. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, October 31, 2012

పారిపొండి .పారిపొండి .... అమ్మాయిలొస్తున్నారు

పారిపొండి .. అమ్మాయిలొస్తున్నారు
అందమైన అమ్మాయిలు
పారిపొండి.. అందంగా నవ్వుతారు
కాని వాళ్ళకు అందమైన మనస్సు లేదు
ఆప్యాయంగా మాట్లాడుతారు..
అది నిజంకాదు.. అంతా బూటకం
నీవే నాప్రానం అంటారు అస్సలు నమ్మకు
వేరె ఎవ్వరి సమక్షంలో  నిన్ను అవమానిస్తారు
అరె బయ్యా చూస్తావేంటి పారిపో అమ్మాయిలొస్తున్నారు

నీ భాదల్లో నేనున్నా అంటారు..
ఎవరికోసమో నిన్ను భాదపెడతారు
అయ్యో ఏంటి ఇంకా నిలబడే ఉన్నావు పారిపో 
అందమైన అమ్మాయిలొస్తున్నారు
నీవడక్కుండానే పరిచయం చేసుకుంటారు
నీవడక్కుండానే ..ఎవరికోసమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు
 
పారిపో పారిపో బయ్యా ఇంకా ఏంటి చూస్తున్నావు
వాళ్ళూ చెప్పేవన్నీ నిజం అనుకుంటున్నావా
ఎప్పుడు ఎలా గైనా మాటలు మారుస్తారు
 అమ్మో వద్దు పారిపో  ప్లీజ్ వచ్చేస్తున్నారు వాళ్ళు

ఏంటి ఈ రోజూ నీతో హేపీగా  మంచిగా మాట్లాడుతున్నారంటావా
అమ్మో .. వద్దు ,.,., వేరెవరు నీగురించి ఏదో చెబుతారు.. అంతే
అన్నీ నమ్మి నిన్ను ఇష్ట వచ్చినట్టు అంటారు పారిపో
అమ్మో పారి పొండి .. పారిపొండి అమ్మాయి లొస్తున్నారు
అందమైన అమ్మాయిలు .. వాళ్ళకు అస్సలు మనస్సే ఉండడు
ప్లీజ్ పారి  పొండి .. వాళ్ళకు కనిపిస్తే .. ప్రేమ,స్నేహం అని మోసం చేస్తారు
బ్ర్దదరూ పారిపొండి.. అమ్మాయిలొస్తున్నారు
(I ( ఇది అందర్నీ ఉద్దేశించి కారు.. నమ్మించి మోసం చేసి అందమైన అమ్మాయిల గురించి..ఎవరో చెప్పారని నిజం తెల్సుకోకుండా అవమానించే వారికోసమే .)

నా జతలో రంగుల జాబిల్లివి అవుతావనుకున్నా

చిరునవ్వుమోముతో
నా జతలో రంగుల జాబిల్లివి
అవుతావనుకున్నా
చిధ్రమయ్యెలా
నా బ్రతుకుకు
స్వాగత తోరణమయ్యావు.
నీ నిస్వార్తపు జల్లులతో
కుసుమాల బృందావనాన్ని
వరంగా ఇస్తావనుకున్న,
నిశ్శబ్దంగా నాలో జారుతున్నా
కన్నీటి జడివానకు
మేఘసందేశానివయ్యావు.
ఆరారు కాలాల వర్ణాలతో
పరవశింప చేస్తావనుకున్న,
నీ జ్ఞాపకాల ధుఖ: సాగరంలో
కన్నీటి కెరటాలను మిగిల్చావు.
ప్రతి నిత్యం వసంత
కోకిలవవుతావనుకున్న,
నీ ఎడబాటులో బ్రతుకే భారామయ్యేలా
విషాద గీతాలను వినిపిస్తున్నావు.
నీ మనసు వెన్నెల కాంతిలో
నా ఆశల విరులు
నీ సిగలో పూయించాలనుకున్న,
కానీ ఓరిమి సాక్షిగా
ఓటమి అడుగు జాడలలో
నడిపిస్తావనుకోలేదు ప్రియా....
నీ ప్రేమను విడిచిన నాకు
ఒంటరితనమే నా సహాగమనం
అదే కదా కడదాక నిస్వార్తపు నా నేస్తం.

అక్షరాలతో ఉరితాళ్ళు పేనుతున్నా

నిజం నిప్పులాంటిదని
నమ్మకం ఏప్పుడూ వమ్ముకాదని
నిజమైన ప్రేమను ఎవ్వరూ మార్చలేరని
ఇవన్నీ నిజాలు కావు..గాలి బుడగలు
పైకి వాస్తవంలా కనిపించే  నీలి నీడలు

అందుకే అక్షరాలతో సహవాసం
నిజాలతో చలగాటం ఆడలేక
అక్షరాలను పేర్చి
ఆత్మ హత్యి చేసుకోవలనే ప్రయత్నం
అందుకే అక్షరాలను ఉరితాళ్ళు గా పేరుస్తున్నా
ఆ అక్షరాలనే గొలుసులుగా చేసి
కాళ్ళు చేతులు కట్టేసుకున్నా
నీకు దగ్గరవ్వాలని  ప్రయత్నం మానాలని

గొందులోని భావాలు
మనసులోని వేదనలు వెళ్ళడి కాకుండా
అక్షరాలను సురకత్తులుగా మార్చి
గుంతులో ఎప్పుడో గుచ్చుకున్నా
మాటలు బైటికి రాకుండా

అక్షరాలతో ఉరితాళ్ళు పేనుతున్నా
తప్పడు..సౌండ్ బైటికి రాకుండా
చచ్చేందుకు ఇదే మంచి తాడు
శబ్దం రాదు నిశ్శబ్దంలో
నిసీద రాత్రి నేను తీసుకున్న
నిర్నయం..
నిర్దయగా నీవు అన్న మాటాలు
నన్నిలా చేసేలా చేస్తున్నాయి
ఫ్రేమించాను అన్నది నీవే
మరొకరి కోసం
అవమానించేది నీవే
అందుకే నీకు ఎదైనా సాద్యిమే ప్రియా
అందుకే అక్షరాలతో ఉరితాడు చేసి
నీకు దూరం అవ్వలని చేస్తున్న ప్రయత్నం ప్రియా

Monday, October 29, 2012

సారి నీ ప్రపంచంలోకి మల్లీ అడుగు పెట్టే ప్రయత్నం చేసినందుకు

సారి నీ ప్రపంచంలోకి మల్లీ అడుగు పెట్టే ప్రయత్నం చేసినందుకు
ఎక్కడో గుంచే చివర్లో చిన్న ఆశ.
అప్పటి నీవు .. ఇప్పటినాకు
ఎక్కడొ చోటు ఉంటుందేమో అని
మానస్సు వద్దు వద్దు అంటున్నా
దైర్యం చేశా .. అనుకున్నదే జరిగింది
నీ ప్రపంచలోకి రాను లే
దూరం నుంచి చూస్తాను
అది తప్పైతే ..నేను..?

Sunday, October 28, 2012

ఆందాల బొమ్మ నను అవమానించింది ..ఇష్టం వచి నట్టు మాట్లాడింది

ఆవేశం .. ఆందోళన. ఆక్రోశం  వెరసి
ఒంటరితనం.. మనసంతా గందరగోళం
బ్రతుకు మీద విరక్తి ..
మనుషులంటే భయం
మనసులంటే  టెర్రర్
అందుకే మనుషులకు ,
మనసులకు దూరంగా
ఒంటరిగా ఉండటం
అలవాటు చేసుకుంటున్నా

అటుగా అందమైన అమ్మాయి వచ్చింది
నీరసంగా ఉంది.. ఆందోళనగా   ఉంది
ఏంటో అప్పటికే భాదల్లో ఉన్న నేను
తనను పలుకరించా,, నా వైపు చూడలేదు..

నాకెందుకులే అని కళ్ళు మూసుకొని
పాతజ్ఞాపకాలు తడుముకొంటున్నా
ఎందుకో ఒక్కసారిగా  తట్టుకోలేక
కంట కన్నీరు ఆగలేదు

ఎవరో నన్ను తడిమారు
నా కన్నీరు తుడిచారు.
అర్దంకాలే కళ్ళు తెరచి చూశా
అందాల బొమ్మ కన్నీరు తుడిచింది
తాను అన్ని ఉన్నా ఒంటరిగా
ఫీల్ అవుతున్నా అంది
భాదలు షేర్ చేసుకొంది
సలహాలు ఇచ్చింది 
నీకు నేనున్నా అంటూ బరోసా ఇచ్చింది
నిన్ను ఎప్పటికీ వీడను  అంది
మరొ క్రొత్త ప్రపంచాన్ని చూపించింది

అన్నీ నిజం అని నమ్మా
ఎవరో వచ్చారు. ఎమో చెప్పారు
అంతే  ఆందాల బొమ్మ నను అవమానించింది
ఇష్టం వచి నట్టు మాట్లాడింది
ఎవరికోసమో నన్ను అవమానించింది
అంతకు ముందు  నాకు చిన్న
భాద అనిపించినా విల విల్లాడింది
మరి ఇప్పుడూ ఇలా అర్దం కాలేదు

మళ్ళీ మొదటి కొచ్చిన జీవితం.
మళ్ళీ అదే విరక్తి.. అదే అందోళన
అప్పుడి కంటే ఇప్పుడు డబుల్ వేదన
ఏంటో జీవితం.. మళ్ళీ మొదలైంది..
నాఖు ఇదే బాగుంది
ప్లీజ్ ఎవ్వరూ పలుకరించకండి
అప్యాయంగా పలుకరిస్తే భయం  వేస్తుంది
నిజం ఏదో అబద్ద ఏదో తెలియక

వాస్తవన్ని జీర్నించుకోలేక
మృత్యువు పిలుపు కోసం ఎదురు చూస్తూ
ఏన్నాళ్ళీనా ఏన్నేళ్ళీనా అర్దంకాని పరిస్థితుల్లో
నమ్మి మోస పోయిన మనస్సు మరిలో
రగులుతున్న అగ్నిపర్వతాలు పేళుళ్ళూ
ఆపాపనే విఫల ప్రయత్నం మాని
ఆరోజుకోసం ఎదురు చూస్తున్నా ప్రియా
 

Saturday, October 27, 2012

ప్రేమించిన నాచిట్టి మనసుని గాయపరచావు

ప్రేమించిన నాచిట్టి మనసుని గాయపరచావు
నీవని నామనసుకి ఎలాతెలుపను?

నీ నిరీక్షణలో జీవితాంతం నేను వేచివుండగలను
నా హృదయాన్ని వేచి ఉండమని ఎలాచెప్పను?

దూరమై నాకు నీవు ధుఃఖాన్ని మిగిల్చావు
ఆ భాధని నీకివ్వమని భగవంతుని ఎలాకోరను?

నీ రూపమే కనపడుతుంది చందమామలోను
చంద్రుని మబ్బులో దాగమని ఎలాచెప్పను?

కనుమరుగై నీవు నన్ను కలవర పరిచావు
నీ కంట కునుకు రానీయకని ఎవరికితెలుపను?

నీ ప్రేమే దక్కని నేను జీవించలేను
ఆరోజు  కోసం ఎదురు చుస్తున్నాను  ప్రియా ఇప్పటికీ
- Padma Garu

Friday, October 26, 2012

నీ వదిలిన జ్ఞాపకాలు ..నీ వదిలిన జ్ఞాపకాలు

గతానికి ప్రస్తుతానికి .
నిన్నటికీ రేపటికీ
విషాదానికి ఆనందానికి
కయ్యానికి ,కవ్వింపుకి
సాక్షిగానేను,,అని చెప్పలేక

ఏంటి ఈ  మరకలు
ఎక్కడ పడితే అక్కడ
కలలో కన్నీరై
కంటినుడి కారిన
కన్నీటి జ్ఞాపకలేనా ?

ఏంటి వింత మనుషులు
మానసనేది లేక
మనుషులతో..
మనసులతో చెలగాటం
గుండెగోతుకలో
రేగుతున్న మంటలు
పగిలిన హృదయం
చెదిరిన కల

మనసులో అలజడి
నన్ను కాదని వెళ్ళినా
నీ వదిలిన జ్ఞాపకాలు
నాతో కలబడుతున్నాయి
అమె నిన్నొదిలించి కాని
నీ మనస్సును కాదని
ఎలా చెప్పాలి
ఏమని చెప్పాలి
నా  మనసు  వినదు
నీ జ్ఞాపకాలు వినవు
నీవు నన్ను కాదని
నన్ను వద్దనుకొని
నన్నో పిచ్చోడిని  చేసి వెళ్ళావని
నా పరిచయానికి ముందు
నా పరిచయానికి తరువాత
వాళ్ళకోసం..వారి ఆనందంకోసం
నన్ను అవమానించావు
వాళ్ళు హేపీగా ఉండాలంటే
నేనూ అవమానించాలని
గుండెను బద్దలు చేసి
భాద పడతానని తెల్సి
నేను భాదపడాలని
నీవు  చేసిన అవమానం
అగ్నిపర్వతాల్లా పేలి
ఆ లావా నన్ను దహించి వేస్తూనే ఉంది
మరి  నీజ్ఞాపకాలు నన్ను ఇంకా
వేదిస్తున్నాయి.. నామనసుతో కల్సి
నీవలా చేయవని... 
ఏవరికి చెప్పుకోను ఈ హృదయవేదన
ఒకప్పుడు నీకు చెప్పుకుంటే ఊరట
కాని ఇప్పుడు నీవే నా భాదకు కారణం
ఏంటో విధి వింతలు అంతే ఇదేనేమో


Thursday, October 25, 2012

తెల్లగులాబీ లాంటి మనస్సుకు అవమానం అనే రక్తపు మరకలంటించావు
తెల్లని గులాబీ లా స్వచ్చంగా ఉండాలని
నవ్వుతూ నీతో జీవితం పంచుకోవాలని
సంతోషంలో .భాదలో నీకై  నేనుండాలని
నీకు నేను గా నాకు నీవుగా  ఉండాలని
మనసులో.దాచుకొని చూసుకోవాలని
మది అంతరంగంలో నిలచుకోవాలని

ఎన్నీ కలలు కన్నాను
అన్నీ నిజమనుకున్నాను
మాటలన్నీ నిజాయితీ ఉందనుకున్నాను
నాకోసమే నీవు పుట్టావనుకున్నాను
నా కష్టాల్లో నీవు కోండత అండ అనుకున్నాను

తుఫానుల ఇద్దరి మద్యా పెరిగించి దూరం
ఎవరో పెట్టారు మనమద్యి వైరం..

కల్లలో పెట్టుకొని చూసుకున్న
నాకు కళ్ళలో నీళ్ళు తెప్పించావు
ఎర్రగులాబీ లాంటి మనస్సుకు
అవమానం అనే రక్తపు మరకలంటించావు

తెల్ల గులాబీ లాంటి మనస్సుకు..
అంటినీ రక్తపుమరకలు అనుకున్నా
కాని గుండెళ్ళో గుచ్చుకుంటున్న
జ్ఞాపకాల కత్తులకు కారుతున్న రక్తం
అని గుర్తించలేకపోయా..
అదీ ఇప్పుడు నా ప్రానం తీస్తోంది
నీవు కనికరించి ఒక్క పలకరింపుతో నైనా నన్ను
ఓదారుస్తావని ఆశ ఇప్పుడు చచ్చి పోతోంది
నీన్ను చేరాలనే ఆశ
గుండేల్లోనుంచి రక్తంలా చిమ్ముతోంది
అన్నీ నీకు తెల్సు. ..
తెల్లని గులాబీ రక్తంతో ఎర్రగా మారినా
చూసి కూడా చలనం లేకుండా వున్నావు..
అలా ఎలా ఉండగలుగుతున్నావు
ఒకప్పుడు ఎంతో ప్రేమగా..జాలిగా..
నాకేం జరుగుతుందో అని కంగారు
పడ్డ మనిషి.. ఇష్టపడ్డ మనిషి చనిపోబోతున్నా
అంత నింపాదిగా ఉండటం అది నీకు మాత్రమే సాద్యిమేమో

Wednesday, October 24, 2012

నీవు నన్ను మర్చిపోఅని తేలికగానే అన్నావు

ప్రియా నవ్వుతావు ఎందుకు మిత్రమా ...
ఇక్కడ కన్నీళ్ళలో నా గుండె స్నానం చేస్తోంది ....
హృదయం ఎడారిగా మారింది
నీవు నన్ను మర్చిపోఅని తేలికగానే అన్నావు
అసలు ఎందుకు నా జీవితం  లోకి వచ్చావు,
వెలుతున్నావు అది నాకు
సాద్యం అయ్యేపని కాదని నీ మనసుకు తెలుసు
నాతో మాట్లాడ వద్దు అన్నమాట
నీవు ఎలా అనగలిగావోగాని
అది నీకు సాద్యమేమోగాని
నాకు అస్సలు సాద్యింకాదు
అన్నీ నీ ఇష్టమే ప్రియా
నా హ్రుదయంలోకి రావడం వరకే నీ ఇష్టం
నా జీవితంలోనుంచి నీవు నన్ను
వెలివేసినా నా హృదయంలో నిలిచిపోయిన...
ప్రియా నిన్ను నేనేలా మర్చిపోను మిత్రమా..
మనసు సంద్రమైంది
నీ జ్ఞాపకం తోడేస్తోంది నిన్ను విడిచి ఉండలేను
నీ ఊపిరి నా గుండెను తడుముతోంటే
నేను గాలై నీ నులి వెచ్చని పాదాలను తాకుతూ
నీ పెదవుల మీద మాటనై వుండిపోతా
ప్రియా నన్ను మన్నించు నీ కోసం వేచి వున్నా..
మౌనంగా రోదిస్తూ
నీ మనసులో చోటివ్వక పోయినా
కనీసం నీ జ్ఞాపకంలోనైనా నన్ను తనువు చాలించనీ ...

దహిస్తున్నవేళ కూడా అలాగే నవ్వనీ ప్రియా!

ప్రియా నీ ఊపిరిలో నన్నుండిపోనీ,
గుండెమూల నన్నొదిగిపోనీ
ఎడబాటులో ప్రేమలోతుని చూడనీ,
ఊహలు ఊసులవనీ
ప్రేమున్నా లేకపోయినా,
నీ ప్రతితలపులో నన్నుండిపోనీ
వీలుకాదని వదిలెళ్ళిపోతే
వేదనే వర్షమై నినుతడిపేయనీ!

ప్రియా వదిలేయాలనుకుంటే
నవ్వుతూ వీడ్కోలు చెప్పేసి వెళ్ళిపో
ఆశల కెరటాలకి గమ్యమార్గమేదైనా
చూపించి దారిమళ్ళిపో
సృహలో ఉంటే జీవించలేని
నన్ను పిచ్చివానిగా మార్చిపో
మమతలగూళ్ళైన
నా ప్రేమ మర్మమేమిటో తెలుసుకునిపో!

ప్రియా నన్ను మరచిన
మైమరపుకే ఆనందమంతా సొంతమవనీ
పలుకనిభావమేదో లిపిలేనిభాషై
నీ పెదవులపై విరబూయనీ
కలకాలం ఆ నవ్వేదో
నిన్ను వీడని నీడలా
నిన్నంటుండిపోనీ
ప్రాణం వీడి నా దేహం
దహిస్తున్నవేళ కూడా అలాగే నవ్వనీ ప్రియా
-padma

Tuesday, October 23, 2012

కధ చెబుతాను ఉలిక్కి పడతావా ....? ఇదో పిచ్చోడి ప్రేమ కధ

ఇదో పిచ్చోడి ప్రేమ కధ ..వాడి ఎదురుగా ఎదురు చూస్తున్న ప్రేయసి తనను వెతుక్కుంటూ వచ్చినా నమ్మలేని స్థితిలో ఎదురైన వింత సంఘటన రియల్ గా చూపించే ప్రయత్నం 
 ( నేను తీసిన షార్ట్ ఫిల్మ్ ఇది )


ఆమె :- నే నొచ్చాను...ఏంటి నేను ఇంక ఎప్పటికీ రాననుకున్నావా..రాలేననుకున్నావా.. ప్రేమించి మోసం చేసేదానిలా కనిపిస్తున్నానా..?

నేను :- అలా చేశావు కాబట్టే .. మనసు భాద నీతో చెప్పుకోలేక ఇలా రాసుకుంతున్నా మళ్ళీ ఎందుకు వచావు అయిన ఇది నిజం కాదులే ..?

ఆమె :- ఇది నిజమే నీకోసం వచ్చెసాను శాశ్వ్తంగా నీతో ఉండేందుకు నీ ప్రేమను పంఛుకునేందుకు వచ్చాను ప్రియతమా ..

నేను :- నన్ను నేను నమ్మటం ఎప్పుడో మానేశాను ఇప్పుడు నీవొచ్చావు అంటే ఎలా నమ్ముతాను.. అప్పుడు ఏం చెప్పినా నమ్మాను అన్ని నిజం అనుకున్నా కాని ఇప్పుడు కూడా అవే మాటలు చెబితే అన్నీ నిజం అని నమ్ముతాను అనుకుంటున్నావా ..
అమె :- నిన్ను ఎలా నమ్మించాలి ..అప్పుడూ ఇప్పుడూ నేను మారలే పరిస్థితులు మనల్ని దూరం చేశాయి. కాని ఆ పరిష్తితుల్ని ఎదురించి నీకోసం వచ్చేసాను ప్రియతమా 

నేను :- నిజమే ఇప్పటికీ ఎప్పటికీ నీమీద ఎప్పటికీ ప్రేమ ఉంది కాని నిజం కాని నిజాన్ని ఎలా నమ్మాలి చెప్పు..అప్పుడు నమ్మి బ్రమ పడ్డా.. ఇప్పుడు మరోసారి నమ్మి ఏమవ్వాలి చెప్పు

అమె :- నివు నిజం అని నమ్మాలంటే ఏంచేయ్యాలి .. చెప్పు నీకోసం ఏం చెయ్యటానికైనా సిద్దం ఇప్పుడు నేను ప్రియతమా

నేను :- నన్ను చెంపమీద నీ ఐదు వేళ్ళు పడేలా గట్టిగా కొట్టు అప్పుడు నిజం అని నమ్ముతా చేస్తావా ప్లీజ్ నాకు ఇప్పుడు నీవు చెప్పే వన్నీ నిజం అని నమ్మాలనే ఉంది..


అంతే అమె నన్ను ఒక్కసారిగా కళ్ళు బైర్లుకమ్మేట్టు కొట్టింది.. కళ్ళలో కన్నీరు రావాలని ట్రై చేస్తే.. పాపం కన్నీరు లేక .. కంటిలో నరాలు తెగి రక్తం  వచ్చేసింది..ఒక్కసారి ఉలిక్కి పడ్డా చూస్తే పైన ఆకాశం క్రింద నేను  ఆ  పార్కులో అందరూ జంటలు హేపీగా ఉన్నారు.. ఒకరంటే ఒకరు ప్రాణంగా .. ఒకరికోసమే  ఒకరు పుట్టారేమో అన్నంతగా..కాని నేను ఇలా బ్రమల్లో కూడా ఉలిక్కి పడుతూ ..ఊపిరి బిగబట్టి బ్రతికున్నానీ లేదో తెలీనంత దిగులుగా తిరిగి రాని .. నీకోసం ఇంకా ఎదురు చూస్తూ వచ్చినట్టే బ్రమ పడుతూ బ్రమళ్ళో కూడా నమ్మలేనంతగా భయ పడుతూ .. ఇలా

నూరేళ్ళూ నిలిచే స్నేహ౦ కావాలి...కన్నుల్లో నన్ను దాచే నేస్త౦ కావాలి

నూరేళ్ళూ నిలిచే స్నేహ౦ కావాలి
కన్నుల్లో నన్ను దాచే నేస్త౦ కావాలి
గు౦డెలో ఒదిగిపోయే౦దుకు ప్రేయసి కావాలి
ఇన్ని అబద్దాలు ఎలా నిజం అవ్వాలి..

మనసు తెలుసుకొని అవకాశంచూసుకునేవాళ్ళున్నారు...
పరిస్థితులను బట్టి ప్రేమ మారుతుందా..స్నేహం జారిపోతుందా...
తాను కోరుకున్న దాన్ని కోసం ఏన్నో డ్రామాలు ఆడేవారు కొందరు..
ఎదుటి మనిషి వ్యక్తిత్వం తెలిసి కూడా మారేవాళ్ళు మరికొందరు..

ఇక్కడ నీతి నిజాయితీ ప్రేమ కు చోటులేదు..నటనకావాలి..
అలాంటి వాళ్లనే నమ్ముతారు...ఎదుటివాళ్ళు భాదపడ్డా వాళ్ళ కవరసం లేదు
ప్రేమకోసం నీజాయితీగా పరితపిస్తున్న మనసును ఎందుకు అర్దంచేసుకోరో తెలీదు..
ఆ నిజాయితీ ప్రేమ చావుకు దగ్గరపడ్డా
వాళ్ళకనవసరం అలా అలా ఎలా ఉంటారు ప్రియా..

వక్తిత్వం మార్చుకొని
వక్తితత్వాన్ని అనుమానిస్తున్న నిన్ను ఏమనాలిరా...
నీ పరిచయం నన్నో పిరికి వానిగా మర్చింది..
ఇప్పటికీ నీకెమౌతుందోని బెంగ..
నీవు నాదగ్గరలేకున్నా ..
నా దానివి కాదని వెళ్ళీనా తీరని ఈ బెంగ ఏన్నాళ్ళో.
బంగ పడ్డా బెంగ పడ్డా నన్ను ఏమర్చావు..
నేనేమౌతానొన్న ఆలోచనలేకుండా..

అన్ని మాటలు మాట్లాడుకున్నాం ..
మాటలప్రవాహాన్నికి అడ్డేలేని రొజులు మర్చిపోయావా..
అలా రోజులు గడచి బాధను నాకు విదిల్చి..
ఇవేరోజులు ఓసారి గుర్తు తెచ్చుకో ప్రియా...
అవన్నీ గుర్తుంటే నీవిలా ఎందుకుటావులే అంతా నా బ్రమ
నీకు నేను గుర్తుండటామా...ఇది చాలా పెద్ద జోక్ కదానీకు..


అన్ని మాటలు మాట్లాడుకున్న
మనం ఇప్పుడు చిన్న మాటా మాట్లాడ లేని స్థితిలో నీవు..
ఒక్కసారి చిన్న మాట్లాడతావని ఎదురుచూస్తూ
నేను చీ అనిపిస్తుందా నీకు..
అప్పుడలా ఇప్పుడిలా స్వార్దం నిండిన
నీమనస్సులో నాకు చోటులేదుకదా..

నా జీవితంలో కి ప్రవేసించినప్పుడే
నీకు తెలుసు ఇలా జరుగుతుందని..
తెల్సి నిజంగా స్నేహం చేసావా
నటించావో తెలీదు అన్నీ నిజం అని నమ్మా..
ఇదిగో ఇప్పుడు నేను అనుబవిస్తున్నా ..


నీవెందుకిలా చేశావంటో రోదిస్తూ..
ఇవన్నీ నీకు తెల్సు కాని ..
వద్దులే " ఐయితే ఎంటంటా " అంటావు
ఏంటో ఈరోజు మనసంతా గందరగోళంగా వుంది
అయినా ఎంచేయగలనులే

ఏ స్నేహ౦ నాకొద్దు
ఏ బ౦ధ౦ వెయ్యొద్దు
స్నేహ౦ కాల౦తో చేజారిపోతు౦టే
బ౦ధ౦ దూర౦తో ముడివీడిపోతు౦టే
ఏ స౦తోష౦ అయినా విషాద౦గా మిగిలిపోతు౦ది
చిన్ని ఆన౦ద౦ సయిత౦ ఎ౦డమావిలా మారిపోతు౦ది
అ౦దుకే...
ఏ స్నేహ౦ నాకొద్దు... ఏ బ౦ధ౦ నాకొద్దు

Monday, October 22, 2012

ఈ గాధను నా మనసునులోని భాధగా మార్చుకొని ,


కాలం కరిగిపోతుంటే.......
మేఘం వాలిపోతుంటే....
ఆత్మీయులు దూరమవుతుంటే,
మనసు విరిగిపోతుంటే ...
ఈ గాధను ఎవరికి చెప్పుకోను ,
ఈ గాధను ఒకరికి చెప్పి బాధించడం కన్నా,
ఈ గాధను నా మనసునులోని భాధగా మార్చుకొని ,
ఈ కాలంతో పాటు కరిగిపోతూ ,
ఆ మేఘంతో పాటు వాలిపోతూ,
ఈ అనంతవాయువులలో కలిసిపోవాలని,
ఈ చివరిక్షణాలే ,నా మధుర క్షణాలు కావాలని,
పరితపిస్తూ , ఆ చివరిక్షణం కోసం వేచిచూస్తూ

Sunday, October 21, 2012

మెడ వంపులోనో నడుము మడతపైనో

కళ్ళూ కళ్ళూ కలవగానే
సిద్ధంగా ఉన్న సగం నవ్వు
పెదవులపైకి జారుతుంది...
అలసట జతగా తెచ్చుకున్న అసహనం
మాటల్ని ముక్కలు చేసి విసిరేస్తోంది..

మెడ వంపులోనో నడుము మడతపైనో
ఎదపై నిలవనంటున్న పైటసాక్షిగా..
నడిరేయిన వేలికొసల పలకరింపులు..
నిర్లిప్తత వాగు దాటాలంటే
శరీరాలు మాట్లాడుకోక తప్పదనుకుంటా!

స్పర్శ ఇచ్చిన భరోసానేమో
నా హృదయమంతా నీ ఊపిరిగా మారింది!

నిద్రదుప్పటి కప్పుతున్న నీ పరిమళం సాక్షిగా
ఒక్కమాట తీసుకోనీ..
నిజం కాని నిజంలా..
ఊహల తీరంలో విహరిస్తున్నాను నేను..

చీకటిని కాకున్నా ప్రతి వేకువనీ
కలిసే ఆహ్వానిద్దాం .. గతం సాక్షిగా
ఇవన్నీ ఊహలే నిజాలు కాదు..
నిజాలు అయ్యే అవకాశం అస్సలేలేదు..
కాని ప్రతి క్షనం నీ జ్ఞాపకాలు వెంటాడు తుంటే..
ఏంటో చిలిపి కోరికలు చిందులు తొక్కుతున్నాయి..
విరహంలో వెర్రి అలోచనలంటే ఇవేనేమోకదా..?

Saturday, October 20, 2012

కన్నీరై కన్నుల్లో ఉన్న నీరూపాన్నే అభిషేకిస్తున్నాయి

నీతో మాట్లాడలనుకునే మాటలని గుండెల్లోనే అదిమిపెడుతుంటే

కన్నీరై కన్నుల్లో ఉన్న నీరూపాన్నే అభిషేకిస్తున్నాయి

ఎందుకో నీ కోసం కన్నీరు కార్చినా ఆనందంగానే ఉంది

ఎందుకంటే నీ మనసుని తాకలేని నా మాటలు

కన్నీరై కన్నుల్లో ఉన్న నీరూపాన్ని తాకుతున్నందుకు .

ఉలిక్కి పాటు కలతనిద్రని చెరిపేస్తున్నాయి

మది కలవర పడుతోందీ..
మనస్సు ఆరాటపడుతోంది
కల నిదురను చెరిపేసింది..
నీ జ్ఞాపకాలు
ఉలిక్కి పాటు కలతనిద్రని చెరిపేస్తున్నాయి

నేనిక్కడ అంటూ పలకరిస్తావు
మదిలో గుబులు రేపుతావు..
మనసా అని పిలిచే లోపు...
కన్నీరు మిగిల్చి కనిపించకుడా పోతావు..
నేనెలా ఉన్నాను ..అంటూ ఒక్కసారి పలకరించలేవా
అన్ని మాటలు ఊసులన్ని గాలిలో కల్సిపోయాయా
ఒకప్పుడు నీవు నన్ను తలచుకున్నా
నిన్ను నేను తలచుకున్నా గంతులేసే మనస్సు
ఇప్పుడు ఎవ్వరు ఎవ్వరి ఏమికానివారిలా
బద్ద శత్రువుల్లా.
గాయం గతుకుల్లో ఉబికి వస్తున్న రక్త్తంలా
బాదలో..బారంగా జీవిస్తున్నా మనసా

Thursday, October 18, 2012

మసకబారినా జ్ఞాపకాల సమాహారం ఇది

రాయడం నాకు ఇష్టం మొదలైంది నీవల్లే
కదిలించగల భావుకత వుందని కాదు
కదిలిన నా హృదయస్పందనకి అసలైన అక్షరరూపం కోసం

రాయడం నాకు అవసరం
పరిపక్వత నిరూపణ కోసం కాదు

పరిమితులులేని మనసుపయనానికి అక్షరదిక్సూచి కోసం..

ఏన్నోసార్లు నీవిషయంలో ఓడిపోయిన నేను
ఎంతగా ఇంకా ఓడీపోతున్నానో తెలపడంకోసం

రాయడం నాకు అలవాటు చేసిందే నీవు
ఆలోచనాసరళి మెప్పుదల కోసం కాదు
మసకబారినా జ్ఞాపకాల సమాహారం ఇది
రాయడం నాకు ఆనందం కాదు
చిందాడే అందమైన పదాల కూర్పుకై కాదు
చిరునగవుని అద్దిన క్షణాల అక్షరసంయోగం కోసం

రాయడం నాకు అమూల్యం
తప్పొప్పుల సమీక్షాసమాహారాల కోసం కాదు
తడబాటులేని విలువల విలువైన అక్షరపాఠం కోసం
రాయడం నాకు స్వార్ధం
నాకవసరంలేని అంగీకారాల కోసం కాదునల్లని ఙ్ఞాపకాలు సిరాగా మార్చి,
కాగితాలపై అక్షరాలను పొందు పరిచే ప్రయత్నం
రాయడం నాకు వేదన..బరించలేని భాద తట్టుకోలేని గుండె కోత..
మనసు చచ్చిన మనిషిగా తట్టుకోలేక రాస్తున్న అక్షరాలే ఇవి

రాయడం నాకు అతి ముఖ్యం
ప్రేరేపించడం కోసం కాదు
నా గుండె చప్పుడు ను చెప్పడం కోసం ప్రియా

రాయడం నాకు అవసరం
నేనేమిటో తెలుపుకోవడానికి కాదు
నేనేమిటో నీవు మరవకుండా తరచి చూడటంకోసం..

ఎప్పుడైనా నేనంటూ దూరం అయితే నీ వెతుకులాటలో..
ఈ అక్షరాల సమాహారాన్ని చూసి అప్పుడైనా అర్దం చేసుకుంటావని..
ఎంత తరచి చూసినా నాలో పేర్కొన్న భావలివి అని తెలుసుకో..

నీవు నిజం తెల్సుకునే సమయానికి ..
ఈ అక్షరాలే నీకు మిగిలేది..నేనుండనుగా
ఇంత ప్రేమ నీపై పెట్టుకున్నా నీపై ఇప్పుడన్నా నన్ను అర్దం చేసుకుంటావా..
నేను ఇక లేను అని తెలుసుకున్నాక ఒకన్నీటి బొట్టు రాలుస్తావా..

వద్దు నాకోసం ఆ కన్నీటీ ని వేష్టు చేయకు అనేది నాసలహా..
విలువలేని నాలాంటి మనుషుల కోసం విలువైనా కన్నీరు కార్చకు..
ఒక్క కన్నీటీ బొట్టు రాల్చవని తెలుసు కాని ఎక్కడో..?

అయినా నా పిచ్చి గాని నీను నేనెందుకు గుర్తుంటాను చెప్పు..
గుర్తు ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి.. WhO am I dear
ఇప్పుడనుకుంటున్నావు ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టాడు ..
పోయాక కూడా ఇలా చిరాకు పెడ్తున్నాడని అనుకుంటున్నావుకదూ...Sorry Dear

ప్రేమ.. దొరకదా వెతికితే కడలైన కన్నీట,

మనసు పలికే భాష ప్రేమ,
మౌనమడిగె బదులు ప్రేమ..
మరణమైనా తోడు ప్రేమ,
మనకు జరిగె మాయ ప్రేమ..
మనకు జరిగె మాయ ప్రేమ.. ..
గుండెలో యదలనే కాల్చుమంటే

ప్రేమ... రగిలిన సెగలనే ఆర్పునది
ఈ ప్రేమ... ఆదియు అంతమూ లేని పయనం
ప్రేమ... వేకువై చేరునే చికటింట్లో
ప్రేమా.. విశ్వమంతా ఉన్న
ప్రేమ,ఇరుకు యదలో దాచగలమ.. .. కా
టిలో కాలదు తుది లేని
ఈ ప్రేమ..జన్మనే కోరదు అమ్మెరుగదీ
ప్రేమ.. దొరకదా వెతికితే కడలైన కన్నీట,
తరమక దాహమే నీరల్లే
ఓ ప్రేమ.. నీడనిచ్చే వెలుగుతోడు,చీకటైతే ఏమికాను..


నీ వెదురు చూసిన క్షనాలు ముగిసాయి


కలం కన్నీరు పెడుతోంది
అదేకదా నాకిప్పుడు తోడు
చేసిన బాషలు మర్చిన మనిషి
జ్ఞాపకాల దొంతర కదిపి
అక్షరాలుగ పేర్చాలనే
పిచ్చి ప్రయత్నం
ఏ అక్షరం సరిగ్గా నిలవడం లేదు
ఎక్కడ మొదలు  పెట్టానో
ఎక్కడ అంతం చేయాలో
తెలియని వింత పరిస్థితి
నీ జ్ఞాపకాలు చేస్తున్న  అలజడి

మాటలు తడబడుతున్నాయి
మాటలు మూగగా మారాయి
ఆలోచన మందగించింది
కలం కదలనంటుంది
మది అలజడి
గుండెళ్ళో దడ

అదుపుతప్పుతున్న మనస్సు
ఆవేశం, ఆందోళన
జరుతున్నది తట్టుకోలేక
జరగబోయేది ఊహించలేక
ఊహకందని వాస్తవాల్ని
వాస్తవాల బ్రమల్ని
కమ్ముకుంటున్నానల్లని మేఘాళ్ళా
ముసురుకున్న జ్ఞాపకాలు
తేనెటీగళ్ళా  గుండెను ముసిరి
కుట్టేస్తున్నాయి..
ఎక్కడ బడితే అక్కడ
గుండెకు జ్ఞాపకాల
తేనెటీగలు తియ్యగా
కుడుతూ బొక్కలూ చేశాయి
ఒకప్పుడు నిండుగా విశాలంగా
హృదయం ఇప్పుడూ
చిల్లుల బొంతర అయ్యింది

నీ వెదురు చూసిన క్షనాలు ముగిసాయి
నేనెదురు చూసిన క్షనాలు ముగిసాయి
చివరిక్షనాలు లెక్కపెట్టుకుంటున్నా
నీవు కోరుకునేది అదే కదా
ఆరోజు కోసమేగా నీ ఏదురు చూపులు..?


Wednesday, October 17, 2012

కాలి పోతున్న కావ్యాన్ని నేను ప్రియా...

ప్రియా  నేను అన్న పదాన్ని మరిచా
నిన్ని వెతులాటలో
మది కలవరింత
దిగాలుగా ఉన్నా
ఓదార్చే వారు లేక


ప్రియా  అక్షరాలన్నీ భారం అయ్యాయి
మనసు రోదనలో
గజిబిజిగా మారిన అక్షరాలు
పదాలు అర్దం మారుతున్నాయి
నీలో నన్ను వెతుక్కోవాలని చూశా
ఆ ప్రయత్నంలో విఫల అయ్యా
విధి చేతిలోనే కాదు
నీ అవమానంలో
ఇప్పుడు కాలిపోతున్నా  ప్రియా

ప్రియా  ఇంకా కాలిపోతూనే ఉన్నా
మంటలు నన్ను 
ఎప్పుడొ కమ్మేశాయి
నాలో ప్రతి అవయవం
కాలి పోతోంది
ఉడుకుతున్న నా అవయవాలు
మాంసపు ముద్దలు గా మారుతున్న క్షనం
అయినా నీలో చలనం లేదు.
ప్రియా  ఎవరికోసమో వెతుకుతున్నావు
నీవు నాకోసమా..?
ఆ ఆలోచనే నన్ను  నవ్విస్తోంది


ఒకప్పుడు నీకోసం
ఆత్రం గా వెతికే వాన్ని 
నీతో మాట్లాడాలని
నీతో ఏవేవో ఊసులు పంచుకోవాలని
కాని ఇప్పుడు..నీవంటే భయం
ఎక్కడ అవమానిస్తావొ
ఎవరి సమక్షంలో
నన్ను వెర్రివాడిని చేస్తావొ.
.

నన్ను ఎన్ని సార్లు
అవమానిస్తావు ప్రియా
గుండె పగిలినా ..మనసు రగిలినా.
ఇప్పుడు కాలిపోతున్న కావ్యాన్ని

కాలీపోతున్న నాదేహంలో
ఎముకలన్నీ బూడిదై
కుప్పగా కూలిపోతున్నా
ప్రియా  దూరంగా చిరునవ్వులు నవ్వుతూ నీవు
మరొకరి సమక్షంలో
ఇప్పుడు నీదృష్టీలో నేను
చెత్త కాగితాన్ని కదా ప్రియా ..?


Monday, October 15, 2012

ఓ వర్షం కురిసిన పగలు " ( నిజం కాని నిజం ) Real Story


ఎందుకో నిన్ను చూడాలనిపింది.... ఏదురు పడలేను.. అంత దైర్యం లేదు..బయలు దేరుదాం అనుకున్నప్పుడే పెద్ద వర్షం.. ..మనిద్దర్ని విధే కాదు వర్షంకూడా విడతిస్తుంది అని విసుక్కున్నా ఎందుకంటే ఆరోజు కారు తీరుకు రాలేదు ..నా కారు నీవు గుర్తుపడతావు... మరి దూరంగా నిలబడి చూడలేను .. మొత్తనికి వర్షం తగ్గింది నిన్ను చూస్తానో లేదు అటుగా వస్తావో లేదో అంటూ మళ్ళీ టెన్షన్...మొదటిసారి మనిద్దం  కలుసుకుందాం అనుకున్నప్పుడు ఎలా టెన్షన ఫీల అయ్యానో అలా.. బయలుదేరెప్పుడే నీగురించి కనుక్కున్నా .. ఆఫీలో ఉన్నావా లేదా .. రోజు ఏటు వెలుతున్నావో అని ..సో .. అటుగా నే వెలుతున్నావని నిర్దరించుకొని .ఇంకా టైం ఉందని గడియారం చూసుకొని గుండె దైర్యం కావాలంటే ఓ దమ్ముకొట్టాలి కదా... ఓ కింగ్ సిగరెట్ లాగించి.. ఈ మద్యి ఎక్కువైందిలే..మరి నన్ను అమాతంగా వదలి వెల్లావు ఎమయ్యానో అని తెల్సుకోనంతగా అవమానించి.. ప్రేమించాను కాబట్టి నీ జ్ఞాపకాలు గుండెళ్ళో ఉంటాయి మర్చిపోలేను నిన్ను వదులుకోలేను .. నీవు చేయ్యగలవు నీకు ఏదైనా సాద్యమే ..నాలాంటి స్నేహితులు నీకు ఎందరో..నేను గుర్తుడాలి నాజ్ఞాపకాలు అనుకోవడం నా పిచ్చిగాని .. నీకు  ఏం అవసరం చెప్పు..అప్పుడు ప్రేమించాను అని చెప్పి నేను అలా అన్నానా అన్నప్పుడే  నా మైండ్ బ్లాంక్  అయింది..ఇంకా చాలా జరిగాయి ఇప్పుడు అనుకోని ఏంలాబం లెండి..అప్పటినుంచి ఇప్పటిదాకా గుర్తొచ్చినప్పుడు భాదపడటం తప్పించి ఏం చేయగలను.. ఇప్పుడు భాదపడటంలో బాగా ఎక్సిపీరియన్స్ వచ్చింది.. ప్రతి చిన్నవిషయానికి ఒంటరిగా భాదపడటం అలవాటు చేసుకున్నా.. కొన్ని సంఘటలుకూడా ఇంకా భాదను పెంచేవే జరగటంతో అలాగే ఫిక్స్ అయ్యాను..అలా నీగురించి ఆలోచిస్తూ బండిమీద నేను అనుకున్న ప్లేస్ కు వచ్చాను  అయినా ఇంకా టైం  ఉంది ...ఎందుకో భయంగా ఉంది.. టెన్షన్ గా ఉంది ఆగలేక మరో సిగరెట్ కీంగ్ త్రాగుచూ వెచ్చటి చాయ్ తాగుతుంటే .. హాయిగా ఉన్నా గుండెళ్ళో  నీ జ్ఞాపకాలు వేడి ఆవిర్లు పుట్టిస్తున్నాయి..అప్పుడెందుకో  గుర్తొచ్చిన కొన్ని జ్ఞాపకాలు గుండెళ్ళో దడగా  అనిపించాయి...వర్షం ఇంకా చన్నటి చిరుజల్లులు కురుస్తూనే ఉంది.. వాతావరణం హాయిగా ఉంది.. అబ్బా ఇద్దరం ఇలా ఒంటరిగా చెట్టుక్రింద చిరుజల్లులు పడుతుండగా నీతో కూర్చొని కబుర్లు చెబుతుంటే ఆ  ఆలోచనే హాయిగా ఉంది....అప్పుడే గడియారం చూసుకున్నా సమయం అయింది.. మీ ఆఫీసులో కు స్నేహితునికి ఫోన్ చేశాను నీవు బయలు దేరావని చెప్పాడు.. వాడే ఫోన్ చేద్దాం అనుకున్నాడు ఈ లోగా నేనే చేశాను .. అంతే సరే  అని  నీకోసం ఎదురు చూస్తున్నాను ఎవరెవరో వస్తున్నారు.. కాని నీవు మాత్రం కనిపించలేదు. ... నిరాశ.. గుండెదడ... ఏంటో మొట్ట మొదటిసారి నిన్ను చూస్తున్నట్టు ఫీలింగ్ నిజమే నిన్ను చూసి సంత్సరం అయిందనుకుంటా..అదుగో దూరంగా కనిపించావు గ్రీన్ డ్రస్ మనిద్దరం కల్సినప్పుడు చాలా సార్లు వేసుకొని వచ్చావు... ఆడ్రస్ నీకు బాగుంటుంది..వచ్చేస్తున్నావు.. ఎక్కడ నేను నీకు కనిపిస్తానో అని వెనక్కు వచ్చేశా లీలగా నీవు కనిపిస్తున్నావు వచ్చేస్తున్నావు వచ్చేశావు చాలా దగ్గరకు.. ఎందుకో నేనున్న ప్రదేశానికి దగ్గరగా వచ్చి బండీ ఆపావు గుండే ఆగినంత పని అయింది..బ్యాగ్ లోనుంచి సెల్ తీసి పక్కగా బండి పెట్టుకొని మాట్లాడుతున్నావు.. ఈ లోగా వర్షం పెద్దది అయింది.. రోడ్డుమీద ఉన్నవాళ్ళూ చెట్లక్రిందకు చేరుకున్నారు.. నాదగ్గరగా నీవు నన్ను చూసే అవకాశం లేదు.. జనం చాలా మంది ఉన్నారు  కాని చాలా దగ్గరగా ఉన్నావు నీవు ,, ఎంత దగ్గర అంటే నీవు బాడికి కొట్టిన సంట్ నాకు వాసన వచ్చేంత దగ్గరగా  ఒకప్పుడు ఇంత దగ్గరగా ఉన్నప్పుడు ఏన్నో కబుర్లు చెప్పుకున్నాం....ఒకరికోసం ఒకరు అనుకున్నాం.. క్షనం తీరిక లేకుండా మాట్లాడుకున్నాం ఎందుకో అన్నీ గుర్తుకు వచ్చాయి.. ఒక్కసారిగా తరువాత జరిగిన పరిణామాలు  నీవు నన్ను ఓ శత్రువులా చేశాడో వెదవ వాడు చెప్పినవి నమ్మావు. అంటే ఒక్కసారి గిర్ర్తున తిరిగిన గతం గుర్తుకు వచ్చి దుక్కం పోంగుకొచ్చింది కంట కన్నీరు ఆగలే  అక్కడ ఓ అద్బుతం .. కన్నీరు తుడుచుకునే సమయం లేదు ఈలోగ పెద్ద గాలి రావడం చెట్లఆకుల్లోంచి నీరు జలజల పడటంతో నేను ఏడ్చిన విషయం ఎవ్వరు తెల్సుకోలేదు.. ఇంకేం హేపీగా ఏడ్చాను  అదీ నీవు పక్కన  గుడేల్లో చేరి ఏడిపిస్తున్న జ్ఞాపకాలు... ఆకులు అప్పటిదాకా దాచుకున్న నీటిని నామీద ఒలకబోసినట్టుంది.. దాదాపుగా తడచి పోయాను నీవు తడచిపోయావు... తడచిన అందాల్లో ఇంకా ఎంత అందంగా కనిపిస్తున్నావో చూశావా అంత భాదలో కూడా నీ అందాలను ఏడుస్తూ తడిమి చూస్తున్న నా కన్నులు నిజంగా సరసమైనవి కదా.. "వర్షం కురిసిన పగలు  "ఇది నా అనుభవం బాగుందా...?

నామనసు జల్లుమని అదృస్యం మిస్సయ్యాని చిన్న భాద..

.ఈ చిన్నది చిరవ్వుతో చంపేస్తుంది
 చిన్నపెదవిలో దాగున చిరునవ్వు
 మనసులో రేపుతోంది గుబులు
 అటుగా వెలుతున్న నాకు
 కనిపించిదోచిన్నారి ఇలా

.ఎదురుగా ఓ టీష్ష్టాల్ లో చూసుకొని
  తననే చూస్తూ కూర్చున్నా
  కూర్చువడంలో కూడా
  కవ్వించ్చొని ఇప్పుడే తెల్సింది

వాలుజడను వయ్యారంగా
 ముందుకేసుకొని అలా
 ముగురులు సవరించుకొంటూ
 ముగ్గులేస్తోదా చిన్నారి
 చిలిగా నవ్వ్తుతూ
ముగ్గు వేస్తూ.. గడపలో కూర్చొని

వెయబోయే ముగ్గు వైపు చూస్తూ
ఎదురుగ ఉన్న నావైవు
అలా ఒక్క క్షనం నన్ను చూసింది
ఇక్కడ నాగుండె ఆగింది..
.ప్రపంచం అలాగే ఆగిపోతే
  బాగుండు అనిపించి ప్రియా

దూరాన ఉన్న నాకు కనిపించిందో దృస్యo
పరికినీ కోంద తొలగి వయ్యారి నడుము
నన్ను పలుకరించింది..చిలిపిగాఅలా చూస్తూ ఉండీపోయా..
ఆచిన్నడి సుతారంగ నడుము ను చీరకొంగుతో మూసింది
నామనసు జల్లుమని అదృస్యం మిస్సయ్యాని చిన్న భాద..
మళ్ళీ ముగ్గులేస్తూ వంగినప్పుడు మరో దృస్యిం
జివ్వుమనిపించింది..రక్తం ఒక్కసారి మరిగినట్టు
అలా ఓరచూపులతో కవ్వించి
చిన్నిపెదంతో నవ్వి ఊరించి
ఉడికించి.. వెలుతూ వెలుతూ
ఒక్కసారి వెనక్కుతిరిగి చూసి
 వెల్లిపోయింది ఆచిన్నది
మళ్ళీ వస్తాఅని చూసింది
ఏం పనిలేదా అని చూసిందో
ఆ చూపులో అర్దాలు
అర్దంకాక  చిన్న్నారి
అందాలు తలచుకొంటూ


 

Sunday, October 14, 2012

గోరింట పూసింది గోరింక కూసింది


గోరింట పూసింది గోరింక కూసింది
గొడవేమిటే రామ చిలకా గొడవేమిటే రామ చిలకా
నే తీర్చనా తీపి అలకా ఆ
నే తీర్చనా తీపి అలకా

గోరింక వలచింది గోరింక పండింది
కోరిందిలే రామ చిలక కోరిందిలే రామ చిలక
నీ ముద్దు నా ముక్కు పుడక ఆ
నీ ముద్దు నా ముక్కు పుడక
ఏలో ఏలో ఏలేలో ఏలో ఏలో ఏలో ఏలేలో ఏలో

పొగడాకు తేనేంతో పొదరిల్లు కడిగేసి
రతనాల రంగులతో రంగ వల్లులు తీర్చి
ఎదలోన పీటేసి ఎదురొచ్చి కూర్చుంటే ఆ ఆ ఆ ఆ
సొదలేమిటే రామచిలక సొదలేమిటే రామచిలక
సొగసిచ్చుకో సిగ్గు పడక ఆ సొగసిచ్చుకో సిగ్గు పడక
గోరింక వలచింది గోరింక పండింది
ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహా

విరజాజి రేకులతో విరిసేయ సవరించి
పండు వెన్నెల పిండి పన్నీరు చిలికించి
నిదరంతా మింగేసే నిసిరాతిరి తోడుంటే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కొదవేమిటే గోరువంక కొదవేమిటే గోరువంక
కడపొంగుతో కట్టుపడక ఆ ఆ
కడపొంగుతో కట్టుపడక
గోరింట పూసింది గోరింక కూసింది
కోరిందిలే రామ చిలక కోరిందిలే రామ చిలక
నే తీర్చనా తీపి అలకా ఆ నే తీర్చనా తీపి అలకా

మదిని మర్చి మనసును ఏమార్చి..గుండెళ్ళో గుచ్చావు

ఎవరు నీవు నాకేం అవుతావు ఎందుకొచ్చావు నాజీవితంలోకి నేను నిన్ను రమ్మని అడగలేదే నా మనస్సులో దూరమని బ్రతిమిలాడలేదే నా భాదలు పంచుకొని ఓదర్చి నట్టు నటించావు నీపరిచయమే వింత.. నీ ప్రవర్తన మరో వింత.. భాదల్లో ఉన్ననీవు ఓదార్పులావచ్చి కడలిలో కన్నీళ్ళను తరచి..తలపులు మార్చి ఊహలు ఊరించి ఆశలు రేపి అదోపాతానికి నేట్టావు మదిని మర్చి మనసును ఏమార్చి..గుండెళ్ళో గుచ్చావు గూడుకట్టుకున్న ఆశలు రేపి. రయ్యిమంటూ ఎగిరిపోయావు నీ కన్నుల్లో నిజాయితీ లేదు నీ మాటలు మొత్తం మాయనే చెప్పే మాటల్లో ఒక్కటీ నిజాయితీ లేదు నన్ను చంపటానికి నీవు పుట్టావేమో నా చావు కోరటానికి వచ్చిన అందాల రాక్షసి నీవు ఒకప్పుడు నీతో మాట్లాడాలని మనస్సు తహ తహ లాడేది నీవు చెప్పిన మాయా మాటలు ఇప్పుడు నీ చేష్టలు మనస్సు నిన్నే కోరుకుంటున్నా.. తనువు నీకు దూరంగా పారిపొమ్మంటుంది నన్ను భాదపెట్టి ఏంసాదించావో నన్ని గుండెళ్ళో గుచ్చి ఏంసాదించావు మనిషిని ఈలోకంనుంచి శాశ్వితంగా పోవడానికి నీవేకారణం నీకిప్పుడు సంతోషమా ఎందుకు దేవున్ని పూజిస్తా దండగ.. మరో మనిషిని మానసికంగా చంపి మన్సును ఏమార్చి ..ఏం సాదించావు ప్రియా

Saturday, October 13, 2012

My New Pic..

వర్షించడానికి సిద్దం గాఎన్నేళ్ళ భావాలో?

నన్ను మాట్లాడనివ్వు... లోలోన అదిమిపెట్టుకున్న ఎన్నో ఆశలుఆనందాలు, కన్నీటి సవ్వళ్ళను ఇప్పటికైనా నీ చెవిని తాకనివ్వు ! చాలు...ఈ మూగ రోదనింక చాలు గుండె పాటను గొంతులో ఆపేసినఆనవాళ్ళు చెరిగిపోయేలా ఒక్కసారి కేక పెట్టనివ్వు... ఇకనైనా నన్ను మాట్లాడనివ్వు! వర్షించడానికి సిద్దం గాఎన్నేళ్ళ భావాలో? ప్రవాహం లాఎన్నెన్ని కన్నీళ్ళో?

నిన్ను ఛూడాలని మనస్సు ఉబలాట పడుతోంది

నీకు గుర్తుందా మనం కల్సింది అక్టోబర్ లోనే.. ఈదే నెలలో.. క్షనం ఏక్కడ ఆవకాశం దొరుకుతుందాని ఎదురు చూశాం.. ఇన్ని రోజులు ఎలా గడచిపోయాయో విది మనిద్దరితో ఆడుకుంది.. మనం ఎందుకు దూరంగా ఉంటున్నామో .నిద్ర పట్ట్క రాస్తున్నా నిజంగా నీలాగా ప్రేమగా ఎవ్వరూ పిలవలేదు..... స్వార్దపరూలే అందరూ... నీతో గొడవపడ్డా నీలో నిజాయితి నన్ను ఇంకా నీవాడినే అని మనసు తపిస్తుంది... స్వార్దపరుల చేతిలో ఓడిపోయాను..నిన్ని చూడాలని నీతో మాట్లాడాలని ఉంది.. అమ్మ చనిపోయినప్పుడు నీవు చెప్పిన దైర్యం..మనసు బాగాలేనప్పుడు నీవిచ్చి సలహా.. ఎందుకో..ఎవ్వరినైనా ఎదురించి నీకు దగ్గర కావాలని ఉంది..మనుషులు ఇంతే మనం వాళ్ళను ఎందుకు లెక్క చేయాలి మనిషిగా మొదటిసారి మనసును గెలిపించావు ఎందరినో చూశాను అందరిలో నీవిచ్చిన దైర్యం.. నీవు చూపిన ప్రేమ ..నేనూ ఎక్కడ భాదపడతానో అని పడ్డ కంగారు..తలచుకుంటే మదిలో గిలిగితలు పెడుతున్నా..స్వార్దపరులు మనమద్యి చేరినప్పుడు ..నన్ను కాదన్న క్షనాన నీ పరిస్థితి తలచుకొని భాదపడ్డాను..నీవు మారావేంటి అని మదన పడ్డాను కాని తర్వాత తెల్సింది ... నీవెంత భాదపడ్డావో..క్షనాలు యుగాగా గడిపిన రోజులు మర్చిపోయావా..ఎందుకో మనస్సు భాద్ అని పించి నప్పుడల్లా నీవే గుర్తుకొస్తావు.. నీవు ఆప్యాయంగా మాట్లాడీని మాటలు ఎలా మర్చిపోను చెప్పు..నన్ను కోదరు నమ్మించి మోసం చేశావు.. నిజం అని నమ్మి మోసపోయాను... ఎందుకో ప్రతివిషయంలో విది వెక్కిరిస్తూ ఆడుకుంటుంది.. నేనేం చేయలేక వెర్రికేకలు వేస్తున్నా నీవు మాట్లాడితే బాగుండు అని ఏన్ని సార్లు అనుకున్నానో ..మనస్సు భాద పడ్డ ప్రతిసారి నీవే గుర్తుకొస్తావు...భాదల్లో ఉన్నప్పుడు నీవు పలుకరించే తీరు... మనస్సు కష్టం అనిపించిన ప్రతిసారి గుర్తుకొస్తావు..గుండెలు పగిలే నిజాలు తెల్సినప్పుడు నీవు తోడుంటే అన్నీ నీకు చెప్పుకోవాలని పిస్తుంది.. చిరునవ్వునవ్వుతూ సలాహాలు ఇస్తున్న నిన్ను అలా చూస్తూ గడిపేయాలని పిస్తుంది.. మనిద్దరీ మద్యా ఎందరో కావాలని సృష్టించిన అఘదం పూడదా నీ చల్లని పిలుపు నన్ను దగ్గర్గా చేరేదెప్పుడొ.. ఎందుకో జరుగుతున్న క్రమం నన్ను బ్రతకనీయదేమో అనిపిస్తుంది. ఒక్కొక్కటిగా ఎదురు తిరుగుతున్న పరిణామాలు .. నమ్మించి చేస్తున్న మోసం.. తట్టుకోలేకపో ఎప్పుడు ఏనిమిషాన గుండే కచ్చితంగా ఆగిపోతుంది. నేను అదే కోరుకుంటున్నా.. నీకు ఇంకా ఏదో చెప్పాలని ఉంది.. నా మాటలు విననంద దూరంలో ఉన్నావు... మనసుకు నేను పోయే లోవు దగ్గవ అవుతావన్న నమ్మకంలేదుతున్నా ప్రాంణం ఉండేలాలేదు.. ఏక్షనం అయినా ఆగిపోవచు.. ఒక్కొక్కటిగా ఎదురు తిరుగుతున్న పరిస్థ్తితులు నన్ను ఆదిశగా వెళ్ళమని మనస్సు నన్ను చిరాకు పెడుతోంది,, నేను పోయేలోపు ఒక్కసారి దగ్గరగా నీతో మాట్లాడాలని ఉంది సాద్యింకాదు కాని ఎందుకో మనస్సు భాదపడ్డప్పుడు నీదరికి చేరాలని పిస్తుంది.. ఏమో ఇక నన్ను చూస్తావో లేదో..కాని ఒక్కసారి నీతో మాట్లాడాలని బాదలు చ్చెప్పుకోవాలని ఉంది ..మాట్లాడే దైర్యం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా మాటలు పలుకలేనంత నీరసంగా గుండె కొట్టుకుంటోంది.. ఆగిపోతుంది ఎప్పుడు.. అయినా మనసాగక నిన్నే పలుకరిస్తోంది చివరిపలుకులకు నాకు అవకాశం ఇవ్వవా..ఎందుకో చివరిక్షనాలు లెక్క బెట్టుకుంతున్నానేమో అనిపిస్తుంది..

Friday, October 12, 2012

నీ మాటల తూటాలు గుండెల్లో పేలుతూనే ఉన్నాయి

నా ఊహల్లో తను నిండిపొయింది అనుకున్నా తన గుండెల్లో నన్ను దాచుకుంది అనుకున్నా నా స్నేహం తాను అందుకుంది అనుకున్నా తన లోకం నేనే అని అంది అనుకున్నా నన్ను ఒక్కసారిగా అవమానించిది తన స్నేహితుల్లో అందరి కంటే నన్నొక్కడీనే ద్రోహిని చేసింది ప్రియా నేను నిన్ను ఒక్కమాట అనలేదే.... అయినా చెప్పుడు మాటలు వీ అవమా నించావు నీ మాటల తూటాలు గుండెల్లో పేలుతూనే ఉన్నాయి కాని ఇవేమి పట్టనట్టు నీవు హేపీగా ఉన్నావు ఇప్పుడని పిస్తుంది నీకు ఏదైనా సాద్యిమే అని నేనూ తన దరిచేరతాను అంటే తన ఙ్ఞాపకాలు నాకు తోడుంటాయని నా ఊహాల్లొ తను ఎప్పుడు జీవిస్తానని అన్నీ నిజం అని నమ్మాను నమ్మకానికి తూట్లు పొడిచి.. మనసా ఎందుకు వేదిస్తున్నావు నా ఊహల్లో ఎల్లప్పుడు జీవించే నా నేస్తానికి ఇది నేను అందించె ఒక కవితా కుసుమం ఈ కుసుమ పరిమళాలు నా నేస్తనికి చేరుతాయని ఆశతో ఎదురుచూస్తున్నాను... నిజాలే కళ్ళలై పోయాయి ఇంక కలలు నిజాలు ఎలా అవుతాయి అయినా ఎక్కడో చిన్న ఆశ. బ్రతికిస్తుంది ఎన్ని రోజుల్లే ఊపిరి ఆగేదాకే కదా..?

Thursday, October 11, 2012

ప్రతి రోజు ఎదురు చూస్తున్న ఏ రోజైన మాట్లాడతావని

నీతో నీకోసం ఒక జీవితం కావాలి. నీ తోడంటు లేనప్పుడు స్వర్గంలో ఉంటె ఏంటి ఈ నరకం లో ఉంటే ఏంటి కను రెప్ప నుండి జారే మొదటి చుక్కని చేరిపెందుకు నా చేయి పట్టుకుని లాలిస్తావని ఈ ఎదురు చూపులో నీ ఊసులు వినలేని నీ ఊహలు కనలేని నా ఈ ఊపిరి ఉంటే ఏంటి లేకున్నా ఏంటి ..?!? నువ్వు నీ నవ్వు లేని ఈ లోకం తో నాకు పనేంటి బంగారం నా భయం ఒక్కటే ఈ జీవితం లో మనం మరల కలిసినా ఒక కృత్రిమమైన సంభాషణ తో మరల విడిపోతామని ప్రతి రోజు ఎదురు చూస్తున్న ఏ రోజైన మాట్లాడతావని ఇలాంటి రోజోస్తుందని తెలిసు ఇంత భయంకరం గా ఉంటుందని తెలియదు మునుపటిలా ప్రేమించు అనలేను వీలైతే మన్నించు

Wednesday, October 10, 2012

ప్రతి క్షణం నీవులేని లోటును తెలుపుతూనే వుంది

నేస్తమా నిన్నటి వరకూ ప్రాణ స్నేహితులం కానీ... ఈ రోజు ప్రాణమే మిగిలింది... స్నేహం కాదు కలిసిరాని కాలం కన్నీటి సాక్షిగా... మరపురాని మన స్నేహాన్ని గతంగా మార్చేసింది ప్రతి క్షణం నీవులేని లోటును తెలుపుతూనే వుంది కష్టమొచ్చినప్పుడు కన్నీటి కంటే ముందు నేనున్నానని గుర్తుంచుకో... మనుషులు విడిపోవచ్చు... మనసులు ఓడిపోవచ్చు... మమతలు మాసిపోవచ్చు... మారనిది స్నేహమొక్కటే.. ఔను...నిజమే,, ఇప్పటికీ ఏం మారలేదు... నువ్వు గుర్తొచ్చినప్పుడు చిరుగాలి కన్నా చల్లని నీ చిరునవ్వు నను పలకరించి పోతుంది ఎప్పటికీ వెంటాడుతూండే ఆ కళ్ళలోని మెరుపు నను తాకి వెళుతుంది ఇవే కాస్త ఓదార్పునిస్తోంది ఎప్పటికీ చకోరంలా నిరీక్షించే... ఓ నేస్తం...

Tuesday, October 9, 2012

రాసలీలల రాజు లేనిది రాధా అర్దం మే లేదే

యమునా తటిలో నల్ల నయ్యకయి ఎదురుచూసేనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడి పోయనే కాదా ..రేయి గడిచెను పగలు గడిచెను మదవుండు రాలేదే ..రాసలీలల రాజు లేనిది రాధా అర్దం మే లేదే ...యదుకుమారుడే లేని వేలలో వేధలు రగిలెను రాధా గుండెలో .....
రాధా మాధవుని వచ్చేనా నీ చెంతకు .. వెన్నలారాత్రుల్లో వేడీ పుట్టిస్తూ.. వగలు పోకేవయ్యారీ వలచి వచ్చాను వలదు అనక చెంతకు చేరి సేద తీరవే చిన్నారి మళ్ళేలు మత్తెక్కిస్తున్నా. ఆకోరచూపుల్లో కొరికా లేక కవ్వింపా కన్నె సుకుమారి .రాజును నేనొచ్చా మన్మద రాజ్యాన్ని ఏలుకుందామా ఇక రాత్రిమొదలైంది..రానని చెప్పకు చేరువై వెన్నెలరాత్రిని కరిగిద్దాం ప్రియతమా.. నీ గుండెలో రేగిన మంటలు నాలో అగ్నిరాజేశాయి ఆరని చిచ్చు మనస్సులో రగిల్చి ఆ చూపుల్లో అర్దం రమ్మనా..రాలేననా వస్తే ఏంచేస్తావనీ...ఆశ గా చూస్తూ నేనాగను నన్నాపకు రాధా

నీకోసం ఆలోచిస్తూ అన్వేషిస్తూ

క్షణ క్షణం అనుక్షణం నిరీక్షణం నీకోసం ఈ ఆవేశం ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఇన్నాళ్ళుగా ఎదురుచూసి అలసి సొలసి సొమ్మసిల్లి పడిపోయా ! మరువరాని మరపురాని క్షణాలను తలచి తలచి దుఖిస్తూ నిర్జీవమైన దేహంతో అంతులేని అనంతమైన శూన్యంలో రెప్పపాటు దుఖంతో మూలుగుతూ మ్రుక్కుతూ నీకోసం ఆలోచిస్తూ అన్వేషిస్తూ నిరీక్షిస్తూ నిట్టుర్పు విడుస్తూ భాధతో వ్యధతో నీకోసం....

Sunday, October 7, 2012

మనసు అను క్షణం నీ కోసం పరుగులు తీస్తుంది

మనసు అను క్షణం నీ కోసం పరుగులు తీస్తుంది అలసట తెలియకూడదని కబుర్లు చెప్తూ నేనూ దానితో..... మెరిసీ మెరిసి అలసిన సూరీణ్ని పడమర లోయలో దాచుకొంటోంది నిత్యం పరుగులు తీసే గోదారికీ సంద్రం చేతులు చాస్తుందిచీకట్లో మగ్గే నింగికీ జాబిల్లి జాబునిస్తుందిమరి నా నిరీక్షణ ఎప్పుడు ఫలిస్తుంది...? నీ సంగమంలో ఈ పరుగు ఎప్పుడు నిలుస్తుంది...? ఆ క్షణాలిచ్చే మధురానుభూతితో

" జ్ఞాపకాలు బాగా దయలేనివి, చాలా పదునైనవి

ఆ రోజులు గుర్తొస్తే సంతోషం లాంటి విచారం కలుగుతుంద "ఆ రోజులు గుర్తొస్తే సంతోషం లాంటి విచారం కలుగుతుంది...... " జ్ఞాపకాలు బాగా దయలేనివి, చాలా పదునైనవి గుండెను అనునిత్యం రంపాలై కోసేస్తుంటాయి... బాధను దిగమింగే ప్రయత్నంలో బ్రతుకులు చీతిమంటలై కాలి పోతుంటాయి....! ఒక ప్రయత్నం విఫల మన్న నిజం మనసుని సూతిమెత్తగా అనునిత్యం శిక్షిస్తుంది...... ఏది చేయాలో తోచని నేను,దేహం ఫుట్ పాత్ మీద అనాధ శవాన్నై వాలిపోతుంటాం.... ఇక అనుభూతుల పరంపర అమ్ముడుపొని దినపత్రికలా... మిగిలిపోతుంది కనిపించక అనిపించే చావేదో ఆత్మహత్యను మరిపిస్తూవుంటది

Saturday, October 6, 2012

" కన్నీరు ............కన్నీటి గాధ "

హాయిగా చల్లగ విహరిస్తున్న నన్నుఇలా మర్చారేంటి గుండెచుట్టూ చల్లదన్నా నిస్తున్న నన్నిలా చేశారేంటీ కంటిని కంటికి రెప్పపా కాపాడుతున్న నేనేంటీలా ఎంజరుగుతుందో తెలీదు...ఎక్కడినించో వెడీ ఆవిర్లు అప్పటిదాకా చిన్నగా కొట్ట్కున్న గుండె వేగం పెరిగింది ఎవరో మనసులో అలజడి సృష్టించారనుకుంటా గుండే అల్ల కళ్ళోకం అవుతోంది అప్పటిదాకా చల్లగా ఉన్న నేను ఒక్కసరిగా.. వెచ్చగా మార కంటిలో చల్లగా సేదతీరిన నేను ఒక్కసారి మనస్సులో వేడీ కన్నీటి నుంచి తరిమేయాలని చూస్తుంది అందేంటి నాకు ఎంజరుగుతోంది నన్ను తన గుండేళ్ళో వేడి తరిమేయాలని చూస్తోంది అయ్యే నేనూ కన్నీరుగా మారానేంటి నాకు ఇక్కడనుంచి వెళ్ళాని లేదు కాని గుండె వేగం పెరిగి .. కళ్ళలోంచి భాదగా నన్ను తరిమేస్తోందా భాద వేడిగామారి ఎందుకో నేను బయట పడితే ' ఆహృదయానికి కొంచెం అయినా ఉపశంతి ఉంటుందేమో అందుకే తనను వీడి వెళ్ళ లేక వెలుతున్నా కన్నీటిగా మారి

Friday, October 5, 2012

నేను కవిని కాదు నేను రాసేది కవిత్వంకాదు

నేను కవిని కాదు నేను రాసేది కవిత్వంకాదు మనసుపొరల్లో అలజడి ...నావన్నీ తాటాకు చప్పుల్లే తడిఆరని కన్నుల్లో..ఉరకలేసే ఆవేశంతో రాస్తున్నా నేను కవిని అని చెప్పలేని ..నాది కవిత్వం అని చెప్పలేదు ఒకప్పుడు నేను రాసే పిచ్చి రాతలు ఒకప్పుడు నీకు కవిత్వంగా కనిపించాయి .. కాని అవి ఎందుకో పిచ్చి రాతలు అయ్యాయి నాకంటే నీవు మెచ్చిన వారిలా రాయడం నాకు రాదు నేను రాయలేను గుండెగదుల్లో..గూడుకట్టుకున్న నిజాలు సముద్రపు అలల్లా దూసుకొస్తూ అవేశంగా.. అక్షరాల రూపంలో రాసే ప్రయత్నం చెప్పుకునేందుకు మనుషులు దూరం అయినప్పుడు అక్షరాల అమరికకు నేను చేస్తున్న విఫల ప్రయత్నం బారమైన మనస్సుతో అక్షరాలను ఏర్చి పేర్చాలని చూస్తున్నానే కాని నేను రాసేది కవిత్వంకాదు.. నాకు కవితలు రాయడంరాదు కనికరంలేని మనుషులు కన్నెర్ర చేసినప్పుడు కాలిన మనసనే కట్టెల తాలూక మసిపొగే నా రాతలు తలరాతను నా రాతల్లో నీ రాతి గుండెను అక్షరాలతో తడిమే ప్రయత్నం కరగని మనస్సును అక్షరాలతో చల్లార్చే ప్రయత్నమే నా రాతలు చిమ్మ చీకట్లో.. వెలుగును అక్షరాలతో వెలుగునింపాలనుకునే ప్రయత్నం నీ మౌనం వెనుక శబ్దాలను.. ఊహాలోకంలో అక్షరాలు గా మార్చుకొని .. నీతో నేను మాట్లాడుకునే ప్రయత్నం నా రాతలు గతంలో మనం మాటలన్ని మూటలుగా ఉన్నాయి నీగుర్తులుగా ఉన్న మాటల మూటలు విప్పి అక్షరాలన్నీ పేర్చి చూసుకునే ప్రయత్నంలో మౌనంగా ఉన్న నీకు ఏదో చెప్పాలనే ప్రయత్నం నలిగిన హృదయం చెప్పలనుకున్న మాటలను నాలుగు అక్షరాలు పేచి మనస్సును కుదుట పర్చే ప్రయత్నం జరిగిన మోసానికి.. అఘాదాల్లో పడిపోతున్న సమయాన అక్షరాలను పేర్చీ ఏమౌతున్నానో అంటూ నాకు నేను చెప్పుకునే ప్రయత్నం

Thursday, October 4, 2012

మా కన్నుల్లో వర్షం కురుస్తుందేమిటి?

అప్పటి వరకు బాధ అంటే తెలీదు అందం గా అల్లుకున్న స్నేహ బంధాలు తప్ప కన్నీళ్ళు అంటే తెలీదు నవ్వి నవ్వి కనుచెలమలు నిండడం తప్ప కష్టాలంటే తెలీదు నేస్తాలతో చిన్న చిన్న అలుకలు తప్ప విడిపోవడం అంటే తెలీదు చేతిలో చేయెసి సాయంత్రాలు నడవడం తప్ప మౌనంగ వుండడం తెలీదు సెలయేరులా గల గలా మాట్లాడడం తప్ప మరి నా జీవితం ఇలా మారించేంటో నవ్వులన్ని జ్ఞాపకాల్లో చేరిపోతున్నాయి అందమయిన బంధాలన్ని ఆటోగ్రాఫ్ లో భాషగా మారిపోతున్నాయి మనసులేమిటి మాటలని దాచేస్తున్నాయి వీడుకోలు చెప్పడం అంత కష్టమా? అరే...ఇదేమిటి? ఆకాశంలో కదా మేఘాలున్నాయి మా కన్నుల్లో వర్షం కురుస్తుందేమిటి?

మరపురాని జ్ఞాపకానివి నువ్వు

నీ ఆలోచనలను అంతం చేద్దాం అంటే జ్ఞాపకమై మళ్ళి పుడుతున్నావు తిరిగి రాని గతాన్ని నేనయితే మరపురాని జ్ఞాపకానివి నువ్వు బావమెరుగని మాటను నేనైతే భాషకందని మౌనానివి నీవు మౌనపు సంద్రానికి చెరో ఒడ్డునా నిలిచిపోయాము.. ఎందుకో ఎప్పటికీ కలువలేని నింగీ నేలలా నీ మాటలతో నన్ను పిలవక పోయినా నీ హృదయంలో నన్ను నిలువక పోయినా నీ కోసం నీ పిలుపు కోసం ఎదురు చూస్తూనే ఉంటాను

పదాల పరదా చాటున.చాలీ చాలని అక్షారాల ఆకలిని తీర్చుకోలేక

నాకేం జరుగుతోంది పదాల పరదా చాటున చాలీ చాలని అక్షారాల ఆకలిని తీర్చుకోలేక పోతున్నా చెప్పాలనుకున్నది చెప్పలేక అక్షర దాహం చేరాల్సిన వారికి చేరుతుందో లేదొ అన్న అనుమానం.. నిజం మండే సూర్యుడు ఒకప్పటి మాట నిజం జాబిల్లి లాంటిదని ఎవ్వరికి అందదు చెప్పాలనుకున్న నిజం తెల్సుకోదు అర్దకాని నమనస్సుకు .. మందేదో వేశావు మత్తులో పెట్టి నన్ను మాయచేశావు మళ్ళ కనిపించనూ అంటూ వెళ్ళావు నీకిది న్యాయమా అంటే కనిపిస్తేగా.. నీ గొంతు వినిపిస్తేగా .? ఓ కాలమా, గడిచిపోయిన కాలమా,తిరిగిరావా, నీకై నీరీక్షణ, నీకై ఆవేదన, ఆ నాడును,నేడు తలుచుకుంటూ, నేడును,నాడుగా మార్చుకుంటూ, అనుక్షణం నీకై భాధపడుతున్నా, నాటి కాలమా, నీవు నేడు రావని ఎరిగి, నాటి తప్పులే,నేటి మెట్లుగా, భావించి,నేటిని రేపటి కొరకు, ఉపయోగిస్తూ నేటి కాలానికి , నా జీవితాన్ని కలపడానికి ప్రయత్నిస్తూ....... ప్రయత్నం లో గెలవను అని తెల్సి విఫల ప్రయత్నంలో ఓడిపోతూ గెలుస్తాను అన్న నమ్మకంలేక ఓటమినే గెలుపుగా బావిస్తూ

Wednesday, October 3, 2012

కన్నీరు పెడుతున్న కలం కన్నీటి గాధ..!

నలిగిన కలాన్ని నేను.. ఒకప్పుడు నేను వేరు ఇప్పటి నేను వేరు.. నన్ను రాయించే చేయి వనుకుతోంది ఎందుకో నేను రాస్తున్నప్పుడు పదాలు రావడంలేదు రాస్తూ రాస్తూ షడన్ గా ఆగిపోతోంది రాసిన చేయి.. ఒక్కోసారి అక్షారాలపై వర్షం పడుతోంది ఏంటాని పైకి చూస్తే రాసే మనస్సు కన్నీరు పెడుతోంది అప్పటిదాగా ఉద్వేగంగా రాసిన రాతలన్ని కన్నీరు పడి చెరిగిపోతున్నాయి నేను కలాన్ని అడగలేను.. ఓదార్చలేను..ఏం జరిగిందో తెల్సుకోలేను అక్షరాలు చెరిగిపోయినప్పుడు.కలం షడన్ గా ఆగినప్పుడు ఏదో జరిగిందీ అని మాత్రం అర్దం అవుతోంది.ఏంటో తెలీదు అక్షరాలు చెరిగిపోయినప్పుడు.కలం షడన్ గా ఆగినప్పుడు ఏదో జరీంది అని మాత్రం అర్దం అవుతోంది.ఏంటో తెలీదు రాసేప్పుడు అక్షారాలు కూడా తడబడుతున్నాయి పదాల అమరిక కుదరటంలేదు..ఎందుకో ఎవరో మనస్సును దారుణంగా మోసం చేశారేమో ఎప్పుడు అందంగురించి ...ఆహ్లాదంగా రాసే నేను ఈ మద్యి అన్నీ విషాదాలే రాస్తున్నా..వేదనగా నన్ను రాయిస్తున్న చేయి వనుకుతోంది ఎందుకో కలాన్ని నేనేం చేయలేనా అని నా మనస్సు ఆరాట పడుతోంది మనుషులు ఎదుకిలా చేస్తారు అయినా ప్రాణం లేని కలాన్ని నేనేం చేయగలను ఇష్టం ఉన్నప్పుడు ఒకలా ఇష్టం కష్టంగా మారినప్పుడుఒకలా ఎందుకు మారతారు.. అప్పుడేమో అంత అందంగా తీయ్యగా మాట్లాడావు ఇప్పుడు అంతలోనే మనుషు చేదయ్యారా.. మరొకరితో పోల్చుకున్నావా ఏంటో కదా మాటలతో ఎందుకు భాదపెడతారో.. అయినా రాసే కలాన్ని నేనేం చేయగలను లే ఒక మనుషును భాద పెట్టే హక్కు ఎవరికుంది అని గట్టిగా అడగాలని ఉంది కాని నాకు గోంతులేదు.. రాస్తున్న ఆమనిషిని ఏం అడుగలేను భాదను పంచుకోలేను ఎన్ని రోజులు తనతో ఉంటానో తెలీదు కాని ప్రాణం లేని నేను తనతో పెంచుకున్న అనుబందం ప్రాణం ఉన్నవాళ్ళ కంటే మేమే మేలేమో కదా..? అయినా ప్రాణం లేని కలాన్ని నేనేం చేయగలను కానీసం మాటలు వస్తే కాస్త ఓదారుద్దాం అని ఉంది మాటలు వచ్చిన ఇంతమంది చుట్టూ ఉన్నారు ఒక్కరూ ఆపని చేయరెందుకో కదా..? నేనో కలాన్ని కన్నీరు కార్చటం తప్పించి ఏంచేయలేక పోతున్నా..? భాదపెట్టే మనిషికి కలం ఉంటుంది ఆకాలని చెప్పాలని ఉంది నీవు తనతో ఉండోద్దు ఓ మనసును భాదపెడుతున్నావు నీ అక్షరాలతో నీవు తననుండి వెళ్ళీపో అని అంతేలే అమె ఆ కలం కాకపోతే మరోటి తెచ్చుకుంటుంది మనస్సును భాదపెట్టాలి అంటే మాటలు చాలేమో.. అయినా ప్రాణం లేని కలాన్ని నేనేం చేయగలను అక్షరాలు రాయాలంటే చేయి ఆసరా కావాలి మరి మనిషి భాదతీర్చాలంటే మరో అందమైన మన్సు కావాలి మనుసులు అందంగా ఉండి ఏం లాబం.. అందమైన మనస్సు అర్దంలేని మనస్సు లేనప్పుడు అయినా ప్రాణం లేని కలాన్ని నేనేం చేయగలను మనుషులు దేవున్ని నమ్ముతారు ... ఎప్పుడూ ఆదేవున్ని తలస్తారు.. ఓ మనిషిని బాదపెట్టినప్పుడు ఆదేవుడు గుర్తుకురాడా ఆదేవుకూడా ఇలాంటి విషయాలు చూసీ చూడనట్టు ఉంటారు మనస్సుల్లేని మనుషులను ఎందుకు పుట్టించాడు పుట్టిస్తే ఎదుటి వాళ్ళను భాద పెట్టే హక్కు ఎవరికిచ్చారు.. దేవున్ని నమ్మిన నీవే మరొకరిని ఎలా భాదపెడతావు ఓ భాద పెట్టే మనిషి నీకిది న్యాయమా..ధర్మమా ఆలోచించు అయినా ప్రాణం లేని కలాన్ని నేనేం చేయగలను

Tuesday, October 2, 2012

ప్రేమించినందుకు ... నిన్ను ప్రాణం కంటే ఇష్ట పడ్డందుకు అవమానించావు

నీవు అవును అన్నా కాదన్నా నేను నిన్ని ప్రేమిస్తూనే ఉంటా నిన్ను నేను ప్రేమించమని చెప్పలేదే ఎందుకు ఉలిక్కి పడతావు ఒకప్పుడు నీవే అన్నావు తరువాత నీవెక్కడ నేనెక్కడ అన్నావు అన్నీ నీమాటలే...మాట మారుస్తావని అనుకోలేదు నేను నేనెప్పుడు ఒకే మాట.. మాట తప ్పను నీలా మనసులో ఒకరకంగా బైట ఒకరకంగా మాట్లాడను నీలా ఎందుకు నన్నొక్కడినే దోషిని చేశావు,, నిన్ను నీవు ప్రశ్నించుకో నేనేంటో తెల్సి... నీవలా ఎలా అనగలిగావు... నీవు నమ్మిన వాళ్ళు నిన్ను అవమాణించిన రోజు నేనేంటో తెలుస్తుంది ..ఆరోజు దగ్గరలో ఉంది వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెబితే నన్నే అవమానించావు చివరకు .. గుండెళ్ళో కత్తుల్లాంటి మాటలతో భాదించావు అయినా నీమీద ఇసుమంతైనా ప్రేమ తగ్గలేదు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా ఒకప్పుడు నీపేరు తలస్తే మురిచి పోయావు ఇప్పుడు.. మండుతుందని నాగుండెను మండించావు నన్ను భాదపెట్టి ఏంసాదించావో తెలీదు.. ప్రేమించినందుకు ... నిన్ను ప్రాణం కంటే ఇష్ట పడ్డందుకు నన్ను అవమానించావు.. భాదపెట్టావు నీ పేరు పలికితే మండుద్ది అన్నావు.. అలా ఎలా అనగలిగావు నీవు చాలా గ్రేట్ ఇలా అంటావని కలలో కూడా ఊహించలేదు నేను తప్ప నీకు అందరు స్నేహితులే .. నాకంటే ముందు పరిచయం ఉన్నవారు నా తరువాత పరిచయం అయిన వేష్టుగాళ్ళు నిజం తెలుసుకుంటావు త్వరలో నేను మారను అప్పుడు ఇప్పుడూ నేనింతే నీలా మారను..మనం పరిచయం మొదలు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటా నీ మీద ప్రేమలో కూడా మార్పు ఉండదు

నీతో మాట్లాడాలి అనుకున్న నా మనస్సుగొంతూ నోక్కిపట్టాను కష్టంగా.

కలం కన్నిరు పెడుతోంది మనిషిని చూసి .. వాళ్ళ తీరు చూసి ఎక్కడున్నావని ప్రతిక్షనం పలుకరించిన మనిషి ఎవరునీవు అని ...వెటకారంగా మాట్లాడితే ఎవరి కోసమో మనస్సులో కత్తులూ దూస్తే కన్నీటికి కారణం చెప్పుకోలేక. మనసుకు లోని భాదని ఆపుకోలేక కలాన్ని కదిలించాలని చూశాను కలానికి నిజం తెల్సింది నిజాన్ని .. గుండెలో భాదను గమనించింది జరిగిన అవమానం ... ఏవరో చెప్పారని ఎదురు తిరిగి అమానించిన క్షణం ఒకప్పుడు నీవంటే ఓ నమ్మకం అందరిలా కాదు.. నాకోసం దేవుడు పంపిన స్నేహం అనుకున్నా.. కాని నేనేంటో తెల్సి .. దారుణంగా గుండెళ్ళీ కత్తులాంటి మాటలు.. అంత దారుణంగా ఎలా మాట్లాడగలిగావో ఇప్పటికీ అర్దం కాదు చూస్తున్నా నీస్నేహితులందరిలో నేనొక్కడినే నీకు దూరం అయ్యాను అందరూ పాత కొత్త స్నేహితులతో నీవు హేపీగా నే ఉన్నావు నేనేం తప్పుచేశాను అని అడుగను.. వాళ్ళందరూ మంచివాళ్ళనే నీవు నమ్ముతున్నావు అందుకే నా ఫోన్ గొంతునొక్కాను నీతో మాట్లాడాలి అనుకున్న నా మనస్సుగొంతూ నోక్కిపట్టాను కష్టంగా. నీకేం చెప్పాను ఇలా జరుగుతుందని ముందే చెప్పా కాని వద్దులే నీ ఇష్టం..బట్ తప్పుచేశావేమో కదా నాతో స్నేహం చేసి.. నాతో స్నేహం చేసిన క్షనం నాతో మాట్లాడిన సమయం అంతా నీ సమయం వేష్టు అయిందేమో కదా... ఇంక ఎప్పుటూ నాలాంటి వాళ్ళతో స్నేహం చేయకు ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవాల్లందరు మంచి వాళ్ళు.. వద్దులే ఏదో చెప్పాలని ఉందికాని అర్హత లేదు అని తేల్చావు ఏమని చెప్పను రాయాలని కలం తీస్తే ..రక్తం చిందిస్తోంది కొట్టుకు పొతాలే .. నీకన్నీరుకి కారణం అయ్యాకదా ఆరోజు కోసం ఎదురు చూస్తున్నా నీకీక ఎదురు పడను

చెమ్మగిల్లిన కాగితం

ఓ నలిగిన జ్ఞాపకం ఓ నలిగిన కాగితం అప్రయత్నంగా జారి పడింది.... వీలైనంత చదును చేసి చదువుదామంటే కన్నీళ్ళ కొలనులైన కళ్ళు మసగబారిపోయాయి..... ఒక చేత్తో కళ్ళు నలుపుకుంటూ మరో చేతి చూపుడు వేలుతో అలుక్కుపోయిన అక్షరాలు విడదీస్తుంటే చెమ్మగిల్లిన కాగితం మరి కాస్త చిరిగి మనసుని చిత్తడి చేసింది...

Monday, October 1, 2012

గెలువలేనని నిర్ణయించుకున్నప్పుడు బ్రతకడం..అనవసరం నీవిక మరణించు

ఒక్క నిమిషం ఆలోచించు ఓడిపోతే మళ్ళి ప్రయత్నించు మళ్ళి ఓడిపోతే మళ్ళి మళ్ళి ప్రయత్నించు గెలువలేనని నిర్ణయించుకున్నప్పుడు బ్రతకడం అనవసరం నీవిక మరణించు ఓ బీరువు మరణం విశాల సృష్టికి వెలితి కాబోదు నీ ఆర్దాంతర అస్తమయం ఎ వీరుడి పుణ్య చరితకు మచ్చ కాబోదు కాల ప్రవాహంలో అనాధ శవంలా కొట్టుకు పోతున్న నిన్ను చరిత్ర గుర్తించజాలదు మరణమే శరణ్యం అనుకున్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించు ఆ ఆలోచనను మరొక్క నిమిషం కొనసాగించు చావడానికి కావలసిన ధైర్యంలో వందవ వంతున్న ఏదో సాదిస్తావ్ ప్రతి ఓటమి ఒక అనుభవమేనని తెలుసుకో ప్రతి అనుభవాన్ని గుణపాఠంలా మలచుకో అప్పుడు ఈ అనుభవాలే నీ విజయానికి సోపానాలవుతాయి ఆ గుణపాటాలే నీ కీర్తిని ఆకాశమెత్తుకు చేర్చుతాయి.. అప్పటికీ నీకు గమ్యిం దొరక్కపో తే చచ్చిపో ...సమయాన్ని వృదాచేయకు..