"...కాలమనే రాస్తాలో
కాలిగుర్తులు ఎన్నో
మనం అనుకోకుండా కలిశాము
ఒకరి కళ్ళలోకి మరొకరం ఆప్యాయంగా చూసుకున్నాము
అప్పుడు జీవితం చిన్నదనిపించింది
లోకం కొత్తగా ..గమ్మతుగా అగుపించింది
నీ పెదవుల మీద మెరిసిన దరహాసం
నన్ను వివశుడిని చేసింది
కలకాలం ఇలాగే ఉంటుందని అనుకునే లోపే
మన మధ్యన ఎడతెగని ఎడబాటు
ఇంతలో నీ మీద కూడా పూలు చల్లుతున్నారు
నా మీద కూడా పూలు చల్లుతున్నారు
నీవు పెళ్లి పల్లకీ మీద
నేను శవ పేటిక మీద ఉన్నా...
అవును కదూ ..ఇదేనేమో ప్రేమంటే ..."
- Bhaskar Teja