ప్రేమ ఒక లొల్లి
నదిలా స్వేచ్చగా ప్రవహిస్తున్న నన్ను
ప్రేమ అనే ఆనకట్టు కట్టి నా దూకుడుకి కళ్ళెం వేసిన మల్లి
ప్రేమ పూల సుగంధపు పరిమళాలు వెదజల్లి
నీ లేడి కళ్ళ చూపులతో నా మనసు గిల్లి
హంస నడక సోయగాలతో మత్తు మందు చల్లి
నేనే నీ సర్వస్వమని ఎన్నో భావాలను అల్లి
నీ మధురమైన మాటలతో మాయ చేసిన ఊసరవెల్లి
నీవు లేక నేను లేనంటే నవ్వావు త్రుళ్ళి త్రుళ్ళి
నీ కోసం తిరిగాను గల్లీ గల్లీ
నా గుండెకు గాయం చేసావు విడిచి వెళ్లి
నీ జ్ఞాపకాలను మరిచి ఉండగలనా నాలా మళ్లీ