అనేదే లేకుండా ఏ మనిషి ఆలోచనలూ ఉండవు. అంటే ఓ క్షణ కాలమైనా, మనం ఎంత బిజీలో ఉన్నా, ఎంత ఏక్టివ్ గా పనిచేసుకుంటూ వెళుతున్నా.. మనం గమనించినా గమనించకపోయినా మన మనసు స్ధబ్ధంగా మారకుండా ఆపలేం.

అన్నింటిలోనూ తానే కలివిడిగా ఉండాలనుకునే మనిషి.. ఆ స్ధబ్ధతలో మాత్రం.. ఏ విషయంలోనూ కొద్దిపాటి ఆసక్తినైనా కలిగి ఉండకపోవడం కూడా ఈ మానసిక cycle ఫలితమే. అందుకే మనకు కావలసిన వారు ఉన్న ఫళంగా ఒంటరిగా ఫీలవుతున్నారని అన్పించినప్పుడు, ఆ ఒంటరితనానికి సరైన కారణాలూ కూడా ఏమీ లేవని అర్థమైనప్పుడు వారికి కాసేపు అలా ఒంటరిగా వదిలేయడమే మంచిది..

Monday, April 9, 2012

కానీ,నేడు మరణం నన్ను వెంటాడుతోంది..

నిన్నటి కన్నా నేడు
నేటి కన్నా రేపు
బావుంటుందనే ఆశతో
రోజు జన్మిస్తూనే ఉంటా!
నిన్ను చేరాలనే ఆత్రంలో.
నీ దగ్గర సేదతీరాలనే పిచ్చి కోరికతో.
ఇలా నీకోసం అకారణంగా
కొన్ని వేల జన్మలు వృథాగా !!
నన్ను నేనుగా నీకోసం.
కానీ,ఏనాడు నీ స్పర్శ సోకిందో..
ఏనాడు నీ ఆలోచనను నన్ను దరి చేరాయో..
ఎప్పుడు మనంగా అనుకున్నామో
ఆనాడే నా పుట్టుక ఆగింది.
కేవలం నీ ___ కోసమే
జీవించడం మొదలెట్టా....!!!
నీ జన్మ నా కొరకై ఉండి ఉంటె ...
నా జన్మకు మోక్షం ఉండేదేమో..
అన్నీ బ్రమలని తేలాయి..మరి ఇప్పుడు
కానీ,నేడు మరణం నన్ను వెంటాడుతోంది..
మరో జన్మకు సమయం ఆసన్నమైందని.
ప్రతి కలయిక
విడుకోలుకు నాంది అంటూ... విడలేను.
మరో జన్మలో కలుస్తామని..నమ్మలేను.
మరి ఏం చేయను
నీ చెంత ఉండాలనే
నా చింత తీరాలంటే ?
నన్ను నేనుగా ఈ జీవితాని చాలిస్తే కదా
మరుజన్మలో నీవడిలో చేసి సేద తీరగలిగేది ప్రియా
అందుకే తప్పైనా తప్పని పరిస్థితుల్లో
రక్త బంధాలు తెంచుకోవడం తో
నీతోడు కోసంఏమి లేని వాడనై
ఉన్నట్టుండి..వానలో నుండి
జారిపడే నత్తగుల్లల్లా..
ఏ మూలాలు లేకుండా..
జన్మించి ఉంటె ఎంత బాగుండేది !!!!
అన్నీ పిచ్చి బ్రమలు పిచ్చి ఆశలని తేలింది లే..
నీవు నాసొంతం అనుకునే ఇలా ప్రతిక్షనం నీ ఊహళ్ళో బ్రతుకు చాలిస్తున్నా

Sunday, April 8, 2012

ఇప్పటికీ ప్రతిరోజూ ఇదే అనుభవ౦..పాత గాయాలను ఓదార్చుకు౦టూ వెళ్ళి.

ప్రతిరోజూ ఇదే అనుభవ౦..గతం తాలూకా నీ జ్ఞాపకాలతో పొద్దువాలేలోపు గాయపడట౦
రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడ౦..నిద్రలేని రాత్రుల్లు గడపడం అలవాటైంది..
నా చితిమంతలు కాలేవరకు నిన్ను మరలేనని తేలింది..

ఇది ప్రతిరోజు జరిగే సన్నివేశ పునరావృత పర౦పరలో..
గొ౦తెత్తి ప్రశ్ని౦చే స౦దర్భము౦డదు..మూగగా రోదించడం తప్ప
మనం ఆనందంగా వున్నరోజులు తిరిగిరావని తెల్సు కాని..భాద నాకు తప్పదు..
నన్ను మర్చిపోవడం నీకు చేతనవుతుందేమో గాని అది నావళ్ళకాదని నీకు తెల్సు
ఎదురుచూపుల నమ్మక౦పై..ద్రోహాన్ని సూదులుగా గుచ్చుతాయి.
విరిగిన భుజాలమీ౦చి నడిచే విషాద౦..ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకిపోయింది..
ఎవ్వరు ఇలా నా విషయంలో..ఏ ఉదయాలు గాయపడకు౦డా అడ్డుకోలేవు..
ఏ రాత్రీ గాయానికి పూతమ౦దు కాలేదు..ఆగాయం ఇంకా పెద్దది అవుతోంది

ఇప్పటికీ ప్రతిరోజూ ఇదే అనుభవ౦..పాత గాయాలను ఓదార్చుకు౦టూ వెళ్ళి..
మళ్ళీ పొద్దువాలేలోపు గాయపడట౦..రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడ౦..

నువ్వు కనపడితే నా కళ్ళు వర్షిస్తాయి

నువ్వు నవ్వితే నాకు ఆనందం
కానీ ఆ నవ్వు వేరొకరి సమక్షంలో ఐతే,
నేను బాధ పడతాను.
ఆ నవ్వుని నేను కోల్పోయానే అని,

నువ్వు నడుస్తుంటే చూస్తూనే ఉంటాను.
కానీ, తర్వాత ఏడుస్తాను
ఆ నడక నీ నుండి నన్ను దూరం చేసిందని.

నువ్వు నా ఎదురుగా మాట్లాడుతుంటే
నాకు ఏమీ అర్ధం కాదు. ఎందుకంటే,
నీ అధరాల కదలికను గమనిస్తూ,
నా చెవులు వినటం మానేస్తాయి. .

నువ్వు గమనించావో లేదో ,
కవులందరూ ప్రకృతిలోని అందాన్ని వర్ణిస్తారు.
కానీ నేను నీలోనే ప్రకృతిని చూస్తాను.
ప్రకృతిలో జరిగే అలజడిని నాలో చూస్తాను.

నువ్వు కనపడితే నా కళ్ళు వర్షిస్తాయి
కనపడకపోతే మళ్ళీ వర్షిస్తాయి
ఒకసారి ఆనందంతో అయితే,
మరోసారి దుఃఖంతో..............

సారి మిత్రమా నన్ను క్షమించవా.... అని అడిగే హక్కు కూడా లేదు

సారి మిత్రమా నన్ను క్షమించవా.... అని అడిగే హక్కు కూడా లేదు..
ఎందుకిలా అందర్ని భాదపెడుతున్నానో అర్దం కావడం లేదు..?
అందర్నీ నేనే భాదపెడుతున్నా ..నాదే తప్పు నన్ను క్షమించవా
కొందరు నన్ను క్షమించే అర్షత కూడా నాకు లేదేమో..?
ఇలా నాకిష్టమైన వాళ్ళను ఎందుకు నేనిలా భాద పెడుతున్నా..?
నాకు ఈ రోజు చాలా భాదగా ఉంది....ఎమో ఎందుకో తెలీదు...తప్పు చేశానేమో
భాధ బరించలేనంతాగా ఉంది..ఎవరికి చెప్పుకోవాలి..నేను ఓడిపోయాను..
కారణం తెలీదు.. కాలం ఇలా తిరగబడింది.. నేనిలా భాద పడుతున్నా..?
ఎందుకిలా అన్నీ నాకే జరుగుతాయి...తప్పు చేస్తున్నది నేను కాబట్టి..?
చాలా సార్లు చాలా రకాలుగా ఓడిపోయాని ఇప్పుడిలా ఓడిపోతాని తెలీదు..?
నాకు చావు ఎందుకు తొందరగా రాదు నాకిష్టమైనవాళ్ళని భాదపెట్టి నేనేం సాదించాను..?
విజయం ఎలా ఉంటుందో కాని ఇష్టమైనవాళ్ళ దగ్గర ఓటమి చాలా భాద కరం..?
ఎప్పుడూ నేనే ఎందుకు ఓడీపోతాను అందరూ గెలుస్తారు.. ఎందుకంటే నేను మంచి వాన్ని కాదుగాబట్టి..
నాలాంటి వేష్టుగాళ్ళు ఈ రోజు ఉంటారు రేపు పోతారు ..అందరూ హేపీగా ఉండండి మిత్రులారా.?
నాకిష్టమైన వాళ్ళు ఏప్పుడూ నవ్వూతూ ఉండాలి ...అదే నేను ఎప్పుడూ కోరుకొనేది

నీ మౌనం నన్ను వేదిస్తోంది...అయినా నీకేం పట్టదులే..?

నీ మౌనం నన్ను వేదిస్తోంది...అయినా నీకేం పట్టదులే..?

నీ మౌనం నన్ను వేదిస్తోంది...అయినా నీకేం పట్టదులే..?

మరుజన్మ విల్లు నీ పేరున రాసి..మరుక్షణమే మృత్యువుని ముద్దాడుతా

గుండె.. యుగాలపాటుగా శ్వాసిస్తూనే ఉంది..
మనసు.. నిశీధి లోకంలో నిను వెదుకుతూ ఉంది..
పయనం.. ప్రతి మలుపంచున నీ ఉనికిని ఊహిస్తూ,
తరగని దూరాన్ని తనలో కలుపుకుంటుంది.

పాదం వదిలిన ప్రతి గురుతులో
రెప్పలు ఓడిన ఆనవాలు..

తీరాలను కలపలేని ప్రతి జామూ
వారధిగా వదిలే జవాబుల్లేని ప్రశ్నలు..

ఇన్నేళ్ల ఊపిరికి దొరకని నువ్వు
వాస్తవపు తొడుగులో..చేదుగా..

మిత్రమా..!!
చావుపుట్టుకల చక్రం నిజమేనంటావా..??
నీ నమ్మకం.. నాగమ్యం..
అందుకే, మరుజన్మ విల్లు నీ పేరున రాసి
మరుక్షణమే మృత్యువుని ముద్దాడుతా..

ఎందుకంటే, నాకు తెలుసు...
నా ఈ ఒంటరి ఎడారి జీవితానికి నువ్వొక మరీచికవని.

--.మనసు పలికే.

నా మనసొక మహాసముద్రం..(మనసు పలికే )

నా మనసొక మహాసముద్రం..
కెరటాల్లా.. ఆలోచనలు..
ఎంత వద్దన్నా నీ వైపుకే.

అలల ఆశ, నువ్వు మహాకాశం కావాలని.
అందుకే, ఆవేశంగా పైకెగిసి..
తీరంలోనే నిన్ను చూసిన క్షణం,
ఇష్టంగా కిందికి దూకుతాయి..
ఆర్తిగా నిన్ను తడుముతాయి.

ఎందుకు నేస్తం??
తీరంతోనే నీ సాహచర్యం?
"నీకు చేరువుగా ఉండొచ్చని"
సమాధానం నాదా? నీదా?

ఇన్నాళ్లూ ఎగసి ఎగసి అలసింది
ఆకాశాన్ని అందుకోలేక కాదు,
అక్కడ నువ్వు లేవని...

ఒక్క క్షణం నింగిని తాకి చూడు.
అర్ణవాకాశాలు కలవడం చూస్తావు..

-- మనసు పలికే..

అవును. ఏం చేస్తాను నీ దగ్గరకొచ్చి...నీ కళ్ళల్లో నన్ను వెతుక్కోవడం త్తప్ప

ఆ నిమిషం....అవును. ఏం చేస్తాను నీ దగ్గరకొచ్చి ?
మౌనంగా నిన్ను చూస్తూ ఉండటం తప్ప
నీ కళ్ళల్లో నన్ను వెతుక్కోవడం త్తప్ప
నా ఆత్మను నీ ముందు ఆవిష్కరించడం తప్ప
ఇంకేం చేస్తాను ??
రెప్పలు లేని జీవి ఏది అన్నావుగా...
ఆ జీవి నేనే ఐతే బావుండు అనుకున్నా..
రెప్ప పాటు కాలమైన నిను వదులుకో లేక
నా స్వప్నం నీవు...
చిన్న అలికిడైన చేదిరిపోతావు.
ఎన్నో అలజడుల మధ్య...
నిన్నెలా... కనమంటావు.
అందుకే నీ దగ్గరికి వస్తాను అంటాను...
నీ స్పర్శ సోకనిదే జీవించలేని ఈ... దేహాన్ని
నలుగురి ముందు నీకెలా.. అప్పగించామంటావు.
అందుకే నిన్ను ఒంటరిగా కలవాలంటాను.
నీతో గడిపే ప్రతిక్షణం
నాకెంత విలువైనదో నీకేం తెలుసు.
అది తెలిసిన నాడే తెలుస్తుంది నీకు
నేను ఏం చేస్తానో.... !!

Saturday, April 7, 2012

నా మనసుకి గాయం చేసి కన్నీరుగా మారి జారిపోయావు

నేను నీకు ఎంత చేరువలో ఉంటానంటే,
జారే కన్నీటిబొట్టును తుడిచేటంత చేరువలో,
నా గుండె చప్పుడు నీకు వినబడేంత చేరువలో,
నా ప్రతిబింబం నీ కంటిపాపలో కనబడేటంత చేరువలో,
నా ప్రతిమాటా నీ మనసుకి చేరేంత చేరువలో,
నీ నీడతో కలిసి నా నీడ నడిచేటంత చేరువలో,
నీకు తోడుగా నీ చెయ్యి పట్టూకోని నడిచేటంత చేరువలో.
నీశీదిలో కదిలే మేఘనికి తెలుసు నీటి బరువు,
నామదిలో మెదిలే ప్రేమకు తెలుసు కన్నీటి బరువు.
నిన్ను ప్రతిబింబంగా మార్చి నా కనుపాపలో దాచుకున్నాను,
కాని నా మనసుకి గాయం చేసి కన్నీరుగా మారి జారిపోయావు
ప్రేమను పంచుతానంటే నమ్మనంటున్నావు,
ప్రాణం అర్పిస్తానంటే నవ్వుకుంటునావు,
నా ప్రేమ విలువ నీ చిరుకోపమా?
లేక నా ప్రాణం విలువ నీ పరిహాసమా?

గడిచిపొతున్న గడియలన్ని జ్ఞాపకాల మాలలవుతున్నాయి,

గడిచిపొతున్న గడియలన్ని జ్ఞాపకాల మాలలవుతున్నాయి,
నా మనసులొసులొ ఒక్కొకటిగా గుచ్ఛుకుంటున్నాయి,
ఎగసిపడే కెరటంలా ప్రతిరోజు నిన్ను చేరుకుంటున్నాను,
నీరాశతో తిరిగి వెనక్కి వెళ్ళిపొతున్నాను,
నీ అంగీకారం దొరకక,
పంజరంలో ఉన్న పావురంలా ఉంది నా ప్రేమ.
బయటకి రావాలని నీ మనసుని చేరాలని ఎదురుచూస్తుంది,
సరస్వతీ పుత్రికవైన నీకు,
నా చూపుల భాష తెలియటం లేదా?
లేకపొతే ప్రేమలేక నీ మనసు శిలైపొయిందా?

నీకోసం జారే ప్రతి కన్నీటిబొట్టు చూసినప్పుడు కనిపిస్తుంది,నామదిలొని నీ ప్రేమ

నా ప్రేమను నీకు వ్యక్తం చెయ్యాలన్న ఆవేదన,
నీకోసం జారే ప్రతి కన్నీటిబొట్టు చూసినప్పుడు కనిపిస్తుంది,నామదిలొని నీ ప్రేమ,
నీ కోసం కన్నీళ్ళు పెడుతున్నా ఆనందంగా ఉంటుంది,
దూరమైన నీకోసం చూసే ఎదురుచూపులోను ఆనందమే,
నీవు చెంతనున్నా ఇంత ప్రేమ కనిపించదేమో,
నీ ప్రేమ పొందాలని పడే ఆరాటం,
నిన్ను చేరువవ్వాలన్న ఆకంక్షా,
నీతో సమయాన్ని గడపాలన్న ఆలోచనలు,
నీ ప్రేమ దొరకకముందున్న నాప్రేమ అనంతం,
అసలు ప్రేమలో కాదు ఎదురుచూడటంలోనే ఆనందముంది,
ప్రేమ దోరకముందు ప్రేమ కనిపిస్తుంది,
కాని ప్రేమ దొరికిన తర్వాతా ప్రేమ మాయమవుతుంది,భాధ్యత ప్రారంభమవుతుంది.
అందుకే నన్ను ప్రేమించకు ప్రియతమా.

నన్నెందుకు ఇలా....వేధిస్తావు???

ఎవరు నీవు.....?
నాకు ఏమవుతావు.....??
నన్నెందుకు ఇలా....వేధిస్తావు???
నీవు కలవైతే
నేను నిదురిస్తాను...
మధురమైన జ్ఞాపకమైతే
నా మస్తిష్కంలో ఏదో పొరలో.....
నిన్ను పదిలంగా.....నిక్షిప్తపరుస్తాను.
గాయం రేపె బాధవైతే
మౌనంగా.....భరిస్తాను.
కానీ....,
నీవు మాటలు రాని మౌనంలా...
వెలుగు లేని చీకటిలా...
గులాబీ చాటు ముల్లులా......
అనుక్షణం నన్ను వెంటాడే నీడలా...
ఎందుకు నన్ను ఇలా.......వేధిస్తావు....???

ఆకోయిల గొంతు ఎవరు నొక్కారబ్బా...కాలమా ..కలికాలమా..?

గల..గల మాట్లాడే కోయిల ఎందుకు మూగబోయిందో
ఆకోయిల గొంతు ఎవరు నొక్కారబ్బా...కాలమా ..కలికాలమా..?
ఎంజరిగింది మిత్రమా నేరమా .. అపచారమా..గ్రహచారమా..?
మనసులోని భావాలు ..బయటకు రావడం లేదా..కారణం..?
నిజం నిర్బయం అబయం..అన్నీ ఏమయ్యాయో..ఎమైంది..?
ఏమన్నా ఏమనుకున్నా సర్దుకుపోవాలన్న నీవే...దూరంగా ఎందుకో..?
కోయిల గొంతు కోటిరాగాలు ఇక వినలేనేమో అనిపిస్తుది..ఎందుకంటే..
ఏరుతువులో రాగాలొస్తాయి..ఎదురుచూపులో కాలం కరిగిపోతోంది
మనసా మౌనం వీడవా..ఎన్నాళ్ళీ మౌనం..మరుజన్మదాకా ఎంటీ మిత్రమా
కాలాన్ని కరిగిస్తూ..మౌనం ఎన్నాళ్ళో తెలీదు..కష్టంగా ఉంది చెప్పేందుకు
చేసేదేం లేదు మౌనం వీడే రోజుకోసం చకొర పక్షిలా ఎదురు చూడటం లేదంటే
ఇలాగే నీ మౌనంవీడే రోజు కోసం ఎదురు చూడటం తప్ప..
కాలం ప్రతిసారి కసి తీర్చుకుంటుంది అంటే ఇదేనేమో కదా మిత్రమా

Friday, April 6, 2012

దేవుడు నామీద ఎందుకో పగపట్టాడు...? దేవుడే వెంటాడి వెదిస్తే..ఎవరికి చెప్పుకోవాలి..?

దేవుడు నామీద ఎందుకో పగపట్టాడు...?దేవుడే వెంటాడి వెదిస్తే..ఎవరికి చెప్పుకోవాలి..?..దయ్యాలు పగపడతాయి కాని దేవుడు కూడా పగపడతాడని నా విషయంలో తెలుస్తోంది..కారనాలు వెతుక్కుంటే అన్నీ అవే...ఎందుకిలా జరుగుతుందో నాకే ఎందుకిలా జరుగుతుంతో తెలీదు..దేవుడా కొంత మందిని మనసుకు నచ్చిన వారిని పరిచయం చేసి.. ఆచ్చర్య పరుస్తావు..నేనేంటి వీళ్ళు నాకు మనస్సుకు దగ్గర అవడం ఎంటీ అనుకుంటూ ఉండాగా నే ఆ మనిషిని మనసుకు ఇంకా దగ్గర చేస్తావు..జరిగేది నిజమా అబద్దమా అనిమనసులో అచ్చర్యపోవడం కాదు ఒకింత గర్వంగా గొప్పగా ఫీల్ అవుతా ఆపీలింగ్ ఆలా మనసులో ఉండగానే .. జరిగేది నిజమో అబద్దమో అనుకుండాగా... అన్నీ నిజాలే అని మైమరపిస్తావు..దేవుడా నేను నీకేం ద్రోహం చేశానో తెలీదు అంతా నిజం అని నమ్మిస్తావు..నేనూ నమ్మేస్తాను నాది అసలే పిచ్చి మనస్సుకదా.... అలాంటీ క్షనంలో నే భయపడుతుంటాను ఎందుకో తెల్సాదేవుడా నామీద నాకు నమ్మకం లేదు నా అదృష్టం అలాంటిది..ఎన్నో సంఘటనలు చూశాను.. అలా నాజీవితంలో కొద్ది రోజులు ... ఒక్కోసారి పట్టలేనంత సంతో షాన్నిస్తావు ..చాలు నా జీవితానికి అని నాకు నేను అనుకునే లోపు...గుండెళ్ళో బాంబులు పేలుస్తావు..ఎందుకు ఇలా నాకే జరుగుతుందో తెలీదు.. నన్ను నేను తగ్గించుక్కున్నా.నా మనసుకు నచ్చిన వాళ్ళూ బాగుండాలని నేను జీవితంలో తలొంచి కాంప్రమైజ్ అయినా నీవు వదలవుగా పట్టలేని సంతోషాన్ని కొద్ది రోజులిచ్చి... అక్కడనుంచి నీ ప్రతాపం చూపిస్తావు.. నా నిద్రను కరువు చేసి.. ప్రతి రాత్రి కన్నీటి మయం చేస్తావు.. నిద్రపట్టకుండా ఏడిపిస్తావు..అలా ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా కరువు అవుతాయి నీరసం వస్తుంది..జీవితం మీద విరక్తి పుడుతుంది....అయినా దేవుడా నీకు నామీద కసితీరదు... పగలు కొందరు శాడిష్టులతో వెంట పడి వెంట పడి వేదించేలా చేస్తావు..వాడు పగలు పరుగులు పెట్టిస్తాడు.. అదీ నాకిష్టమైన వ్యక్తులతో వినకూడని మాటలు అనిపిస్తావు..చూడలేని విషయాలు తట్టుకోలేని సంఘటనలు నా కళ్ళేదురురా జరిగేట్టు చేస్తావు అలా మనసుకు నచ్చిన వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడీస్తావు..మళ్ళీ మంచి మనుషులను పరిచయం చేస్తావు..అయినా దేవుడివి నీవు నామీద పగపట్టావని అన్నీ నిజం అనుకుంటా.. వారు మాటలు వినాలని కాస్తా ఊరట పోందాలని వారితో సంతోషంగా స్నేహా ఉండి ... అప్పుడూ ఒక్కక్షనం దేవుడా నీమీద అనుమానం నీవేంటి నన్ను ఇలా సంతోష పెడుతున్నావు అని... అయినా పిచ్చోడిని కదా అందర్ని నమినట్టే నిన్నూ నమ్ముతా... అంతే ఆ సంతోషం రెండురోజులే నీప్రతాపం చూపిస్తావు.. నేను ఎక్కడ ఏవిదంగా భాదపడతానో నీకు మాత్రమే తెల్సు గుండెలమీద కొడతావు.. ఏముంది ఎప్పటిలా .. భాదపడటం తప్ప నన్ను నేను మర్చిపోయి ఎన్నోరోజులైంది.. అటు చావనీయవు బ్రతక నీయవు.. దేవుడా ఎందుకు నామీద ఇంత కక్ష .. నేనేం ద్రోహంచేశాను నాన్నని దూరం చేశావు .. అమ్మని దూరం చేశావు.. డబ్బే లోకంగా బ్రతికే రిలేషన్స్ ఇచ్చావు... మరి నాకంటూ మనిషిగా ఎమిచ్చావు..ప్రతిక్షనం ఎందుకిలా వేదిస్తావు.. మనసుకు దగ్గరచేస్తావు వెంటనే దూరం అయ్యేలా చేసి... ప్రతిక్షనం వారి జ్ఞాపకాలతో గుండెలు పగిలేలా ఏడ్చేలా చేస్తావు.. అసలు నన్నెందుకు పగపట్టావో తెలీదు.. అయినా నేనే దొరికానా దేవుడా.. నా మనసుకు నచ్చిన వాళ్ళను దూరం చేసి ఎందికిలా వేదిస్తావు దేవుడా నీకు నేను నచ్చకపోతే .. నాప్రాణం తీసుకపోవచ్చుకదా..?అది నీకు పెద్దపనికూడా కాదు..నన్ను ఇంకా భాదపెట్టడానికే నన్నింకా బ్రతికేలా చేస్తున్నావని తెల్సు నీ ప్లాన్ నాకు అర్దం అయింది దేవుడా.. నాప్రాణం నీవు తీయవు.. నా అంతట నేనే తీసుకునేలా చేస్తున్నావు కదూ అదే నికిష్టం కదూ ఒక్క నావిషయంలో నా మనస్సుతో గుండేళ్ళో ప్రతిక్షనం పొడుస్తూ ఎందుకు నన్నిలా వేదిస్తున్నావు దేవుడా..నీ మనసులో అసలు రహస్యి తెల్సింది.. అదిశగా నేను అడుగులు వేస్తున్నాలే దేవుడా నన్ను ఏడీపిస్తే ఏడీపించావు... నన్ను ఏమైనా చేయి కాని నా మనసుకు నచ్చిన వాళ్ళు హేపేగా ఉండేలా చేయి నేను ఏమైపోయినా పర్లేదు.. ప్లీజ్..నాలా వాళ్ళ మనస్సుతో ఆడుకోకు ప్లీజ్ దేవుడా ఇదే నా ఆఖరు కోరుక.....( ఇంకా చెప్పటానికి చాలా ఉంది మనస్సు భాదగా ఉంది ఇప్పుడు చెప్పలేను )

ఈ క్షణం నన్ను నేను కోల్పోతున్నా

నా చుట్టూ ఎదో జరుగుతుంది

కంటికి కనపడని యేవో శక్తులు నన్ను చుట్టుముట్టాయి,
అవి నాకు ఊపిరాడకుండా చేస్తున్నాయి

నన్ను ఒక చోట నిలబడకుండా చేస్తున్నాయి
వేయి టన్నుల బరువు నా బుజాలపై,శిరస్సు మోపి నన్ను పాతాళానికి త్రొక్క ప్రయత్నిస్తున్నాయి,
అవి నన్ను ఎత్తైన ప్రదేశానికితీసుకుపొయి క్రిందికి వదిలే ఆలొచనలు చేస్తున్నాయి

ఈ క్షణం నన్ను నేను కోల్పోతున్నా
అసలు నేను ఎవరో కూడా మర్చిపోతున్నా
నా కన్నులు మూతపడి పోతున్నాయి క్రమేపి

చిరు చమటలు అల్లుకుని చేతులు చల్లబడిపోతున్నాయి
నా వారందరికీ దూరమైపోతున్నా బావన.....

అంతలో చిన్నగా సూర్యకిరణాలు నా నుదుటిపై చేరి నన్ను నిద్ర లేపాయి..కళ్ళు తెరిచి చూసా

.మరో సంచలనాత్మక..సస్పెన్స్ త్రిల్లర్ మూవీ

త్వరలో...మరో సంచలనాత్మక..సస్పెన్స్ త్రిల్లర్ మూవీ...సాప్ట్ వేర్ ఉద్యోగులందరూ కల్సి నిర్మిస్తున్న సరికొత్తసినిమా...?

ఏ ఆలోచనల ఆవిరి తన కళ్ళలో ముసురుకుంది?

స్తబ్ధుగా తను
ఎప్పుడు కుండపోతా అన్నట్టు ఆకాశం
దట్టమైన ఆ మేఘాలు ఎక్కడి నీటితో అల్లుకున్నాయో?
ఏ ఆలోచనల ఆవిరి ఆమె కళ్ళలో ముసురుకుందో?
ఏ పవనమో వీచి ఏ మేఘాన్నో కరిగించింది..
జన జనా వాన
చెట్లపైనా
గుట్లపైనా
ఏం జరిగిందో మరి ఆ కళ్ళూ కరిగాయి
టపా టపా కన్నీరు
చెక్కిళ్ళపైనా
గుండెలపైనా
జన జనా వాన
టప టపా కన్నీరు

ఒక్కసారిగా ఆగిపోయాయి

మళ్ళీ ఏం జరిగిందో మరి
జన జనా వాన
టప టపా కన్నీరు

మళ్ళీ ఆగిపోయాయి

వాన కురిసింది కన్నీరు కురిసింది
వాన కురిసింది కన్నీరు కురిసింది

ఏ ఆలోచనల ఆవిరి తన కళ్ళలో ముసురుకుంది?

ఈ జడి ఈ రోజు ఆగేనా?

Thursday, April 5, 2012

బ్లాగ్ ఎందుకో అప్ డేట్ చేయాలని పించడంలేదు ..?

నేనున్నా నంటూ పలుకరించే నేస్తంలో కూడా ఇన్ని మార్పులా నేను నమ్మలేకున్నా..

ఆకాశంలో కదిలాడు తున్న నీలి మేఘాలు..ప్రియా
మదిలో కడిలాడుతున్న నీ జ్ఞాపకాలు..
కదిలాడుతున్న మేఘాలు నిజం ..
మన గతం అబద్దమా తేల్సుకోలేక పోతున్నా..
నిజాన్ని ఒప్పుకోలేక ..అబద్దం నిజమవ్వాలన్నస్వార్దం..
మనసును నిలవనీయడంలేదు..ప్రియా
కళ్ళలో నిలచిపోయిన నీచిరునవ్వులు..
కన్నీరొస్తే ఎక్కడ మిస్సవుతావోనని కన్నీటీని ఆపుతున్నా ప్రియా
గుండెల్లో భావాల్ని ఆపగలనేమోగాని కన్నీటి సుడిగుండాలు ఆగనంటున్నాయి
ఎందికిలా అవుతోందా నేనేం తప్పుచేశానో అన్ని ఏన్నోసార్లు ప్రశ్నించుకున్నా..
జరుగుతున్న వాస్తవాలు ఎందుకు అబద్దాలు కాకుడదన్న స్వార్దం మనసును తొలచి వేస్తుంది..
మనుష్యుల్లొ ఎందుకిలా మార్పులు ప్రియా...నేరగాన్ని చేస్తున్న పరిస్థితులు
నేనున్నా నంటూ పలుకరించే నేస్తంలో కూడా ఇన్ని మార్పులా నేను నమ్మలేకున్నా..
ప్రియతమా నేను రాతి శిలను కాని నిన్ను ప్రేమించి మర్చిపోవాడానికి..
నీవు మౌనంగా ఉన్నావని వేదించడానికి నేను రాక్షసుడను కాను
ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది ప్రియా...మళ్ళీ చూస్తానో లేదోమరి..
నీ గురించి నేను కన్న కలలన్నీ కన్నీరై కరుగుతున్నాయి ఎందుకు నేస్తం..
నీకోసం పరితపిస్తున్న ఈ చిన్ని గుండే ఆగిపోయేలోపు నీతో మాట్లాడ గలనా..ప్రియా
ఎమో నామీద నాకు నమ్మకం పోయింది....ఏది నిజమో ఏది అబద్దమో తెలియకున్నది ప్రియా

ముక్కలైన మనసు కథ

కనురెప్ప వాలిపోతోంది.....
పొంగిపోతున్న కన్నిటికి ఆనకట్ట వేసేందుకు .....
గుండె బరువెక్కుతోంది .....
బద్దలవుతున్న బాధను బందించేందుకు ....
చేయీ అలసిపోతోంది .....
చెక్కిలి పై కన్నీటి ఆనవాళ్ళు తుడిచేందుకు. ....
వేదన రాగాన్ని ఆలపిస్తున్న మూగ గానం నాది.........
అది విని కరిగే హృదయపు ఉనికి ఏది ...?
ముక్కలైన మనసుతోనే ... శిదిలమైన ఆస తోనే సంచరిస్తున్నా...
మనిషి లాగే కనిపిస్తూ శిల లాగా బ్రతికేస్తున్న..........

మోసం చేశానా అన్నావు మరి నీవు చేసింది మోసంకాదా..?

మోసం చేశానా అన్నావు మరి నీవు చేసింది మోసంకాదా..?
అసలు నిజం నీకు తెల్సు..కాని నిన్ను నమ్మావు వాడేం చేశాడో నీకు తెల్సు
ఇష్టమైన వ్యక్తి జీవితంతో మరొకరు ఆడుకుని వేదిస్తుంటే ...కాంగా ఉంటారా..?
చనిపోయే పరిస్థితులు వాడు క్రియేట్ చేస్తుంటే కాంగా ఎలా ఉండగలిగావు..?
మనిషిగా నీవిషయంలో ఎంతగా నలిగిపోయానో తెల్సు కాని నీవు..?
అప్పుడు వాడు... ఆ తరువాత నీవే చచ్చిపో అన్నావు ..ఇలా అనిపించుకోవడానికా బ్రతికి ఉంది
నా గురించి తెలియనివాడు ఎందో చేశాడు మరి నాగురించి తెల్సిన నీవే " ఎవడివి నీవు " అన్నావు
నేను ఏ చిన్నవిషయాన్ని తట్టుకోలేనని తెల్సు ..కాని ఎలా అనగలిగావు..?
నీవన్న మాటలు ఇప్పడికీ గుండేళ్ళో బాంబుళ్ళా పేలుతూనే ఉన్నాయి
అప్పుడు వాడు స్వార్దంకోసం...ఆ తరువాత నీవు.. నేనేం తప్పుచేశానో అర్దంకావడం లేదు
నిన్ను నమ్మా ..నీమాటలు నమ్మా..అదేనా నేను చేసినతప్పు..
నీవన్న ప్రతి మాట గుండెళ్ళో పెట్టుకొని ఇష్టపడ్డందుకు నాకు ఇలా జరగాల్సిందే..కదా..?
నీవు నిజం ..నీ మాటలు నిజం అని నమ్మినందుకు నాకిలా జరగాల్సిందే
అన్నీ మర్చి పోయి నీవు హేపీగా ఉన్నావు .. బట్ నేను మాత్రం ఇలా..అనుబవిస్తున్నా..?
వాడు చేయాల్సింది చేసి హేపీగా ..లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు..వాడు పెట్టిన మంటలు ఇంకా రగులుతూనే ఉన్నాయి
వాడు మనిషి పుట్టి ఉంటే ఇలా చేసుండే వాడు కాదు..?
వాడేం కావాలని కోరుకున్నాడో అప్పుడు నాకు చెప్పాడుసాదించాడు హేపీగా ఉన్నాడు..
నాకు వాడిలా డ్రామాలు అడవాళ్ళడా ఎడ్వటం..అక్కడిమాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చెప్పడం నాకు చేతకాదు
నీమీద నమ్మకం జీవితాన్ని చదివావు ..ఏది నిజమో ఏది అబద్దమో తెల్సుకుంటావని..కాని..?
అందరిలా..నీవు నమ్మించావు.. తర్వాత నీస్వార్దం చూసుకున్నావు..?
అప్పుడెప్పుడో అడిగావు ..నేను మోసం చేశానా అని మరి ఇప్పుడు మోసంచేసింది ఎవ్వరు

Wednesday, April 4, 2012

నడిరేయిలో నీ తల..గతం జ్ఞాపకాలు నన్ను ప్రతిక్షనం తరుముతుంటాయి

వేకువఝామున తొలికిరణం నువ్వై తాకినందుకే
ప్రతి ఉదయం కొత్తవెలుగులతో స్వాగతిస్తుంది

అపరాహ్నంలో నీ ఊసు తలపోసినందుకే
నీలాకాశం నీ రూపురేఖలతో నను కవ్విస్తుంది

మలిసంధ్యలో నువ్వు నా మది మీటినందుకే
మనసు కొమ్మపై కొత్త కోయిల ఆలపిస్తుంది

నడిరేయిలో నీ తలపు లీలగా మెదిలినందుకే
గతం జ్ఞాపకాలు నన్ను ప్రతిక్షనం తరుముతుంటాయి

ఇలా నీ ద్యాసలోనే సాగిన ప్రతీ రోజూ
వేయి రంగుల హరివిల్లై మది విరబూస్తుంది..

ఇదంతా గతం ప్రస్తుంతం నీవు దూరం అయి ..
అను భవిస్తున్న నా ఈ భాదను ఎప్పుడు అర్దం చేసుకుంటావో ప్రియా

ఆత్మహత్య ఆలోచన ఉన్నవాళ్ళను రక్షిచుకోవాలంటే ఎంచేయాలి

Friend Plese Dot SUCIDE ... ఉద్యమం తీవ్రరూపం అవుతున్న వేళ రాజకీయ నాయకులు అడే గేంలో ప్రత్యేక తెలంగానా కోసం విద్యార్దులు ఆత్మహత్యలుచేసుకోవడం నన్ను కలచివేసింది ఉస్మానియా యూనివర్సిటి వద్ద యాదయ్య అనే విద్యార్ది అత్మహత్య చేసుకుంటున్నప్పుడు దానికి నేను ప్రత్యెక్ష సాక్షిని..ఉద్యమాలు చేయాల అది మన హక్కు కాని ఆత్మహత్యలువద్దు...నా మిత్రు ల సహకారంతో ఆత్మహత్యలు వద్దన్న ఈపాటద్వారా జీ 24 గటలు లో వచ్చిన్ ఈ ష్టోరీ చూడండి... నేను అనెక మంది ప్రముకులను కల్సి ఇలా ఆత్మ హత్యలు చేసుకోకుండా ఏంచేయాలి అలాంటి ఆలోచన ఉన్నవాళ్ళను ఎలా గుర్తించాలొ మీరు చూడండి వాళ్ళను ఆలోచనుంచి ఎలా బైట పడేలా చేయడ మేకాక వారివల్ల తెలంగానాకు ఎంత ఉపయోగ ముందొ చెప్పండి ఎదైనా బ్రతికి సాదించుకుందాం చనిపోయి సాదించేదేమీ లేదని చెప్పండి..ఒక్కరి లో అయినా మార్పువచ్చినా సంతోషం నేను కోరుకునేది అదే..

నా ప్రతి తలపులో నీవుంటావు..ఈ నిజాన్ని మాత్రం నమ్మవు

చెక్కిలిమీద కన్నీటి చారికై నిలిచిన జ్ఞాపక౦

ఈ రాత్రి నిశ్శబ్ద౦గా ఉ౦డదు
చెవిని తొలిచే కీచురాళ్ళ ధ్వని
చెప్పుకోలేని భాద ఎందుకో ఇలా
ఆలోచనలకు రెక్కలు తొడగకా మానదు
ఇప్పటికెన్ని ఆలోచనలు
గాజుబొమ్మాల్లా పగిలిపోయాయో..?
టార్చిలైటును ఆర్పివెలిగిస్తూ
రాత్రిని పరిశోధిస్తున్న మిణుగురుకు తెలుసు
పదునెక్కిన ఆలోచనల ముల్లుగర్రలు
మానుతున్న గాయాలను మేల్కొలుపుతు౦టాయి
గాయాలు జ్ఞాపకమై సలిపినప్పుడల్లా
హృదయ౦లోకత్తిదిగిన బాధ.......

అర్ధరాత్రి దాటాక
కునుకుపట్టని కళ్ళు నేరేడు పళ్ళవుతాయి
నరాలు కాలుతున్న కరె౦టు తీగలవుతాయి
గుడ్లగూబ గొ౦తువిని
చ౦ద్రుడు మబ్బుదుప్పటి కప్పుకు౦టాడు
నేనుమాత్ర౦...
జ్ఞాపకాల లోయల్ని తవ్వుకు౦టూ
ఏ మూడో ఝామునో
స్వప్న౦తో నిద్రను వెలిగి౦చుకు౦టాను.

తెల్లారిచూస్తే...
జ్ఞాపకాలు జాడను కోల్పోయినట్టే అనిపిస్తు౦ది
అద్దానికి ముఖాన్ని చూపగానే
చెక్కిలిమీద చారికై నిలిచిన జ్ఞాపక౦
మళ్ళీ ఆలోచనల్నిరేపి
నన్నొక కన్నీటి శిబిరాన్ని చేస్తు౦ది.

Tuesday, April 3, 2012

ఎందుకు నన్ను ఇలా.......వేధిస్తావు....????

ఎవరు నీవు.....?
నాకు ఏమవుతావు.....??
నన్నెందుకు ఇలా....వేధిస్తావు???
నీవు కలవైతే
నేను నిదురిస్తాను...
మధురమైన జ్ఞాపకమైతే
నా మస్తిష్కంలో ఏదో పొరలో.....
నిన్ను పదిలంగా.....నిక్షిప్తపరుస్తాను.
గాయం రేపె బాధవైతే
మౌనంగా.....భరిస్తాను.
కానీ....,
నీవు మాటలు రాని మౌనంలా...
వెలుగు లేని చీకటిలా...
గులాబీ చాటు ముల్లులా......
అనుక్షణం నన్ను వెంటాడే నీడలా...
ఎందుకు నన్ను ఇలా.......వేధిస్తావు....????

జారుతున్న కన్నీటిలో..రేపటి స్వప్నాలు ఉన్నాయని

నిదుర రాని రేయిలో
పురుడు పోసుకున్న వేదనలు
ఎవరు చూసారు గనుక....
జారుతున్న కన్నీటిలో
రేపటి స్వప్నాలు ఉన్నాయని
ఎవరికీ తెలుసు గనుక...
చిరునవ్వుల వెనుక
రాసుకుంటున్న మంటల వేడి
ఎవరిని తాకింది గనుక....
నేనేంటో...........తెలియడానికి

ప్రియా..! ’ఎడబాటు’ నిర్వచన౦....సరిగా తెలియదు...

ప్రియా..!
’స్ప౦దన’ నిర్వచన౦
...తెలియదు...
కానీ.., నిన్ను చూసిన తొలిక్షణమే
స్ప౦ది౦చాను
’ప్రేమ’ నిర్వచన౦
తెలియదు...
ఆ మరుక్షణమే
ప్రేమి౦చాను
’ప్రాణ౦’ నిర్వచన౦
తెలియదు...
అయినా నువ్వే నా ప్రాణ౦
అనుకొన్నాను
’ఎడబాటు’ నిర్వచన౦
సరిగా తెలియదు...
కానీ.., నన్ను విడిచి వెళ్ళావు
వెళ్ళేము౦దు
’జీవచ్ఛవ౦’ అనే పదానికి
నిర్వచన౦ చెప్పడ౦ మరచావు!

పొమ్మని అనకు నన్ను ఈసారికి క్షమించుమా

కమ్మని కలవై నను చేరిన నేస్తమా
పొమ్మని అనకు నన్ను ఈసారికి క్షమించుమా
నన్ను దాచుకున్న నీ మనసుని నొప్పించాను
నిన్ను దాచుకున్న నా మనసుని ద్వేశించాను
నీ ప్రతి కల నా కోసమని
నీ ప్రతి అడుగు నాతొ అని గుర్తించలేని గుడ్డివాడినయ్యాను
నీ కున్న ఆశ నేనేనని
నా ప్రతి శ్వాస నువ్వేనని తెలిసి తెన్చుకోవాలనుకున్నాను
కాని నేడు తెలిసింది నువ్వు లేని లోటు ,,,
కమ్మని కలవై నిదురించిన నీవు చెంత లేక
నిదురన్నదే కల అయినది ,
ప్రతి కలలో నను లాలించే నీవు
నేడు నా చెంత లేవు అనేది ఒక కల ఐతే మంచిది ,
అడుగున అడుగై నను నడిపించిన నీవు లేక
ప్రతి అడుగు తడబడుతుంది
ఇక నీవు లేక నేను జీవించలేను
ఈసారికి క్షమించుమా

Monday, April 2, 2012

కనురెప్ప వాలిపోతోంది..... పొంగిపోతున్న కన్నిటికి ఆనకట్ట వేసేందుకు

కనురెప్ప వాలిపోతోంది.....
పొంగిపోతున్న కన్నిటికి ఆనకట్ట వేసేందుకు .....
గుండె బరువెక్కుతోంది .....
బద్దలవుతున్న బాధను బందించేందుకు ....
గుండె అలసిపోతోంది .....
చెక్కిలి పై కన్నీటి ఆనవాళ్ళు తుడిచేందుకు. ....
వేదన రాగాన్ని ఆలపిస్తున్న మూగ గానం నాది.........
అది విని కరిగే హృదయపు ఉనికి ఏది ...?
ముక్కలైన మనసుతోనే ... శిదిలమైన ఆస తోనే సంచరిస్తున్నా...
మనిషి లాగే కనిపిస్తూ శిల లాగా బ్రతికేస్తున్న....
లేదు ఇంక ఎక్కువకాలం బ్రతికే అవకాశంలేదనిపిస్తోంది..
శిధిల మైన శిలలా మారిపోవాలని ఉంది..జీవం ఆవిరౌతోంది కదా..
ప్రియా నేను పోయినా నన్ను గుర్తుంచుకుంటావుకదూ..?
ఆవిషయం తెల్సిన క్షనాన ఓ కన్నీటి బొట్టు రాలుస్తావా..?
ఆ కన్నీటి తో మళ్ళీ జీవంపోదాలని ఆలోచన కాదు..అది నాకు మృతం..
ఆ కన్నీటిబోట్టే ..నా తప్పులన్నిటిని తప్పిస్తుందన్న నమ్మకం..
వెళ్ళి పోతున్నాను ప్రియా..నీకు దూరంగా చూడలన్నా చూడలేనంత దూరంగా..
నన్ను చూడాలనిపిస్తే ఆకాశంకేసి చూడు ..అక్కడో తలుక్కుమనే చుక్క నీకోసం ఆత్రంగా చూస్తుంది
మినుకు మినుకు మంటూ నీకోసం ఎదురు చూస్తుంది.అది నేనే..
ఆకాశం లో చుక్కగా మారి నీ చల్లని చూపుల కోసం ఎదురు చూస్తా..
అవును నా పిచ్చిగాని అప్పటిదాకా నేను గుర్తు ఉండాలి కాదా...?
గుర్తు ఉంటానా..గుర్తుంచుకునేంత గొప్పోడిని కాదుకదా...?

ఈ రోజు మనసంతా గందరగోళంగా ఉంది..?

ఈ రోజు మనసంతా గందరగోళంగా ఉంది..?
మనిషిగా చచ్చి పోయాను జీవితంలో ఓడిపోయాను..
ఏంటో ..జీవితంలో ఒక్క దెబ్బకే విలవిల్లాడతాం..?
ప్రతిదెబ్బ గుండెగు గురి చూసి తగులుతుంటే..తట్టుకోవడం ఎలా..?
కచ్చితంగా ఏదోరోజు ఈ గుండె ఆగిపోతుంది అదే నేను కోరుకుంటున్నా..?
తిన్నామా...పడుకున్నామా..లేచామని కాకుండా..?
బ్రతికిన కొద్ది రోజులు ఎదోటి చేస్తాను ఆతరువాత అదే నన్నుఅందరికి గుర్తు చేస్తుంది
గుండే ఆగిపోయేదాకా ఎదోటి చేస్తా..రోజులు లేవని ప్రతిఘటన గుర్తు చేస్తున్నాయి..
నేను ఎప్పుడూ నేరస్తున్నే .. నేను తప్ప అందరూ మంచి వాళ్ళు..
ప్రతి పరిచయం ..నన్ను వెక్కిరిస్తుంది..వెర్రివాడా అని...?
ఎందుకో ఊపిరి బిగబట్టి నన్ను.. ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి
వేడిగా ఆవిర్లు నాలోనుంచి వచ్చి..నా లైఫ్ కొద్దిరోజులే అని గుర్తుచేస్తున్నాయి
తప్పించుకోని తప్పని పరిస్థితులు .. చేసిన పనికి తల వంచాను..ఓడిపోయాను
నా ఎదురుగా నేను ఇష్టపడ్డవాళ్ళు నన్ను నేరస్తున్ని చేసి ..హేపీగా ఉన్నారు..ఆ పరిచయం..?
కనీసం ఒకప్పుడు ఇష్టపడ్దనేను ఎమయ్యాను ఉన్నానో లేనో తెల్సుకోలేనంత బిజీగా..?
అందరూ సంతోషంగా ఉండాలి ..నేనేమైనా పర్లేదు.. నాకిష్టమైనవాల్లందరూ...బి హేపీ
ఈ రోజు ఏం జరుగుతుందో...అర్దంకావడం లేదు..గుండెళ్ళొ అలజడి..?
ఆసించింది దొరక్కపోతే వైరాగ్యింకాదు..నేను ఇంతే ..నాకిలాగే జరగాలి..?
నా వైరాగ్యం మే నన్ను తినేస్తుంది..తిరిగిరాని లోకాలకు వెళ్ళినా నేనిష్టపడ్డవాళ్ళందరూ బాగుండాలి ..
ఓడిపోయాను..ఓడిపోయాను..ఓడిపోయాను..ఓడిపోయాను..ఓడిపోయాను..ఓడిపోయాను..ఓడిపోయాను..

రాతిరి వెళ్ళిపోయింది,...స్వప్నం చెదిరి పోయింది,

నిశి రాత్రి నీ జ్ఞాపకాలు నన్ను కలవపరుస్తుంటే,

నిదుర నాకు దూరమై, వేదన చేరువై,

నా మది నీ తలపులతో పరితపిస్తుంటే,

నా ఉహల్లో నీ ప్రతిబింబం నన్ను మైమరచగా,

నీ సాన్నిత్యపు తన్మయత్వంలో ఓ మధుర స్వప్నపు నీడలో నేను సేద తీరుతుంటే,

కాలం కరిగిపోయింది,

రాతిరి వెళ్ళిపోయింది,

స్వప్నం చెదిరి పోయింది,

నా ఆలోచనలు గూడులేని గువ్వల్లాగా అనంతమైన ఆకాశంలోకి అంగలార్చినప్పుడు

నా ఆలోచనలు గూడులేని గువ్వల్లాగా అనంతమైన ఆకాశంలోకి అంగలార్చినప్పుడు... పనీపాటా లేని దివారాత్రాలు చీకటిలో, వెలుతురులో కొట్టుకుపోయినప్పుడు...నేను కిటికీలోంచి దూరంగా నీ ముఖాన్ని చూశాను. ఆ వెలుగులో నా హృదయం లోగొంతుక పాటలగా బద్దలయ్యింది. ఈ వేకువ జామున సూర్యుడి లేత కిరణాలు పూలపైని చెమ్మపై పడగానే అవి మరకతాల్లా మెరిసాయి. సముద్రాలపై ఒంటరిగా తిరిగే పక్షి ఆ పాట అందుకుంది.
.....
నా గొంతు బిగించి ఒక పాట ఎత్తుకోవాలని ఉంది. నిన్ను కలిసిన క్షణాన నాలో కలిగిన ఈ మమైకాన్ని ఒడిసిపట్టుకుని... నా గాత్ర మాధుర్యాన్ని గుక్కతిప్పుకోకుండా చేస్తాను.కిటికీ తెరిచి బయటికి నీకోసం తొంగి చూశాను. దారిపొడవునా నిర్మానుష్యంగా ఉంది. చక్రాల జాడలు వీధి దాటి వెళ్లాయి. అలసిన సూరీడు లేత పసుపు కిరణాల కుబుసాన్ని విడుచుకుంటూ నీలి సాగరంలోకి తనని తాను ఒంపేసుకున్నాడు. ఇంతలోనే పెద్ద నల్లని మేఘమొకటి సూరీడుని కమ్మేసింది. మెల్లగా నేను సముద్రంలాగా సద్దుమణిగి చీకటిలోకి కుంగిపోయాను.
.....
నా లోలోపలి అంచుల్లో ఎక్కడో మిణుకుమిణుకుమంటున్న దివ్వెలా నీ జ్ఞాపకాన్ని చూశాను. అది ముమ్మాటికీ నీ జ్ఞాపకమే. కాలం పాదాలకింద పడి అదికూడా నలిగిపోతుందేమోనని భయపడ్డాను. పగలు అయిపోతుందంటే నా జీవితమే ముగిసిపోతుందేమోనన్నంత భయమేస్తుంది. సాయంత్రం సముద్రం పక్కన కూర్చున్న గుంపులో ప్రతి ముఖంలో నిన్నే వెదుకుతాను. లోకమంతా కునుకు తీస్తున్న ఘడియల్లో నేను మెలకువను వింటుంటాను. ఇలాంటిదే ఒకరాత్రి ఈ తోటలో మనమిద్దరం కూర్చున్నప్పుడు ఈ తెలియని ముగింపును ఊహించి ఏడ్చాను.

Sunday, April 1, 2012

మనం మనస్ఫూర్తిగా ఉంటే వారి నుండీ మనకు అంతటి ఆత్మీయతే లభిస్తుంది

ఏదో రూపేణా మనం ఇతరుల ఆనందానికి కారణం అయితే మనకూ అంతకు రెట్టించిన ఆనందకరమైన పరిస్థితులు మనకు బాగా అవసరం అయినప్పుడు ప్రాప్తిస్తాయి.

ఎలా ప్రవర్తిస్తున్నామో మర్చిపోయి చిన్న మాటతో మరొకరిని గాయపరిచినా... ఆ గాయం ఏదో విధంగా మనల్ని తిరిగి శిక్షిస్తుంది.

నేను మాట్లాడుతున్న ఈ మాటలు ఏదో కాజువల్ గా రాస్తున్నవి కాదు.. ఓ ఆనందంలో మునిగిన క్షణమూ, ఓ మానసిక గాయంతో కొట్టుమిట్టాడిన క్షణమూ ఆయా పరిస్థితులకు మూలబీజాల్ని చాలా పర్ ఫెక్ట్ గా గుర్తుకు తెచ్చిన సందర్భాలు నా జీవితంలో ఎన్నో చూశాక కొద్దిమందినైనా ఆలోచనలో పడేస్తుందని రాస్తున్నదిది.

జీవితంలో తారసపడే ప్రతీ మనిషితోనూ "నాకేం వస్తుంది" అన్న కాలిక్యులేషన్లు, "నేను ఫలానా పొజిషన్ లో ఉన్నా కదా.. ఇలానే ప్రవర్తించాలి" అనే బిగింపులతో సంబంధం లేకుండా అరమరికలు లేకుండా ఉండడం వల్ల ఎంత అద్భుతమైన మనుషులు ప్రాకృతిక ధర్మంలో భాగంగా నాకు తారసపడుతున్నారో నేను చెప్పలేను.

వ్యక్తులతో మనం మనస్ఫూర్తిగా ఉంటే వారి నుండీ మనకు అంతటి ఆత్మీయతే లభిస్తుంది. మన బిజీ జీవితాలతో మనం వ్యక్తులకు ఎంత దూరంగా గడుపుతుంటే.. కొన్నాళ్ల తర్వాత అంతటి దూరంలో మనమే చింతిస్తూ నిలబడవలసి వస్తుంది. ఇదీ ఒకింత నాకు అనుభవమైనదే. అందుకే జీవితంలో ఓ వైపుకే ఒరిగిపోవడం.. సమతౌల్యాన్ని పాటించకపోవడం తెలియకపోతే.. కష్టపడుతూ కష్టపడుతూ మనం ఏదో సాధిస్తూ ఎంతో దూరంలో ఉన్నామనుకుంటాం. దూరంలో ఉండేది వాస్తవమే! అయితే కష్టపడుతూ కష్టపడుతూ ప్రపంచానికి అంత దూరంగా జరిగిపోయామన్నది మాత్రం సత్యం.

మనం పారేసుకునే నోళ్లు మనకు నిందల రూపంలోనూ, మానసికంగా మనం చేసే గాయాలు మన మనసుని మెలితిప్పే బాధల రూపంలోనూ వెంటాడడం ఎవరూ తప్పించలేని ధర్మం.

ఒక లక్ష్యం, గమ్యం, సక్రమమైన జీవన విధానం లేని వ్యక్తి.. తన మాటలు, చేతలకు పర్యవసాలు ఆలోచించలేరు. బయటి ప్రపంచంలోనూ, ఇంటర్నెట్ లోనూ ఎంతోమందిని చూస్తుంటాం. ప్రాంతాన్నీ, కులాన్నీ, వృత్తినీ, ప్రవృత్తినీ ఆసరాగా చేసుకుని ఇష్టానుసారం మాట్లాడేస్తూ ఉంటాం. ఒక్కసారి మన మెదడు ఎంత మనల్ని దిగజార్చేస్తోందో బేరీజు వేసుకుంటే మన మీద మనకే అసహ్యం వేస్తుంది.

ఆ అసహ్యం మాటలా ఉంచితే.. ఇలా ఇతర వ్యక్తులు, సమాజం పట్ల మనం వ్యక్తపరిచే ప్రతీ భావానికీ తగిన ప్రతిఫలం ఖచ్చితంగా కాచుకుని ఉంటుంది. కొందరు ఆ ప్రతిఫలం దక్కినప్పుడు కారణాలు గ్రహించగలుగుతారు. మరికొందరు విధి తమ పట్ల ఇలా కఠినంగా ఉంటోందేమిటోనని బుర్రలు గోక్కుంటారు.

మనందరం చదువుకున్నదే.. మంచి వాడితో స్నేహం మంచిది అన్నది. దాని అంతరార్థం.. మంచేదో, చెడెదో మనకు తెలియకపోయినా పక్కవాడైనా మనల్ని రక్షిస్తాడన్న సూత్రం.

ఇప్పుడు ఆర్థిక అవసరాలూ, సామాజిక హోదాలూ, ఫేస్ బుక్ ల లాంటి వాటిలో అయితే.. ఎక్కడ వెకిలితనం, ఎక్కడ అది మంచిదైనా చెడ్డదైనా వినోదం ఉంటే ఆయా చోట్ల మన పరిచయాలు ఆగిపోతోంటే.. మన స్నేహాల్లో కొద్దిపాటి మంచి విలువలైనా ఎలా మిగులుతాయి?

ఆ కొద్దిపాటి మంచి విలువలు కూడా లేకపోతే మనం పరోక్షంగా తోటి మనుషుల్ని ఎగతాళి చేస్తూ, పక్కవాడిని మాటలతో గాయపరుస్తూ, ఎదిగే వాడిని దిగజారుస్తూ, శారీరక వైకల్యాల్ని వినోదంగానూ, రాజకీయపు లోపాల్ని కసిదీరా తిట్టుకుంటూ రాక్షసత్వానికి దగ్గర అయిపోతున్నట్లు కాదా?

మనలో రోజురోజుకీ పెరిగిపోతోన్న ఆ రాక్షస ప్రవృత్తి మనల్ని ఏదో రూపంలో శిక్షించకుండా వదిలేస్తుందంటారా?

ఊహల్ని కాలరాసి ఆత్మను ముక్కలు ముక్కలుగా మిగిల్చావు

ప్రేమిస్తున్నాను అని,
నాకోసమే జీవిస్తున్నానని ... అన్నావు
ఎప్పటికీ నాతోనే అన్నావు
నీ జీవనం అని ... అన్నీ అబద్దాలు!
నా భావనల్ని, ఊహల్ని
కాలరాసి ఆత్మను ముక్కలు ముక్కలుగా మిగిల్చావు
నా ఆనందం హరించి
గుండెల్లో గాయాన్ని రేపావు!
బాధే ... మిగిలింది
ఆత్మ ఆవిరై ...
నమ్మలేని నిజం నీవు అబద్దాలాడటం

నీ నుంచి దూరంగా ఒక్క అడుగు వెనక్కి వేస్తే,

ఏమి కానీ నీవు నా జీవితము లో కీ వచ్చావు ..నాకు తెలుసు నీ రాక శాశ్వతము కాదు అయిన నా పిచ్చి మనసు ఊరుకోదు.నీ రాక తో నా ఎడారి లాంటి జీవితము లో వెన్నెల వచ్చింది మిత్రమా ....

నీవు వస్తున్నావు అంటే ఆనందం .నీకు స్వాగతము చెప్పటము కూడా మరచిపోతా ,, వెళ్ళిపోతున్నావు అన్నా బాధ లో నీకు వీడుకోలు కూడా పలకను...
...
నీ నుంచి దూరంగా ఒక్క అడుగు వెనక్కి వేస్తే, నా ప్రమేయం లేకుండానే మళ్ళీ నీ వైపుకే పది అడుగులు పడిపోతుంటే ఎలా ? ఒక్క నువ్వు ఒక్క నాలో ఇన్ని వేల వేల తలపుల్ని పూయించడం ఎంతటి విచిత్రము కదూ! నా నువ్వైపోతూ నీ నేనుగా మారిపోతున్నఈ క్షణాన.. ఏమని చెప్పాలి నీకసలు...... ఏమని అడగాలి నిన్నసలు.. ఎవరనుకోవాలి నిన్నసలు..!?

కొన్ని సార్లు అనుకొంటా .... నీ నుంచి వెళ్ళిపోదాము అని, . ఎందుకు అంటే నా దురదృష్టము నీకు ఎక్కడ వస్తుందో అని భయము ... నేను నిన్ను వెంటాడుతున్న అని నీ మిత్రులు అవహేళన చేస్తూ ఉండే బాధ గా ఉంది .. ఏదో ఒక రోజు వెళ్లి పోతా మిత్రమా ....

ఎన్ని ప్రేమలు తమ పవిత్రతను ప్రశ్నించుకున్నాయో

జాబిలి పంచే చెలిమికి కలువ రేకులు వికసిస్తాయని ............
సూర్యుడు పంచే చెలిమి వెంటే ప్రొద్దు తిరుగుడు పయనిస్తుందని .....
తెలిసిన వారే స్నేహితులంట .......
మనసు తెలిసిన వారే మన తోడంట.......

ఎన్ని ప్రేమలు తమ పవిత్రతను ప్రశ్నించుకున్నాయో .......
మోహపు జాడలు లేని ఈ స్నేహపు ప్రేమను చూసి ........
ఎన్ని బంధాలు తమ అనుబంధాన్ని శంకిచాయో.......
రక్తపు సంభందం లేని ఈ బంధాన్ని చూసి .......

ఎన్ని కాలాలు ఎంతగ కక్ష కట్టాయో........
ఊసు పోని కబుర్లు తమని కరిగించే సాధనాలని తెలుసుకొని ........
ఎన్ని లోకాలు ఎంతగా కుళ్ళు కున్నాయో ........
ఎదురయ్యే ప్రతి కస్ట నష్టాల భారం సగమైపోతుందని ..........

నీ ఆత్మను నీ మనసు నవ యవ్వనం సంతరించుకొనేలా చేస్తున్న
ఈ స్నేహం
యే జన్మ ఫలమో యే దేవుడి వరమో.......