హాపీ న్యూ ఇయర్ టు ఆల్ !
పాత జ్ఞాపకాలకు వీడ్కోలు చెబుతూ
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. - 2012
గోడ మీదికి చేరేందుకు కొత్త కేలండర్ తహతహలాడుతోంది..
కొత్త సంవత్సరం అనగానే అందరికీ ఎక్కడలేని ఉత్సాహం
వచ్చేస్తుంది.డిసెంబర్31 నుంచే హంగామా మొదలవుతుంది.
కొత్త రిజల్యూషన్స్ తీసుకోవడం,
డైరీలు వ్రాసే అలవాటు ఉంటే కొత్త డైరీ కొనుక్కోవటం,
కాలెండర్లు కొనటం, బంధుమిత్రులతో సరదాగా గడపడం లాంటివి చేస్తూంటాం.
ఆ రోజంతా సంతోషంగా గడపటానికే అందరం
మనసా వాచా కర్మణా ప్రయత్నిస్తాం.