. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, December 23, 2011

మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...ఒక్కగానొక్క కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణించాడు

మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కోమటి రెడ్డి ఒక్కగానొక్క కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణించాడు. ప్రతీక్ రెడ్డి ప్రయాణిస్తున్న స్కోడా కారు రామచంద్రాపురం మండలం కొల్లూరు దగ్గర ప్రమాదానికి గురైంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు ఓ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రతీక్ సహా ముగ్గురు చనిపోయారు. వీరు ముగ్గురూ సిబిఐటీలో ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్నారు. మిగిలిన ఇద్దరిని సుచిత్ రెడ్డి, చంద్రారెడ్డిగా గుర్తించారు. గొర్రెలను తప్పించబోయి కారు డివైడర్ ను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. సంఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా మరో విద్యార్థి అరవ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీలో ఉన్న కోమటిరెడ్డి విషయం తెలియగానే హుటాహుటిన రాష్ట్రానికి పయనమయ్యారు. మెదక్ జిల్లా రోడ్డు ప్రమాదంలో ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోవడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. కన్నీరు మున్నీరవుతున్నారు. నల్లగొండలోని ఆయన నివాసంలో విషాదచాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న కోమటి రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున కోమటి రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు. నవంబర్ లో తెలంగాణ కోసం దీక్ష చేసినప్పుడు ప్రతీక్ వచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుని వారు విలపిస్తున్నారు.