Thursday, December 15, 2011
అమ్మా ఎక్కడున్నావు ..నీవు చనిపోలేదు నాకు తెల్సు మరి ఎక్కడున్నావు ...?
అమ్మా ఎక్కడున్నావు ..నీవు చనిపోలేదు నాకు తెల్సు మరి ఎక్కడున్నావు ...?
పేగు తెగింది! తన రాజ్యం నుంచి తననెవరో వేరు చేసినట్లు బిగ్గరగా ఏడిచినా బందం!! ఆందోళనను బిగపట్టి ఉన్న అందరి మొహాల్లో ఆనందం... నవమాసాలు.......అమ్మ పంచప్రాణాలు యీ ఆమె అక్కున చేరాయీ.. అమ్మే ప్రాణం...అమ్మ అవును అంటే అవును , కాదు అంటే కాదు.. అమ్మ కొంగు పట్టుకొని బుడి బుడి నడకలు,,చిట్టి చిట్టి మాటలు!!! అమ్మకు గారాల పట్టి అయింది..క్రమంగా మంచి చెడులను గుర్తించే మనిషి అయినా ... ఒక్కసారిగా ఏదో శక్తీ ఆవహించింది....... ఏవేవో ఆలోచనలు, ఆలోచనలు అడుగున ఎక్కడో అమ్మ!!!! ఇప్పుడు ఆమె కాదంటే అవును, అవును అంటే కాదు!!! అన్నింటిని అడ్డుకుంటుందని అమ్మ మీద అలిగింది, కోప్పడింది,మాట్లాడటం మానేసింది....ఇదంతా చూసి అమ్మ మనసు మూగగా రోదిస్తుంది.. లోకంలో ఎన్ని అందాలో, ఎన్ని ఆనందాలో ఎంత బాగునన్నాయో!!!!ఇన్న్నాళ్ళు వీటికి దూరంగా అమ్మ చాటున ఉన్నందుకు తనని తనే నిన్దిన్చుకుంది...అవధులు లేని ఆనందంతో ఎగిసిఎగిసి పడింది.... కాల చక్రం గిర్రున్న తిరిగింది... కొత్త బంధాల ఖాతాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది.....విశ్రాంతి లేదు, విరామం లేదు వలధనుకున్న గీతం బాణంలా శరవేగంతో గుండెకు తగిలి గాయమైంది పాత జ్ఞాపకాలు,అజ్ఞాపకాలు పొరల్లో..... అమ్మ!!!తృప్తిగా తల పెట్టి పడుకున్న అమ్మ ఒడి గురుతుకొస్తుంది..ఎవరో ఒక్కసారిగా చెంప మీద లాగ్ కొట్టినట్లు భావన..దుఖం పెల్లుబుకింది...గుండెలవిసేలా ఏడిచింది వెంటనే అమ్మ కోసం నడక సాగించాలనుకున్నా ...పరుగులు తీస్తున్నా ..కాని అప్పటిదాకా దగ్గరగా ఉన్న అమ్మ ఎందుకు దూరం, అయింది ఎదురుగా ఉన్నట్టే ఉంటుంది దగ్గరకు వెలితే కానరాదు బ్రమా..నిజమా..నాకెందుకో ఇప్పడికీ బ్రతికి ఉందేమొ అని పిస్తుంది ..అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ సారాంశం అంకితం .అమ్మ జ్ఞాపకాలు దూరం అవ్వాలంటే చాలా కష్టం..ఏపని చేస్తున్నా ..ఇప్పుడిలా ఉండటానికి కారణం అయిన ఆమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్ళిందన్నది వాస్తవంకదా ..అది అబద్దం ఎందుకు కాకూడదు..అమ్మను నానుంచి దూరం చేసి దేవుడు ఏంసాదించాడు ..
అమ్మ అబద్దాలు చెబుతుంది ఎందుకో తెలుసా?
నన్ను తన కొంగులో దాచి తనకసలు ఎండే తగలడుమ్లేదు అని నటిస్తుంది, నా కడుపు నిమ్పడుమ్కోసం తనకు అస్సలు ఆకలిగా లేదు అంటుంది, అమ్మ పిచ్చిది నేను బడికి వెళ్ళిన ఏడుస్తుంది, ఊరు వెళ్ళిన ఏడుస్తుంది,తిరిగివస్తాను అని తెలిసి కూడా ఏడుస్తుంది,
అమ్మ అమాయకురాలు
ప్రతిఫలం మరిచి ప్రేమను పంచుతునే ఉంటుంది,
అమ్మ అందంగా ఉండదు
ప్రాణం కడుపు పడితే చాలు తను ఎలా ఉంటుందో తనకే తెలియదు
అమ్మ కోపిష్టి
మట్టి తింటున్నని కొడుతుంది
అమ్మ నత్హిది
నాకు మాటలు నేర్పు అంటే తను నాలానే మాట్లాడుతుంది
అమ్మ పిసినారి
తను అన్నం తినిపిన్చినంతకాలం కొంచం కొంచంగానే పెట్టేది
అమ్మకు ఏమి తెలియదు
చందమామ రాదుఅని తెలిసిన పిలుస్తూనే ఉంటుంది
అమ్మ దొంగ కూడా
నాన్న జేబులో చిల్లర కొట్టేసి నాకు ఐస్ క్రీం కొనిపెడుతుంది
అమ్మ వంటిది, అమ్మ మంచిది అమ్మ పిచ్చిది,అమ్మ ఒక్కటే అన్నాడు ఆత్రేయ......
నేను మటుకు అమ్మను పొగడను అంటే పొగడను ఎందుకంటే నాకు తెలిసి ఆమె తన బిడ్డ గురించి చేబెతే వినంత ఆనందంగా బిడ్డ చెబితే వినదు....
అదే అమ్మ మనసు....
తనని అర్థం చేసుకోగలిగితే అదే ఖురాన్,బైబిల్,బాగావతగీత.......................
తను కోటిమంది మదర్ తెరిష లతో సమానం...............................
అమ్మ అమ్మ అమ్మ..................
నా మోము చిన్నబోతే
తను చిన్నబుచుకుంటుంది.....
నే ముభావంగా ఉంటె...............
భారమైన నిట్టుర్పవ్తుంది..................
నా కంట నీరు చిమ్మితే
తానో వర్షించే మేఘమావ్తుంది.................
అర్ధరాత్రి దాక నా గదిలో దీపం వెలిగితే..............
దరి చేరిన నిద్రదేవిని దూరంగా పొమ్మంటుంది..................
కలత మనసుతో నేను కనిపిస్తే తను కకావికలమవ్తుంది.....
ఉద్దోగ భారంతో ఊసురుమని ఇంటికొస్తే ఊద్దేపించే ఊదార్పువ్తుంది ......
బడలికతో బద్దకిస్తే.................
బలవంతపు గోరుముద్దవ్తుంది ..........................
అస్సలు ఏమాత్రం తనకి నే సమయం ఇవ్వకపోయినా.................
అహరహం నాకై సతమతమవ్తుంది...........
మౌనంగా నా పని నే చేసుకుంటున్న మనిషినైన ఎదుట ఉన్నానని మురిసిపోతుంది.........................
పుట్టి బుద్దిఎరుగక పనిలో ఎ సహాయం చేయకపోయీన పదిమందికి నా బిడ్డ సహాయపడుతుంది అని గొప్పలు చెబుతుంది............................................
పదిమంది దగ్గర ప్రదర్శిచిన ప్రశాంత తన దగ్గర చిరాకు ప్రదర్శిచిన నా చిట్టి తండ్రికి అంత కష్టం వచిందేమో అని
చింత పడుతుంది.......................
అందకే ఏఏఏఏఏఏఏ అమ్మకుచికి అమ్మంటే అంత పిచ్చి
Labels:
కవితలు