కొన్ని జ్ఞాపకాలు ఎంత మరచిపోవాలన్నా కూడా మర్చిపోలేను.......
అవి అనుక్షణం మానని గాయంలా నా మనస్సుని బాధపెడ్తూనే ఉంటుంది...........
అయినా కనీసం రాబోయే ఈ సంవత్సరమైనా సంతోషంగా ప్రారంభించాలనుకున్నాను......
కాని ఆ దేవుడికి నేను ఈ మాత్రం ఆనందంగా ఉండటం కూడా ఇష్టం లేనట్టుంది......
ఆనందాన్ని వరంగా ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీస్కుంటున్నాడు నీకింతే ప్రాప్తం అని......
అందుకే ఎప్పుడూ ఆ దేవుణ్ణి నమ్మకూడదనుకుంటూనే నమ్మి గాయపడ్తుంది నా మనస్సు.......
మనుష్యుల మనస్సులతో ఆడుకోటం ఆ దేవుడికి ఒక సరదా.......దానికి నాలాంటి వాళ్ళు బలవ్వాల్సిందే.......
నాకు మనస్సు ఇచ్చినా కూడా దానికి స్పందించే గుణం ఇవ్వకపోయినా బాగుండేది.......
రాయిలా హాయిగా బ్రతికేవాడిగా తయారు అయ్యాను.......
ఇప్పుడు ఎంతమర్చిపోదామని ప్రయత్నించినా నావల్ల కావటం లేదు.........
నాకెలాగో ఈ కొత్త సంవత్సరాన్ని ఆనందించే అదృష్టం లేదు.......
కనీసం మీరందరూ అయినా సంతోషంగా ఉండాలని నా కోరిక.........