ఒక కల...అధ్భుతమైన చిత్రాన్ని గీయాలని
ఆ చిత్రంలో నీ జీవకళ ఉట్టిపడాలని!!!
ఒక కల...మంచి కవిత వ్రాయాలని
నా భావాలన్నీ అందులో పొందుపరచాలని!!!
ఒక కల...మధురమైన గేయం రచించాలని
ఆ పాటతో నీవు పరవశించిపోవాలని!!!
ఒక కల...నీకు తోడై ఉండాలని
ఆనీడ నీవు మరనించేవరకు తోడై ఉండాలని !!!
ఒక కల...నీకలలు సార్దకంకావలని
వాటన్నిటీకి నేనే కారణం కావలని !!!
ఒక కల...నీ కళ్ళలో మెరుపులు మెరవాలని
ఆ మెరుపుల్లో కలకాలం ..అలాగే ఉండాలని!!!
ఒక కల...నీకంట కన్నీరు రావద్దని
నీ పెదాలు ఎల్లప్పుడూ నవ్వూతూ ఉండాలని !!!
ఒక కల...నీ ఊహకలకు రెక్కలు రావలని
ఆ రెక్కలు కలకాలం నేనైఉండాలని !!!
ఒక కల...నీవు అనుకున్న శిఖరాలు చేరాలని
ఆశిఖరాల క్రింద నేను సిధిలమైన పర్వలేదని !!!
ఒక కల... అజ్ఞాతంగా అంతమైపోవాలని
అంతమై నీ మనస్సులో శాస్వితంగా జీవించాలని!!!