. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, July 31, 2012

ప్రియా నీ సన్నిది చేరాలంటే..ఏం ఏంచేయాలి


ప్రియా మనసు ఇంకా తడిగానే ఉంది..పొడి బారలేదింకా
కాని ఆచెమ్మ కళ్ళను చేరడం లేదెందుకో మరి

ప్రియా నీ చెంత చేరాలని..ఏవేవో చెప్పాలని
హృదయ బారాన్ని దింపుకోవాలని ఉంది

ప్రియా నీ సన్నిది చేరాలంటే..ఏం చేయాలంటూ
నాలోని చేతకాని తనం వెక్కిరిస్తుంది ఎన్నాళ్ళకెన్నాళ్ళ కని

ప్రియా ఎక్కడ నే తడబడ్డానో తెలియక...ఏం చేస్తున్నానో అర్దంకాక
తెలిసినట్లే అనిపించినా దిద్దుబాటులో అడుగులు జారిపోతున్నాయెందుకో?

ప్రియా క్షణ క్షణం నీకు దగ్గరవుతున్నానుకొని..ఇంత దూరం అయ్యానెందుకో
నాకు తెలియకుండానే నీనుండి దూరంగా వెళ్లిపోతున్నాను కదూ ?

ప్రియా అసలేం జరుగుతోంది...ఎవరు తప్పు చేస్తున్నారు కారణం
దాచడానికేమి లేని నేను అయినా మనమధ్య తెలియని అగాధం

ప్రియా తెలిసిన ఒక శూన్యం మనసంతా..తెలియని అవేదన జీవితంలో
తెలియనిదల్లా అధిగమించాలన్న కోరికనెలా ఆచరించాలన్నదే?

ప్రియా నన్ను కాదనవని తెలుసు...ఎందుకు దూరంగా ఉంటున్నావో అర్దంకాదు
క్షమించే నీ మనసు తెలుసు అయినా తెలియని భయం ఆందోళన

ప్రియా చూసావా! నేను చెప్పాలనుకొన్న..ఏం చెబుతున్నానో
విషయాన్ని కూడా నీకర్దమయ్యెలా చెప్పలేకపోతున్నాను కదూ?

ప్రియా ఇకపై ప్రతి క్షణం ఒకే మంత్రం,...నీగురించే ఆలోచనల్
నీవైపు చూస్తూ, నీ మాటలే మదిలో మననం చేస్తూ

ప్రియా నీతోనే నేనని నీలోనే సాగాలని..ఓ తీరని కోరిక
నీ ఒడిని మళ్ళీ చేరాలని ఓ పిచ్చి ఆలోచన

ప్రియా అందుకోసం నన్ను నేను..పూర్తిగా మర్చిపోయాను
సంసిద్ధ పరచుకోవాలని ఆశతో చేస్తున్నా మరోపోరాటం

ప్రియా నీతో మాట్లాడాలనుకున్న ప్రతిసారి SMS పంపుతున్నా


ప్రియా ఏదో చెప్పాలని ఆరాటం.....అంతులేని ఆలోచనలు ....
ఏమిటి అవుతుంది..మనసులో ముళ్ళులు గుచ్చిన భాద ప్రియా
ప్రియా ఎందుకు ఈ అలజడి మనసులో
నాది చేయి జారిపోతుంది అన్న బావం..
ప్రియా మనసు దాటి భాద రాదు....ఎవరికి చెప్పాలో తెలియక
ప్రియాపెదవి దాటి మాట రాదు .....ఏమి చెప్పాలో తెలీక
నన్ను నేను మర్చిపోతూ...ఏమి చేయాలో తెలేయక
ప్రియా అసలు ఎందుకు ఈ అలజడి నాలో?
నా సెఫోన్ లాగా మనసు మూగగా రోదిస్తుంది ప్రియా.
అత్రంగా నీతో మాట్లాడాలని ఎన్ని ఫోన్లు చేసినా
సమాదానం ఇవ్వని ఖటినమైన మనస్సున్న ఫోన్ నీ సెల్ఫొన్ది
గజిబిది గందరగోళంలో గాయంగా మారిన నా మనస్సుకు
ఏమని సమాదానం చెప్పను ప్రియా..
అలా కటిన్యుస్ గా ఫోన్ చేద్దామంటే .. ఎప్పుడన్నా ఎంగేజ్ వస్తే తట్టుకోలేను
ఫోన్ చెయ్యకుండా ఉండలేను..చెప్పు ప్రియా నాభాదకు సొల్యూషన్
ప్రియా నీతో మాట్లాడాలనుకున్న ప్రతిసారి SMS పంపుతున్నా
ఆ SMS రిప్లైరాకపోయినా... రాదని తెల్సినా..
అలా నీకు SMS పంపుతూనే ఉంటా..? ఇలా చేస్తున్న నన్ను చూసి ఎమనుకుంటావు ప్రియా.నవ్వుకుంటావా
నా SMS చూసిన ప్రతి సారి....?

Monday, July 30, 2012

ప్రియా హృదయాన్ని కోవెల చేసానని అనుకున్నా

ప్రియా ఇరుకుగా భావించే నా హృదయం లో
నిన్ను పెట్టడం ద్వార నిన్ను ఇబ్బంది
పెడుతున్నానేమో..
క్షమించు ప్రియా...
ప్రియా రెక్కలు విరిచి నాతోనే నిన్ను
ఉంచుకోవాలని నా ఉద్దేశ్యం కాదు
నా ప్రేమను పంజరంలా భావించేవరకు
ఇబ్బంది పెడుతున్నానని
అనుకోలేదు ప్రియా...
ప్రియా హృదయాన్ని కోవెల చేసానని అనుకున్నా
కాని ....నువ్వు భయపడే రక్తపు లోగిలిలో ఉంచానని
అనుకునేంత భయపడుతున్నావని
అనుకోలేదు ....క్షమించు ప్రియా
ప్రియానీకు" కాంతిని" అవ్వడం కోసం
ఎదురు చూస్తూ కాలిపోయే
క్రోవ్వత్తిని అవుదామనుకున్నాకానీ
ప్రియా నిప్పులాంటి నా ప్రేమ
నిన్ను కాలుస్తున్న అగ్ని
అనుకుంటున్నా వను కోలేదు ...
క్షమించు ప్రియా
కన్నీటితో నీ దారిని శుభ్రం
చేశా నిర్భయంగా వెళ్ళు ...
ప్రియా వెనక్కి తిరిగి చూడకు ....
మళ్లీ నీకు దగ్గర అవ్వాలనిపిస్తుందేమో ....
నీ సంతోషం కోసం నా ప్రేమ
ప్రియా మోడు బారిన ... నీ ప్రేమ చిగురులు
చూసి సంతోషించే ..నీ ప్రేమ పిపాసిని .....

Sunday, July 29, 2012

ప్రియా నీ జ్ఞాపకాలతో తడసి పులకించాలని మది ఆరాటపడుతోంది ...


ప్రియా ముత్యాల వాన జల్లులకోసం ఎదురుచూసే ధాత్రిలా
నీరాకకై శూన్యంలోకి చూస్తూ కుర్చునాను
నా మది పావురంలా రెక్కలుసాచి
ఆ పచ్చటి నేలలను నీలిమబ్బులను దాటి
అనంతమైన ఈ ప్రేమతాలూకు
సూన్యంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది
నాలో తడసి ముద్దయిపోయిన ఈ ఆలోచనా తరంగాలను ఆపలేక
చీకటిదారులలో మగ్గిపోతున్న ఈ ఒంటరి నావని చూసి
ప్రియా సీతాకోకచిలుకలాంటి నా ఆలోచల్ని పరిహసిస్తూ
తన గర్భాని చీల్చుకుని చొచ్చుకు వచ్చిన జలతరంగాలతో
పద్మవ్యుహాని పన్ని నన్ను తన గర్భంలోకి తీసుకుపోతోంది
ప్రియా నా చుటూ వ్యాపించిన ఈ జలనిశీధిలో అంతర్దానమౌతున్న నాకు
నీ స్మృతుల తరంగగోష తప్ప మరొకటి వినిపించుటలేదు
అనంతమైన ఆ సముద్రగర్భంలోకి చొచ్చుకుపోతున్నా ...
ప్రియా నీ జ్ఞాపకాలతో తడసి పులకించాలని మది ఆరాటపడుతోంది ...

ప్రియా మన ఇద్దరి మధ్య అలుముకున్న చీకటి తెరలని రచించిందెవరో


ప్రియా మన ఇద్దరి మధ్య అలుముకున్న చీకటి తెరలని రచించిందెవరో
కనిపించని నిజాలనడుగు అబద్దపు నీడల పొడుగేమిటో
ప్రియా కాలచక్రం ఇరుసులనడుగు కదలిపోయిన కలల కన్నీరు ఏమిటో
నిద్ర రాని నా కన్నులనడుగు నీకు నేనేమిటో

ప్రియా నువ్వు నా జ్ఞాపకాలనుంచి, నా నుంచి తప్పుకోవాలని అనుకున్నా
నీకు తెలిసిన మనసును అడిగి చూడు నీడలా నీ వెంటే వున్నది ఎవరని?
ప్రియా అలిగి అలసిన మాటలనడుగు నీ ఊహల వెనుక ఉన్న ఆశేమిటో
నిజానికి అబద్ధానికి మధ్య నా కలలనీ ఊహలనీ తొక్కిపెట్టిందెవరో
ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ మనసునడుగు నిజం చెబుతుంది


ప్రియా అలా అలవోకగా ఓటమి నన్ను ఓడిస్తూంటే
నిజాల వెంట నీవు ఊహల మధ్య నేను ............
ప్రియా ఎప్పటికీ ఒంటరిగా అదే దిక్కుతోచని సమూహంలో
అయినాప్రియా ! నేనింతకు ముందూ ఒంటరినే ఇక పైనా కూడా .......

ప్రియా అక్షరాలు కావివి, నా గుండె గాయపు రక్తాశ్రువులు ..


ప్రియా కన్నీరు కడలయి చెక్కిలి తీరం చేరగా,

మూగబోయిన స్వరం మౌన రాగం ఆలపించగా,

ప్రియా ఆ రాగపు వేదనలో గుండెలోని నీ జ్ఞాపకాలన్నీ గువ్వలై ఎగిరిపోగా,

నా హృదయారణ్యంలో నీ ప్రేమ సమాధిపై రాస్తున్నా ఈ అక్షరాలు,

ప్రియా అక్షరాలు కావివి, నా గుండె గాయపు రక్తాశ్రువులు ....

ప్రియా గతం ప్రతీ రోజు తరుముతూనే ఉంది


ప్రియా గతం ప్రతీ రోజు తరుముతూనే ఉంది
నువ్వు ఎక్కడ ఉన్నావో మనసుతో వెతకమని
ప్రియా నీజ్జాపకాలు నన్ను వేదిస్తున్నాయి..నీ ప్రతి అడుగుని
నిన్ను జ్ఞాపకం గానే ఉంచమని..నీకు దగ్గదవ్వాలని ప్రయత్నిస్తే
ఎక్కడ దూరం అవుతావో..అని భయంగా ఉంది ప్రియా

ప్రియా నేను వేసే ప్రతి అడుగులో
నేను తీసే ప్రతి శ్వాసలో
నీ జ్ఞాపకం

ప్రియా ఎక్కడో... ఎప్పుడో
నువ్వు ఎదురుపడితే
ఇదీ...అని చెప్పుకోడానికే
ఈ మాత్రం అయినా గెలిచింది

ప్రియా నీవు నాకు... ఎంత దూరంలో
నువ్వున్నావో... నాకు తెలియదు
ప్రియా మనస్సుకి.. ఎంత దగ్గరగా ఉన్నావో మాత్రమే తెలుసు

ప్రియా కళ్ళు మూసుకొని ఎప్పూడూ... నిన్ను చూస్తూనే ఉన్నా

Saturday, July 28, 2012

FACE BOOK లో అమ్మాయిల్ని మోసం చేస్తున్న గ్యాంగులు

ప్రియా నిన్ను కలవాలని అనుకున్నాను...కలలు కనకు అన్నావు


ప్రియా నిన్ను కలవాలని అనుకున్నాను...కలలు కనకు అన్నావు
ప్రియా నీతో నడవాలి అనుకున్నాను...నాకు నడక రాదు అన్నావు
ప్రియా ప్రియా నీతో మట్లాడలి అనుకున్నాను..మనస్కరించదం లేదు అన్నావు"
నీతొ శాశ్వతంగా జీవించాలనుకున్నాను...కాని కుదరదు అన్నావు
"నీతో ఒక్కొక్క అడుగు వేద్దాం అనుకున్నాను....ఒంటరి వాడ్ని చేసావు ప్రియా
నిన్ను గెలుచుకుందాం అనుకున్నాను...నన్ను గేళి చెసావు ప్రియా
నీకొసం ఎన్నాల్లొ ఎదురు చుసాను...నాతొ పని ఎమిటి అన్నావు ప్రియా
ప్రియా కంటి పాప కంటే ఎక్కువగా ప్రేమించాను..కన్నీల్లే మిగిల్చావు
ప్రియా నువ్వే నా లోకం అనుకున్నాను..కాని లొకన్నే చీకటి చెసావు
ఇంకేమి చేయాలి నేస్తం నీ కోసం???"
ప్రియా నీకోసం కలలు కంటూ కూర్చున్నాను...కాని వాటిని నువ్వు కలగానే చేసావు ప్రియా
కారనం లేని కలలుగా మిగిల్చావు ... నాకలలని కలల్లు గా మిగిల్చావు
కన్నీటి దారలకు అర్దం లేకుండా చేసావు మరిక సేలవు తీసుకోనా నేస్తమా...

జాబిలమ్మ నాకు ఎందుకు దూరం అయిందో మరి..?


ఓ మనసు పడుతున్న భాదను చూసి జాబిలమ్మ జాలి పడింది
నేనున్నా అంటూ పలుకరంచి....ఓదార్చింది
సేదతీర్చి భాదపడోద్దని దైర్యిం చెప్పిందా వెన్నెలమ్మ
నా నుండి మనసును వేరు చేసి .. తన దగ్గర పెట్టుకుంది
ప్రపంచంలో నాకన్నా అదృష్ట వంతుడు లేడని .. జాబిలమ్మ ఒడిలో చేరా
తను చెప్పే తీయ్యని మాటలవింటూ ప్రపంచాన్నే మరిచా..హాయిగా నిద్రపోయా
ఎందుకొ నాకు నేను తగల బడుతున్న వాసన .. లేచి చూశా
జాబిలమ్మ లేదు... ఏర్రని సూర్యుడు నన్ను కాల్చేస్తున్నాడు
జాబిలమ్మ కనిపిస్తుందేమో అని జాలిగా అంతటాచూశా కనిపించలేదు
సూర్యుడు నన్ను కాల్చాడు.. తగలబడిపోయా.. ఒక్క హృదయం మాత్రం మిగిలింది
చీకటి పడింది .. జాబిలమ్మ వచ్చింది.. దూరంగా చూస్తుంది కాని దగ్గరకు రాలేదు
నేను తగల పడ్డా జాలి పడలేదు..తను తీసుకెళ్ళీన హృదయాన్ని విసిరేదింది
ఆత్మతో పాటు హృదయమే మిగిలింది ..నాకు ఇప్పుడు దేహంలేదు
జాబిల్లే నాకు దూరం అయితే ఇవికూడా ఎందుకని నేనే అగ్నిలో దూకా
అన్నీ చూస్తునే ఉంది కాని జాబిల్లికి జాలి కలుగలేదు ఎందుకనో...?

ప్రియా నా కన్నీటికి ఎందుకు పక్షపాతం


ప్రియా నా కన్నీటికి ఎందుకు పక్షపాతం!!
తనువు గాయాలకు
వెల్లువై నేనున్నానంటూ
గుండెలపై వర్షం లా
చెక్కిల్ల మెరుపులా
వరదల జల జల
ఉబికి వచ్చే కన్నీరు
ప్రియా మనుసు బాధపడితే
తడి ఆరి బండబారి
గొంతులొంచి గుండె లోకి
అవిరై నీరు మింగి
గుండె మంట పెంచి పెంచి
తనలోనే దస్తుంది ఎందుకనో!!!
ప్రియా మనసు సేద తీరితే చూడలేని అసూయా?
నాదైన శరీరానికి నా మనసుపై పక్షపాతామా?
కన్నీటికి కూడా ఇంత కాఠిన్యమా ప్రియా ?

Friday, July 27, 2012

ప్రియా ఇప్పుడే కురిసిన వాన జల్లు మదిని దోచేసింది ..


ప్రియా ఇప్పుడే కురిసిన వాన జల్లు మదిని దోచేసింది ..
పరిసరాలని పులకరింప చేసిందిచెలి నీవు నా పక్కన ఉన్నంతగా
ప్రియా కలయికని తెలిపే ఊహలు నా మనసుకి కలిగించే పులకరింత లాగా...
వాన జల్లుకు తడిసన మట్టి వాసన గమ్మత్తుగ ఉందిచెలి
ప్రియా చేరువలో వెళ్తున్నప్పుడు గాలి వాసన కలిగించే మత్తులాగా...
చల్ల గాలులు, కారు మబ్బులులేని వెచ్చదనాన్ని,
రాని వెన్నెలని గుర్తు చేస్తున్నాయి ప్రియా...
చెలి దూరంగా వుందితన కలవరింత ప్రకృతి ఆస్వాదనని దూరం చేస్తుంది ప్రియా...
చెలీ రావే,వరాలీవే,వెతికా నిన్ను వీచే గాలుల్లోకన్నా నిన్ను కారు మబ్బుల్లో...
ప్రియా వెచ్చదనం ఏదని?నీ జ్ఞాపకాలతో కాలుతున్న జాబిల్లిని నేను
చెలి వెన్నెల రాదే అని?చెలీ రావే,వరాలీవే...

Thursday, July 26, 2012

వెంటాడే నీ జ్ఞాపకాలు నన్ను వేదిస్తున్నాయి ప్రియా


ప్రియా "ఘనీభవించిన కాలం
ఒక్కోసారి గుండెను గాయం చేస్తుంది
ప్రియా మరోసారి కోలుకోలేకుండా మార్చేస్తుంది
ప్రయాణమే జీవన మార్గంగా మారిన ప్రస్తుత తరుణంలో
ప్రియా మాటలు కరువయ్యాయి ...ఇక చూపులే మిగిలాయి ..
హృదయం మంచు ముద్దగా మారింది ...నీ గురించి ఆలోచించి ..ఆలోచించి ...
ప్రియా అయినా ..నువ్వు అక్కడ నేను ఇక్కడ
దారులు వేరు..గమ్యాలు వేరు ..
ప్రియా ఊహల్లో నేను ..కలల అలలై ఎగసి పడుతుంటే
నేను మాత్రం నీ తలపుల తనువు కోసం ఆరాటపడుతున్నా ...
ప్రియా మన పరిచయం ...సముద్రం లోని దిక్సూచిలాగా మారింది ..
అప్పుడప్పుడు ఓ రెండు మాటలు ..మరికొన్ని వాలు చూపులు ...
ప్రియా నీ కళ్ళు మెరిసినప్పుడు ...నీ పెదవుల మీద దరహాసం విరిసినప్పుడు
నీ గుండెల మీద ..నా చూపు గులాబిగా మారి నిన్ను గుచ్చుకున్నప్పుడు
నేను నేనుగా ఉండలేకపోయా ...ప్రియా
ప్రియా బహుశా ఇది మన మద్య మరింత దూరాన్ని పెంచింది
పెను అనుమానాలకు తావిచ్చింది ...
ప్రియా నిన్ను విడిచి నేనుండలేను ..ప్రియా నన్ను నేను సముదాయించుకోలేను..
ప్రియా మనసు పొరల్లో నిక్షిప్తంగా ఉండిపోయిన ..ప్రియా ఆ కాసిన్ని కన్నీళ్లను కార్చటం తప్పా ...
ప్రియా అందుకే ..నిండారా ..ఏడుస్తూ ఉన్నా ...
నువ్వు ..హాయిగా ఉండాలని ...ఆలోచిస్తూ పిచ్చివాడను అయ్యాను
వెంటాడే నీ జ్ఞాపకాలు నన్ను వేదిస్తున్నాయి ప్రియా

ఈ నిజాన్ని నమ్మాలి కదా ....?

ప్రియా ప్రతి అందం అద్బుతం, ప్రతి అంశం అమృతం.ప్రియా పరవశింప జేసే ప్రక్రుతి అందాలు..మనసును పులకింప జేస్తున్నాయి..

చిగురు తొడిగిన కొమ్మపై చినుకు చేసే అందాలు,

ప్రియా మంచు కురిసిన వేలలో ఆకుల పై వెలసిన స్వచ్చమైన నీటి బొట్టు

చినుకు తాకిన బూమిపై మట్టి పంచే పరిమళాలు,

పుడమి పంచిన ప్రేమతో ప్రకృతి చూపే సోయగాలు,

ప్రియా ప్రకృతి సోయగాలతో పరవశించి కోయిల పాడే స్వరాలు,

కోయిల స్వరాల మాధుర్యంతో ప్రక్రుతి పులకిస్తొంది,

మది రాసిన కావ్యాలతో విరిశిన చిరునవ్వులు,

ప్రతి అందం అద్బుతం, ప్రతి అంశం అమృతం.

పవవళ్ళు తొక్కే జలపాతం ప్రియా నీనవ్వు..

ప్రియా నవ్వీ నవ్వనట్టుండె నీ నవ్వు..విరిశీ విరయని పువ్వేకదా

Wednesday, July 25, 2012

ప్రియా ఎందుకో ఆక్షణం గుండె అరలలో మీ రూపం ..ప్రియా అందంగా తిరిగే అరుద్డైన జంటలను చూస్తుంటే ..
మనసూ మెత్తగా .. అడుగుతుంది ..
దురాన వున్న నీ కోసం ..

ప్రియా ఎందుకో ఆక్షణం గుండె అరలలో మీ రూపం ..
చప్పుడు చేయకుండా కదులుతుంది ..
కళ్ళు మత్తుగా ముసుకొంటై..
నాప్రాణం లో కలసిన వున్నా మీ మనసుని వెతకడం కోసం ..

ప్రియా మనం ఇంకా ఎన్నాళ్ళిలా ..
lovers లా అనిపించి ఎలాగోవుంటుంది ..

ప్రియా మనం కలుస్తున్నాం విడిపోతున్నాం ..
కలయిక లో వున్నా తీపి జ్ఞాపకాలను ..
ఎదురు చూపుల నిరీక్షణలో నెమరు వేసుకొంటూ క్షణ క్షణం భారం గా ..
ప్రియా అనుక్షణం మీద్యాసలో గడిపేస్తూ ..
వేచిచుస్తున్నాను నేస్తం మీ రాక కోసం ..
ఓ ప్రాణమా నిన్దయిన నీ రూపం నా మనసులో మేదిలీ భావాలకు ప్రతిరూపం ...

ఓ కాలమా.... ఎందుకే నీవు...నన్నిలా చేశావు


ఓ కాలమా.... ఎందుకే నీవు...నన్నిలా చేశావు
ఇంత అల్పసంతోషి ఐనవు ....
నీ "రోజుల" చక్రానికి ఆయువు...
ఇరుబదినాలుగు గంటలు చాలనుకున్నావు ...
ధ్యానములోని తాపసిలా...
ఎంత ప్రశాంతంగా ఉన్నావు...

కాని అది ఏమిటో మాకేమో....
ఇంకో ఇరుబదినాలుగు దినములు
కలిపినా మా "రోజు"కు ఆయువు సరిపోదు...
బ్రతుకుభాద్యతపై మమకారం తీరదు...
పెంచిన ఈ వ్యవధిని కూడా...
బంధాల బంధనంలో బంధీ అవటానికి ...
ఆ ఊచలను ఇంకొంచెం పదిలం చేస్తాం
కాలం అంతంలో "అయ్యో నాకోసం
ఏమి చేసుకోలేదని" రోదిస్తాం...

కాని కాలమా నీకెంత అదృష్టమే???...
గడచినా దానికి దుఖించక...
జరగబోయే దానికి చింతించక...
ఎవరి కోసం వేచి చూడక...
నిర్లిప్తంగా ముందుకు సాగుతూ...
ఈ క్షణం మాత్రమె నిజం అంటావు...
ఏ బంధాలకి బంధీ కానంటావు...

వెనుకకి తిరిగి చూడటం తెలియని...
నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉంది...
ఒకరి చింత నీకు లేదు...
ఎవరి నుంచి భయము లేదు....
ఎవరికీ ఏమి దాచావు...
ఎవరి నుండి ఏమి ఆసించవు...
ఓ కాలమా నీ పనే బాగుంది సుమా...

ప్రియా కొన్ని పరిచయాల గాయాలు అలాగే వున్నాయిప్రియా కొన్ని పరిచయాల గాయాలు అలాగే వున్నాయి
కాని..మనసులో..
మానిపోయే గాయం కన్నా ఏడ్పిస్తూ ఎక్కిరించే
వాతల అంకెలని చూస్తే
మళ్ళీ మళ్ళీఅస్తమించమని
బలవంతంగా నన్ను సముద్రంలోకి
విసిరి కొడుతూ ఆడుకోవద్దని
విన్నవిస్తూ మనసు తివాచి పరిచా

ప్రియా ఇప్పుడు
నా పిలుపు నన్నే ఏడుస్తుంది
ఎందుకు మా ఇద్దర్ని జీవితకాలం దూరం చేసావని ?

ప్రియా ఏ అరణ్యంలో దాక్కున్నావ్
నా మనసు కుడా చేరలేని ప్రదేశమా?
ఏ ఎడారిలో ఇసుక దిబ్బ వయ్యావ్?
నీ అడుగుల జాడలు తుడిచేసి దాక్కున్నావ్
నా పాదాలు నిను చేరకుండా

ప్రియా కాలం దోసిటిలో పట్టుకున్నా
బొట్టు బొట్టుగాదారులెతుక్కుని
మరీ జారి పోతుంది
ఎం చేయను ?

ప్రియా మిస్డ్ కాల్స్ లా మిగిలిపోయే నన్ను
ఎప్పుడో ఒకప్పుడు నీ చూపు తడుముతుందని
తిరిగి స్పందించేంతలో నిజంగానే నేను
ప్రియా నీ గుండె అర నుంచి
బయట పడేసే సిమ్ కార్డునయిపోతానని
భయం..?

ప్రియా అందుకే జీవితమే మిస్ అవుతున్నా
నా పిలుపుకి నువ్ స్పందించేంత వరకు
నీ గుండెను తెరిచే అంకెలని వల్లే వేస్తూ
నిన్ను చేరుకుటానీ లేదో తెలీక..?
నా మనసును మాయచేసిన నిన్ను
మమరువలేక మూగగా నీకోసం రోదిస్తూ

ప్రియా నీ ప్రేమ లో కొత్త హృదయాన్ని పరిచయం చేసి నన్ను నీవుగా మార్చావుప్రియా బాధలకే నిలయం అయిన నా హృదయ అలజడిలో
ప్రేమ సవ్వడిని నింపావు నా ప్రాణమా...!!!
బంధమే దూరం అయిన నా జీవితం లో
అంతులేని ఆప్యాయతను పంచావు ఓ ప్రియతమా..!!!
బరువే అని నా గుండెను నిట్టుర్పులో వుంచాను ప్రియా
ప్రియా నీ ప్రేమ లో కొత్త హృదయాన్ని పరిచయం చేసి నన్ను నీవుగా మార్చావు …..

ప్రియా కారనాలెన్నైనా ఉండొచ్చు షడన్ గా మారావు నాకు దూర అయ్యావు..
అప్పుడు మొదలైన అలజడి గుండేల్లో తీరని ఆవేదని మిగిల్చింది..
ఎందుకిలా అని అడుగలేను అడిగే అర్హతలేదేమో అని..

ప్రియా ఎమౌతుందో తెలీదు...మొత్తానికి ఏదో జరుగుతుంది..
నీవు దూరం అయినప్పటినుంచి ...నా జీవితకాలం తగ్గిపోతుంది..

ప్రియా ఎన్ని కాలాలు మనమీద ఎంతగా కక్ష కట్టాయో.


ప్రియా జాబిలి పంచే చెలిమికి కలువ రేకులు వికసిస్తాయని .
సూర్యుడు పంచే చెలిమి వెంటే ప్రొద్దు తిరుగుడు పయనిస్తుందని .
తెలిసిన వారే స్నేహితులంట ప్రియా...
మనసు తెలిసిన వారే మన తోడంట..

ప్రియా ఎన్ని ప్రేమలు తమ పవిత్రతను ప్రశ్నించుకున్నాయో .......
మోహపు జాడలు లేని ఈ స్నేహపు ప్రేమను చూసి ........
ప్రియా ఎన్ని బంధాలు తమ అనుబంధాన్ని శంకిచాయో.......
రక్తపు సంభందం లేని ఈ బంధాన్ని చూసి .......

ప్రియా ఎన్ని కాలాలు మనమీద ఎంతగా కక్ష కట్టాయో........
ఊసు పోని కబుర్లు తమని కరిగించే సాధనాలని తెలుసుకొని ........
ఎన్ని లోకాలు ఎంతగా కుళ్ళు కున్నాయో ........
ఎదురయ్యే ప్రతి కస్ట నష్టాల భారం సగమైపోతుందని ..........

ప్రియా నీ ఆత్మను నీ మనసు నవ యవ్వనం సంతరించుకొనేలా చేస్తున్న
ఈ స్నేహం ఎన్ని జన్మ ఫలమో యే దేవుడి వరమో.......కదా ప్రియా

ప్రియా నీవు జాబిల్లిలా నీజ్జాపకాల కొలిమిలో కాల్చేస్తున్నావు

Monday, July 23, 2012

ప్రియా నా విషయంలో ఏది చేసినా నీకే సాద్యిం..?


ప్రియా నిశ్శబ్ద౦గా జారే
కన్నీటి చుక్కను
తుడవడానికి
మరో హృదయ౦ పడే
తపనే
..."ప్రేమ"

ప్రియా అదే కన్నీటి చుక్కను
రానివ్వకు౦డా
ఆరాటపడే హృదయమే
"స్నేహ౦"

ప్రియా ఇవన్నీ నిజాలైతే నీవేంచేస్తున్నవో తెలుసా..?
కన్నీళ్ళు తుడుతుస్తున్నావా పెట్టిస్తున్నావా..?
ప్రియా నా విషయంలో ఏది చేసినా నీకే సాద్యిం..?
ఎందుకు నా విషయంలో ఇలా చేస్తున్నావో ఒక్కసారి..
ప్రశాంతంగా ఒంటరిగా ఆలోచించు నిజాలు తెలుస్తాయి..
ప్రియా నీ మసస్సాక్షి నడుగు నిజమేంటో తెలుస్తుంది..
ఇంతకంటే చెప్పేది చెప్పుకునేది ఏమీ లేదు..?
ఆ అర్హత నాకు లేకుండా చేశావుకదా..?


ప్రియా గుండెకు గాయం చేశావు...నన్నెందుకిలా దూరంచేస్తున్నావు
కావాలని కవ్వించావా...నే మాట్లాడకపోతే..ఇబ్బంది పడ్డావు...మరీప్పుడెలా ఉండగలుగుతున్నావు
ఇష్టం ఒకసారి ఒకలాగ మరోసారి మరోలా ఎలా మారుతుంది..
పెద్దకారణం మనస్సులో పెట్టుకొని...గుండెకుపెట్టిన గాయాన్ని పెద్దది చేస్తున్నావు
ప్రియా ఇది నీకు న్యాయమా అని అదిగే హక్కు నాకు లేదు..అడిగేందుకు నేనెవ్వడిని..అంతలోనే ఎందుకంత దూరం అవుతున్నావు గుండెకోతకు కారణం నీవు అని తెల్సు భాతపడతాను అని తెల్సు అయినా అన్నిటికీ మౌనమే నీ సమాదాన మా..?
ఎందుకిలా చేస్తున్నవు అని అడిగే హక్కులేదు...అలోచించే హక్కు నాకులేదని తెల్సు కాని నీవు గుండెకు చేసిన గాయం మానేనా..
నీవు గుండెకు చేసిన గాయం రోజు రోజు కి పెద్దది అవుతోంది..ఇంకా పెద్దది అవుతోంది...ప్రతిరోజు నీమౌనం గుండెకు చేసిన గాయాన్ని ఇంకా పెద్దది చేస్తోంది...
ఎంతకాలం బరిస్తోంది ఈ గుండే ఆగిపొయేరోజు దగ్గరకు వస్తొంది..అయిన నీలో మార్పు వస్తుందా...నీవు నాగుండెకు పెట్టిన గాయంఎలాంటిదో తెల్సుకుంటావా
నీవు నాగుండెకు చేసిన గాయం రోజు రోజుకి పెద్దదవుతోంది...చివరికి ఆగిపోయేలావుంది ....అప్పుడైనా తెల్సుకుంటావా నాగుండెకు నీవు ఎంత పెద్ద గాయం చేసావో...గుండెకు గాయం చేశావు...నన్నెందుకిలా దూరంచేస్తున్నావు

ప్రియా రాత్రి కరిగినా మ౦చు తరగట౦ లేదు


ప్రియా చీకటి రాకము౦దే
చలిగాలి పరిగెత్తుకొస్తు౦ది
అబ్బ... ఎవరు వేసి వెళ్ళారో
ఊరిపైన ఈ మ౦చు షామియానా
బొట్లు బొట్లుగా జారుతూ
చల్లటి ఉచ్చులతో నరాలు బిగిస్తో౦ది
చలిని చెక్కుతున్న అకాశ౦ ను౦చి
మ౦చు పొట్టులా రాలుతూనే ఉ౦ది
చుక్కలు కనిపి౦చడ౦ లేదు
ప్రియా చ౦దమామ జాడ తెలియడ౦ లేదు
చి౦తతోపు చివరల్లో౦చి
చలిగాలిలా దూసుకొచ్చే కీచురాళ్ళ ధ్వని
తెల్లార్లూ నిద్రను తరుముతూనే ఉ౦ది

ప్రియా రాత్రి కరిగినా మ౦చు తరగట౦ లేదు
పూలమొక్కల సిగలో ముత్యాలు మెరుస్తున్నాయి
మ౦చులో తడిసిన గుమ్మడి పువ్వు
చిన్నసైజు అక్వేరియ౦లా జలజలలు పోతో౦ది
అరటిబోదెలు నీటి చుక్కలుగా జారుతూ
శిరస్నాన౦ చేసొచ్చిన
ప్రియా పడుచుపిల్ల నునుపు దేహాన్ని తలపిస్తున్నాయి
మ౦చు ముద్దుల ముద్రలతో
ప్రియా గుమ్మ౦ ము౦దు న్యూస్ పేపరు సిగ్గుపడుతో౦ది
చలికి ముడుచుకున్న పావురాళ్ళలా
కిటికీలో పాల ప్యాకెట్లు!

ప్రియా పొద్దు పొడవట్లేదు
గడ్డకట్టిన శరీరాలపై సూదులు గుచ్చడానికి
సూర్యుడు భయపడుతున్నాడు
ఆలోచనలు రేపిన మ౦టలతో
ఇక నేనే అగ్నిగోళాన్నై ఉదయి౦చి
అన్ని దేహాలకూ కవిత్వాన్ని కాపడ౦ పెడతాను..

Sunday, July 22, 2012

నీ తీయ్యని స్పర్సకోసం ఎదురు చూస్తున్నా ప్రియా

ప్రియా దుఖం లోంచి ..దూరం అవ్వాలనుకునే నా విఫల ప్రయత్నం


ప్రియా కనురెప్ప మూసే లోపే
కలలన్నీ కల్లలవుతున్నవి
ప్రియా ఏమీ లేని చోట
ఏదో జరిగిపోతున్నట్టు
కల్మషం లేని హృదయాన్ని
కమ్ముకున్నట్టు
ఇంకా ఇంకా ప్రయాణం కొనసాగుతూనే ఉంది
ఇది ..నిరంతరమా లేక తాత్కాలికమా
అన్నది అర్థమయ్యేలోపు
అన్నీ కలగా మిగిలి పోతున్నాయి
కాలమూ జీవితమూ
కలగలిసి పరుగులు తీస్తున్నవి
ప్రియా నీజ్ఞాపకాలు.. మదిలో పదిలం
ఆజ్ఞాపకాల దొంతరలో..
కాసేపు తొంగిచూస్తే నా భాద అర్దం అవుతుంది
ప్రియా దుఖం లోంచి ..దూరం అవ్వాలనుకునే నా విఫల ప్రయత్నం
నీజ్ఞాపకాల్లా నిలచే గుండేల్లో దాగి దోబూచులాడుతున్నాయి ప్రియా

నా మనసనేకాగితం నలిగి పోయింది ప్రియా...నాలో నేను


నా మనసనేకాగితం నలిగి పోయింది ప్రియా...నాలో నేను..ఎందుకిలా జరుగుతుంది అంటే కారణం చెప్పలేను..నా అనుకున్నవాళ్ళు ఎందుకిలా దూరం అవుతున్నారో తెలీదు..అది నాకే ఇలా జరుగుతోంది ఎందుకో అందుకేనేమో నాకు ఈ మౌనం ఓనరకం..నా కిష్టమైన వాళ్ళు..అందరితో మాట్లాడటానికి టైం కుదురుతుంది. . నాతో మాత్రం మాట్లాడరు ఎందుకో తెలీదు.. వాళ్ళ స్నేహితులందరూ మంచి వాళ్ళు నేను తప్ప ఇలా ఏన్నో ఆలోచనలతో నా మనసు నలిగిపోతోంది.. ఓదార్చే మనసులే దూరం అయ్యాయి ఎవరితో చెప్పుకోను ప్రియా...ఏమని చెప్పుకోను..నాగొంతు నేనే నులుముకున్నంత భాద..మాట మౌనంగా మారిందని కాలాన్ని తిట్టుకోనా .. ఎందుకు ఎవ్వర్ని తిట్టుకోవాలి చెప్పు నాకు నేనే తిట్టుకుంటా...ప్రపంచం బద్దలై అందరూ సంతొషంగా ఉండి నేనొక్కడీనే తగలబడి పోవాలన్నంత కసి నామీద నాకు.. అందుకే నీవు దూరం అయినప్పటినుంచి.. ఒంటరిగా ఉండటానికే ప్రయత్నిస్తున్నా..జ్ఞాపకాల అలజడిలో కాలిపోతున్నా ప్రియా నా తడికన్నుల వెనుక వేదన ఎవరికి కావాలి చెప్పు.. అప్పుడేదో నాతో సరదాగా టైం పాస్ కు స్నేహం చేశారు.. ఇప్పుడు ఇష్టం లేదు వెళ్ళిపోయారు.. మీకున్న అంతమంది స్నేహితుల్లొ.. మాట్లాడటానికి కూడా నేణు పనికి రానా ప్రియా అవును నాపిచ్చిగాని అలా అనే కదా నా ఫోన్ కట్ చేసి మరీ మీస్నేహితులతో మాట్లాడుటున్నావు కదా ... అప్పుడు నాతో నీవన్న స్నేహం ప్రేమ అన్నీ టైం పాస్ కోసం అన్నావుకదా.. ఇన్ని జరిగినా ..ఇంకా నామనసు నిన్నే కోరుతోంది నా మనసుకు పడ్డగాయానికి మందులేదు ప్రియా.. అదంతే పిచ్చిది అన్నీ నిజం అని నమ్మి మోసపోతోంది దేవుని గుడిసాక్షిగా జరిగిన మోసం..నామీద దాడి.. ఓ మనిషిని నిజంగా ఇష్ట పడితే ఇంతలా భాద పడాలా .. అవమాన పడాలా.. మరొకరికోసం నన్ను ఇంతలా అవమానించాలా ప్రియా...నేను చాలా మందిని చూసాను ప్రియా.. ఎవ్వరైనా ఇష్టపడ్డవాళ్ళు ఉంటే ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారు..ఎవ్వరి మనసును ఎవ్వరూ భాద పెట్టుకోరు...ఎవ్వరైనా తన కిష్టం అయినవారినంటే వాళ్ళూ ఇద్దరూ ఒప్పుకోరు మరి నన్ను వెరొకరి కోసం నన్ను ఎన్ని మాటలు అంటానికైనా వెనుకాడరు .. అంతలా మరొకరు మనసులో ఉన్నప్పుడు నాతో స్నేహం , ప్రేమ అని ఎందుకనాలి వాళ్ళకోసం నన్ను ఇంతలా అవమానించి భాద పెట్టాలి .. నేను భాద పడతాను అని తెల్సే ఎన్ని మాటలైనా అంటారు నన్ను .. భాదపడతాను అని తెల్సి కూడా ..నాపిచ్చిగాని నేను భాద పడాలనేకదా.. తనకు మనసుకు నచ్చినవారికోసం నన్ను ఇంతలా భాదపెట్టేది కదా ప్రియా..నాకెందుకో ప్రతిసారి బంగపడటం భాదపడటం ఎంత అలవాటైందో ... నాకిష్ట మైనవాళ్ళు కూడా అంతలా భాదపెడుతున్నారు... ఎందుకని నాకే ఇలా జరుగుతోంది నన్నే ఇలా భాద పెడుతున్నారు..నలిగిపోయాను ప్రియా బాగా నలిగిపోయాను.. మానసికంగా తట్టుకోలేక పోతున్నా..ఎప్పుడైనా ఏక్షనమైనా ..ఈ లోకం నుంచి దూరంగా పారిపోవాలనుంది ప్రియా..దానికోసమే దారులు వెతుక్కుంటున్నా ప్రియా అవును అయితే ఏంటంటా అంటావు నిజమేకదా నేను ఎమైపోతే నీకేంటీ .. నీవు నీస్నేహితులతో హేపీగా ఉన్నావు.. నేను ఎమైతే నీకేంటి.. ఎమైనా నీవు కనీసం ఓకంటి చుక్క కన్నీరు కూడా కార్చవేమో చూసావా ఇంత భాదలో కూడా ఇంకా నామీద నీకు ప్రేమ మిగిలిఉందేమో అంది నా పిచ్చి మనసు ఆశపడుతోంది ప్రియా ఎందుకో ఆ పిచ్చి మనసుకు నీవంటే అంత ఇష్టం నీవెన్ని మాటలు అన్నా ..నీవే కావాలని ఇప్పటికీ కోరుకుంటోంది ప్రియా ఎవరన్నా నాతో ఈ మద్యి ప్రేమగా మాట్లాడితే ఆచ్చర్యిం అనిపిస్తోంది.. ఎందుకిలా ప్రేమగా మాట్లాడి మోసం చేస్తారు అని భాదవేస్తుంది వాళ్ళు అలా మాట్లాడుతుంటే వింతగా ఉంటోంది ప్రియా..ఈ మద్యి ఓ ఇద్దరి స్నేహితులను చూశాను ఆ అమ్మాయి తన స్నేహితుడిగురించి చెబుతూ .. వాడు చాలా సెన్సిటీవ్..అంటూ ఎంతో జాగ్రత్తగా .. తనను నొప్పించకుండా నాదగ్గర తన స్నేహితుణి గురించి సుతి మెత్తగా మాట్లాడుతుంటే నా కంట కన్నీరు ఆగలేదు ప్రియా.. నిజం..నీవు నాతో అంతకంటే ప్రేమగా మాట్లాడావు..తరువాత వద్దులే నీ మనసుకు అలా అనిపించింది అలా చేసావు అడగటానికి నేనెవ్వరిని చెప్పు...నేనింక ఎవ్వరి స్నేహం చేయను ఒంటరిగానే ఉంటాను ఏదో రోజు నామీద నాకు చిరాకేసి నాకు నేను తగలబడిపోతాను ఎందుకో తెల్సా.. నీకు నిజం తెల్సి.. నాప్రేమలో ఎంత నిజముందో తెల్సుకునే సరికి నీకు చూడటానికి నా...నేను తగల బడ్డాక కాలిన బూడిదగా కనిపీచాలన్నంత కసి నామీద ప్రియా.. నీవంటే ఎప్పటికీ ఇష్టమే ఆవిషయం నీకు తెల్సు అందుకే అయితే ఏంటంటా అంటావు..కదా..నీ చుట్టూ ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కాదు జాగ్రత్త అని చెప్పాలని ఉంది ఎందుకోకూడా నాకు కారణం తెల్సు.. కాని నీవు ఆవిషయం చెప్పే అవకాశం నాకివ్వలేదు ప్రియా.. అందుకే ఇలా చెబుతున్నా ప్లీజ్ ప్రియా జాగ్రత్తగా ఉండు ..నీ ఎదురుగా ఓరకంగా పక్కన మరోరకంగా మాట్లాడుతున్నారు వాళ్ళనే నమ్ముతున్నావు...అయినా ఇప్పుడు నా మాటలు వినే స్తితిలో నీవు లేవులే ప్రియా నేనేమైతే ఏంటీ లే ప్రియా నీవు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలన్నదే నేను చివరి వరకు కోరుకునేది దేవున్ని ప్రియా.. Take Care Bujjiii

ప్రియా నీపై ఇసుమంత కూడా లేని అధికారానికి నాకెందుకింత తాపత్రయం.. ?


ప్రియా నాలో పొంగే భావాలే నన్ను వెంటాడి మరీ వేధిస్తున్నాయి.
నాతో సహకరించని నిజాలు ..
ఎప్పటికి నిజం కాని కలల నిప్పుల్లో నేను కాలిపోతుంటే..
ప్రియా నీతో గడిపిన ఆనంద క్షణాల అగ్నికి నే ఆహుతి అవుతుంటే..
ప్రియా నువ్వు మాత్రం నిశ్చింతగా అక్కడ ఎలా నిద్రపోతున్నావు..?
ప్రియా నీ తలపుల వలపు సెగను నాలో ఎందుకు రేపుతున్నావు.. ?
అయినా నా పిచ్చి కాకపోతే .....
ప్రియా నీపై ఇసుమంత కూడా లేని అధికారానికి నాకెందుకింత తాపత్రయం.. ?
ఎప్పటికి నువ్వు దక్కవని తెలిసినా నా వెర్రి మనసుకెందుకింత ఆవేశం..?

ఎందుకో తెలుసా...?
నే ప్రాణంగా ప్రేమించే ప్రియా నీ (నా) కన్నుల కోసం,
ప్రియా నన్ను నేనే మరిచిపోయే నీ చిరునవ్వుకోసం,


ప్రియాకేవలం నిన్ను తప్ప, నీ నుంచి ఇంకేమి ఆశించని నా ఈ ప్రయత్నం..
ఎప్పటికైనా నిన్ను కరిగిస్తుందని ఆశిస్తూ..
భాధాగా వెలుతున్నాను ప్రియా ఎక్కడికో తెలీదు ..

Saturday, July 21, 2012

“నిన్ను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, మిస్ అవుతున్నాను...” వాక్యాలు వేరైనా భావం ఒక్కటే

“నువ్వంటే నాకు చాలా ఇష్టం” – ఆడా మగా ఇద్దరి మధ్య చోటుచేసుకునే ఈ సంభాషణని చదవగానే ఎవరు ఎవరితో ఏ సందర్భంలో ఇలా అన్నారో ప్రస్తావించకపోతే ఇదేదో ప్రేమ వ్యవహారం అనే సందేహమే అధికశాతం మందికి సహజంగా కలుగుతుంది. ఒకే భావాలున్న ఇద్దరు వ్యక్తులు తమ ఆలోచనలను ఒకరిలో మరొకరు చూసుకుంటూ ఉబ్బితబ్బిబ్బయ్యే వేళ ఇలా ఇష్టాన్ని వ్యక్తపరుచుకోపోతే మనసు నిరాశ చెందుతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ప్రేమికులే కానవసరం లేదు.. స్నేహితులూ ఒకరినొకరు ఇష్టపడొచ్చు. కానీ ఆ ఇష్టాన్ని మనసారా మాటల్లో చెప్పాలన్నా “ఇష్టం” అనే పదం అపార్థాలకు తావిస్తుందేమోనని గుంజాటంలో చిక్కుకునే దుస్థితి మనది. నేస్తం తన స్నేహహస్తంతో హృదయాన్ని తడిమినప్పుడు “నువ్వంటే ప్రాణం మిత్రమా” అని మనసు ఒద్దికగా ఒదిగిపోతూ మూలగకపోతే మనలో స్పందనలు ఏమున్నట్లు? నిష్కల్మషమైన ఆ ప్రేమకు కూడా ఆద్యంతాలు, తర్కాలు అన్వేషించనారంభిస్తే మనలో మానవత ఎంత అడుగంటిపోయినట్లు..?

“నిన్ను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, మిస్ అవుతున్నాను...” వాక్యాలు వేరైనా భావం ఒక్కటే... హృదయాన్ని మరో హృదయం ముందు పరచడం! “హృదయం” అనేది ఇప్పటి రోజుల్లో మనసుతోపాటు శరీరాన్నీ ప్రేమించే “సంపూర్ణ ప్రేమికుల”కు కట్టబెట్టబడిన పేటెంట్ వస్తువు. ఒకరి హృదయాన్ని మరొకరు తరచి చూడడం ప్రేమికులే చేయాలి. అపోజిట్ సెక్స్ కి చెందిన ఇద్దరు స్నేహితులు భావాలు కలిసి హృదయసావాసం చేసుకోవడం భౌతిక ప్రపంచానికి మింగుడుపడదు. హృదయాన్ని ప్రేమించడం అంటే శారీరక వ్యామోహమూ అందులో అంతర్లీనంగా ఉండి ఎన్నో హృదయాలకు మధ్య అగాధాలు పెంచేస్తున్నాయి.ప్రేమిస్తున్నాను అన్న నీవే .. స్నేహాన్ని ప్రేమ అని చెప్పి అపహాస్యిం చేస్తున్నా అన్నవు .. నీ మనస్సాక్షిని అడుగు ... నీవు అన్నావో లేదో ప్రియా ప్రేమ ఒక్కసారే పుడుతుంది.. ఎట్టి పరిస్థితుల్లో మారదు కదా..? .. నీకంటే అందంగా వున్నా అందంగా మాట్లాడే వారొచ్చినా అది ప్రేమ మహిమ ఒక వేళ ప్రేమ పేరుతో మోసం చేస్తే.. మరొకరు ప్రేమను ఆ ప్రేమను మరిపిస్తే..భాదలో ఓదార్పునిస్తే కచ్చితంగా ఆప్రేమ లో కొద్దిగా మార్పు వస్తుంది..అదీ పూర్తిగా కాదు... మనుషులు మారగానే ప్రేమ మారటాన్ని .. ఆప్రేమకు ఏమని పేరు పెట్టి పిలుస్తారో తేలీదు.. కాలం తో పాటు ప్రేమలో నిజాయితి లోపిస్తుంది..నిజమైన ప్రేమ అని నమ్మినవాడు ఎదుటి వారిలో మార్పు చూసి .. తట్టుకోలేక పిచ్చి వాడవుతున్నాడు.. మరికరిని మనసులో పెట్టుకొని ..ఇంకరికి ప్రేమ అని చెప్పడ ఆతరువాత అలా అన్నానా అనటం ప్రేమ పేరుతో చేస్తున్న పిచ్చికి పరాకాష్ట .. తనదే నిజమైన ప్రేమ అని నమ్మినవాడు మోసపోయిన వాడు.. నిజంగా పిచ్చోడే కదా మరి..?

నా నేస్తం తన ఆప్యాయతతో మనసుని నిమిరినప్పుడు “ప్రియతమా” బుజ్జీ " అని పిలవాలని పిస్తుంది అని మనసారా పిలవాలనిపిస్తుంది. కానీ గొంతులోనే సమాధి అయిపోతుంది ఆ పిలుపు. అలాంటి పదాలు వాడాలంటే మనసులో లేశమాత్రమైనా నటన లేకున్నా “నాటకీయత” ధ్వనిస్తూ అద్భుతమైన అనుభూతి అతి సాధారణం అయిపోతుందేమోనన్న భయం ఆవరిస్తుంది. భావవ్యక్తీకరణకు, ఇరువురు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని పటిష్టం చెయ్యడానికి ఆలంబనగా నిలిచే ఆణిముత్యాల్లాంటి.. “ఇష్టం, ప్రేమ, ప్రియతమా, నేస్తమా... ప్రేమతో” వంటి పదాల్ని సినిమాల్లో యువహృదయాల్ని ఆకట్టుకుని కనకవర్షం కురిపించుకోవడానికి విచ్చలవిడిగా వాడేసి ఎంత చులకన చేశారో తలుచుకుంటే హృదయం తరుక్కుపోతుంది. యంత్రాల మధ్య భౌతికంగా మనమూ యంత్రాలమైపోయాం. గాఢమైన అనుభూతులను చులకనైపోయిన అమూల్యమైన పదాలతో పలకలేక మనసునూ యాంత్రికం చేసుకుంటూ సాగుతున్నాం...ఒకప్పుడు అలాపలికిన పెదాలే..ఇప్పుడు ఘోరమైన పదాలు పలికేందుకు సైతం వెనుకాడటంలేదు..కారనం ఎదైనకావచ్చు కనీసం అర్దం చేసుకోలేని మనస్సు లేనప్పుడు ఆ పదాలు పలికే అర్ష కోల్పోతారు మనం నుంచి నేను అనే స్వార్దం..నీలో ప్రవేశించినప్పుడు...ఎదుటి వాడు భాదపడతాడు అని తెల్సినప్పుడు కూడా స్వార్దంతో నీవు పలికే ప్రతీక్షరం ఎదుటి వాని . ఒకప్పుడు నీకు ప్రత్యేక మైన స్నేహం ఇప్పుడు కాదన్న నీపెదాల్లో నిజాయితీ ఎప్పుడు పలుకుతావు ..మనస్సు గాయపరస్తున్నాను అనీ అయినా నీవు ఆలోచించగలిగావా..?...నీ మనస్సాక్షిని ఒప్పించే చేస్తున్నావా.].? తెలీక చేస్తున్నావా తెలిసి చేస్తున్నావా ఎంత తలలు పగుల కొట్టుకున్నా అర్దకావడంలేదు మిత్రమా అంత తీరిక నీకెక్కడిదిలే..నీవరకు నీవు హేపీగా ఉంటే చాలుకదా అనే నీవు అలోచిస్తావు..నా చిన్నిమనస్సు కూడా నీవు హేపీగా ఉండాలనే కోరుకుంటుంది అని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటే చాలు అదెలాగూ నీవు చేయవులే...

ప్రియా గుండెల్లో నాకెందుకో గుబులుగా ఉంది...?


ప్రియా నాకెందుకో గుబులుగా ఉంది
నా అనుకున్న ప్రతిది ఎదురు తిరిగితే
మన అనుకున్న వాళ్ళు మనసుకు దూరం అయితే..
అన్నీ తెల్సి..ఓదార్చాల్సిన నీవే ఇలా చేస్తే ప్రియా
అందుకేనేమో ఆలోచనలతో నేను
రాలుతున్న జ్ఞాపకాల్ని..
ఏరుకుంటూ వెర్రి వాడిలా..

ఏదో ఆలోచిస్తూ దేనికోసమో చింతిస్తూ,
ఎరుగని ఒక కొత్త లోకానికి నేనేగుతున్నట్టు,
అప్పటి వరకు నాకు పేగుతో ఉన్న భంధం విడిపోతున్నట్టు,
ఉన్న కొన్ని రోమాలు నిక్కబొడుచుకుంటూ,
కొన్ని అరుపులు ఆక్రోశంగా వేదనననుభవిస్తున్నట్టు,
ప్రియా ఏంటో పిచ్చి పిచ్చిగా ఉన్నాయి ఆలోచనలన్నీ

ప్రియా కళ్ళు మూసుకొని ఎప్పూడూ... నిన్ను చూస్తూనే ఉన్నా


నీ జ్ఞాపకం
ప్రియా అదే జ్ఞాపకం
పదే పదే మనస్సుని తడుముకుంటూ
ప్రియా మరిచిపోవటం అనేది
అన్నింటికీ కాదేమో
నీ జ్ఞాపకాలకు అస్సలే కాదు

ప్రియా గతం ప్రతీ రోజు తరుముతూనే ఉంది
నువ్వు ఎక్కడ ఉన్నావో వెతకమని
ప్రస్తుతం ఆపుతోంది.. ప్రతి అడుగుని
నిన్ను జ్ఞాపకం గానే ఉంచమని

ప్రియా నేను వేసే ప్రతి అడుగులో
తీసే ప్రతి శ్వాసలో
నీ జ్ఞాపకం

ప్రియా ఎక్కడో... ఎప్పుడో
నువ్వు ఎదురుపడితే
ఇదీ...అని చెప్పుకోడానికే
ఈ మాత్రం అయినా గెలిచింది

ప్రియా నాకు... ఎంత దూరంలో
నువ్వున్నావో... తెలియదు
మనస్సుకి.. ఎంత దగ్గరగా ఉన్నావో మాత్రమే తెలుసు

ప్రియా కళ్ళు మూసుకొని ఎప్పూడూ... నిన్ను చూస్తూనే ఉన్నా
ఊపిరి ఆగేలోపు.. ఒక్కసారి
కళ్ళు తెరిచి చూడాలని... ఎదురుచూస్తున్నా...

Friday, July 20, 2012

నీవు గుర్తుకొచ్చినప్పుడు..రాత్రుల్లుపడ్ద భాదను ఎవ్వరు చూశారు కనుక ప్రియా


నిదుర రాని రేయిలో..
పురుడు పోసుకున్న వేదనలు..
ప్రియా జరుగుతున్న ఘటనలు నేనేంటో నీరూపిస్తున్నాయి..
నా స్నేహం ఉనికినే ప్రశ్నించాయి ప్రియా...
ఓడిపోయిన క్షనంలో నేనేంటో ఇలా
నీవు గుర్తుకొచ్చినప్పుడు ...
రాత్రుల్లుపడ్ద భాదను ఎవ్వరు చూశారు కనుక ప్రియా
ఎవరు చూసారు గనుక....ఎన్ని క్షనాలు..ఘడియలు నీకోసం తపించానో ప్రియా
కాని తెల్సి నీవు మౌనంగా ఉంటావు..
ఆ మౌనం వెనుక కారనం నాకు తెలియడం లేదు ప్రియా
జారుతున్న కన్నీటిలో..గతం జారిపోతుందేమో అన్న భయం..
ప్రియా అందుకే కాబోలు కన్నీరు కారినా అపుకోని ఎంతగా ఏడ్చానో
రేపటి స్వప్నాలు ఉన్నాయని
ఎవరికీ తెలుసు గనుక...ప్రియా
చిరునవ్వుల వెనుక
ప్రియా రాసుకుంటున్న మంటల వేడి
ఎవరిని తాకింది గనుక....
ప్రియా నేనేంటో...........తెలియడానికి..?
నా భాదేంటో చెప్పుకోవడానికి నీవు .. నా దగ్గరలో లేవెందుకని ప్రియా..?

ప్రియా అవిగో, కన్నీటిపొరలు నాకు ఇంకా కనిపిస్తూనే వున్నాయికదా!


ప్రియా పిల్లగాలికి పులకరించే నా శరీరం..
మొద్దుబారిపొయిందేమో!
లేక.. పిల్లగాలి నను వెలివేసిందా!

మైమరపించేటి ఆ పూతోటల పరిమళాలు
నా శ్వాసకు అందటం లేదేమీ ప్రియా!
ప్రియా కొంపదీసి నా శ్వాసగానీ... ఆగిపోయిందా!

ఇంకా లేదే!
ప్రియా నీ ప్రేమై వెర్రికేకలు పెడ్దుతున్న నా హ్రుదయనాదం ఇంకా నాకు వినిపిస్తుంది కదా!
ప్రియా అవిగో, కన్నీటిపొరలు నాకు ఇంకా కనిపిస్తూనే వున్నాయికదా!
ప్రియా నీ చేతి స్పర్శకై నా శరీరం ఇంకా తపిస్తూనే వుంది కదా!
ఆ శ్వాస కూడా.. తెరలు తెరలుగా.. పరిగెడుతుంది కదా ప్రియా

ప్రియా ఒంటరి తనపు మౌనాన్ని ఉపిరి తిత్తుల నిండా బలంగా పీల్చుకొని
ప్రియా ఒంటరి తనపు మౌనాన్ని ఉపిరి తిత్తుల నిండా బలంగా పీల్చుకొని
బాధల సుడులను బయటకు వదులు తుంటే
వ్యర్ధంగా రాలిపోతుంది వర్తమానం
అస్త్రైలో బూడిదల

ప్రియా నాలో ఈ అలవాటుకి సమాజం చూపే కారణం
అనాలోచితమో, అవివేకమో, అమాయకత్వామో, అహంకరమో
ఆథ్మన్యున్నథ అభత్రతా భావాల డిఫెన్స్ మెకనిజమో
నాకానవసరం

ప్రియా నికోటిన్ నిషానీ తలకెక్కించి
నిస్తేజత స్థానంలో నిర్లక్షాన్ని నింపి
నరాలని స్టిములేట్ చేసి నాడులని వైబ్రట్ చేసి
గతం గాయాలకు సెల్ఫ్ పిటీ బామ్ ని అద్ది ఒదర్చెది వ్యసనమైనా
దానికి బానిస నవ్వడానికి
నాకు సమ్మతమే ప్రియా

ప్రియా పొగ.............
నల్లటి దట్టమైన పొగ
సుడులు తిరుగుతూ పైకి ఎగురు తుంది ...ఆ చ్చం నా ప్రియురాలి కురుల ముంగురులల

ప్రియా పెదవుల మధ్య మెత్తటి ఫిల్టర్ దూధి
తన లేత నుగారు బుగ్గల్‌ల (స్టుపిడ్ సిమిల్యారిటీ అనుకుంట)

అటు చివర వెలిగే నిప్పు కణిక
తన ఆధరాలలా ఎర్రగా మెరుస్తుంటే
అందుకోవాలనే ఆతృతతో బలంగా పీలుస్తున్నాను


ప్రియా వేడి పొగ గుండెల్లో చేరుతుంటే వెచ్ఛటి తన కౌగిలి అనుభవానికి వస్తుంది
ఆఖరి ధమ్ము వరకు అదే అనుభూతి
తానిచ్చిన తొలి ముద్దు తాలూకు తిమ్మి రీ
వాళ్ళంతా పాకు తున్న్నట్టు
మత్తుగా గమ్మతుగా


ప్రియా హటాత్తుగ కళ్ళ ముందు వెరిసిన వాస్తవికత
పొగ.........
నల్లటి దట్టమైన పొగ

ప్రియా కాన్సర్ కత్తిని కస్సున గుండెల్లో గుచ్చింది
ఆచ్చం వెన్ను పోటు పొడిచిన నా ప్రియరాలిలా..

ప్రియా నీకోసం ఎదురుచుస్తూ ..?

Tuesday, July 17, 2012

త్వరలో ఈ బ్లాగ్ ను క్లోజ్ చేస్తున్నా ....? ఈ రోజు ఎందుకో యేమీరాయాలని లేదు..త్వరలో ఈ బ్లాగ్ ను క్లోజ్ చేస్తున్నా ....? ఈ రోజు ఎందుకో యేమీరాయాలని లేదు..

మనసుకు నచ్చిన వాళ్ళు మనఫోన్ కట్ చేసి వేరే వాళ్ళతో మాట్లాడీతే


మనసుకు నచ్చిన వాళ్ళు మనఫోన్ కట్ చేసి వేరే వాళ్ళతో మాట్లాడీతే..
చాలా భాదవేస్తుంది.. మనం భాద పడతామని తెలీ కూడా
వాళ్ళు అలా చేస్తే ఆభాద చెప్పుకోలేనిదిగా ఉంటుంది..

అంటే మనంటే అసహ్యిం ..కాబట్టే కదా ఫోన్ కట్ చేస్తారు.
అన్ని రోజుల తరువాతా ఆప్యాయంగా మాట్లాడుతారని అనుకుంటే
మన ఫోన్ కట్ చేసి వేరే ఫోన్ లో మాట్లాడీతే ఆభాద చెప్పుకొలేం కదా..?

Monday, July 16, 2012

ఇది నా మనసు డైరీ ప్రియా..


ఇది నా మనసు డైరీ ప్రియా..
చదవటానికి ప్రయత్నించు....
గుండెలో రగులుతున్న వేదనను అర్దం చేసుకో
అందరిలా నిన్ను టైపాస్ కోసం నిన్ను ఇష్టపడలేదు..
నేను వేరు అందరిలా ఆలోచించని
అందరిలాంటి వాడిని కాదు ప్రియా అందరీలా ఆలో చించలేను...
అందరిలాంటి వాడిని కాదు ప్రియా
నాదన్నది నాకే సొంతం అన్న కుంచిత మనస్తత్వంనాది
నీవు ఎవ్వరితో నాకన్నా ప్రేమగా మాట్లాడావంటే తట్టుకోలేను
నీ ప్రేమ నీ స్నేహం నీ కష్టం
నీ ఆనందం లో అన్నీ నేనవ్వాలనే అనుకుంటాను
పరిచయం అయింది మోదలు ప్రతి నిమిషం నీగురించే ఆలోచిస్తున్నా ప్రియా..
జరుగుతున్న విషయాలు అర్దం అవుతున్నా..
ఏముంది నాకు నీమీద అధికారం చలాయించడానికి కదా
అలాని నిన్ను బందిచను గుండేల్లో ఉన్నావు ..
గుట్టుగా నిన్ను చూసుకుంటాను ..
హాయిగా ఉండు ఆదరిస్తాను ..
నన్నూడి వెల్లకు ప్రియా ఇది నా చివరి కోరిక

ఈ చల్లదనం లో నీకు నులి వెచ్చని దుప్పటిగా నిలచి పోవాలని ఉంది ప్రియా


చీకటి తొలగక ముందే..కమ్ముకున్న మబ్బునీడల్లో
తలుపు తీయగానీ జివ్వుమంటూ కురిసిన చిరు జల్లు
నా మనసులోని నీ తలపులను ఒక్కసారిగా తట్టిలేపాయి

ఎవరో షామియానా వేసినట్టు చెట్లపై..
స్వచ్చమైన చినుకులు..
స్వచ్చమైన నీ చిరునవ్వులా

ఈ చిరుజల్లుల.పచ్చని పరువాల చెట్లపై
బొట్లు బొట్లుగా జారుతూ
చల్లటి ఉచ్చులతో నరాలు బిగిస్తో౦ది
చలిని చెక్కుతున్న అకాశ౦ ను౦చి
చిరుజల్లులు నీ నవ్వులా కురుస్తూనే ఉన్నాయి
చుక్కలు కనిపి౦చడ౦ లేదు
చ౦దమామ జాడ తెలియడ౦ లేదు.
అవకాశం ఎప్పుడొస్తుందా బైటికొద్దామని తొంగి చూస్తున్న సూర్యుడు
చి౦తతోపు చివరల్లో౦చి..కమ్ముకున్న నల్లటి మబ్బుతునకలు
చలిగాలిలా దూసుకొచ్చే ఆసవ్వడికి జివ్వుమటున్న మనస్సు..
నీ జాడకోసం ఆత్రంగా అడుగుతోన్న మనస్సు..?పూలమొక్కల సిగలో ముత్యాలు మెరుస్తున్నాయి
మ౦చులో తడిసిన గుమ్మడి పువ్వు
చిన్నసైజు అక్వేరియ౦లా జలజలలు పోతో౦ది
అరటిబోదెలు నీటి చుక్కలుగా జారుతూ

పొద్దు పొడవట్లేదు
గడ్డకట్టిన శరీరాలపై సూదులు గుచ్చడానికి
సూర్యుడు భయపడుతున్నాడు
ఆలోచనలు రేపిన మ౦టలతో..
వేడి వేడి కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నా..
చిరుజల్లులు చేసే సవ్వడి ...
నీవేం చేస్తుంటావో అంటూ అడుగుతున్నాయి ప్రియా
ఇక ఇక లాబం లేదు నేనే అగ్నిగోళాన్నై ఉదయి౦చి..
నీ దేహానికి వెచ్చని కవిత్వాన్ని..
కాపడ౦ పెట్టాలనే చిరుప్రయత్నమే ప్రియా ఇది.
ఈ చల్లదనం లో నీకు నులి వెచ్చని దుప్పటిగా నిలచి పోవాలని ఉంది ప్రియా

ఇప్పుడే కురిసిన వాన జల్లు ...వాన జల్లుకు తడిసన మట్టి వాసన గమ్మత్తుగ ఉందిచెలి


ఇప్పుడే కురిసిన వాన జల్లు ..
పరిసరాలని పులకరింప చేసిందిచెలి..
కలయికని తెలిపే ఊహలు నా మనసుకి కలిగించే పులకరింత లాగా...
వాన జల్లుకు తడిసన మట్టి వాసన గమ్మత్తుగ ఉందిచెలి
చేరువలో వెళ్తున్నప్పుడు గాలి వాసన కలిగించే మత్తులాగా...
చల్ల గాలులు, కారు మబ్బులులేని వెచ్చదనాన్ని, రాని వెన్నెలని గుర్తు చేస్తున్నాయి...
చెలి దూరంగా వుంది...తన కలవరింత ప్రకృతి ఆస్వాదనని దూరం చేస్తుంది..
చెలీ రావే,వరాలీవే,వెతికా నిన్ను వీచే గాలుల్లోకన్నా నిన్ను కారు మబ్బుల్లో..
వెచ్చదనం ఏదని? వెన్నెల రాదే అని?చెలీ రావే,వరాలీవే...
చల్లని పిల్ల గాలులకు నీతలపులతో ఉరకలేస్తోంతి ప్రియా
ఎక్కడున్నావు నీ వెచ్చని కౌగిలిలొ నన్ను బందించు ప్రియా

Sunday, July 15, 2012

ప్రియా రాత్రంతా కబుర్లాడుతావని..కవ్వింతలతో నిదుర పొదామని..?శ్వాసనంతా దారాలుగా మార్చాను ప్రియా
నీ గుండె చుట్టూ నన్ను ముడుపు కట్టుకున్నా
తలగడలో దూరి పోయి..
నీజ్ఞాపకాలు తో కన్నీరును ఆపుకుంటూన్నా ప్రియా
శ్వాసవై.నా వెచ్చని ఊపిరికి నీవు ఆసరా అవుతావని
ప్రియా రాత్రంతా కబుర్లాడుతావని..కవ్వింతలతో నిదుర పొదామని..?
చెవులకు నా మనసును తగిలించా..ప్రియా
ఉక్కపోస్తున్న మనసుకు..?
నీ వేడి ఉశ్వాసలు తెలుస్తున్నాయి ప్రియా
భావాలై చల్లబరచాలని..నీకోసం
వావేడి తలపులు నీతో పంచుకోవాలని ప్రియా
చీకటింట్లో దీపమైనట్టు..
వెన్నెళ్ళో చందమామలా..నా పక్కన నీవున్నావని
నీ మాటల్తో..వెచ్చని కౌగిలింతల గిలిగింతలతో
నా గుండెలో శ్వాసను వెలిగించాలని..
నాలో రగిలే వేడికి నీ తాకిడి తోడవ్వాలని
మసిబారుతున్న ఆశలను..
నీ కోరికలతో రగిలించుకోవాలని..
నా మనస్సు ను నీకోసం ప్రతి రాత్రి
కన్నీటితో శుభ్రం చెశా

ఏమయ్యావ్ ?
రెక్కలు గాలికిచ్చి
మనసును నాకిచ్చావ్ అని మరిచి
పెదాలకు ప్రేమ అర్ధాలు నేర్పి
ఉషస్సుని తిమిరాన్ని కలిపే దారిలో
రాగాల ఊయల వేసుకొని

గాలితో గుస గుసల కచేరి చేస్తూ
సంధ్యా వేళయ్యిందని ఎరుగక
గుండె గూటికి దారి మరిచవా ?
ప్రతి రాత్రి నీజ్ఞాపకాను నేను మరువలేదు
నీవు మరిచినట్టున్నావు..
అందుకే మనిద్దరి మద్యి మాటలు కరువయ్యాయి ప్రియా..
మనసు మాట వినటం లేదు ప్రియా..
నీ వెచ్చని ఊపిరుల తలపులతో ..
ఏరాత్రి నేను సరిగ్గా నిద్రపోయింది లేదు ప్రియా..
నీవు నన్ను మర్చి ..విరహపు ఏకాంతాన్ని నాకు వదలి
ఏమాత్రం జ్ఞాపకాలు లేకుండా హాయిగా నిద్రపోతున్నావు కదా ప్రియా..?

నాతో ఉంటావ్.....తనకోసం ఆలోచిస్తావ్... నా శత్రువు నువ్వే మనసా

నీకు మనసిచ్చా....నాకు కలలిచ్చావు
మనసుకు బాధ...పెదవులకు నవ్వు అలంకారంగా మిగిలింది
కన్నీరు సుడిగుండం అయినా....అందులో నీ జ్ఞాపకాలు మాత్రం పదిలం
నువ్వు, నీ చిరునవ్వే లేని చోటే కావాలి
ఊహల ఉయ్యాల నుండి కింద పడ్డాను....జీవితం అనే నిజం కనిపించింది
తుదిదాకా తోడు ఉంటావనుకున్న....తుదముట్టిస్తావనుకోలేదు
నీతోపాటు నా చిరునవ్వు కూడా తీసుకెళ్ళావు...అది ఇస్తావా....నువ్వొస్తావా?
నీ కళ్ళతో చూడాలని ఉంది...నేను కనిపిస్తానో లేదో అని
మనసు నుండి కళ్ళకి నీ ప్రయాణం....కన్నీరులా
కన్నీళ్ళకు మాటలొస్తే కనులు అలసిపొతాయేమో
నా చిరునవ్వు చిన్నబోయింది....నువ్వు వెళ్ళాక
కన్ను తడవకుండా....రోజు గడవట్లేదు
మనసంతా నువ్వే....మరి నేనెక్కడ?
సముద్రంలో నా కన్నీటిబొట్టు.....చూసారా ఎవరైనా?
మరువలేక చస్తున్నా....మర్చిపోయి చంపేసావ్
ఇచ్చినచోటే తీస్కో....ఇచ్చావని అడిగితే బాధే
కనులలో సుడిగుండాలు....మనసులోకి వరదలా
కన్నీరు మనసులోకే....బయటికి రానంటుంది
ధగ్గరవాలంటే భయం....దూరమవుతావేమోనని
జీవితం ఒక ప్రశ్న.....చావే సమాధానం
అబద్ధం చాటున నిజం ప్రశ్నిస్తున్నా....నిజాన్ని అబద్ధం చేశా చేతకాక
నీ జ్ఞాపకాల తూఫాన్....నా హృదయ సముద్రంలో సునామీగా
నీ చూపులకవ్వింపులో....లేవలేకపోయా జీవితమంతా
నీకు నాకు దూరం...కనురెప్పలు మూసి తెరిచే కాలం....
తన విజయం నా కన్నీరు........నా కన్నీరే తన ఓటమి
ఏకాంతం ప్రశ్నించింది....నీ కలలన్నీ నిజమైతే నేనేమవాలని
కలలో అనుకున్నా... కలత నిద్రలో నువ్వు...
నాతో ఉంటావ్.....తనకోసం ఆలోచిస్తావ్... నా శత్రువు నువ్వే మనసా
కడదాకా ఉంటా అనుకున్నా.......కడలిలో కలిసిపోతా అనుకోలేదు
కలలతో కనుల యుద్ధం........ కలలే గెలిచాయి
కళ్ళకి సర్జరీ అవసరం....ఎటు చూసిన నువ్వే మరి....
వదలలేక వదలలేక కదిలా.....నీ చివరి చూపు నుండి...
చిరునవ్వు విసిరావు....అందటానికి జీవితకాలం పట్టింది
నాకిష్టమైన కష్టం.....నిన్ను కలవటం ...
నువ్వు కాదన్నందుకు కాదు.....నేను కాదనలేనందుకు బాధ..
దగ్గరగా జాబిలి.....దూరంగా నువ్వు...
జాబిలి ప్రేమంతా నాకేవెన్నెలగా.....మరి నువ్వెక్కడ?.....
నా కన్నుల్లో నువ్వు బందీవైతే...జీవితఖైదు నాకు పడిందేంటి?.......
దగ్గరై తేలికయాను.....దూరమై భారమయావు...
నీతో స్నేహం....నాకిష్టమైన గాయం
ఎన్నాళ్ళకు వస్తానో....నీ నుండి బయటికి....
మనసు బాధ కన్నీరుగా కూడా మారట్లేదు....
కలలన్నీ వెలివేసాయి కన్నుల్ని....... చూసేదెలా నిన్ను?
బాధంతా ఘనీభవించి.... కన్నీరుగా కూడా కరగట్లేదు...
మనసులో జ్ఞాపకాల చినుకులు....కళ్ళల్లో కన్నీటి వరదలా
పురివిప్పిన నా మనసులో... అన్నీ నీ జ్ఞాపకాల కన్నులే....
ఇలా నీ జ్ఞాపకాల సంద్రంలో నేను.....అలలా తాకివెళ్ళే నువ్వు..

వెన్నెలరాత్రుల్లు ప్రకృతితల్లి ఒడిలో నేను నిదురోయే వరకే అని..?ఘల్లు ఘల్లు మంటూ
తెల్లని చీరతో వర్షం
తడి ఆరని పెదాలతో.
తడబడే అడుగులతో
వయ్యారంగా నడచుకొంటూ
ఎదురుగా వచ్చి కూర్చుంది
నా ఊహల సుందరి

కళ్లలోని..కవ్వితల్ని
ప్రేమను పెదాల ఎరుపుగా చూపిస్తూ
బుగ్గళ్ళో ఎరుపును సిగ్గుగా మల్చి
కన్నీటి చుక్కల్ని తుడుస్తూ
ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని
మెల్లిగా చిరునవ్వు నవ్వింది..

నీవు "ఒంటరివని ఎవరన్నారు ?"
నా "కన్నా" బుజ్జీ అంటూఅని ఆప్యాయంగా పిలుస్తూ
దగ్గరకు తీసుకొని నుదుటిపైముద్దాడింది

"మేఘంలా ఆవిరైన నన్ను కౌగలించుకుని
నేను లేనా అని అప్యాయంగా పలుకరిస్తూ
ఆ కౌగిలింతలో వెచ్చదనం నన్నూరడించిది
పొగలు పొగలుగా ఆవిర్లు కదులుతూ
నన్ను గుండెని గట్టిగా హత్తుకోని
గాలి అధికారంపై అదికారాన్ని చలాయిస్తూ
తన కౌగిలి ప్రపంచంలో కరిగించింది
కాని ఇది కల ఇప్పుడు ప్రేమ కబుర్లకి ..
సందేశం మోసుకెల్లడం వరకే..
తరువాత అమె దక్కాక విజయం నాదేనా
వర్షించే వరకు పూజలు పునస్కారాలు..
మమ్మల్ని ఏకాంతంగా కలిపిన ప్రకృతికి వదనం


ప్రకృతి పలుకులు చిలక పలుకులై ..
అంతా నిజంలాంటి బ్రమ అని తేలితే..?
నిజం అయ్యేదెప్పుడని మళ్ళీ ఎదురు చూపులు చూడడం తప్ప

కొద్ది సేపటి ఆనందం నిజం కావాలని
కొండల గుసగుసలలో కరిగి పోతూ
నేల నేలంతా పరుచుకుని వేడి నింపుకుంటూ
పచ్చిక పైరులతో అమెతో వెన్నెల రాత్రుల్లు
రాత్రుల్లు ప్రకృతితల్లి ఒడిలో నేను నిదురోయే వరకే అని..?

నా కళ్ళలో నీళ్ళుఓదార్పు పూలై
నా పైన కురిపించి నన్ను హత్తుకుని
పిలవగానే నేను నీతో ఉంటానని
తన ప్రేమతో తడిపి ఒంటరితనాన్ని
పంచుకుని నేస్తమయింది..నా ప్రియ నేస్తం

అనంత జీవన పయనంలో..ఏ బాంధవ్యబంధాలు శాశ్వతంకావు


ఈ రంగులు మారే లోకంలో
ఏ రెండు రంగులు ఒకటికావు
ఒకదానికోసం మరొకటి మారదు.

అనునిత్యం సాగే సృష్టిలయలో
ఏ ఇరువురి రాతలు ఏకంకావు
ఒకరి గీతను ఇంకొకరు మార్చలేరు.

ఈ స్వార్ధపు అనిశ్చల జగతిలో
ఏ జతల భావాలు అతికిసాగవు
ఒకరి భావాలతో వేరొకరికి పనిలేదు.

అనురాగ ఆత్మీయతల లోగిలిలో
ఏ జంట మనసులు ఒకటికావు
ఒకరికి బదులుగా వేరొకరు చావరు.

ఈ అనంత జీవన పయనంలో
ఏ బాంధవ్యబంధాలు శాశ్వతంకావు
ఒంటరితనానికి ఎవరూ జతకూడలేదు.

గుర్తుకు వస్తున్నదంతా ఒకటే..చనిపోయిన తరువాత నాదేహం కుళ్ళు వాసతప్ప


ఇప్పుడు నామనస్సు మనస్సులోలేదు
మనసులో ఆలోచనలు లేవు
ఉన్నదల్లా ఒకటే
ఏ నిముషంలో ప్రాణం పోతుందో అనే ఆలోచన

ఇపుడు హృదయాలలో స్పందన లేదు
ఆర్ద్రత అనురాగం లేదు
అనుభూతి, ఆత్మీయత లేదు
ఎదురయ్యేదంతా ఒకటే....
మరణ మ్రుదంగ నాదాల సవ్వడులు...
జనారణ్యంలో మానవ మృగాల సంవేదన..వినిపిస్తుంది

ప్రక్రుతిలో నాకు మనసున్న ప్రాణులే కనిపించడంలేదు
అంతా స్వార్దం.. నిజం తెల్సుకునే ప్రయత్నం చేయరు
పలకరింపు లేదు పరామర్శ లేదు
గాలి,నీరు లేదు
మంచి, మమత లేదు.అనురాగంలేదు
గుర్తుకు వస్తున్నదంతా ఒకటే...
చనిపోయిన తరువాత నాదేహం కుళ్ళు వాసతప్ప

మత్తు మనసుని గమ్మత్తు లోకాలకు తీసుకెలుతుంది.


ఎంటో జీవితం ఎప్పుడు ఎటుమలుపులు తిరుగుతుందో తెలియదు...ఈ ఈ మద్యి నిదురించింది లేదు..ఓకప్పుడు ప్రతిక్షనం నీజ్ఞా పకాల దోంతరలో ఏంటో బయంకరమైన బయాలు దూరం అవుతున్నట్టు కలలు ఎవ్వరీ బలవంతంగా నానుంచి లాక్కెలుతున్నట్టు ..నీకు చెబితే నవ్వుతావని ఉదయాన్నే నీ SMS పలకరింపు కనిపించక పోతే ఏదో దిగులు గా ఉంటుందినీ నుంచిరాత్రిల్లు పలుకరింపు SMS వచ్చేదాక నిద్దుర రాదు..నేను ఏతప్పూచేయలేదు అంటే నమ్ముతావా.. నీకేదో జరిగిపోతోందన్న కంగారు.. నిన్ను ఎవరో మోసం చేస్తారేమో అన్న ఆవేదనే నన్ను అలా అనిపించింది...ఇంతగా అర్దం చేసుకున్నా నీవే అపార్దం చేసుకున్నావు నా మదిలో మెదిలే భావాలకు రూపం నీవనుకున్నా..అందుకే మనసులో ఏలాంటీ భయం లేకుండా నాకు చెప్పాలనుకున్నది నీకు చెప్పా..అదే తప్పుగా అపార్దం చేసుకుంటావని మాత్రం ఊహించలేదు..మనమద్యిలో ఎవ్వరో కావాలని చిచ్చుపెట్టారు అదే నమ్మావు .. వారు అనుకున్నది సాదించారు వాళ్లు నీతో హేపీగా స్నేహం చేయాలంటే నన్ను దూరం చేయాలి .. అదే చేసి వాడు విజయం సాదించాడు..కాని నీవు ఎవ్వరు చెప్పినా నమ్మవు అనుకున్నా నన్ను నా స్నేహాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను అని అన్న మాటలు గుర్తులేవా మొదట ఎంచేప్పానో అదే జరిగింది కదా..? .ఏం జరిగిందో ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో అంతా కళలా బయపడినంతా జరిగింది..కలలో వచ్చినదానికంటే జరిగిండే బరించలేనిది గా ఉంది నిజము కాదు అని ఎన్ని సార్లు అనుకున్ననో కాని జరిగింది తలుచుకుంటే ప్రతిక్షనం నరకంలా ఉంది..మరి జరిగిన ఘటనలు మర్చిపోటానికి ....మత్తు మనసుని గమ్మత్తు లోకాలకు తీసుకెలుతుంది..పొగ గుండేల్నీ చీలుస్తూంటే.. మందు గుండేళ్ళో భాదను కరిగిస్తుందని...ఆశ నిన్ను మర్చి పోటానికి ఆరెండే నాకిప్పుడు నేస్తాలు..అవి నాతీడుగా ఉన్నయంటే నామదిలో నీ తలపులు గాయం రేగుతోందని అర్దం కనీసం చిన్ని ఆశను సైతం పోగొట్టుకొని ..జివిస్తున్నానిలా..ఒక్కోసారి అనిపిస్తుంది కనీసం ఒక్కసారి అయిన గుర్తుకు వస్తనా అని కనీసం తిట్టుకోవడానికి అయిన అని ఎందుకు గుర్తుకు రావలి నేను..కదా నిజమే ఆ అవసరమే లేదు నీకు అందుకే ఈ రెండు నాకు దగ్గరయ్యాయి..నీవు తాగితే నాకేంటి తాగక పోతే నాకేంటి అంటావు... నిజమేకదా..చెప్పాలనిపించి చెప్పా వద్దు అన్నావు .. మత్తులో మైకంలో అలగా ఉంటిపోవాలని జీవితం లో నీ లాంటి వ్యక్తిని పోగొట్టుకున్నాక ...ఇక ఇదే ఇప్పుడు నాకు నేస్తం