నువ్వు లేక...చావు రాక...
ఉన్నా నిలా...ఏకాకిలా...
ఎన్నో వసంతాల నడుమ
నేనొక శిశిరాన్ని
చిగురు లేక పలుకు లేక
పాడింది కోయిల ఓ..విశాదగీతిక
నా కలలన్ని అలలతో కలసి తీరాన్ని చేరుతున్నాయి.
కొన్ని వెనక్కు నెట్టబడి సముద్ర అంతర్బాగాన్ని చేరుతున్నాయి.
తీరాన్ని చేరిన కలలలో నేను నిన్ను వెతుకుతూ...ఉంటె
అంతర్బాగంలో చేరిన కలలలో ఎవరో..నన్ను వెతుకుతూ...ఉన్నారు.