. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, November 29, 2014

తనే గెలవాలని నన్ను మానసికంగా చంపిన క్షనాలు

కవలలం ..నిజమే.. కలిసి
ఎన్నో పంచుకోవాలని కలలు కన్నాను
దగ్గర అవుతున్నా అనుకునే  కొద్దీ దూరమయ్యావు.

నీకోసం పలవరించిన ఏకాంతపు రాత్రులు
నాలో నేను కలవమని చేసిన అభ్యర్ధనలు..ప్రార్ధనలు
విదిలించి కొట్టి నా మానాన నన్నొదిలేశావు..

స్థితిగతులు మారి, నా నిస్సత్తువ గెలిచినప్పుడు
నన్ను కాక మరొకరిని గిలిపించి నప్పుడు 
తన్నను విజేతను చేసి నన్ను ఓడించిన క్షనాల్లో 
తనే గెలవాలని నన్ను  మానసికంగా చంపిన క్షనాలు 
నిస్సహాయుడనై ఒంటరిగా ఒదార్చే నీవే పదునైన కత్తివై 
గుండెల్లో గునపమై గుచ్చిన క్షనాల్లో  
నా అరుపులు ప్రతిధ్వనులై నన్నే  వెక్కిరించాయి.

నాతోనే ఉన్నావంటావా .. సాక్ష్యమేదీ ?
నా బ్రతుకంతా నువ్వు తప్పిన జ్నాపకాలే...
నువ్వెంతమందిని పిలిచావు?
ఎంతమందిని కలిశావు ?
ఏం నేచేసిన తప్పిదమేమిటి ?
వాళ్ళు నీకు చేసిన న్యాయమేంటో ..?


నా రాక.. నీకది ఇష్టంలేదేమో
నే రావడం.. అదీ కష్టమే ?
అసలాంతర్యమేమో ? ఈ ఎడబాటెందుకో ?
కలవని తెలీ ఈ కలవరింతలెందుకో ?

విధిని నమ్మిన వాడిని
నీ విధానాన్ని ప్రశ్నించాను..క్షమించు
కాలం జారుతుందిగా..
మన మధ్య దూరమూ..కరుగుతుంది.  

ఎప్పటికైనా మన కలయిక తధ్యమే  
కానీ తొందరలో చూడగలనన్న తీరని ఆశతో
ఆశ తీరదని తెల్సి తీరని ఆవేదనతో ఎదురు చూస్తూ నేను 

Tuesday, November 25, 2014

మనసు స్రవిస్తోన్న సిరా లో అక్షరాలు ఎర్రటిరంగు పులుముకుంటున్నాయి

ఏవేవో ఆలోచనలు
చుట్టూ వినిపిస్తున్న 
అక్షరాల ఆక్రందనలు
అల్లిబిల్లిగా అల్లేసుకుని
పీటముడి పడిపోయాయి
చిక్కులు విప్పుదామని
చెయ్యి దూరిస్తే
చల్లగా ఏదో తాకింది
చూస్తే ఎర్రటి రక్తం  
ఎవర్ని ఎవరొ పొడిస్తే వచ్చింది
కస్సుమన్న శబ్దంతోనే పౌంటెన్లా 
ఎగిసిపడ్డ రక్తం 
మనసు స్రవిస్తోన్న సిరా గా 
లో అక్షరాలుగా  మారిపోయి 
ఈ చిత్తు కాగితాన్ని అలికేసింది…..
 అలికిడిలో వచ్చిన అక్షరాలే ఇవి
చదువుతుంటే గజిబిజిగా అనిపించినా
మనసు లోతుల్లోంచి తీసిన 
పాత ఇనుములాంటీ జ్ఞాపకాలు
నాకు ఇసుమంత టైం ఇస్తే 
అన్నీ నీ కాళ్ళదగ్గర పేరుస్తా
చదివిచూడు..నాహృదయంపడే 
వేదన శబ్దాలు వినిపిస్తాయి
వినవు వినలేవు ఎందుకంటే
ఆమనసే ఉంటే ఇదంతా ఎదుకు కదా....?

Sunday, November 23, 2014

మసకబారిన నా ప్రస్తుతాన్ని నేను

నిండిన కళ్ళతో 
మసకబారిన నా ప్రస్తుతాన్ని
విడమరిచి విశదీకరిస్తుంది 
విశ్రాంతినిస్తుంది
నను విడిన బంధాలని, 
విగత భావాలని
వక్రించిన విధి నన్ను వెక్కిరిస్తూ
మనసుపర్చిన
నిస్పృహల్లో ఆరేస్తుంది
కంటి గానుగనుండి 
కలల సారాన్ని ఆస్వాదిస్తూ
సాగే నీడకు నిర్లిప్త 
ప్రేక్షకుడిగా ఉండిపోయాను
అలల దాగుడు మూతల్లో  
నిద్రనోచుకోని నేను 
ఆప్యాయత కోసం
దురు చూస్తున్నాను
నిలవని అడుగు జాడల్లో 
తడబడే అడుగుల్లో 
ఆత్మీయత వెదుక్కుంటున్నాను

Saturday, November 22, 2014

మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపం

మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపం 
అది నా కంటికి శూన్యం 
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం 
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం 
నీ రూపం అపురూపం 

ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో 
ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా 
ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో 
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా 

నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం 
నీ రూపం అపురూపం 

ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా 
గానం పుట్టుక గాత్రం చూడాలా 
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా 
గానం పుట్టుక గాత్రం చూడాలా 
వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి 
నాలో జీవన నాదం పలికిన నీవే 
నా ప్రాణ స్పందన 
నీకే నా హృదయ నివేదన 

మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం 
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం 
నీ రూపం అపురూపం



Friday, November 14, 2014

గతాన్ని తడుముకున్న ప్రతిసారి గుండెల్లో గుచ్చుకునే నిజాలు

గతాన్ని తడుముకున్న ప్రతిసారి గుండెల్లో గుచ్చుకునే నిజాలు  నిజాన్ని నమ్మాలి కాని మసిపూసిన నిజం అబద్దంగా కనిపిస్తుంది ..మన అనుకుంటే తప్పుకూడా ఒప్పుగా కనిపిస్తుంది .... ఏవరో చెప్పిన మాటలు వింటే నిజాలన్ని అబద్దాలై ఎదుటి మనిషి ని చేతకాని  వాన్ని చేస్తాయి కొన్ని నిజాలు అంతే అడగలేం ...అన్నీ తెల్సి కడగలేం ఎదుటి మనిషిని దారునంగా మరో మనిషి ఎదురుగా ఓడించి తనను తాను సమర్ధించుకునే క్రమంలో ఎదుటి మనిషి పై వేసిన అబాండాలు అప్పుడు నీకు మనస్సాంతి ఇవ్వొచ్చు కాని కొందరికి అవే సూలాలై బానాలై మనసులో గుచ్చుతునే ఉంటాయి లైఫ్ అంటే ఎంజాయిమెంట్ ఒక్కటే కాదు రిలేషన్ వాల్సూస్ చాలా వుంటాయి అప్పుడలా ఇప్పుడిల ఎప్పటికప్పుడూ మారటం కొందరికి చాతకాదు అందుకే ఇలా వుంటారు జీవితంలో మనుషులు అలా మారిపోతునే ఉంటారు ..  


* Naaku mundu okammata manushula venaka inko maata inkoritho inko maata telidandi moham mida cheptaa milaaa matram chyanu chaala ignore chestaa naaku nachakapote ipdu ade chestunaaa

 * Meeredo pedda innocentlaaa nenedo mimmalni mosam chesinaatu mosali kannillu kaarchi sympathy pondutunaaremo kaani oka finger point cheste 4 fingers mee vaipe untaai telusukondi

 * Edainaa kaani jaragalsina damage jarigipoindi naaku nivalla mana madya emlekpoinaa create chesi chepalsina avasaramento naaku epatiki ardamkaadu

 * Nuvu naato anav naa munde acting andarito antaav adegaa prblm

 * Plz go n meet psychriatist

 * Natinchindu chaalu

మనం ఏది ఇచ్చినా వద్దు అనకుండా పుచ్చేసుకునేది మన మనసు ఒక్కటేనేమో ఈ ప్రపంచంలో... ఒక్కోసారి ఎదురు తిరిగినా మనం దాని నోరు నొక్కేసి మన ఇష్టం వచ్చ్సినట్టే దానిని ఉండమని చెప్పేస్తాం...వినక చస్తుందా మరి.. మనం మన మనసుకు మాత్రమే నియంతలం కదా...అందుకే దాన్ని మాత్రమే మన మాట వినేటట్లు చేసుకుంటాం..ఒకవేళ అది వినక పోయినా మనం పట్టించుకోము...అచ్చు మనని మన వాళ్ళు పట్టించుకోనట్లే...-:).
మనసు నిజంగా మధుకలశమే.. కాకపొతే దానిలో మనం కాని మన చుట్టూ మనం అల్లుకున్న లేదా పెంచుకున్న బంధాలు అనుబంధాలు వెదజల్లే పరిమళాల అనుభూతుల మీద ఆధారపడి ఆ సున్నితత్వం ఉంటుంది...నిన్ను నీకు చూపించే నీ మనసు అద్దంలో అన్ని నిజాలు స్పష్టంగా కనిపిస్తాయి...ఒప్పుకునే మంచి మనసే నీది కావాలి మరి.. ఎవరికీ తెలిసినా తెలియక పోయినా నీ మనసుకు నువ్వేంటో తెలుసు...అది ఏం చెప్తుందో నీకు తెలుసు... అందుకే నిన్ను నీకు చూపించే నీ నిజమైన నేస్తాన్ని నిర్లక్ష్యం చేయక నీ మాటే నీది కాకుండా ఓసారి అది చెప్పేది కూడా వింటే పోయేదేం ఉంది.. మహా అయితే అది చెప్పే మంచి నీకు నచ్చుతుంది అంతే కదా... లేదా ఎలానూ దాన్ని నోరు మూసుకుని ఓ పక్కన పడి ఉండమని చెప్పే అధికారం ఉండనే ఉందాయే...
చూసారా...మనలోని మన మనసుతోనే మనం ఎన్ని ఆటలు ఆడుకుంటున్నామో... పగలని అద్దం లో కనిపించేది ఒక రూపమే...అదే ముక్కలైన అద్దంలో లెక్కకు రాని రూపాల్లానే...ముక్కలైన మనసు అద్దంలో లెక్కకు దొరకని ఆలోచనా సంద్రాలెన్నో.. మెలి తిప్పే మనసు సుడిగుండాలెన్నో...  ఈనాటి మన అతుకుల అవసరపు బతుకుల్లానే మనసు ముక్కలు దాచేసుకుని ఓ రకంగా చెప్పాలంటే మనసనేది ఉందని మరిచి పోయి అవసరం కోసమో...భాద్యతల బంధాల కోసమో...సమాజంలో మనకంటూ ఓ గుర్తింపు కోసమో...బతికేస్తూ...నలుగురితో పాటు మనతో మనం కూడా నటించేస్తూ జీవిత నాటకాన్ని దిగ్విజంగా వెళ్ళదీసేస్తున్నాం...కొన్ని నిజాలు నమ్మాలి తప్పదు జరిగేవు అల జరుగుతూనే ఉంటాయి ఎందుకలా జరిగింది అని అనుకునే లోపే అన్ని అలా జరిగిపోతూ వుంటాయి ...నీలో నీవు నిఖార్సుగా ప్రశ్నించుకుంటే కచ్చితంగా నిజాలు తెలుస్తాయి అయినా నీకు నిజం తో పనేముంది . తెలుసుకోవాల్సిన  అవసరమేముంది .... అలా నీవు నిజం తెల్సుకోవాళనుకుంటే ఇలా ఎప్పటికే చేయవు . నీకు కావల్సింది నటీంచి నమ్మించాలి అదినావల్లకాదు నేనిలా నే వుంటా నాలానే ఉంటా .... 

Wednesday, November 12, 2014

కోపంలో నీ కంటి కొసన నిప్పు రాజుకుంది

అగ్ని గుండెల్లో మండుతున్న అగ్ని
రాసుకుంది ఎక్కడో కాదు గుండెల్లో
కోపంలో నీ కంటి కొసన నిప్పు రాజుకుంది
మంటల్లో కొన్ని స్వప్నాలు..
తగలబడుతున్నాయి
నా మరణవార్త నేనే చెప్పుకుని
దుఃఖిస్తాను..స్వరపేటికలో
నెత్తుటి పాట ..నింపుకుంటున్నాను
మృత్యోర్మా అమృతంగమయా అంటూ
నాలో నేణు చివరి 
పాట పాడుతూనే ఉన్నాను
ఇంకా పొరలు పొరలుగా 
కాని ఎందుకో ఎక్కడో
నా గుండెలో నీ జ్ఞాపకాలు 
నవ్వుతునే ఉన్నాయి
ప్రేమాక్రోశ అవేదనలో 
అరుస్తున్న అరుపులు
కలవర పడుతున్న 
మదిని తగులబెట్టాను
సమాధికింద బుట్టదాఖలైన
ప్రేమ పదాలు 
మూగగా నీకోసం రోదిస్తున్నా
పట్టీంచుకునే స్థితిలో లేని నీవు
చుట్టూ నిన్ను పొగిడే జనాల పొగడ్తల్లో
నా రోదలు నికేం వినిపిస్తాయిలే
ఆలకించేస్థితిలో లేని నీకోసం చేసే ఆక్రందనలు
నిన్ను చేరినా విన్నట్టే విని చిరాగ్గ పెట్టిన 
నీ అందమైన మొకాన్ని చూసి
ఆ ఆర్తనాదాలు నిన్ను చేరలేక నామీదే దాడిచేస్తున్నాయి

Monday, November 10, 2014

మిగిలిన తనువు, అలసటగా మేల్కొన్నప్పుడు

మన గమ్యాలు వేరు అన్నప్పడు
విరిగిన మనసు శాస్వత నిద్ర పోయినా
మిగిలిన తనువు, 
అలసటగా మేల్కొన్నప్పుడు
చెక్కిళ్ళపై జేరి చోద్యం చూసిన,
ఎప్పుడు రాలాయో తెలియని 
ఆ రెండు చుక్కలు 
నేటికీ ఉన్నట్టున్నాయి .

ఎందుకో ఈ రోజు 
నీ తలపు పవనాలు
జ్ఞాపకాలకు కన్నీరై 
వరదలా కురుస్తున్నాయి .
గుండె కన్నా పెద్ద ఇంకుడు గుంట ఏముంది
ఇవాళ అదీ నిండి నట్టుంది.. ఒలుకుతుంది.
నిండిన కంటి పున్తల్లో నుంచి
నా ప్రస్తుతం నీటి పొరల వెనక
లీలగా కదులుతూ కనిపిస్తుంది....