. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, December 31, 2013

ప్లీజ్ నా సంతోషాన్ని నాకు తిరిగి ఇవ్వవా


గోడ మీదికి చేరేందుకు కొత్త కేలండర్ 2014 తహతహలాడుతోంది..

హాపీ న్యూ ఇయర్ టు ఆల్ !

పాత జ్ఞాపకాలకు వీడ్కోలు చెబుతూ
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. - 2014

గోడ మీదికి చేరేందుకు కొత్త కేలండర్ తహతహలాడుతోంది..

కొత్త సంవత్సరం అనగానే 

అందరికీ ఎక్కడలేని 
ఉత్సాహం వచ్చేస్తుంది.
డిసెంబర్-31 నుంచే హంగామా 
మొదలవుతుంది.

కొత్త రిజల్యూషన్స్ తీసుకోవడం,
డైరీలు వ్రాసే అలవాటు ఉంటే 

కొత్త డైరీ కొనుక్కోవటం,
కాలెండర్లు కొనటం, బంధుమిత్రులతో 

సరదాగా గడపడం 

ఆ రోజంతా సంతోషంగా 

గడపటానికే అందరం
మనసా వాచా కర్మణా ప్రయత్నిస్తాం.

మన సంతోషం కాదు
మనం ఎవ్వరిని ఇబ్బంది  పెట్టామా లేదా .

అని ఆలోచించి నూతన సంత్సర వేడుకలు  జరుపుకోండి ..మీకంటూ మనస్సాక్షి ఉంటే

Monday, December 30, 2013

నీవు లేని ప్రతిక్షణం ఓ పిడిబాకవుతున్నా,

కలల ఒడిలో 
సరికొత్తగా అనిపించావ్ 
ఈ రోజెందుకో!
వెచ్చనైన నెచ్చెలిగా,ఆత్మీయ
స్వచ్చమైన చిరునవ్వుతో,
మల్లెలాంటి మనసుతో,
గులాబితనపు సోయగాలతో......
కలలే కొత్తగా 

అనిపించాయ్ నీ రాకతో
కలలే కలకాలమైతే 

బాగుండనిపించేంతగా

ఉలిక్కిపడి అంతలోనే 

నిదురలేచా
హైదరాబాద్ లో నీవు 

తిరిగే ప్రతిచోటా వెతికా
కానరాలేదు నీవు
కనుమరుగైన కలలాగే..

గత స్మృతుల ఒడిలో 

కాసేపు సేద తీరా,
ఆస్వాదించా 

నీ ప్రేమ మాధుర్యాన్ని!
ఆమోదిస్తున్నా 

కలల సౌందర్యాన్ని,
కలలోని నిన్ను 

తరచిచూస్తూ !!

గతించిన కాలం గుండె 

నలిపేస్తున్నా,

నీవు లేని ప్రతిక్షణం 

ఓ పిడిబాకవుతున్నా,
లక్ష్య సాధన కోసం 

వడివడిగా అడుగులేస్తూ,
చిరునవ్వుతో శాశ్వత 

నిదురకోసం వేచి చూస్తున్నా!

కలతనొందిన కనులకు 

ఈ కలలే స్వాంతన !
మరణిస్తున్న నా మనసుకు 

నీ కలలే జీవితం !!

Saturday, December 28, 2013

ఏ కన్ను యేడ్చినా..నొప్పి గుండెల్లోనే వస్తుంది

దుఃఖం నన్ను
చిన్నచూపు చూస్తుంది!
కన్నీటి రుచియేమిటో
దుఃఖమే చెప్పేది నాకు
హృదయాన్ని కన్నీళ్లలో
నానం చేయిచేది  దుఃఖమే!
ఏ కన్ను యేడ్చినా..
నొప్పి గుండెల్లోనే వస్తుంది

.ఎంత వెతికినా 
సమాదానం దొరకడం లేదు
దుఃఖం కరిగితేనే

కన్నీరు వొలికేది.
హృదయం లో 

భాదతో ఎంత ఏడ్చినా
కన్నీరు రావడంలేదు!

కన్నీరుకు భాద 
అలవాటైంది
మస్సువేదనకు 

స్పందనే కన్నీరు..
కరిగిపోతున్న కాలాన్ని..
కన్నీరు ఆపలేకపోతోంది..
నేరం నాది కాకున్నా
నేరస్తున్ని చేస్తున్నారు..
అందరూ బలిపీఠం
ఎక్కించేందుకే 

ప్రయత్నిస్తున్నారు..
బలౌతున్నది నేను
భాద పడుతున్నది నేను..
కాల్సిన వాల్లు ..దూరం అయి
పట్టించుకోవడంలేదు..
జరిగింది తలచుకొని
జరగబోయేదానిపై 

ఆశలు వదులుకొని.
చేసేదేమీ లేదు 

నిస్సహాయంగా
ఆకాశం వైపు దీనంగా 

చూడటం తప్ప

Thursday, December 26, 2013

మనసరా మరణించే వరకు నన్ను నేను హత్తుకోవాలిగా

 ఏదో గుండెల్లో 
తెలియని దిగులు
కనిపించని కారణమేదో 

గుచ్చుతోంది
కల్లేదురుగా 

నిజం కనబడుతున్నా
అది నిజంకాదేమో అని
నన్ను నేను చంపుకొని అనుకొన్నా
నిజం అబద్దంగా 

ఎలా మారుతుంది చెప్పూ
యేదో అలికిడి 
నిన్ను పిలుస్తోందా
నన్ను తొలుస్తోందా
మనసేనా

యేముంటుంది....
మళ్ళి అదే మతిలేని కాదు కాదు
మెదడు తినేసె ఆట మొదలెడ్తోంది......
"నువ్వు కాల్చుకుంటావ?? 

నన్ను కాల్చమంటావ???"
దాని ఈ అలుపెరుగని ప్రశ్న
విని విని సమధానం చెప్పలేకో,
చెప్పటమ ఇన్ష్టం లేకనో,
చెప్పిన అది ఆగదనో,
చెప్పటానికి యెమి లెకనో....
మౌనమే దాని అన్ని 

ప్రశ్నలకి సమధనంగ ఇచ్చేశా...
ఇక దానికి 

సంధానంతో పనేముంది
దాని మాటలు అది రుజువు 

చేసింది తనని కాల్చుకుంటూ....
నన్ను కాల్చటం దానికి 

యెంతో ఇష్టమైన ఆట.
దాని ఆట కొసం 

అది పేర్చె చితి శరం లేని
అంపశయ్య నాకూ తెలుసు...
కాని తప్పదు తరలి రాని
మృత్యు పాశం తలుపు 

తెరచి కౌగిలించుకునే వరకు
తరుగుతున్న ఆయువునే 

ఆయుధం చేసుకుని
కరిగిపొతున్న కన్నీటి ఆశరాతో 

నిత్యం నన్ను 
నేను వెతుక్కుంటూ ……..
కొత్త ఆశలను, 

కనురెప్పల మాటున
తప్పిపొయిన 
చిరునవ్వు కాంతి రేఖలను ………
నేనే బూస్తాపితం చేసుకుంటూ......
చెసుకుంటున్నానో అనుకుంటున్నానో....
కని వెంటపడ్తున్న వెదనను

గతాన్ని తరుముకుంటూ
మనసరా మరణించే వరకు 

నన్ను నేను హత్తుకోవాలిగా

Tuesday, December 24, 2013

నీవు మరొకరి చెంతచేరి నన్ను అవమానిస్తుంటే అయ్యో అనిపించలేదా..?

ప్రేమ అంటే రెండు శరీరాల కలయికా? ప్రేమకు అదే పరమార్థం?  కానీ, రెండు హృదయాలు కలుసుకోవడం కూడా తక్కువేమీ కాదు కదా! జీవన సుగంధం మనం అనుకున్నట్లు మన చెంతనే లభించకపోవచ్చు. అయినా వేల పూల పొదలకు నెలవైన నందనమే నీ ఎదురుగా ఉంది. అదేమైనా తక్కువా? ఆకాశాన్ని చూసే ప్రతి మనిషీ చందమామను కోరుకుంటాడు. కానీ, అందరికీ చంద్రుడు( జాబిల్లి ) సొంతమై  పోతుందా? ఎంత ఆశించినా అందుకునే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కోసారి ఆ కాంతి పుంజం మన చేతుల్లోకి రాకపోవచ్చు ఆ స్థితిలో వెలుగును అందించే ఒక చిన్న దీపమైనా అపురూపమే. ఒక దూళికణంలో భూమండలాన్ని చూడటం, ఒక తరంగంలో సముద్రాన్ని చూడటం ఇదేగా జీవిత ఔన్నత్యానికి పరాకాష్ట. ఉన్న చోటే ఉండే చిన్న కనుపాపలో ఎదురుగా ఉన్న దృశ్య జగత్తంతా ఇమిడిపోతోంది. అలాంటిది నిత్యచైతన్యవంతమైన అంతరంగం ఎంత విశాల పరిధిలోకి వెళ్లాలి. విశ్వమంతా విస్తరించాలి. శక్తి మేర ఆ బాధ్యతల్ని భుజస్కంధాల మీదికి తీసుకోవాలి. ఇలా మన ఆలోచనల పరిదిదాటి  ఏవోవే ఆలోచనలు మనసును కుట్టేస్తాయి... నీకోసం పరితపిస్తూ .. నీవు దూరం అయిన క్షనాల్లో నాలో జరిగే అంతర్గత ఘర్షన నన్ను నాలో ఒక్క క్షనం నిలువనీయదు ... నీ వేంచేస్తున్నావో అంటూ మనసు గొడవ చేస్తుంది ...నిన్ను ఒక్కసారన్నా చూపిచవా అని దీనంగా అడుగుతుంది నన్నూ కాదనుకున్న క్షనాల్లో నీ ఆనందాన్ని వెతుక్కొని నీవెల్లావు .. నీకు నేను గుర్తుండాల్సిన అవసరం ఏంటీ ..? అందుకే నివైపు తొంగి చూసిన క్షనాల్లో ఆనందంగా నవ్వుతున్న నీవు కనిపిస్తావు .. అది నేను దూరమైనందుకో .. మరికరి చెంత నీ ఆనదం రెట్టింపు అయిందో తెలీదు   ఒక్కటి మాత్రం చెప్పగలను నన్నూ పూర్తిగా మర్చిపోయావు అస్సలు నేనంటు ఒకడ్నిఉన్నా నీకోసం తపిస్తుంటా అన్ని ధ్యాస నీకు లేదు... ఉండాల్సిన అవసరం నీకు లేది ...జీవితం అనే ట్రైన్ లో ఎందరో వస్తుంటారు పోతుంటారు .. నీకు నేనో ప్యాసింజర్ని  ఎదో పొద్దుపోక టైం పాస్ కోసం కొద్ది రోజులు నాతో స్నేహం చేశావు ... అది గుర్తుంచుకునేంత గా నీవు అనుకోలేదు .. ఏజన్మలో ఏపాపం చేశానో నీ పరిచయం  అయింది .... ఆ పాప ఫలమే నాతో టైం పాస్ స్నేహం చేశావు.. నన్నో ద్రోహిగా ముద్రించి మరీ వెల్లావు  నీవు మరొకరి చెంతచేరి నన్ను అవమానిస్తుంటే అయ్యో అనిపించలేదా... కనీసం జాలి కూడా లేకుండా మనస్సుపై ఎదురు దాడి చేస్తుంటే .. ప్రపంచం తల్లక్రిందులైనట్టుంది ..నిజాన్ని నమ్మలేక అబద్దమనే బూడిద పూసుకొని మనలేక నేను పడీన వేదన నాకే తెల్సు నీకూ తెల్సుకోవాల్సిన అవసరం లేదు అంత తీరిక నీకు లేదు 

                            జీవన పోరాటంలో ఎన్నెన్నో ప్రాణాలు అలసిపోతున్నాయి. విగతజీవులుగా మారుతున్నాయి .. అన్నిటిని గుర్తుంచుకొంటామా.. నీకున్న కొద్ది సమయంలో ఇవన్నీ పట్టీంచుకొనే తీరిక ఓపీక నీకు లేదు .. అంతలా నిన్ను ఏమార్చిన నన్ను మర్చేలా చేసిన స్నేహాలుండగా నేను అనే మనిషి కోసం ఆలోచించాల్సిన అవసరం నీకేంటి కదా ..చేయగలిగింది ఏముంది గుర్తులనే కత్తులను గుండేల్లో గుచ్చుకున్న ప్రతిసారి ఇలా నాలో నేను కుమిలి పోవడం తప్ప..ఎన్నెన్నో హృదయాలు జీవితపు ఎడారుల్లో ఒయాసిస్సుల కోసం ఎదురు చూస్తూ సొమ్మసిల్లిపోతున్నాయి. అలాగే వసంతం కోసం నిరీక్షిస్తూ చివరికి గ్రీష్మపు మంటల్లో ఎన్నో మొగ్గలు వాడిపోతున్నాయి. అలా ఓడిపోయి వాడీపోయిన ఓ పనికిమాలిన స్నేహం నాది అందుకేకదా వాళ్లలా నేనిలా ఉన్నాను .. ఇంక అనుకోవాల్సింది ఏముంది ఇంతలా అవమనించి నేను ఆక్రోసించేలా చేసి ఆనంద పడుతున్న నిన్ను తలచుకొని వెక్కి వెక్కి ఏడ్వటం తప్పించి నాకు నేను   ఈ స్థితిలో ఎవరైనా ఏం చేయాలి? గతించిపోయిన ఒక వసంతం స్థానంలోకి మరో వసంతాన్ని పిలవాలి. ఒక లోకం కూలిపోతే దాని స్థానంలో మరో కొత్త లోకాన్ని నిర్మించుకోవాలి. వే యి నిర్మాణాలు చేస్తే అందులో అరుదుగా కొన్నే మిగులుతాయి. ధ్వంసమైపోయిన నిర్మాణాలతో పోలిస్తే నిర్మించిన వాటిలో వె య్యోవంతు కూడా కాదు. విధ్వంసమైపోతున్నవే ఎక్కువని నాలాంటి హృదయాలు ఇలా భాదపడటానికి నీలాంటి వాళ్ళను మాలాంటి వాళ్ళను భాదపెట్టడానికి దేవుడూ పుట్టించినప్పుడు నీవైనా ఏం చేస్తావూ తప్పు  నీది కాదు నా జన్మది..ఏ జన్మలో చేసిన పాప ఫలితమో ఈ జన్మలో నీ పరిచయం నీ  స్నేహితులనే వాళ్ళూ నిన్నడ్డం పెట్టుకొని నన్ను వేదిస్తుంటే నీకానందం .. కదూ . అందుకేనేమో అది చాలదు అన్నట్టు నీవు వాళ్ళతొ మాటలు అనిపించి ఇంకా సరిగ్గా మనసుకు తూటాలు తగిలాయో లేదో అని నీవే డైరెక్టుగా నామనసు గాయ పడేలా అంటుంటే నేను ఎంత విల విల లాడానో నీకేం తెల్సు

   అందరూ బాగుండాలి అనుకోవడం  జీవన ధర్మం కాదు. నాలాంటీ నా మనస్సులాంటివి .. పనికిరాని పనికిమాలినవని దేవుడే నిర్నయిస్తే నీవేంచేస్తావు చెప్పు .. ఒక మొగ్గ పూవుగా మారడాన్ని మాత్రమే చూస్తాం. కానీ, ఆ క్రమంలో వేల మొగ్గలు రాలిపోవడాన్ని మనం గమనించం. ఇంతా జరుగుతున్నా పూలతీగెలు మొగ్గలు వేయకుండా ఉంటాయా? సౌధం కూలిన ప్రతి సారీ తిరిగి నిర్మించే యజ్ఞంలో ఒక్కోసారి శరీరమూ మనసూ అలసిపోవచ్చు. ఒక అయిష్టమూ ఏర్పడవచ్చు. లోకం తీరు ఏవగింపునూ కలిగించవచ్చు.  అది జరిగింది కాబట్టే నీవు నాతో అలా ప్రవర్తించావు .. నన్ను ఇన్ని మాటలు ఎలా అన్నావా అని ఎంత మదన పడ్డానో తెలీదు అవమానం ఎంత దారునంగా గుండెను పిండేస్తుందో నీకు తెలీదు .. ఎందుకంటే నీవు అన్నదానివి నేను పడ్డవాన్ని నేను పుట్టీ బుద్ది ఎరిగిన కాన్నుంచి చాలా స్నేహాలు చూశాను .. వాళ్ళందరూ నమ్మకంగా చాలా చాలా బాగున్నారు ఆనందగా ఉన్నారు .. ఒకరంటే ఒకరు ప్రేమగా ఒక్కమాట అననీయకుండా ఎవరైనా అంటే తట్టూకోలేనంత స్నేహం చేసేవాళ్ళను చూస్తున్నా మరి నీలా నాకు ఎవ్వరు కనిపించలే ఎందుకో నీ పరిచ్యం అప్పుడూ ఇలా చేస్తావని  ఊహించలేదు ఒకటి మాత్రం నిజం ఏజన్మలోచేసుకున్న పాపమో ఈ జన్మలో నీస్నేహం రూపంలో నన్నూ కాటేసి ప్రతి క్షనం భాదపడేలా చేస్తుంది

నీనుండి నీవు దూరం కాకు ..నీవు నీలా ఉండు ప్లీజ్ ( నీకై ఓ ఆత్మ సంఘర్షన }


ఒక్కసారి ఒకే ఒక్కసారి, ఈ ముసుగులన్నీ తీసి పక్కన పెట్టి……”నేను బాగానే ఉన్నానులే”, అన్న ముసుగు కూడా తీసేసి,మనసు లోతుల్లో ఆణువణువూ స్పృశిస్తూ, “సంతోషంగా ఉన్నానా?”, అని గొంతెత్తి అరిస్తే బండరాతి గుండెల మధ్య పలుమార్లు ప్రతిధ్వనించి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అదే ప్రశ్న.బండరాయి పగుళ్ళ  శబ్దం తప్ప ఎమైనా సమాధానం వస్తుందా ? మనకు మనం మంచివాళ్లమనే ముసుగు కప్పుకొని... స్వార్దంగా నో సంతోషాన్ని మాత్రం మే సూసుకొని ఎదుటి వాళ్ళేమైనా పట్టించుకోని నీ మనస్సాక్షిలో దాగిన నీజాలను అడుగు ..అడగలేవు పైకి నటిస్తున్నావు నేను మంచే చేస్తున్నా అని నీ మనస్సాక్షి కాదన్న వద్దన్నా పట్టించుకోకుండా నీ మనసుకు  ముసుగులు కప్పీ కప్పీ ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసిన గుండె కదూ?…. పాపం ఎండిపోయింది…..ఒక్కసారి ముసుగులన్నీ తొలిగేటప్పటికి, మళ్లీ ఊపిరి పిల్చుకోవాలని ప్రయత్నం. కొన ఊపిరి అందగానే ఏదో ఆనందం…నగ్నత్వంలో  స్వచ్ఛతలాగా…స్వచ్ఛత సువాసనను వెదజల్లే స్వేఛ్చను ఊపిరిగా పీల్చుకుంటూ మళ్లీ ప్రాణం పోసుకుంటున్న గుండె స్పందించటం మొదలు పెట్టింది... ఆ స్పందనలో ధనం, దర్పం, అధికారం ఏమీ లేవు….స్వచ్ఛత తప్ప…గుండెల నిండా ఊపిరి పీల్చి వదిలే సరికి, సుదూరంగా అలజడి  శబ్దం. లోకం శరవేగంతో పరుగులు పెడుతుంది,  సునామీ కాలం వెంబడిస్తున్నట్టు…తిరిగి ముసుగులు వేసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. మనసు ఒప్పికోవట్లేదు…సునామి తరుముకొస్తుంది…ఓ ముసుగును అక్కడే వదిలేసి మిగతావన్నీ తగిలించుకుని లోకంతో పాటు పరుగులు...ఏ అలిసిన క్షణానో మరోసారి ఈ ఒకే ఒక్కసారి అంటూ ముసుగులు తొలిగించకపోతానా……మరో సంఖ్య తగ్గించుకోకపోతానా… అందరి దృష్టిలో నీవు మాత్రం గొప్ప.. నిజాయితీకి నిలువుటద్దం అంటూ చెప్పకనే చెప్పుకుంటావు నీ ఇగోను సాటిస్ ఫైచేస్తూ..స్వార్దగా ఆలోచిస్తూ...ఎక్కడ ఎవరు నిన్ను తప్పుగా అనుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ ఎవ్వరూ చూడట్లేదని నిజాన్ని నిలువునా తగులబెట్టి వెర్రినవ్వులు నవ్వుకుంటున్నావు ఏదో విజయంసాదించాను అని ... ఎవ్వరూ చూడకపింఓయిన అన్నిటికీ నీ మనస్సాక్షే అన్నికీ సాక్ష్యం అయినా ఏం తెలియనట్టు అయాకంగా నటించడం నేర్చుకున్నావుగా అప్పుడలా ఇప్పుడిలా నిన్ను చూస్తుంటే  నీవేనా అనిపిస్తుంది కాని నిజంకదా నమ్మక తప్పదు ... కళ్ళెదురుగా జరిగే నిజాలు మరి నీవు చీకట్లో చేశాను అనుకున్నా నిజానికి వెలుగు చీకట్లుండవన్న నిజం తెల్సుకునే సమయం ఆలోచన నీకు లేదు...ప్లీజ్ ఇంక నటించకు మంచి అనే ముసుగు తీసి.. నీవు నీవులాగా ఉండు..నీలో స్వచ్చత ఉంది ఆ స్వచ్చతను స్వార్దం తినేస్తుంది  . నీలో ఉన్న అంతరంగ అందం చెడి పోతుంది.. నీవు మారకు నీవు నీవులాగా ఉండి నీలో నీవు ఓడిపోకు  క్షనకాలపు  ఆనందపు పొగడ్తలకోసం ఆరాటపడుతున్నావు కాని అదోపాతాలానికి దిగజారిపోతున్నావని తెల్సుకోలేకపోతున్నావు..నీకు తెలివిలేక కాదు తెల్సుకోలేక..పై పై మెరుగులే కావాలి నీకు  ఇప్పటీకైనా నటించడం మానీ నిక్కచ్చిగా జీవిండం నేర్చుకో .. నీలాగానే ఉండు..నిన్ను నీవు మార్చుకొని ఏమార్చుకోకుపైకి అందరూ నిన్ను పొగుడుతున్నా లోపల నీన్ను చులకనగా చూస్తున్నారు.. నీఎదురుగా మాట్లాడంకాదు నీవు లేనప్పుడు కూడా నిన్ను నిన్నుగా గుర్తించేలా చేసుకో

Thursday, December 19, 2013

అంతులేని స్నేహమనే ఈ వింత ఆటలో ఓడిపోయాను

ఏంటో ఏమో 
ఎటుపోతున్నాయో 
నా ఆలోచనలు
నా తలపుల రహదారులు 

నాకు నేను దిక్కు తెలియక
దారి  తెన్నులు లేక 

గమ్యం  లేక గండి 
పడ్డ హృదయాన్నై
చిరు గాలికెగురుతూ... 

తుఫానులకు క్రుంగిపోతూ
అంతులేనిఈ  స్నేహమనే  వింత ఆటలో
గెలవలేక ఓడిపోయాను
నాకు నేను 
సమాదానం చెప్పుకోలేక
ఒక్కోసారి సమిధనై..
సమాదానం లేని ప్రశ్ననై 
అనునిత్యం జ్వలించే జ్వాలనై
ప్రేమనే చెట్టుకు కాసిన మొగ్గనై
వర్షపు  తుంపరలతో 

నిండిన వర్షపు చెమ్మనై
ఏ క్షణాని కాక్షణం 

ఒక్కడినే ఏకాకి గా మిగిలిపోతూ
నాకు నేను ఓడిపోతూ
గెలవలేని  రేపటిలొ గతంగా 

మిగిలిన  నిన్నటిలో
ఒంటరి గా  మిగిలిపోయాను 

ఎందుకో చెప్పవూ ....?

Tuesday, December 17, 2013

ఎందుకో నాకు ఈ లోకంతో ( నాదో బ్రమ )

ఎందుకో నాకు ఈ లోకంతో 
బంద తెగిపోయిందేమో 
అనిపిస్తుంది
కారనం చెప్పుకోలేని .. 
భారంగా రాస్తున్న 
అక్షరాలసాక్షిగా 
వస్తున్న ఆలోచనలు
ఎందుకో గుర్తుకొస్తున్న 

ప్రతి జ్ఞాపకం 
విలువ కొద్ది  గంటలేమో
ఇక అంతేనేమో
నేను అనే ఓ జీవీ 

నిర్జీవిగా మారుతున్న 
క్షనాలు దగ్గర 
పడుతున్నా యనిపిస్తుంది 
చెట్లను చూసినా.. 
ఆకాశాన్ని చూసినా ... 
ఎవ్వర్ని చూసినా ఈరోజు
అంతా వింతగా అనిపిస్తుంది .... 

రేపు అన్న రోజు లేకుంటే 
అది ఈరోజే చివరిరోజు
ఎవ్వరికి ఎవ్వరు శాశ్వితంకాదు ... 

అలాగే నేను 
ఈ లోకానికి శాశ్వితంకాదు
రేపటికి ఎమౌతుందో 

ఏం జరుగుతుందో 
ఎవ్వరికి తెలుసు 
అంతా వింత ప్రపంచం
ఎందుకో ఈక్షనాన 
అందరూ గుర్తుకొస్తున్నారు...
చివరకు మిగిలేది ఏంటి...

ఓ జ్ఞాపకం అదీ గుర్తుంటే
అయినా గుర్తుండేంత 

గొప్ప స్నేహం నాది కాదు అని
నాకు బలమైన నమ్మకం .. 

జీవితంలో ఇదో అంకం
అది పూర్తయిందేమో 

అనిపిస్తుంది ఈ క్షనాన  
ఆలోచనలు పిచ్చి పిచ్చిగా ఉన్న
ఓ నిజం నాగుండెను తాకుతుంది
ఆనిజమే నన్నీ మాటలు 

అనిపిస్తున్నాయి
ఏంటో రేపటి ఈ ప్రపంచంలో 

నేనో జీవిగా ఉండలేనా
జీవితం అంటే ఇంతేనా .. 

పుట్టుకే చావుకి కారణమా
మషిజన్మతొ అన్ని బందలు 

అంతం అవుతాయా
క్షనాల జీవితం 

దగ్గర పడుతున్నకొద్దీ . ... 
ఏదో కావాలని ఆరాటం
ఎవ్వరికి చెప్పుకోవాలో తెలీదు ... 

వినే వాళ్ళు లేనప్పుడూ
ఎవరికి ఏమని చెప్పుకోవాలి... 

ఎందుకు చెప్పుకోవాలి

దూరం కాలేదు ... దగ్గరి తనం పక్కకు జరిగింది

మనసు మనసుతో అన్నది బాసలు నిలుస్తాయి
ఎన్నటికీ నన్ను మరచిపోవద్దని అడిగి అడిగి అలసిపోయాను
ఋతువులెన్ని మారినా నీజ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమే

ప్రాణాన్నే ప్రాణానికి పెట్టుబడి పెట్టి ప్రేమ ఎప్పుడూ పదిలమే 
నిప్పునీరు ఏవ్వరూ ఏంమీ చేయలేరు .. కుతంత్రాలు చేసే మనిషి తప్ప
ఓడిపోయేలా చేసి వాడిపోయేట్టు చేసిన మనషి ఆడిన నాటకంలో 
సమిదగా మారింది ప్రేమ ...చివరకు జ్ఞాపకమై గుండెల్లో నిలచిపోయింది 
అందుకే ఓ జ్ఞాపకమా మనసావాచా మరచిమారిపోవద్దని వేడుకొంటున్నా 


దూరం కాలేదు ... దగ్గరి తనం పక్కకు జరిగింది అంతే 
మనసు మాటున మాటలు మూగబోయాయి 
మదిచేరువలో ఉండాల్సిన మనం విడిపోయాము
కాదు కాదు విడదీసింది కలికాలం ..
అది కలకాలం ఉండాకూడాదని నా తపన 

నీవిలాచేస్తావని కలలోకూడా ఊహించలేదు...?

నీ స్నేహం నేను ఎన్నడు అడుగలేదు...నీ తోడు కావాలని నేను ఎప్పుడు కోరలేదునేను ఊహించని నీ స్నేహం నాకు పంచావు.అప్పటికే దెబ్బతిన్న నాగుండెకు ఓదార్పు నౌతాఅంటూ నీ అంతట నీవే వచ్చావు...ఎదురు చూడని దేవత ఎదురేగి నాకోసమే వచ్చిందేమో అని ఎంతగా మురిసిపోయానో నీకు తెల్సు.నాకే తెలియకుండా నా తోడుగా నిలిచావునాగుండమేల్లో దైర్యాన్ని నింపి..ప్రపంచంలో ఇలాంటీ స్నేహాన్ని పొందిన నేను  ఏంత అదృష్టవంతున్నో అని మురిపోతు క్షనానే ఒక్కసారి అవమానం అనేకత్తులతొ కసిగా పొడిచావు అది చాలదన్నట్టూ వాడితో మాటలు నీవే అనిపించావు కదా..నిన్ను మర్చిపొమ్మని ఇప్పుడు ఎందుకు నన్ను అడుగుతున్నావు..నన్ను వీడి పోవడానికి కావాలని అందరిలో నన్నెందుకు అవమానిస్తున్నావు..వాడికంటే అతవెటకారమైనదా నాస్నేహం వాడి బాదల్లొ నీవుంటావు.. "నీజీవితానికి "వాడో మార్గదర్శి కదా మరి నేను మీరు చేసే అవమానానికి బలైన అర్బకున్ని చేశావుగా అంతలా చూస్తున్నావెందుకో ప్రియా..నువ్వు అల లా నన్ను కలిసి ఒక కల లా కరిగి పోయినా ..నువ్వు వదిలిన నీ జ్ఞాపకాలు నిన్నే గుర్తుచేస్తున్నాయి నేస్తం మరలా దొరకని నీ స్నేహం కోసం ఎదురు చూస్తోంది నా హృదయం...కన్నీరు ఒలికి  చెదిరిన  అక్షరాలు ముద్దగా అయ్యాయికంటిని ఆకట్టుకున్న చిత్రాలు విచిత్రాలైగుండెను పిండేసే  కావ్యాలుగా మారాయిమూగగా రోధించే  నీజ్ఞాపకాలు నా గుండెల్లో రక్తనమూనాలుగామిగిలిపోయాయి  మౌనంగా నీకన్నీ తెలుసు కాని తెలియనట్టు నటిస్తావు .... ఒకప్పుడు నీకేం తెలియని అమాయకురాలివి  కాని ఇప్పుడు  ఎప్పుడు ఎక్కడ గుండెలమీద కొడితే భాదపడాతనో తెల్సి మరీ గుండెళ్ళో అవమానించి  అక్రోశించేలా చేస్తున్నావు .. అన్నిటిలో నన్ను బ్లాక్ చేశావు ..నా మనసును బ్లంక్ గా మార్చావు ... మనసునే ఏమార్చావు ...బాపు బొమ్మవని మురిసిపోయా ప్రేమబందానికి నీవో సింబల్ గా నాగుండెల్లో శాశ్వితంగా నీపేరు రాసుకున్నా... నీ చిరునవ్వులు ఇప్పుడు నావికావునీ ప్రేమ పిలుపులు నావికావు ఇప్పుడునీ ఆప్యాయమైన పలుకరింపుల్లోఎవరో చేరారు.. వాళ్ళకోసమేనీ మనస్సు తపిస్తుంది అందుకేనేమో వాడితో కావాలని నన్ను వెటకారంగా మాట్లాడేలా చేస్తున్నావుమీరిద్దరు ఎంతక్లోజో అంటూ నీ చాట్ హిష్టరీ మరీ చూపిస్తున్నాడు నీవే అలా చేయమని చెప్పావేమో కదా....?ఆశించని ఎంతో గొప్ప అందమైన  ప్రపంచంఅని ఊహించుకున్నా , నీవు ఆశించిన  ప్రపంచం ముందు అది ఎందుకూ కొరగాదు. అనుకున్నది నెరవేరనప్పుడు వజ్రాలే అరచేతిలో వాలిపోయినా అవి ఇసుక రేణువులే అయిపోతాయి. అద్భుతమైన పగలు, అత్యంత ఆహ్లాదకరమైన రేయి ఇలా ఏముంటేనేమిటి? అవన్నీ అప్రధానమే. అనసవరమే. అనుకున్నది నీ ముందు వాలిపోయి.కాని ప్రతి కదలికలో నీవిప్పుడు లేవు నన్నొక్కడిని చేసి నీదారు చూసుకున్నావు మరొకరి వంచన చేరి నన్ను ఎప్పుడో మర్చిపోయావు కదూ ..? ఆశించిందే కరువైపోయాక నాకు మిగతావన్నీ ఎన్ని సొగసులు పులుముకున్నా, అవి శవానికి చేసిన అలంకారాల్లాగే ఉంటాయి. ప్రకృతి సహజంగా ఎన్నెన్ని వచ్చి మన ఎదురుగా నిలిస్తే నేమిటి? తన ప్రాణమైన ప్రేయసి తనతో లేకపోతే అంతా ఎడారిలా, అనంతమైన శూన్యంలా అనిపిస్తుంది. ఆ స్థితిలో అతని చూపులన్నీ ఆమె కోసమే వెతుకుతాయి.కాని ఆమె పట్టించుకోని క్షనాలన్నీ కస్సుమని కస్సుమని  గుందెల్లో దిగబడి రక్తం ఓడుతున్నా తనకోసమే తపనపడీ తడబడుతుంది ఇదేనేమో నిజమైనా ప్రేమ అంటే ... ఏంటో పిచి పిచి ఆలోచనలు గుండెల్లో ఒదిగి ఉండాల్సిన భావాలు బాకులై గుండెల్లో గుచ్చుతూనే ఉన్నాయి ..నీవు నన్ను కాదు చీ పొమ్మన్నా ఎందుకో ఇంకా నా మనస్సు నిన్నే కోరుకుంటోంది ,,చూడు నా గుండెచప్పుడుని అక్షరాలుగా మార్చాను ఒక్కసారి చదువు క్రిదరాసిన మనస్సు అక్షరాలు ..కాలం పరుగెడుతూనేగడియారం ముల్లు ఆపినంత మాత్రానకాలం ఆగమంటే ఆగుతుందానీవు వస్తాను అంటే కాలాని ఆపేస్తాఎందుకంటే ఆక్షనంలో నీవు నాతొ వుంటావనిచిన్న ఆశ..ప్లీజ్ ఒక్కసారి రావూకాసేపు…కాసేపంటే కాసేపేఅందుకే అన్ని పనులు  పక్కన పెట్టినీకోసం ఎదురు చూస్తుంటామనం కలిసే ఆ  రోజును నా కోసమై జన్మించనీకొన్ని క్షణాలను దోసిట్లో నింపుకుని నీకోసం ఎదురు చూస్తున్నాగుండేభారంగా మారింది అందుకే కొద్దిసేపైనానన్ను నేను అభిషేకించుకోనీ….కొద్ది క్షనాలైనా  ఆనంద పడనీఅయినా జరగని సమయం కోసంఆగని గడియారం కోసం ఆశగా ఎదురు చూడటం పిచ్చేమోనిన్నటి రోజున జనించినఆ రాగం సృతి తప్పుతోందినా గుండె గదిలో ధ్వనిస్తూనే ఉంటుందితరిగి పోయిన గతంనన్ను వెక్కిరిస్తుందిమనసు పొరలలో జ్ఞాపకాలు రెపరెపలాడుతూనే వుంటాయిమరో రోజూ అలసటతో విశ్రమించే వరకు….నాలో నీ జ్ఞాపకాలు చేరి చింద్రం చేస్తుంటాయితెగని ఆలోచనల దారానికిఎగురుతున్న జీవితపు గాలిపటంగడియారం ముల్లుల మధ్య చిక్కుకుపోయిందిఈ నిశ్శబ్దంలో నా శబ్దం ఆలకిస్తూనిశ్శబ్దంగా న్స్తేజంగామల్లీ మల్లీ జ్ఞాపకాలి పుడుతూనే ఉన్నాయి 

Friday, December 13, 2013

నిజమైనా ప్రేమ ఎంతటి త్యాగానికైనా సిద్దమౌతుందా....?

ఎదురు చూస్తాను అని తెల్సి తనకోసం  కోసం నిరీక్షించడానికీ మధ్య భూమికీ ఆకాశానికీ ఉన్నంత తేడా ఉంది. నిరీక్షణ ఏదో నిర్లిప్తంగా ఉంచుతుందని కూడా కాదు. ప్రతి సారి నీతలపులు  విలవిల్లాడిపోయేలా చేస్తాయి. ఓ జ్ఞాపకం నిలువునా దహించి వేస్తుంది. ఈ పరిణామాల్లో ప్రపంచంలోని ప్రతిదీ సహజ స్థితికి పరమ విరుద్ధంగా అనిపిస్తుంది. పాలు విషధారలైనట్లు, పూలు రాళ్ల కుప్పలైనట్లు అనిపిస్తుంది. హాయిగొలిపే వసంత రుతువు గ్రీష్మ వర్ణంలోకి మారిపోతుంది, చివరికి గాలి కూడా మారిపోయి ప్రాణాలు తొలిచేస్తుంది. నిజానికి అవి మారడం,మారకపోవడం అనేవి తన జీవితాన్ని ప్రభావితం చేసేవి కావు. తనకు కావలసిందల్లా తన ప్రేమమూర్తి, తన ప్రేమ ప్రపంచం. అందుకే ' నాకు నువ్వే కావాలి. నువ్వు సర్వవ్యాప్తమైన నీ ప్రపంచం కావాలి' అంటాడు ప్రియుడు. నిజంగానే ఆమె తనదై, ఆమెదైన ప్రపంచం తనలో భాగమైపోవడానికి వారికోసం మనవంతుగా ఏం చేయగలం? ఇది ఎవరికి వారు తే ల్చుకోవలసిందే. 

                                                       ఒక్కొక్క జ్ఞాపకం  కోటి కిరణాల్ని విరజిమ్ముతూ లోకాన్ని శోభాయమానం చేస్తూనే ఉంటాయి. కాకపోతే,   తనకు సంబంధం లేనివి అని పట్టించుకోని  ప్రేమమూర్తి ఆమె ఒదిగిన తన ఊహాలోక సుందర ప్రపంచం వేరు. నిజానికి తన జీవితాన్ని సౌందర్యవంతంగా, కాంతివంతంగా మలిచేది తన ప్రియుడి కోసం ఆరాట పడుతుందా.. ఆమె ఆలోచనలు అడ్డదారి పట్టిన క్షనాల్లో ... తనకోసం ఎదురు చూసే మనసొకటి ఉందని గుర్తుంచుకొంటుందా. అప్పుడు వాటిని కూడా ఆసాంతం ఆస్వాదించవచ్చు. కానీ ఆ ప్రేమమూర్తే లేకుండా పోతే, మిగతా ఎన్ని లోకాలున్నా వృథాయే కదా! అలాంటివి ఉంటేనేమిటి? పోతేనేమిటి? అందుకే ఆ ప్రియుడు 'నువ్వు లేకుండా ఇవన్నీ నాకెందుకు? కళ్లు వొత్తులు చేసుకుని, అనుక్షణం ఎదురుచూస్తున్నది నీ కోసమే  తను మరో లోకాన్ని సృష్టీంచుకొని తన ఆనందం వెతుక్కొని వెల్లిన క్షనాల్లో మిగిలి రగిలేది వేదనే కదా

                                              ఆశించని ఎంతో గొప్ప అందమైన  ప్రపంచం నీ ముందే ఉన్నా, నీవు ఆశించిన  ప్రపంచం ముందు అది ఎందుకూ కొరగాదు. అనుకున్నది నెరవేరనప్పుడు వజ్రాలే అరచేతిలో వాలిపోయినా అవి ఇసుక రేణువులే అయిపోతాయి. అద్భుతమైన పగలు, అత్యంత ఆహ్లాదకరమైన రేయి ఇలా ఏముంటేనేమిటి? అవన్నీ అప్రధానమే. అనసవరమే. అనుకున్నది నీ ముందు వాలిపోయి. దాని చుట్టూ మిగతావన్నీ ఉంటే అది వేరు. అప్పుడ వి మన ఆశాద్వీపాన్ని మరింత దివ్యంగా మార్చవచ్చు. ఆశించిందే కరువైపోయాక మిగతావన్నీ ఎన్ని సొగసులు పులుముకున్నా, అవి శవానికి చేసిన అలంకారాల్లాగే ఉంటాయి. ప్రకృతి సహజంగా ఎన్నెన్ని వచ్చి మన ఎదురుగా నిలిస్తే నేమిటి? తన ప్రాణమైన ప్రేయసి తనతో లేకపోతే అంతా ఎడారిలా, అనంతమైన శూన్యంలా అనిపిస్తుంది. ఆ స్థితిలో అతని చూపులన్నీ ఆమె కోసమే వెతుకుతాయి.కాని ఆమె పట్టించుకోని క్షనాలన్నీ కస్సుమని కస్సుమని  గుందెల్లో దిగబడి రక్తం ఓడుతున్నా తనకోసమే తపనపడీ తడబడుతుంది ఇదేనేమో నిజమైనా ప్రేమ అంటే ...

ఫేస్ బుక్ లో అమ్మాయిలకు వలవేస్తున్న నీచులు

తియ్యటి మాటలు అందమైన భావాలు .. అంటూ పొగుడుతూ అమ్మాయిలకు వల ... ఇలాంటి వారినే నమ్ముతున్న  అమ్మాయిలు ఇలాంటి సంఘటనల ద్వారా అయినా నమ్ముతారో లేదో  చూద్దాం

అందరూ స్వార్దపరులే ...వీళ్ళు మనుషులా

వేల మంది నా చుట్టూ చేరి 
గోల చేస్తున్నారు
ఎవరికి వారు సంతోషంగా ఉన్నారు
అందరినీ ఒక్కవేటుతో 

నరికెయ్యాలన్నంత కోపం,
ఒక్కొక్కరిని ముక్కలు 

ముక్కలు చేయాలన్నంత కసి
వీళ్ళేవరికి పక్కోడి 

భాదతో సంబందం లేదు
ఎవ్వడి స్వార్దం వాడిది 

వాళ్ళ స్వార్దం కోసం 
ఎదుటివాన్ని 
ఎంతైనా భాదపెట్టగలరు
మళ్ళీ ఏం తెలియనట్టు 

అమాయకంగా 
నటించనూ గలరూ
 " Selfish" మనుషులే అందరూ 

ఎవ్వరూ వెంట లేకున్నా...
నా దారి రహదారి
ఎంటో నీవు నన్ను ఒంటర్ని

 చేసినప్పటీ నుండి
ఒక్క సారిగా అగాధంలోకి
 ఎవరో తోసినట్టు 
గుండె భారంగా మనసు 
వేదనగా అనిపిస్తుంది

నా ఆలోచనలే నన్ను 

ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి
ఎంతసేపో తెలియని 
ఒంటరి పయనం చేస్తుంటా,
దారంటూ లేని లోయల్లోకి 

నాకు నేనుగా  జారిపోతుంటా
పైకి రావాలనిపించదు
మనసులేని మనుషుల 

మధ్యికంటే ఇదే బెటరేమో కదా


Thursday, December 12, 2013

చెలికాడి చెంతకు చేరి క్షనాలు గుసగుసలాడుతున్నాయి


ప్రేమ చేసిన గాయం ఎప్పటికీ మానదు

 నా ప్రేమ ను
విశ్వప్రేమికులంతా ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంటుంది

ఈ మాటలు ఎక్కడైనా నేనంటే
నా మానసిక స్థితి ని అనుమానిస్తారేమో?
అని కూడా నాకో సందేహం..విశ్వమంత ప్రేమ ఉన్నా విస్వసించలేనప్పుడు..అపార్దాల సుడిగుండంలో ఉండి మనస్సు బండగా మరి మారిన నిన్ను చూస్తూ...యుగ యుగాలుగా నిజాయితీ ప్రేమకు పట్టిన గతేనని విషాదంగా మిగిలిపోయా..నెవెక్కడున్నా హేపీగా ఉన్నావులే అని మనస్సుకు సర్దిచెప్పుకోనా నిజమే ప్రతి క్షనం ప్రతి నిమిషం నిన్నే తలుస్తున్న నన్ను చూసి నీవన్నట్టు నాకు పిచ్చే ప్రేమ పిచ్చి..నన్ను నేను కూడా ఇంతగా ప్రేమించలేదేమో..నామీద కూడా నేను ఇంతాలా ప్రేమించి ఉంటే..నిన్ను ఇష్టపడి ఉండేవాడిని కాదేమో అవును నిజమే "నన్నో షాజహాన్ గానో, శరత్ గారి దేవదాసు గా మిగిలిపొవాల్సిందే ఆకేరక్టరే కరెక్టని డిసైడ్ అయ్యావేమో అందుకే దూరంగా ..నాకు ఏది మనస్సు కష్టమనిపిస్తుందో అదే చేస్తున్నావు...గుండెకు గాయమేకాదు ..గాయానికి  కూడా గండిపెట్టగల మనసులేని మనిషిగా మారావు ఇలాఅని తెల్సిఉంటే నన్నునేనైనా ప్రేమింఉకునే వాన్ని కాని ..నీదాసున్ని అయ్యాకదా ఈ వేదన నాకు తప్పదు....నీచుట్టూ నిన్ను పొగిడేవాళ్ళను పెట్టుకొని అదే ప్రపంచం అని నిర్నయించుకున్నావు కదా ..? పొగడ్త చూసి వదిలేయాలి వాళ్ళనే వెంటబెట్టుకొని గొప్పగా ఫీల్ అవుతున్నావు..ఎదోరోజు అసలు నిజం తెలుస్తుందకదా..? నిజమే పొగడ్తల మద్యి ఉన్నవాళ్ళను ఎదురుగా నిజాలు కనిపించవు..అలాగే నీవు కళ్ళున్న గుడ్డి మనిషిగా మారిపోయావు నేను శాశ్వితంకాదు బట్ నా ప్రేమ శాశ్వితం ఈ కట్టే కాలే సమయానికైనా ఆ నిజం తెల్సుకుంటావన్న నమ్మకం అస్సలు లేదు ఇప్పుడు అందుకీ "ఇంకా నా ప్రేమ ను విశ్వప్రేమికులంతా ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంటుంది " నా ప్రేమలో నిజాయితీ పెద్దగా గొంతులో నరాలు తెగేలా చెప్పాలని ఉంది కాని ...మూగవాన్ని చేశావు....
నా హృదయం
రోదిస్తుందని తెలుసు
నీవు ఎదురుగా లేవని
నీతో పంచుకోవాల్సిన ఎన్నో భావాలు
ఇంకా మిగిలే ఉన్నాయని

నీవు
నన్ను హింసిస్తున్నావు
నీ జ్ఞాపకాలతో గతం
మధురోహల మత్తు
నా నర నరాల్లో
దిగమింగుకోలేకపోతున్న ఊసులు ..>నాకు మిగిలింది రోదించడమేకదా..ప్రేమను నిజాయితీగా ప్రేమించాను..నిండు పున్నమి జాబిలి వని నిన్ను ఎంతగా ఇష్టపడ్డానో అంతగా పట్టపగలు సూర్యిన్నే నీలో దాచుకొని మనసు దోచుకొని జ్ఞాపకాలతో దాడి చేస్తూ గాయం చేస్తూ మురిసిపోతున్నావు అందుకేనేమో నాగాయలైనా నీ నవ్వే నాకు ముఖ్యిం ణాది ఒక ఫ్రెమెన కద "ఒక ప్రేమేనా
ఒక అబద్దం ఒక అస్పష్టతేనా
ఒక అయోమయమేనా అని .... అడగాలి
అర్ధం తెలుసుకోవాలి అని
అక్షరాలు కొన్ని .....
అంతరంగలోనే ఆవిరైపోతున్నాయి "కాదు ఆవిరి చేస్తున్నావు...నిలువునా దహించి వేస్తున్నావు నీకు ఏదైనా సాద్యిమే "ఇప్పటికీ నీ ప్రేమ భావనల్లోనే
మధుర స్మృతుల్లోనే ..... రోదిస్తూనే
కన్నీటి ప్రతిబింబాలు .... భావాలు కొన్ని
మనసు గోడల్లోనే ఇంకిపోతున్నాయి! " నాకన్నీరు రక్తంగా మారింది ప్రియా

Tuesday, December 10, 2013

గుడ్డిగా గుండెను తడుముకొంటూనే ఉన్నా

ఉదయానికీ ..పగపట్టిన 
పగలుకు మధ్యన
ఊసుపోని 

చిరిగిపోయిన గతంలోకి
వడగాలి 

సుడి గాలుల్లోకీ
ఎండిన గుండె 

చెమ్మ తగలగానే
భూమిలో నాటిన 

విత్తనాల్లా విస్ఫోటనం జరిగి
కొత్త జ్ఞాపకాల చెట్టు 

మొలకెత్తుతుంది
ఊహల ఎక్కిళ్ళకు..

వాస్తవల నీల్లను చల్లి
సేద దీర్చే మెత్తని భుజం కోసం
గుడ్డిగా గుండెను తడుముకొంటూనే ఉన్నా

Monday, December 9, 2013

చీకటి గుహలలో ఒకరికోసం ఒకరం

చీకటి గుహలలో 
ఒకరికోసం  ఒకరం
వెర్రిగా వెతుకులాడుతూ..
కనబడగానే కంగారు పడుతూ
ఒకరినొకరు ఊహల్లో 

తడుముకుంటూ..
మన గతాల లోతుల్లోకి  

ఒకరికి తెలియకుండా 
ఒకరం లోయల్లోకి జారిపోతూ
ఎవరికి వారు ఒంటరిగా

ఒకరికొకరు ఆసరాగా ఎగబాకుతూ

ఏదో తెలియని అలజడి ఆక్రమించేస్తుంది
చెప్పాలనుకున్న మాటలు గొంతులో
ఇరుక్కపోయి మాటలను 

ముక్కలు చేస్తున్నాయి
నేను అనే మనిషిని 

మనం నించి విడిపోయి
నన్నెలా మరిచిపోయావనే 

ప్రశ్నకు సమాదానం
చెబుతావేమో అని ఓ చిన్ని ఆశ ...


నా మనసెప్పుడూ గాజుపలకే
పగులుతూనే ఉంటుంది..
ఎందుకంటే ఎప్పుడూ
పగులగొట్టాలనే చూస్తున్నావు కాబట్టి
అందుకే అవి ముక్కలు 

ముక్కలవుతూనే ఉంటాయి…
ఒక పారదర్శకమైన పొర 

నాకు కవచమైందిప్పుడు
మనసును  చుట్టి ఉంచుతుంది.
ముక్కలు చెల్లా చెదరైనా
నేలరాలకుండాఆ పొరలోనే 

ఇరుక్కపోయాయి...
ప్లీజ్ కనీసం ఆ ముక్కలనైనా నాకివ్వవా

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(32)

1) నీ ప్రతి తలపు రేగుతున్న గాయాలై..గుండె నిండా
భారమైన గాయాలై ఎదురు చూస్తూ నా కన్నీరెక్కడా అని అడుగుతున్నాయి


2) కోపాన్ని దుప్పటిలో కప్పేసి.. కన్నీటితో
నీకై ఎదురు చూస్తున్నాను.. నిద్రలేని ఈ రాత్రిలో


3) ఆనందమో విషాదమో నాకూ తెలీదు
నాకు నేనుగా నీలో సంలీనమై ఏం చేయలేక ఏకాంతంలో మిగిలిపోతాను


4) ఎప్పుడు తెరిస్తేనేం ఆలోచనల తాజాదనాన్ని నింపుతూ
రేపటి ఆలోచనల కిటికీలను తెరుస్తూమదిలో తెలియని గందరగోళం


5) సందేహాల గాలికి మన మనసులు
కొట్టుకుంటూనే ఉన్నాయి నీలోను నాలోను


6) ఒకరికొకరం దూరమౌతున్న క్షనాల్లో
మదితలపుల్లో పలుచని ఆర్ద్రత మండి నన్ను దహించి వేస్తుంది


7) మన మధ్య ఘనీభవించిన మౌనాన్ని
అక్షరాలతో కరిగించి కాలాన్ని శాసించాలని చూస్తున్నా


8) కాలం పేజీలను తిప్పుతుంతే
ప్రతి పేజీలో చిరుగులే కనిపిస్తున్నా ఎందుకనో చెప్పవూ


9) ఏంటో మెలుకువతో ఉన్నప్పుడు బ్రతికుంటూ
నిద్రపోయినప్పుడు చనిపోతున్నా ఏందుకో చెప్పవూ...?


10) ఇంకా నా కళ్ళలో ఏమున్నాయని
కళ్ళను విదిలిస్తున్నావు కన్నీళ్ళన్నీ అయిపోయాయిగా


11) నేను చెప్పాలనుకున్న మాటల్ని మింగేసింది మౌనం
గుండెల్లో అలజడి రేపుతూ నిశ్శబ్దం వేదించి సాదించిదేమిటో..?


12) ఎటునుంచైనా అసలైన రహస్యిం జారిపడీ
గుండెల్లే మంటను చల్లారుస్తుందేమో అని ఎదురు చూస్తున్నా


13) బోర్లించిన మనసు పుస్తకంలోంచి
జ్ఞాపకాలను దొర్లిస్తూ నిశ్శబ్ధం రోదిస్తుంది ఎప్పుడూ


13) బరువైన నీ కను రెప్పల్లో జారే జ్ఞాపకాలను
పదాలుగా చేసి వడిసి పట్టుకొని కవితలుగా రాయాలని ఉంది


14) నిశ్శబాన్ని జాగ్రత్తగా దొర్లిస్తూ
మదిని వడకట్టేస్తూక్షనాలమీద ఇప్పుడేం రాయను


15) అలవాటుగా వెనక్కి తిరిగి చూసుకుంటే
అంతా కలగాపులగంగానే..గదరగోళంగా వుందేమితో


16) అక్షరాలు పదాలుగాపదాలు వాక్యాలుగా
అల్లుకుంటూ అల్లుకుంటూ..పోతుంటే అర్దాలు మరిపోతున్నయేంటో


17) నా గది లోపల.. మౌనంగా రాసుకుంటున్నాను
నన్ను నేను శోధించుకోవడమనే పనిలో నిమగ్నమై ఓడిపోయిన క్షనాల్లో


18) ఒక్కొక్క అక్షరాన్ని రాసుకుంటూ పోతున్నప్పుడు,
ఎవరో నన్ను తడుముతున్నట్లు వింత వింత అనుభూతి


19) లెక్క తేలని నక్షత్రాలలో తప్పిపోయినట్టున్నా ఇప్పుడు
ఈ రాత్రి కొబ్బరాకుల సందు నుంచి నిద్రను వెతుక్కుంటూ
నేను 


20) చీకటి రాత్రుళ్ళు లోలకానికి అతుక్కుపోయినట్టున్నా ఇప్పుడు
అవును కాదుల నడుమ ఊపిరి సలపనంత ఊపిరి ఆగిపోయేంతగా ఊగిసలాట…


21) తడమకపోయినా తట్టిలేపుతున్న ఆ తలపులు
పాతుకుపోయిన నీ జ్ఞాపకాలు వెంటాడి వేదిస్తూనే ఉంటాయి


22) ఎన్నిసార్లు అనుకుంటానో ఆ క్షణాలను తిరిగి
రాయగలిగితే చాలని...కాని అక్షరాలెందుకో సహకరించడంలేదు


23) మనసు ఆల్బం తెరచి చూసి
జ్ఞాపకాలను సుతారంగా మదిలో తలచుకొంటే తెలియని వేదన


24) అపుడో ఇప్పుడో..మనసు భారమైన క్షణానో
కన్నీరు ఉప్పొంగుతున్న నిమిషానో నన్ను మరిపిస్తున్నాయి నీజ్ఞాపకాలు


25) చీకటిలో చూసినా వెలుగులో చూసినా,
నాకు నేనే కానీ నీవు కనిపించవుగా ఎంత వెతికినా


26) మనసు పోటుకీ..గెలుపు బాటకీ..ఒక్క నిర్ణయం ఒంటరి ప్రయానమే

27) పదాలు పేర్చిన మారణాయుదం
ఒక్కటి చాలు మనసుని పేల్చి ముక్కలు చేయడానికి


28) ముసురు కొరడాలతో గాట్లుపడిన మబ్బులు
ఎండవేడికి కరిగిపోతున్నాయి...వాడి వేడికినిలవలేక..?


29) మన జ్ఞాపకాలు కత్తులై మరణంతో జతకట్టమంటున్నాయి
నీవు వదలి వెల్లినవేగా నాకు తప్పేట్టు లేదు నీకేం నీవు బానే ఉన్నావు..?


30) మన జ్ఞాపకాల జన్మదినం దగ్గరలోనే ఉంది
మనసు ఉక్కిరిబిక్కిరి అవుతుంది..ఆరోజొస్తావు కదూ


31) జ్ఞాపకాలు జాతర జరుపుతున్నాయి
మనసు బెంబేలుపడుతుంది నీకోసం ఎక్కడున్నావు నీవు


32) నీ మనసనే ఏడారిలో నా జీవిత జాడలు
నీకోసం మిగిల్చి పోతున్నా నాకోసం వస్తావు కదూ..?


33) మనసనే పూలతోటలో
అనుభూతుల విరులన్నీ ఎండిన ఆకులైయ్యాయి


34) మనిషినే కాబట్టే మనసును చంపుకొని
కాలం కసిగా తొక్కినా.. బొద్దింకలా నీకోసం పరుగెత్తుతున్నా


35) గుండేభారంగా మారింది అందుకే కొద్దిసేపైనా
నన్ను నేను అభిషేకించుకోనీ….కొద్ది క్షనాలైనా ఆనంద పడనీ ప్లీజ్


36) కొన్ని క్షణాలను
దోసిట్లో నింపుకుని నీకోసం ఎదురు చూస్తున్నా


37) ఏకాంతంలో విశ్రమిస్తున్న సమయంలో
నాలోని నీ జ్ఞాపకాలు గుండెల్లో చేరి చింద్రం చేస్తున్నాయి


38) తరిగి పోయిన గతం నన్ను వెక్కిరిస్తూ
మనసు పొరలలో జ్ఞాపకాలు రెపరెపలాడుతూనే వుంటాయి


39) గడియారం ముల్లుల మధ్య చిక్కుకుపోయింది
ఈ నిశ్శబ్దంలో....గుండె చప్పుడునుకూడా భరిచలేకున్నా


40) తెగని ఆలోచనల దారానికి ఆసరా అయిన
ఎగురుతున్న జీవితపు గాలిపటం గమ్యిం ఎటువైపో


41) జ్ఞాపకాల అరలలో పేర్చిన స్మృతుల దొంతరలు
తరచి చూసిన ప్రతిసారి కాలం కరిగిపోతుంది మనసు చలించి గుండె జారిపోతుంది


42) నిన్నటి అనుభవం వెక్కిరించింది
నేటి భావం నేరగాన్ని చేసి నవ్వుకొని మురిసిపోతుంది


43) భద్రంగా దాచేసుకున్నా గడిచిపోయిన గతంలో
నిజాలైన నిట్టూర్పుల సెగలు కన్నీటి దారలలో అలకబడిన అక్షరాలే అన్నీ


44) కరుడు గట్టిన కటినమైన నీమాటలతో
చిల్లులు పడ్డ గుండెలతో చిట్లిన మెదడు నరాలతో నేను..?


45) నగరం నడిబొడ్డున కాంక్రిట్ జనప్రవాహం లో
నువ్వునడుస్తున్న దారి పక్కనే నేనున్నాగుర్తు పట్టవెందుకని...?


46) గతించిన కాలం వెక్కిరిస్తూ గతమెరిగిన జీవితం
'నేను 'ని శాసిస్తుంది..నీవు అనే గతం ప్రస్తుతాన్ని మింగేసి ఒంటర్ని చేసింది


47) మది చెమ్మ గిల్లిన కల్లతో తో చేదు అనుభవాలతో
చావుకు చేరువలో ఉండి చరిత్ర పుటల్లోంచి తప్పుకునేందుకు సిద్దం అయ్యాను


48) వీడు ..వీడుకాకపోతే వాతే వాడు
వాడు కాకపోతే వాడమ్మ మొగుడు.."చీ" దీనమ్మ జీవితం


49) జీవితపుస్తకం లోంచి ఓ పేజీ అర్థాంతరంగా చిరిగిపోయింది
నా హ్రుదయ ఘోష గొంతులోనే మూగబోయి మౌనంగా రోదిస్తుంది


50) నువ్వు లైలావో కావో - నేను మజ్ఞూనే...అనార్కలివో కావో నేను సలీంనే
పార్వతి ఔనో కాదో నేను మాత్రం నీ దాసుడను.. నీకై పరితపించే దేవదాసును


51) తీరం తెలియని ప్రయాణం లో పరుగులు పెడుతూ
అలసట తీరని మజిలీలల దప్పికతో దహించుకుపోతున్నా


52) అసలైన నిజాన్ని గుండెల్లోదాచేసే
నల్లని అఙ్ఞానపు ముసుగులు కప్పుకొన్నావెందుకని


53) నువ్వెలా వెల్లిపోయావు"బుజ్జి" చిటారుకొమ్మన ఙ్ఞాపకాల ముడుపుకట్టి
సుడులు తిరిగే నా కన్నీళ్ళని జాలిగా చూస్తూ.. నేనెవరో తెలియనట్టు వెల్లిపోయావేంటో


54) నీకూ నాకూ మధ్య యుగాల దూరం
మాటలు కరువయ్యి మనుషులు చొరబడ్డారుగా


55) కుట్లుపడ్డ పెదాల మీద రక్తం చిమ్ముతూ గులాబీలా
విచ్చుకుందో వెటకారపు చిరునవ్వు గుండెల్లో దిగిన గునపంలా


56) మన తీపి అనుభూతులు జ్ఞాపకాలుగా మారాయి
మౌనన్ని మంత్రంగా వేసి జ్ఞాపకాలను గుండెలో గుచ్చుతూ తియ్యని గాయం చేస్తున్నావు.


57) తెలియని భారమేదో గుండెను బాధపెడుతుందెందుకో
ఎరుపెక్కిన నా కన్నులలోని రక్తఛార ఇంకా నా కనుపాపల నుండి చెరిగిపోకుంది


58) నీ మనసు ఎడారిలో నా ప్రేమ దాహం తీర్చుకోవాలనుంది
నా మనసు నీ దగ్గర లేదని తెలిసి కూడ ఏదొ గెలవాలని ఆరాటపడుతుంది,


59) నీ ఊహలతో బ్రతికే నాకు తెల్లవారుతుంటే భయం
ఓ నిజానికి సాక్ష్యింగా..చీకటి చీకటి గానే ఉండిపోతే ఎంత బాగుండు అనిపిస్తుంది


60) ఏడ్చి ఏడ్చి గుండెలో ఇంకిన జ్ఞాపకం నిజం
కన్నీటి లో దాగున్నసాక్ష్యం వెన్నెల రాత్రుల్లలో రాలిపోతుంది బూడిదై


61) గడచిన కాలం అంతా నీతో గడిచిపోతూ..నిన్నే తలస్తూనన్ను నేనే మరిచిపోతూ
కాలం తెలియని సమయం..ఇంకెంత దూరమో తెలియని పయనం ఎప్పుడు ఆగుతుందో..?


62) గతం ఎప్పుడూ నన్ను గద్దిస్తూ...ప్రస్తుతం నన్ను బెదిరించి భయపెడుతుంది

63) గతాన్ని చెరిపేసుకుంటూ భవిష్యత్తుని తనకి తనే రాసుకుంటూ
కాలంపరిగెత్తుతోంది నాకు మాత్రం నీ జ్ఞాపకాల్ని మాత్రమే మిగిల్చి వెక్కిరిస్తోంది


64) నీ స్నేహం కోసం ఎలాగూ పడిచస్తానని పరాచికాలాడుతున్నావో,
నా ఆరాటం చూసి అలుసుగా తీసుకొని ఆడిస్తున్నావో తెలియట్లా మరి...?


65) చల్లని నీ చిరునవ్వులకోసం నేను తడుముకొంటూ
ఎన్ని సంధి ప్రయత్నాలు చేసాను..అన్నీ ఎండిపోయిన ఆకులైయ్యాయి ఏంటో


66) నువ్వు కావాలని నన్ను దాటిపోయిన క్షనాల్లో
నీ చల్లని పిలుపు కోసం ఎన్నిసార్లు మరణిస్తానో నీకు తెలుసా..?


67) నీవు విసిరేసిన ప్రతి జ్ఞాపకంలోంచి నేను మొలకెత్తాలి అనుకొంటాను
నీవు నా ప్రతి జ్ఞాపకాన్ని తుంచేస్తుంటే రక్తం ఓడుతున్న జ్ఞాపకాలకేమని చెప్పను


68) రాత్రి మబ్బుల దాచిపెట్టిన నక్షత్రాలన్నిటినీ,
పగలు దోచుకెళ్ళి ఇప్పుడూ చీకట్లొకి విసిరేశావు ఎందుకని


69) నా రక్తాక్షరాల ఉత్తరాన్నందిస్తే నీతో నాకేం పోవోయ్ 
పిచ్చోడా అన్నావు నీవేదైనా అనగలవు..నీకేదైనా సాద్యమే కదా 

70) అటు ఇటు చూసి ఎవ్వలేనిది చూసిన నీ జ్ఞాపకం
హటాత్తుగా తనలోకి లాగేసుకొని నన్ను చిత్తడి చేస్తోంది కాపాడవూ..?


71) కమ్యూనికేషన్ గ్యాప్ లో చిక్కుకుపోయి కంగారు పడుతున్నా
కన్నీటితో అక్షరాలను అలికెయ్యాలనుకున్నా కన్నీరు కరువైంది కాస్త అవువివ్వవూ


72) ఆనందం కన్నీరుగా దోసిట్లో నింపాలని చూశాను
చూస్తే చేతినిండా ఏర్రటి రక్తం వేడిగాబుసలు కొడుతోంది ఎందుకో


73) నా జ్ఞాపకాల ఘనికి కొల్లగొట్టాలని చూస్తున్నారు
అది నీవు పంపిన మనిషేనా...ఎందుకింత నీచానికి దిగజారావో చెప్పవూ...?


74) నీ నిశబ్దపు గోడలను తడుముతున్న నా మౌనభాష
చీకటి రాత్రుళ్ళు పై కదిలాడే నీలిమబ్బులచాటున దాగి రోదిస్తోంది


75) ఓర్చలేని భాదలో ఆ కవిత అక్షరాలు చుట్టుకుని
బయటపడిన క్షణం తనివిదీరా ప్రతి అక్షరాన్ని ఆత్రంగా తడుముకుంటున్నా


76) ఎన్ని నిద్రలేని రాత్రులు...ఎన్ని బరువెక్కే ఆలోచనలు
ఎన్ని అంతర్మధనాల రోదనలేన్నో నీకు ఎందుకు వినిపించడంలేదో చెప్పవూ


77) నా మనసు పొరలు చీల్చుకుని
బయటకు వచ్చే ఈ కవితకు ఏమని పేరు పెట్టను చెప్పవూ


78) ఏంటో ఎన్నాళ్ళిలా దిక్కులు చూస్తూ
చుక్కలు లెక్కెడుతూ కాలం గడపడం కాస్త చెప్పవూ


79) ప్రతిపగలూ నిరీక్షణలో క్షణాలు లెక్కెడుతూ
చీకట్లో చిరిగిపోయిన జ్ఞాపకాలను లెక్కబెట్టుకుంటున్నా


80) నా స్నేహపు గాయాల శకలాల మీద
పెట్రోతో దహించి వేసి నీవేం సాదిస్తావురా..నీకిదేం ఆనందం


81) హృదయం పగిలిల ప్రతిసారీ
అక్షరాలు ఒరిగి పోతున్నాయి నలిగిన జ్ఞాపకాల్లా


82) నాలోని శబ్దాన్నంతా బయటికి పంపేసి
నిశ్శబ్దాన్ని నింపెయ్యాలనే చూస్తున్నా నాలో నేను ఓడిన క్షనాల్లో


83) ఒంటరినైనపుడు నన్ను ఓదార్చే జ్ఞాపకాలు
జీవితపు సుడిగాలిలో చెల్లాచెదరై పదునైన కత్తులై గాయాలు చేస్తున్నాయి


84) కను రెప్ప క్రింద..గులాబీ వనంలో
రాలిపడినవీ నీటిబిందువులు కన్నీరై కనుమరుగౌతున్నాయి


85) జ్ఞాపకాల గనుల్లో..మన మాటల కోసం తవ్వకాలు మొదలెట్టాను

86) అంతులేని భాధతోఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడక చనిపోతానేమో
అనిపించినప్పుడు కనిపించకుండా మాయం అయిపోయి ఎంత త్యాగం చేశావు...?


87) చేరువైన నేస్తం నీవు నన్ను ఒంటరిగా వదలి వెల్లి
నీ ఙ్ఞాపకాలు ముసురుకుని చీకట్లో కూర్చున్నప్పుడు ఎందుకు వెక్కిరిస్తావు


88) ఏంటీ గందరగొళం ఏంటీ అవంతరాలు అవరోదాలు
దేవుడా చాలు ఈ పరీక్షలు..ఇకనైనా చెప్పు నన్ను ఎందుకు పుట్టించావ్?


89) ఒంటరి తనాన్ని కావలించుకుని చీకట్లో పడుకున్నా
అక్కడ కూడా అదే నవ్వు కలలో కూడా అదే నవ్వు అదే ఆలాపన ఎప్పుడూ


90) చీకటి కూడా వెలుగుకేసి నడుస్తుంటే,
నా నిరాశ నాకెక్కడి చుట్టమో వెలుగులోనూ చీకటే కనిపిస్తుంది


91) అడక్కుండానే మనసులోకి చొరబడి..చెప్పకుండానే గుండె చీల్చి...
గతాన్ని కెలికి వెల్లిపోయావ్ ఇంతకీ నువ్వు నాతోనే ఉన్నావా ? లేవా ?చెప్పవా ?


92) గడిచిన నిమిషంలో ఏదో ఫోన్ మాట్లాడుతూ
నిన్ను 100 సార్లే తలుచుకున్నా ఈ ఒక్కసారికి నన్ను మన్నించవా


93) నీ జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా
గుండెల్లో నిప్పులు పోసినట్టు తట్టుకోలేనంత భాద


94) చేజారిన దాని కోసం బాధ పడుతూ..ఆవేశపడుతూ
అందని దానికై ఆరాటపడుతూ...అందోళన పడితే గతంతిరిగి వస్తుందా


95) నీవు పారేసిన అక్షరాలను ఏరుకుంటున్నా
అవన్నాజ్ఞపకాలై నన్ను ఓదారుస్తాయేమో నని చిన్నిఆశ....?


96) ఏంటో సమయం జారిపోతుంది
అప్పుడే పడ్డ వాన చినుకులా నాకందకుండా


97)  నేను నేర్చుకున్న భాషలన్నీ మర్చిపోయానిప్పుడు
నీతో మాట్లాడేందుకు ఒక కొత్త భాషని సృష్టించుకున్నా అదే మౌన భాష


98) ఎన్నాళ్ళయింది లెక్క తేలని 
నక్షత్రాలలో  తప్పిపోయినట్టున్నా ఇప్పుడు 

99) జ్ఞాపకాలను కౌగలించుకుని
పరితపిస్తున్న నామనసు న నీకు చేరలేదా


100) నిద్రను వెతుక్కుంటూ
జాబిలమ్మ ఒడిలోకి చేరి నీ చెక్కిల్లను ముద్దాడుతూ 
నేను