భరించటమే తెలిసిన "ప్రేమ "
నింగి వంగి నిను చూసేనని
నిదుర ఇంక నిను చేరదని
కంటిపాప నింక నిదురించకని
తెలియక గాయం చేసే పాపవని
తెలుపలేను హృదయం లేదు అని
లోకమంతా ఏలుతున్నావని
తెగ మిడిసి పడే బంగారం
తన తనువు చీల్చుకొచ్చావని పలుకగలదా వసుధ స్వరం
కనుపాప ఎంత కాదన్న కనురెప్ప విదిపోదన్నా
కానరాని కరుణ కాదన్నా కరిగిపోని
చెదిరిపోని, మరణము లేని ప్రేమన్నా ...!