. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, September 28, 2014

మనసుగదిలో మారుతున్న నీడల నిజాలు

అదొక విశాలమైన గది
నా మనసుగది
దానిలో ఒక నిలువుటద్దం
నీ ప్రతిబింబం కనిపించగానే
విస్తీర్ణం పెరిగింది.
 అందులో
సగం నిజం
సగం భ్రమ.
రెంటికీ మధ్య
గిరి గీయడం కష్టం
గీతలకు దోరకని లావణ్యిం 
నన్ను నేను నమ్మలేని నిజం 
ఏంటీ కాని నిజం 
నాది కాదని తెల్సి 
నా మనసెందుకో నీకోసం 
ఆరాట పడుతుంది 
వాస్తవం మొక్క అయితే
స్వప్నం మొగ్గ.
స్వప్నానికి
గత చింతన ఉండదు
భవితవ్యానికది వంతెన.
ఎత్తులకెగిరే విమానానికి
లోయలోని కొండలు
సంధ్యలో ఎరుపెక్కిన
బుగ్గల్లా మారుతున్న సూర్యిని సాక్షిగా 
నాకు నేనే తెలియ్ని నిజంలా 

కర్త కనిపించని క్రియలు
అర్థంకాని విక్రియలుగా
చలిస్తాయి.
కెరటాన్నీ
దాని నురగనూ
కోసినట్టు విడదీయలేము.
పెట్టె తెరిస్తే
లోపల అనర్ఘరత్నాలు
కాని రెప్పమూస్తే
లోపల
అద్భుత ప్రపంచాలు
పువ్వుకోసం వెతికితే
మట్టి దొరికినట్టు
ఇదిగో
ఈ కవిత మీకోసం

Saturday, September 20, 2014

గుండెబావి లో నీటిని కంటి చెమ్మ గా కోల్పోయిన వెర్రివాడ్ని నేను

ఎండమావి లో నీటికై వెతికి
గుండెబావి లో నీటిని కంటి చెమ్మ గా 
కోల్పోయిన వెర్రివాడ్ని నేను.
నిశీధి లో కాంతిని పంచుతానంటూ
గమ్యాన్ని వెతుకుతానంటూ గగ్గోలు పెట్టి
వెలుగు ను కోల్పొయిన చిరుదివ్వెను నేను
ఉన్నత శిఖరాలు అధిరోహించాలాంటూ
ఆరాటం తో ఆశతో అడుగులు వేస్తూ
అలసిపోయి అదుపు తప్పి అధఃపాతాలానికి
పడిపోయిన ఆరొహకుడ్ని నేను
అయినా పరిగెడుతున్నా, ప్రయాణిస్తున్నా
ప్రయత్నిస్తున్నా, ప్రయాస పడుతున్నా
నా దృష్టి దాష్ఠికాన్ని చూడలేని దూరాలకు పోతుంది.
నా అడుగు ఆవేశం తో అనంత దూరాలకు సాగిపోతుంది.
ఎందుకంటే,
నేను శరీరం క్రుళ్ళిన శవాల మధ్య ఉండగలను.
కాని, మనసు క్రుళ్ళిన మనుషుల మధ్య కాదు. 

Wednesday, September 17, 2014

నాగుండెలపై వాలి... శూన్యంలోకి మగతగా చూసే నిన్ను.... నాతో పెదాలు కలిపి మూసిన కళ్ళ వెనుక " ఇవన్నీ ఒకప్పుడు జరిగిన వాస్తవాలు ..వాడు ప్రేమగా రాసుకున్న పదాలు.."


అందుకేనేమో వాడు నిజం అయ్యాడు నేను అబద్దం అయ్యి అదృస్యిం అవుతున్నానేమోకదా..?

" వెన్నెల ప్రవాహం...... పగటి వెలుగులో ముడుచుకుని. రాత్రి నిశ్శబ్దంలో విచ్చుకున్న మల్లెల నవ్వు... "
" మలుపులు తిరుగుతూ సాగుతున్న దారులు రెండు. యూసఫ్ గూడ కేఫ్ లో. కలుసుకున్న సాయంత్రం. మెరిసే కళ్ళు , నవ్వే "
" కొన్నిటిలో మూర్ఖుణ్ణయి... ఎదో చూసి..ఏదో విని... ఏదో అనుభూతించి... ఒక్క క్షణం అసలెక్కడా అని ఆగి , వెనక్కి చూసుకుంటే ... "
"అందమయిన అక్షరాలు..... అందమయిన అక్షరాలు మాట్లాడే అక్షరాలు రాగం తీసే అక్షరాలు అరకులోయలో ఒంటరి ప్రేయసిలా ."
" ఈ దేహాన్ని, చైతన్యాన్ని పట్టి ఉంచిన దేనినో అన్వేషిస్తూ... ఈ సంతోషానికి ,దిగులుకు మూలం ఎక్కడా అని యోచిస్తూ ..."
" ఙ్ఞాపకాలు వెంటాడుతాయి......కొన్ని చూపులు వెంటాడుతాయి.అలాగే కొన్ని అక్షరాలు కూడా.చదివేపుడు అవి కలిగించిన ."
" ఎవరు ....??ఎవరామె..??అంత స్వేచ్చగా రెండు రెక్కలు సాచి విహరిస్తోంది.....?నచ్చిన చోటికల్లా....,విరగబూసిన పూదోటల్లో... "
" జీవితం ఎందుకో, ఎటుపోతున్నాననే సందేహం,అలోచన నిరంతరం వెంటాడుతోంది.అర్థం లేని వెదకులాట. కాలం అలా సెకన్లు ."
" నీకూ నేనొక రహస్యంలాగే కనిపిస్తానా? నా మీసాలు,గడ్డాలూ, చేతుల్లో బలం....అన్నీ.. నాకయితే నువ్వెపుడూ నిలువెత్తు "
" నీ మౌనంలో........ నిదురించిన నా ఙ్ఞాపకాలు మేల్కొంటాయి... నీ నవ్వు నా చెవుల్లో మ్రోగేంతవరకూ... నీ ఙ్ఞాపకాల అలల్లో "
" సృష్టి పలికిస్తోంది...అనాదిగా.... నాదాన్ని ...ప్రణయ గీతాన్ని ...... ఒక్కొక్కరినుంచి..... ఒకప్పుడు నీనుంచి.......తీయగా."
" 1 సెప్టెం 2008 – మలుపులు తిరుగుతూ సాగుతున్న దారులు రెండు. యూసఫ్ గూడ కేఫ్ లో. కలుసుకున్న సాయంత్రం. మెరిసే ..."
" ఎన్ని స్పర్శలు. నీ శ్వాసతో నులివెచ్చని స్పర్శ. నన్ను కాల్చేసే గోర్వెచ్చని సుగంధపు స్పర్శ. నీ కంటి చూపు తాకగానే ..."
" నాగుండెలపై వాలి... శూన్యంలోకి మగతగా చూసే నిన్ను.... నాతో పెదాలు కలిపి మూసిన కళ్ళ వెనుక. ఙ్ఞాపకాలు నేనెలా పట్టను ..."

Tuesday, September 16, 2014

www.cobranews.net స్వేతా బసు సెక్స్ రాకెట్లో బిజినెస్ మెన్ బిగ్ "భి" బాలు ను పోలీసులు ఎందుకు తప్పించారు కోబ్రాన్యూస్ రిపోర్ట్

www.cobranews.net    స్వేతా బసు సెక్స్ రాకెట్లో బిజినెస్ మెన్ బిగ్ "భి" బాలు ను పోలీసులు ఎందుకు తప్పించారు కోబ్రాన్యూస్ రిపోర్ట్

Friday, September 12, 2014

నీ ఒడిలో తల ఉంచి గుండెలు పగిలేలా ఏడ్వాలని ఉంది

నాకు నువ్వు గుర్తుకొచ్చినప్పుడు 
నీ ఒడిలో తల ఉంచి  
గుండెలు పగిలేలా ఏడ్వాలని ఉంది
మనసారా నవ్వాలని ఉంది.
ఎందుకో తెలీదు గెలిచాననికాదు
ఎంతదారునంగా ఓడిపోయానో అని 
ఏం చేయాలో తెలీక చావచచ్చి
నా మనసంత  నీ ముందర పరచాలని ఉంది.
మన ఊహ లన్ని 
పంచుకోవాలని ఉంది. కాని ఏంలాభం. 
ఇప్పుడు నువ్వే నాతో లేవుగా?
నన్నొదిలి వెళ్ళాలని నీకెలా అనిపించింది?
నువ్వు వదలనని ఎన్ని బాసలు  చేసావు! 
నాతో ఒకప్పుడు అన్నవన్నీ కల్లలేనా ?
చూడు!నీకోసం నా కన్నులు 
నీరు ఎలా ప్రవహిస్తుందో.అవే నీవు ఉన్న  
ఆవిశాల లోకం లోకి రావాలి  
అని నిన్ను కరిగించాలి ఆని .
నాకు నిన్ను చూడాలని ఉంది.
ఏమి చేయాలో తెలియడంలేదు
అసలు   నాకు తెలియని 
మరో ప్రేమలోకాన్ని
చూపించి పరిచయం చేసింది నీవే  కదా 
ప్రకృతి పచ్చదానాన్ని ..
పంటివిరుల కమ్మదనాన్ని
కార్లో చుట్టూ పచ్చని చెట్లూ మనిద్దరమే 
అలా సాగిపోతూ ఎంత దూరం 
అయినా పోవాలనిపించేది
మరెందుకు అగిపోయి 
నీదారు నీవు చూసుకున్నావు చెప్పవూ
అల అర్దాంతరంగా 
వెళ్లి పోయి ఏమి మాట్లాడరెందుకు?
ఎలా విడిచి వెళ్ళాలనిపించింది ?
ఎందుకో  నా అత్రుతలా ఉంది 
ఏ అలికిడి ఐన నీవు వచావనే ఆశ
ఎవరు  పిలిచినా నీ పిలుపే ననే ద్యాష  
నను ఉలికిపాటుకి గురి చేసి 
ప్రతి రోజు భారంగా 
కనురెప్పలు వాల్చేస్తున్నాను 
నీ తీపి గురుతులే జ్ఞాపకాలుగా 
కాలాల ను గెంటు కుంటూ 
ఈ లోకంలో ఉన్నన్తవరకూ 
నా జీవన ప్రయాణం ఎడారిలో 
ఒయాసిస్సై  విలపిస్తూ నీ కోసం నిరీక్షి స్తూ
చావలేక బ్రతుకుతూ 
ఎన్నాల్లిలా ఎదురు చూడను చెప్పు 

Wednesday, September 10, 2014

మనసు రక్తం ఓడిన ఓ కర్కసమైన ఓ నిజం సాక్షిగా

సందానం లేని ప్రశ్నల్లొనుంచి
జవాబుల్లోకి జారి 
జవాబుదారీతనాల్లోంచి
నిజంలో మునిగిపోయి 
దేనికోసమో వెతుకుతున్న 
అవును నీకోసమే కదూ 
ఏంటో ఇంకా అర్దంకాని 
ప్రశ్న్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా 
ఏంటో నా ఈ ప్రయానం 
రెక్కల ప్రశ్ననై ప్రయాణమయ్యాను.
జనావాసాలకీ, అరణ్యాలకీ మధ్య
నాకు తెలీని నిజాన్ని వెతుక్కంటూ 

మనసు రక్తం ఓడిన 
ఓ కర్కసమైన ఓ నిజం సాక్షిగా 

దారులన్నీ ప్రవహిస్తున్నాయి,
అబ్ద్దపు రక్తపు టేరులై  
ఈ చివరన నిలబడి చూస్తే
ఎక్కడా చిన్న చీలికైనా లేకుండా
నిజాన్ని అబద్దంలో ఇరికించి 
నటనను నాకెదురుగా చూపిస్తూ
పగలబడీ నవ్వుతున్నావుగా 
నేల మీద పరచుకున్న ఆకాశంలా
రోడ్డు నిజమోకనిపిస్తుంది,
బ్రమనో  తెలియని 
అభూత కల్పనైంది కదా నాజీవితం
కాదు కాదు నీవే నన్నలా తయారు చేసావు 

Tuesday, September 9, 2014

నేను రాసే ప్రతి అక్షరంలో ఉంది నేవే కదూ


నిజమే.. 
నిన్ను నేను మరచాను..
అనుకుంటున్నావు నేను రాసే 
ప్రతి అక్షరంలో ఉంది నేవే కదూ 
కానీ... నువ్వే 
ప్రతిక్షణం..ప్రతిఒక్క క్షణం.. 
గుర్తొస్తున్నావు ..
కంటి తడిలాగానో..
కవితా శకలంలాగానో
కంగారుపడి జారిపడ్డ
స్వేదపు చుక్కలానో
పెరిగిన గుండెదడలో
కల్సిపోయిన జీవితపు 
అనుభవాన్ని
ఆత్రంగా అందుకోవాలని చూసి 
చేజారిపోయిన గతాన్ని అందుకోలేక 
చేతకానివానిలా మిగిలిపోయా
ఎందుకంటే అందరిని గెలిపిస్తూ 
నన్నోడించి చేతగాని వాడిలా 
చేవచచ్చిన వానిలా మిగిల్చావు గా..

జారిపోయే క్షణాలు
రెప్పల వెనక
తిరుగుతాయే కానీ
చెక్కిళ్ళపై జేరి..
బరువైనా దించవు..
వ్యస్థ జీవితం ముసుగులో
ముఖం దాస్తున్నాయి నీ జ్ఞాపకాలు

నిన్ను మరిచానన్న నమ్మకం
నీకు కలిగించడం కోసమేనేమో...
ఈ అసంకల్పిత స్పందన
సారి మరోసారి క్షమించు 
నీకు నిజాలు నచ్చవు
అబద్దాలు నేను చెప్పలేను
వీడు వీడుకాకపోతే వాడమ్మ మొగుడు
నిజమే ఇదే జీవితంకదూ 
రైలుబండిలో ఎక్కేవారు ఎక్కుతారు 
దిగేవారు దిగుతున్నారు 
నీలో నిన్నేం కోల్పోతున్నావో 
నీకిప్పుడు తెలీదు
మనసుకు తగిలిన ఉలిదెబ్బ 
గాటు తగిలిన రోజు అన్ని 
నిజాలు రీల్లలా తిరుగుతాయి 

జాగ్రత్త నేస్తమా 
ఆచి తూచి అడుగులు వేయి 
ఎందుకంటే నీ అంత  
మేధావిని నేను కాదు 
పైపై మెరుగులు కాదు 
మనస్సులో అందం ఎవరికి కావాలి 
మాటలతో మాయచేయాలి 
మనసును మోసం చేస్తూ అది నేను చేయలేను లే 

Sunday, September 7, 2014

నా మరణం కోసం నేనే ఎదురు పరుగెత్తుతున్నా ..నీనుండి పారిపోవాలని

నా మరణం కోసం నేనే 
ఎదురు పరుగెత్తుతున్నా ..
నీనుండి పారిపోవాలని 
ఎవరికైనా ఎప్పుడైనా
మరణం ఎలా రావాలంటే ...
పిలవగానే కువకువలాడుతూ
పెంపుడు పావురంలా
భుజంపై వచ్చి వాలాలి
టికెట్టు కొనుక్కున్న రైలుబండిని
సకాలంలో అందుకున్నట్టు
నిదానంగా అన్నీ సర్దుకుని
నింపాదిగా ఎక్కాలి
ఎవ్వారికోసం నేను 
నీకోసం (మరణం)
వాళ్ళ చిరునవ్వే చిరునామా కావాలి 

నా మన్సు పుస్తకాన్నిపూర్తిగా చదివేసిన 
జాగ్రత్తగా మడిచి పెట్టి
పేజీలన్నీ చించేశావుగా
నేనంటో నాకు అర్దంకాకుండా 
నిన్ను తలవగానే
నిన్ను నేను మననం చేసుకున్నట్టు
మనస్ఫూర్తిగా మనశ్శాంతితో వెళ్లిపోవాలి
నిస్సవ్వడిగా మట్టిలో
ఇంకిపోయే బిందువులా
భూమిలా నాలో నేను 
ఇంకిపోవాలి 

కాలం ఒడిలోకి జర్రున 
జారిపోవాలి నా జీవం
నడిచి వచ్చిన దారి తను మరిచిపోయినా
ముందున్న దీపధారి చూపే కాంతిలో
కూనిరాగాలు తీసే బాటసారిలా
సుదూరాలకు సాగిపోవాలి ప్రాణి
వాయిద్యాలతో తరలివస్తున్న
దేవదేవుని పల్లకీకి ఎదురేగి
సమూహంలో కలిసిపోయినట్టు
కనుమరుగవాలి నాప్రాణం
అనాయాసేన మరణం
నా మరణం నీకు ఆనందమేగా 

www.cobranews.net లో ఈ రోజు నేరవార్తలు

www.cobranews.net లో ఈ రోజు నేరవార్తలు

1) శ్వేతాబసు జీవితంలో ప్రజలకు తెలీని మరో కోణం...

2 ) ఓ అమ్మాయి చంపుతానని బెదిరిస్తోంది.. ట్విట్టర్ లో క్రికెటర్ జడేజా

3) బ్యాంకాక్ నుంచి నకిలీ కరెన్సీ తీసుకువచ్చి నగరంలో చలామణి చేస్తున్న ఇద్దరి అరెస్ట్

4) ప్లీజ్ ఈమెను కాపాడండి.. ఫేస్ బుక్ లో చనిపోతానంటూ పోష్టు పెట్టింది

5) తల్లీకూతుళ్ల బట్టలిప్పి,అర్ధనగ్నంగా ఊరేగింపు

6) బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా తన తరువాతి చిత్రంలో శ్వేతాబసుకు బంపర్ ఆఫర్

7) మరణ రహస్యం బైటపడింది.. భార్యను, పోలీస్ శాఖను మోసం చేశాడు

నీలో నేను లేనని తెల్సి ఇంకా నీలో నన్ను వెతుక్కుంటా .. నాకు పిచ్చేమో కదూ..?

నీకోసం ఎదురుచూస్తూనే ఉంటాను
 నీవురావని తెల్సినా.. ఎందుకో..? 
నీతో మాత్లాడుతూనే ఉంటాను 
నీవు పక్కన లేకున్నా..ఎందుకో..? 
నీగురించి ఆలోచిస్తునే ఉంటాను 
నీవు నాగురించి ఆలోచించనవి తెల్సినా..ఎందుకో...? 
నీవు గుర్తుకు వచ్చిన ప్రతిక్షనం 
నేను భాదపడుతూనే ఎందుకో తెలీదు..? 
ఎక్కడ నీవు అని ప్రశ్నిస్తూనే ఉంటా 
నీవు సమాదానం చెప్పేవని తెల్సినా ఎందుకో...? 
నీకోసం పరుగెత్తుతునే ఉంటా అక్కడ 
నీవు లేవని తెల్సినా ఎందుకో...? 
నీకోసం ఆవేదన పడుతూనే ఉంటా .. 
నా ఆవేదన నీవు అర్దం చేసుకోలేవని తెల్సినా ఎందుకో...? 
నీకోసం కన్నీళ్ళు కారుస్తూనే ఉంటా ..
కన్నీళ్ళకు స్పందిచవని తెల్సినా ఎందుకో...?

Wednesday, September 3, 2014

www.cobranews.net కోబ్రాన్యూస్ ప్రొమో

www.cobranews.net...ఆఫీసులో వేదింపులు .గృహ హింసాసైబర్ నేరమా రౌడీ మూకల వేదింపులా. బ్లాక్ మైలింగ్ సమస్యి ఎవరికీ చెప్పుకోలేని సమస్యిలు మాదృష్టికి తీసుకురండిఎలాంటి దైనా మాకు సమాచారం ఇవ్వండి


Monday, September 1, 2014

నన్ను నన్ను గా ఎప్పుడు గుర్తిస్తావో

నా గుండె గదులు కబ్జా చేసి
మోయలేనంత భారంగా
దూరలేనంత చిక్కంగా
ఆకాశంలా అనంతమౌతూన్న
నన్ను నన్ను గా ఎప్పుడు గుర్తిస్తావో

మనుషుల మధ్య ఉన్నా
ఎక్కడైనా ఎప్పుడైనా
తొంగి చూసే నిన్ను
తరిమి కొట్టలేక
దిగమింగుకోనూలేక
ఎన్ని అగ్నిపర్వతాలు 
నాగుండెల్లోబద్దలవలేదూ?!
అవమానమనే 
లావాలో పొంగిపొర్లిన 
నాదేహం ఎన్నిసార్లు 
చితికిపోలేదు?!
నిజాన్ని మోయలేక 
అబద్దన్ని దాచుకోలేక 
నా గుండె ఎంత 
వేదన పడుతుందో నీకేం తెల్సు