. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, December 30, 2016

చచ్చిపోవాలని ఉంది...

చచ్చి పోవాలని...
ఈ లోకం వీడిపోవాలని...
నన్ను నేను దహించుకోవాలని...
అన్నీ వీడి మరణించాలని...
ఎన్నో సార్లు అనుకున్నా
అన్ని సార్లూ వాయిదా వేసుకున్నా...
క్యాలెండర్ లో తేదీలు మారినట్లు
నిర్ణయాన్ని మార్చుకున్నా...
బతకాలని లేకున్నా బతికే ఉన్నా...
మనసైన మనసులో
స్థానం కోల్పోయి
తుది అంకంలో
నా మనసులో విషాదం
నింపుకుని
పరాజితుడిగా
నిష్క్రమించలేక
బతికిపోయాను...
ఇప్పుడు మళ్ళీ
చచ్చిపోవాలని ఉంది...

Sunday, December 4, 2016

మూగగా రోదిస్తూనే వుంది మనస్సు

మనసు ఒక మౌనం, 
కాని నేను నీ మనసు లోని మౌనాన్ని 
మాటలుగా మార్చాలి అనుకున్నా,
కాని ఏమీ చేయలేని 
నిస్సహాన్ని అని తెల్సింది 
ఎందుకో పెదవులు 
కదలక మాటలు 
కాస్త మూగబొయినాయి
కళ్ళలొని కాంతి  తేజస్సు వీడి తన్మయం 
చెందవలసిన సమయం లొ 
తనకొసం తపించిన  మనస్సు  
మాటలను  కళ్ళతొ పలికించ లేక 
బింధువుల రూపంలొ 
కన్నీటి భాష్పలుగా పంపుతున్నాయి.... 
ఓ మాటలు  రాని మౌనమా. .. 
మనసులో ముగగా 
రోదిస్తున్న ఓ జ్ఞాపకమా 
నా  భాష్పలని  జలధారగా 
హా హృదయ బారాన్ని మోస్తూ 
ఆబారాన్ని వెచ్చని కన్నీటిగా బైటీకి తెస్తూ 
మూగగా రోదిస్తూనే వుంది మనస్సు 
నన్ను ఇలానే వుందనీ ఎప్పటికీ 
నన్ను  మార్చద్దు అని మౌనంగా 
పంపుతున్న సందేసం ఇది 
ఈ నా మౌన సంభాషణ శ్వాశగా నీ దరి చేరి 
నిన్ను  నా దరి చేరుస్తుంది
నీ పై మనసు చావక 
ఎప్పతి కైన ఎదురు పడతావని ఆశగా జీవిస్తున్నా

Tuesday, November 29, 2016

తెలుగమ్మాయి హ్రుదయంలో భావాలు

నేను తట్టుకోలేనంతగా ప్రేమించకు
నాకు అందనంత  దూరంగా నీవు ఉండకు
నువ్వు ప్రేమించలేనంత నిన్ను ప్రేమించానని
నీ ప్రేమని నాకు చెప్పడం మరువకు..

నేను లేని ఒంటరితనాన్ని ఊహించకు

నన్ను తలచి మౌనంగా రోధించకు
నా ప్రేమని నీవు మరిచే ప్రయత్నం చేస్తూ
నిన్ను మరువమని నన్ను శపించకు..
------ అప్పుడు-ఇప్పుడు -----------
నేనెరిగిన కార్యం కేవలం నీ అడుగు నీడలో నేను

అప్పుడు దగ్గరై దూరం, ఇప్పుడు దూరమే దూరం

ఈ నిరీక్షణలో నేను ఏమౌతానో అన్న చింతలేదు

అప్పటి ధ్యాసలో ఇప్పుడు శ్వాసపీలుస్తున్నా

కాలమిచ్చే తీర్పుకి పర్యవసానం ఏమౌనని భాధ

దూరమవలేక భాధప్పుడు, దూరమై వ్యధిప్పుడు

ఆశలేం అందనంతెత్తులో ఎక్కి కూర్చుని లేవు

ఆశలప్పుడు అడియాశలే, ఇప్పుడదే బాటన్నాయి

---------- నాకు తెలిసింది ------------------
నేనెరిగిన చర్య కేవలం నీ అడుగు నీడలో నేను

అప్పుడు దగ్గరై దూరం, ఇప్పుడు దూరమే దూరం

ఈ నిరీక్షణలో నేను ఏమౌతానో అన్న చింతలేదు

అప్పుడున్న ధ్యాసలోనే ఇప్పుడు శ్వాసపీలుస్తున్నా!

కాలం ఇచ్చే తీర్పుకి పర్యవసానం ఏమౌనని భాధ

దూరమవలేక భాధప్పుడు, ఇప్పుడు దూరమై వ్యధ

నా ఆశలేం అందనంతెత్తులో ఎక్కి కూర్చుని లేవు

ఆశలప్పుడూ అడియాశలే, ఇప్పుడదే బాటన్నాయి!

source ;-http://telugammaye.blogspot.in/

Sunday, October 23, 2016

మాటలన్ని నాలోనీ భావాలుగానే మిగిలిపొయాయి ..?

మరు జన్మ కు పొందేన నీ హ్రుదయాని 
మనం చివరి సారి ఎదురుపడ్డప్పుడు
నీవు పడ్డ తడబాటు 
నా గుండె స్పందనై అలానే ఉండిపొయింది 
నా చూపు నీవైపు లేదనుకుని 
చూసిన ఆ చూపులు 
ఇంకా నా యధను తాకుతూనే ఉన్నవి 
కను సైగకు కాన రాక 
ఎదురు చూసిన చూపులెన్నో
నువ్వు చూడని ని వెనువెంట వొచ్చిన 
నీ నీడగ మారిన నా హ్రుదయాని అడుగు ప్రియతమా 
నీ పలకరింపుకై ఎన్నేలు వేచి 
ఆ చీకటిలో ఉండిపొయిందో 
నీ హంస నడకల సోయగాని వర్నించ తరమా నాకు 
నీ కోకిల రాగలా పలుకులు ఏ పుణ్యం చేసాయో 
నీ పెదవిపై నాట్యం చేసేందుకు 
ఏమని వర్నిచను ప్రియతమా 
నా ప్రేమనైనా నిన్ను 
ఈ మాటలన్ని నాలోనీ భావాలుగానే మిగిలిపొయాయి 
నీ వరకూ రానివ్వలేదు నా పిరికితనం 
నీ కొంటె చూపుకు గాయపడిన నా మనసు 
ఎన్నేలకు కోలుకునెనో 
భహుస నీ రూపాని నేను మరిచినప్పుడు కాబొలు 
ఈ జన్మ కి మరిచేన నా ప్రానాన్ని 
మరు జన్మ కు పొందేన నీ హ్రుదయాన్ని

Tuesday, October 18, 2016

అర్ధ నిద్రకు అంతమెప్పుడు ?

చిక్కటి చీకటి రాత్రి
ప్రశాంతతను ఆశించి 
నిద్రకుపక్రమించిన జ్ఞాపకం
అవి ఎప్పటినుంచి వేచి ఉన్నాయో
ఆ తరుణం కోసం.. 
ఎన్ని ఊసులో.. ఎన్ని గుసగుసలో..
గుండె లోతుల్లోనుంచి గుచ్చబడిన
బంధాలు తెగి జారిన ముత్యాల్లా.. 
సాగుతున్నాయి మనసులో గుచ్చేస్తున్నాయి 

ఆ జ్ఞాపకాలు  సున్నితంగా..
అప్పుడప్పుడూ మనసును తడుముతూనే వున్నాయి
ముల్లులా దాని మనసు గుచ్చేవి కొన్నైతే
జేబులో దాచిన  పువ్వులా 
అయినా ఎందుకో ఆ పువ్వు ముళ్ళు 
గుచ్చి గాయం చేస్తున్నా 
రక్తం ఓడుతున్నా భాద అనిపిస్తున్నా
 అదో తియ్యని అనుభూతి గనే మిగిలి వుంది 


Wednesday, October 12, 2016

తడుముతున్న జ్ఞాపకాల కదలికలు

వేదనలో గగనం లో విహరించాలని కన్న కలలన్నీ కల్లేదురుగా కన్నీరుగా మారిన క్షనాలకు కారనాలు వెతికి ఏం లాభం ఇద్దరి అనుబందం వేదనగా మారి వ్యదగా గుండెను కొస్తున్న జ్ఞాపకాల కత్తులకు బలౌతూనే ఉన్నా కదా విరహ వేదనలో నీవు చేసిన జ్ఞాపకాల కత్తి పొట్ల గాయాలు తడుముకొంటున్నా తప్పో తప్పని సరైన పరిస్థితులు కాదనుకున్న నిజాల సాక్షిగా..చేయని నేరానికి బలైన ప్రేమను ఆదరించలేని నీ నిస్సహాయతలో మాటలు కరువై ..జీవితం బరువై గుండెలోతుల్లోంచి తన్నుకొస్తున్న దుక్కానికి కారనం నీవైనా ...అది నేను మాత్రమే బరిస్తున్నా .. నీ ఆనందానికి అడ్డుగా ఉండకూడదని నన్ను నేను అడ్డంగా కరుగదీరుకుంటున్నా కొవ్వొత్తిలా అయినా కరుగలేని నీ మనస్సాక్షిగా
                 జీవితంలో అన్నికోనాలు బయట పడేది ప్రేమ లో పడ్డాకే.. ప్రేయసి పిలుపుకోసం ఆరాట పడుతూ మానసును ఏమారుస్తున్న ఆ జ్ఞాపకాలను ఎప్పటికి అప్పుడు పేర్చుకొంటూ విడిపోతున్న క్షనాలను వేదనగా.. కలిసి పంచుకున్న అనుభూతులను ఆత్రంగా అందుకోవాలన్న ప్రయత్నంలో తెలియకుండానే ప్రేయస్.ఇని శత్రువుగా మారతాం... కల్సి ఉన్నప్పుడు తెలీదు ఇద్దరూ విడీపోయాక తెలుస్తుంది అసలు నిజం..నిజం నైజమే అంత అంతా జరిగాక సినిమాల్లో చివర్లో వచ్చే పోలీసుల్లా తీరిగ్గా వస్తుంది నిజం ఈలోగా జరగాల్సిన డెమేజ్ జరుగుతుంది.... ఇద్దరి మద్యా కావాల్సినంత గ్యాప్ ... ఇప్పుడు అవసరం అవుతాయి జ్ఞాపకాలు ... తను ఎదురుగా లేనప్పుడే కదా వాటితో పని తను నీతో నీవు తనతో పంచుకున్న జ్ఞాపకాల ఆవాహన కోసం వెంపర్లాడుతాం ..అమె ఎదురుగా ఉన్నా మాట్లాడలేని పరిస్థితి మనసు మూగబోయిన క్షనాలవి..క్షనికావేశంలో తీసుకున్న నిర్నయాల పర్యావసానం వేదనలో తడుముతున్న జ్ఞాపకాల కదలికలు


Tuesday, October 11, 2016

వెలుగు ను కోల్పొయిన చిరుదివ్వెను నేను

ఎండమావి లో నీటికై వెతికి
గుండెబావి లో నీటిని కంటి చెమ్మ గా 
కోల్పోయిన వెర్రివాడ్ని నేను.
నిశీధి లో కాంతిని పంచుతానంటూ
గమ్యాన్ని వెతుకుతానంటూ గగ్గోలు పెట్టి
వెలుగు ను కోల్పొయిన చిరుదివ్వెను నేను
ఉన్నత శిఖరాలు అధిరోహించాలాంటూ
ఆరాటం తో ఆశతో అడుగులు వేస్తూ
అలసిపోయి అదుపు తప్పి అధఃపాతాలానికి
పడిపోయిన ఆరొహకుడ్ని నేను
అయినా పరిగెడుతున్నా, ప్రయాణిస్తున్నా
ప్రయత్నిస్తున్నా, ప్రయాస పడుతున్నా
నా దృష్టి దాష్ఠికాన్ని చూడలేని దూరాలకు పోతుంది.
నా అడుగు ఆవేశం తో అనంత దూరాలకు సాగిపోతుంది.
ఎందుకంటే,
నేను శరీరం క్రుళ్ళిన శవాల మధ్య ఉండగలను.
కాని, మనసు క్రుళ్ళిన మనుషుల మధ్య కాదు. 

Friday, September 30, 2016

పరిగిడుతున్నా కాలం వెనక

నువ్వు రావని తెలుస్తున్న
అందుకోడానికి నీ చేయి లేదని తెలిసిన
నా చెయ్యి చాచి నేవిపు చూస్తున్న
పరిగిడుతున్నా కాలం వెనక
 నేన్ను అందుకోలేక
వేచి చూస్తున్న నే పిలుపుకే
నవ్వు నన్ను వదిలిన చోటి ఒంటరిని అయ్యి ...
విలపిస్తున్న కన్నీరే రాకుండా
కన్నులో నే రూపం చేరగాకుండదని
స్వసిస్తున్న ఊపిరి లేకున్నా
నా యెదలో నీకు ఊపిరిఅగకుండా
రెప్పవాల్చకుండా ఎదురుచూస్తున్నా

Tuesday, August 9, 2016

మొబైల్ లో కొబ్రా న్యుస్ లైవ్ టివి చూడాలంటే ..యాప్ డౌన్లోడ్ చేసుకొండీ

కోబ్రాన్యూస్ లైవ్ టీవి మీ ఆడ్రాయిడ్ మొబైల్ లో చూడాలనుకుంటే వెంటనే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొండి..మీ చుట్టు జరిగే నేరాలగురించి తెలుసుకొండి..మీస్నేహితుల మొబైల్ లో కుడా ఈ కోబ్రాన్యూస్ లైవ్ టీవీయాప్ ను డౌన్లోడ్ చేయండి..దేశంలో మొట్ట మొదటి మొబైల్ క్రైం న్యూస్ చానల్...ఈ  లింక్ క్లిక్ చేయండీ లేదా గుగుల్ ప్లే ష్టోర్ లో చొబ్రా న్యూస్ ఆప్ డౌన్లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.ideabytes.cobranews

24xx7 Crime News...'"Conra News " Live TV

Wednesday, July 27, 2016

మౌన సంఘర్షన

మౌనం నిశ్శబ్దం మంత్రఘోష. మౌనం పదునైన ఆయుధం, మౌన మంటే పదాల  నిశ్శబ్ద సంభాషణ అన్నాడు ఓ మహానుభావుడు. ''గొంతు మౌనంగా ఉన్నప్పుడు...మనసు మాట్లాడుతుంది. మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌన ముద్రలో ఉన్నప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'' అంటారు మెహర్‌ బాబా. మౌనం నోటిలో నాలుకతో పరిమితమైన వ్యవహారం కాదు. నోరు, మెదడు, మనసు, నమన్వయంతో పనిచేయాలి. పుస్తకం చదవడం మౌనం కాదు, అది రచయిత సృష్టితో మమేకమై మాట్లాడటం. టీ.వీ. చూస్తూ కూర్చోవడం మౌనం కాదు. అది కొన్ని పాత్రలతోనో, వార్తలతోనో చేసే సంభాషణ. కంప్యూటర్‌ ముందు కూర్చోవడం మౌనం కాదు, అది వేయి గొంతుకల కబుర్లతో సమానం. మౌనంలో మాటలుండవు ఆలోచనలుండవు, అదో తపన్సు.మాట ఒకానొక వ్యక్తీకరణ మార్గం మాత్రమే. కానీ ఇదొక్కటే వ్యక్తీకరణకాదు. మాటలు నేర్పే సంస్థలున్నట్లు మౌనాన్ని నేర్పే పాఠశాలలు ఎక్కడా లేకపోవచ్చు...అయితే ఒక్కమాట...మౌనాన్ని మించిన కమ్యూనికేషన్‌ లేదు. మౌనం అర్థ అంగీకారం మాత్రమే కాదు. ఒక్కోసారి పూర్తి అంగీకారం కూడా. మౌనం అంటే ఆలోచనలు, కలలు, కోరికలు, భ్రమలు ముసుగులో బుర్రలోని సామా నంతా పక్కనపెట్టి, నిన్ను నీవు స్పష్టంగా చూసుకోవడం. ఇది ఆత్మసాక్షాత్కారమే. గతంలో అర్థం లేకుండా మాట్లాడినందుకో, అనవసరంగా తూలనాడినం దుకో పశ్ఛాత్తాపపడే వారెంతో మందిని చూస్తుంటారు. కానీ మౌనం కారణంగా బాధపడ్డ సందర్భాలు చాలా అరుదు. మనుషులందరూ మాటలకు అలవాడి పడిపోయారు. మాట్లాడకపోతే పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. మాట్లాడాలి. ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడకపోతే, వారి మీద వారికే అనుమానమోచ్చేస్తుంది. మౌనంగా ఉన్నట్టు. కనీసం కలలు కూడా కనలేరు. అలాంటి కలలు రావు. కలల మనుషుల ఆలోచనల్ని ప్రతిబింబిస్తాయి. మనుషుల జీవితాన్ని ఎత్తి చూపుతాయి. మౌనంలోని అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించాలను కునేవారు. ముందుగా మాటల మత్తునుంచి బయట పడాలి ఇది ఏ ఒక్కరోజులో సాధ్యం కాదు. మనం మాటల్ని తగ్గించుకోవాలి. పొదుపుగా వాడాలి. అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. మౌనాన్ని అనుభూతించడానికి సంపూర్ణ ఆరోగ్యం కావాలి. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. రోగాల మనసు మౌనంగా ఉండలేదు. బాధతో మూలుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితి రాకూడదనుకుంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉం చుకోవాలి. మంచి అలవాట్లు పెంచుకోవాలి. కృత్రిమ జీవన శైలిని పదిలిపెట్టాలి. మౌనం మానవ సంబంధాల మీద సానుకూల ప్రభావం చూపిస్తుంది. నోరు జారడం వల్ల వచ్చే ఇబ్బందులుండవు. మాటతూలడం వల్ల పుట్టికొచ్చే విపరీత పరిణామాలుండవు. ఉద్యోగ జీవితంలో, వ్యక్తి గత జీవితంలో మనం ఎదుర్కొనే రకరకాల సమస్యలకు మౌనంలోనే సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ...మౌనంగా ఉన్నప్పుడే మనం బాగా ఆలోచించగలం, మాటలకు, ఆలోచనలకు అస్సలు పొత్తు కుదరదు. నాణ్యమైన యంత్రం శబ్దం చేయదు. సాఫీగా తనపని తాను చేసుకు పోతుంది. నిండుకుండ తొణకదు. స్థిరంగా ఉంటుంది. సమర్థులు కూడా అంతే. మౌనంగా తమపని తాము చేసుకు పోతుంటారు. 'మౌనం' మనలోంచి పుటుకొచ్చే అపారశక్తిని వృధాగా పోనివ్వదు. ఎందుకంటే -వృధా ఆలోచనలుండవు. వృధా మాటలుండవు. ప్రతి ఆలోచనా లక్ష్యంవైపే, ప్రతిమాటా అర్థవంతమే. అప్పుడు సమూహాల్లో కూడా ఒంటరిగా ఉం డగలం. అవసరమైతే ఒంటరి సమూహం కాగలం. ఏకాం తానికి, జనసంద్రానికీ తేడా ఉండదు.ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా..మౌనాన్ని పాటించగల శక్తి వస్తుంది.

నిజాన్ని నమ్మలేక ..చీకట్లో ఆ నిజంకోసం తడుముకొంటూ ( ఇది నా మౌన సంఘర్షన )


                                                                      ఎప్పటీకప్పుడు మోసం చేసుకొంటూనే వున్నాం .. ఎప్పతి కప్పుదు కాంప్రమైజ్ అయి బ్రతకాల్సి వస్తొంది ..అనుకున్నది వేరు జరుగుతోంది వేరు  మనం ఇంతకన్నా డిఫరెంట్‌గా, ఆనందంగా, గొప్పగా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఏ క్షణమైనా కూర్చుని ఆత్మవిమర్శ చేసుకున్నామా..అలా చేసుకొంటే మనల్ని మనం చిన్నబుచ్చుకొన్నట్టు మనల్ని మనం లోలోపల మోసం చేసుకొంటూ దారి తెలియని బాటసారిలా కదులుతూ వెలుతున్నాం జీవకల అనేది లేకుండా ..
 ఎప్పటికప్పుడు నిను నీవు మోసం చేసుకొంటూ .....
                                 నిజాన్ని దాటలేక అబ్దంలో బ్రతకలేక మనస్సులో సంగర్షన పడూతూ అయ్యో అదేం లేదే అని ఎప్పటీకప్పుడు మనస్సును మోసం చేసుకొంటూ సాగిస్తూనే వున్నాం జీవితాన్ని ..కష్టపడ్డాం, చాలా సాధించాం, జీవితంలో చాలా తెలుసుకున్నాం అంతా మనం అనుకుందే జరుగుతుంది అని ఏం జరగకపోయిన ఎవ్వరో పరాఇ వాల్లను నమ్మించి నట్టూ మనల్ని మనం నమ్మిచ్హుకొంటూన్నాం ఎందుకు ఎదో వెలితి కావాల్సింది దొరికినట్టే దొరికి దగ్గరదాకా వచ్చి దూఋఅం అవ్వడం ...ఎవ్వరిని నమ్మాలో ఎవ్వరిని నమ్మకూడాదో తెలియని క్షనాల్లొ అన్ని నిజాలే అని నమ్ముతూ ఏది నమ్మామ్మో అది అబద్దమై మనల్ని చీకట్లో నెట్టేస్తున్న పరిష్తితుల్లో అయోమయ గందర గోలంగా బ్రతుకు నీడుస్తున్న క్షనాల్లో  ఇంకా లైఫ్ ఏమాత్రం కొత్తగా అన్పించట్లేదు.. ఇంతకన్నా ఏముంది లైఫ్ అన్పిస్తోంది  అవును కదుల నడుమ గుండెల్లో ఎదో తెలియని ఘర్షన ...మది లో అలజడి లేపుతున్నా అనుఘర్షన ఏమిపోతొంది మనస్సుకు ..ఏం జరుగుతోంది జీవితంలో ..
                    “నేను ఫలానా అంత గొప్ప మనిషిని కాబట్టి.. నేను ఫలానా హోదాలో ఉన్నాను కాబట్టి ఇలాగే బ్రతకడం కరెక్ట్” అని జడ్జ్‌మెంట్లు చేసుకోవడం నన్ను నేను మోసం చేసుకొంటూ నేనే గొప్ప అని నాలో నేను తప్పు చేస్తున్నా అన్న  అసలు ఎవరు మీ లైఫ్‌ని కంట్రోల్ చేసేదీ, కామెంట్ చెయ్యగలిగిందీ  మీ ఆనందాన్ని కాదనేవాళ్లు నిన్ను నిన్నుగా నమ్మిచి తన స్వార్దం కోసం మోసం చేసే వాల్లు జీవితంలో కి తుఫాను లా వచ్చి తుళానుల వెల్తారు .. వారు వదలి వెల్లిన అలజడి గుండెల్లో పెట్టుకొని తిరిగిరాని వారికోసం ఆకాసం వైపు చుస్తే ఏంలాభం శూన్యం తప్ప ఎద్ముకీ ఆందోలన లైఫ్ లో అలజడీ సృష్టించే వాల్లు బాగానే వున్నారో వాల్లకి వాల్లు సృష్టించుకొన్ని కొత్తలోకంలో .. మనల్ని వదలి కాణి మనమె ఎద్ముకిలా పిచ్హొల్లలా ఆలోచిస్తూ మనల్ని మనం మోసం చేసుకొంటూ పాత జీవితాన్ని కొత్తగా జీవిస్తున్నాం అని లోపల ఏదుస్తూ పైకి నవ్వుతూ ..జీవీచడం ఎదుకని నిన్ను నీవు ప్రశ్నించుకో .. సమాదం లేని ఈ ప్రశంకు ..ప్రకంపలను గుండేల్లో మాత్రమె వుంటుంది అది ఎవ్వరు కనిపించని చూడలేని జీవితం ..ఉన్నదీ లేనిది నడుమ జీవితం సాగిస్తూ పైకి నవ్వుతూ లోపల గుండెలు పగిలేలా ఏడుస్తూ పైకి చిరునవ్వులు చిందిస్తూ అస్సలు భాదర బందీ లేదు అస్సలు ఎలాంటి భాదలు లేవు అని ప్రపంచాని నవ్విస్తూ నిద్రులేని రాత్రుల్లు గడిపే జీవితానికి ఏమని పేరు పెట్టాలి పేరు పెట్టని పేరు లేని ఆ చీకటి జీవితానికి మౌనరోదనలో నిశ్శబ్ద యుద్దం చేస్తూ నాలో నేను లేకుండా నీలో ఇంకా నేనున్నా అని బ్రమ పడుతూ ...కాలం వెల్లదీస్తూనే  వున్నా మెల్లిగా నాలో నేను నడుస్తూ జీవితంలో పరుగులు పెడుతున్నా అని నన్ను నేను ఇంకా మోసం చేసుకుంటూనే వున్నా నిజాని నమ్మినా నమ్మి నట్టు నటిస్తూ  ...నీలో లేని నను నేను ఇంకా వెతుకుంటూ ఇంకా నీకోసం తడుముకొటూనే వున్నా ..

Thursday, June 16, 2016

మనసున మూలన దాచిపెటుకున్న జ్ఞావకాలు

మధుర క్షణాల మీద 
మనసు పయనం సాగిస్తూ..
స్వప్న లోకంలోకి జారిపోతుంది జ్ఞాపకం .

ఎప్పుడూ గీయని 
కలల చిత్రమేదో
వెన్నల హంగుతో
రంగుల్ని అద్దుకుంటుంది . 

ఎన్నడూ వినని వెన్నల  పాటేదో 
మనసు గొంతులో నీ జ్ఞాపకంలో 
హాయిగా పాడుకుంటుంది.

చీకటి గూటిలో దీపంలా
వున్న చందమామను చూస్తూ...
ఎన్నో అనుభవాల్ని తడుముతూ..
మనసు తుమ్మెదలా ఎగురుతుంది.
ఎందుకో చెప్పవూ ..
నిజాన్ని మాత్రం అబద్దం చేయకు ప్లీజ్

అందమైన దృశ్యానుభూతులు
నా మనసున ఏ మూలనో దాచిపెటుకున్న
ఎన్నో జ్ఞావకాల దొంతర్లను కదిలిస్తూ,
బాల్యంలోని గురుతులను,
అప్పటి చిలిపితనపు సరదాలనీ,
చినుకుల చిటపటలతో  తట్టిలేపుతుంటే,

వర్షంలో తడుస్తూ చిందాడిన
ఆ ఆనందమైన,అద్భుతమైన క్షణాలను
ఊహిస్తూ నా తనువంతా నవ్వుకుంటుంది.
నిజమేదో అబద్దమేదో తెలియని క్షనాల్లో 


అందంగా ముస్తాబయిన హేమంతం..( ఓ ఊహ ఇది నిజం కాదు )

నిన్ను ప్రేమిస్తున్నాని చెప్పలేని
ఒకానొక సందిగ్దావస్థలో
మొగ్గతొడిగిన ప్రేమ
లోలోనదాగి
పుస్తకంలోనే ఎండిపోయింది
ఇప్పుడు
వయస్సు తెచ్చిన 
ధైర్యమో, అనుభవమో
కథలు కథలుగా
మాటలు పొరలు పొరలుగా
ఎందరిముందైనా విప్పాలని చూస్తుంది

మంచు పూల పల్లకిలో
అందంగా ముస్తాబయిన హేమంతం..
తన సోయగాలతో మనసును తడుముతూ
తనువంతా చక్కిలిగింతలు పెట్టి నవ్వుతుంది.

ఏమని వర్ణించనూ..?
రేయంచు నుంచి జారిపడిన వేకువఝాములో
పూలకొమ్మను హత్తుకుపోయిన నీటిముత్యాలను.
తూరుపు కొండలని దాటివస్తున్న సూరీడిని
మసకతెర చాటునుంచి తొంగిచూస్తున్న ఈ లోకాన్ని 

నీ ఊహలలో వెదుకుతుంటాను.

అద్వైత క్షణాలన్నీ
నీ జ్ఞాపకాలలో కలిసిపోతుంటే
నన్ను నేను కోల్పోయి
నీ ఊహలలో వెదుకుతుంటాను.

నువ్వొస్తావు,
మన ఇరువురి మధ్య
ఎన్నో మౌనాలు  దోబూచులాడతాయి.
నీ దగ్గరున్న నవ్వుల నురగను
నా పెదాలపై అందంగా అంటిస్తావు.

అదేంటో మరి అర్ధం కాదు!
నీ సాంగత్యంలో ఎంత సమయమైనా
మంచుబిందువులా ఇట్టే కరిగిపోతుంది
అదేంటి ఇదినిజంకాదా నాఊహనా
ఊహే ఇంత మధురంగా వుంటే 
వాస్తవం ఇంకెంత బాగుంటుందో కదూ..?

Wednesday, June 8, 2016

నాలో తడసి ముద్దయిపోయిన ఆలోచన

అనంతమైన ఈ ప్రేమతాలూకు 
సూన్యంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది
నాలో తడసి ముద్దయిపోయిన 
ఈ ఆలోచనా తరంగాలను ఆపలేక 
చీకటిదారులలో మగ్గిపోతున్న 
ఈ ఒంటరి నావని చూసి 
అనంతమైన ఆ నీలిసంద్రం గర్జిస్తూ 
పువ్వులా పట్టి పీల్చేస్తున్న 
సీతాకోకచిలుకలాంటి 
నా ఆలోచల్ని పరిహసిస్తూ 
తన గర్భాని చీల్చుకుని 
చొచ్చుకు వచ్చిన జలతరంగాలతో 
పద్మవ్యుహాని పన్ని నన్ను 
తన గర్భంలోకి తీసుకుపోతోంది 
నా చుటూ వ్యాపించిన 
ఈ జలనిశీధిలో 
అంతర్దానమౌతున్న నాకు 
నీ స్మృతుల తరంగగోష 
తప్ప మరొకటి వినిపించుటలేదు 
అనంతమైన ఆ సముద్రగర్భంలోకి 
చొచ్చుకుపోతున్నా ...
నీ జ్ఞాపకాలతో తడసి పులకించాలని 
మది ఆరాటపడుతోంది ....

ముత్యాల వాన జల్లులకోసం

ముత్యాల వాన జల్లులకోసం 
ఎదురుచూసే ధాత్రిలా
నీరాకకై శూన్యంలోకి చూస్తూ కుర్చున్నాను  
నా మది పావురంలా రెక్కలుసాచి 
ఆ పచ్చటి నేలలను నీలిమబ్బులను దాటి
అనంతమైన ఈ ప్రేమతాలూకు 
సూన్యంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది
నాలో తడసి ముద్దయిపోయిన 
ఈ ఆలోచనా తరంగాలను ఆపలేక 
చీకటిదారులలో 
మగ్గిపోతున్న ఈ ఒంటరి నావని చూసి 
అనంతమైన ఆ నీలిసంద్రం గర్జిస్తూ 
పువ్వులా పట్టి పీల్చేస్తున్న 
సీతాకోకచిలుకలాంటి 
నా ఆలోచల్ని పరిహసిస్తూ 
తన గర్భాని చీల్చుకుని చొచ్చుకు 
వచ్చిన జలతరంగాలతో 
పద్మవ్యుహాని పన్ని నన్ను 
తన గర్భంలోకి తీసుకుపోతోంది 
నా చుటూ వ్యాపించిన 
ఈ జలనిశీధిలో అంతర్దానమౌతున్న నాకు 
నీ స్మృతుల తరంగగోష 
తప్ప మరొకటి వినిపించుటలేదు 
అనంతమైన ఆ సముద్రగర్భంలోకి 
చొచ్చుకుపోతున్నా ...
నీ జ్ఞాపకాలతో తడసి
 పులకించాలని మది ఆరాటపడుతోంది ....

Tuesday, May 17, 2016

ఓ మౌనం నన్ను ప్రశ్నిస్తున్నా

ఎన్ని నిశ్శబ్దాలు 
మాట్లాడుతున్నా 
ఎన్ని నిరాశలు 
నిన్ను కమ్మేస్తున్నా 
ఎన్ని నిస్పృహలు 
నీలో మనిషిని వెతుకుతున్నా 
ఏకాంతం ఎందుకో 
నన్ను ఎప్పుడూ ఎక్కిరిస్తుంది 
నిదానించమని 
ఓ మౌనం నన్ను ప్రశ్నిస్తున్నా 
అల్ల కెరటాలు కలలతో కవాతుచేస్తున్నా 
ఆటుపోటులు తో 
అలుపెరగనీ పోరాటం చేస్తున్నా 
ఉప్పెనలు నా ఊసులని కప్పేసి 
దిగులు దిగులుగా 
దిగమింగేస్తున్నా 
నాలోని ఆవేశం
నీవు గుర్తొచ్చిన ప్రతిసారి 
మౌనమై పగుళ్లిస్తూనే ఉంటాయి
కొన్ని నిశ్శబ్దాలు
భయంకర శబ్దాలు అవుతాయి 
కొన్ని జ్ఞాపకాలు మనసుకు 
గాట్లుగా మిగులుతాయి 
కొన్ని నీడలు 
నాగతాన్ని గుర్తుకు తెస్తాయి 

Sunday, May 15, 2016

కృష్టకాంత్ పార్క్ గేటు దగ్గర కీచక పర్వం..( My public expermet )

కృష్టకాంత్ పార్క్ గేటు దగ్గర కీచక పర్వం...అడ్డు కున్న ఓ ఇద్దరు..అందరూ చూస్తున్నా ఇద్దరే ఎందుకు స్పందించారు...
                                మీరే చూడండి


Monday, April 25, 2016

అది రైతుబజార్ ఓ కుర్రోడు ఈవ్ టీజ్ చేస్తున్నప్పుడు ఓ రైతు స్పందించిన తీరు అమోఘం- My Public Experment

అది రైతుబజార్....అందరు కూరగాయలు కోంటూ బిజిబిజి గా ఉంటారు 

అక్కడ ఓ అమ్మాయిని ఓ కుర్రోడు ఈవ్ టీజ్ చేస్తున్నప్పుడు అందరూ 

పట్టించకోక పోయినా అది రైతుబజార్....అందరు కూరగాయలు కోంటూ 

బిజిబిజి గా ఉంటారు అక్కడ ఓ అమ్మాయిని ఓ కుర్రోడు ఈవ్ టీజ్ 

చేస్తున్నప్పుడు అందరూ పట్టించకోక పోయినాఅదేంటో మీరూ చూడండి

Tuesday, April 12, 2016

ఓడి పోయాను గెలవలేనని తెల్సి గెలిపించలేని నీకోసం మనసు తడుముకొంటూనే వుంది

తెలియలేని దారుల్లో తచ్చాడడానికి
ఏ కాంతి తీగలూ వంచలేను..వెతకలేను 
తడి కంటి కాంతి ఇప్పటికేకనురెప్పలు 
నిన్ను ఇప్పటికీ వెతుకుతూనే వున్నాయి 

నామనస్సు  గాయాలకి
ఏ మందూ వెదకలేను...
కాలంతో తిరిగిన నీ పాదాల క్రింద
విధి అరిగిపోయింది...
నా జీవితం నలిగి పోయింది 
నన్ను నేను మర్చిపోయాను 
ఎక్కడ చూసినా నీవే కనిపిస్తున్నావు 
ఏ ఊహల్లో కూడా నీవే తచ్చాడుతున్నావు 
నాది కాని నీపై నాకు ఏ హక్కు లేదు 
కాని ఎందుకో మనసు నీకోసం 
తడుముకొంటూనే వుంది 
నీకోసం ప్రతి క్షనం తపన పడుతూనే వుంది 

చెక్కిళ్ళ చెరువు గట్లు తెగకముందే
జ్ఞాపకాళు  తవ్వి తీయాలి.
నీ నీడలోని జవసత్వాలు..
జార విఢిచి వెతుకూనే వున్నా 
ఇకనైనా నా తోడు కావాలి.
మనసు కోరుతూనే వుంది 
మది ఇప్పటికీ నిన్నే తలస్తూ వుంది 
నేనోడిపోయాను..నీ జోడు కావాలి
నిన్నెన్నటికీ పొందలేను 
నేవు ఎప్పటికీ నాదానివి కాదు 
నేను ఓడి పోయాని దారునంగా 
గెలవలేను అని తెల్సు 
నీవు గెలిపించడానికి సిద్దంగా లేవు 
నేకు ఇష్ట మైన వాల్లు గెలవాలి 
వాల గెలుపు లో నా వోటమి నీకు కావాలి 
నీకు నా ఓటపిలో ఆనందం వుంది 
నా పతనం కోరుకుంటూన్న నీ మనసు 
కోరిక తీరాలి అందుకే తలవొంచాను   
నా తల తెగ గొట్టాలని చూస్తున్నా 
మౌనంగా మనసు లో భాదను భరిస్తూ 
ఎన్నాలని భరించను నేను మనిషినే కదా 
ఓడి పోయాను  గెలవలేనని తెల్సి 
గెలిపించలేని నీకోసం మనసు తడుముకొంటూనే వుంది  

Thursday, March 10, 2016

ఓ జ్ఞాపకం మనసును సన్నగా తడుతుంది

నాకు మొబైలిప్పుడు కేవలం
సాంకేతిక సమాచార సాధనమే కాదు
నా దేహాన్ని, ఆలోచనల్ని వైబ్రేట్‌చేసే పరికరం కూడా.

అవసరాలమధ్య అనుసంధానమౌతున్న 
అనేకనెంబర్లతోపాటు
నీ నంబరు అలానేవుంది
అప్పుడప్పుడూ ఏదొకటి వెదకుతున్నప్పుడు
నీ పేరుతో నంబరు కన్పిస్తుంది
అంతటి వెదకులాటలో
ఓ జ్ఞాపకం మనసును సన్నగా తడుతుంది
ఒక్కసారి ప్రయత్నిద్దామని మదిలో తొలుస్తుంది
ప్రయత్నించిన వెనువెంటనే కలిసుంటే  
రింగ్  అవుతుంది కానీ వెంతనే కట్ చేస్తావుగా 
అందుబాటులో లేవనో, పరిథిలో లేవనో పదే పదే పలుకుతుంది
మొబైల్ లో కొత్త ఆప్సన్స్ నీకు 
మంచి అవకాశం కలిపించాయి
బ్లాక్ లో పెట్టడం..
నీవు బ్లాక్ చేసిన నెంబర్లలలో మొదటిది నాదే కదూ 

దగ్గరవ్వాలనే ఆలోచనకు
విభజన రేఖేదో అడ్డమొస్తుందేమో!

వాణిజ్య బేరీజులమధ్య నెంబర్లు 
మారుస్తుంటాము
కానీ ఆది నా దగ్గర వుండదు..
కానీ  నీ నెంబర్ అలానే వుంది
కొత్తనెంబర్ కూడా సేవ్ అయి వుంది 
కాని ఫోన్ చేసేంత దైర్యం అయితే మాత్రం లేదు

వాడని నెంబర్లను తీసివేస్తుంటాము
మరి నా నంబరు నీ దగ్గరుందో లేదో

నాకిప్పుడు
నీ పిలుపునుంచో, మాటల్లోంచో పొందే తరంగ తాకిడికోసం
మనసెప్పుడూ తడుముకొంటూనే ఉంటుంది
నీ నుంచి రింగు కావాలి
నా మొబైల్ కు నీ వాయిస్ ద్వారా ఏదో సందేశం రావాలి
అది ఒకప్పుడు స్వీట్ వాయిస్ కాని ఇప్పూడు 
తిట్లదండకం ఎవరో ఎదో చెబితె నిజం తెలుసుకొకుండా
ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం 
పిచ్చి మనస్సు అలాగైనా నీ వాయిస్ వినొచ్హని 
ఆరాటపడుతుంది నీ కు చీ అనిపించదంలేదు ...?
నా నెంబరు మారలేదు సుమా!

హఠాత్తుగా
జీవితాన్ని ఏమీ మార్చలేదు

Wednesday, March 9, 2016

శూన్యంలో నీకోసం ఆశగా ఎదురు చుస్తున్నా ...

ఎన్నో పంచుకోవాలని కలలు కన్నాను
దగ్గర అయ్యేకొద్దీ  కొద్దీ దూరమయ్యావు.

నీకోసం పలవరించిన ఏకాంతపు రాత్రులు
కలవమని చేసిన అభ్యర్ధనలు..ప్రార్ధనలు


నీకాలిక్రిందవేసి నిర్దాక్షన్యంగా తొక్కి 
నా మానాన నన్నొదిలేశావు..
ఒంటరిని చేసావు 

స్థితిగతులు మారి, 
నా నిస్సత్తువ గెలిచినప్పుడు
నిస్సహాయుడనై.. నీకోసం పిలచిన పిలుపులు
ప్రతిధ్వనులై వెక్కిరించాయి.
నీకోసం ఆత్రంగా వెతికిన నా కళ్ళలో 
ఉబికి వస్తున్న నాకన్నీ విలువ 
తెలుసుకోలేక నన్నోదిలేసి 
నీ ఆనందం నీవు చూసుకున్నావు 
నాతోనే ఉన్నావంటావా .. సాక్ష్యమేదీ ?
అని నిజం కాదు కదా 
అప్పతి జ్ఞాపకాలు సూదులై గుండెల్లో 
గుచ్హుతున్న గాయాల తాలూకా పుండ్లే అవి 
నా బ్రతుకంతా నువ్వు చేసిన జ్నాపకాలే కదా మరి 


నువ్వెంతమందిని పిలిచావు?
ఎంతమందిని కలిశావు ?
అందరూ మంచొల్లే నీకు 
ఒక్క నేను తప్ప ..?
ఎందుకో చెప్పవూ ..?
ఏం నేచేసిన తప్పిదమేమిటి ?

నా రాక.. నీకది ఇష్టంలేదేమో
నే రావడం.. నీకు  కష్టమే ?
అసలాంతర్యమేమో ? ఈ ఎడబాటెందుకో ?
కడలి కన్నీరే తెలిపిన నిజాలివి 

విధిని నమ్మిన వాడిని
నీవి కావాలని కోరుకుంటున్న మనస్సు
.క్షమించు
కాలం జారుతుందిగా..
మన మధ్య దూరమూ..కరుగుతుంది. 
అనే పిచ్చి బ్రమలో బ్రతుకుతున్నా 

ఎప్పటికైనా మన కలయిక తధ్యమే !
కానీ తొందరలో చూడగలనన్న ఆశతో.
నిరాశ అని తెల్సి ..
ఆశను చివరి కోరికగా చేసుకొని 
శూన్యంలో  నీకోసం ఆశగా ఎదురు చుస్తున్నా  

Monday, March 7, 2016

గుండె లోతుల్లో సమాధి చేసిన జ్ణాపకం,

గుండె లోతుల్లో సమాధి చేసిన జ్ణాపకం,
మనసు గోడల బీటలు చూస్తూ
విధి రాతలవని పక్కకు తోసి
తడి కళ్ళతో చిత్తడి భవితలోని
కొత్త చిగురాకు కోసం ఆశగా 
ఎదురు చూస్తుంది మనస్సు 
ఓటమెదురైనా వెనుదిరగని 
తడికిక నా కళ్ళలో తావీయనని..
నడక నేర్చిన శవమై
జీవం వైపుగా ఆగక సాగే పయనమమిది
కనువిప్పు తెలియని  కరిగిపోతున్న 
కాలం సాక్షిగా కన్నీటిలో 
తేలాడే నిజాలు తెలిపే గత0నాది  


మానిన గాయాల్ని రేపడం,
నీకు  అలవాటేమో  కదూ
అలలారిన మనసు కొలనులో
జ్ఞాపకాలిసరడం నీకు అలవాటైన   
నీ ప్రవృత్తేమో కదూ 
ఆరిన జ్ఞాపకాలను  తిరిగి
రగిలించడం నీకానందమెమో కదూ  

Sunday, February 21, 2016

No.1 న్యూస్ చానల్ శాయి సుధాకర్ గారి సమక్షంలో నా పుట్టీనరోజు వేడుకలు

 నెం.1 న్యూస్ చానల్  శాయి సుధాకర్ గారి సమక్షంలో నా పుట్టీనరోజు వేడుకలు... జీవితంలో మర్చిపోలేని  రోజు..నా భ్యూరో లో పనిచేసే నా మిత్రుల సమక్షంలో ... పుట్టిన రోజు వేడుకలు 


Wednesday, February 3, 2016

అడుగుదామనుకున్ననో అడగకుండానే మర్చిపోయా ఎప్పుడో

నన్ను నన్నులా ఉండనివ్వక నలుగురిలో నన్ను పిచ్చి వాన్ని చేసి .. చేసి ఎవరికీ కనిపించకుండా నాకు మాత్రమే కనిపిస్తావు ..నవ్విస్తావు ..ఎడ్పిస్తావు.. ఎందుకు  నా ఊహల్లో చేరి వేదిస్తావెందుకు... నా అనుమతి లేకుండా నా నా ఊహల ఉనికి తెలుసుకుని నా పరిస్తుతుల్లోకి ,నా  మది లోతుల్లోకి దూరిపోడానికి నీకు అనుమతిని ఎవరిచ్చారు ..నా అనుమతిలేకుండానే నాలో చేరావు .. ఎవరికోసమో నన్ను దూషించి దూరం అయ్యావు...ఇప్పటికీ అందరిముందు అవమానిస్తూ  ఆనందిస్తున్న నిన్ను చూస్తే నవ్వాలో ఏడ్వాలో తెలియడంలేదు.. నాకు తెల్సింది మౌనంగా రోదించడం తప్ప..అది పైకి నటిస్తావని నటిస్తున్నావని తెలియదు ...నీవో గొప్ప నటివి... తిమ్మిని బమ్మిని చేయగలవు .. అందరిలో నన్నో దోషిని చేయగల సత్తా నీకు మాత్రమే వుంది అదో అలా నవ్వకు ...అవేవి అడుగుదామనుకున్ననో  అడగకుండానే మర్చి పోతానేమో ... ఆ నవ్వుకు  ఏ మంత్రం నేర్పవు ?? ఎవరినైనా మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది ? మరీ అలా మూతి ముడుచుకోకు విచుక్కున్న కుసుమంలా  నీ పెదాలు నవ్వులు రువ్విస్తుంటే అందంగా    వుంటావు .....కాదు ఆ అందంలో నిజం లేదు ...అందమైన దెయ్యానికి ....మాటలు నేర్చిన చిలకవు...అందరిని నమ్మించావు నేనో దోషిని అని అందరీ చెప్పావా ఇంకా ఎవ్వరైనా మిగిలారా..నీవు గొప్ప అని చెప్పుకోవడం ..నిన్ను నీవు మంచి అని చెప్పుకోవడం  కోసం ఏమైనా చేయగలవని నీ పరిచయంలో ఊహించలేకపోయాను
                       ఒంటరితనం వచ్చి నన్ను ప్రశ్నించింది .. ఎప్పుడు నాతో గడుపుతావు అని ? ఏది సమాదానం ఇద్దాము అనేంతలో నువ్వు నా ప్రక్కనే వచ్చి నిలబడ్డావు ...అప్పుడు దాని మొహం చూడాలి ..పాపం .. దాన్ని చూసి నువ్వు నవ్వుతుంటే ఏమి చేయాలో తెలియక అది వేనుతిరుగుతున్నప్పుడు నువ్వు దానికేదో నష్టం కలిగిస్తున్నట్టు అది వేల్లిపోయిందే ..అయ్యో ఏమని చెప్పాలి .. ఒంటరితనమే కాదు ..నువ్వు వచ్చిన తరువాత అందరు వేసే అపహాస్యపు బాణాలు కూడా నిన్ను దాటి వచ్చేంత ధైర్యం చేయలేక వాళ్ళ వద్దకే తిరిగి వెళ్తుంటే లోలోన ఎంత భాదపడతానో నీకేం తెలుసు
                     నా నవ్వును నువ్వు ఎక్కడ్నుంచి వెతికి తీసుకొచ్చుకోను ఏదారో తెలియక ఎప్పటి కప్పుడు తికమక పడుతూనూ ఉన్నా..ప్రపంచం ఇంత చీకటిగా ఉందేంటో అర్దం అవ్వడంలేదు.. ... ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళను అని ఇస్తున్నావనుకున్నా నన్ను నమ్మక ద్రోహం చేస్తున్నావని ఊహించలేకపోయా..

నెంబర్ వన్ న్యూస్ లో 6:30 నా స్టూడియో లైవ్ Special Debate.

కాపు గర్జనలో జరుగుతున్న పరిస్థితులు ...ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు...ఉద్యమ కారుల భవిష్యత్ కార్యచరన పై నెంబర్ వన్ న్యూస్ లో 6:30 నా స్టూడియో లైవ్ Special Debate..Video..

Tuesday, February 2, 2016

పై నెంబర్ వన్ న్యూస్ లో 6:30 నా స్టూడియో లైవ్ Special Debate

కాపు గర్జనలో జరుగుతున్న పరిస్థితులు ...ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు...ఉద్యమ కారుల భవిష్యత్ కార్యచరన పై నెంబర్ వన్ న్యూస్ లో 6:30 నా స్టూడియో లైవ్ Special Debate