. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, October 23, 2016

మాటలన్ని నాలోనీ భావాలుగానే మిగిలిపొయాయి ..?

మరు జన్మ కు పొందేన నీ హ్రుదయాని 
మనం చివరి సారి ఎదురుపడ్డప్పుడు
నీవు పడ్డ తడబాటు 
నా గుండె స్పందనై అలానే ఉండిపొయింది 
నా చూపు నీవైపు లేదనుకుని 
చూసిన ఆ చూపులు 
ఇంకా నా యధను తాకుతూనే ఉన్నవి 
కను సైగకు కాన రాక 
ఎదురు చూసిన చూపులెన్నో
నువ్వు చూడని ని వెనువెంట వొచ్చిన 
నీ నీడగ మారిన నా హ్రుదయాని అడుగు ప్రియతమా 
నీ పలకరింపుకై ఎన్నేలు వేచి 
ఆ చీకటిలో ఉండిపొయిందో 
నీ హంస నడకల సోయగాని వర్నించ తరమా నాకు 
నీ కోకిల రాగలా పలుకులు ఏ పుణ్యం చేసాయో 
నీ పెదవిపై నాట్యం చేసేందుకు 
ఏమని వర్నిచను ప్రియతమా 
నా ప్రేమనైనా నిన్ను 
ఈ మాటలన్ని నాలోనీ భావాలుగానే మిగిలిపొయాయి 
నీ వరకూ రానివ్వలేదు నా పిరికితనం 
నీ కొంటె చూపుకు గాయపడిన నా మనసు 
ఎన్నేలకు కోలుకునెనో 
భహుస నీ రూపాని నేను మరిచినప్పుడు కాబొలు 
ఈ జన్మ కి మరిచేన నా ప్రానాన్ని 
మరు జన్మ కు పొందేన నీ హ్రుదయాన్ని

Tuesday, October 18, 2016

అర్ధ నిద్రకు అంతమెప్పుడు ?

చిక్కటి చీకటి రాత్రి
ప్రశాంతతను ఆశించి 
నిద్రకుపక్రమించిన జ్ఞాపకం
అవి ఎప్పటినుంచి వేచి ఉన్నాయో
ఆ తరుణం కోసం.. 
ఎన్ని ఊసులో.. ఎన్ని గుసగుసలో..
గుండె లోతుల్లోనుంచి గుచ్చబడిన
బంధాలు తెగి జారిన ముత్యాల్లా.. 
సాగుతున్నాయి మనసులో గుచ్చేస్తున్నాయి 

ఆ జ్ఞాపకాలు  సున్నితంగా..
అప్పుడప్పుడూ మనసును తడుముతూనే వున్నాయి
ముల్లులా దాని మనసు గుచ్చేవి కొన్నైతే
జేబులో దాచిన  పువ్వులా 
అయినా ఎందుకో ఆ పువ్వు ముళ్ళు 
గుచ్చి గాయం చేస్తున్నా 
రక్తం ఓడుతున్నా భాద అనిపిస్తున్నా
 అదో తియ్యని అనుభూతి గనే మిగిలి వుంది 


Wednesday, October 12, 2016

తడుముతున్న జ్ఞాపకాల కదలికలు

వేదనలో గగనం లో విహరించాలని కన్న కలలన్నీ కల్లేదురుగా కన్నీరుగా మారిన క్షనాలకు కారనాలు వెతికి ఏం లాభం ఇద్దరి అనుబందం వేదనగా మారి వ్యదగా గుండెను కొస్తున్న జ్ఞాపకాల కత్తులకు బలౌతూనే ఉన్నా కదా విరహ వేదనలో నీవు చేసిన జ్ఞాపకాల కత్తి పొట్ల గాయాలు తడుముకొంటున్నా తప్పో తప్పని సరైన పరిస్థితులు కాదనుకున్న నిజాల సాక్షిగా..చేయని నేరానికి బలైన ప్రేమను ఆదరించలేని నీ నిస్సహాయతలో మాటలు కరువై ..జీవితం బరువై గుండెలోతుల్లోంచి తన్నుకొస్తున్న దుక్కానికి కారనం నీవైనా ...అది నేను మాత్రమే బరిస్తున్నా .. నీ ఆనందానికి అడ్డుగా ఉండకూడదని నన్ను నేను అడ్డంగా కరుగదీరుకుంటున్నా కొవ్వొత్తిలా అయినా కరుగలేని నీ మనస్సాక్షిగా
                 జీవితంలో అన్నికోనాలు బయట పడేది ప్రేమ లో పడ్డాకే.. ప్రేయసి పిలుపుకోసం ఆరాట పడుతూ మానసును ఏమారుస్తున్న ఆ జ్ఞాపకాలను ఎప్పటికి అప్పుడు పేర్చుకొంటూ విడిపోతున్న క్షనాలను వేదనగా.. కలిసి పంచుకున్న అనుభూతులను ఆత్రంగా అందుకోవాలన్న ప్రయత్నంలో తెలియకుండానే ప్రేయస్.ఇని శత్రువుగా మారతాం... కల్సి ఉన్నప్పుడు తెలీదు ఇద్దరూ విడీపోయాక తెలుస్తుంది అసలు నిజం..నిజం నైజమే అంత అంతా జరిగాక సినిమాల్లో చివర్లో వచ్చే పోలీసుల్లా తీరిగ్గా వస్తుంది నిజం ఈలోగా జరగాల్సిన డెమేజ్ జరుగుతుంది.... ఇద్దరి మద్యా కావాల్సినంత గ్యాప్ ... ఇప్పుడు అవసరం అవుతాయి జ్ఞాపకాలు ... తను ఎదురుగా లేనప్పుడే కదా వాటితో పని తను నీతో నీవు తనతో పంచుకున్న జ్ఞాపకాల ఆవాహన కోసం వెంపర్లాడుతాం ..అమె ఎదురుగా ఉన్నా మాట్లాడలేని పరిస్థితి మనసు మూగబోయిన క్షనాలవి..క్షనికావేశంలో తీసుకున్న నిర్నయాల పర్యావసానం వేదనలో తడుముతున్న జ్ఞాపకాల కదలికలు


Tuesday, October 11, 2016

వెలుగు ను కోల్పొయిన చిరుదివ్వెను నేను

ఎండమావి లో నీటికై వెతికి
గుండెబావి లో నీటిని కంటి చెమ్మ గా 
కోల్పోయిన వెర్రివాడ్ని నేను.
నిశీధి లో కాంతిని పంచుతానంటూ
గమ్యాన్ని వెతుకుతానంటూ గగ్గోలు పెట్టి
వెలుగు ను కోల్పొయిన చిరుదివ్వెను నేను
ఉన్నత శిఖరాలు అధిరోహించాలాంటూ
ఆరాటం తో ఆశతో అడుగులు వేస్తూ
అలసిపోయి అదుపు తప్పి అధఃపాతాలానికి
పడిపోయిన ఆరొహకుడ్ని నేను
అయినా పరిగెడుతున్నా, ప్రయాణిస్తున్నా
ప్రయత్నిస్తున్నా, ప్రయాస పడుతున్నా
నా దృష్టి దాష్ఠికాన్ని చూడలేని దూరాలకు పోతుంది.
నా అడుగు ఆవేశం తో అనంత దూరాలకు సాగిపోతుంది.
ఎందుకంటే,
నేను శరీరం క్రుళ్ళిన శవాల మధ్య ఉండగలను.
కాని, మనసు క్రుళ్ళిన మనుషుల మధ్య కాదు.