మరణం నాకు వరమే
నీ మాటలు కరువైన వేళలో
బ్రతుకు నాకు శాపమే
నీ పెదవులపై చిరునవ్వు మాయమైన క్షణంలో
ఏకాంతం నాకు మిత్రుడే
నీ అడుగులు నన్ను విడిచిన వేళలో
సానిహిత్యం నాకు శత్రువే
నీ చూపుల కెరటాలు నన్ను తాకని క్షణంలో
శూన్యం నాకు దైవమే
నీ తలపుల తలుపులు మూసుకుపోయిన వేళలో
లోకం నాకు కలయే
నీ ఎడబాటు వాకిలి ద్వారం తెరచుకున్న క్షణంలో
యుగం బాటు సాగిన ఆ జీవనం వ్యర్ధమే
నీ మమతల చిరుజల్లు కురవని వేళలో
జీవితం ఓ క్షణమైనా భాగ్యమే
నీ లాలన పొందే క్షణంలో