మౌనమే నీభాష ఓ మూగ మనసా...ఈ పాటలో ఎంత అర్దం ఉందో కదా..మనసును కదలించే మరపురాని సాంగ్ అర్దం చేసుకోవాలంటే ...పెద్ద మనసు ఉండాలి పాటగురించి ఎంతోరాయాలని ఉంది కాని తరువాత పోష్టుచేస్తాను పాట చదవండి ఓపికపికలేకపోతే వినండి ఈ పాట 1979 లో సాంగ్..మనసుతో ఆలకిస్తే ఎన్నో అర్దాలు స్పురిస్తాయి..
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో యెందుకు వగచేవో
ఎందుకు రగిలేవో యేమై మిగిలేవో
ఎందుకు రగిలేవో యేమై మిగిలేవో
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు యున్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
చిత్రం: గుప్పెడు మనసు (1979)
సంగీతం: యమ్మెస్ విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం: మంగళంపల్లి బాల మురళీకృష్ణ
ఆ పాటతాలూక వీడియో చూడండి....