గుర్తొస్తున్నాయి నీతో నేను కలిసి నడిచిన అడుగులు ..
.నీతో కలిసి పంచుకున్న సంతోషపు క్షణాలు ...
హృదయం పొంగి ప్రవహించిన ప్రేమ ఝరులు ..
నేను రాల్చిన కన్నీటి చుక్కల అర్ధాలు
నేర్చుకున్న జీవిత పాఠాలు..
అనునయించిన విజయ సత్యాలు
అనుభవించిన ఆనంద ఐశ్వర్యాలు .
నిట్టూర్చిన అపహాస్యపు క్షణాలు
విజయం కోసం ఎదురుచూస్తూ అభ్యసించిన సాహసపు పాఠాలు ...
నన్ను ఆలింగనం చేసుకున్న అనురాగ ఆప్యాయతలు
ఆవేదనకి గురి చేసిన అనుమాన అవమానాలు
ఇంకెన్నో.. మొత్తంగా నాకిచ్చి ...
ఇప్పుడు నూతన సంవత్సరం లోకి సాగానంపుతున్న సంవత్సరమా,,
నీకు నా వీడ్కోలు ..
ఎంతో నాకై మోసుకొస్తు అందంగా ముస్తాబై వస్తున్న
నూతన సంవత్సరమా నీకు నా ఆహ్వాన సుమాలు ..