. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, January 31, 2013

ఆ 'జాబిలి' వైపు ఆరాదనగా చూస్తూ

ఓ ప్రేమ 'జాబిలి' నీ చల్లదనం నాక్కావాలి
నీకోసం తపన పడుతున్నా నేనొక ప్రేమ బాటసారి.

నీవొక ప్రేమ జాబిలి.వెన్నెల సిరిమళ్ళివి..నీ చెలికాని చేరరావా
నీ నవ్వుల వెన్నెల్లు నాపై కురిపించి నా మదిలో అలజడి రేపావు..!
కానీ,నా జీవితపయనంలో 'ప్రేమ' మజిలీ రగిలించి ఎక్కడ దాక్కున్నావు జాబిల్లి

ఆకసాన అందంగాఅందమైన 'జాబిలి'ని చేరుకోలేను
చెంత చేరాలి అన్న ఆశను చంపుకోలేను ప్రియా
నీవు నా గుండెలో చేసిన తీపి గాయాల గురుతులను చెరుపుకోలేను.
అందుకే,ఆ 'జాబిలి' వైపు ఆరాదనగా చూస్తూ.. చూస్తూ..
నిన్ను ఆరాధిస్తూ..అభిమానిస్తూ..ఈ చిన్ని ప్రాణం విడుస్తున్నా

Monday, January 28, 2013

సగం కాలిన శవాన్ని నేను ప్రియా


నిన్న కోసం మొన్న
నేటి కోసం నిన్న
రేపటి కోసం నేడు
బాధ పడుతూ జాలి పడుతూ
ఆవేశ పడుతూ అసహాయతతో
ఆందోళనతో బ్రతుకుతున్న
బడుగు జీవిని నేను ప్రియా

జీవితాన్ని జీవించలేక
వర్తమానంతో పోరాడ లేక
బ్రతుకు నడుస్తున్న బానిసను నేను
హృదయమే అడవిగా
మనసే ఎడారిలా రెంటికీ చెడ్డ
రేవడిలా భవిష్యత్తు భయంతో
బ్రతికే భ్రష్ట జీవిని నేను ప్రియా

కళ్ళుండీ కనపడనీ,
చెవులుండీ వినబడనీ
హృదయముండీ
స్పందించని మనసుండీ
మమత పంచని నిన్నడగలేని
నిర్బగ్యున్ని ప్రియా నేను

నీకై అడుగు ముందుకెయ్యలేని
అభాగ్య జీవిని నేను
నీతో మనసు విప్పి ఎవరు మాట్లాడినా
నా హృదయం తట్టి ఎవరు నిద్ర లేపినా
అర్థ చేసుకోలేని..ఆమోదించలేని
నేను బ్రతికున్న శవాన్ని
నా మనసంతా నిర్జీవమే
అందుకే అంటున్నాను
సగం కాలిన శవాన్ని నేను.

నాలో నీవున్నావు ప్రియా


నిన్ను చూడాలనే మనస్సు
తపన పడుతోంది..
ఆత్రంగా నీ కోసం 
మనసు తడుముతోంది 

మాయని మచ్చగా  
నిలచి పోయిన
నీజ్ఞాపకాల సాక్షిగా

ప్రియా 

నాలో నీవున్నావు 
నీలో నేనున్నానా
లేకపోయినా వున్నాని చెప్పవూ  

నువ్వు మొహం చాటేస్తే 
నిన్ను చూడలేననుకున్నావా
నాలో ఉన్ననిన్ను ప్రతిక్షనం 
చూస్తూనే ఉంటాగా ప్రియా 


Sunday, January 27, 2013

ప్రతీ రాత్రి ...లోకం అంతా నిదురపోతోంది ఒక్క నేను తప్పఈ నిశీధి లో
ఎన్ని రాత్రులను
కరిగిపోతున్నాయో
కాదన్న వాస్తవాల సాక్షిగా

నీవు దూరం అవ్వడం

దూరమవుతావో అని
భయపడ్డ క్షనాలు దగ్గర అవ్వడం
బరించడం చాలా కష్టం
భావాలను బందిచాలనే
విఫల ప్రయత్నంలో
వేడెక్కిన గుండే సాక్షిగా

ప్రతీ రాత్రి 

లోకం అంతా నిదురపోతోంది
ఒక్క నేను తప్ప 
నీవు నిద్రపోతూనే ఉంటావు
నీ ఆలోచనతో నేనున్నా
నా ఆలోచనలు నీకులేవుగా ప్రియా....?

నీ జ్ఞాపకాల సంకెళ్ళు

నాగొంతులో గుచ్చుకున్నాయి
మాట పెగలడంలేదు..
మనసు మాత్రం రగులుతోంది
అందుకే కాబోలు మాట పడిపోయింది

అందుకే పొద్దు పొడవని 

రాత్రుల్లు కావాలి
రాత్రుల్లు చీకట్లో 
ఒక్కడిగా మిగిలిపోవాలి
కాదనలేని నిజం కసుక్కున 
గుండెల్లో దిగబడితే
కదల్లేని బావాలు
నన్నే కసుకుంటున్నాయి

నీండు జాబిల్లి 

నీవెవరని అడుగుతుంది 
సమాదానం లేనిప్రశ్నల్లో
సర్దుకొని పోనా..
నిన్ను సాదించే కున్నందుకు
నన్ను నేను శిక్షించుకోనా ప్రియా

నన్నేప్పుడో చంపేశారు..ఒకసారికాదు రెండుసార్లు


ఎన్నో నెలలుగా వెతుకుతున్నా
అయినా దొరకడంలేదు..
నేను పారేసుకున్న మనసుకోసం కాదు


చుట్టూ ఎముకల గూళ్ళు
చుట్టూ చచ్చి పడిన శవాలు
ఎంతవెతికినా నాకింకా దొరకనేలేదు
నాదగ్గరకూడా చచ్చిన శవం వాసనే

నన్నేప్పుడో చంపేశారు
ఒకసారికాదు రెండుసార్లు
చంపడం వాళ్ళకిష్టంకాబట్టి ఇలా అయ్యా 
ముక్కలైన శవంలా

ఎందుకో ఒక్కసారి గతం గిర్రున తిరిగింది
ఇష్టం అని చెప్పిన మనిషి
ఎవరి వంచనో చేరి నన్ను చంపేసింది
వాడు నన్ను చంపుతుంటే తనూ నవ్వుతూ
నామీద దారుణంగా దాడి చేసి చంపేసి 
నవ్వుతూ వెళ్ళీపోయారు..అప్పుడే ఓ వింత

కొసప్రాణం ఉన్న నన్ను
ప్రాణం పోసింది..ఓ అందాల బొమ్మ
నన్ను నేను నమ్మలేనంత ప్రేమ చూపించి
ప్రపంచంలో ఇంతలా ప్రేమించే వాళ్ళుటారా అన్నంత
నిజం అని నమ్మా ..
ఆ నమ్మకం నిజంకాదని కొద్దిరోజులకే తెల్సింది

అంతే తనూ అంతకంటే దారూణంగా
చంపేస్తుంది..సేం.. మళ్ళీ దారుణంగా
 అందరిలోఅవమానిస్తూ ..
వెటకారమనే పదునైన కత్తులతోదాడి .
తనెప్పుడైనా ..జాలి పడుతుందేమో అని
తనవైపు జాలిగా చూశా..లేదు
ఆచూపుల్లో ఏం అర్దం చేసుకుందో
మళ్ళీ బంగారం అంటూ ఎవరినో తీసుకొచ్చి
దారుణంగా అతనితో చేరి దాడి చేసింది
ముక్కలు ముక్కలుగానరికేసింది నన్ను

అవును తనూ మనిషేగా..
అందుకే మనిషిలా చేసింది
తనతప్పేముంది చెప్పు..నిజాన్ని ఒప్పుకోవాలిగా..?

ఇప్పుడే నాశవం తాలూకా ముక్కలు 
ఏరుకొచ్చి కుప్పకుప్పగా పెట్టుకున్నా

కాని నేను అనుకున్నది దొరకలే 
ఎంతవెతికినా దొరకలే..
చుట్టూ శావాలే..
నేను వెతుకుతునంది మాత్రం దొరకలేదు

అదిగో ఎదో కనిపిస్తుంది 
అదేనా నేను వెతుకుతుందని దగ్గరకు వెల్లా
చూస్తే చిరాకేసింది ...అది నా మనస్సు

ఎందుకో ఒక్కసారిగా నామనస్సుమీద
నాకు చెప్పలేనంతకోపం
పదునైన కత్తి తెచ్చి ముక్కలు ముక్కలు చేద్దాం అని
నా మనస్సుమీద కత్తితో ఒక్కవేటు వేశా
నామనస్సు రెండుగా నిలువునా చీలిపోయింది  

అప్పుడో వింత జరిగింది
అప్పటినుంచి నేను వెతుకుతుంది 
కనిపించింది..అదే..నీజ్ఞాపకాలమూట
నీజ్ఞాపకాల మూట నా మనస్సులో బద్రంగా ఉంది
అమ్మయ్యనాశ్రమ ఫలించింది..
నీజ్ఞాపకాల మూటను బద్రంగా తీసుకున్నా

ఓ చెట్టు క్రిందకెళ్ళి కూర్చున్నా
నీజ్ఞాపకాల మూటనూ తీసుకేల్లా
ఎందుకో తెలుసా 
నీవు అన్నావుగా 
మన జ్ఞాపకాలనీ మూటగట్టి పెట్టు
ఏకాంతంలో జతచేరుతా అని
అందుకే ఈ స్మశానంలో
నీజ్ఞాపకాల మూటతో ఏకాంతంగా ఎదురు చూస్తున్నా
వస్తావు కదా ప్రియా..మాట మార్చవుగా..

Saturday, January 26, 2013

నాగుండె గదులన్నీటికీ కూలుస్తున్నా ప్రియా


వీడ్కోలు చేస్తం
శిదిలమై ముక్కలవుతున్న 
మస్సాక్షిగా
అందరూ చేరే ఆచివరి యాత్రకు
దగ్గరుండి వెళ్ళిపో అని చెప్పాక
వెళ్ళలేక వెలుతున్నా
ఉండలేక ఓడిపోయి వెలుతున్నా
ఇప్పటికే నాశరీరాన్ని తూట్లు పొడిచావు
ఎక్కడ ఎలా కొట్టాలో తెల్సిన మనిషివి
దారికాచి దాడిచేశావు నిండా గాయాలతో
రక్తం ఓడుతున్నా శరీరం.
నాశరీరం,హృదయం 
ఎర్రని నిప్పు కనికలా కనిపిస్తోందిప్పుదు

బుజ్జీ బంగారు లేపనం పూసుకొని
ఎంత అందంగా కనిపించావ్
లేపనం పోయేకొద్దీ
నీవు ఇలా 
మనస్సుపై దాడి చేస్తావని ఊహించలే
అప్పుడు దేవుని గుడి సాక్షిగా
ఇప్పుడు నీవు ఇలా ఎందుకని 
అడుగలేను మనసు నీరశించింది

నీవు నాలోకి వచ్చిన క్షనం
నాలోంచి నన్ను వెళ్లగొట్టి మరీ
నిన్ని నా మనసులో దాచుకున్నానే

నాగుండె గదులన్నీటికీ కూలుస్తున్నా
శిదిలం అయిన మనిషిని
చిద్రం అయిన మనస్సుతో
ఘడియలు లెక్కబెట్టుకుంటూ

కాస్త సమం మిగిలుంది
ఏదోరూపంలో దాడి చేయడం నేర్చుకున్నావుగా
మళ్ళీ నీకు ఆవకాశం వస్తుందోరాదో ప్రియా
ఇక్కడిక్కడే తిరగలేక తిరుగుతున్నా దాడిచేసి కసితీర్చుకో

Friday, January 25, 2013

ప్రియా గుర్తుకున్నానా..ప్లీజ్ గుర్తున్నా అని చెప్పవూ


చీకట్లో ఈదుతూ ..
వెలుగుకోసం  ఆరాట పడుతూ
చస్తూ బ్రతుకుతున్నా
నన్ను నీకోసం మనసు వేసే   ప్రశ్నలను
కొరుక్కుతినాలని చూస్తూ..మళ్ళీ చస్తూ
చీకటీ నురగల లేపనాన్ని పూసుకొని
పేలి ముక్కలౌతూ..నలిగిపోతున్నా
నీవదలి వేసిన నీ మనసుముక్కల్లో
నీవేమన్నా కనిపిస్తామేమో అన్న ఆశతో
అర్రులు చాస్తూ ఆవేదనగా
నీకోసం పరుగులు పెడుతున్నా
పడుతూ లేస్తున్నప్పుడు తగిలిన గాయాలను
ఓడుతున్న రక్తాన్ని లెక్కచేయక..
నీవు మనసుకు పెట్టిన గాయాలకు
మరికరికోసం చేసిన
వెటకారపు అక్షరాల డైనమేట్లకు
నేను ఏప్పుడో పేలి కాలిపోయాను
నేనిప్పుడు మనిషికాదు..
మనిషిలాంటి మనిషిని
అయినా నీకోసం నా అన్వేషన ఆగడు..
నిన్ను గెలిచి ఓడిన మనిషిని
ప్రియా గుర్తుకున్నానా..
ప్లీజ్ గుర్తున్నా అని చెప్పవూ
గుర్తులేకపోయిన.. అందరిలో
నన్ను మర్చిపోయినా
నా మనస్సుకోసం
నేనె తెల్సని...మన పరిచయం
గురించి నాలోని కొన్నిజ్ఞాపకాలను
కొన్నిటిని నామనస్సులోంచి లాగి
అవి నీమనస్సులో లేకపోయినా
నేను గుర్తున్నాని ఆజ్ఞాపకాలను చూసైనా చెప్పవూ
నీ జ్ఞాపకాల్లో కాలి రాలిపోయిన మనిషిని ప్రియా ప్లీజ్

కాల్చేసే మంటొకటి…


కాల్చేసే మంటొకటి…

25-జనవరి-2013

ఇప్పుడు నాకు విషాదమే అవసరమైంది
జడలు విప్పిన విషాదం
అది నన్ను  గుచ్చి గుచ్చి బాధపెట్టి
నాకో వ్యథను మిగిల్చాలనుంది
నాకు బాధే కావాలి
ఆమె జ్ఞాపకాలను దాచిన గుండెను
కాల్చేసే మంటొకటి
నాకిప్పుడు అవసరం
ఆ కాలుతున్న బాధే నాకిప్పుడు కావాలి
హృదయంలో గూడుకట్టుకొన్నఆమె రుపాన్ని
పలుగుల‌తో తొలగించే నొప్పి కావాలి
ఆ పలుగు చేసే గాయం కావాలి
గుండెలోతుల్లో ఘనీభవించిన‌ ఆమె మధురానుభూతులను
ఎగదోసి రగిలించి
కరిగించే సెగ కావాలి
ఆ సెగ రగిలించే వేదనే నాక్కావాలి
ఆమె అంతర్ సౌందర్యాన్ని
అతికించుకొన్న‌ మనసుపొరలను
విడదీసి ముట్టించే నిప్పురవ్వొకటి కావాలి
ఆ రవ్వ కాల్చే మంటే నాకిప్పుడు అవసరం
మనసును పదే పదే తడుముతూ
ఎంత ఎండినా ఆవిరవని ఆమె జ్ఞాపకాలను
నిలదీసి అంటించే అగ్గొకటి కావాలి
విరబూసిన మా కలల విరితోటలను
కబళించి దహించే దావానలం కావాలి
నన్నో జీవశ్ఛవం చేసే
నన్ను భౌతికంగా మాయంచేసే
నా గుండెను రాయిగ మార్చి
ఇంద్రజాలికుడొకడు నాకు ఎదురవ్వాలి
అవును..
నాకొక విషాదం  కావాలి………!

మనిషిలా నటిస్తున్నావు ప్రియా

నిజాన్ని ఒప్పుకోలేను
గతం నుంచి తప్పుకోలేను

కన్నీళ్ళిప్పుడు శాశిస్తున్నాయి

జీవితగమనం రోజులెన్నో చెబుతున్నాయి

ప్రేమగురించి అంతబాగా చెప్పేనీవు

ఎదుటి మనిషిమనస్సును ఎందుకు చింద్రం చేస్తావు

నా గుండెళ్ళో భాద తక్కువైందనా

ఏదురుపడి మరీ గుండెళ్ళో గుచ్చుతున్నావు

నీవచ్చం మనిషిలానే ప్రవర్తిస్తున్నావు

ఏడుస్తుంటే చూసి పగలబడి నవ్వుతున్నావు

అందరూ మరనిస్తారు

కాని ఇలా ప్రతిక్షనం మరణించరేమో

నిశ్శబ్దపు డైనమేట్లేకాదు

వెటకారపు అక్షరాల అనుబాంబులు వేస్తున్నావు

ఎందుకిలా చేస్తున్నావు

ఎవరో ఒకరికోసం అవమానిస్తూ ఎందుకు ఏడిపిస్తున్నావు

నా శవయాత్రలో

దూరంగా నిలబడి పగలబడి నవ్వుతున్నదినీవేనా

నవ్వు విరగబడి నవ్వు

నాచావు నీకంత ఆనందానిస్తే.
ఇలా రోజూ క్షణ క్షణం చస్తూనే ఉంటా

ఏడ్చేందుకు కన్నీళ్ళు కూడా లేవు

గుండేళ్ళోంచి చిందుతున్న రక్తపు చుక్కలు తప్ప

ఇలాంటి క్షనాలకోసమా నేనెదురు చూసింది 

నిజంగా నీవు మనిషివి అనిపించావు..
కాదు కాదు మనిషిలా నటిస్తున్నావు ప్రియా

Wednesday, January 23, 2013

ప్లీజ్ నన్నుఎవరన్నా ఏమైనా చేయండి ఈ క్షనం ఇప్పుడే గుండె అగిపోవాలి

ప్లీజ్ నన్నుఎవరన్నా ఏమైనా చేయండి ఈ క్షనం ఇప్పుడే గుండె అగిపోవాలి

చివరిగా ఏదో చెప్పాలని ఉంది మాటలు పెగలడంలేదు..ఓడించావుగా

అక్షరాలు తడబడుతున్నాయి ఇంక ఎప్పటికీ రాయలేనేమోని

చస్తూ బ్రతకడం చాలా కష్టం..ఒక్కసారే ఎందుకు చావురాదు

ఓడిపోయానని తెల్సు.. కాని ఇంతగా గుండెపగిలేంతగా అని తెలీదు

కత్తి ఒక్కసారే దిగబడుతుంది పదాలు గుండెను జ్ఞాపకాలై చీలుస్తూనే ఉంటుంది

నిజమే నేనేంటో నాకు తెలిదు నీవు చెప్పేదాకా..లోకానికి ఇకసెలవా మరి

నాకిక ఆలోచించే శక్తిలేదు...ఈక్షనం గుండె ఆగితే పోతే ఎంతబాగుండో

గుండెకొత్తుకలో కత్తి గుండెను చీలుస్తుంది...నన్ను చంపుతుంటే ఆనందించే వాళ్ళకోసం

అక్షరాలనే ఆయుదాలుగా చేసుకొన్నావుగా..వాటితో నా తలనరికేసేయ్

నిన్ను చూడని క్షణం నాకో యుగం ఆ బాధకు కారణం నీకు తెలుసా నీ ఎడబాటే

వెళుతూ.. వెళుతూ…నా హృదయాన్ని గాయపరచకు నాకు విషాదాన్ని మిగల్చకు

ప్రపంచం ఇలాగే ఆగిపోనీ ప్రియా


Tuesday, January 22, 2013

నీకోసం నిదురలేని రాత్రుల్లు గడిపినవెన్నో


నిజంగా నేను...పనికిమాలిన వాడినే


ఇష్టపడుతున్నా కాబట్టి 
ఎన్నిమాటలైనా పడతానుకాబట్టి 
ప్రేమీంచాను ఏమైనా అనే అర్హత నీకుంది
నిజమే నీవన్నట్టు నేను 
పనికివాలిన వాడినే

నీవు పదికాలాల పాటు చల్లగా ఉండాలని 
కోరుకుంటా కాబట్టి నిజంగా నేను
పనికిమాలిన వాడినే
ఎలా అన్నా ఏమన్నా ఇలాగే ఉంటా
నేనెప్పుడూ మారను మారలేను
నేనింతే.. కారనాలెతక్కు
కసిదీరా తిట్టు 
అనే హక్కు నీకుంది
పడాలి కదా
ఎన్నన్నా పడతాను
నాకు నేను గా 
విదించుకున్న శిక్షకరెక్టే 
ఒక్కోసారి పిచ్చి మనస్సు 
నీవు మారావేమో అని 
నిన్ను పలకరించు అని
మనసు మారాం చేస్తుంది 
ఇలా నీనుండి నిజాలు తెల్సినప్పుడు
మనసు మూగగా రోదిస్తుంది
ఏంచేయలేను.. ఏం చేయను 

గుప్పెడంత గుండెలోని భాద..


Monday, January 21, 2013

నీ కోసం ఏం రాస్తున్నానో తెలీక


కదిలిస్తే చాలు గుండె ఒలికి పోతుంది
పలకరిస్తే చాలు మనసు
పులకించి పరవసించి పోతుంది
ఎలా ప్రారంభిచను ప్రియా
నీ కోసం ఏం రాస్తున్నానో తెలీక
నాలోని నిన్ను మినహా
నాలోనుంచి నన్నే తరిమేశాను
ఆహ్వానం లేకుండానే
నా హృదయంలో ప్రవేశించి
నా దృష్టిని నా మనస్సును
నీ వైపు మరల్చుకుంటున్నావు
నీవు రావు నన్ను పోనీవు
తీయ్యటి మాటలతోఊరించి
ప్రపంచానికి దూరం చేశావు
అందుకే మరో ప్రపంచాన్ని సృష్టించుకున్నా
నా కలల ప్రపంచంలో నీఒక్కదానివే ఉంటావు
నిన్ను అలాగే చూస్తూ నేనుంటా ప్రియా
దిగులు కళ్ళతో,వెర్రి చూపులతో,
మరపు మాటలతో,
ఏమరపాటులో ఎదురుచూపులు
నీకోసం ఎక్కడ వెతకాలో తెలీక
నీ కోసం వెతికి వెతికి అలసి
చిక్కి శల్యమయ్యే ఈ నిర్భాగ్యుణ్ని చూసి
దిక్కులే నవ్వుతున్నాయి
చుక్కలు కూడా ఏడుస్తున్నాయి
నా జీవితాన్ని అల్ల కళ్ళోలం చేశావు
అనిపిస్తుంది నాకు
నీ ప్రేమకోసం నాదొక
నిరంతర పోరాటం
సముద్రపు కెరటాల ఉప్పెనలా
నిరంతరంగా..జీవనదిలా..
నిరంతరం నీకోసం వెతుకుతూనే ఉంటా ప్రియా

Wednesday, January 16, 2013

ఇవి నా గుండె చప్పుళ్ళు ప్రియా కాస్త ఆలకించవా...? Part-2ఇవి నా గుండె చప్పుళ్ళు ప్రియా కాస్త ఆలకించవా...? Part-2

1) నీకూ నాకూ మధ్య నిశ్శబ్ధం లాంటి ఓపొర అడ్డుగోడైంది ప్రియా

2)  నా మనసేమో ఎవరి ఆనవాళ్ళ జాడకోసమో శోధిస్తుంది
     జాడ తెలియని వేళల్లో అక్షరాల ఆనవాళ్ళే ఆసరా అవుతాయి ప్రియా

3)  ప్రియా నిన్ను నాకు దగ్గర చేసిన దూరాన్ని అడుగు...
     నీ కలలతో పగలు రేయి ఒకటైపోయిన కాలాన్ని అడుగు నేనీప్పుడేం చేస్తున్నానో

4)  మనసుకు తగిలించుకున్న గాయాన్ని బరించలేకపోతున్నాను
      నీజ్ఞాపకం సూలాలై నాగుండేల్లో ప్రతిక్షనం గుచ్చుతూనే ఉంది ప్రియా
5)  ప్రియా నీతో ప్రతి అనుభవం నన్ను నాకు పరిచయం చేస్తూనే ఉంది
      అవన్నీ గుండెళ్ళో బద్రంగా చెరగిపోని జ్ఞాపకాలుగా నిక్షిప్తమవుతూనే ఉన్నాయి ప్రియా

6)  నువ్వుంటే ప్రతి యుగమూ ఒక్క క్షణమై కరిగిపోతుంది
      నీవు లేకుంటే ప్రతీ క్షణమూ ఒక యుగమై నిలిచిపోతుంది ప్రియా
7)  నీటి నీవు క్షేమంగా ఉన్నావన్న తలంపు నా కంటి చివరిచుక్కని ఆపేస్తూంది .

8)  ప్రియాగా నువ్వొదిలిన వర్తమానంలో పగిలిన హృదయాన్ని అతికించుకోలేని
      నా అసహాయతనీ వ్యక్తపరచలేని నా ఆవేదననీ కన్నీటితో నిండిన నా కళ్ళలో
      నాకన్నీళ్ళని దాచుకొని...తిరిగిరాని గతంలోకి నీకై వేదనగా ఎదురు చూస్తున్నా

9)    కేవలం నిన్ను తప్ప, నీ నుంచి ఇంకేమి ఆశించని నా ఈ ప్రయత్నం..
       ఎప్పటికైనా నిన్ను కరిగిస్తుందని ఆశిస్తూ.. నీకోసం ఎదురు చూస్తున్నా ప్రియా

10)    నీకోసం వెతుక్కుటూ వస్తున్నాక్రొత్త దారుల్లో పాత గుర్తులు తలచుకొంటూ
        నీ ఆనవాళ్ళూ కనిపిస్తాయేమో అని రక్తం ఓడుతున్నా శరీరాన్ని లెక్కజేయక
        మోకాళ్ళపై దేవుకుంటూ నిర్లిప్తంగా నీకోసం వెతుకుతూనే ఉన్నా ప్రియా

వెతుకుతున్నా నీకోసం ఇంకా వెతుకుతూనే ఉన్నా ప్రియా


ప్రేమ కి రూపం లేదు. 
అది మనం ప్రేమించే వ్యక్తిగానో, 
మనని ప్రేమించే వ్యక్తిగానో 
మాత్రమే రూపుదిద్దుకుంటుంది. 
నేనూ ఒకప్పుడు నాలో నేను. 
తన ఆగమనం నా జీవితంలో 
జరిగే వరకు ఇలా..
నేనింకా నీ రాక కోసం వేచివున్నానని, 
నీవొచ్చే దారులు వెదుకుతున్నానని 
చెప్పాగా నీకు, ఇపుడూ
నేను వెదుక్కుంటున్నా ...
వెదుకులాటలోనే వున్నానని 
వుసూరుమంటూనేవున్నా
ఎందుకంటే ఎపుడూ 
వెదుక్కుంటునేవున్నా,
వెదికినవేవి నాకు దొరకవని తెల్సి
గురుతుకీ రాదు మరి
వెదకాల్సినవింకేవీ లేవని ఆపేసిన క్షణం
మిగిలిన నన్ను నేను మళ్ళీ 
వెదుక్కోవాలని అనిపిస్తుంది,
నేను కనుక నాకు మళ్ళీ దొరికితే
ఈ సారి మాత్రం వెదకటాన్ని ఇంకెవరికైనా 
వీలునామా వ్రాసేయాలని.
వెతుక్కోవాల్సినవి మాత్రం వారు ఎంచుకోవాలని
నే వెతికినవేవీ ఈ లోకంలో ఇంకెక్కడా వుండవని
నా కెపుడోనే తెల్సిందని చెప్పటానికి 
మాత్రం మాటలు వెదుక్కుంటున్నా
ఆవి వినే మనిషి కొరకు మాత్రమే 
ఇపుడు వెదుక్కుంటున్నా
మరి చెస్తావా ఆ మాట నాకు, 
నే వెదుక్కున్నది నిన్నేనని?
ఇప్పటికైనా నీకు అర్దం అయ్యేఉంటుంది ప్రియా 

Tuesday, January 15, 2013

ప్రియా ఈ మాట ఎప్పటికీ మర్చిపోకు సుమా....


మాయలు చేసి మౌనంగా ఉంటే ఎలా జాబిలమ్మా


ఓ జాబిలమ్మ
ఎక్కడున్నావు జాబిలమ్మా
చూడబోతే సిగ్గుతో
నల్లమబ్బుల చాటుగా దాగుతావు
చూపు తిప్పగానే తోంగి చూస్తూ
దొబుచులు ఆడతావు
ఏవో ఉసులు చెప్పబోతే
ఎవరు నీవన్నట్టు చూస్తావు
మౌనంగానేనుంటే నన్ను
చూసి కొంటెగా నవ్వుతావు
కోపంతో ముఖం తిప్పుకుంటే
ప్రేమతో బుజ్జగిస్తావు
కొంటె ఉసులాడుతు నన్ను నవ్విస్తావు
తనివి తీరకుండానే సెలవంటూ సాగుతావు
నా మదిలో సిరివెన్నెలు కురిపించే ఓ జాబిలమ్మ
మరల నీ దర్శనం ఎప్పుడమ్మా?
ఇన్ని మాయలు చేసి మనసు గుళ్ళచేసి
ఇలా మౌనంగా ఉంటే ఎలా జాబిలమ్మా నీకిది న్యాయమా

Monday, January 14, 2013

ఇవి నా గుండె చప్పుళ్ళు ప్రియా కాస్త ఆలకించవా...?


ఇవి నా గుండె చప్పుళ్ళు ప్రియా కాస్త ఆలకించవా...? 
ఇలా చెప్పుకుంటూ పోతే నాజీవితం సరిపోదేమో ప్రియా
---------------------------------------------------------------------------------

1) కళ్ళు ముస్తే కలలో...కళ్ళు తెరిస్తే ఇలలో...ప్రతీ పువ్వులో నీ నవ్వు...అనుక్షణం కవ్విస్తుంటే..స్పందిస్తున్న ఈ గుండే చప్పుడు...నీకు వినిపించెదెప్పుడు.. ప్రియా

2) నీ మదిలో నేనుండి పోవాలని నీ పెదవులు పలికే కావ్యం నేనై నిలిచిపోవాలని 
ప్రతి రాత్రి నీ స్వప్నం లో నేనొదిగి పోవాలని..ఈ కలనిజం అవ్వాలని మది ఆరాట పడుతోంది ప్రియా

3) నీ విరహం నన్ను నాలో లేకుండా చేసింది నీ జ్ఞాపకం నా ప్రాణాన్ని నాకు దూరం చేస్తుంది..అందుకే నువ్వు ఒక్కసారి వచ్చిపో..నన్ను నాలో నింపిపో...ప్రియా ప్లీజ్

4) గెలుపు నీదే కావాలని కోరుకుంటా అలక మానీ నాకీ మాట చెప్పు నీ అలక తీర్చు మంత్రమేది ఇదివరలా చిలక పలుకులకు నేనేం చేయాలో చెప్పుప్రియా

5) మనసులు అలసిన వేళ మౌనం దరిచేరే వేళ చల్లని చంద్రుని నీడలో..తీపి జ్ఞాపకాల ఒడిలో నిదురపో నేస్తమా వేకువజామున నిన్నంటి పెట్టుకొనే ఉంటాగా ప్రియా

6) నీతో స్నేహం చేసెంతవరకు తెలియదు..నాలో ఇంత త్యాగం ఉందని నా మనసుని అడిగాను అప్పుడు తెలిసింది...నాలో నేను లేనని..నాలో ఉన్నది నువ్వని ప్రియా

7) నా స్నేహం స్వచ్చమైనదైతే...నీవెందుకు నాకు..నీ జ్ఞాపకం చాలు ప్రియా

8) మొదటి చూపులో ప్రేమ అన్న వాక్యం నిజమని నాలో కలిగిన 
భావన ప్రేమేనని నిన్ను చూశాకే తెలిసింది కాదని లేదని చెప్పగలవా ప్రియా


9) నీ అనుబంధం శిలవంటి మనసును మనిషిని చేసింది నీ విరహం నన్ను నాలో లేకుండా చేసింది నీవు దూరం అయినప్పటి నుంచి తెల్సింది ప్రాణం నాదగ్గర లేదని

10) నీతో స్నేహం చేసెంతవరకు తెలియదు..నాలో ఇంత త్యాగం ఉందని నా మనసుని  అడిగాను అప్పుడు తెలిసింది...నాలో నేను లేనని..నాలో ఉన్నది నువ్వని ప్రియా

Sunday, January 13, 2013

ప్రియా నీ శ్వాసనై నిన్ను చేరాలని ఉంది కాని...

ప్రియా మంచు ముత్యమై 
నీపై వాలిపోవాలని ఉంది 
చినుకునై నిన్ను
తాకాలని ఉంది కాని...
ఎండనై మండిపోతున్న
మాటనై నీ పెదవిపై 
పలకాలని ఉంది కాని...
ప్రియా మౌనమై మిగిలిపోతున్న
ఆశనై నీ మదిలో 
నిలచి ఉండాలని ఉంది
నిరాశానై కరిగిపోతున్న,
ప్రియా నీ శ్వాసనై నిన్ను చేరాలని ఉంది కాని...
ఊపిరి వదిలి వెల్లిపోతున్నా 
నాకు భాదలేదు  
నీగుండేలో ఉన్నా అని తెలిస్తే 
ఊపిరి ఆగిపోయినా సంతోషంగా 
మృత్యువుని ఆహ్వానిస్త ప్రియా
నీవు నమ్మినా నమ్మకా పోయినా

Saturday, January 12, 2013

ఓ నిశ్శబ్ద పుష్పం..ఇద్దరి మద్యా చెప్పుకోలేని అఘాదాన్ని చేసింది.

కాలన్ని కాదని
ఏమేరపాటుగా ఎదురు చూస్తున్న క్షనం
ననే నున్నానంటూ వచ్చావు
నీ తియ్యనైన మాటలతో
నీ అద్చుతమైన స్నేహంతో 
నా గుప్పెడంత గుండెను ఆక్రమించేసావు
నాలో నన్ను చూసుకుందాం అనుకున్నా
నాలో నీవే కనిపిస్తున్నావు
ఇప్పుడు నాలో నేను లేను
నన్ను ఎప్పుడో నీవు ఆక్రమించేశావు
ఎలా వచ్చిందో తెలీదు
ఎందుకొచ్చిందో తెలీదు
మనిద్దరి మద్యా
అసంకల్పితంగా వికసించింది
ఓ నిశ్శబ్ద పుష్పం
ఇద్దరి మద్యా చెప్పుకోలేని
అఘాదాన్ని చేసింది..
ఆగాదం పూడ్చెదెవ్వరు
ఇలా నా మన్స్స్సులో
ఆలోచనలు
అల్లకళ్ళోలం రేపుతున్నాయి
గుండేకు చిల్లులు చేస్తూ
రేపటి పై ఆశ లేదు
ఈ నిశి రాతిరేనన్నెప్పుడో
మింగేసి చీకట్లో కలిపేసేలాగుంది

Thursday, January 10, 2013

కన్నీటి పొరలు అడ్డొస్తున్నాయి...ప్రియా


ప్రియా నీజ్ఞాపకాలు
మబ్బులా కమ్ముకుంటాయి
వెంటనే కన్నీరు
ఏకధాటిగా బయటకు పరుగులు తీస్తాయి
నీ తలపులు గుర్తొచ్చిన ప్రతిసారి...
నా కళ్ళు ఏకధాటిగా ఇలా వర్షిస్తాయి!

కంటి నిండా కలలున్నాయి...
అవి ఎప్పటికి తీరవేమో
ఎప్పటికీ తీరందాటని ఉప్పెనలా
నీవు గుర్తొచ్చిన ప్రతిసారి
ఏదో రాయాలని విఫల ప్రయత్నం చేస్తుంటా
ఎందుకో ఒక్కోసారి అక్షరాలు కనిపించకుండా
కన్నీటి పొరలు అడ్డొస్తున్నాయి...ప్రియా

అందుకే దేవుడా
నిజంగా నీవు దేవుడవైతే..
ప్రియను దరి చేర్చలేవని తేలింది అందుకే
నా గుండెను రాతి బండను చేయి...
పగిలి పోయిందనుకో ఆ రాయి...
నన్ను మట్టిలో కలిపి వేసేయి...
భగవంతుడా నీవు నాకు
ఈ ఒక్క సహాయము చేయి...
నీవు దమ్మున్న దేవుడవైతే....?

నీ తలుపులు రేపే నా ఈ నిశ్శబ్ధయుద్దంలో.. ప్రియా

నీ తలుపులు రేపే 
నా ఈ నిశ్శబ్ధయుద్దంలో.. 
ఒంటరిగా పోరాడుతున్నా మనస్సుతో
యుద్ధం చేసేదీ నేనే.... 
గాయపడేదీ నేనే... ప్రియా 

నిన్ను నానుంచి దూరం చేసిన

నల్లని రాత్రులలో నీకోసం 
ఎదురు చూస్తూ వాడిపోయిన 
నా హృదయం సాక్షిగా
తుంపులు తుంపుల జ్ఞాపకాలూ…
గాఢమైన దిగుళ్ళూ గుండె 
బరువుగా నీకోసం ఎదురు చూపులు
కనుల ముందే చేజారే క్షణం ..

కనులు నమ్మలేని నిజం 
కనులు దాటని కన్నీటి జలం 

మరి ఇది ఏ దేవుని శాపం మూలమో ప్రియా

మౌనంలోనూ.... 

కెరటాల అలజడిలోనూ వినిపిస్తుంది 
నా హృదయ ఘోష...
ఉప్పొంగే ఆశల నిట్టూర్పుల 

నా శ్వాస కదలి కరిగిపోతున్న నా ఆశ
ఆశలో ఊపిరి పీల్చాలన్న ద్యాసే మరుస్తున్నా

నీ తలపులు కలలోను కలవరపెడుతుంటే...

కన్నీరై కారుతూ గుండెల్నితాకుతుంటే...
లోలోపలే నా పై కలబడుతున్న 

నీ జ్ఞాపకాలను తడుముతూ నాకన్నీటికి
సమాదం ఎమని చెబుతావు ప్రియా


Wednesday, January 9, 2013

మనసుకు సమాదానం ఏమని చెప్పను...ప్రియా....

ప్రతి రోజు నువ్వు పలికే చిలక పలకులలో
బాగున్నావా అనే ఒక్క చిన్న మాట కోసం ..
ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నా....
.ముగ్ధమనోహరంగా..చిలిపిగా ప్రేమగా ఒక్కసారైనా పిలిచావా..
.... నాతో మాట్లాడకున్నా. నా బాధని ..

కోపాన్ని దుప్పటిలో కప్పేసి..
కన్నీటితో నీకై ఎదురు చూస్తున్నాను..
నిద్రలేని ఈ రాత్రిలో ...నీ కొరకు 
కిటీకీలోంచి చూస్తున్నాను
ఎక్కడున్నావ్?..ఎప్పుడొస్తావ్ ప్రియా..?.... ఎపుడు నా ఆలోచనలన్ని నీ గురించేనని 
నిన్నే తలచుకుంటానని ఎలా తెలుపను.....
నీ ప్రతి తలపు రేగుతున్న గాయాలై..
గుండె నిండా భారమైన గేయాలై. .
ఎదురు చూస్తున్న నా కన్నీటికి..
నీ ఎద ఎప్పుడు కరుగుతుందో ప్రియా..గుండె భారమై బరువెక్కుతుంది....
నీ అన్వేషణలో తలదించుకోని 
తప్పుకుంటున్న ఈ ఘడియలకేమైనా తెలుసా..
స్మ్రుతులు నురగలై పొంగుతున్నట్లు...
అవి నాలోనే పేలుతున్నట్టు....
ఆనందమైనా..విషాదమైనా...
గుండెలోనే దాచుకున్నాను..
నువ్వెక్కడ అని అడుగుతున్న
మనసుకు సమాదానం ఏమని చెప్పను...
తెలుసుకోలేని మతిబ్రమణంలా 
పారేసుకున్న జీవితం గురించి 
ఏమని చెప్పాలి ప్రియా.......

జీవితం అర్దంకాని అరబిక్ పుస్తకంలా ఉందెందుకో ప్రియా

ఆ క్షణం లో జనించింది
మరో క్షణంలో నశించింది
చివరికి...
అప్పుడే మొదలయ్యింది

ప్రేమ
అదొక తియ్యని అనుభూతి
విచ్చిన్నమౌతున్నా
మల్లీ మొదలౌతుంది
ఈ సృష్టిలోని
అన్నిటిలాగే
కూలడానికే కడతామా
కూలితేనే తిరిగి కట్టుకోవాలా
కూల కుండా కాపాడుకోలేమా
జ్ఞానం బూడిద నుంచీ
సృజనాత్మకత జ్వలిస్తుంది
అదీ క్షణికమే...
అటుపైన మరణిస్తుంది

మరనించేది పుట్టడానికేనా
మరి మరనించడం దేనికి..?

కలవడం విడిపోవడానికేనా
మరి ఎందుకు..?
కలవడం విడిపోవడం ఏంటో

ఒకసారి మనసున్న మనిషిలా
మరోసారి..చచ్చిన శవంలా బ్రతకాలా..?

ప్రేమలో అన్నీశాశ్వితం కదా...?
మరి ఏందుకిలా జరుగుతోంది..?

జీవితాన్ని ఎంత అర్దం
చేసుకుందాం అనుకున్నా
అర్దంకాని అరబిక్ పుస్తకంలా ఉందెందుకో ప్రియా

Monday, January 7, 2013

ఆ చల్లని జాబిలమ్మకోసం ఆత్రంగా ఆప్య్తాయంగా


ఏ వెన్నెల రాత్రో
నాలుగు ఆప్యాయతల
మల్లెలు పరాకుగా వెళ్తున్న
పడమటిగాలిన వచ్చి పడతాయేమో అని
గాలిలో తేలుతున్న జ్ఞాపకాలను
పట్టి ఆపగానే ఒకప్పటి
స్పర్శాక్షణాలన్నీ చుట్టూ జలజలా
రాలతాయేమో అని
ఆ చల్లని జాబిలమ్మకోసం
ఆత్రంగా  ఆప్య్తాయంగా
ఎరుదు చూస్తున్నా..ప్రియా

కళ్ళు మూసుకొని నీకోసం ఆలోచిస్తున్నా ప్రియా


రేపటి ఉదయానికి
నాతో నడచే స్నేహానివనుకున్నా
కలలేన్నో కన్నా ప్రియా
కన్నీరే  మిగిల్చవెందుకో

అదే నీకిష్టం కనుక
మౌనంగా రోదిస్తున్నా
నీకిష్టమని..
ఎందుకంటే
కష్టమైనా ..
నీ ఇష్టమే నాకిష్టం ప్రియాచల్ల గాలిలొ నీకోసం పరితపిస్తూ
నీ జ్ఞాపకాల తోటలో విహరిస్తున్నా
మౌనరోదనలో

రాత్రంతా పరిహసించిన
పెనుగాలిని లెక్కచేయని
ఆత్మవిశ్వాసం
ఆకుల మధ్య మెల్లగా
విచ్చుకుంటుంటే


కళ్ళు మూసుకొని నీకోసం ఆలోచిస్తున్నా  ప్రియా
తియ్యటి స్వరం వినిపించింది

సన్నని పరిమళం
మనసుని మెత్తగా
హత్తుకుంది!

నీజమేమో అని 
హృదం నాట్యమాడగా
ఆనందిస్తున్న క్షణాన
ఉలిక్కి పడి లేచా 
అది కల అని అప్పటికి కాని తెలీలా ప్రియా

చుక్కల నవ్వుల్ని తోడిచ్చింది జాబిలి...?

పెదవి పై చాలా పేర్లు పలికేవి కాని
ఆ పలుకులు ఇంత మధురమైనవని 
నీ పేరు పలికేవరకు తెలియదు ప్రియా...

నిజం గా నిజం...


నా కవితకు ప్రాణం గా మలుచుకున్నా
నీ చెరగని చిరునవ్వు ని మాత్రమే అని తెలుసా
ఈ కావ్యపు పదాలన్ని నీజ్ఞాపకాల తునకలే 
అవన్నీ అనాలోచితంగా పేర్చినా ఇలా నే ఉంటాయి
అచ్చం చందమామలాంటి నీ మోములా..

నీ మనసు నను వీడనీ నీడల్లే విహరిస్తు 
ప్రతిక్షణం నీతలపులతో నా కాలాన్ని కరిగిస్తూ
నీ జ్ఞాపకాల శ్వాసలో నీ పిలుపుకై వేచివుంది
కానీ ఎప్పటి వరకూ ఈ నీ మౌనం
అర్ధం కాని రాతిరిని...నీ తలపుల నిశాచరిని

నిన్ను తలచుకున్న ప్రతిసారి లయతప్పుతూ
భారంగా వెక్కిపడుతున్న గుండె సవ్వడి
నీకై అన్వేషిస్తున్నప్పుడు తలదించుకుని 
తప్పుకుంటోంది ఎలా సమాధానమీయాలో తెలీదని
ఈ ఘడియలకే మందు పూయాలో తానెరుగనని

చుక్కల నవ్వుల్ని తోడిచ్చి జాబిలి దోసిలివంటి
నీ తలపుల నించి నన్ను జారవిడిచింది..నీ మౌనం
నీ జ్ఞాపకాలను వెంటేసుకుని నీకోసం వెతికాను
నీ చూపులుకై వెతుకుతూ నాది కానీ లోకంలో
కాని చివరకు నాకు మిగిల్చావు వేదనే ...
నువ్వు నాకేమీ కావనే సందేశాన్నిస్తూ....

అయినా నే వేచి ఉంటాను మరుజన్మవరకూ
నా ప్రేమన్నది నీకు అర్ధమయేవరకూ
నీ మనసు నాకు మాత్రమే సొంతమయ్యేవరకూ....
ఎందుకంటే నేనప్పుడూ ఇప్పుడూ...ఎప్పుడూ ....
చెలీ! నీ సుఖమే కోరుకుంటా కడవరకూ.....